19న ఎయిడ్స్‌ క్యాండిల్‌ లైట్‌ మెమోరియల్‌ డే | Sakshi
Sakshi News home page

19న ఎయిడ్స్‌ క్యాండిల్‌ లైట్‌ మెమోరియల్‌ డే

Published Sat, May 18 2024 9:15 AM

-

రాయచోటి: ఎయిడ్స్‌ వ్యాధితో జీవితాలను కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ఈనెల 19న అంతర్జాతీయ ఎయిడ్స్‌, క్యాండిల్‌ లైట్‌ మెమోరియల్‌ డే నిర్వహించనున్నట్లు జిల్లా కుష్టు, ఎయిడ్స్‌, టీబీ అధికారి డాక్టర్‌ శైలజ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్‌ 1న అంతర్జాతీయ ఎయిడ్స్‌ దినోత్సవం జరుపుకోవడంతోపాటు మే నెల మూడో ఆదివారాన్ని అంతర్జాతీయ ఎయిడ్స్‌ క్యాండిల్‌ లైట్‌ మెమోరియల్‌ డేగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో ఎయిడ్స్‌ వ్యాధి వల్ల కలిగే సామాజిక, ఆర్థిక నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ ఎయిడ్స్‌ క్యాండిల్‌ లైట్‌ మెమోరియల్‌ డే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 19న రాయచోటిలోని కమ్యునిటీ హెల్త్‌ సెంటర్‌, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డైట్‌ కళాశాల వరకు ప్రేమ, సంఘీభావంతో మనందరం గుర్తించుకుందాం, మనందరం నయం చేసుకుందాం అనే థీమ్‌తో ఈ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ ఉంటుందన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement