ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్‌ | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్‌

Published Wed, May 15 2024 4:44 PM

Aquaman And The Lost Kingdom Streaming Now In OTT

గతేడాదిలో విడుదలైన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్' మరో  ఓటీటీలోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రెంట్‌ ప్రాతిపదికన స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే ఇప్పుడు జియో సినిమాలో ఈ చిత్రాన్ని ఉచితంగా చూడొచ్చు.  2018లో వచ్చిన ‘ఆక్వామెన్‌’ తెలుగు ప్రేక్షకులను కూడా  అలరించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన మరో సూపర్‌ హీరో ఫిల్మ్‌ 'ఆక్వామెన్‌ అండ్‌ ది లాస్ట్‌ కింగ్‌డమ్‌'.

జేమ్స్ వాన్ డైరెక్ట్ చేసిన ఈ ఆక్వామాన్ మూవీలో జేసన్ మొమొవా ఈ ఆక్వామాన్ (ఆర్థర్ కర్రీ) పాత్ర పోషించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. కామిక్స్‌ నుంచి పుట్టుకొచ్చిన మరో సూపర్‌ హీరో 'ఆక్వామెన్‌'. ఇప్పటికే పలువురు సూపర్‌హీరోలను అందించిన హాలీవుడ్‌.. అక్వామాన్‌ను కూడా సూపర్‌ హిట్‌ అయింది.  మే 21వ తేదీ నుంచి జియో సినిమాలో ఈ చిత్రాన్ని  ఫ్రీగా చూడొచ్చు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement