పోలీసులమని బెదిరించి నగదు చోరీ | - | Sakshi
Sakshi News home page

పోలీసులమని బెదిరించి నగదు చోరీ

Published Sat, May 18 2024 7:35 AM | Last Updated on Sat, May 18 2024 7:35 AM

-

కోదాడరూరల్‌ : తాము పోలీసులమని బెదిరించి ఓ వ్యక్తి వద్ద నగదు చోరీ చేసిన ఇద్దరి యువకులను కోదాడ రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఇస్మాయిల్‌ ఈ నెల 16న రాత్రి ఏడు గంటల సమయంలో కోదాడ నుంచి స్వగ్రామం వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలోని దోరకుంట శివారు వద్ద నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి చెందిన వినయ్‌, కోదాడ పట్టణ పరిధిలోని సాలార్జంగ్‌పేటకు చెందిన మతిన్‌లు ఇస్మాయిల్‌ బైక్‌ను అడ్డగించారు. తాము పోలీసులమంటూ బెదిరించి అతని వద్ద రూ.4500 నగదును అపహరించారు. మరుసటి రోజు మళ్లీ ఫోన్‌ చేసి ఇంకా డబ్బు కావాలని బెదిరింపులకు పాల్ప డ్డారు. దీంతో ఇద్దరిపై అనుమానం వచ్చిన ఇస్మాయిల్‌ కోదాడ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు ఎస్‌ఐ అనిల్‌రెడ్డి విచారణ చేసి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా.. నిందితులిద్దరూ గతంలో గంజాయి కేసులో జైలుకు కూడా వెళ్లారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement