Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IPL 2024 Playoffs: Qualifying Teams, Schedule, Venues
IPL 2024: ముగిసిన లీగ్ మ్యాచ్‌లు.. ప్లే ఆఫ్స్‌కు చేరిన జ‌ట్లు ఇవే

ఐపీఎల్‌-2024లో లీగ్ ద‌శ మ్యాచ్‌లు ముగిశాయి. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా గౌహ‌తి వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మ‌ధ్య జ‌రగాల్సిన చివ‌రి లీగ్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది. టాస్ ప‌డిన‌ప్ప‌ట‌కి మ‌రోసారి వ‌ర్షం మొద‌లు కావ‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అంపైర్‌లు ప్ర‌క‌టించారు.ఇక లీగ్ స్టేజీ ముగియ‌డంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన జ‌ట్ల‌పై ఓ లూక్కేద్దం. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌-4లో నిలిచిన కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్, ఆర్సీబీ జ‌ట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించాయి. పాయింట్ల టేబుల్‌లో కేకేఆర్‌(19) పాయింట్ల‌తో అగ్ర‌స్ధానంలో ఉండ‌గా.. ఎస్ఆర్‌హెచ్ 17(నెట్ ర‌న్‌రేట్ +0.414), రాజ‌స్తాన్ 17(నెట్ ర‌న్‌రేట్ +0.273), ఆర్సీబీ(14) పాయింట్ల‌తో వ‌రస‌గా రెండు, మూడు ,నాలుగు స్ధానాల్లో నిలిచాయి. ఇక మే 21 నుంచి నాకౌట్ మ్యాచ్‌లకు తెర‌లేవ‌నుంది. మే 21న అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి క్వాలిఫియ‌ర్‌లో కేకేఆర్‌, ఎస్ఆర్‌హెచ్ జ‌ట్లు త‌ల‌ప‌డునున్నాయి. మే 22న ఎలిమినేట‌ర్‌లో ఆర్సీబీ, రాజ‌స్తాన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. అనంత‌రం మే 24 క్వాలిఫియ‌ర్-2లో ఎలిమినేట‌ర్‌లో గెలిచిన జ‌ట్టు, క్వాలిఫియ‌ర్‌-1లో ఓడిన జ‌ట్టు త‌ల‌ప‌డ‌నున్నాయి. మే 26న చెపాక్ వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

RR vs KKR IPL 2024: Rain forces washout in Guwahati
రాజ‌స్తాన్‌, కేకేఆర్ మ్యాచ్ ర‌ద్దు.. ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ హ్యాపీ

ఐపీఎల్‌-2024లో భాగంగా గౌహ‌తి వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మ‌ధ్య జ‌రగాల్సిన చివ‌రి లీగ్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది. గౌహ‌తిలో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వ‌ర్షం కురిసింది. అయితే మ‌ధ్యలో వ‌ర్షం త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో మ్యాచ్‌ను 7 ఓవ‌ర్లకు కుదించారు. టాస్ కూడా ప‌డింది. కానీ మ‌ళ్లీ వ‌ర్షం తిరుగుముఖం ప‌ట్ట‌డంతో అంపైర్‌లు మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. దీంతో ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్ ల‌భించింది. ఇక ఈ మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 17 పాయింట్ల‌తో రెండో స్ధానాన్ని సుస్ధిరం చేసుకుంది. అయితే రాజ‌స్తాన్ ఖాతాలో కూడా 17 పాయింట్లు ఉన్న‌ప్ప‌ట‌కి.. ఆ జ‌ట్టు కంటే ఎస్ఆర్‌హెచ్ ర‌న్‌రేట్ మెరుగ్గా ఉంది. ఈ క్ర‌మంలోనే రాజ‌స్తాన్ జ‌ట్టు ఎస్ఆర్‌హెచ్‌ను పాయింట్ల ప‌ట్టిక‌లో అధిగ‌మించ‌లేక‌పోయింది.మ‌రోవైపు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ 19 పాయింట్ల‌తో అగ్ర‌స్ధానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది సీజ‌న్ ప్లే ఆఫ్స్‌కు కేకేఆర్‌, ఎస్ఆర్‌హెచ్‌, ఆర్సీబీ, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ చేరాయి. మే 21న జ‌ర‌గ‌నున్న తొలి క్వాలిఫియ‌ర్‌లో కేకేఆర్‌, ఎస్ఆర్‌హెచ్ జ‌ట్లు త‌ల‌ప‌డునున్నాయి. మే 22న ఎలిమినేట‌ర్‌లో ఆర్సీబీ, రాజ‌స్తాన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి.

Abhishek Sharma Creates History; Breaks Virat Kohlis 8-Year-Old Record
చరిత్ర సృష్టించిన అభిషేక్‌.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు

ఐపీఎల్‌-2024లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఉప్ప‌ల్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు.215 పరుగుల భారీ లక్ష్య చేధనలో పంజాబ్‌ బౌలర్లకు అభిషేక్‌ శర్మ చుక్కలు చూపించాడు. 28 బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌.. 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్‌ 209.42 స్ట్రైక్‌ రేటుతో 467 పరుగులు చేశాడు.ఈ క్రమంలో అభిషేక్‌ శర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా అభిషేక్‌ రికార్డులకెక్కాడు. ప్రస్తుత సీజన్‌లో అభిషేక్‌ 41 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి పేరిట ఉండేది. 2016 సీజన్‌లో కోహ్లి 38 సిక్స్‌లు బాదాడు. తాజా సీజన్‌తో విరాట్‌ ఆల్‌టైమ్‌ రికార్డును అభిషేక్‌ బ్రేక్‌ చేశాడు.

RR vs KKR, IPL 2024: Toss Delayed Due To Heavy Rain
రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవ్వాలి: ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌

ఐపీఎల్‌-2024లో గౌహతి వేదిక‌గా చివ‌రి లీగ్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డేందుకు రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు సిద్ద‌మ‌య్యాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం క‌లిగించాడు. బర్సపరా క్రికెట్ స్టేడియం ప‌రిసర ప్రాంతాల్లో తేలిక‌పాటి వ‌ర్షం కురుస్తోంది. దీంతో 7:00 గంటలకు పడాల్సిన టాస్‌ ఆలస్యం కానుంది. కాగా ఇరు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్ 19 పాయింట్లతో అగ్రస్ధానంలో ఉండగా.. రాజస్తాన్ 16 పాయింట్లతో మూడో స్ధానంలో ఉంది. ఇక పంజాబ్‌పై తమ చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాజస్తాన్‌- కేకేఆర్ మ్యాచ్ రద్దవ్వాలని సన్‌రైజర్స్ అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ మ్యాచ్ మొత్తానికి రద్దు అయితే రాజస్తాన్‌, కేకేఆర్‌కు తలో పాయింట్ లభిస్తుంది. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ 17 పాయింట్లతో తమ రెండో స్ధానాన్ని పదిలం చేసుకుంటుంది. కాగా మ్యాచ్ రద్దు అయితే రాజస్తాన్ ఖాతాలో కూడా 17 పాయింట్లు ఉంటాయి. కానీ రాజస్తాన్ జట్టు కంటే ఎస్‌ఆర్‌హెచ్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. కాబట్టి ఎస్‌ఆర్‌హెచ్ సెకెండ్ ప్లేస్‌కు ఎటువంటి ఢోకా లేదు.

Hyderabad chase down 215 easily, move to second spot
పంజాబ్‌పై ఘ‌న విజ‌యం.. సెకెండ్ ప్లేస్‌కు ఎస్ఆర్‌హెచ్‌

ఐపీఎల్‌-2024లో త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అద‌రగొట్టింది. ఉప్ప‌ల్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్ధానానికి స‌న్‌రైజ‌ర్స్ చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 214 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్ర‌భుసిమ్రాన్ సింగ్‌(71) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా.. రూసో(49), అథర్వ తైదే(46), జితేష్ శ‌ర్మ‌(32) అద‌ర‌గొట్టారు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో టి న‌ట‌రాజ‌న్ రెండు వికెట్లు, క‌మ్మిన్స్‌, వియస్కాంత్ త‌లా వికెట్ ప‌డ‌గొట్టారు. అనంత‌రం 215 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్‌..19.1 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో అభిషేక్ శ‌ర్మ‌(66) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అత‌డితో పాటు హెన్రిచ్ క్లాసెన్‌(42), నితీష్ కుమార్ రెడ్డి(37), రాహుల్ త్రిపాఠి(33) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

Jake Fraser-McGurk punches ticket for T20 World Cup: Reports
ఆసీస్ యువ సంచలనానికి ల‌క్కీ ఛాన్స్‌.. వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో చోటు!?

ఐపీఎల్‌-2024లో ఆస్ట్రేలియా యువ సంచ‌ల‌నం, ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓపెన‌ర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ త‌ర‌పున ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన మెక్‌గ‌ర్క్ టోర్నీ ఆసాంతం అద‌ర‌గొట్టాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గ‌ర్క్‌.. 234.04 స్ట్రైక్ రేటుతో 330 ప‌రుగులు చేశాడు.ఈ క్ర‌మంలో అత‌డికి ఆస్ట్రేలియా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జట్టులో చోటు ఇవ్వాల‌ని సెల‌క్ట‌ర్లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కాగా ఇప్ప‌టికే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌న‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును ఆస్ట్రేలియా క్రికెట్ ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టులో మెక్‌గ‌ర్క్‌కు చోటు ద‌క్క‌లేదు.కనీసం రిజర్వ్ జాబితాలో కూడా జేక్ ఫ్రేజ‌ర్‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు. సెల‌క్ట‌ర్ల నిర్ణ‌యం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే ఆసీస్ సెల‌క్ట‌ర్లు ఇప్పుడు త‌మ మ‌న‌సును మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. జేక్ ఫ్రేజర్‌ను టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌న‌కు రిజ‌ర్వ్ ఆట‌గాడిగా ఎంపిక చేయాల‌ని ఆసీస్ సెల‌క్ష‌న్ క‌మిటీ నిర్ణయం తీసుకున్న‌ట్లు ఆసీస్ మీడియా వ‌ర్గాలు వెల్ల‌డించాయి.ఆసీస్ స్టార్ డేవిడ్ వార్న‌ర్‌కు బ్యాక‌ప్‌గా మెక్‌గ‌ర్క్‌ను ఎంపిక చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక జాన్ 1 నుంచి పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ ఆరంభం కానుంది. ఆసీస్ త‌మ తొలి మ్యాచ్‌లో జూన్ 5న ఒమెన్‌తో త‌ల‌ప‌డ‌నుంది.టీ20 ప్రపంచ క‌ప్‌న‌కు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్‌), ఆష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్. జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.

T20 WC 2024: Piyush Chawla Says Rohit Sharma is His All Time Favourite
నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ క్రికెటర్‌ అతడే: టీమిండియా స్టార్‌

టీ20 ప్రపంచకప్‌-2007, వన్డే వరల్డ్‌కప్‌-2011.. టీమిండియా ట్రోఫీ గెలిచిన రెండు సందర్బాల్లోనూ జట్టులో భాగంగా ఉన్నాడు స్పిన్నర్ పీయూశ్‌ చావ్లా. ఏకంగా రెండుసార్లు ట్రోఫీని ముద్దాడే అదృష్టం దక్కించుకున్నాడు. ‌2006లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ యూపీ స్పిన్నర్‌ తన కెరీర్‌ మొత్తంలో 3 టెస్టులు, 25 వన్డేలు, ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 7, 32, 4 వికెట్లు తీశాడు.అయితే, ఈ రైటార్మ్‌ లెగ్ బ్రేక్‌ స్పిన్నర్‌కు ఐపీఎల్‌లో మాత్రం ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 192 మ్యాచ్‌లు ఆడిన పీయూశ్‌ ‌192 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ తరఫున 11 మ్యాచ్‌లలో కలిపి 13 వికెట్లు పడగొట్టాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2024 ట్రోఫీ టూర్‌ నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్‌ బృందంతో కలిసి పీయూశ్‌ చావ్లా హైదరాబాద్‌లోని సాక్షి మీడియా ఆఫీస్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా ట్రోఫీని ఆవిష్కరించి టీమిండియాకు విష్‌ చేశాడు.ఈ క్రమంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. తన ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరో తెలియజేశాడు. ‘‘రోహిత్ శర్మ నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌. తను నాకు స్నేహితుడు. ఐపీఎల్‌-2024లో ఆఖరి మ్యాచ్‌ సందర్భంగా అతడు ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈసారి వరల్డ్‌కప్‌లో రోహిత్‌ ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పీయూశ్‌ చావ్లా పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడిగా బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ.. 14 మ్యాచ్‌లు ఆడి 417 పరుగులు చేశాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌పై సెంచరీ చేసిన హిట్‌మ్యాన్‌.. లీగ్‌ దశలో ఆఖరిదైన లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లోనూ అర్ధ శతకం(38 బంతుల్లో 68)తో సత్తా చాటాడు.

IPL 2024 SRH vs PBKS: Klassen Mass Catch Prabhsimran Solid Knock Comes End Video
క్లాసెన్‌ మాస్‌ క్యాచ్‌.. బ్యాటర్‌ మైండ్‌బ్లాంక్‌! వీడియో

ఐపీఎల్‌-2024లో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ లీగ్‌ దశలో ఆఖరి మ్యాచ్‌ ఆడుతోంది. సొంత మైదానం ఉప్పల్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఈ మ్యాచ్‌లో గనుక సన్‌రైజర్స్‌ భారీ తేడాతో గెలిచి.. తదుపరి మ్యాచ్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడిస్తే ఏకంగా రెండో స్థానానికి చేరుకుంటుంది. ఇక ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది.ఓపెనర్లు అథర్వ టైడే(27 బంతుల్లో 46), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌(45 బంతుల్లో 71) అద్భుత ఇన్నింగ్స్‌తో శుభారంభం అందించారు. ముఖ్యంగా ప్రభ్‌సిమ్రన్‌ సన్‌రైజర్స్‌ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి ముప్పుతిప్పలు పెట్టాడు.ఈ క్రమంలో 15వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన విజయకాంత్‌ వియస్కాంత్‌ రెండో బంతికి ప్రభ్‌సిమ్రన్‌ను ఊరించాడు. దీంతో షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన కనెక్ట్‌ కాలేదు. ఈ క్రమంలో వెంటనే స్పందించిన వికెట్‌ కీపర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు. దీంతో ప్రభ్‌సిమ్రన్‌ నిరాశగా పెవిలియన్‌ చేరాడు. అలా దురదృష్టకరరీతిలో ప్రభ్‌సిమ్రన్‌ అవుట్‌ కావడంతో పంజాబ్‌ ఫ్యాన్స్‌ నిరాశ చెందారు.అయితే, ఈ మ్యాచ్‌లో ఓపెనర్లతో పాటు వన్‌డౌన్‌బ్యాటర్‌ రిలీ రొసో(49), కెప్టెన్‌ జితేశ్‌ శర్మ(15 బంతుల్లో 32 నాటౌట్‌) రాణించడంతో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.మరోవైపు.. లక్ష్య ఛేదనకు దిగిన ఆరెంజ్‌ ఆర్మీకి ఆరంభంలోనే షాకిచ్చాడు పంజాబ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌. అతడి దెబ్బకు రైజర్స్‌ విధ్వంసకర ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌(0) పరుగుల ఖాతా తెరవకుండానే బౌల్డ్‌ అయ్యాడు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి(18 బంతుల్లో 33)ని హర్షల్‌ పటేల్‌ అవుట్‌ చేశాడు. దీంతో పవర్‌ ప్లేలో సన్‌రైజర్స్‌ రెండు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. Right wicket at the right time 😎Prabhsimran's solid knock comes to an end courtesy of a Klaasy catch 💪Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #SRHvPBKS pic.twitter.com/a87LCfvi9g— IndianPremierLeague (@IPL) May 19, 2024

IPL 2024, SRH vs PBKS: Atharva, Prabhsimran & Rilee Powers PBKS To 214
SRH vs PBKS: రాణించిన టాపార్డర్‌.. పంజాబ్‌ భారీ స్కోరు!

ఐపీఎల్‌-2024 లీగ్‌ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ దంచికొట్టింది. సన్‌రైజర్స్‌ హైదారాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించింది. టాపార్డర్‌ రాణించడంతో సన్‌రైజర్స్‌కు 215 పరుగుల లక్ష్యం విధించగలిగింది.కాగా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలిచిన పంజాబ్‌ కింగ్స్‌.. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకున్న సన్‌రైజర్స్‌తో పోటీకి దిగింది. ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ తాత్కాలిక కెప్టెన్‌ జితేశ్‌ శర్మ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.ఈ క్రమంలో ఓపెనర్లు అథర్వ టైడే(27 బంతుల్లో 46), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌(45 బంతుల్లో 71), వన్‌డౌన్‌ బ్యాటర్‌ రిలీ రోసో(24 బంతుల్లో 49) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. అదే విధంగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ కెప్టెన్‌ (15 బంతుల్లో 32 నాటౌట్‌) ఇన్నింగ్స్‌తో మెరిశాడు.ఈ క్రమంలో పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 214 పరుగులు సాధించింది. ఇక సన్‌రైజర్స్‌ బౌలర్లలో నటరాజన్‌కు రెండు, కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌, విజయకాంత్‌ వియస్కాంత్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.కాగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌ రద్దు కావడంతో ప్లే ఆఫ్స్‌ చేరిన సన్‌రైజర్స్‌.. పంజాబ్‌తో మ్యాచ్‌లో గనుక గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే, కేకేఆర్‌- రాజస్తాన్‌ మధ్య మ్యాచ్‌ ఫలితం తర్వాతే రెండో స్థానం ఖరారవుతుందో లేదో తెలుస్తుంది.

Satwiksairaj Rankireddy-Chirag Shetty Crowned Thailand Open Mens Doubles Champions
థాయ్‌లాండ్ ఓపెన్ విజేత‌గా సాత్విక్‌-చిరాగ్ జోడీ

థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్ విజేత‌గా భారత స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి నిలిచారు. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో చైనాకు చెందిన చెన్ బో యాంగ్, లియు యిపై 21-15 21-15 తేడాతో విజ‌యం సాధించిన ఈ భార‌త ద్వ‌యం.. తొమ్మిదవ వరల్డ్ టూర్ టైటిల్ త‌మ ఖాతాలో వేసుకున్నారు.వ‌రుస గేమ్‌లలో ప్ర‌త్య‌ర్ధి జోడీని ప్రపంచ నం.3 సాత్విక్‌ ద్వయం చిత్తు చేసింది. ఏ ద‌శ‌లోనూ ప్ర‌త్య‌ర్ధికి కోలుకునే అవ‌కాశం సాత్విక్‌, చిరాగ్ జంట ఇవ్వ‌లేదు. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు టైటిల్‌ను సొంతం చేసుకోవడం ఈ జోడికి మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది. ఇక ప్ర‌స్తుత బీడ‌బ్ల్యూఎఫ్‌ సీజ‌న్‌లో ఈ జోడికి ఇది రెండువ టైటిల్ కావ‌డం విశేషం. అంతకుముందు మార్చిలో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ టైటిల్‌ను ఈ జోడీ సొంతం చేసుకుంది. అదేవిధంగా మలేషియా సూపర్ 1000,ఇండియా సూపర్ 750 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచారు.

Advertisement
Advertisement

Sports

1
India
7020 / 58
odi
2
Australia
5309 / 45
odi
3
South Africa
4062 / 37
odi
4
Pakistan
3922 / 36
odi
5
New Zealand
4708 / 46
odi
6
England
3934 / 41
odi
7
Sri Lanka
4947 / 55
odi
8
Bangladesh
4417 / 50
odi
9
Afghanistan
2845 / 35
odi
10
West Indies
3109 / 44
odi
View Team Ranking
Advertisement
Advertisement
Advertisement