● అసంపూర్తిగా భవన నిర్మాణాలు ● నత్తనడకన వసతుల కల్పన పనులు ● అడ్వాన్స్‌ నిధులిచ్చినా అంతంతమాత్రంగానే.. ● గడువులోపు పూర్తి కావడం అనుమానమే.. ● ‘సాక్షి’ విజిట్‌లో వెల్లడైన సర్కారు బడుల తీరు | Sakshi
Sakshi News home page

● అసంపూర్తిగా భవన నిర్మాణాలు ● నత్తనడకన వసతుల కల్పన పనులు ● అడ్వాన్స్‌ నిధులిచ్చినా అంతంతమాత్రంగానే.. ● గడువులోపు పూర్తి కావడం అనుమానమే.. ● ‘సాక్షి’ విజిట్‌లో వెల్లడైన సర్కారు బడుల తీరు

Published Sun, May 19 2024 9:45 AM

● అసం

కై లాస్‌నగర్‌: సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేదిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. ఇందు కోసం అడ్వాన్స్‌గా 25శాతం నిధులు సైతం ఆ కమిటీల ఖాతాల్లోకి జమ చేసింది. బడుల పునఃప్రారంభమయ్యే నాటికి అన్ని పాఠశాలల్లో అధికారులు గుర్తించిన విద్యుదీకరణ, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, కిచెన్‌ షెడ్ల నిర్మాణంతో పాటు పాఠశాలల్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి కార్పొరేట్‌ తరహాలో బడులు తీర్చిదిద్దాలని ఆదేశించింది. అయితే ఈ పనులు గడువులో పూర్తి కావడం అనుమానంగానే కనిపిస్తోంది. ‘సాక్షి’ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం సందర్శించగా ఈ విషయం వెల్లడైంది. చాలా పాఠశాలల్లో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యార్థులకు మరోసారి సమస్యలే స్వాగతం పలికే పరిస్థితి కనిపిస్తోంది.

అసంపూర్తిగా భవన నిర్మాణాలు

జిల్లాలో డీఈవో పరిధిలో మొత్తం 702 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 678 ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్య పాఠశాలలుండగా, 17 కేజీబీవీలు, ఆరు మోడల్‌ స్కూళ్లు, ఒక అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల ఉంది. చాలా బడుల్లో తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు వంటి కనీస వసతుల్లేక విద్యార్థులు ఇబ్బందుల నడుమ చదువులు సాగించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ప్రభుత్వ హయాంలో మన ఊరు–మనబడి పథకం ద్వారా ఆయా పాఠశాలల్లో అదనపు తరగతి గదులతో పాటు మరుగుదొడ్లు, కిచెన్‌ షెడ్ల నిర్మాణాలు చేపట్టారు. పనులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా చాలా చోట్ల పూర్తి కాలేదు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే నిలిపివేశారు. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ బాధ్యతలను అమ్మ అదర్శ పాఠశాలలకు అప్పగించింది. మొన్నటి వరకు ఎన్నికలు ఉండటంతో పనులు నెమ్మదించాయని, ప్రస్తుతం వేగం పుంజుకుంటుందని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా కనిపించడం లేదు.

పది పాఠశాలలకు అదనపు గదులు

వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను విద్యాశాఖ ముందుగానే గుర్తించింది. జిల్లా వ్యాప్తంగా 14 పాఠశాలల్లో భవనాలు కూలిపోయే దశలలో ఉన్నట్లుగా గుర్తించి కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. ఈ మేరకు స్పందించిన కలెక్టర్‌ తన స్థాయిలో పది పాఠశాలలకు రూ.16లక్షల నుంచి రూ.20లక్షల చొప్పున అదనపు తరగతి గదులను మంజూరు చేశారు. వాటి పనులు ప్రారంభించాల్సి ఉంది. మిగతా నాలుగు పాఠశాలలకు వ్యయం ఎక్కువగా ఉండటంతో వాటి మంజూరు కోసం రాష్టస్థాయికి ప్రతిపాదనలు పంపించారు.

ఇక్కడ కనిపిస్తున్నది బజార్‌హత్నూర్‌ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.6లక్షల వ్యయంతో చేపట్టిన కిచెన్‌షెడ్‌, డైనింగ్‌ హాల్‌ నిర్మాణం. మన ఊరు–మన బడి కింద గతేడాది ఏప్రిల్‌లో పనులు ప్రారంభించారు. సీలింగ్‌ వరకు చేరుకున్నా ఒక్క రూపాయి నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశాడు. ఏప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. – బజార్‌హత్నూర్‌

వసతులు కల్పిస్తాం

పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు గాను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే ఆయా క మిటీల అకౌంట్లకు రూ.5కోట్ల నిధులు విడుద ల చేశాం. తాగునీరు, విద్యుదీకరణ, మరుగుదొడ్లు వంటి వాటితో పాటు చిన్నపాటి మరమ్మతు పనులు సైతం చేపడుతున్నాం. ఇవి స కాలంలో పూర్తిచేసేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. బడులు తెరిచే నాటికి విద్యార్థులకు ఎ లాంటి ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధప్రతి పాదికన పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నాం.

– ప్రణీత, డీఈవో

జిల్లాలో..

బాయ్స్‌ టాయ్‌లెట్స్‌ లేని పాఠశాలలు : 325

గర్ల్స్‌ టాయ్‌లెట్స్‌ లేని పాఠశాలలు : 282

తాగునీటి వసతి లేని పాఠశాలలు : 264

విద్యుత్‌ సౌకర్యం లేని పాఠశాలలు: 234

శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలు : 14

● అసంపూర్తిగా భవన నిర్మాణాలు ● నత్తనడకన వసతుల కల్పన పను
1/1

● అసంపూర్తిగా భవన నిర్మాణాలు ● నత్తనడకన వసతుల కల్పన పను

Advertisement
 
Advertisement
 
Advertisement