Main News
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్‌స్టర్‌తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
Khammam Car Accident: అల్లుడు హైడ్రామా..!
బాబు కావాలంటే బైక్ పాప కావాలంటే స్కూటీ
పోలీసులతో హీరోయిన్ గొడవ.. వీడియో వైరల్
పాక్‌ను శక్తివంతం చేస్తున్న చైనా? లక్ష్యం ఏమిటి?
ఎంసీఏ కీలక నిర్ణయం.. ముంబై మెంటార్‌గా మాజీ క్రికెటర్
పర్యాటకులకు స్వర్గధామాలు ఈ బీచ్‌లు
నైరుతి వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..
ప్రాణం తీసిన ఫొటో సరదా
ఢిల్లీలో రికార్డ్ టెంపరేచర్ సెన్సార్ తప్పిదమే: ఐఎండీ
నేటితో చివరి అంకం..ప్రచారం ముగింపు
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్‌స్టర్‌తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
Khammam Car Accident: అల్లుడు హైడ్రామా..!
బాబు కావాలంటే బైక్ పాప కావాలంటే స్కూటీ
పోలీసులతో హీరోయిన్ గొడవ.. వీడియో వైరల్
పాక్‌ను శక్తివంతం చేస్తున్న చైనా? లక్ష్యం ఏమిటి?
ఎంసీఏ కీలక నిర్ణయం.. ముంబై మెంటార్‌గా మాజీ క్రికెటర్
పర్యాటకులకు స్వర్గధామాలు ఈ బీచ్‌లు
నైరుతి వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..
ప్రాణం తీసిన ఫొటో సరదా
ఢిల్లీలో రికార్డ్ టెంపరేచర్ సెన్సార్ తప్పిదమే: ఐఎండీ
నేటితో చివరి అంకం..ప్రచారం ముగింపు
Lifestyle
అనుష్క శర్మ బుడ్డి హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే..నోరెళ్లబెట్టడం ఖాయం!
క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ నటి, అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తుంటుంది. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ఇప్పటికే అమెరికాకు చేరుకుంది. అందులో విరాట్ కోహ్లీ మినహా.. మిగతా ప్లేయర్లంతా ఉన్నారు. విరాట్ మాత్రం వ్యక్తిగత పనుల నిమిత్తం ఇంకా భారత్‌లోనే ఉండిపోయారు. ఆయన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే రెండోసారి తండ్రైన విరాట్ కోహ్లీ ప్రస్తుతం ముంబైలో తన భార్య అనుష్క శర్మ, పిల్లలతో సరదాగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న కోహ్లీ.. మంగళవారం రాత్రి కుటుంబంతో కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లాడు. ఇందులో తన భార్య అనుష్క శర్మతో పాటు.. టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, అతడి భార్య సాగరిక ఘట్గే, క్రికెట్ ప్రెజెంటర్ గౌరవ్ కపూర్, తదితరులు ఉన్నారు. వారందరితో విరుష్క దంపతులు సరదాగా గడిపారు. అందుకు సంబంధించిన వీడియోలు, పోటోలు నెట్టింట తెగ చక్కెర్లు కొడుతున్నాయి. అయితే ఇక్కడ ఆ అనుష్క పట్టుకున్న హ్యాడ్బ్యాగ్ హాట్‌టాపిక్‌గా మారింది. చెప్పాలంటే డిన్నర్ డేట్లో ఆ హ్యాండ్‌బ్యాగ్ హైలెట్‌గా నిలిచింది. ఇది గాబ్రియేలా హర్స్ట్ నినా బ్రాండ్‌కి చెందిన లగ్జీరియస్ బ్యాగ్. దీన్ని ఎక్కువగా బ్రిటీష్ రాజవంశస్తులు, కొందరూ హాలీవుడ్ ప్రముఖులు ఉపయోగిస్తారు. అచ్చం ఇదే మాదిరి బ్యాగ్‌ని ప్రిన్స్ హ్యరీ భార్య మేఘనా మార్కిల్ ధరించింది. ప్రఖాత్య హాలీవుడ్ ప్రముఖులు, ధనవంతులు ఉపయోగించే ఫేమస్ బ్రాండ్ లెదర్ బ్యాగ్ ఇది. అలాంటి లగ్జరీయస్ బ్యాగ్ అనుష్కా ధరించడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఈ బుడ్డి బ్యాగ్ ధర ఏకంగా రూ. 2.3 లక్షలు పైనే పలుకుతుందట. దీన్ని ఎక్కువగా రాజవంవస్తులు, ధనవంతుల దర్పాన్ని ప్రదర్శించే రేంజ్లో ఉండే లగ్జరీయస్ హ్యాండ్ బ్యాగ్ అని చెబుతున్నారు ఫ్యాషన్ ప్రముఖులు. సినీ సెలబ్రెటీలు ధరించే దుస్తుల నుంచి హ్యాండ్ బ్యాగ్‌లు వరకు అన్ని కళ్లు చెదిరిపోయేంత ఆకర్షణీయంగా ఉండటమేగాక అత్యంత విలావంతమైన వస్తువులుగా ఉంటాయి. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) (చదవండి: భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?)
మామిడి తొక్కే కదా అని తీసిపారేయకండి..ఎన్ని లాభాలో తెలుసా..!
మామిడి తొక్కే కదా అని తీసిపారేయకండి..ఎన్ని లాభాలో తెలుసా..!
వేసవిలో మామిడి పండ్ల జాతర అన్నట్లుగా రకరకాల వెరైటీలు వస్తుంటాయి. మామిడి పండ్ల అంటే ఇష్టపడని వారెవరూ ఉంటారు చెప్పండి. అయితే మనం మామిడి పండ్ల తొక్కును పడేసి తినేస్తుంటాం. కానీ మామిడి పండ్ల తొక్కలో ఉన్నన్ని ఆరోగ్య ప్రయోజనాలు మరెందులోనూ ఉండవని అంటున్నారు. అవేంటో చూద్దామా..!మామిడి తొక్కలో ఏ, సీ, కే, ఫోలేట్, మెగ్నీషియం, కోలిన్, పొటాషియం, ఫైబర్లు, యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు, పాలీఫైనాల్స్లు ఉంటాయి. ఇవి గుండెజబ్బులు, కేన్సర్ వంటి ప్రమాదాన్ని తగ్గిస్తాయని శాస్తవేత్తలు చెబుతున్నారు. అంతేగాదు 2008లో ప్రచురితమైన ఓక్లహోమ్ స్టేట యూనివర్శిటీ అధ్యయనంలో మామిడి తొక్కలు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటమే గాక బరువు కూడా అదుపలో ఉంటుందని తేలింది. ముఖ్యంగా నామ్ డాక్ మై, ఇర్వ్విన్ అనే రెండు మామిడి రకాల తొక్కలు శరీరంలోని కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. పండ్లును చక్కగా తినేశాక ఆ మామిడి తొక్కలను ఏం చేయాలనే కదా..! వాటిని పడేయకుండా చక్కగా రకరకాల రెసీపీలు చేసుకుని తినేయండి అని చెబుతున్నారు నిపుణులు. మామిడి తొక్కలతో చేసే రెసీపీలు ఏంటంటే..మామిడి తొక్క టీ: మామిడితొక్కలను చక్కగా నీటిలో ఉడికించి, కొంచెం తేనే, నిమ్మకాయ వేసుకుని టీ మాదిరిగా తాగితే ఆ టేస్టే వేరే లెవల్ అన్నట్లు ఉంటుంది. ఈ టీ వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు అందుతాయి.మామిడి తొక్క ఊరగాయ: తొక్కతోపాటు ముక్కలు చేసుకుని ఉప్పులో ఊరబెట్టి, రోజ ఎండలో ఆరనియాలి. ఇలా వాటిలో నీరు మొత్తం ఇంకిపోయేలా ఆరనిచ్చి చక్కగా పచ్చడి మాదిరిగా పట్టుకోవడం లేదా వాటిని భద్రపర్చుకుని పప్పులో వేసుకుని తిన్న బాగుంటాయి. మామిడి తొక్కపొడి: ఎండలో ఎండబెట్టిన మామిడి తొక్కను పొడి చేసుకోవాలి. దీన్ని మెరినేడ్లు, సూప్‌లు, కూరల్లో జోడిస్తే మంచి టేస్ట్ వస్తుంది. పైగా మామిడి తొక్కను ఆహారంలో భాగం చేసుకున్నట్లువుతుంది కూడా. అంతేగాదు ఈ తొక్కల పొడిని బ్యూటీ టోనర్‌గా కూడా ఉపయోగించొచ్చు. హెయిర్ వాష్‌గా కూడా ఉపయోగించొచ్చ. బ్యూటీ స్క్రబ్: మామిడి తొక్కల పొడిని తేనే లేదా పెరుగులో కలిపి ముఖానికి స్క్రబ్‌లా ఉపయోగించొచ్చు. దీని వల్ల ముఖంపై ఉండే మృత కణాలు పోయి తాజాగా ఉంటుంది. పైగా చర్మం కూడా రిఫ్రెష్‌గా ఉంటుంది. జుట్టు సంరక్షణ: ఈ మామిడి తొక్కలను కలిపిని నీటితో షాంపు వేసుకుని తలను శుభ్రం చేసుకుంటే..జుట్టు చిట్లడం వంటి సమస్యలను అరికట్టి సిల్కీగా ఉండేలా చేస్తుంది. అంతేగాదు చర్మం కుచ్చులా ఉండి మెరుస్తూ ఉంటుంది. స్కిన్ టోనర్: మామిడి తొక్కలను నీటిలో వేసి మరిగించిన ద్రవాన్ని వడగట్టి చర్మానికి టోనర్‌గా ఉపయోగించొచ్చు. ఇది ముఖంపై ఉండే రంధ్రాను దగ్గర చేయడమే తాజాగా ఉండేలా చేస్తుంది.(చదవండి: మామిడి బఫే..ఐస్‌క్రీం నుంచి బ్రేక్‌ఫాస్ట్ వరకు అన్ని మ్యాంగో మయం..!)
Cannes 2024 రూ. 105 కోట్ల విలువైన డ్రెస్‌లు : ఈ భామ ఎవరో గుర్తుపట్టండి!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినీ, ఫ్యాషన్ ప్రముఖులు సందడి చేస్తున్నారు. ప్రతీ ఏడాది 12-రోజుల ఈ వేడుకులో ఫ్యాషన్ స్టయిల్, బ్యూటిఫుల్ ఫ్యాషన్ గేమ్, లుక్స్‌తో అదరగొట్టేస్తున్నారు. 77వ కేన్స్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్యారాయ్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కియారా అద్వానీ, ప్రీతి జింటా, దీప్తి సాధ్వానీ, శోభితా ధూళిపాళ, అదితి రావ్ హైదరీ తళుక్కున మెరిసారు. అంతేకాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ త్యాగికూడా అందరి చూపును తన వైపు తిప్పుకుంది. అయితే వీరిలో మరింత స్పెషల్‌గా నిలుస్తోంది నటి, మోడల్ ఊర్వశి రౌతేలా.ఊర్వశీ రౌతేలా ఖరీదైన ఫ్యాషన్ దుస్తులతో టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా నిలిచింది. ఈ బ్యూటీ కేన్స్ వేదికపై ధరించిన డ్రెస్ ధరలు ఏకంగా రూ.105 కోట్లు. ముఖ్యంగా ఫస్ట్ డే ధరించిన పూల పింక్ గౌన్ స్పెషల్‌గా నిలిచింది. దీని ధర ఏకంగా రూ.47 కోట్లు అని తెలుస్తోంది. అలాగే, కేన్స్ నాలుగవ రోజు వేసుకున్న బ్లాక్ అండ్ వైట్ కస్టమ్ మేడ్ డ్రెస్ ధర ఏకంగా రూ.58 కోట్లు. సో.. మొత్తంగా ఈ రెండు డ్రెస్సులు కలిపి రూ.105 కోట్లు వరకు ఉంటుందనేది హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఐశ్వర్య, కియారా అద్వానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రీతి జింటా లాంటి తారలు ధరించిన డ్రెస్‌ల ధరలు లక్షల్లో ఉంటుందిట. తరువాత రోజుల్లో కూడా తనదైన స్టయిల్లో అదర గొడుతోంది ఈ భామ.👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Photos
కేన్స్ 2024లో తళుక్కన మెరిసిన స్టార్, ఎవరీ నాన్సీ త్యాగి (ఫొటోలు)
Cannes 2024: ఊర్వశి రౌతేలా స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
Geetha Madhuri: సింగర్ గీతామాధురి కూతురు... ఎంత పెద్దదైంది, దిష్టితగిలేను! (ఫోటోలు)
Janhvi Kapoor: మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్‌లో జాన్వీ బిజీ బిజీ..క్రికెట్ థీమ్ నెక్లెస్..!
తెల్లచీరలో రాయంచలా మెరిసిపోతున్న ఈ బ్యూటీ గుర్తుందా!
Funday
తన రంగును మార్చుకునే.. సరస్సును ఎప్పుడైనా చూశారా!
ప్రకృతి అద్భుతాల్లో ఒకటి.. మహర్లూ సరస్సు. దక్షిణ ఇరాన్ లోని షిరాజ్ నగరానికి సమీపంలో దాదాపు 600 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందీ ఉప్పు నీటి సరస్సు. ఓ పక్క తెలుపు, మరో పక్క లేత గులాబీ రంగుతో.. సందర్శకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఎత్తైన ప్రాంతంలో కొలువుదీరిన ఈ కొలను కాలానుగుణంగా తన రంగును మార్చుకుంటుంది.షిరాజ్‌కు ఆగ్నేయంగా 27.0 కిమీల (16.8 మైళ్ళు) వరకూ ప్రవహిస్తుంది. సాధారణంగా వేసవి చివరి నాటికి ఆవిరైపోతుంది. ఆ సమయంలోనే ఇది పింక్ కలర్లోకి మారి.. ప్రకృతి ప్రియుల్ని ఆకర్షిస్తుంది. సూక్ష్మజీవుల కారణంగా ఇది పింక్ కలర్లోకి మారుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. నీటి మట్టం మరింత తగ్గగానే ముదురు గులాబీ రంగులోకి మారుతుంది. ఇందులో పేరుకున్న ఉప్పే.. ఈ సరస్సు మధ్యలో లేదా తీరంలో నిలబడటానికి.. దిమ్మలా, ఒడ్డులా మారుతుంది.ఇలాంటి పింక్ సరస్సులు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఉన్నాయి. రష్యాలోని ఆల్టై పర్వత ప్రాంతంలో ఉన్న సైబీరియన్ పింక్ లేక్ కూడా గతంలో వైరల్ అయ్యింది. ఆ సరస్సు మధ్యలోంచి రైలు పట్టాలు వేయడంతో సందర్శకులను అది మరింత ఆకట్టుకుంటోంది. ‘ఆర్టెమియా సాలినా’ అనే ఉప్పు నీటి రొయ్యల జాతి కారణంగానే ఆగస్ట్ సమయంలో.. సైబీరియన్ సరస్సుకి గులాబీ రంగు వస్తుందని నిపుణులు తేల్చారు.ఇవి చదవండి: అవును.. అది నిజంగా మృత్యుగుహే!
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలు.. ట్రై చేయండిలా..!
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలను గురించి మీరెప్పుడైనా విన్నారా! ఆమ్లెట్ వేయడంలో కొత్తదనం.., బాదం క్రిస్పీ చికెన్ మరెంతో స్పెషల్.., సోయా అంజీరా హల్వాలు నోరూరించే విధంగా ఉన్నాయంటే ఒక్కసారి వంట వార్పు చేయాల్సిందే!కోకోనట్ ఆమ్లెట్..కావలసినవి..గుడ్లు – 5కొబ్బరి కోరు – పావు కప్పుఉల్లిపాయ ముక్కలు – 2 టీ స్పూన్లు (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)పచ్చిమిర్చి ముక్కలు – కొద్దిగా (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)కొత్తిమీర తురుము– కొద్దిగా (అభిరుచిని బట్టి)హెవీ క్రీమ్ – అర టేబుల్ స్పూన్ (మార్కెట్లో లభిస్తుంది)పంచదార – 2 లేదా 3 టీ స్పూన్లుబటర్ – 2 టేబుల్ స్పూన్లు (కరిగింది, నూనె కూడా వాడుకోవచ్చు)ఉప్పు – కొద్దిగాతయారీ..– ముందుగా ఒక బౌల్లో వేయించిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు.. కొత్తిమీర తురుము, కొబ్బరి తురుము, పంచదార, హెవీ క్రీమ్ వేసుకుని.. అందులో గుడ్లు పగలగొట్టి.. కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.– అనంతరం పాన్ లో బటర్ లేదా నూనె వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని.. ఈ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పరచి.. చిన్న మంట మీద ఉడకనివ్వాలి.– ఇరువైపులా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి ఈ మిశ్రమంతో మొత్తం ఒకే అట్టులా కాకుండా.. రెండు లేదా మూడు చిన్నచిన్న ఆమ్లెట్స్‌లా వేసుకోవచ్చు. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటుంది ఈ ఆమ్లెట్.బాదం క్రిస్పీ చికెన్..కావలసినవి..బోన్ లెస్ చికెన్ – 3 లేదా 4 పీసులు (పలుచగా, పెద్దగా కట్ చేసిన ముక్కలు తీసుకోవాలి)మొక్కజొన్న పిండి – 6 టేబుల్ స్పూన్లుగోధుమ పిండి – 1 టేబుల్ స్పూన్బాదం – అర కప్పు (దోరగా వేయించి.. బ్రెడ్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి)ఎండుమిర్చి – 2 (కచ్చాబిచ్చాగా పొడి చేసుకోవాలి)గుడ్లు – 2, బాదం పాలు – 3 టీ స్పూన్లుమిరియాల పొడి – కొద్దిగాఉప్పు – తగినంతనూనె – సరిపడాతయారీ..– ముందుగా ఒక బౌల్లో మొక్క జొన్న పిండి, గోధుమ పిండి, మిరియాల పొడి, ఎండు మిర్చి పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.– మరో బౌల్లో గుడ్లు పగలగొట్టి.. బాగా గిలకొట్టి.. అందులో బాదం పాలు పోసి కలిపి పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకుని.. అందులో బాదం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో చికెన్ ముక్కను తీసుకుని.. దానికి మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని బాగా పట్టించాలి.– అనంతరం దాన్ని గుడ్డు–బాదం పాల మిశ్రమంలో ముంచి, వెంటనే బాదం పొడి పట్టించి.. నూనెలో దోరగా వేయించి.. సర్వ్ చేసుకోవాలి.సోయా అంజీరా హల్వా..కావలసినవి..డ్రై అంజీరా – 20 లేదా 25 (15 నిమిషాలు నానబెట్టుకోవాలి)కిస్మిస్ – 15 (నానబెట్టి పెట్టుకోవాలి)సోయా పాలు – అర కప్పుఫుడ్ కలర్ – కొద్దిగా (అభిరుచిని బట్టి)జీడిపప్పు, బాదం, పిస్తా – కొద్దికొద్దిగా (నేతిలో దోరగా వేయించి.. చల్లారాక కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి)నెయ్యి, పంచదార – సరిపడాగసగసాలు లేదా నువ్వులు – కొద్దిగా గార్నిష్కితయారీ..– ముందుగా అంజీరా, కిస్మిస్ రెండూ కలిపి.. మెత్తటి పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి.– ఈలోపు కళాయిలో 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని అందులో.. అంజీరా మిశ్రమాన్ని వేసుకుని చిన్న మంట మీద గరిటెతో తిప్పుతూ ఉండాలి.– దగ్గర పడుతున్న సమయంలో సోయా పాలు, జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు వేసుకుని మళ్లీ దగ్గరపడే వరకు చిన్న మంట మీద.. మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించాలి.– అనంతరం సరిపడా పంచదార, ఫుడ్ కలర్ వేసుకుని.. బాగా తిప్పాలి. టేస్ట్ చూసుకుని పంచదార, నెయ్యి అభిరుచిని బట్టి ఇంకొంచెం కలుపుకోవచ్చు.– కాస్త దగ్గర పడుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేసి.. కాసేపు అలానే గాలికి వదిలిపెట్టాలి.– దగ్గరపడి, చల్లారాక చేతులకు నెయ్యి రాసుకుని.. మొత్తం మిశ్రమాన్ని రోల్స్‌లా చుట్టుకుని.. గసగసాల్లో లేదా వేయించిన నువ్వుల్లో దొర్లించాలి. అనంతరం నచ్చినవిధంగా కట్ చేసుకోవాలి.ఇవి చదవండి: ఈ మినీ మెషిన్‌తో.. స్కిన్ సమస్యలకు చెక్!
ఈ మినీ మెషిన్‌తో.. స్కిన్ సమస్యలకు చెక్!
వయసు పెరిగే కొద్ది కళ్ల చుట్టూ ముడతలు, పెదవుల చుట్టూ గీతలు పడటం సర్వసాధారణం. అయితే దాన్ని.. చిత్రంలోని ఈ మైక్రోకరెంట్ లైన్ స్మూతింగ్ ఇన్స్టంట్ ప్లంపర్ డివైస్‌తో తగ్గించుకోవచ్చు. ఈ మినీ మెషిన్.. ఆ సమస్యను కేవలం వారం రోజుల్లోనే పరిష్కరించేస్తుంది.ఈ మినీ మెషిన్ తో ట్రీట్మెంట్ తీసుకుంటే.. కళ్లు కాంతిమంతమవుతాయి. పెదవులు ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఈ డివైజ్‌కి ఒకవైపు రెండు చిన్న చిన్న బాల్స్ లాంటి మసాజర్ హెడ్స్ ఉంటాయి. వాటిని చర్మానికి ఆనించి మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టూల్‌కి మధ్యలో చిన్న రోలర్ బాటిల్ ఉంటుంది. అందులో సీరమ్ ఉంటుంది.మసాజ్ చేసుకునేముందు ఆయా ప్రదేశాల్లో ఆ సీరమ్‌ని అప్లై చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. సీరమ్ రోలర్ని డివైస్ నుంచి బయటికి తీసుకోవచ్చు.. తిరిగి అక్కడే అటాచ్ చేసుకోవచ్చు. ఈ సీరమ్ .. యాంటీ ఆక్సిడెంట్ కెఫిన్, క్రాన్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్, రోజ్ వాటర్, ఫర్మింగ్ నియాసినామైడ్, విటమిన్ బి5 వంటి 95% సహజ పదార్థాలతో తయారైంది.ఈ మెషిన్ తో సుమారు ఏడు రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే.. కళ్లు, పెదవుల చుట్టూ ఉన్న ముడతలు, గీతలు పోయి సహజమైన అందం సొంతమవుతుంది. ఈ డివైస్‌కి చార్జింగ్ పెట్టుకుని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ మసాజర్‌లో 5 లెవల్స్‌తో కూడిన ఆప్షన్్స ఉంటాయి. దాంతో అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ధర 186 డాలర్లు. అంటే 15,530 రూపాయలన్నమాట.ఇవి చదవండి: ఇవి మార్జాల పుష్పాలనుకుంటున్నారా!
Children's Story: సహన రెండవ తరగతి చదువుతోంది.. ఒకరోజూ..!
సహన రెండవ తరగతి చదువుతోంది. ఆమె అన్నింటికీ తొందరపడుతుంది. ఏదయినా సరే తను అడిగిన వెంటనే నిమిషాల్లో జరిగిపోవాలి. లేదంటే గొడవ చేసి అమ్మ నాన్నలను విసిగిస్తుంది.‘అమ్మా! నా జడకు రబ్బర్ బ్యాండ్ వదులుగా ఉంది, సరిగ్గా పెట్టు’ వంట చేస్తున్న మానస దగ్గరకు వచ్చి అంది సహన. ‘పప్పు తాలింపు పెడుతున్నాను, ఐదు నిమిషాలు ఆగు’ అంది మానస. ‘అమ్మా! ప్లీజ్ అమ్మా, రామ్మా’ అంటూ నస పెట్టింది అమ్మాయి. దాంతో చేసే పని ఆపి సహన జడకి రబ్బర్ బ్యాండ్ సరిగ్గా పెట్టింది మానస.‘డాడీ! నాకు సాయంత్రం రంగు పెన్సిళ్లు తీసుకురండి’ ఆఫీసుకు వెళ్తున్న తండ్రితో చెప్పింది సహన.‘సరే అలాగే‘ అంటూ వెళ్ళిన ఆయన సాయంత్రం రంగు పెన్సిళ్లు మరచిపోయి వచ్చారు. అందుకు సహన మొండి పేచీ పెట్టింది. ఆ పేచీ భరించలేక ఆయన మళ్ళీ బజారుకి వెళ్ళి తీసుకువచ్చారు. ‘సహనా! నీకసలు ఓపిక లేదు. ఏదైనా అడిగిన వెంటనే దొరకదు. సమయం పడుతుంది. దానికోసం ఓర్పుగా ఎదురు చూడాలి. ఇలా తొందరపడితే.. తొందరపెడితే ముందు ముందు చాలా కష్టపడాల్సి వస్తుంది’ బాధపడుతూ కూతురితో అన్నారాయన. ఆ మాటలను సహన పెద్దగా పట్టించుకోలేదు.ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే అమ్మతో ‘స్కూల్ యాన్యువల్ డేకి నన్నో గ్రూప్ డాన్స్‌కి సెలెక్ట్ చేశారు టీచర్. గ్రూప్ డాన్స్ కాదు సోలో డాన్స్ చేస్తానని చెప్పాను’ అంది సహన.‘మంచిదే.. కానీ గ్రూప్ డాన్స్ అంటే నువ్వెలా చేసినా అందరిలో కలసిపోతుంది. సోలో డాన్స్ అయితే చాలా శ్రద్ధపెట్టి నేర్చుకోవాలి! ఒక్కసారి ప్రాక్టీస్‌కే నాకంతా వచ్చేసిందని తొందరపడితే కుదరదు. రోజూ ఇంటి దగ్గర కూడా సాధన చేయాలి మరి!’ అంది మానస. ‘అలాగేలే అమ్మా’ అంటూ తల ఊపింది సహన నిర్లక్ష్యంగా! యాన్యువల్ డే కోసం స్కూల్లో డాన్స్ నేర్పించడం మొదలైంది. కానీ సహన ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయట్లేదు. అది గమనించి కూతురితో అన్నది మానస ‘ఇంటి దగ్గర నువ్వు సరిగా ప్రాక్టీస్ చేయడం లేదు. అలా అయితే స్టేజీ మీద బాగా చేయలేవు’ అని! ‘స్కూల్లోనే బాగా చేస్తున్నానమ్మా! అది చాల్లే’ అని జవాబిచ్చింది సహన ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా. ఇంక చెప్పినా వినేరకం కాదని వదిలేసింది మానస.సహన వాళ్ల స్కూల్ వార్షిక దినం రానే వచ్చింది. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. సహన వంతు వచ్చింది. పాట మొదలైంది. దానికి తగ్గ స్టెప్స్.. హావభావాలతో డాన్స్ చేయసాగింది సహన. అయితే హఠాత్తుగా తను వేయాల్సిన స్టెప్స్‌ని మరచిపోయి వేసిన స్టెప్స్‌నే మళ్లీ మళ్లీ వేయసాగింది. ‘అలా కాదు సహనా.. ఇలా చేయాలి’ అంటూ స్టేజీ పక్క నుంచి వాళ్ల డాన్స్ టీచర్ చిన్నగా హెచ్చరిస్తూ చేతులతో ఆ స్టెప్స్‌ని చూపించసాగింది. అర్థం చేసుకోలేక అయోమయానికి గురైంది సహన. దాంతో డాన్స్ ఆపేసి.. బిక్కమొహం వేసి నిలబడిపోయింది.స్టేజీ మీదకు వెళ్లి ఆమెను కిందకు తీసుకొచ్చేసింది టీచర్. ప్రేక్షకుల్లో ఉన్న మానస లేచి.. గబగబా సహన దగ్గరకు వెళ్లింది. కూతురిని హత్తుకుంది. దానితో అప్పటివరకు ఉన్న భయం పోయి తల్లిని గట్టిగా వాటేసుకుంది. ‘అమ్మా! నేను డా¯Œ ్స మధ్యలో స్టెప్స్ మరచిపోయాను’ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ చెప్పింది సహన. ‘నీకు చాలాసార్లు చెప్పాను.. ఏదైనా పూర్తిగా నేర్చుకోనిదే రాదని! కొంచెం రాగానే అంతా వచ్చేసిందనుకుంటావు. ఇప్పుడు చూడు ఏమైందో! సాధన చేయకపోవడం వల్ల ఆందోళన పడ్డావు. అదే చక్కగా ప్రాక్టీస్ చేసుంటే ఈ కంగారు ఉండేది కాదు కదా! తొందరపాటు వల్ల ఇలాంటివి జరుగుతాయనే ఓర్పుగా ఉండాలని చెప్పేది’ అంది మానస.అమ్మ మాటలనే వింటూ ఉండిపోయింది సహన. ‘చదువులోనూ అంతే! జవాబులో కొంత భాగం రాగానే వచ్చేసిందంటావు. ముక్కున పట్టి అప్పచెప్పి ఇక చదవడం ఆపేస్తావు. ముక్కున పట్టింది ఎంతసేపో గుర్తుండదు. అందుకే పరీక్షల్లో సరిగ్గా రాయలేక మార్కులు తెచ్చుకోలేకపోతున్నావు. అప్పటికప్పుడు ఏదీ వచ్చేయదు. నిదానంగా ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివి అర్థం చేసుకోవాలి’ చెప్పింది మానస.అలా అంతకుముందు అమ్మ ఎన్నిసార్లు చెప్పినా సహనకు అర్థం కాలేదు. కానీ ఈసారి బాగా అర్థమయింది. తన పొరబాటును గ్రహించింది. ‘అమ్మా.. ఇప్పటి నుంచి తొందరపడను. నిదానంగా ఆలోచిస్తాను. దేన్నయినా పూర్తిగా నేర్చుకుంటాను’ అన్నది సహన .. అమ్మను చుట్టేసు కుంటూ! ‘మా మంచి సహన.. ఇక నుంచి పేరును సార్థకం చేసుకుంటుంది’ అంటూ.. కూతురు తల నిమిరింది మానస. – కైకాల వెంకట సుమలతఇవి చదవండి: మిస్టరీ.. 'ఆ వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే.. ఎందుకలా జరుగుతుంది'?
వింతలు విశేషాలు
వామ్మో ఈ దారా? ప్రాణం పోయినంత పనైపాయె!!
నీతా అంబానీ తాగే వాటర్ అంత ఖరీదా? మరి రూ.49 లక్షల బాటిల్ సంగతేంటి?
Cannes 2024: ఊర్వశి రౌతేలా స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
ఈ ఏడాది.. వికసించిన 'మే పుష్పం' ఇదే!
Deepika Padukone : దీపికా పడుకోణె అమేజింగ్ లగ్జరీ కార్లు, విలువ ఎంతో తెలుసా?
Sagubadi: కాల్చొద్దు.. కలియదున్నండి!
ఈ చిత్ర ప్రదర్శన.. భళా!
వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే : పీరియడ్స్ పరిశుభ్రత ముఖ్యం, లేదంటే చాలా ప్రమాదం
పంజాబ్‌లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ... నమ్మబుద్ధి కావడం లేదా, ఇదిగో వీడియో వైరల్
KKR Wins IPL ‘హ్యాపీ నా పప్పా’: అటు పెద్దోడు, ఇటు చిన్నోడు : తండ్రీ కూతుళ్ల ఎమోషనల్ వీడియో