Saakshi
బుధవారం :
19/06/2013
పాత సంచికలు | ఈ-పేపర్ | క్లాసిఫైడ్స్ |
 
Digital Marketing:
To Advertise in the site
Contact No:+91 9603462716
digitalmarketing@sakshi.com
Internet Tariff Card
Print Rate Card
sakshipost
sakshitv
 
 
హోం > ఫీచర్స్ స్టోరీ
Feature Stories
బ్రెజిల్‌లో ఘోరకలి!
లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్‌లో ఎగసిపడిన అగ్నికీలలు అంతులేని విషాదాన్ని రేపాయి.
Written by Srinu On 28/1/2013 03:13:00 AM
లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్‌లో ఎగసిపడిన అగ్నికీలలు అంతులేని విషాదాన్ని రేపాయి. పడగెత్తిన నిప్పు ఆనందోత్సాహాల్లో తేలియాడుతున్న వందలాది మంది విద్యార్థుల ప్రాణాలు తోడేసింది. నిప్పుకు తోడయిన నిర్దయ పొగ సంతోషాలతో ఆడిపాడుతున్న యువతీయువకుల ఆయువును అనంతవాయువుల్లో కలిపేసింది. మనసు లేని మంటలు సృష్టించిన విలయంతో బ్రెజిల్‌లోని యూనివర్సిటీ పట్టణం శాంటా మారియా శవాల కుప్పగా మారింది. శోకసంద్రమై తల్లడిల్లింది.

దక్షిణ బ్రెజిల్ శాంటా మారియా నగరంలో జనంతో కిక్కిరిసిన ‘కిస్ క్లబ్’లో ఆదివారం(జనవరి27న) వేకువ జామున రెండు గంటల సమయంలో ఆకస్మికంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో 232 మంది మృత్యువాత పడ్డారు. 131 మంది గాయపడ్డారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. మృతులంతా విద్యార్థులే కావడం గుండెను పిండేసే విషాదం.

‘కిస్ క్లబ్’లో యూనివర్సిటీ విద్యార్థుల పార్టీ జరుగుతుండగా ఉన్నట్టుండి మంటలు ఎగసిపడ్డాయి. క్లబ్ అంతా అగ్నికీలలు, దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఏం జరుగుతోందో అర్థంకాక అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తలో దిక్కుకు పరిగెత్తారు. బయటకు వెళ్లేందుకు ఒకే ఒక ద్వారం ఉండడంతో ఒకరినొకరు తోసుకుంటూ బయటకు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. చాలా మంది పొగతో ఊపిరాడక, కొందరు తొక్కిసలాటలో మరణించారు. అగ్ని ప్రమాదానికిగల కారణాలు తెలియలేదని పోలీసులు చెప్పారు. అయితే, పార్టీలో పైరోటెక్నిక్స్(జ్వాలా విన్యాసాలు)తో కూడిన రాక్ బ్యాండ్ సంగీత కార్యక్రమం జరుగుతున్నప్పుడు అగ్ని ప్రమాదం సంభవించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

‘కిస్ క్లబ్’ ఘోరకలితో బ్రెజిల్ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. ‘ఇది విచారకరమైన ఆదివారం’ అంటూ ట్విట్టర్‌లో సంతాప సందేశాలు ఉంచారు. ప్రమాదం నేపథ్యంలో దేశాధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ చిలీ పర్యటనను కుదించుకుని హుటాహుటిన స్వదేశానికి తిరిగి వచ్చారు. పర్యటనల కంటే బ్రెజిల్ప్రజలే తనకు ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. ప్రమాద బాధితులకు అన్నిరకాలుగా సహాయమందించాలని ఆదేశించారు.


నైట్‌క్లబ్‌లలో గత విషాదాలివీ
2009: రష్యాలోని లేమ్ హార్స్ నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం. బాణసంచా కారణంగా మంటలు. 152 మంది దుర్మరణం.
2009: బ్యాంకాక్‌లోని శాంటికా నైట్‌క్లబ్‌లో బాణ సంచా పేలుళ్లతో ఎగసిపడ్డ అగ్ని కీలలు. 67 మంది మృతి.
2004: అర్జెంటినాలోని బ్యూనోస్ ఎయిర్స్‌లోని నైట్‌క్లబ్‌లో అగ్ని ప్రమాదం. 194 మంది దుర్మరణం.
2003: రోడ్ ఐలాండ్ నైట్‌క్లబ్‌లో వేదికపై జ్వాలా విన్యాసాల కారణంగా అగ్నిప్రమాదం. 100 మంది మృతి.
2002: వెనిజువెలాలోని కారకస్‌లో ఉన్న లా గోజిరా డిస్కోథెక్‌లో అగ్ని ప్రమాదం. మృతులు 50 మంది.
2000: చైనాలోని లూయాంగ్ క్లబ్‌లో వెల్డింగ్ చేస్తుండగా అగ్ని ప్రమాదం. 309 మంది దుర్మరణం.
  

More Headlines

Listings 'సరోగసీ' వివాదంలో షారుఖ్! Listings భారంగా బంగారం
Listings కేబినేట్ లో దేశముదుర్లు! Listings రూటు మార్చిన రాయపాటి!
Listings తెలిసినవారితోనే ముప్పు! Listings కావూరికి చోటు... పొంగులేటిపై వేటు!
Listings ప్రధానిని మారుస్తారా? Listings ప్రేమ పెళ్లి పెద్దగా గాంధీజీ!
Listings గొప్ప నటుడు మణివణ్ణన్ Listings 'జపమాల'పై అభ్యంతరం
Listings కేసీఆర్ 'వార్' వన్‌సైడేనా! Listings టిఆర్ఎస్కు ఊపిరిలూదిన పోలీస్
Listings రాజ్ కుంద్రాను 'ఫిక్స్' చేశారా! Listings జగన్ కేసు స్పీడ్.. జిందాల్ కేసు లేట్!
Listings డాట్... డాష్...పుల్స్టాప్! Listings చలో అసెంబ్లీ... నిర్బంధం...ఉద్రిక్తత!
Listings జస్టిస్ ఫర్ జియాఖాన్ Listings ఐపిఎల్ అంత ఈజీఏం కాదు
Listings ఆన్‌లైన్‌లో ఆవులు, బర్రెలు! Listings శ్రీశాంత్‌కు ‘తీహార్’ గుణపాఠం!
1 2 3 4 5 6 7 8 9 10 ...
Back to Listing Page
 
Download e-paper
Sakshi Toolbar
 
 
Home | News | Business | Sports | Cinema | Gallery
About Us