కిర్గిస్థాన్‌లో వైద్య విద్యార్థులు క్షేమం
సరుబుజ్జిలి: మండలంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థినులు వైద్య విద్య కోసం కిర్గిస్థాన్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడ అల్లర్లు జరగడంతో కొన్ని రోజులుగా వారి తల్లిదండ్రులు గందరగోళానికి గురయ్యారు. అయితే వైద్యవిద్యార్థులంతా క్షేమంగా ఉన్నట్లు అక్క డి నుంచి సమాచారం రావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జలీలాబాద్ యూనివర్సిటీలో చదువుతున్న తన కుమార్తె మాధురి క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందించిందని తండ్రి కూన జగన్నాథం తెలిపారు. మరో వర్సిటీలో చదువుతున్న డోల శ్వేత కూడా ఇంటికి క్షేమ సమాచారం అందించిందని తండ్రి డోల రామకృష్ణ తెలిపారు. భారత ప్రభుత్వం స్పందించి తమ పిల్లలను స్వదేశాలకు రప్పించే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
తజికిస్తాన్‌లో చిక్కుకొన్న వైద్య విద్యార్థి
రణస్థలం: మండల కేంద్రంలో నివాసం ఉంటున్న శ్రీదేవి మహంతి కుమార్తె అనన్య తజికిస్తాన్‌లో మెడిసిన్ చదువుకునేందుకు రెండేళ్ల క్రితం వెళ్లారు. అక్కడ వైద్య విద్యార్థులపై దాడులు జరుగుతున్నా యి. దీంతో కుమార్తె క్షేమ సమాచారంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనన్య అక్కడ మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతోంది. భారత ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment