హల్దీవాగులో దూకి వృద్ధుడు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

హల్దీవాగులో దూకి వృద్ధుడు ఆత్మహత్య

Published Tue, May 14 2024 3:20 PM

హల్దీవాగులో దూకి వృద్ధుడు ఆత్మహత్య

తూప్రాన్‌: హల్దీవాగులో దూకి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివానందం కథనం మేరకు.. మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ గ్రామానికి చెందిన చీర్ల ఆగమయ్య(65) భార్య కొంతకాలం కిందట అనారోగ్యంతో చనిపోయింది. పెళ్లీడు వచ్చిన కూతురు వివాహం చేయలేని స్థితిలో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందేవాడు. ఆదివారం ఇంట్లోంచి బయలుదేరిన ఆగమయ్య తూప్రాన్‌ పట్టణ సమీపలలోని నాగులపల్లి చౌరస్తా సమీపంలోని హల్దీవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం హల్దీవాగులో మృతదేహం గుర్తించి దర్యాప్తు చేపట్టగా కాళ్లకల్‌ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని ఎస్‌ఐ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement