Saakshi
బుధవారం :
19/06/2013
పాత సంచికలు | ఈ-పేపర్ | క్లాసిఫైడ్స్ |
 
Digital Marketing:
To Advertise in the site
Contact No:+91 9603462716
digitalmarketing@sakshi.com
Internet Tariff Card
Print Rate Card
sakshipost
sakshitv
 
 
హోం > ఫీచర్స్ స్టోరీ
Feature Stories
సారా కల్లోలం!
పచ్చని సంసారాల్లో నాటు సారా చిచ్చు పెడుతోంది. ఈ రక్కసి బారిన పడిన కుటుంబాలు అల్లకల్లోమవుతున్నాయి.
Written by Srinu On 28/1/2013 00:00:00 AM
పచ్చని సంసారాల్లో నాటు సారా చిచ్చు పెడుతోంది. ఈ రక్కసి బారిన పడిన కుటుంబాలు అల్లకల్లోమవుతున్నాయి. సారా నిష మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. సారా మత్తుకు బానిసలయి జీవితాన్ని నరకం చేసుకుంటున్నవారెందరో. సారాకు దాసోహమయి కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన పిల్లలను కాల్చుకుతింటున్న మందుబాబులకు కొదవలేదు. కల్లు, సారా, బ్రాందీ, విస్కీ, రమ్ము, బీరు పేరేదైనా ఫలితం మత్తే. జీవితం చిత్తే.

తాగుడుకు అలవాటుపడి ఎంతో మంది తమ జీవితాలను కష్టాలపాల్జేసుకుంటున్నారు. సంపాదనంత తాగుడుకు తగలేసి కుటుంబ సభ్యులను పీక్కుతింటున్నవారు కోకొల్లలు. పీకలదాకా తాగి తగాదాలకు దిగడం, కుటుంబ సభ్యులను చావగొట్టడం సహజంగా జరుగుతుంటుంది. కుటుంబ భారాన్ని మోయాల్సినవాడే మద్యానికి బానిసయితే ఆ సంసారంలో అశాంతికి అంతుండదు. కలహాలు, కలతలు, కన్నీళ్లు నిత్యకృత్యంగా మారాతాయి. ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి.

మహబూబ్‌నగర్ జిల్లా ఖిల్లాఘనపురంలో సారా మహమ్మారి తాజాగా తల్లీకొడుకుల ప్రాణాలు బలితీసుకుంది. తాగుబోతు తండ్రి పెట్టే చిత్రహింసలు భరించలేక త ల్లితో కలిసి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘనపురం గ్రామానికి చెందిన గొండ్ల నారాయణ సారా తాగుడుకు బానిసై ప్రతిరోజూ పీకలదాకా తాగి భార్యాకొడుకును తరుచూ కొట్టడం, తిట్టడం వంటివి చేసేవాడు. శనివారం రాత్రి-జనవరి 26న- మరోమారు సారాతాగి భార్య శాంతమ్మను కొట్టాడు. అడ్డొచ్చిన కొడుకు హరికష్ణను తీవ్రంగా చితకబాది, తెల్లవార్లు చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో తీవ్రమనస్తాపం చెందిన తల్లీకొడుకులు గ్రామం వెలుపల ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

‘సారాయి తాగి మా నాయిన మా అమ్మను, నన్ను రోజూ కొడుతుండు. నెలరోజులుగా తెల్లార్లు కొడుతుండు. వారి గొడవతో నాకు నిద్రపట్టడం లేదు. ఈ బాధను తట్టుకోలేక నేను మా అమ్మ చచ్చిపోతున్నం. దయచేసి ఇకనుంచి ఊరిలో ఎవ్వరినీ సారాయి అమ్మనీయొద్దు.’ అని ఆత్మహత్యకు ముందు హరికృష్ణ తన ఆవేదనను గోడపై బొగ్గుతో రాశాడు. సారా మహమ్మారి అకృత్యాలకు ఇది ఒక నిదర్శనం మాత్రమే. ఇలాంటి సంఘటనలు రోజూ రాష్ట్రంలో ఏదో మూల జరుగుతూనే ఉన్నా పాలకులకు పట్టడం లేదు. సారా అమ్మకాలను నియంత్రించి, ప్రజలను మత్తుకు బానిస కాకుండా చూడాల్సిన ఏలికలు కళ్లు మూసుకోవడంతోనే ఈ దౌర్భగ్యస్థితి దాపురించింది. సంసారాల్లో చిచ్చు పెడుతూ కల్లోలాలకు కారణమవుతున్న సారా అమ్మకాలను నియంత్రించాలని మహిళా లోకం కోరుతోంది.
  

More Headlines

Listings 'సరోగసీ' వివాదంలో షారుఖ్! Listings భారంగా బంగారం
Listings కేబినేట్ లో దేశముదుర్లు! Listings రూటు మార్చిన రాయపాటి!
Listings తెలిసినవారితోనే ముప్పు! Listings కావూరికి చోటు... పొంగులేటిపై వేటు!
Listings ప్రధానిని మారుస్తారా? Listings ప్రేమ పెళ్లి పెద్దగా గాంధీజీ!
Listings గొప్ప నటుడు మణివణ్ణన్ Listings 'జపమాల'పై అభ్యంతరం
Listings కేసీఆర్ 'వార్' వన్‌సైడేనా! Listings టిఆర్ఎస్కు ఊపిరిలూదిన పోలీస్
Listings రాజ్ కుంద్రాను 'ఫిక్స్' చేశారా! Listings జగన్ కేసు స్పీడ్.. జిందాల్ కేసు లేట్!
Listings డాట్... డాష్...పుల్స్టాప్! Listings చలో అసెంబ్లీ... నిర్బంధం...ఉద్రిక్తత!
Listings జస్టిస్ ఫర్ జియాఖాన్ Listings ఐపిఎల్ అంత ఈజీఏం కాదు
Listings ఆన్‌లైన్‌లో ఆవులు, బర్రెలు! Listings శ్రీశాంత్‌కు ‘తీహార్’ గుణపాఠం!
1 2 3 4 5 6 7 8 9 10 ...
Back to Listing Page
 
Download e-paper
Sakshi Toolbar
 
 
Home | News | Business | Sports | Cinema | Gallery
About Us