Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

No cash found at Justice Varmas house Delhi Fire Services chief1
జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసులో బిగ్ ట్విస్ట్‌

ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయంటూ పెద్ద ఎత్తున కలకలం రేగిన గంటల వ్యవధిలోనే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లోలేని సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని, ఆ సమయంలో అగ్ని మాపక సిబ్బందికి భారీ స్థాయిలో నోట్ల కట్టలు దొరికాయని జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే చెలరేగింది.అయితే యశ్వంత్ వర్మ ఇంట్లో ఎటువంటి నోట్ల కట్టలు దొరకలేదని ఢిల్లీ అగ్ని మాపక సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ ఒక్కసారిగా ట్విస్ట్ ఇచ్చారు. తాము అగ్ని ప్రమాదం జరిగిందనే సమాచారంతో జడ్జి వర్మ ఇంటికి వెళ్లినమాట వాస్తవమేనని కానీ అక్కడ ఎటువంటి నోట్ల కట్టలు దొరకలేదంటూ స్పష్టం చేశారు.‘ మా కంట్రోల్ రూమ్ కు మార్చి 14వ తేదీ రాత్రి గం. 11. 30 నిమిషాలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. భారీ అగ్ని ప్రమాదం జరిగిందనేది దాని సారాంశం. దాంతో మా అగ్ని మాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో అక్కడికి వెళ్లారు. మేము సరిగ్గా 11.45 నిమిషాలకు అక్కడ వెళ్లారు మా సిబ్బంది. 15 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలీసులకు కూడా మేము సమాచారం ఇచ్చాం. అగ్ని ప్రమాదాన్ని నివారించిన తర్వాత మా టీమ్ అక్కడ నుండి వెళ్లిపోయింది. మా ఆపరేషన్ లో ఎటువంటి నగదు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో లభించలేదు’ అని స్పష్టం చేశారు.

Tdp Leaders Attack Ysrcp Leader House In Tadipatri2
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్సార్‌సీపీ నేత ఇంటిపై టీడీపీ నేతల దాడి

సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేస్తూ టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా, వైఎస్సార్‌సీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దాడి చేయించారు.వైఎస్సార్ సీపీ నేత ఫయాజ్ బాషా.. తాడిపత్రిలో నూతనంగా ఇంటిని నిర్మించుకోగా, అన్ని అనుమతులు ఉన్నా కానీ టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వందలాది మంది అనుచరులతో ఫయాజ్ బాషా ఇంటిపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై జేసీ.. రాళ్లతో దాడి చేయించారు. టీడీపీ నేతలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు.

ED Seriously Look On Betting Apps3
‘టార్గెట్‌ సజ్జనార్‌’ క్యాంపెయినింగ్‌!

పలువురికి సామాజిక వ్యసనంగా మారిన ఆన్‌లైన్‌ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌ వెబ్‌సైట్లు, యాప్‌లను ఏపీలో బ్లాక్‌ చేసేలా ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను ఆదేశించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, లా మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. అందులోని ముఖ్యంశాలు ఇలా ఉన్నాయి. ‘గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌ గ్రూపులు యువతను సులభంగా ఆకట్టుకుని వారిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. సాక్షి, హైద‌రాబాద్‌: బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకులు– ఇన్‌ఫ్లూయన్సర్ల మధ్య భారీ స్థాయిలో మనీలాండరింగ్‌ జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే పంజగుట్ట పోలీసుస్టేషన్‌లో 11 మందిపై, మియాపూర్‌ ఠాణాలో 25 మందిపై నమోదైన కేసులపై లోతుగా ఆరా తీస్తోంది. ప్రాథమిక ఆధారాలు లభించిన తర్వాత కేసు నమోదు చేసి, నిందితులను నోటీసులు జారీ చేసి విచారించనుంది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రారంభించిన ‘హ్యాష్‌ ట్యాగ్‌ సే నో టు బెట్టింగ్‌ యాప్స్‌’తోనే ఈ కథ మొదలైంది. దీంతో ప్రస్తుతం బెట్టింగ్‌ మాఫియా ఆయనకు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో ప్రచారం మొదలెట్టింది.ఈ బెట్టింగ్‌ మాఫియా దందా మొత్తం వ్యవస్థీకృతంగా సాగుతోంది. వీళ్లు అమాయకుల నుంచి కొల్లగొట్టిన సొమ్ములో దాదాపు 50 శాతం తమ యాప్స్‌ను ప్రమోట్‌ చేసిన ఇన్‌ఫ్లూయన్సర్లకు ఇస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరి సోషల్‌మీడియా ఖాతాలో పోస్టు చేసిన లింకు ద్వారా అయితే ఏఏ పంటర్‌ తమ యాప్‌ను యాక్సెస్‌ చేశారనేది నిర్వాహకులు తెలుసుకుంటున్నారు. ఆ వ్యక్తి ద్వారా తమకు వచ్చిన మొత్తంలో 50 శాతం ఇన్‌ఫ్లూయన్సర్‌కు ఇస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ లావాదేవీల్లో అత్యధికంగా నగదు రూపంలో హవాలా ద్వారా జరుగుతున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇందులో విదేశీ కోణాన్నీ అనుమానిస్తూ ఆరా తీస్తున్నారు. ఈ యాప్స్‌కు ఉన్న విదేశీ లింకుల పైనా దర్యాప్తు చేయనుంది. ఆ కేసులన్నీ తిరగదోడేందుకు నిర్ణయం.. బెట్టింగ్‌ ఉచ్చులో చిక్కి రాష్ట్రంలో 15 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులన్నీ ఆయా జిల్లాలు, కమిషనరేట్లలో ఆత్మహత్యలుగానే నమోదయ్యాయి. అయితే.. వారి మృతికి బెట్టింగ్‌ యాప్స్‌ కారణమని ఆధారాలు సేకరిస్తే... వారే ఆత్మహత్యకు పురిగొల్పినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆయా కేసులను సమీక్షించి, ఆధారాలు ఉన్న వాటిలో బెట్టింగ్‌ యాప్స్‌ గుర్తించి వాటినీ నిందితులుగా చేర్చడానికి కసరత్తు చేస్తున్నారు. బెట్టింగ్‌ యాప్‌ నిందితులుగా చేరితే సాంకేతికంగా దాని నిర్వాహకుడు ఆ జాబితాలో చేరతాడు. ఈ యాప్స్‌ను ప్రమోట్‌ చేసిన సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లూయన్సర్ల వివరాలు తెలిస్తే వారినీ ఆయా కేసుల్లో నిందితులుగా చేర్చనున్నారు.ఇన్‌ఫ్లూయన్సర్లను మళ్లీ ప్రయోగిస్తున్న మాఫియా.. బెట్టింగ్‌ యాప్స్‌ ద్వారా వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ దందాను గుర్తించిన వీసీ సజ్జనార్‌ ఇటీవల తన సోషల్‌మీడియా ఖాతాల్లో ‘హ్యాష్‌ ట్యాగ్‌ సే నో టు బెట్టింగ్‌ యాప్స్‌’ పేరుతో యుద్ధం ప్రకటించారు. దీనిపై స్పందించిన విశాఖపట్నం పోలీసులు లోకల్‌ బాయ్‌ నానిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆపై సూర్యాపేట అధికారులు బయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదు చేయగా.. అతడు విదేశాలకు పారిపోయాడు. ఇప్పుడు పంజగుట్టలో కేసు నమోదు కావడంతో పాటు బెట్టింగ్‌ యాప్స్‌ దందాపై పోలీసుల దృష్టిపడింది. దీంతో బెట్టింగ్‌ మాఫియా సజ్జనార్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. దీనికోసం కొన్ని వీడియోలు చేయడానికి కొందరు ఇన్‌ఫ్లూయన్సర్లతోనూ ఒప్పందాలు చేసుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరికి చెల్లింపులు కూడా జరిగినట్లు భావిస్తున్నారు. మెట్రో రైళ్లపై బెట్టింగ్‌ ప్రకటనల తొలగింపు కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నట్లు తమ దృష్టికి రావడంతో వెంటనే వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎల్‌అండ్‌టీ, సంబంధిత అడ్వర్టటైజ్‌మెంట్‌ ఏజెన్సీలను ఆదేశించినట్లు పేర్కొన్నారు. దీంతో గురువారం రాత్రి మెట్రో రైళ్లపై ఉన్న బెట్టింగ్‌ వాణిజ ప్రకటనలను పూర్తిగా తీసివేసినట్లు చెప్పారు. డబ్బులు కోల్పోయిన వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

Capable Women With Earning Capacity Should Not Ask For Interim Alimony Says Delhi High Court4
‘మీకెందుకివ్వాలమ్మా భరణం?’.. మహిళ కేసులో హైకోర్టు కీలక తీర్పు!

ఢిల్లీ: భర్త నుంచి తాత్కాలిక భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉన్నత చదువులు చదువుకున్నారు. వివాహం కాకముందు ఉద్యోగం చేశారు. భారీ మొత్తంలో వేతనం తీసుకున్నారు. అలాంటి మీకు భరణం ఎందుకివ్వాలి? అని ప్రశ్నించింది. ఉద్యోగం చేసేందుకు అన్నీ అర్హతలు ఉన్న పిటిషినర్‌కు భరణం ఇచ్చే అంశాన్ని ప్రోత్సహించడం లేదని వ్యాఖ్యానించింది. వెంటనే, ఆమె అర్హతకు తగ్గ ఉద్యోగాన్ని చూసుకోవాలని సూచించింది. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. వాళ్లిద్దరూ భార్య, భర్తలు. 2019 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం సింగపూర్‌లో సెటిల్‌ అయ్యారు. అయితే, సింగపూర్‌కు వెళ్లిన తనని.. తన భర్త, అతని తల్లిదండ్రులు వేధిస్తున్నారనే కారణంతో భార్య ఫిబ్రవరి 2021లో భారత్‌కు తిరిగి వచ్చారు. తన బంగారాన్ని ఆమ్మి స్వదేశానికి వచ్చినట్లు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన బంధువులు ఇంట్లో నివాసం ఉంటున్నారు. కాబట్టి, తన భర్త నుంచి భరణం కావాలని కోరుతూ జూన్ 2021లో ట్రయల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ట్రయల్‌ కోర్టు ఆ పిటిషన్‌ కొట్టివేసింది. దీంతో మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌లో తన భర్త భారీ మొత్తంలో సంపాదిస్తూ లగ్జరీగా బతుకుతున్నారని, తనకు ఎలాంటి సొంత ఆదాయం లేదని, భర్త నుంచి తాత్కాలిక భరణం కోరుతున్నట్లు పేర్కొన్నారు.ఆ పిటిషన్‌పై జస్టిస్‌ చంద్రదారి ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సమయంలో సీఆర్‌పీసీ సెక్షన్ 125 ను సమర్ధిస్తూనే ఉద్యోగం చేసేందుకు అన్నీ అర్హతలు ఉండి, ఖాళీగా ఉండే మహిళల విషయంలో ఇది వర్తించదు. అందుకే, మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు వ్యాఖ్యానించింది. ఉన్నత విద్య, మంచి ఉద్యోగం చేసిన అనుభవం ఉన్న భార్య.. భర్త నుంచి భరణం పొంది ఖాళీగా ఉండడాన్ని సహించదు. కాబట్టి, కోర్టు ఈ కేసులో తాత్కాలిక భరణాన్ని ప్రోత్సహించడం లేదు. ఎందుకంటే పిటిషనర్ ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినట్లుగా, వివాహానికి ముందు దుబాయ్‌లో మంచి ఆదాయం సంపాదించినట్లు గుర్తించింది. ఆమె చదివిన చదువుకు మంచి ఉద్యోగాలు, వేతనాలు వస్తాయని కోర్టు భావిస్తోంది. ఆమె.. తన భర్త ఇచ్చే తాత్కాలిక భరణం మీద ఆధారపడకుండా స్వయంగా సంపాదించుకునే అవకాశాలపై దృష్టి సారించాలని సూచించింది. అదే సమయంలో ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

IPL 2025: Rain To Play Spoilsport In Opening Clash Between KKR And RCB5
IPL 2025: కోల్‌కతాలో వర్షం.. కేకేఆర్‌, ఆర్సీబీ మధ్య రేపటి మ్యాచ్‌ జరిగేనా..?

ఐపీఎల్‌ 2025 సీజన్‌ తొలి మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలేలా ఉన్నాడు. కేకేఆర్‌, ఆర్సీబీ మధ్య రేపు (మార్చి 22) జరగాల్సిన మ్యాచ్‌ వర్షం​ కారణంగా రద్దయ్యే అవకాశముందని తెలుస్తుంది. రేపు మ్యాచ్‌ జరిగే సమయానికి (రాత్రి 7:30 గంటలకు) వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నాయని వాతావరణ నివేదికలు ఇదివరకే స్పష్టం చేశాయి. దీన్ని నిజం చేస్తూ ఇవాల్టి నుంచే వర్షం మొదలైంది. NO RAIN pleaseeee!!!!pic.twitter.com/YgfkvBSfx0— CricTracker (@Cricketracker) March 21, 2025ఇవాళ రాత్రి 8 గంటల ప్రాంతంలో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డన్స్‌ మైదానంలో వర్షం కురుస్తూ ఉండింది. ఇవాల్టి పరిస్థితి చూసి రేపటి మ్యాచ్‌ జరిగేనా అని క్రికెట్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్‌ సమయానికి వర్షం​ తగ్గిపోవాలని దేవుడిని వేడుకుంటున్నారు. ఐపీఎల్‌ కోసం​ క్రికెట్‌ అభిమానులు చాలాకాలంగా కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌ రద్దైతే వారి బాధ వర్ణణాతీతం.మరోవైపు రేపటి మ్యాచ్‌కు ముందు ఈడెన్‌గార్డెన్స్‌లో ఐపీఎల్‌-18వ సీజ‌న్‌ ప్రారంభోత్సవాన్ని ఘ‌నంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ ఓపెనింగ్ సెర్మనీ దాదాపుగా రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన కేకేఆర్‌ సొంత మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌ విజయం సాధించి సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలని ప్లాన్‌ చేసింది. అయితే వారి ఆశలు వర్షార్పణం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌ ఆజింక్య రహానే సారథ్యంలో బరిలోకి దిగనుంది. గత సీజన్‌లో కేకేఆర్‌కు టైటిల్‌ అందించిన శ్రేయస్‌ అయ్యర్‌ ఈ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు వెళ్లాడు. ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా 'ఈ సాలా కప్‌ నమ్మదే' అనుకుంటూ ఉంది. అయితే వీరి ఆశలకు వర్షం ఆదిలోనే బ్రేకులు వేసేలా ఉంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ కూడా కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతుంది. రజత్‌ పాటిదార్‌ ఆర్సీబీ నూతన నాయకుడిగా నియమితుడయ్యాడు.ఆర్సీబీ జట్టు..రజత్‌ పాటిదార్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, దేవ్‌దత్‌ పడిక్కల్‌, టిమ్‌ డేవిడ్‌, స్వస్తిక్‌ చికారా, కృనాల్‌ పాండ్యా, మనోజ్‌ భాండగే, రొమారియో షెపర్డ్‌, స్వప్నిల్‌ సింగ్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జేకబ్‌ బేతెల్‌, మోహిత్‌ రతీ, ఫిలిప్‌ సాల్ట్‌, జితేశ్‌ శర్మ, జోష్‌ హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, లుంగి ఎంగిడి, రసిఖ్‌ సలాం​ ధార్‌, సుయాశ్‌ శర్మ, యశ్‌ దయాల్‌, నువాన్‌ తుషార, అభినందన్‌ సింగ్‌కేకేఆర్‌ జట్టు..అజింక్య రహానే (కెప్టెన్‌), మనీశ్‌ పాండే, రింకూ సింగ్‌, రోవ్‌మన్‌ పావెల్‌, అంగ్‌క్రిష్‌ రఘువంశీ, అనుకుల్‌ రాయ్‌, రమన్‌దీప్‌ సింగ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, మొయిన్‌ అలీ, సునీల్‌ నరైన్‌, ఆండ్రీ రసెల్‌, క్వింటన్‌ డికాక్‌, రహ్మానుల్లా గుర్బాజ్‌, లవ్‌నిత్‌ సిసోడియా, వరుణ్‌ చక్రవర్తి, మయాంక్‌ మార్కండే, వైభవ్‌ అరోరార, హర్షిత్‌ రాణా, అన్రిచ్‌ నోర్జే, చేతన్‌ సకారియా, స్పెన్సర్‌ జాన్సన్‌

Harish Rao Meets Cm Revanth Reddy6
సీఎం రేవంత్‌రెడ్డితో హరీష్‌రావు భేటీ.. కారణం ఇదే!

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డితో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు భేటీ అయ్యారు. ఆయన వెంట పద్మారావు, మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. సీఎంతో అరగంటకు పైగా హరీష్‌రావు మాట్లాడారు. నియోజకవర్గాల్లో ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. భేటీ అనంతరం పద్మారావు మీడియాతో మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో ఉన్న సమస్య కోసం సీఎం దగ్గరకు వెళ్లామని పేర్కొన్నారు.‘‘మేము వెళ్లేసరికి సీఎం రూమ్ నిండా మంది ఉన్నారు. 15 నిమిషాల పాటు సీఎంతో ఏమీ మాట్లాడలేదు. పద్మారావు నియోజకవర్గంలో కేసీఆర్ మంజూరు చేసిన హై స్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం కోరాం. సీఎం వెంటనే వేం నరేందర్ రెడ్డికి ఆ పేపర్ ఇచ్చి చేయమని చెప్పారు’’అని పద్మారావు తెలిపారు. పద్మారావు రమ్మన్నారని తాను కూడా వెళ్లినట్లు హరీష్‌రావు పేర్కొన్నారు.డీలిమిటేషన్ పై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పెట్టిన మీటింగ్‌ను బహిష్కరించాం. చెన్నైలో జరిగే మీటింగ్ కాంగ్రెస్ ఆర్గనైజ్ చేయట్లేదు. డీఎంకే వాళ్ళు పిలిచారని మేము వెళ్తున్నాం. డీఎంకే మాకు ఫ్రెండ్లీ పార్టీ. ఘోష్ కమిటీ నివేదిక గురించి నాకు తెలియదు’’ అని హరీష్‌రావు చెప్పారు.కాగా, అంతకు ముందు.. సీఎం రేవంత్‌ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కలిశారు. మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎంను కలిసినట్లు మర్రి రాజశేఖరరెడ్డి చెప్పారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి చెన్నై బయలుదేరారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ అధ్యక్షతన డీలిమినేషన్‌పై రేపు(శనివారం) చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ అఖిలపక్ష సమావేశానికి రేవంత్‌ హాజరుకానున్నారు.

Guntur Court Issued Bail To Posani Krishna Murali7
పోసానికి బెయిల్ మంజూరు

గుంటూరు: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కేసులో పోసానికి బెయిల్ ముంజూరు చేసింది. ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు.. బెయిల్ ను మంజూరు చేసింది. బుధవారం నాడు పోసాని బెయిల్ పిటిషన్ పై తీర్పును వాయిదా వేసిన కోర్టు.. ఈరోజు(శుక్రవారం) బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ప్రముఖ రచయిత,నటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పోసాని బెయిల్‌ పిటిషన్‌పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా .. న్యాయస్థానం ఇవ్వాల్టికి వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు.. గుంటూరు జిల్లా జైలులో ఉన్న ఆయన్ను మంగళవారం కస్టడీలోకి తీసుకున్న సీఐడీ పోలీసులు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.2 గంటల వరకు విచారించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌క్లాస్‌ ఫర్‌ ప్రొహిబిషన్‌/ఎక్సైజ్‌ కోర్డులో హాజరుపరిచారు. అక్కడ్నుంచి పోసానిని తిరిగి గుంటూరు జిల్లా జైలుకి తరలిం­చారు. ఈ కేసులో బుధవారం కోర్టులో విచారణ జరిగింది. శుక్రవారం తిరిగి విచారించిన కోర్టు.. పోసానికి బెయిల్ మంజూరు చేసింది.ఫిబ్రవరి 26వ తేదీ అరెస్టు.. ఆపై వేధింపులుకాగా, ఫిబ్రవరి 26వ తేదీని పోసానిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అనంతరం కూటమి సర్కార్ ఆదేశాలతో రోజుకో కేసు పెట్టి పోసానిని వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తూ తమ అహంకార పూరిత వైఖరిని ప్రదర్శిస్తోంది కూటమి ప్రభుత్వం. పోసానికి ఆరోగ్యం బాగోలేకపోయినా వరుస కేసులు పెట్టి మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకూ 19 కేసులు పెట్టింది కూటమి ప్రభుత్వం.

Tollywood actor Jagapathi Babu Funny Video with Actress Amani8
కోటి రూపాయలకు మళ్లీ అమ్మేస్తావా?.. శుభలగ్నం సీన్‌ గుర్తు చేసిన జగపతిబాబు

టాలీవుడ్ నటుడు జగపతి బాబు విలక్షణ పాత్రలతో వెండితెరపై అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. గతేడాది పుష్ప-2తో ప్రేక్షకులను మెప్పించిన జగపతిబాబు.. ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న కీ రోల్ ప్లే చేస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోనే ఉంటారు. తాను ఎక్కడికెళ్లినా వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటారు. తాజాగా మరో ఆసక్తికర వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు.ఇందులో ఆమని, జగపతిబాబు మధ్య సరదా సంభాషణ జరిగింది. ఓ మూవీ షూటింగ్‌ సెట్‌లో వీరిద్దరు సరదాగా ఒకరినొకరు ఆట పట్టించారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అందులో పార్ట్‌-1.. కోటి రూపాయలకు నా భార్య నన్ను అమ్మేసే ముందు.. పార్ట్-2 మేకప్ వేస్తున్నావ్ ఏంటి? నన్ను మళ్లీ మార్కెట్‌లో పెడతావా ఏంటి? అని సరదాగా క్యాప్షన్ రాసుకొచ్చాడు. మొదటి వీడియోలో ఆమనికి జగపతిబాబు మేకప్ వేయగా.. రెండో పార్ట్‌లో ఆమనికి జగపతి బాబు మేకోవర్ చేశారు. ఇదంతా షూటింగ్ సెట్‌లో సరదా కోసమే చేశారు.‍అయితే గతంలో వీరిద్దరు జంటగా నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం శుభలగ్నం. ఈ సినిమాలో తన భర్త అయిన జగపతిబాబును అమ్మకానికి పెడుతుంది. ఆ సీన్‌ను గుర్తుకు తెచ్చుకున్న జగపతి బాబు సరదాగా ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మళ్లీ ఇద్దరు కలిసి సరదాగా ఇలా చేయడంతో ఇది చూసిన అభిమానులు శుభలగ్నం సినిమాను గుర్తు చేశారంటూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_)

Mumbais historic Laxmi Nivas Bungalow sold for Rs 276 crore new owners connected to Mukesh Ambani9
చారిత్రక ‘లక్ష్మీ నివాస్’ బంగ్లా అమ్మకం..

ముంబైలోని అత్యంత చరిత్రాత్మకమైన ప్రాపర్టీలలో ఒకటైన లక్ష్మీ నివాస్ బంగ్లా రికార్డు స్థాయి రియల్ ఎస్టేట్ వ్యవహారంలో చేతులు మారింది. నెపియాన్ సీ రోడ్డులో ఉన్న ఈ చారిత్రక భవనాన్ని రూ.276 కోట్లకు విక్రయించారు. ఇది నగరంలో అత్యంత ఖరీదైన నివాస లావాదేవీలలో ఒకటిగా నిలిచింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన లక్ష్మీ నివాస్ దాని నిర్మాణ వైభవానికి మించి చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది.చరిత్రలో నిలిచిపోయిన భవనం1904లో పార్శీ కుటుంబం నిర్మించిన లక్ష్మీ నివాస్ తరువాత 1917లో కపాడియా కుటుంబం యాజమాన్యంలోకి వచ్చింది. అప్పట్లో కేవలం రూ.1.20 లక్షలకు దీన్ని కొనుగోలు చేశారు. భారత స్వాతంత్య్రోద్యమ కీలక దశలో (1942-1945) లక్ష్మీ నివాస్ దేశంలోని ప్రముఖ విప్లవకారులకు సురక్షిత స్థావరంగా ఆశ్రయం కల్పించింది. రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్, అచ్యుత్ పట్వర్ధన్, అరుణా అసఫ్ అలీ వంటి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఇక్కడ ఆశ్రయం పొందారు.అంతేకాదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ రేడియోకు కీలక ప్రసార కేంద్రంగా ఈ బంగ్లా పనిచేసింది. భారత స్వాతంత్ర్య పోరాట గళాన్ని పెంచింది. బంగ్లా ఉన్న నెపియాన్ సీ రోడ్ ఒకప్పుడు బికనీర్ ప్యాలెస్, కచ్ కోట, వాకనర్ హౌస్ వంటి రాయల్ ఎస్టేట్లతో పాటు ఉన్నత స్థాయి బ్రిటిష్ అధికారుల నివాసాలకు నిలయంగా ఉండేది. అందువల్ల లక్ష్మీ నివాస్ వలసవాద చరిత్రకు, భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రతీకగా నిలుస్తుంది.రికార్డు స్థాయి డీల్జాప్కీకి లభించిన రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్లు, ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం లక్ష్మీ నివాస్ అమ్మకం గత ఫిబ్రవరి 28న ఖరారైంది. ఈ లావాదేవీలో రూ.16.56 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు తెలుస్తోంది. 19,891 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా అమ్మకం ధర చదరపు అడుగుకు సుమారు రూ.1.38 లక్షలుగా ఉండటం ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ కు నిదర్శనం. ఈ ప్రాపర్టీలో గ్రౌండ్ ఫ్లోర్, రెండు పై అంతస్తులు, వెనుక భాగంలో అదనపు నిర్మాణం ఉన్నాయి. ఇది దక్షిణ ముంబై నడిబొడ్డున విశాలమైన ఎస్టేట్‌గా ఉంది.కొత్త ఓనర్లకు అంబానీతో లింక్ఈ ప్రతిష్టాత్మక లక్ష్మీ నివాస్ బంగ్లాను ఇప్పుడు అంబానీ కుటుంబానికి చెందిన వాగేశ్వరి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ తన కీలక వాటాదారుల ద్వారా సొంతం చేసుకుంది. ఈ కంపెనీకి చెందిన ఎలీనా నిఖిల్ మేస్వానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అంబానీ వ్యాపార సామ్రాజ్యంలో కీలక వ్యక్తి అయిన నిఖిల్ మేస్వానీ సతీమణి. ఇ​క ఈ నిఖిల్ మేస్వానీ ఎవరో కాదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైన రసిక్‌లాల్ మేస్వానీ కుమారుడు. ఈయన ధీరూభాయ్ అంబానీ అక్క త్రిలోచన మేనల్లుడు.

Rani Mukerji: 100 Surya Namaskars Avoided Carbs To Achieve Toned Figure10
Rani Mukerji: టోన్డ్‌ బాడీ సీక్రెట్‌..! వంద సూర్య నమస్కారాలు ఇంకా..!

బాలీవుడ్‌లో అత్యంత ప్రసిద్ధ తారల్లో రాణి ముఖర్జీ ఒకరు. బెంగాలీ చిత్రంలో సహాయ నటి పాత్రతో సినీ రంగంలో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రాజా కీ ఆయేగీ బారాత్ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీలతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే గాక ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారామె. ఈ రోజు ఆమె 46వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో 2013లో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి నటించిన అయ్యా మూవీ కోసం ఎంతలా కష్టపడి స్లిమ్‌గా మారిందో తెలుసుకుందామా. ఆ మూవీలో సన్నజాజి తీగలాంటి దేహాకృతితో హీరో పృథ్వీరాజ్‌తో కలిసి చేసిన నృత్యం ప్రేక్షకుల మదిని దోచుకోవడమే గాక ఇప్పటకీ హైలెట్‌గా ఉంటుంది. ఆ సినిమాలో రాణి ముఖర్జీ టోన్డ్‌ బాడీతో మెస్మరైజ్‌ చేస్తుంది. అందుకోసం ఎలాంటి డైట్‌ ప్లాన్‌, వర్కౌట్‌లు ఫాలో అయ్యేదో రాణి ముఖర్జీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సత్యజిత్ చౌరాసియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అవేంటంటే..ఆ సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ గ్లాస్‌ ఫిగర్‌ని పొందేందుకు ఎలా కష్టపడిందో వింటే విస్తుపోతారు. తన శరీరాకృతి మెరుపు తీగలా ఉండేందుకు ఎలాంటి డైట్‌-వర్కౌట్‌ ప్లాన్‌ని అనుసరించిందంటే. రాణి ముఖర్జీ దినచర్య ఎలా ఉండేదంటే...తెల్లవారుజామున 60 మి.లీ కలబంద రసం.ఒక గిన్నె బొప్పాయి, సగం ఆపిల్‌రెండు గంటలు వ్యాయామంఅల్పాహారం: ముయెస్లీ/ఓట్స్ స్కిమ్డ్ మిల్క్ మధ్యాహ్నం: రెండు మల్టీగ్రెయిన్ ఆట రోటీలు, పప్పు.సాయంత్రం: మొలకలు, రెండు గుడ్డులోని తెల్లసొన, మల్టీ-గ్రెయిన్ బ్రెడ్ .రాత్రి భోజనం: 1 రోటీ, కాల్చిన కూరగాయలు, 150 గ్రాముల తందూరీ చేపలు.100 సూర్య నమస్కారాలు, మైదా కార్బోహైడ్రేట్లు లేవుచివరగా టైనర్‌ సత్యజిత్‌ చౌరాసియా మాట్లాడుతూ..ఈ మూవీ ప్రారంభించడానికి రెండు వారాల ముందు తనను సంప్రదించి విల్లలాంటి శరీరాకృతి కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆ మూవీలోని కొన్ని సన్నివేశాలకు పొట్ట భాగాన్ని, వెనుక భాగాన్ని వొంపైన తీరులో చూపించాల్సి ఉంటుందని చెప్పిందన్నారు. సులభంగా బాడీ కదలికలు కూడా ఉండాలని తెలిపిందన్నారు. కాబట్టి ఆమెను టోన​్‌గా కనిపించేలా చేసేందుకు యోగా, చక్కటి డైట్‌ ప్లాన్‌ని ఆమెకి ఇచ్చినట్లు తెలిపారు. నటి రాణి కూడా తాను సూచించినట్లుగానే దాదాపు 50 నుంచి 100 సూర్యనమస్కారాలు చేసేది. అలాగే ప్రతి రెండు మూడు గంటలకొకసారి తినేదన్నారు. వీటి తోపాటు రెండు మూడు లీటర్ల నీరు తాగాలని, కార్బోహైడ్రేట్లు, మైదాను పూర్తిగా తొలగించాలని చెప్పినట్లు తెలిపారు. అలాగే ఆహారంలో ఒక చెంచాకు మించి నూనె ఉండకుండా కేర్‌ తీసుకున్నట్లు తెలిపారు. అయితే అప్పడప్పుడు చాక్లెట్‌ పేస్ట్రీల వంటివి తీసుకునేదన్నారు. ఇక్కడ రాణి కూడా అలాంటి దేహాకృతి కోసం చాలా అంకితభావంతో కష్టపడిందని చెప్పుకొచ్చారు. (చదవండి: 'పిలిగ్రీ కళ': ఇల్లే యూనివర్సిటీ..!)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement