Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Ys Jagan Condemn Illegal Arrest Of Ysrcp Mp Midhun Reddy1
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుని ఖండించిన వైఎస్ జగన్

సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఖండించారు. ఎంపీ మిథున్‌ రెడ్డి అరెస్ట్‌ అక్రమమన్నారు వైఎస్‌ జగన్‌. ఈ మేరకు ఆదివారం ( జులై20) వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ‘ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుని ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా అక్రమ కేసు. ప్రజల తరపున పోరాడే వారి గొంతు మూయించే కార్యక్రమం తప్ప మరొకటి కాదు . వరుసగా మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డిని బలవంతపు వాంగ్మూలం ద్వారా తప్పుడు కేసులో ఇరికించారు. టీడీపీ ప్రభుత్వపు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే మిథున్‌ని అరెస్టు చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య.I strongly condemn the illegal arrest of YSRCP Lok Sabha MP Sri P.V. Midhun Reddy. This is nothing but a political conspiracy designed to silence those who stand with the people. Midhun Reddy, who has been elected as a Member of Parliament for three consecutive terms, has been…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 20, 2025 లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టుగా చూపించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు అంతా ప్రలోభాలు, బెదిరింపులు, థర్డ్ డిగ్రీ ద్వారా తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని నడిపిస్తున్నదే. చంద్రబాబు తన హయాంలో చేసిన మద్యం కుంభకోణంలో బెయిల్ మీద ఉన్నారు. చంద్రబాబు తన 2014-19 కాలంలో మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారు. దానికి సంబంధించి ఆధారాలతో సహా కేసు నమోదైంది. ఆ కేసును కొట్టేయించేందుకు, ఇప్పటి పాలసీని సమర్ధించుకునేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.ఒకవైపు చంద్రబాబు తప్పు చేస్తూనే మరోవైపు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూపొందించిన పాలసీని తప్పుబడుతున్నారు. ప్రస్తుతం తన గత హయాంలోని అవినీతి పద్ధతులను పునః ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్టుషాపులు,పర్మిట్ రూమ్‌లు వెలిశాయి.మా హయాంలో వేలాది బెల్టుషాపులు, పర్మిట్ రూమ్‌లను మూసివేయించాం. మద్యం దుకాణాలను కూడా గణనీయంగా తగ్గించాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన ఆ చర్యలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. మద్యం మాఫియా రంగంలోకి దిగిందివైన్ షాపులకు లైసెన్స్ మంజూరు విషయంలో మాఫియాదే పైచేయి అయింది. మా హయాంలో పారదర్శకంగా జరిగిన ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేశారు. రాష్ట్రంలో ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని రాజకీయ కక్షసాధింపులకు దిగుతున్నారు.చంద్రబాబు మద్యం స్కాంతో సహా అనేక తీవ్రమైన అవినీతి కేసుల్లో ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తన మీద ఉన్న కేసుల దర్యాప్తును నిలిపివేశారు. ఆ విషయాల నుండి దృష్టి మళ్ళించడానికి మా పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు.వైఎస్సార్‌సీపీని ఎవరూ ఏమీ చేయలేరు చంద్రబాబు అసలు ఎజెండా ఏంటో ప్రజలందరికీ తెలిసిపోయింది.అక్రమ కేసులు, విచారణల పేరుతో వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్టు చేసి, జైలుపాలు చేయటానికే సిట్‌ని ఏర్పాటు చేశారు.కానీ వాస్తవాలేంటో కోర్టు విచారణలోనే తేలుతుంది. మద్యం కేసు రాజకీయ ప్రేరేపిత కేసు చట్టం ముందు ఇది ఎంతమాత్రం నిలబడదు. ప్రజలకు దగ్గరగా ఉన్న వైఎస్సార్‌సీపీని ఎవరూ ఏమీ చేయలేరు.ప్రజా గొంతుకగా వైఎస్సార్‌సీపీప్రజల గుండెల్లో వైఎస్సార్‌సీపీ బలంగా పాతుకుపోయింది. ప్రతిపక్షంగా వున్న పార్టీని‌ అణచివేసేందుకు జరుగుతున్న కుట్రలు నిలబడవు. వైఎస్సార్‌సీపీని అణచివేయాలనుకున్న ప్రతిసారీ మేము ధైర్యంగా నిలబడ్డాం. ప్రజలతో కలిసి ఉంటాం, వారి గొంతుకగా నిలబడతాం. ఈ అన్యాయాన్ని ఎదుర్కుంటూ వైఎస్సార్‌సీపీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది’ అని స్పష్టం చేశారు.

100 MPs have signed to Impeachment against Justice Varma in Parliament, says Kiren Rijiju2
జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపునకు ముహూర్తం ఖరారు?

సాక్షి,న్యూఢిల్లీ: కాలిన నోట్ల కట్టల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు పదవి నుంచి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైంది.రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందే జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను అభిశంసన ద్వారా తొలగించే ప్రక్రియపై 100 మంది పార్లమెంట్‌ సభ్యులు సంతకాలు పెట్టినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా ప్రకటించారు.ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. విచారణకు సుప్రీంఈ ఏడాది మార్చి నెలలో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసంలో భారీ ఎత్తున కాలిన నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. దీంతో జస్టిస్‌ వర్మపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీతో విచారణ చేపట్టింది. ఈ విచారణలో కాలిన నోట్ల కట్టలు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మవేనన్న సాక్షులు,ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.అభిశంసన చర్యలువీటిని పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం నియమించిన త్రిసభ్య కమిటీ సైతం జస్టిస్‌ వర్మను అభిశంసన ద్వారా తొలగించాలని సిఫారసు చేసింది. త్రిసభ్య కమిటీ నిర్ణయాన్ని తప్పుబట్టిన జస్టిస్‌వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కమిటీ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయ స్థానంలో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే తనపై అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా చేసిన సిఫార్సులను సైతం సవాలు చేశారు.త్రిసభ్య కమిటీ రిపోర్టుపై సవాలునోట్ల కట్టల వ్యవహారంలో తన వాదన పూర్తిగా వినకుండానే నివేదిక రూపొందించారని అంతర్గత ఎంక్వైరీ కమిటీ తీరును ఆయన తప్పుపట్టారు. ఈ దర్యాప్తులో లోపాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు కమిటీకి లభించలేదన్నారు.ఏకమైన అధికార,ప్రతి పక్షాలు తనను దోషిగా తేల్చాలన్న ముందస్తు వ్యూహంతోనే నివేదిక సిద్ధంగా చేశారని విమర్శించారు. తనపై దర్యాప్తు ప్రక్రియ మొత్తం రాజ్యాంగవిరుద్ధంగా సాగిందని, తన ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. నివేదికపై తాను అధికారికంగా స్పందించకముందే దాన్ని మీడియాకు లీక్‌ చేశానని, తన ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్ర జరిగిందని జస్టిస్‌ వర్మ మండిపడ్డారు. అందుకే ఈ నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అయినప్పటికీ జస్టిస్‌ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అధికార,ప్రతి పక్షాలు ఏకమయ్యాయి. అభిశంసన తీర్మానం ద్వారాభారత రాజ్యాంగం ప్రకారం.. అవినీతి ఆరోపణల ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా మాత్రమే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుండి తొలగించవచ్చు.అటువంటి ఘటనల్లో అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు లేదంటే లోక్‌సభలో కనీసం 100 మంది సభ్యుల మద్దతు ఉంటేనే ఆమోదిస్తారు. ఈ తీర్మానాన్ని ఆమోదించడానికి సభలోని మూడింట రెండు వంతుల ఎంపీల మద్దతు అవసరం.మంత్రి కిరణ్ రిజిజు ఏమన్నారంటే?ఇప్పుడు ఇదే పద్దతిలో జస్టిస్‌ వర్మ తొలగింపునకు అధికార,ప్రతిపక్ష లోక్‌ సభ,రాజ్య సభ సభ్యులు సంతకాలు పెట్టారు. న్యాయవ్యవస్థలో అవినీతి అనేది చాలా సున్నితమైన విషయం. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉన్నాయి. వర్షాకాల సమావేశంలో జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రభుత్వం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నాం’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అభిశంసన తీర్మానంలో అనూహ్య పరిణామంఈ అభిశంసన తీర్మానంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం విభేదిస్తుంటాయి. కానీ న్యాయవ్యవస్థలో అవినీతి వంటి సున్నితమైన అంశంపై పార్టీలకు అతీతంగా స్పందించడం, ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలుస్తూ.. 100 మంది ఎంపీలు అభిశంసన తీర్మానంపై సంతకాలు చేయడం, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా 35 మంది కాంగ్రెస్ ఎంపీలు సైతం సంతాలు చేసినట్లు సమాచారం.

Karnataka CM Siddaramaiah Irked On Party Event Dais3
నేను డీకే పేరు చెప్పాలా?, మీరు నాకు సూచిస్తారా?: సీఎం సిద్ధరామయ్య అసహనం

కర్ణాటక సీఎం మార్పు అంశంపై గత కొన్ని రోజులుగా జోరుగా చర్చ నడుస్తోంది. సీఎం సిద్ధరామయ్యను మార్చే అవకాశం ఉందని, ఆ స్థానంలో డీకే శివకుమార్‌కు అవకాశం కల్పించడానికి రంగం సిద్ధమైందంటూ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై సిద్ధరామయ్య కానీ, డీకే శివ కుమార్‌ కానీ ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు.అయితే నిన్న (శనివారం, జూలై 19వ తేదీన) మైసూర్‌ జిల్లాలో జరిగిన పార్టీ ఈవెంట్‌లో ప్రభుత్వంలో నెలకొన్న అసంతృప్తిని సీఎం సిద్ధరామయ్య బహిరంగంగానే వెళ్లగక్కారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ పేరును పేర్కొనాలనే సూచనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను కీర్తించే క్రమంలో కొత్త ప్రాజెక్టులను ప్రకటించడంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘సాధన సమావేశం’లో సీఎం సిద్ధరామయ్య ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కూడా హాజరయ్యారు,. అయితే అత్యవసరంగా ఆయన బెంగళూరు బయల్దేరాల్సి ఉండటంతో వేదిక పైనుంచి ఉన్నపళంగా వెళ్లిపోయారు. అయితే సిద్ధరామయ్య ప్రసంగానికి సిద్ధమైన క్రమంలో పార్టీ ముఖ్యులను పరిచయం చేసే క్రమంలో డీకే పేరు ప్రస్తావించలేదు. అయితే డీకే, డీకే, డీకే అంటూ సభకు వచ్చిన జనం నుంచి స్పందన వచ్చింది. దీనిపై సిద్ధరామయ్యలో కోపం కట్టలు తెంచుకుంది. అదే సమయంలో డీకే పేరును మరిచిపోయారనే ఉద్దేశంతో కాంగ్రెస్‌కు చెందిన ఒక న్యాయవాది.. ఆ విషయాన్ని ఆయనకు తెలియజేసే ప్రయత్నం చేశారు. దీంతో సిద్ధరామయ్యకు కోపం మరింత ఎక్కువవైంది. ‘ డీకే శివకుమార్‌ ఇక్కడ లేరు.. అవునా.. కాదా.. దయచేసి మీరు వెళ్లి కూర్చోండి. మీరు ఏ తరహా న్యాయవాది’ అంటూ కాస్త స్వరం పెంచి మరీ సిద్ధరామయ్య అనడంతో ఇది పార్టీలోని, ప్రభుత్వంలో అంతర్గత లుకలుకల్ని బయటపెట్టింది.

YSRCP Leader Ambati Rambabu Takes On Chandrababu Naidu4
‘అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీని అణచి వేయలేరు’

గుంటూరు: అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీని అణచి వేయలేరని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అం‍బటి రాంబాబు మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్ కుట్రలకు కొందరు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, అలాంటి వారికి ప్రమోషన్లు ఇస్తున్నారని అంబటి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పిచ్చి చేష్టలను చూసి జనం విస్తుపోతున్నారని అంబటి ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం, జూలై 20) గుంటూరు నుంచి మాట్లాడిన అంబటి.. సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబును మించి క్రిమినల్‌ మైండ్‌సెట్‌ ఉన్న పొలిటీషియన్‌ రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఎవరూ లేరని మండిపడ్డారు. ‘తడిగుడ్డతో గొంతులు కోయగల వ్యక్తి చంద్రబాబు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాలని చూశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు. చంద్రబాబు అంతటి దివాళాకోరు రాజకీయ నాయకుడు మరెవరూ లేరు. మద్యం కేసులో ఎంతమందిని అరెస్టు చేసినా లెక్క చేయం. అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీని అణచి వేయలేరు. రాష్ట్ర అభివృద్ధి, తమకు సంక్షేమ పథకాలను అందిస్తారని ప్రజలు కూటమిని గెలిపించారు. కానీ రాజకీయ కక్షసాధింపులు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను వేధించే పని చేస్తున్నారు. చివరికి జగన్ పర్యటనలకు వెళ్తే ఆయనపై కూడా కేసులు పెడుతున్నారు. మద్యం కేసు పేరుతో ఇష్టానుసారం కేసులు పెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీని తెచ్చింది. ప్రయివేటు వ్యక్తులకు ప్రమేయం లేకుండా చేశాం. దీని వలన ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఈ పాలసీలో తప్పులేదని కేంద్ర సంస్థ సీసీఐ కూడా చెప్పింది. కానీ ఆ సీసీఐని తీర్పును కూడా కాదని అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబు హయాంలోనే మద్యం అక్రమాలు జరిగాయి. ఆ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. స్కిల్ కేసులో అరెస్టయి జైల్లో కూడా ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై చంద్రబాబుకు ఎప్పటినుంచో కక్ష ఉంది. అందుకే మిథున్‌రెడ్డి మీద కేసు పెట్టి అరెస్టు చేశారు. చంద్రబాబు, లోకేష్ చెప్పినట్టు చేయటమే‌ సిట్ అధికారుల పనిగా ఉంది. ఎవరిని కేసులో పెట్టమని చెబితే వారిని అరెస్టు చేస్తున్నారు. ఇలాంటి చర్యల వలన వైఎస్సార్‌సీపీని ఏమీ చేయలేరు. లేని స్కాంను ఉన్నట్లు చూపుతూ పుస్తకాలు, నవలలు రాస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ గంజాయి దొరుకుతోంది. వంద రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామన్న హోంమంత్రి ఏం చేస్తున్నారు?, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. అవేమీ పట్టించుకోకుండా రాజకీయ వేధింపుల పనిలో ప్రభుత్వం ఉంది. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు మేము భయపడం. అవసరమైతే కొన్నాళ్ళు జైల్లో ఉండానికైనా సిద్ధంఅసలు మద్యం కేసులో మిథున్‌రెడ్డికి ఏం సంబంధం?, ఎల్లోమీడియా రాసిందే పోలీసులు ఛార్జిషీట్, రిమాండ్ రిపోర్టుల్లో రాస్తున్నారు. చంద్రబాబు రాజకీయ పుట్టుకే స్కాంలో నుండి పుట్టాడు. డబ్బుతో ఏదైనా చేయగలని నిరూపించిన వ్యక్తి చంద్రబాబు. వ్యవస్థలను మేనేజ్ చేయటఙ, చీకట్లో కాళ్లు పట్టుకోవటంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే లేరు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాలని చూసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయ మలినాలను తొలగిస్తానంటూ కబుర్లు చెప్తున్నారు. చంద్రబాబు అనుమతి ఇచ్చిన డిస్టలరీ నుండే గత ప్రభుత్వం మద్యం కొనుగోలు చేసింది. అక్రమ కేసులతో మమ్మల్ని భయపెట్టలేరు. చంద్రబాబు పెట్టిస్తున్న ఏ ఒక్క కేసు కూడా నిలపడదు’ అని అంబటి స్పష్టం చేశారు.

Shubman Gill eyes 19-year-old Asian record in Manchester Test5
చ‌రిత్ర సృష్టించేందుకు 25 పరుగుల దూరంలో శుబ్‌మన్‌ గిల్‌..

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు కోసం శుబ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోనే భార‌త జ‌ట్టు మాంచెస్ట‌ర్‌లో అడుగుపెట్టింది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో టీమిండియా తీవ్రంగా శ్రమించనుంది. సిరీస్ సమమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది.అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆసియా బ్యాట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించేందుకు గిల్ సిద్దంగా ఉన్నాడు.ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం మహ్మద్ యూసుఫ్ పేరిట ఉంది. అతడు 2006 ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 90.14 సగటుతో 631 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 202గా ఉంటుంది.ఇప్పుడు మాంచెస్టర్‌లో శుబ్‌మన్ మరో 25 పరుగులు సాధిస్తే.. యూసుఫ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. ప్రస్తుత సిరీస్‌లో గిల్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి 101.16 సగటుతో 607 పరుగులు చేశాడు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన గిల్‌.. అనంతరం బర్మింగ్‌హామ్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా ద్విశతకంతో మెరిశాడు. అతడి అత్యధిక స్కోర్ 269గా ఉంది.ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్లుమహ్మద్ యూసుఫ్ (పాకిస్తాన్) - 2006లో 4 మ్యాచ్‌ల్లో 631 పరుగులుశుభ్‌మన్ గిల్ (భారత్‌) - 2025లో 3 మ్యాచ్‌ల నుండి 607 పరుగులురాహుల్ ద్రవిడ్ (భారత్‌) - 2002లో 4 మ్యాచ్‌ల నుండి 602 పరుగులువిరాట్ కోహ్లీ (భారత్‌) - 2018లో 5 మ్యాచ్‌ల నుండి 593 పరుగులుసునీల్ గవాస్కర్ (భారత్‌) - 1979లో 4 మ్యాచ్‌ల నుండి 542 పరుగులుసలీమ్ మాలిక్ (పాకిస్తాన్‌) - 1992లో 5 మ్యాచ్‌ల నుండి 488 పరుగులుగిల్‌కు కఠిన పరీక్ష..కాగా మాంచెస్టర్ టెస్టు రూపంలో గిల్‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఆండర్సన్‌-టెండూల్కర్ ట్రోఫీలో ప్రస్తుతం భారత్ 1-2తో వెనుకబడి ఉంది. తొలి టెస్టులో ఓడిన అనంతరం టీమిండియా రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత లార్డ్స్ టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైంది.దీంతో ఇప్పుడు నాలుగో టెస్టు భారత జట్టుకు చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవకపోతే సిరీస్ కోల్పోనుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో గిల్ తన కెప్టెన్సీతో జట్టును ఎలా నడిపిస్తాడో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.చదవండి: #Karun Nair: అనుకున్నదే జరిగింది.. కరుణ్ నాయర్ గుడ్‌బై

YSRCP MP Mithun Reddy Arrest News July 20th Updates Details6
ఎంపీ మిథున్‌రెడ్డికి రిమాండ్‌ విధింపు

మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌.. లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ విజయవాడ: ఎంపీ మిథున్‌రెడ్డికి రిమాండ్‌ విధింపుఆగస్టు 1వ తేదీ వరకూ రిమాండ్‌ విధించిన ఏసీబీ కోర్టుచంద్రబాబు సృష్టించిన కట్టు కథ, తప్పుడు కేసు: సజ్జల తప్పుడు కేసు సృష్టించి పరాకాష్టకు తీసుకెళ్తున్నారుచంద్రబాబు సృష్టించిన కట్టు కథ, తప్పుడు కేసుఈ కేసులో మా పార్టీ సీనియర్ లీడర్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారులిక్కర్ స్కామ్ అంటే చంద్రబాబు హయాంలో జరిగిందిఏడాదికి రూ. 1300 కోట్లు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశాడు40 వేలకు పైగా బెల్టు షాపులు పెట్టారు4,5 డిస్టీలరీలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారుతన హయాంలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్‌ మీద బయట ఉన్నాడు ఈసారి మరింత బరి తెగించి స్కామ్ చేస్తున్నారుమిథున్ రెడ్డి రిమాండ్ పై ముగిసిన వాదనలు మిథున్ రెడ్డి ECG హెల్త్ రిపోర్ట్స్ బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని తెలిపిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులువాటిని కోర్టుకు సమర్పించలేదని కోర్టుకు తెలిపిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు.ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులువై క్యాటగిరీ భద్రత కలిగిన వ్యక్తి కనుక సెంట్రల్ జైలుకి అనుమతివ్వాలని కోరిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులురాజమండ్రి లేదంటే నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించాలని కోరిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులురిమాండ్ పై మరికొద్ది సేపట్లో ఆర్డర్స్ ఇవ్వనున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తిజైల్లో కూడా వై క్యాటగిరీ భద్రత కల్పించాలని కోరిన మిథున్ రెడ్డి న్యాయవాదులుస్పెషల్ బ్యారక్ కోరిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులుభద్రత ,హెల్త్,ములాఖత్ లకు సంబంధించి రెండు పిటిషన్లు దాఖలు చేసిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులుకొనసాగుతున్న వాదనలులిక్కర్‌ కేసులో ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న వాదనలుమిథున్ రెడ్డి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డిప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించనున్న ఇ.కోటేశ్వరరావుకోర్టుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్,లేళ్ల అప్పిరెడ్డి,భరత్‌కోర్టు బయట పోలీసుల ఓవరాక్షన్‌.. న్యాయాధికారికి ఫిర్యాదు చేసిన న్యాయవాదులుబార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాషా కారును అడ్డుకున్నారని ఫిర్యాదులిక్కర్‌ కేసులో ఏం తేల్చారు?: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందిఈ క్రమంలోనే నా తనయుడు ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేసిందిఎంపీకి రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అవకాశమెక్కడిది?జగన్‌కు సన్నిహితంగా ఉంటున్నాడనే మిథున్‌రెడ్డిపై కేసుకూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిథున్‌రెడ్డిని వేధిస్తున్నారుగతంలోనూ మిథున్‌రెడ్డిని ఎంతో ఇబ్బంది పెట్టారుమిథున్‌రెడ్డిపై పెట్టింది తప్పుడు కేసేలిక్కర్‌ కేసులో ఇప్పటిదాకా ఏం తేల్చారుమా మీద ఉన్న కక్ష.. విద్వేషంతో.. జిల్లాలో మా కుటుంబానికి ఉన్న పట్టును చూసే చంద్రబాబు ప్రతీకార రాజకీయం ప్రదర్శిస్తున్నారుతప్పు చేయలేదు కాబట్టి మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడురాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజాతిరస్కారం తప్పదువిజయవాడ కోర్టుకి మిథున్‌రెడ్డి తరలింపువిజయవాడ కోర్టుకి ఎంపీ మిథున్‌రెడ్డి తరలింపుఏసీబీ జడ్జి ముందు హాజరుపర్చిన సిట్‌ అధికారులుకోర్టు వద్ద పోలీసుల ఓవరాక్షన్న్యాయవాదులను సైతం లోపలికి అనుమతించని పోలీసులుకోర్టుకి అన్ని వైపులా బారికేడ్లతో దారులను మూసేసిన పోలీసులుకోర్టు ప్రధాన ద్వారం కూడా మూసివేసిన పోలీసులుపోలీసులకు న్యాయవాదులకు మధ్య వాగ్వాదం కాసేపట్లో ఏసీబీ జడ్జి ముందుకు..విజయవాడ జీజీహెచ్‌లో ఎంపీ మిథున్‌రెడ్డికి ముగిసిన వైద్య పరీక్షలులిక్కర్‌ స్కాం కేసులో ఏ-4గా ఉన్న మిథున్‌రెడ్డికాసేపట్లో ఏసీబీ జడ్జి ముందు హాజరుపర్చనున్న సిట్‌అక్రమ కేసులకు జడిసేది లేదురాష్ట్రంలో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారుఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అక్రమంలిక్కర్ పాలసీలో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధం లేదులిక్కర్ పాలసీ ప్రభుత్వం నడిపింది.. అందులో ఎలాంటి అక్రమాలు జరగలేదువైఎస్సార్‌సీపీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడేది లేదు:::ఎమ్మెల్యే విరుపాక్షివిజయవాడ: కోర్టు దగ్గర పోలీస్ ఆంక్షలుకోర్టుకు వచ్చే అన్ని దారులు బారికేడ్లు పెట్టి మూసేసిన పోలీసులుఅడ్వకేట్‌లను కూడా కోర్టులోకి అనుమతించని పోలీసులుపోలీసులతో వాగ్వాదానికి దిగిన అడ్వకేట్‌లు.. అనంతరం వారిని లోపలకు అనుమతించిన పోలీసులుగేట్లు సైతం మూసేసిన పోలీసులుప్రభుత్వాసుపత్రికి మిథున్‌రెడ్డి తరలింపువిజయవాడ ప్రభుత్వాసుపత్రికి ఎంపీ మిథున్‌రెడ్డి తరలింపుకాసేపట్లో మిథున్‌రెడ్డికి వైద్య పరీక్షలుఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు.. వైఎస్సార్‌సీపీ శ్రేణుల అడ్డగింతవైద్య పరీక్షల అనంతరం ఏసీబీ జడ్జి ఎదుట మిథున్‌రెడ్డిని ప్రవేశపెట్టే అవకాశంలిక్కర్‌ స్కాం కేసులో శనివారం రాత్రి మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన సిట్‌విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద పోలీసుల ఓవరాక్షన్‌కాసేపట్లో వైద్య పరీక్షలు నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి మిథున్ రెడ్డిప్రభుత్వ హాస్పటల్ వద్ద భారీగా పోలీసు బందోబస్తుప్రభుత్వ హాస్పటల్ కు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులువైఎస్సార్‌సీపీ నేతల వాహనాలకు మాత్రమే అనుమతి నిరాకరణఏపీలో కొనసాగుతున్న రాజకీయ కక్షసాధింపులులేని లిక్కర్ స్కాం పేరుతో వైఎస్సార్‌సీపీ కీలక నాయకుల అరెస్టులుఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా 11 మంది అరెస్టుతాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేసిన సిట్ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసి 48 మంది పేర్లను ఛార్జిషీటులో పేర్కొన్న సిట్మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కీలక నేతల అరెస్టే లక్ష్యంగా పని చేస్తున్న సిట్ అధికారులునిజానికి చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలోనే ప్రభుత్వానికి ఎక్కువగా వచ్చిన ఎక్సైజ్ ఆదాయంఅయినప్పటికీ రూ.3 వేల కోట్లు పక్కదారి పట్టాయంటూ తప్పుడు కేసు నమోదురూ.50 వేల కోట్లు కొట్టేశారంటూ అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పిన చంద్రబాబురూ.35 వేల కోట్లు అంటూ బొంకిన పవన్ కళ్యాణ్నోటికొచ్చినట్లు మాట్లాడుతూ లేని స్కాంని ఉన్నట్టు భేతాళ కథలు అల్లుతున్న ప్రభుత్వ పెద్దలుటీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే స్క్రిప్టునే ఛార్జిషీటు, రిమాండ్ రిపోర్టుల్లో పేర్కొంటున్న సిట్ఎల్లోమీడియా తప్పుడు రాతలు, సిట్ తప్పుడు విచారణలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్కోర్టుల్లోనే న్యాయపోరాటం చేస్తామంటున్న వైఎస్సార్‌సీపీఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డికి సంఘీభావం తెలిపిన పార్టీ నేతలుమిథున్ రెడ్డికి అండగా వైఎస్సార్‌సీపీజీజీహెచ్‌కు తరలించే ముందు సిట్‌ కార్యాలయం వద్ద మిథున్‌రెడ్డివాట్‌ నెక్స్ట్‌మద్యం పాలసీ అక్రమ కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌విచారణ పేరిట విజయవాడకు పిలిచి మరీ అరెస్ట్‌ చేసిన సిట్‌సుదీర్ఘ విచారణ తర్వాత.. అరెస్ట్‌ చేసినట్లు శనివారం రాత్రి మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారంఇవాళ ఏసీబీ కోర్టు/జడ్జి ఎదుట మిథున్‌రెడ్డిని ప్రవేశపెట్టే అవకాశంమిథున్‌రెడ్డిని కస్టడీకి కోరనున్న సిట్‌!రిమాండ్‌ విధించే అవకాశం?అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు మద్యం అక్రమ కేసులో చంద్రబాబు సర్కార్‌ బరి తెగింపుఆధారాల్లేని లిక్కర్‌ స్కాంలో.. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌విచారణ పేరిట పిలిచి మరీ అరెస్ట్‌ చేసిన సిట్‌రాజకీయ కక్షతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధిస్తోన్న చంద్రబాబునేడు జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశంమిథున్‌రెడ్డిని రిమాండ్‌ కోరనున్న సిట్‌మద్యం మాఫియా మూలవిరాట్టు చంద్రబాబే 👉పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండిమద్యం స్కామ్‌.. ఓ కట్టుకథరెడ్ బుక్ రాజ్యాంగానికి రెడ్ కార్పెట్ వేసే పాలన సాగిస్తున్నారు.ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానుమద్యం స్కామ్ అనేది ఒక కట్టు కథవైయస్సార్సీపి నేతలను అరెస్టు చేయడం కోసమే మద్యం స్కామ్ ను తెరపైకి తెచ్చారు.వైయస్ జగన్ సన్నిహితులపై అక్రమ కేసులు పెడుతున్నారువైయస్‌ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి శునక ఆనందం పొందుతున్నారు..కూటమి నేతల తప్పుడు కేసులకు ఎవరూ భయపడరు.:::అరకు ఎంపీ తనుజారాణిఅబద్ధాలపుట్టగా ఛార్జ్‌షీట్‌లేని మద్యం కేసును సృష్టించి చంద్రబాబు కుట్రలుఅవాస్తవ వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కుతంత్రంలేని కుంభకోణం ఉన్నట్లుగా చూపే పన్నాగంఅబద్ధాల పుట్టగా చార్జ్‌షీట్‌ దాఖలుపెరిగిన నిందితులుమొత్తం 48కి పెరిగిన నిందితుల సంఖ్య 👉పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి మాఫియా డాన్ చంద్రబాబే‌2014-19 మధ్య యథేచ్ఛగా చంద్రబాబు దోపిడీఖజానాకు గండికొట్టి అస్మదీయులకు దోచిపెట్టిన బాబురూ.25 వేల కోట్లకు మించి అక్రమాలుసీఐడీ కేసులో ఇప్పటికీ బెయిల్‌పైనే చంద్రబాబుఅప్పటి దందానే నేడూ కొనసాగిస్తున్న వైనం!తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ కేసులు..అరెస్టులు👉పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండిమిథున్‌రెడ్డి అరెస్ట్‌ అక్రమం: వైఎస్సార్‌సీపీఇది స్కామ్‌ కాదు.. చంద్రబాబు ప్రతీకార డ్రామా: వైఎస్సార్‌సీపీలేని మద్యం కేసును సృష్టించి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్ మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఏమాత్రం సంబంధం లేని వారందరినీ కక్షపూరితంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేసిన తీరుని వైయస్ఆర్… pic.twitter.com/CiIR4DyA1U— YSR Congress Party (@YSRCParty) July 19, 2025ఏడాది పాలనలో @ncbn చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని లేదు. ఆయన పాలన గురించి ఎవరూ ప్రశ్నించకూడదనే లేని లిక్కర్ కేసును సృష్టించి ఇలా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారు. ఆయన పాపం పండే రోజు కూడా వస్తుంది. @MithunReddyYSRC గారి అక్రమ అరెస్టును…— Roja Selvamani (@RojaSelvamaniRK) July 19, 2025రాష్ట్రంలో జరుగుతున్నది సుపరిపాలన కాదు, అరాచకపాలన. అధికారం ఉంది కదా అని లేని లిక్కర్ కేసును సృష్టించి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడం మంచి పద్ధతి కాదు. మా ఎంపీ @MithunReddyYSRC గారి అక్రమ అరెస్టును ఖండిస్తున్నా. @ncbn గారూ అధికారం శాశ్వతం…— Rajini Vidadala (@VidadalaRajini) July 19, 2025మిథున్‌రెడ్డి అన్న అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది #westandwithMidhunReddy pic.twitter.com/Pwr0hKRVnQ— Nandigam Suresh Babu - YSRCP (@NandigamSuresh7) July 19, 2025#SadistChandraBabu@ncbn లో రాజకీయ కక్ష తారా స్థాయికి చేరింది. అందులో భాగంగానే అసలు లేని అవినీతిని ఉందన్నట్లుగా ప్రజలకు భ్రమ కల్పించడమే బాబు లక్ష్యం. అందులో భాగంగానే మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు.-మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే pic.twitter.com/2ENNFeGgqj— YSR Congress Party (@YSRCParty) July 19, 2025#SadistChandraBabuప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తూ కూటమి ప్రభుత్వం ఒక రాక్షస క్రీడను ప్రారంభించింది. అందులో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను.-పర్వతరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ pic.twitter.com/Lp44S1Jp67— YSR Congress Party (@YSRCParty) July 19, 2025లిక్కర్ స్కామ్ అంటారు… కానీ:ఆధారం లేదుడబ్బు సీజ్ కాలేదుమద్యం లభించలేదుచార్ట్ షీట్ లో పేరు లేదు ..కానీ అరెస్ట్ ఉంది ఎందుకంటే టార్గెట్ జగన్ అన్న @ysjagan ఈ కుట్రలో మిథున్ అన్నను @MithunReddyYSRC కూడా లాగారు.ఇది స్కామ్ కాదు… ఇది @ncbn చంద్రబాబు గారి ప్రతీకార డ్రామా.… pic.twitter.com/LJu64TEgqe— Dr.Anil Kumar Yadav (@AKYOnline) July 19, 2025#SadistChandraBabuవైఎస్సార్‌సీపీని ఎదుర్కొనే ధైర్యం లేక @ncbn… అక్రమ కేసుల రూపంలో కక్ష తీర్చుకుంటున్నాడు. ఇది రాజకీయ అరాచకమే.ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను.-అరకు ఎంపీ గుమ్మా తనూజ రాణి గారు pic.twitter.com/cG0dQB2SuY— YSR Congress Party (@YSRCParty) July 19, 2025మిథున్‌ రెడ్డి అరెస్ట్‌ రాజకీయ కక్ష సాధింపుపెద్దిరెడ్డి కుటుంబాన్ని, వైఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యంరాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లులేని లిక్కర్‌ స్కామ్‌ను సృష్టించి అరెస్ట్‌లు చేస్తున్నారు ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులుఇది… pic.twitter.com/3YO54cIp9I— Rachamallu Siva Prasad Reddy (@rachamallu_siva) July 19, 2025

How to check whether someone has taken a loan using your PAN card7
మీ పాన్‌కార్డుతో ఎవరైనా లోన్‌ తీసుకున్నారేమో..

కొందరికి అప్పు అంటే మహా చెడ్డ భయం. దాని జోలికి కూడా వెళ్లరు. మీరు తీసుకోరు సరే.. మరి ఎవరైనా మీ పేరుతో అదేనండి మీకు తెలియకుండా మీ పాన్‌ కార్డు వివరాలతో లోన్‌ తీసుకుని ఉంటే.. అమ్మో ఇది ఫ్రాడ్‌. అవును ఫ్రాడే మరి. డౌట్‌గా ఉందా? మీ పాన్‌ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారేమో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎలాగో ఈ కథనంలో చదివేయండి వెంటనే..రుణ మోసాలు, సున్నితమైన, ఆర్థికపరమైన డాక్యుమెంట్ల దుర్విగియోగం వంటివి ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మీ కార్డులేమైనా దుర్వినియోగానికి గురయ్యాయా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ పాన్ కార్డు మీ క్రెడిట్ రిపోర్ట్ తో లింక్ అయి ఉంటుంది. దానిని ఉపయోగించి తీసుకున్న ఏదైనా రుణం (మీ సమ్మతితో లేదా సమ్మతి లేకుండా) మీ క్రెడిట్ రేటింగ్, మీ రుణ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ పాన్ కార్డు దుర్వినియోగం అయ్యిందో లేదో తెలుసుకోండిలా..మీ క్రెడిట్ రిపోర్టును క్రమం తప్పకుండా చెక్ చేయండిమీ పాన్ కార్డును ఉపయోగించి ఏదైనా రుణం తీసుకున్నారో లేదో తెలుసుకోవడానికి సులభమైన మార్గం మీ క్రెడిట్ రిపోర్ట్ చూడటం. సిబిల్, ఎక్స్ పీరియన్, ఈక్విఫాక్స్, సీఆర్ఐఎఫ్ హై మార్క్ వంటి క్రెడిట్ బ్యూరోలు మీ పేరిట తీసుకున్న అన్ని రుణాలు, క్రెడిట్ కార్డుల రికార్డును నిర్వహిస్తాయి. ఆయా సైట్లకు వెళ్లి మీ పాన్, మొబైల్ నంబరు ఇచ్చి క్రెడిట్ రిపోర్ట్‌ తీసుకోవచ్చు. అది కూడా ఉచితంగా.మీ క్రెడిట్ రిపోర్టులో ఇవి గమనించండిమీరు క్రెడిట్ రిపోర్టును సమీక్షిస్తున్నప్పుడు, మీరు దరఖాస్తు చేయని రుణాలు లేదా క్రెడిట్ కార్డులు, తప్పు ఖాతా నంబర్లు, పరిచయం లేని రుణ సంస్థల పేర్లు లేదా మీరు ఆమోదించని కొత్త హార్డ్ ఎంక్వైరీలు ఏమైనా ఉన్నాయేమో చూడండి.మీ పాన్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారనడానికి ఇవి సంకేతాలు. మీరు ఇటువంటి అనేక ఎంట్రీలను చూసినట్లయితే, మీ క్రెడిట్ మరింత క్షీణించకుండా వెంటనే చర్యలు తీసుకోండి.👉 ఇది చదివారా? ఈపీఎఫ్‌వో రూల్స్‌లో మార్పులు.. ఆ కండీషన్లు ఇక ఉండవుఫేక్‌ లోన్‌ బయటపడితే ఏం చేయాలి?మీరు మోసపూరిత రుణాన్ని ఎదుర్కొన్నట్లయితే, దానిని రుణ సంస్థ దృష్టికి తీసుకురండి. అలాగే దానిని నివేదించిన క్రెడిట్ బ్యూరోతో చర్చించండి. చాలా వివాదాలను క్రెడిట్ బ్యూరోలు ఆన్‌లైన్లో దాఖలు చేయవచ్చు. ఐడీ ప్రూఫ్, లోన్‌కు సంబంధించిన వాస్తవాలు, సంతకం చేసిన అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదనంగా, మీ స్థానిక పోలీసు సైబర్ క్రైమ్ సెల్లో ఫిర్యాదు చేయండి. పాన్ దుర్వినియోగం అయినట్లు ఆధారాలను సమర్పించండి.భవిష్యత్తులో పాన్ దుర్వినియోగం కాకూడదంటే..అసురక్షిత సైట్లు, యాప్‌లు లేదా వాట్సాప్ ఫార్వార్డ్‌లలో మీ పాన్ కార్డు నంబర్‌ను ఎప్పుడూ పంచుకోవద్దు. బహిరంగంగా షేర్ చేయడం, అనవసరంగా ఎవరికైనా అప్పగించడం చేయొద్దు. మీ పాన్ కార్డు పోతే, రీప్రింట్ కోసం దరఖాస్తు చేయండి. ఆ సమయంలో కొన్ని నెలలు మీ క్రెడిట్ రిపోర్ట్‌ను సమీక్షించండి. ఫైనాన్షియల్ అకౌంట్ లకు బలమైన పాస్ వర్డ్ లను సెట్‌ చేసుకోండి. మీ పాన్ తో లింక్ చేసిన లోన్ లేదా క్రెడిట్ అప్లికేషన్ ల కోసం ఎస్‌ఎంఎస్‌/ఈమెయిల్ నోటిఫికేషన్ లను ఎనేబుల్ చేయండి.

Peddireddy Ramachandra Reddy Reacts On Mithunreddy Arrest8
జగన్‌కు సన్నిహితుడనే నా తనయుడ్ని అరెస్ట్‌ చేశారు

చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు తారా స్థాయికి చేరాయని, ఈ క్రమంలోనే తన తనయుడు మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్‌ చేయించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తమ కుటుంబం మీద ఉన్న కక్ష, విద్వేషంతోనే ఇలా కేసులు పెడుతూ వస్తున్నారని.. ఈ ఫలితం చంద్రబాబు రాబోయే రోజుల్లో తప్పక అనుభవిస్తారని అన్నారాయన. సాక్షి, తిరుపతి: చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు తారా స్థాయికి చేరాయని, ఈ క్రమంలోనే తన తనయుడు మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్‌ చేయించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తమ కుటుంబం మీద ఉన్న కక్ష, విద్వేషంతోనే ఇలా కేసులు పెడుతూ వస్తున్నారని ఓ వీడియో సందేశంలో ఆదివారం ఉదయం ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా పనిచేస్తోందో.. చంద్రబాబు, లోకేష్, పవన్ ఏవిధంగా రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోంది. మూడుసార్లు ఎంపీగా గెలిచిన నా తనయుడు మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేయించింది. గతంలోనూ మిథున్‌రెడ్డిని ఇబ్బంది పెట్టింది చూశాం. గతంలో ఎయిర్ పోర్ట్ మేనేజర్‌ను కొట్టాడని కేసు పెట్టారు. అది తప్పుడు కేసుగా తేలింది. మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిథున్‌రెడ్డిని మరీ వేధిస్తున్నారు. మదనపల్లె ఫైల్స్‌ అన్నారు. ఆ కేసులో ఏమీ లేదని తేలిపోయింది. ప్రభుత్వ భూములు, ఫారెస్ట్‌ భూములు ఆక్రమించారని వేధించారు. ఇప్పుడేమో ఏకంగా మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయించారు. ఈ కేసు కూడా తప్పుడు కేసుగానే తేలుతుంది. అసలు లిక్కర్‌ కేసులో ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం తేల్చింది?. ఒక ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అవకాశమెక్కడిది?. కేవలం జగన్‌కు సన్నిహితంగా ఉంటున్నాడనే మిథున్‌రెడ్డిపై కేసు పెట్టారు. మిథున్‌రెడ్డిపై పెట్టింది ముమ్మాటికీ తప్పుడు కేసే. మా మీద ఉన్న కక్ష.. విద్వేషంతో.. జిల్లాలో మా కుటుంబానికి ఉన్న పట్టును చూసే చంద్రబాబు ప్రతీకార రాజకీయం ప్రదర్శిస్తున్నారు. తప్పు చేయలేదు కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. ఈ పర్యవసానం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపడం మాత్రమే కాదు.. చంద్రబాబు రాజకీయంలో ఒక మచ్చగా మిగులుతుంది. రాబోయే రోజుల్లో అపవాదులు, అపకీర్తి, దుర్మార్గాలతో ప్రజలకు చంద్రబాబు ఎలా జవాబు చెబుతారో చూడాలి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.వైఎస్సార్సీపీని ఇప్పటికిప్పుడు గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్‌ జగన్‌ బంగారుపాళ్యం మార్కెట్ యార్డు పర్యటన సందర్భంగా ముగ్గురు ఎస్పీలతో అణచి వేయాలని చూశారు. వేలాది మంది రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోజు తరలి వచ్చారు. చంద్రబాబు ఇప్పటిదాకా ఇచ్చిన 143 హామీలు, ఆరు సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. మహిళల్ని, నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు ఈ విధంగా తప్పుడు కేసులు తో ప్రతి పక్షపార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, ప్రజలు దృష్టి మరల్చుతున్నారు. పార్టీకి పట్టుకొమ్మలు గా ఉన్న నాయకులను అరెస్ట్ చేయిస్తూ.. దుర్మాపు పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో నియంత పాలన చేస్తున్నారు, ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసి పోయారు చంద్రబాబు ఈ విషయం ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది’’ అని రామచంద్రారెడ్డి హితవు పలికారు.

Christopher Havens mathematician, a prisoner and director Prison Mathematics Project.9
లెక్కలతో జీవితాన్నే తిరగరాసుకున్న ఖైదీ..!

జైలు గోడల మధ్య మగ్గిపోతున్న కాలంలోనే ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, పోరాట నాయకులు అద్భుతమైన రచనలు చేసిన సంగతి చాలామందికి తెలుసు. అయితే, అమెరికాలో జైలు గోడల మధ్య శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ స్వయంకృషితో గణిత సాధన చేస్తూ, ప్రపంచ గణిత మేధావుల దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. దృఢసంకల్పం ఉండాలే గాని, అనుకున్నది సాధించడానికి జైలుగోడలు ఆటంకం కాదని నిరూపిస్తున్నాడు.ఆ ఖైదీ పేరు క్రిస్టఫర్‌ హేవెన్స్‌. హత్య కేసులో అతడికి 2010లో పాతికేళ్ల జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి జైలులో ఒంటరి గదిలో ఉంటూ లెక్కల లోకంలో లోతుగా మునిగిపోయాడు. జైలు గదిలో చిన్న పజిల్స్‌తో మొదలైన ప్రయాణం, పెద్ద గణిత సూత్రాల వరకు వెళ్లింది. అతడు ఉండే జైలు గదిలో కంప్యూటర్‌ లేదు, ఇంటర్నెట్‌ లేదు, చేతిలో పుస్తకం, మదిలో లక్ష్యాలు తప్ప. అలా లెక్కలు వేసి వేసి నోటుబుక్కులు, జైలు గోడలు నింపేశాడు. ఏకంగా ప్రపంచానికి కొత్త గణిత రహస్యాన్ని చూపించి, గణిత పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. క్రిస్టఫర్‌ ప్రయాణం అంతటితోనే ఆగలేదు. ‘నేను మాత్రమే కాదు, అందరూ గణితం నేర్చుకోవాల్సిందే!’అనే తపనతో, జైల్లో నుంచే ఖైదీల కోసం ‘ప్రిజన్‌ మ్యాథ్స్‌ ప్రాజెక్టు’ ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ కింద అమెరికాలోని దాదాపు ముప్పై రాష్ట్రాల్లో వందలాది ఖైదీలు గణితంలో మునిగి తేలుతున్నారు. వారిని చూస్తే, నిజంగా జైలులో ఉన్నారా, లేక ఏదైనా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. మరో కొత్త ప్రయత్నంఇంతలోనే ఇంకో కొత్త ప్రయత్నం. ‘కంప్యూటర్‌ లేని ఖైదీలు గణితంలో సంక్లిష్టమైన లెక్కలు ఎలా చేయాలి?’ అనే ప్రశ్న తలెత్తింది. అప్పుడే హేవెన్స్‌కి తట్టిన ఆలోచన. ‘ఈమెయిలు ద్వారా కోడింగ్‌’ ఈ పద్ధతిలో కోడ్‌ లేఖలా పంపిస్తారు, ఫలితాలు తిరిగి వస్తాయి. ఈ విధానంతో జైలులో ఉండే ఖైదీ ఇప్పుడు మేఘగణన చేస్తున్నాడు. ప్రస్తుతం క్రిస్టఫర్, జర్మనీకి చెందిన గణిత నిపుణుడితో కలిసి ‘జోప్‌’ అనే గణిత శ్రేణిపై పరిశోధన చేస్తున్నాడు. ఈ విషయమై హేవెన్స్‌ మాట్లాడుతూ, ‘న్యాయం అంటే శిక్ష కాదు, మార్పు. లెక్కలతో నా జీవితాన్ని తిరిగి రాసుకున్నా’ అని చెప్పాడు. (చదవండి: పెయిన్‌ కిల్లర్స్‌ వాడితే..ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేయకూడదా..?)

Harihara Veeramallu Tickets Price Hike In Andhra Pradesh10
సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు

సందర్భాన్ని బట్టి తన అవసరాన్ని బట్టి మాటలు మార్చడం ప్రజలను ఏ మార్చడంలో పవన్ కళ్యాణ్‌ను మించిన వాళ్లు లేరని మరో మారు రుజువైంది. పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో ఎన్నో మార్లు నాటి వైఎస్ జగన్‌పై చెలరేగిపోయారు. సమయం సందర్భం లేకుండా గంగవెర్రులెత్తిపోయారు ..ఏయ్ జగన్ అంటూ ఊగిపోయారు.అసలు ప్రైవేట్ వ్యక్తులు నిర్మించే సినిమాలకు సంబంధించి టికెట్లు ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది అంటూ నిలదీశారు... తన సినిమాలకు సంబంధించి అవసరమైతే ప్రజలకి ఫ్రీ షో చూపిస్తానని టికెట్ల ధరల కోసం ప్రభుత్వం దగ్గరకు వెళ్లేది లేదని డైలాగులు కొట్టారు.మొత్తానికి ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చాక హరిహర వీరమల్లు సినిమా రిలీజుకు వచ్చింది. దాదాపు ఐదేళ్లు క్రితం షూటింగ్ మొదలైన ఈ చిత్రం అపుడపుడూ షూటింగ్ చేసుకుంటూ మొత్తానికి ఆమధ్య నిర్మాణం పూర్తి చేసుకుంది. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా పవన్ ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు.. మొత్తానికి రిలీజ్ డేట్ వచ్చేసరికి పవన్‌లోని ఆర్థిక అవకాశవాది బయటకు వచ్చాడు.అవసరం అయితే తాను ఫ్రీగా సినిమా చూపిస్తాను అంటూ గతంలో కొట్టిన డైలాగులు కొండెక్కించిన పవన్ ఇప్పుడు వ్యాపారి రూపంలోకి వచ్చారు. నిర్మాత ఏఎం రత్నం నుంచి భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న పవన్ ఆయనకు లబ్ది చేకూర్చేందుకు టికెట్ల ధరలు పెంచేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. దీంతో ఈమేరకు టికెట్ ధరలు పెరిగాయి.ఇందులో భాగంగాజూలై 23న వేసే ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్స్ షోలకు ఒక్కో టికెట్ ధర రూ.600లుగా నిర్ణయించారు. ఆపై జీఎస్టీ అదనం. రాత్రి 9:00 గంటలకు ప్రీమియర్ ను ప్రదర్శించనున్నారు. మరోవైపు 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్,మల్టీఫ్లెక్స్‌ ధరలను కూడా పెంచారు. లోయర్ క్లాస్‌లో రూ.100, అప్పర్ క్లాస్‌లో రూ.150, మల్టీ ప్లెక్స్ లో రూ.200 వరకు టికెట్ ఛార్జీలను పెంచుకునే అవకాశం కల్పించారు. అవతలివాళ్లకు వచ్చేసరికి బోలెడు రూల్స్ మాట్లాడే పవన్ ఇప్పుడు తనవరకు వచ్చేసరికి ఆర్థికలాభం మాత్రమే చూసుకుంటున్నారు అని ప్రజలు భావిస్తున్నారు. ఆయన మాటలకు. చేతలకు మధ్య చాలా తేడా ఉంటుందని మరోమారు స్పష్టమైంది* సిమ్మాదిరప్పన్న

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement