ప్రధాన వార్తలు
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
ఆయన విసిరేసిన డబ్బుకు పచ్చపార్టీ టిక్కెట్ ఇచ్చింది. అదే కావరంతో ఎన్నికల్లో గెలుపు కోసం ఓటర్లకు డబ్బులు వెదజల్లారు. డబ్బుంటే ఏదైనా నా దాసోహం అవుతుందనుకున్న ఆ పచ్చనేత అహంకారానికి నియోజకవర్గ ప్రజలు తెలివిగా సమాధానమిచ్చాని టాక్. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల మనసులో నిలవాలని ఓటింగ్‌తో ఆయనకు బుద్ధి చెప్పారని స్తోంది. అంతేకాదు ఆ పచ్చనేత బెదిరింపులకు భయపడేది లేదంటోన్న ఆ నియోజకవర్గం ఎక్కడుంది ? 2024 ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని విపక్షకూటమి చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మాఫియాడాన్‌గా పేరున్న కావ్య కృష్ణారెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. ఎప్పుడూ ప్రజల కష్టాలను కానీ, నియోజవర్గంలోని అభివృద్ధి గురించి కానీ ఈయన గారు పట్టించుకున్నది లేదు..చేసింది కూడా ఏమీ లేదు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఏం చేస్తామన్నది కూడా ఓటర్లకు ఈయన చెప్పింది కూడా లేదు. నామమాత్రంగా ప్రచారాన్ని ముగించి పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్నప్పుడు కుట్ర రాజకీయాలు మొదలెట్టాడు. ఎన్నికల్లో గెలవాలి..అధికారం అందుకోవాలన్న తాపత్రయతంతో ఓటర్లను కొనేయాలని డిసైడ్ అయ్యారు. అనుచరులతో డబ్బులు పంపిణీ చేశారు. ఓటుకు రెండు వేలు చొప్పున పంచారు. పోలింగ్ రోజున కూడా ఈ ఓటుకు నోటు యవ్వారం నడిచినట్లు సమాచారం. కావలి నియోజకవర్గంలో 2 లక్షల 3853 ఓట్లు ఉండగా.. వాటిల్లో లక్షా 98 వేల ఓట్లు పోలయ్యాయి. 97,916 ఓట్లు పురుషులు, లక్ష ఓట్లు మహిళలు వేశారు. గత ఎన్నికల కంటే ఈసారి ఆరు శాతం అధికంగా పోలింగ్ నమోదయింది. ఈ భారీ పోలింగ్‌ను చూసి కావ్యకృష్ణారెడ్డి మైండ్ బ్లాక్ అయ్యిందని సమాచారం. సర్కార్ సానుకూల ఓటు పోటెత్తిందనే విషయం తెలియడానికి ఆయనకు ఎంతో సమయం పట్టలేదు. తన దగ్గర నోట్లు తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్‌కు గుద్దారని తెలుసుకుని రగిలిపోయారు. అనుచరులను పంపి ఓటర్ల నుంచి తిరిగి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించడమే కాదు బెదిరింపులకు దిగిన కాల్ రికార్డింగ్స్ బయటకొచ్చాయి. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సంక్షేమపాలనను మరోసారి జనం కోరుకుంటూ తీర్పునివ్వడాన్ని చంద్రబాబు కూటమి జీర్ణించుకోలేకపోతోందని ఆరోపించారు.వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో మరోసారి కావలిలో గెలవనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించే నేత కావడం వల్లే ఆయన గెలవబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
‘ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ గల్లంతే!’
కృష్ణా, సాక్షి: ఏపీ రాజకీయాల్లో గతంలో ఏనాడూ ఇలాంటి పరిస్థితులు లేవని.. ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు దాడులు చేయిస్తున్నాడని ఏపీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఈ కుట్రలో భాగంగానే.. ఒక ప్రణాళికాబద్ధంగా వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరగుతున్నాయని అన్నారాయన. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘గతంలో ఇటువంటి పరిస్థితులు లేవు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నారు. ఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నారు. ఎన్నికలై నాలుగు రోజులైనా వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి. అల్లర్లకు ఆధ్యుడు చంద్రబాబే.... అమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నారు. ఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతారు. టీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుంది. కులాలు,మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు. ప్రజలే బాబుకి బుద్ధి చెబుతారు అని జోగి రమేష్ అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు సమన్వయం పాటించండి. టీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్ కు ఫిర్యాదు చేశాం అని జోగి రమేష్ పార్టీ శ్రేణులకు సూచించారు.
టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
హైదరాబాద్, సాక్షి: పచ్చ మూకల కుట్ర రాజకీయాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. సర్వే పేరుతో దొడ్డిదారిన తెలుగు దేశం పార్టీ చేసిన నిర్వాకం ఇది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ.. అదీ రాజధాని నగరంలో సర్వే కోసం యువతను రిక్రూట్ చేసుకుంది. మూడు నెలలపాటు గొడ్డు చాకిరీచేయించుకుని.. చివరకు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఆగ్రహంతో బాధితులు విధ్వంసానికి దిగగా.. ఈ ఘటన బయటపడింది.నగరంలోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో టీడీపీ నేతలు కొందరు తమ బినామీ పేరిట ఓ అద్దె భవనం తీసుకున్నారు. అందులో invitcus pvt lmtd bpo పేరిట బీపీవో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. టెలికాలర్స్ జాబ్స్ పేరిట కొందరు స్టూడెంట్స్‌ను నియమించుకున్నారు. అయితే బీపీవో ముసుగుతో.. గుట్టు చప్పుడు కాకుండా వాళ్లతో ఎన్నికల సర్వే పని చేయించారు వాళ్లు. తీరా ఎన్నికలయ్యాక వాళ్లకు జీతాలు ఎగ్గొట్టడంతో బాధితులు ఆందోళనకు దిగారు.రూ.13 వేలు ఇస్తామని చెప్పి.. రూ.3 వేలే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో కొందరు యువకులు ఆ ఆఫీస్ వద్దకు చేరి ఆందోళన చేపట్టారు. ఇదేంటని? వాళ్లు నిలదీయడంతో.. టార్గెట్ పూర్తి చేయలేదని అవతలి నుంచి సమాధానం వచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన యువకులు.. ఆఫీస్‌ను ధ్వంసం చేసేందుకు యత్నించారు. గొడవలు జరుగుతున్నాయన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ గ్యాప్‌లోనే కంపెనీ నిర్వాహకులు పరారైనట్లు, బాధితుల తరఫున నిలదీయబోయిన మీడియాపైనా దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.టీడీపీ నేతల అండదండలతోనే ఈ కార్యాలయం నడుస్తోందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాదు.. కూకట్‌పల్లిలో సైతం invitcus pvt lmtd ఓ బ్రాంచ్‌ను ఓపెన్ చేసి ఇదే మాదిరి అక్కడా కూడా ఎన్నికల సర్వే నిర్వహించినట్లు తేలింది. ఇంకోవైపు మైనర్లతో వెట్టి చాకిరీ పై విచారణ చేయాలనీ బాధితుల బంధువుల ఆందోళన చేపట్టారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని పోలీసులు చెబుతున్నారు.
పల్నాడుపై పగబట్టిన బాబు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి/ సాక్షి, నరసరావుపేట : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకులు పల్నాడుపై పగపట్టారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా జరుగుతున్న వరుస పరిణామాలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. రాజకీయంగా వరుసగా చావు దెబ్బ తింటున్న తెలుగుదేశం ఎలాగైనా పల్నాడులో ఫ్యాక్షనిజాన్ని ఎగదోసి, వర్గ వైషమ్యాలను పెంచి పోషించడం ద్వారా తన ఉనికిని నిలబెట్టుకునేందుకు శతధా ప్రయత్నిస్తోంది.అందులో భాగంగా వరుస దాడులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మాచర్ల, గురజాల నియోజకవర్గాలకు పల్నాడు ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. మాచర్ల నియోజకవర్గం నుంచి 1999లో టీడీపీ తరఫున పోటీ చేసిన జూలకంటి దుర్గాంబ గెలుపొందారు. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి గెలుపొందారు. 2009, 2012 (ఉప ఎన్నిక), 2014, 2019 ఎన్నికల్లో వరుసగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తున్నారు. కాగా దుర్గాంబ కుమారుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో మాచర్లలో సైకిల్ మూలన పడింది. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. టీడీపీ బలోపేతమంటూ...మాచర్లలో టీడీపీని బలోపేతం చేయాలంటే పిన్నెల్లిని అడ్డు తొలగించడమే మార్గం అని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు.. అందుకు అనుగుణంగా దాడుల ప్రణాళిక రచించారు. అందులో భాగంగా 2020 జనవరి ఏడో తేదీన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మంగళగిరికి సమీపంలోని కాజ టోల్‌ప్లాజా వద్ద టీడీపీ శ్రేణులతో భారీ ఎత్తున దాడి చేయించారు. ఎమ్మెల్యే వాహనాన్ని రాళ్లతో ధ్వంసం చేశారు. గన్‌మెన్ గాయాలపాలయ్యారు. అయితే ఆ రోజు ఎమ్మెల్యే బయటపడ్డారు. ఆ క్రమంలో భాగంగా రౌడీలు, గూండాలనే గుర్తింపున్న బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలకు మందీ మార్భలాన్ని తోడిచ్చి విజయవాడ నుంచి 2020 మార్చి 11న మాచర్లకు పంపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు, స్థానికులు తిరగబడి బొండా, బుద్దా బృందాలను వెంటపడి తరిమేశారు. దీంతో చంద్రబాబు.. ఫ్యాక్షనిజం, హత్యల నేపథ్యమున్న జూలకంటి బ్రహ్మానందరెడ్డిని మళ్లీ రంగంలోకి దింపుతూ 2021 డిసెంబర్లో మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. 2010 మార్చి పదో తేదీన ఆత్మకూరు వద్ద ఏడుగురి హత్య కేసులో జూలకంటి ప్రథమ ముద్దాయి. చివరకు తన బాబాయి కుమారుడైన సాంబిరెడ్డి పొలాల్లో దాక్కుని ఉండగా హత్య చేయించారని అందరూ చెప్పుకుంటారు. పోలేపల్లి శివారెడ్డి హత్య కేసులోనూ జూలకంటిది ప్రధాన పాత్ర అని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. మాచర్ల ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వరుస దాడులు, దొమ్మీలు, హత్యా ప్రయత్నాల పరంపర కొనసాగుతోంది. ఈ ఎన్నికల తర్వాత అది శ్రుతి మించింది. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై విచ్చలవిడిగా టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. వినుకొండ, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లోనూ టీడీపీ దాడులకు తెగబడింది. మాచర్ల నియోజకవర్గంలో అశాంతికి ప్రధాన కారణం పోలీసులేనని, ప్రధానంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్, కారంపూడి సీఐ నారాయణస్వామి తీరు వల్లే గొడవలు పెరిగాయని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బహిరంగా నిప్పులు చెరగడం పల్నాడులో పరిస్థితికి అద్దం పడుతోంది. పదుల సంఖ్యలో ఊళ్లలో విధ్వంసం» మాచర్ల రూరల్ మండలంలోని కొత్తూరు, కంబంపాడు, భైరవునిపాడు, వెల్దుర్తి మండలం లోయపల్లి, వెల్దుర్తి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సంపేట, రెంటచింతల మండలం రెంటాల, జెట్టిపాలెం, పాలవాయిగేటు, గోలి, మిట్టగుడిపాడు, కారంపూడి మండలం ఒప్పిచర్ల, కారంపూడి, పేటసన్నెగండ్ల, చింతపల్లి, దుర్గి మండలం ముటుకూరు, అడిగొప్పల, పోలేపల్లి తదితర గ్రామాల్లో టీడీపీ దాడులు కొనసాగాయి.» దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల మండలాల్లోని కేశానుపల్లి, మాదినపాడు, ఇరిగేపల్లి, తంగెడ, కొత్తగణేశునిపాడు, బ్రాహ్మణపల్లి, పెద అగ్రహారం, జానపాడు, వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల, రెడ్డికొత్తూరు, బొల్లాపల్లి, కొచ్చర్ల, గంటావారిపాలెం, సత్తెనపల్లి నియోజకవర్గంలోని పాకాలపాడు, మాదల, తొండపి, చాగంటివారిపాలెం, నార్నెపాడు, గణపవరం, చీమలమర్రి, రూపెనగుంట్ల, గుండ్లపల్లి, కుంకలగుంట, చేజర్లలోనూ వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేశారు.» నరసరావుపేట టౌన్, దొండపాడు, పమిడిపాడు, పెదకూరపాడు మండలం యర్రబాలెం, లగడపాడు, చండ్రాజుపాలెం, మాదిపాడు, చిలకలూరిపేటలోని అప్పాపురం గ్రామాల్లో టీడీపీ దాడులకు తెగబడింది. అభివృద్ధిలో పోటీ పడలేకే విధ్వంసంచంద్రబాబు ఏలుబడిలో అభివృద్ధి ఊసే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పల్నాడులో అభివృద్ధి పరుగెత్తుతోంది. నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటైంది. పిడుగురాళ్లలో మెడికల్ కాలేజీ రూపు దిద్దుకుంటోంది. వరికపూడిసెలకు మోక్షం కలిగింది. గురజాల నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో తాగునీటి వసతి కలిగింది.నరసరావుపేటలో జేఎన్టీయూ కాలేజీకి శాశ్వత భవనాలు ఒనగూరాయి. రొంపిచర్ల, మాచర్లలో కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. పులిచింతల ప్రాజెక్టు దిగువన మాదిపాడు వద్ద వంతెన నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి. తద్వారా అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, గుంటూరు వరకు, మరోవైపు జగ్గయ్యపేటకు రవాణా వసతి మెరుగు పడనుంది.కొండమోడు–పేరేచర్ల, సాగర్– దావుపల్లి, మాచర్ల– దాచేపల్లి, నకరికల్లు–వాడరేవు జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని గ్రహించిన చంద్రబాబు.. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి గొడవలు చేయిస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
వీడియోలు
ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
టీడీపీపై బొత్స సెటైర్లు
వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర
ఏపీలో మరో 7 రోజులు భారీ వర్షాలు
బాటిల్స్ లో నో పెట్రోల్...ఈసీ ఆదేశం
చిరుత కదలికలపై టీటీడీ స్పెషల్ ఫోకస్
సిట్ ఎంట్రీతో అజ్ఞాతంలోకి కొంతమంది అనుమానితులు
అల్లు అదుర్స్.. నాగబాబు బెదుర్స్