Top Stories
ప్రధాన వార్తలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 'ట్రంప్ 2.0'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దుమ్ము రేపారు. హోరాహోరీ పోరు తదితర విశ్లేషణలన్నింటినీ తోసిరాజంటూ డెమొక్రాట్ల అభ్యర్ధి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై ఘనవిజయం సాధించారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి వెల్లడైన ఫలితాల్లో విజయానికి కావాల్సిన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల మార్కును ట్రంప్ అలవోకగా దాటేశారు. తద్వారా నాలుగేళ్ల విరామం తర్వాత రెండోసారి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు. గ్రోవర్ క్లీవ్‌లాండ్ తర్వాత అమెరికా చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక నేతగా నిలిచారు. ఆ క్రమంలో పలు ఇతర రికార్డులూ సొంతం చేసుకున్నారు. అత్యంత ఎక్కువ వయసులో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన వ్యక్తిగా కూడా 78 ఏళ్ల ట్రంప్ నిలిచారు. క్రిమినల్ అభియోగాల్లో దోషిగా తేలిన ఏకైక మాజీ అధ్యక్షునిగా ట్రంప్ ఇప్పటికే చెత్త రికార్డును మూటగట్టుకోవడం తెలిసిందే. తాజా విజయంతో అలాంటి చరిత్రతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన తొలి నేతగా కూడా నిలిచారు. పైగా పాపులర్ ఓటు కూడా గెలుచుకోవడంతో ట్రంప్ విజయానికి పరిపూర్ణత చేకూరినట్టయింది. 2016లో ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా నెగ్గినప్పుడు ఆయన కంటే ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 28 లక్షల ఓట్లు ఎక్కువగా రావడం తెలిసిందే. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ట్రంప్ ఇప్పటికే హారిస్ కంటే ఏకంగా 50 లక్షలకు పై చిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. 20 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన రిపబ్లికన్ అధ్యక్షునిగా నిలిచారు. అంతేగాక తనకు మాయని మచ్చగా మిగిలిన 2020 అధ్యక్ష ఎన్నికల ఓటమి తాలూకు చేదు గుర్తులను కూడా ఈ గెలుపుతో చెరిపేసుకున్నారు. బైడెన్ విజయాన్ని తిరస్కరిస్తూ తన మద్దతుదారులను క్యాపిటల్ హిల్‌పై దాడికి ఉసిగొల్పి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడంతో ట్రంప్ రాజకీయ భవితవ్యం ముగిసినట్టేనని అంతా భావించారు. అలాంటి స్థితి నుంచి పుంజుకుని నాలుగేళ్ల తర్వాత ఆయన సాధించిన ఘనవిజయం రిపబ్లికన్ పార్టీలో ఆనందోత్సాహాలు నింపగా 60 ఏళ్ల హారిస్ ఓటమితో డెమొక్రాట్లు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. విజయం ఖాయం కాగానే ట్రంప్ తన భార్య మెలానియాను ఆప్యాయంగా అక్కుని చేర్చుకుని ముద్దాడారు. ఫ్లోరిడాలోని తన వెస్ట్‌పామ్ బీచ్ నివాసం వెలుపల భారీగా గుమిగూడిన అభిమానులకు అభివాదం చేశారు. రన్నింగ్‌మేట్ జేడీ వాన్స్‌తో తన ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి అమెరికా ప్రజలనుద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. మరోసారి తనపై విశ్వాసముంచినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘అపూర్వమైన, అత్యంత శక్తిమంతమైన ఫలితమిది. అమెరికా చరిత్రలో స్వర్ణయుగానికి నా విజయం నాంది’’ అని ప్రకటించారు. ‘‘భగవంతుడు ఏదో పెద్ద కారణంతోనే నాకు ప్రాణదానం చేశాడని చాలామంది చెప్పింది నిజమేనని ఈ ఫలితాలు రుజువు చేశాయి’’ అని ప్రచార పర్వంలో తనపై జరిగిన హత్యా ప్రయత్నాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ఇది అమెరికా ప్రజల విజయం. అంతేగాక దేశ చరిత్రలోనే అతి గొప్పదైన, కనీవిని ఎరగని రాజకీయ ఉద్యమమిది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘నా చివరి శ్వాస దాకా ప్రతి రోజూ మీ కోసం, మీ కుటుంబాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పోరాడతా. మీ జీవితాల్లో వెలుగులు పంచుతా. ద్రవ్యోల్బణం, అక్రమ వలసలతో సహా అన్ని సమస్యలకూ సమర్థ పరిష్కారం చూపుతా’’ అని వాగ్దానం చేశారు. ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తయి ట్రంప్‌ను అధ్యక్షునిగా లాంఛనంగా ప్రకటించేందుకు మరో రెండు నెలలు పట్టనుంది. అనంతరం జనవరి 20న ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. రెండోసారి శ్వేతసౌధంలో అడుగు పెట్టనున్న ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశాధినేతల నుంచి అభినందనలు, శుభాకాంక్ష సందేశాలు వెల్లువెత్తాయి. ముందునుంచీ... అమెరికావ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఆ వెంటనే రాష్ట్రాలవారీగా ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదటినుంచీ ట్రంప్ ఆధిపత్యమే సాగుతూ వచ్చింది. చూస్తుండగానే ఏడు స్వింగ్ రాష్ట్రాల్లోనూ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. వాటిలో ఒకటైన విస్కాన్సిన్‌లో గెలుపుతో ఆయన 270 ఓట్ల మెజారిటీ మార్కును దాటగానే రిపబ్లికన్ నేతలు, అభిమానులు, మద్దతుదారులు దేశవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయారు. బుధవారం రాత్రి తుది ఫలితాలు వెల్లడయ్యే సమయానికి 538 ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ 294 సొంతం చేసుకున్నారు. మరోవైపు హారిస్ 223 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమయేలా కన్పిస్తున్నారు. ట్రంప్‌కు 7.1 కోట్ల పై చిలుకు ఓట్లు రాగా ఆమెకు 6.6 కోట్లే వచ్చాయి. 50 రాష్ట్రాలకు గాను అరిజోనా, నెవడా, మెయిన్ ఫలితమే తేలాల్సి ఉంది. అరిజోనాల్లో ట్రంప్ గెలుపు లాంఛనమే కాగా మెయిన్, నెవడాల్లోనూ ఆయన ఇప్పటికే 50 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆ మూడు రాష్ట్రాల్లోని 21 స్థానాలనూ గెలుచుకుని మరోసారి 300 మార్కు అలవోకగా దాటేలా కన్పిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆయనకు 304 ఓట్లు దక్కడం తెలిసిందే. తన ఓటమి ఖాయం కావడంతో హార్వర్డ్ వర్సిటీలో బుధవారం రాత్రి తలపెట్టిన ప్రసంగ కార్యక్రమాన్ని హారిస్ రద్దు చేసుకున్నారు. అధ్యక్షుడు బైడెన్ అభ్యర్థిత్వం పట్ల డెమొక్రాట్ల నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయనకు బదులుగా అనూహ్యంగా బరిలో దిగిన హారిస్‌కు ఈ ఫలితాలు నిరాశ కలిగించేవే. గెలిచి ఉంటే అధ్యక్ష పదవిని అధిష్టించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించేవారు. ట్రంప్, హారిస్ మధ్య పోటాపోటీ నెలకొన్నట్టు కొద్ది నెలలుగా ఎన్నికల సర్వేలన్నీ పేర్కొంటూ రావడం తెలిసందే. స్వింగ్ స్టేట్లలోనూ అదే పరిస్థితి ఉందని చెప్పడంతో ఫలితాలపై సర్వత్రా నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.
రూ.2,610 కోట్ల అక్రమ డిపాజిట్లు..18 ఏళ్లుగా జిత్తులు!
చట్టపరమైన చర్యల కోసం కింది కోర్టులో అదీకృత అధికారి ఫిర్యాదు చేస్తే దానిపై పిటిషన్..! వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిషన్‌ను నియమిస్తే పిటిషన్...! అధీకృత అధికారిని నియమిస్తే పిటిషన్..! కేసు వాదించడానికి స్పెషల్ పీపీని నియమిస్తే పిటిషన్! కింది కోర్టు విచారణకు స్వీకరిస్తే పిటిషన్...! వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తే పిటిషన్..! హైకోర్టు జోక్యానికి నిరాకరిస్తే సుప్రీంకోర్టులో పిటిషన్...!! సాక్షి, అమరావతి: ఇలా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్ 6న బట్టబయలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు. ప్రతి దశలోనూ విచారణను అడ్డుకుంటూ వచ్చారు. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 7వ తేదీన మరోసారి విచారణ జరపనుంది. ఆర్‌బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు స్వీకరించిందా? లేదా? అనే విషయాన్ని తేల్చనుంది. చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించినట్లు తేలితే వసూలు చేసిన రూ.2,610 కోట్లకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అటు అక్రమ డిపాజిట్లు.. ఇటు నష్టాలంటూ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997 కేంద్ర చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. అయితే దీన్ని ఖాతరు చేయకుండా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్‌బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి 1997 నుంచి 2006 మార్చి నాటికి 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.2,610.38 కోట్లు అక్రమంగా వసూలు చేసింది. ఇంత భారీగా డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఆశ్చర్యకరంగా 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. తద్వారా 50 శాతం మంది డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేరింది. డొంక కదిల్చిన ఉండవల్లి... మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. మార్గదర్శి అక్రమాల తీరును బహిర్గతం చేశారు. ఇదే సమయంలో ఆ డిపాజిట్ల వివరాలను ఆర్‌బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నుంచి వివరణ కోరింది. వాస్తవానికి 1997లోనే డిపాజిట్ల సేకరణపై మార్గదర్శి స్పష్టత కోరగా ప్రజల నుంచి అలా సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్‌బీఐ అప్పుడే స్పష్టం చేసింది. అయినా సరే పట్టించుకోకుండా మార్గదర్శి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారో అప్పుడు మళ్లీ ఆర్‌బీఐ దీనిపై స్పందించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్‌బీఐ స్పష్టంగా చెప్పింది. రంగాచారి, కృష్ణరాజు నియామకం.. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్‌బీఐ చేతులెత్తేయడంతో చట్ట ప్రకారం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముందుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని, చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ టి.కృష్ణరాజును అ«దీకృత అధికారిగా నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ నియామకాలను సవాలు చేస్తూ రామోజీ 2006లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం 2007లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఐటీ శాఖ నుంచి సేకరించిన రంగాచారి.. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రంగాచారి నిర్వహించిన విచారణకు రామోజీరావు, మార్గదర్శి సహకరించకుండా కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డంకులు సృష్టించారు. తమ పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని, డాక్యుమెంట్లు ఇచ్చేది లేదంటూ మొండికేశారు. దీంతో రంగాచారి ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ నుంచి తెప్పించుకున్నారు. ఆర్‌బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని పేర్కొంటూ 2007 ఫిబ్రవరి 19న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టుకు నివేదించటాన్ని తన నివేదికలో పొందుపరిచారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. రామోజీ పెట్టుబడి రూపాయైనా లేదు.. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీ తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణలో తేల్చారు. 2000, ఆ తరువాత బ్యాలెన్స్ షీట్‌లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని నిగ్గు తేల్చారు. కోర్టు అనుమతితో తనిఖీలు.. మరోవైపు ఈ కేసులో అదీకృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు కోర్టు అనుమతితో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో తనిఖీలు చేశారు. దీన్ని సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ 14.3.2007న కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీనిపై రామోజీ హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టు ఇచ్చిన సెర్చ్ వారెంట్‌ను నిలుపుదల చేసింది. ఈ క్రమంలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. దీన్ని కొట్టి వేయాలంటూ అదే ఏడాది రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ రజనీ స్టేతో మూలపడిన కేసు.. దీంతో దిక్కుతోచని రామోజీ 2010లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అ«దీకృత అధికారి ఇచ్చిన ఫిర్యాదులో విచారణను సెక్షన్ 45(ఎస్)(1), 45(ఎస్)(2), 58బీ(5ఏ) రెడ్ విత్ సెక్షన్ 58(ఈ)లకే పరిమితం చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ నాంపల్లి కోర్టు 2011లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్‌బీఐ చట్టం పరిధిలోకి మార్గదర్శి ఫైనాన్షియర్స్ రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 20.7. 2011న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.‘‘స్టే’’ వల్ల కేసు అప్పటి నుంచి మూలనపడిపోయింది. అటు తరువాత వచ్చిన ప్రభుత్వాలు రామోజీ గుప్పిట్లో ఉండటంతో మార్గదర్శి అక్రమాలను పట్టించుకోలేదు. విచారణ.. తీర్పు.. ఒకే రోజు ఉమ్మడి హైకోర్టు విభజన 1.1.2019న జరిగింది. 31.12.2018 ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అటు న్యాయవాదులు ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై దృష్టి సారించలేని పరిస్థితిని రామోజీరావు తనకు అనుకూలంగా మలచుకున్నారు. నాంపల్లి కోర్టులో అ«దీకృత కృష్ణరాజు చేసిన ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో తాము దాఖలు చేసిన వ్యాజ్యాలను రామోజీ విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రాను రంగంలోకి దించారు. లూథ్రా వాదనలు విన్న జస్టిస్ రజనీ ఇంత పెద్ద కేసులో అదే రోజు అంటే 31వతేదీన తీర్పు కూడా ఇచ్చేశారు. రామోజీ, మార్గదర్శి వాదనను సమర్ధించారు. హెచ్‌యూఎఫ్.. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదని జస్టిస్ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో అధీకృత అధికారి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి అదే రోజు తీర్పునివ్వడం అరుదైన ఘటన. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లుగానీ ఎవరూ గుర్తించలేదు. అటు తరువాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. జస్టిస్ రజనీ తీర్పుపై మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అటు తరువాత మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2019 డిసెంబర్ 17న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. హైకోర్టు తీర్పును రద్దు చేసిన సుప్రీం.. హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు 19.9.2020న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం17.8.2022న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటు ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ ప్రభుత్వం, ఇటు మార్గదర్శి, రామోజీరావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చింది. మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు విచారణ సందర్భంగా ఆర్‌బీఐ న్యాయవాది మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా ఈ ఏడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అదీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసుల కొట్టివేతకు సుప్రీం నిరాకరణ.. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ ఇదే సమయంలో రామోజీ, మార్గర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని.. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నామని స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని, సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. తాజాగా విచారణ జరిపి ఆరు నెలల్లో విచారణను ముగించాలని, సేకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని తెలిపింది. తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూన్‌లో తిరిగి విచారణ ప్రారంభించింది. విచారణ జరుగుతుండగానే రామోజీరావు మరణించగా ఆయన స్థానంలో హెచ్‌యూఎఫ్ కర్తగా తనను చేర్చాలని రామోజీ కుమారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలు వాయిదాల అనంతరం పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ఈ నెల 7న విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.
ఎయిర్‌బస్ @ ఓరుగల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విమానాశ్రయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. వరంగల్ శివారులోని మామునూరులో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఎయిర్‌పోర్ట్ రూపొందబోతోంది. ఐదారేళ్ల తర్వాత ఎట్టకేలకు అవరోధాలు పరిష్కారం కావటంతో విమానాశ్రయ నిర్మాణం చేపట్టేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సంసిద్ధత ప్రకటించింది. దీనిని సొంతంగానే నిర్మించాలని నిర్ణయించగా, అనుమతులు, ఇతర అధికారిక ప్రక్రియను ఆరునెలల్లో పూర్తి చేసి టెండర్లు పిలవబోతోంది. ఎయిర్‌బస్ దిగేలా.. నాలుగేళ్ల క్రితం ఏఏఐ ఆధ్వర్యంలో జరిగిన టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ సర్వే రెండు రకాల నివేదికలు సమర్పించింది. చిన్న విమానాశ్రయం నిర్మించేందుకు 724 ఎకరాల భూమి, రూ.248 కోట్ల వ్యయం అవుతుందని, పెద్ద విమానాలను ఆపరేట్ చేసే స్థాయిలో నిర్మించాలంటే 1053 ఎకరాల భూమి, రూ. 345 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. తొలుత చిన్న విమానాశ్రయంగానే నిర్మించాలని నాటి ప్రభుత్వం సూచించింది. కానీ భవిష్యత్‌లో విస్తరణ ఇబ్బందిగా ఉంటుందని, కనీసం 30 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఒకేసారి పెద్ద విమానాశ్రయమే నిర్మించాలని గతేడాది చివరలో ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి ప్రభుత్వం సరే అనటంతో పెద్ద విమానాశ్రయమే రూపొందబోతోంది. ఇక్కడ ఎయిర్‌బస్ విమానం దిగేలా దాదాపు 2,800 మీటర్ల పొడవైన్ రన్‌వే నిర్మించబోతున్నారు. మామునూరులో నిజాం ప్రభుత్వం నిర్మించిన ఎయిర్‌్రస్టిప్ శిథిలం అయినా, నాటి రెండు రన్‌వేల ఆనవాళ్లు ఉన్నాయి. అందులో పెద్దది దాదాపు 1,400 మీటర్ల పొడవు ఉంది. ఇప్పుడు అదే డైరెక్షన్‌లో దానిపైనే కొత్త రన్‌వే నిర్మించనున్నారు. దాని పక్కన గ్‌లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్‌వే కూడా ఉంది. దానిని కూడా పునరుద్ధరించే యోచనలో ఉన్నారు. సొంతంగానే నిర్మాణం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎమ్మార్ సంస్థ నిర్మించింది. ఎయిర్‌పోర్టుకు 150 కి.మీ. పరిధిలో మరో విమానాశ్రయం నిర్మించకూడదన్న నిబంధన ఉంది. వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఇది అడ్డంకిగా మారటంతో జీఎమ్మార్ సంస్థతో సంప్రదింపులు జరిపారు. వరంగల్ విమానాశ్రయాన్ని కూడా దానికే కేటాయించేలా కూడా చర్చలు జరిగాయి. చివరకు ఆ నిబంధనపై అభ్యంతరం పెట్టకూడదన్న దిశలో చర్చలు సానుకూలంగా జరిగాయి. ఆ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్‌ఓసీ తీసుకుంది. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు కేటాయించకుండా సొంతంగానే వరంగల్ ఎయిర్‌పోర్టును చేపట్టాలని అది నిర్ణయించింది. – విమానాశ్రయానికి 700 మీటర్ల దూరంలో ఉన్న వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిని మళ్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. దాదాపు కిలోమీటరు నిడివితో భారీ సొరంగమార్గం నిర్మించి వాహనాలను దాని గుండా మళ్లించాలని ప్రతిపాదించారు. కానీ దీనికి భారీ ఖర్చు అవుతున్నందున, దాని బదులు బైపాస్‌రోడ్డు నిర్మించాలన్న ప్రత్యామ్నాయ ప్రతిపాదనపై ఇప్పుడు పరిశీలిస్తున్నారు. – వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కులో జపాన్, తైవాన్ లాంటి విదేశీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవి కార్గో ఫ్లైట్ సేవలు కోరుతున్నాయి. కార్గో ఫ్లైట్ ఆపరేషన్ జరగాలంటే పెద్ద రన్‌వే ఉండాలి. దీంతో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగానే దీనిని రూపొందించబోతున్నారు. మూడేళ్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్.. మామునూరు విమానాశ్రయాన్ని ‘ఉడాన్’లోని రీజినల్ కనెక్టివిటీ స్కీంతో అనుసంధానించనున్నారు. ఇందులో మూడేళ్ల కాలానికి కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ అందిస్తుంది. రూట్ల వారీగా బిడ్డింగ్ నిర్వహిస్తే వాటిల్లో ఎంపికైన ఆపరేటర్లకు ఆయా రూట్లు కేటాయిస్తారు. ఆ ఆపరేటర్లు మాత్రమే ఆ రూట్లలో మూడేళ్లపాటు విమాన సర్వీసులు నిర్వహిస్తారు. ఈ కాలంలో సీట్ల వారీగా నష్టాలను బేరీజు వేసి.. డిమాండ్ అంచనా–వాస్తవ డిమాండ్.. ఈ రెంటి మధ్య ఉండే గ్యాప్‌ను కేంద్రం భర్తీ చేస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. వేయి ఎకరాలు అవసరం కొత్త విమానాశ్రయానికి వేయి ఎకరాలు కావాలి. నిజాం కాలం నాటి పాత విమానాశ్రయానికి చెందిన 696 ఎకరాలు ప్రస్తుతం ఏఏఐ అధీనంలోనే ఉన్నాయి. మిగతా భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. విమానాశ్రయం నిర్మించేందుకు రూ. 800 కోట్లు ఖర్చవుతాయని అంచనా. త్వరలో ఏఏఐ డీపీఆర్ సిద్ధం చేయనుంది.
USA Presidential Election Results 2024: విజయానికి ఐదు మెట్లు
పోరు హోరాహోరీ అంటూ విశ్లేషణలు. హారిస్‌దే పైచేయి అంటూ అమెరికా మీడియాలో కథనాల వెల్లువ. అందుకు తగ్గట్టు ట్రంప్‌తో ఏౖకైక డిబేట్‌లోనూ హారిస్ స్పష్టమైన ఆధిపత్యం. వీటికి తోడు ఆమె ఆఫ్రికన్, భారత మూలాలు. మహిళల దన్నుపై ధీమా. అబార్షన్ వంటి కీలకాంశాలు కలిసొస్తా యన్న అంచనాలు. సెలబ్రిటీల బహిరంగ మద్దతు. రిపబ్లికన్లతో పోలిస్తే ప్రచారానికి వరదలా వచ్చి పడ్డ నిధులు. కానీ తీరా చూస్తే ట్రంప్ హవా ముందు అన్నీ కొట్టుకుపో యాయి. హోరాహోరీ అనుకున్న పోటీ కాస్తా ఫలితాలొచ్చే సరికి ఏకపక్షంగా మారిపోయింది. ట్రంప్ విజయానికి, హారిస్ పరాజయానికి దారితీసిన కారణాలను పరిశీలిస్తే...1. అమెరికా ఫస్ట్2016లో ట్రంప్‌ను విజయతీరాలకు చేర్చిన ఈ నినాదం ఈసారి కూడా గట్టిగా పని చేసింది. ఉక్రెయిన్‌కు మద్దుతుగా బైడెన్ సర్కారు వందలాది కోట్ల డాలర్లను గుమ్మరించడం సగటు అమెరికన్లకు మింగుడు పడలేదు. దానికి తోడు చైనా తదితర దేశాల నుంచి కారుచౌకగా వచ్చిపడుతున్న వస్తూత్పత్తులు వారి పొట్టకొట్టడమే గాక ఉపాధికి కూడా ఎసరు పెడుతున్నాయి. అసలే ధరాభారంతో కుంగిపోతున్న అమెరికన్లకు ఈ పరిణామం కొన్నేళ్లుగా రోకటిపోటుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాను ప్రాభవం కొడిగడుతున్న దేశంగా ట్రంప్ అభివర్ణించడాన్ని వారు సమర్థించారు. సుంకాలను భారీగా పెంచడం ద్వారా కారుచౌక దిగుమతులకు అడ్డుకట్ట వేస్తానన్న ప్రకటన అమెరికన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఆర్థిక అవ్యవస్థ సహా అన్ని సమస్యలనూ చక్కదిద్దడానికి హారిస్‌తో పోలిస్తే ట్రంపే సరైన నేత అని మెజారిటీ ప్రజలు భావించారు. ‘అమెరికా ఫస్ట్’ నినాదానికి విపరీతమైన స్పందన దక్కింది. అంతర్జాతీయంగా అన్ని రంగాల్లోనూ అమెరికా ప్రాధాన్యాన్ని పునరుద్ధరిస్తానన్న వాగ్దానం శ్వేతజాతీయుల మనసు గెలుచుకుంది.2. అక్రమ వలసలువలసదారులు తమ అవకాశాలను తన్నుకుపోతున్నారన్న ఆక్రోశం స్థానికుల్లో చాలా ఏళ్లుగా నెలకొని ఉంది. వారిలోని ఈ వ్యతిరేకతను ట్రంప్ పూర్తిస్థాయిలో సొమ్ముచేసుకోగలిగారు. బైడెన్ నాలుగేళ్ల పాలనలో అమెరికాలోకి రికార్డు స్థాయిలో అక్రమ వలసలు జరిగాయి. వలసదారులు అమెరికన్ల పొట్టకొడుతు న్నారన్న ట్రంప్ వాదనతో వారు ఏకీభవించారు. వాటికి అడ్డుకట్ట వేయడమే గాక అక్రమంగా వచ్చిన 10 లక్షల పై చిలుకు మందిని స్వదేశాలకు పంపేస్తానని ప్రకటించడం ట్రంప్‌కు భారీగా లాభించింది.3.ఎకానమీఈసారి ట్రంప్‌ను గద్దెనెక్కించిన అంశాల్లో అత్యంత ముఖ్యమైనది. బైడెన్ పాలనలో గత నాలుగేళ్లలో ద్రవ్యోల్బణం చుక్కలను తాకింది. నిత్యావసరాల ధరలు అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రెండు రెట్లకు పైగా పెరిగిపోయాయి. కరోనా తదితర సమస్యలూ దానికి కారణమైనా ఓటర్లు మాత్రం బైడెన్‌ను, ఆయన డెమొక్రటిక్ పార్టీనే దోషులుగా చూశారు. ట్రంప్ హయాంలోనే ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండేదన్నది అమెరికన్లలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఆర్థిక అవ్యవస్థను చక్కదిద్దే సామర్థ్యం విషయంలో ట్రంప్‌తో పోలిస్తే హారిస్ తేలిపోయారని అన్ని సర్వేల్లోనూ తేలింది.4. గ్రామీణ ఓటర్ల బ్రహ్మరథంతొలినుంచీ ట్రంప్‌కు గట్టి ఓటు బ్యాంకుగా నిలిచిన గ్రామీణ ఓటర్లు ఆయనకు ఈసారి మరింత దన్నుగా నిలిచారు. గత కొన్ని ఎన్నికలతో పోలిస్తే ఈసారి వారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగినట్టు ఫలితాల సరళి చెబుతోంది. ఈ ట్రెండు దేశవ్యాప్తంగా కొనసాగడం ట్రంప్‌కు బాగా కలిసొచ్చింది. ఎందుకంటే గ్రామీణ ఓట్లను ఆయన దాదాపుగా స్వీప్ చేశారు.మైనారిటీ ఓటర్లలోనూ పాగామెక్సికో తదితర లాటిన్ అమెరికా దేశాల నుంచి తరాల కిందట వలస వచ్చి స్థిరపడ్డ స్పానిష్ మాట్లాడే వారిని హిస్పానియన్లుగా పిలుస్తారు. ఫలితాల్లో వీరి ఓట్లూ కీలకమే. డెమొక్రాటిక్ పార్టీ ఓటర్లలో 12 శాతం దాకా ఉండే హిస్పానియన్లు కొన్నేళ్లుగా రిపబ్లికన్ పార్టీవైపు మొగ్గుతున్నారు. ఆ ట్రెండ్ కూడా ఈసారి కూడా కొనసాగినట్టు కన్పిస్తోంది. దీనికి తోడు హిస్పానియన్లకు, ఇండియన్ అమెరికన్లకు దగ్గరయ్యేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పోలింగ్ సమీపించిన తరుణంలో బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై దాడులను ఖండిస్తూ చేసిన ప్రకటన ఇండియన్ అమెరికన్లపై ప్రభావం చూపింది. 2020తో పోలిస్తే ట్రంప్‌కు ఈసారి లాటిన్, ఇండియన్ అమెరికన్ ఓట్లు గణనీయంగా పెరిగినట్టు దేశవ్యాప్తంగా 1.15 లక్షల ఓటర్లతో జరిపిన ఏపీ వోట్‌కాస్ట్ ప్రాథమిక సర్వే తేల్చింది. 2020లో బైడెన్‌కు ప్రతి 10 మంది లాటిన్ ఓటర్లలో 9 మంది ఓటేయగా ఈసారి హారిస్‌కు 8 మందే వేసినట్టు పేర్కొంది. 2020లో 60 శాతం పడ్డ హిస్పానియన్ ఓట్లు ఈసారి 50 శాతానికి తగ్గాయి. 30 ఏళ్ల లోపు ఓటర్లలో 2020లో బైడెన్‌కు 60 శాతం మంది ఓటేయగా ఈసారి అది 50 శాతానికి పరిమితమైంది. వారిలో 2020లో ట్రంప్‌కు మూడో వంతే ఓటేయగా ఈసారి అది 40 శాతానికి పెరిగింది. ఈ చిన్న మార్జిన్లే తుది ఫలితాలను గట్టిగా ప్రభావితం చేశాయి.5. భావజాలాలుపైకి కన్పించకపోయినా అమెరికా సమాజంలో జాత్యహంకారం, పురుషాధిక్య భావజాలం బలంగా వేళ్లూనుకుని ఉన్నాయి. ట్రంప్‌కు శ్వేతజాతీయులు మొదటినుంచీ గట్టి మద్దతుదారులుగా ఉండటానికి ఇది కూడా కారణమేనని చెబుతారు. అందుకే ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ వంటి ట్రంప్ నినాదాల్లో అంతర్లీనంగా దాగున్న ఆ భావనలు ఓటర్లపై గట్టి ప్రభావమే చూపాయని భావిస్తున్నారు. వీటికి తోడు ట్రంప్‌పై కోర్టు కేసులు, క్రిమినల్ అభియోగాలను ప్రజలు పట్టించుకోకపోవడం కూడా ఆయనకు కలిసొచ్చింది. పైగా ప్రస్తుతం దేశానికి కావాల్సింది ఆ దూకుడేనని వారు భావించారు. దీన్ని ట్రంప్ కూడా అంగీకరించడం విశేషం. తనపై ఉన్న కేసులు, అభియోగాలు జనాదరణను మరింతగా పెంచాయని చెప్పుకొచ్చారాయన.
కొడంగల్ ఎత్తిపోతల్లో సీఎం వాటా ఎంత ఢిల్లీ వాటా ఎంత: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిన మేఘా కంపెనీతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ సంస్థకు రూ.4,350 కోట్ల కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు కట్టబెడుతున్నారు. అనుభవం కలిగిన కంపెనీలను టెక్నికల్ బిడ్‌లో అనర్హులుగా ప్రకటించి రెండు సంస్థలకు కేక్ ముక్క ల్లా పనులు పంచి పెట్టి డబ్బులు దండుకునే కుట్ర చేస్తున్నారు. రూ.4,350 కోట్లలో సీఎం వాటా, ఢిల్లీ వాటా ఎంతో చెప్పాలి..’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మె ల్యే వివేకానంద్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో అరాచక కంపెనీ, ఆంధ్రా కంపెనీ అన్నారుగా.. ‘రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’అని పేర్కొన్న మేఘా సంస్థకే ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు రూ.వేల కోట్ల విలువ చేసే పనులు అప్పగిస్తున్నారు. గతంలో ‘అరాచక కంపెనీ’, ‘ఆంధ్రా కంపెనీ’, ‘పొలిటికల్ మాఫియా’అని సదరు కాంట్రాక్టు సంస్థపై ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు దానిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? హైదరాబాద్ నగరానికి కృష్ణా జలాలను తెచ్చేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ సదరు సంస్థ నేరపూరిత నిర్లక్ష్యం మూలంగా కూలిపోయినా బ్లాక్ లిస్టులో పెట్టకపోవడానికి కారణమేంటో చెప్పాలి. కాంట్రాక్టు సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని విచారణ కమిటీ ఇచ్చిన రిపోర్టును రేవంత్‌రెడ్డి తారుమారు చేసే అవకాశం ఉంది. ఆ నివేదికను వెంటనే బయట పెట్టాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. గోదావరి జలాల పేరిట రూ.5,500 కోట్ల కుంభకోణం ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’నిబంధన పక్కన పెట్టి మంత్రివర్గ సభ్యుడైన పొంగులేటికి సంబంధించిన కంపెనీకి మూసీ ప్రాజెక్టు పనులు ఇస్తున్నారు. రేవంత్‌కు సహాయ మంత్రిలా వ్యవహరిస్తున్న బండి సంజయ్ కూడా దీనిపై మాట్లాడటం లేదు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ గురించి మాట్లాడుతున్న మోదీ ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదు. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలించేందుకు గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.1,100 కోట్లతో ప్రతిపాదించిన పనులు రద్దు చేశారు. ఇప్పుడు అంచనాలు రూ.5,500 కోట్లకు పెంచి మరో భారీ కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. ఈ ప్రాజెక్టును కూడా ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’కి ఇచ్చేందుకే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సీఎం చెప్పిన చోట అధికారులు సంతకాలు పెడితే ఉద్యోగాలు ఊడటం ఖాయం..’అని మాజీమంత్రి హెచ్చరించారు. పొంగులేటీ..నువ్వు జైలుకు పోకుండా చూసుకో ‘అరెస్టులు అంటూ అందరి జాతకాలు చెప్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తాను జైలుకు వెళ్లకుండా చూసుకోవాలి. పొంగులేటి నివాసంలో జరిగిన ఈడీ దాడులపై ఇప్పటివరకు బీజేపీ స్పందించలేదు. ఐటీసీ కోహెనూర్ హోటల్లో అదానీ కాళ్లు పట్టుకుని, కడుపులో తలపెట్టి తనను కాపాడాలని పొంగులేటి కోరాడు. రేవంత్ నివాసంలో గౌతమ్ అదానీ కొడుకు కరణ్ అదానీతో నాలుగు గంటల సుదీర్ఘ భేటీ జరిగింది. ఈడీ దాడిలో ఏం జరిగిందో పొంగులేటి చెప్పాలి. అరెస్టుల గురించి చెప్పడానికి పొంగులేటి ఎవరు? వీళ్లు నడిపేది సర్కారా లేక సర్కస్సా?. గొట్టంగాళ్లకు భయపడేది లేదు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటులో కాంగ్రెస్ హస్తం ఉంది. మరమ్మతు చేయకపోవడం వెనుక ఏదో మతలబు ఉంది. కేసీఆర్‌ను బదనాం చేసేందుకు ఈ అరాచక శక్తులు ఎంతకైనా తెగిస్తాయి. కుంభకోణాలను బయట పెడుతున్నందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు చేస్తారు. అయినా ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం..’అని కేటీఆర్ స్పష్టం చేశారు.
డొనాల్డ్ ట్రంప్ గెలుపు వెనుక ఎలాన్ మస్క్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో అపరకుబేరుడు ఎలాన్ మస్క్ పాత్రను తీసిపారేయలేం. మొదటి నుంచి ట్రంప్‌కు మద్ధతు పలుకుతూ వచ్చిన మస్క్.. బైడెన్ ప్రభుత్వంపైనా, పోటీదారు కమలా హారిస్‌పైనా అదే స్థాయిలో విమర్శలతో చెలరేగిపోయాడు. అదే టైంలో.. సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’కి బాస్‌గా ఎలాన్ మస్క్ నడిపించిన ఉద్యమం కూడా ట్రంప్ గెలుపులో కీలకభూమిక పోషించింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్‌కు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ పరోక్షంగా ఉపయోగపడింది. మస్క్ తన సోషల్ మీడియా వేదికలపై ప్రముఖులతో కలిసి ట్రంప్‌కు అనుకూలంగా ప్రచారం చేశారు. అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం, ట్రంప్ గెలుపుతో అమెరికన్లకు కలిగే ప్రయోజనాలతో పాటు వివిధ సున్నిమైన అంశాల గురించి చర్చించారు. ఆ చర్చలే ఓటర్లకు దగ్గరయ్యేలా చేసింది. పలు సందర్భాల్లో ప్రజల్లో ట్రంప్‌పై ఉన్న వ్యతిరేకతను సైతం అనుకూలంగా మార్చేలా మస్క్ తన వ్యూహ, ప్రతివ్యూహాలతో ఆకట్టుకున్నారు. అన్నింటికంటే ముందు.. ట్రంప్‌పై గతంలో విధించిన సోషల్ మీడియా బ్యాన్‌ను ఎత్తిపారేశారాయన.ఇదీ చదవండి: కమలా హారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ ఘన విజయంట్రంప్‌కు బహిరంగ మద్దతు వ్యాపార వ్యవహరాల్లోనే కాదు రాజకీయంగా మస్క్.. ట్రంప్‌కు ప్రత్యక్షంగా మద్దతు పలికారు. వాస్తవానికి 2016, 2020 ఎన్నికలలో ట్రంప్‌కు మస్క్ పరోక్ష మద్దతిచ్చారు. అలాగే ఈ ఎన్నికల్లో మస్క్ ఓ అడుగు ముందుకు వేసి ట్రంప్‌కు మద్దతు పలికారు. అలాగే.. ట్రంప్ హామీలు, గత పాలనలో నిర్ణయాలను విపరీతంగా ప్రమోట్ చేశారు. కుటుంబ నియంత్రణ, అంతరిక్ష పరిశోధనలు, ఆర్థిక జాతీయవాదం వంటి అంశాలపై మద్దతు పలకడంతో కోట్లాది మంది మస్క్ అభిమానులు సైతం ట్రంప్‌కు ఓటు వేసేందుకు ఉపయోగపడింది. మస్క్‌ను నమ్మారు!ట్రంప్‌కు మస్క్ మద్దతు ఇవ్వడంతో.. ఆయన కంపెనీలైన టెస్లా, స్పేస్‌ఎక్స్ ఆవిష్కరణలతో పాటు పెట్టుబడిదారులు, వినియోగదారులు లబ్ధి చేకూరొచ్చని భావించారు. పన్నులు, ఇంధనం, రాయితీ వంటి హామీలపై మస్క్ ఎక్కువ ఫోకస్ చేశారు. పెట్టుబడిదారుల నుంచి వినియోగదారుల వరకు మస్క్ మాటల్ని నమ్మారని, కాబట్టే మస్క్ అభిమానుల ఓట్లు ట్రంప్‌కు పడేలా చేశాయని విశ్లేషకుల అభిప్రాయం. ఎలాన్ మస్క్ చేసిన పోస్టులే..సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ క్రేజ్ అంతా ఇంతా కాదు. స్వేచ్ఛ పేరుతో.. ఎలాంటి అంశంపైన అయినా స్పందిస్తుంటారు. మీడియా, టెక్నాలజీలతో పాటు ఉన్నత రంగాల ప్రముఖుల పట్ల జోబైడెన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పలుమార్లు ఎలాన్ మస్క్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఈ అంశం ట్రంప్‌కు బాగా కలిసొచ్చింది. ప్రపంచకుబేరుల జాబితాలో మస్క్ ముందు వరుసలో ఉండడం, ఆకట్టుకునేలా మాటలు ట్రంప్‌కు అనుకూలంగా పనిచేశాయి.ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో మస్క్ మరింత చురుకైన పాత్ర పోషిస్తే, ట్రంప్‌కు ప్రయోజనం చేకూర్చేలా అమెరికన్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని ఆయా సోషల్ మీడియా వేదికలపై ప్రస్తావించారు. టెక్నాలజీ, ఆర్థిక సమస్యలు, సంస్కృతి వంటి అంశాల ట్రంప్‌కు అనుకూలంగా మారాయి.వాక్ స్వాతంత్య్రం, ప్రభుత్వ జోక్యం, వ్యక్తిగత స్వేచ్ఛపై మస్క్ వ్యక్తిగత విశ్వాసాలు ట్రంప్‌కు మద్దతు పలికేలా చేశాయి. వాక్ స్వాతంత్య్రం, సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడంపై మస్క్.. ట్రంప్‌తో జతకట్టేలా చేశాయి. ట్రంప్ గెలుపులు ఈ అంశాలు కలిసొచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఎలాన్ మస్క్ చేసిన ప్రచారం ఓటర్ల శైలిని మార్చేసిందనే చెప్పొచ్చు.
మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్.. పిఠాపురం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల పిఠాపురంలో అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి పిఠాపురం వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ వంగా గీతా, జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఆ చెక్కు అందజేశారు.కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి: వంగా గీతఅనంతరం పిఠాపురంలో జరిగిన ఆ పార్టీ ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. కూటమి పాలనలో చిన్నారులు, మహిళలపై దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయని వంగా గీతా మండిపడ్డారు. మహిళలకు భద్రత, ధైర్యం కల్పించాలని వంగా గీత అన్నారు. వైఎస్సార్‌సీపీని సంస్ధగతంగా పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఇచ్చినా హమీలను అమలు చేయలేదు. ఇచ్చిన హమీలను నూరు శాతం వైఎస్ జగన్ అమలు చేశారు. కూటమి సర్కార్.. ప్రజలను నమ్మించి హమీలు అమలు చేయకపోవడం అన్యాయం’’ అని ఆమె దుయ్యబట్టారు.మంచి చేసి ఓడిపోయిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ: కురసాల కన్నబాబుప్రజలకు మంచి చేసి ఓడిపోయిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ. నేరుగా ప్రజలకు సేవలందించాలని బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశమంతా చూసేలా వలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. చంద్రబాబులా అబద్దపు హమీలు జగన్ ఇవ్వలేదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. కులం, మతం చూడకుండా అర్హులకు పథకాలు అందించిన ఘనత వైఎస్సార్‌సీపీదే. చంద్రబాబూ.. రుషికొండ ప్యాలెస్ కాదు.. పలాసలో నిర్మించిన ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ చూడండీ. పాడేరులో కట్టిన మెడికల్ కళాశాల.. ఉప్పాడలో కట్టిన ఫిషింగ్ హర్బర్‌ను కూడా చూడాలి...అమరావతిలో మీరు కట్టిన సచివాలయానికి ఖర్చు ఎంతో చెప్పండి. కూటమీ ప్రభుత్వంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దుర్మార్గమైన పరిస్ధితులు వచ్చాయి. పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో.. పోలీసుల పని తీరు ఏలా ఉందో చెప్పారు. ఇసుక, శాంతి భద్రతల సమస్యలు నాకు సంబంధం లేదంటే కుదరదు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు ఎక్కడపడితే అక్కడ అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలియదు. అయినా పోలీసులు పని బాగోలేదని కూటమి నాయకులు చెబుతున్నారు. గోతులు పూడ్చడానికి కూడా శంకుస్ధాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే. చంద్రబాబు ప్రచారం పీక్‌లో ఉంటుంది. వాస్తవం కింద ఉంటుంది.ఇదీ చదవండి: నిజంగా పవన్‌కు ఆ ధైర్యం ఉందా?
Donatd Trump: వివాదాలకు పెద్దన్న
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జయకేతనం ఎగురవేశారు. 132 ఏళ్ల అనంతరం మధ్యలో ఒక విరామం తర్వాత రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి అభ్యర్థిగా ఆయన చరిత్ర సృష్టించారు. సంచలనాలు, వివాదాలకు మారుపేరైన ట్రంప్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. వ్యాపారం, స్థిరాస్తి, మీడియా రంగాల్లో తన ప్రతిభాపాటవాలతో రాణించారు. వ్యాపార కుటుంబంలో జన్మించిన ట్రంప్ విలక్షణ నాయకుడిగా పేరుపొందారు. రాజకీయ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాదు, అమెరికా రాజకీయాలపై తనదైన ముద్ర వేయడం విశేషం. 1982లోనే ఫోర్బ్స్ జాబితాలోకి.. ట్రంప్ అసలు పేరు డొనాల్డ్ జాన్ ట్రంప్. 1946 జూన్ 14న న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రు లు ఫ్రెడ్ ట్రంప్, మేరీ అన్నే మెక్‌లి యోడ్ ట్రంప్. మొత్తం ఐదుగురు సంతానంలో ట్రంప్ నాలుగో సంతానం. ఫ్రెడ్ ట్రంప్ అమెరికాలో విజయవంతమైన రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా పేరు ప్రఖ్యాతులు గడించారు. డొనాల్డ్ ట్రంప్ బాల్యం న్యూయార్క్‌లోనే గడిచింది. న్యూయార్క్ మిలటరీ అకాడమీలో చదువు కున్నారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. 1968లో కామర్స్‌లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. కాలేజీలో చదువు పూర్తయ్యాక ట్రంప్ 1971లో తన తండ్రి వ్యాపార సంస్థలోకి అడుగుపెట్టారు. తమ సంస్థను ‘ట్రంప్ ఆర్గనైజేషన్’గా పేరుమార్చారు. ట్రంప్ గ్రూప్‌నకు సంబంధించిన హోటళ్లు, క్యాసినోలు, గోల్ఫ్ కోర్సులను మరింత విస్తరింపజేశారు. తన పేరిట కొన్ని ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. అనతికాలంలోనే ట్రంప్ బ్రాండ్‌కు మంచి పేరొచ్చింది. విజయవంతమైన వ్యాపారవేత్తగా డొనాల్డ్ ట్రంప్ పేరు మార్మోగిపోయింది. 200 మిలియన్ డాలర్ల సంపదతో 1982లో తొలిసారి ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో చేరారు. 2023లో ఆ సంపద విలువ 631 మిలియన్ డాలర్లతో సమానం. 2004లో ప్రారంభమైన అప్రెంటీస్ అనే టీవీ రియాలిటీ షోను ట్రంప్ స్వయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇంటింటా అందరికీ అభిమాన పాత్రుడయ్యారు. ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నారు. 14కుపైగా పుస్తకాలు రాశారు. 1987లో విడుదలైన ‘ద ఆర్ట్ ఆఫ్ ద డీల్’ అనే పుస్తకం విపరీతమైన పాఠకాదరణ పొందింది. నెరవేరిన స్వప్నం డొనాల్డ్ ట్రంప్‌కు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఆసక్తి ఉండేది. 1980వ దశకంలో రాజకీయ రంగంలో ప్రవేశించారు. రిపబ్లిన్ పార్టీలో చేరారు. అధ్యక్షుడు కావాలన్నది ట్రంప్ కల. అందుకోసం ఎంతగానో శ్రమించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగించారు. మొదట్లో ఆ ప్రయత్నాలు ఫలించకపోయినా నిరాశ చెందలేదు. మరింత పట్టుదలతో కృషిచేశారు. 2015 జూన్ 16న రిపబ్లిన్ అభ్యర్థిగా ఆయన పేరు బలంగా తెరపైకి వచ్చింది. ప్రైమరీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులను వెనక్కి నెట్టి, ఎట్టకేలకు 2016 జూలైలో అధ్యక్ష ఎన్నికల బరిలో ట్రంప్ నిలిచారు. రిపబ్లికన్ అభ్యర్థిగా ఆయన పేరు అధికారికంగా ఖరారైంది. 2016 నవంబర్ 8న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ సంచలన విజయం సాధించారు. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను ఓడించారు. రష్యా ప్రభుత్వం ఆయన విజయానికి సహకరించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ట్రంప్ 2017 జనవరి 20 నుంచి 2021 జనవరి 20వ తేదీ దాకా అగ్రరాజ్యానికి 45వ అధ్యక్షుడిగా సేవలందించారు. పన్ను సంస్కరణలు, వలస విధానం, విదేశీ వ్యవహారాలపై ట్రంప్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. కొన్ని కీలకమైన పన్నులను తగ్గించారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నాలుగేళ్ల పాలనలో యుద్ధాలకు దూరంగా ఉన్నారు. కానీ, చైనాతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. శత్రుదేశంగా భావించే ఉత్తర కొరియాలో కాలుమోపిన తొలి అమెరికా అధ్యక్షుడిగా(పదవిలో ఉండగానే) ట్రంప్ చరిత్రకెక్కారు. వలసలపై కొంత కఠినంగానే వ్యవహరించారు. కొన్ని ఇస్లామిక్ దేశాల నుంచి ప్రజలు అమెరికాకు రాకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించేందుకు సైనిక నిధులను మళ్లించారు. తన పదవీ కాలంలో ముగ్గురిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించారు. ట్రంప్ పాలనలోనే కోవిడ్–19 మహమ్మారి వచ్చిపడింది. ఈ విపత్తును ఎదుర్కోవడంలో ట్రంప్ తీవ్ర అలసత్వం వహించారన్న ఆరోపణలు వచ్చాయి. వాతావరణ మార్పులకు సంబంధించిన పారిస్ ఒప్పందం, ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలిగారు. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌తో మూడుసార్లు సమావేశమయ్యారు. కానీ, అణ్వాయుధాల నియంత్రణ దిశగా ఆయనను ఓప్పించలేకపోయారు. ట్రంప్ వేగంగా, స్థిరంగా నిర్ణయాలు తీసుకుంటారన్న పేరుంది. అదే ఆయనను బలమైన నాయకుడిగా మార్చింది. రెండు సార్లు అభిశంసన అధ్యక్షుడిగా ట్రంప్ పాలనాకాలం పలు వివాదాలతో గడిచింది. శృంగార తార స్మార్మీ డేనియల్స్‌కు చెల్లించిన సొమ్మును రికార్డుల్లో చూపించకుండా వాటిని తారుమారు చేసిన ‘హష్ మనీ’ కేసులో న్యూయార్క్ కోర్టు ఈ ఏడాది మే నెలలో ట్రంప్‌ను దోషిగా తేల్చింది. ఒక నేరంలో అమెరికా అధ్యక్షుడు దోషిగా తేలడం ఇదే మొదటిసారి. ఈ కేసులో ట్రంప్‌కు ఇంకా శిక్ష విధించలేదు. మరికొన్ని కేసుల్లోనూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అమెరికా కాంగ్రెస్‌లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో ట్రంప్ రెండుసార్లు అభిశంసనకు(ఇంపీచ్‌మెంట్) గురయ్యారు. ఉక్రెయిన్ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 2019 డిసెంబర్‌లో అభిశంసనను ఎదుర్కొన్నారు. తన మద్దతుదారులతో క్యాపిటల్ భవనం వద్ద ఘర్షణను ప్రేరేపించినట్లు విమర్శలు వెల్లువెత్తడంతో 2021 జనవరిలో మరోసారి అభిశంసనకు గురయ్యారు. రెండుసార్లు అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడిగా అపకీర్తి పొందారు. అయితే, కాంగ్రెస్‌లో ఎగువ సభ అయిన సెనేట్ మాత్రం ఈ రెండు సందర్భాల్లో ట్రంప్‌ను నిర్దోషిగా తేల్చింది. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ప్రభావం చెక్కుచెదరలేదు. అందుకే అదే పార్టీ నుంచి మరోసారి పోటీ చేయగలిగారు. ఈ ఏడాది ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. మాజీ అధ్యక్షుడిగానూ ట్రంప్ నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలవడం కావడం విశేషం. కేసులు, విచారణలతో ట్రంప్ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రజల నోట్లో నానింది. 3 వివాహాలు.. ఐదుగురు సంతానం 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ కుటుంబం పెద్దదే. మూడు వివాహాలు చేసుకున్నారు. తొలుత చెక్ రిపబ్లిక్‌కు చెందిన మోడల్ ఇవానాను పెళ్లాడారు. 1977 నుంచి 1990 దాకా ఆమెతో కలిసున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం సినీ నటి మార్లా మాపిల్స్‌ను వివాహం చేసుకున్నారు. 1993 నుంచి 1999 దాకా వారి బంధం కొనసాగింది. విడాకులతో వేరయ్యారు. 2005లో స్లొవేనియా మోడల్ మెలాని యాతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఇరువురూ కలిసే ఉంటున్నారు. ట్రంప్‌కు ముగ్గురు భార్యలతో మొత్తం ఐదుగురు సంతానం ఉన్నారు. మొదటి భార్య ఇవానాతో డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంక, ఎరిక్, రెండో భార్య మార్లాతో టిఫానీ జన్మించారు. మూడో భార్య మెలానియాతో బారోన్ ట్రంప్ జన్మించాడు. మద్యం, సిగరెట్, డ్రగ్స్ తీసుకోవడం తనకు అలవాటు లేదని ట్రంప్ పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన రోజుకు నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే నిద్రిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇస్తారు. గోల్ఫ్ ఆయనకు ఇష్టమైన క్రీడ. అదే ఆయన వ్యాయామం కూడా. ఇతర వ్యాయామాలేవీ చేయరు. నడక(వాకింగ్) కూడా పెద్దగా ఇష్టపడరు. మానవ శరీరం ఒక బ్యాటరీ లాంటిదని, అందులో సహజంగానే మనిషికి కావాల్సిన శక్తి ఉంటుందని, వ్యాయామాలతో ఆ శక్తి హరించుకుపోతుందని ట్రంప్ నమ్ముతారు. ట్రంప్ రికార్డులు→ ట్రంప్ ఖాతాలో అరుదైన ఘనత చేరింది. ఒక విరామం తర్వాత మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇలా జరగడం గత 132 ఏళ్లలో ఇదే తొలిసారి. గ్రోవర్ క్లీవ్‌లాండ్ తర్వాత ఈ రికార్డు ట్రంప్ సొంతమైంది. క్లీవ్‌లాండ్ 1885 నుంచి 1889 దాకా 22వ అధ్యక్షుడిగా, 1893 నుంచి 1897 దాకా 24వ అధ్యక్షుడిగా పనిచేశారు. ట్రంప్ 2017 నుంచి 2021 వరకు ఒకసారి అధ్యక్షుడిగా వ్యవహరించారు. మధ్యలో ఒక విరామంతో 2025 నుంచి 2029 దాకా మరో సారి అధ్యక్షుడిగా పని చేయబోతున్నారు. → 78 ఏళ్ల వయసులో ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నిక ల్లో గెలిచారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన అత్యంత వృద్ధుడు ట్రంప్. → గత 20 సంవత్సరాల్లో పాపులర్ ఓటుతో గెలిచిన మొదటి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌చరిత్రలో అతిపెద్ద పునరాగమనం నాలుగేళ్ల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేక ఆయన అభిమానులు రాజధాని వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనం వద్ద వీరంగం సృష్టించారు. వారి నిరసన హింసాత్మకంగా మారింది. ఈ వ్యవహారం చివరకు ట్రంప్ మెడకు చుట్టుకుంది. 2020 నాటి ఎన్నికల్లో పరాజయంతో ట్రంప్ రాజకీయ జీవితం ముగిసినట్లేనని అప్పట్లో రాజకీయ పరిశీలకులు తేల్చిచెప్పారు. పలు వివాదాల్లో ఇరుక్కుపోవడంతోపాటు హష్ మనీ కేసులో దోషిగా తేలిన ట్రంప్ ఇక ఎప్పటికీ రాజకీయ రంగంలో కనిపించే అవకాశం లేదని వాదించారు. వారి అభిప్రాయాలను ఫటాపంచలు చేస్తూ ట్రంప్ మరోసారి సమరోత్సాహంతో దూసుకొచ్చారు. 78 ఏళ్ల వయసులో అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మరోసారి వైట్‌హౌస్‌లో కాలు పెట్టబోతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్
టాప్–20 నుంచి కోహ్లి, రోహిత్ అవుట్
దుబాయ్: న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఘోరంగా విఫలం కావడంతో ఆ ప్రభావం వారిద్దరి ర్యాంకింగ్స్‌పై కూడా పడింది. బుధవారం విడుదలైన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి, రోహిత్ శర్మ టాప్–20లో చోటు కోల్పోయారు. కోహ్లి ఎనిమిది స్థానాలు దిగజారి 22వ ర్యాంక్‌లో, రోహిత్ రెండు స్థానాలు పడిపోయి 26వ ర్యాంక్‌లో నిలిచారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో కోహ్లి 93 పరుగులు, రోహిత్ 91 పరుగులు సాధించడం గమనార్హం. మరోవైపు భారత్‌కే చెందిన యశస్వి జైస్వాల్ ఒక స్థానం పడిపోయి నాలుగో ర్యాంక్‌లో నిలువగా... రిషబ్ పంత్ ఐదు స్థానాలు మెరుగై ఆరో ర్యాంక్‌లోకి వచ్చాడు. శుబ్‌మన్ గిల్ నాలుగు స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్‌లో నిలిచాడు.
విష్ణుప్రియ గుండె ముక్కలు.. కొత్త మెగా చీఫ్ ఎవరంటే?
మెగా చీఫ్ కంటెండర్‌షిప్ కోసం హౌస్‌లో పోటీలు జరిగాయి. యష్మి, విష్ణుప్రియ, ప్రేరణ.. ముగ్గురూ టఫ్ టాస్కులోనూ కష్టపడి ఆడారు. అటు బిగ్‌బాస్ గాసిప్స్ వినాలని తహతహలాడిపోయాడు. ఇంకా ఏం జరిగిందో తెలియాలంటే నేటి (నవంబర్ 6) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..కీని పట్టు.. కంటెండర్‌షిప్‌ను గెలిచేట్టుఇప్పటికే రోహిణి, నబీల్ కంటెండర్‌షిప్ బ్యాడ్జులు గెలిచారు. మిగిలిన పృథ్వీ కోసం 'కీని పట్టు.. కంటెండర్‌షిప్‌ను గెలిచేట్టు' అనే గేమ్ ఇచ్చాడు. ముందుగా తాళాలు సంపాదించి అన్ని బాక్సులు ఓపెన్ చేసినవారు గెలుస్తారు. పృథ్వీతో ఎవరు తలబడాలనుకుంటున్నారో చెప్పాలనగా దాదాపు హౌస్‌మేట్స్ అందరూ ముందుకొచ్చారు. దీంతో పృథ్వీ.. అందరిలో నుంచి విష్ణుప్రియను సెలక్ట్ చేసుకున్నాడు. అలా పృథ్వీ, విష్ణు ఆడారు.విష్ణును బోల్తా కొట్టించిన పృథ్వీఈ గేమ్‌లో పృథ్వీ అతి తెలివితో విష్ణుప్రియను బురిడీ కొట్టించి గెలిచేశాడు. అలాగే కంటెండర్‌షిప్ బ్యాడ్జ్ ధరించాడు. అతడి సూట్‌కేస్‌లో రూ.99,000 ఉండగా.. అవి ప్రైజ్‌మనీలో యాడ్ అయ్యాయి. పృథ్వీకి ఒకర్ని చీఫ్ కంటెండర్ చేసే ఛాన్స్ ఉండగా ఆ అవకాశాన్ని అతడు విష్ణుప్రియకు ఇచ్చాడు. ఆ తర్వాత నువ్వు చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటావు.. నిన్ను ఆదర్శంగా తీసుకుని చాలా మారిపోయాను అంటూ విష్ణుతో కబుర్లాడాడు పృథ్వీ.మెలిక పెట్టిన బిగ్‌బాస్‌ఇకపోతే బ్యాడ్జులు గెలిచిన నబీల్, పృథ్వీ, రోహిణి.. యష్మి, విష్ణుప్రియ, ప్రేరణలను కంటెండర్లుగా సెలక్ట్ చేశారు. ఈ ముగ్గురికీ బిగ్‌బాస్ ఇసుక బస్తాలతో గేమ్ పెట్టాడు. ఇందులో ప్రేరణ విజయం సాధించి కంటెండర్‌షిప్ బ్యాడ్జ్ ధరించింది. అలాగే తన దగ్గరున్న సూట్‌కేసులో రూ.1 లక్ష ఉంది. ఇక్కడే బిగ్‌బాస్ ఓ మెలిక పెట్టాడు. ఈ సూట్‌కేసుకు బదులుగా మిస్టరీ సూట్‌కేస్ సెలక్ట్ చేసుకోవచ్చన్నాడు. దీంతో పాతది వదిలేసి మిస్టరీ సూట్‌కేస్ తెరిచింది. తీరా చూస్తే ఆశ్చర్యంగా అందులో రూ.2,10,00 ఉన్నాయి. ఇది విన్నర్ ప్రైజ్‌మనీలో జమైంది.అంతమాట అనేసిందేంటి?గంగవ్వ.. ప్రేమపక్షులు పృథ్వీ, విష్ణులను అన్నాచెల్లి అనేసింది. పృథ్వీకి విష్ణు చెల్లిలా అన్నీ దగ్గరుండి చేసి పెడుతుందని మెచ్చుకుంది. అక్కడ చెల్లి అనే పదం విని విష్ణు గుండె ముక్కలైంది. చెల్లి కాదు, అతడంటే ప్రేమ అని విష్ణు చెప్తున్నా కూడా అవన్నీ కుదరవని తీర్పు చెప్పింది. అనంతరం బిగ్‌బాస్.. తేజను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి అతడి ముందు కేక్ పెట్టాడు. కేక్ కావాలంటే ఇంటిసభ్యుల గురించి ఒక మంచి గాసిప్ చెప్పాలన్నాడు.అప్పట్లో ట్రయాంగిల్.. ఇప్పుడైతే..దీంతో తేజ.. గౌతమ్- యష్మి- నిఖిల్ మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీ నడిచిందని కానీ ఇప్పుడు అది లేదన్నాడు. గౌతమ్- యష్మి మధ్య అక్కాతమ్ముళ్ల అనుబంధం, నిఖిల్- యష్మి మధ్య ఫ్రెండ్‌షిప్ ఉందన్నాడు. నీకు ఎవరు క్రష్ అని బిగ్‌బాస్ అడగడంతో పడీపడీ నవ్విన తేజ.. క్రష్ కాదుగానీ ప్రేరణతో మంచి అనుబంధం ఏర్పడిందన్నాడు. కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తేజ అసలు విషయం చెప్పకుండా.. యష్మి సూట్‌కేస్ ఎవరికైనా ఒకరికి ఇవ్వాలని బిగ్‌బాస్ చెప్పాడంటూ అబద్ధమాడాడు. తేజ పెట్టిన పెంటఅది నిజమని నమ్మిన యష్మి.. వెంటనే తన సూట్‌కేసును గౌతమ్‌కు ఇచ్చింది. పోయినవారం అతడిని రేస్ నుంచి తీసేసినందుకు ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంది. కానీ పృథ్వీ అందుకు ఒప్పుకోలేదు. అతడికెందుకు ఇస్తావంటూ కోపంగా మాట్లాడాడు. దీంతో యష్మి ఫీలైంది. అది చూసిన విష్ణు.. ఈ అబ్బాయిలు డిక్టేటర్‌గా మనల్ని రూల్ చేయడమేంటని అసహనం వ్యక్తం చేసింది.గాసిప్ చెప్తే కేక్ ఫ్రీఅటు ప్రేరణను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ ఏదైనా గాసిప్ చెప్తే కేక్ తినొచ్చన్నాడు. నిఖిల్‌కు యష్మి అంటే ఇష్టం.. కానీ, అందరి ముందు బయటపడటం లేదు అని తెలిపింది. ఈ ఇంట్లో అందరికంటే జెన్యూన్ ఎవరని అడగ్గా గంగవ్వ పేరు చెప్పింది. ఇకపోతే ఎంతోకాలంగా మెగా చీఫ్ పోస్ట్ కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న ప్రేరణ ఎట్టకేలకు చీఫ్ పదవిని కైవసం చేసుకున్నట్లు భోగట్టా!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రూ.2,610 కోట్ల అక్రమ డిపాజిట్లు..18 ఏళ్లుగా జిత్తులు!
USA Presidential Election Results 2024: హారిస్.. ఐదు వైఫల్యాలు
టాప్–20 నుంచి కోహ్లి, రోహిత్ అవుట్
అరోనియన్‌తో అర్జున్ గేమ్ ‘డ్రా’
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 'ట్రంప్ 2.0'
USA Presidential Election Results 2024: విజయానికి ఐదు మెట్లు
Sakshi Cartoon: ట్రంప్ గెలుపు
ఎవరు తాతా ఇతను!
ది ప్యారడైజ్
The Great Indian Kapil Show: చూతము రారండీ
ఎవరికో ఒకరికి క్లాస్ పీకుతుంటేనే బెటర్!
Akaay: కోహ్లి బర్త్‌డే.. తొలిసారి కుమారుడి ఫొటో షేర్ చేసిన అనుష్క
నిన్నటి వరకు ఓ లెక్క.. ఇప్పుడు మరో లెక్క: నేటి బంగారం ధరలు ఇవే..
పట్ట చీరలకు కేరాఫ్ అడ్రస్ ఆ ఊరు..!
నా మొదటి భార్య అలాంటిది.. అందుకే రెండో పెళ్లి: నటుడు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. విరాట్ కోహ్లికి గుడ్ టైమ్ స్టార్ట్ కానుందా..?
రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ డిమాండ్!
రవితేజ వారసుడి చిత్రం.. ఆ సాంగ్ వచ్చేసింది!
కమలా హారిస్ స్వగ్రామంలో ఉత్సవ వాతావరణం
ఈ రాశి వారు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు
రూ.2,610 కోట్ల అక్రమ డిపాజిట్లు..18 ఏళ్లుగా జిత్తులు!
USA Presidential Election Results 2024: హారిస్.. ఐదు వైఫల్యాలు
టాప్–20 నుంచి కోహ్లి, రోహిత్ అవుట్
అరోనియన్‌తో అర్జున్ గేమ్ ‘డ్రా’
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 'ట్రంప్ 2.0'
USA Presidential Election Results 2024: విజయానికి ఐదు మెట్లు
Sakshi Cartoon: ట్రంప్ గెలుపు
ఎవరు తాతా ఇతను!
ది ప్యారడైజ్
The Great Indian Kapil Show: చూతము రారండీ
ఎవరికో ఒకరికి క్లాస్ పీకుతుంటేనే బెటర్!
Akaay: కోహ్లి బర్త్‌డే.. తొలిసారి కుమారుడి ఫొటో షేర్ చేసిన అనుష్క
నిన్నటి వరకు ఓ లెక్క.. ఇప్పుడు మరో లెక్క: నేటి బంగారం ధరలు ఇవే..
పట్ట చీరలకు కేరాఫ్ అడ్రస్ ఆ ఊరు..!
నా మొదటి భార్య అలాంటిది.. అందుకే రెండో పెళ్లి: నటుడు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. విరాట్ కోహ్లికి గుడ్ టైమ్ స్టార్ట్ కానుందా..?
రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ డిమాండ్!
రవితేజ వారసుడి చిత్రం.. ఆ సాంగ్ వచ్చేసింది!
కమలా హారిస్ స్వగ్రామంలో ఉత్సవ వాతావరణం
ఈ రాశి వారు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు
సినిమా
అమరన్ సక్సెస్.. నితిన్ సినిమా సాంగ్ పాడిన శివ కార్తికేయన్
తమిళ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అమరన్. వీరసైనికుడు ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆరు రోజుల్లో రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో బుధవారం నాడు హైదరాబాద్‌లో సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో నితిన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.మా నాన్న కూడా..శివకార్తికేయన్ మాట్లాడుతూ.. అమరన్ సినిమాలో ముకుంద్ క్యారెక్టర్ చేయడానికి కారణం మా నాన్న. ఆయన పోలీసాఫీసర్. డ్యూటీలోనే మరణించారు. సినిమా రిలీజైనప్పటినుంచి నితిన్ ప్రతిరోజు కాల్ చేసి అప్డేట్స్ చెప్తూనే ఉన్నారు అని పేర్కొన్నాడు. అభిమానుల కోసం ఓ పాట కూడా పాడాడు. ఓ ప్రియా ప్రియా.. తెలుసా నీకైనా.. అంటూ నితిన్ ఇష్క్ సినిమాలోని పాటను రెండు లైన్లు ఆలపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సినిమాఅమరన్ సినిమా విషయానికి వస్తే ఇందులో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రేమమ్ నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. పోలీసులు ఏం తేల్చారంటే?
ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌలీపై గతంలోనే లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. సినిమాల్లో అవకాశం పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ యువ నటి ఫిర్యాదు చేసింది. దుబాయ్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురిపై యువతి ఆరోపణలు చేసింది. దీంతో అప్పట్లోనే నివిన్ పౌలీతో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు నటులపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.అయితే ఆ తర్వాత జరిగిన విచారణలో నటుడు నివిన్ పౌలీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. తాజాగా ఈ కేసులో నివిన్ పౌలీకి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. యువతి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సంఘటన జరిగిన సమయంలో నివిన్ పౌలీ అక్కడ లేరని గుర్తించినట్లు తెలిపారు. అతను లైంగికంగా వేధించినట్లు స్పష్టమైన ఆధారాలు తమకు లభించలేదని కొత్తమంగళం కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించారు. దీంతో ఆరో నిందితుడిగా ఉన్న ఆయన పేరును తొలగించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే మిగిలిన నిందితుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా.. నివిన్ పౌలీ మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ప్రేమమ్ చిత్రంలో నటించారు.
'ఇక నుంచి నువ్వు మా తెలుగు హీరో'.. నితిన్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. అమరన్ రిలీజైన ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. మొదటి రోజే రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.102 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ హీరో నితిన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరన్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రానికి హీరోయిన్ సాయిపల్లవి బ్యాక్‌బోన్ అంటూ కొనియాడారు. మీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని.. ఏదో ఒకరోజు మీతో డ్యాన్స్ చేయాలని ఉందని అన్నారు. త్వరలోనే ఆ రోజు రావాలని కోరుకుంటున్నానని నితిన్ తెలిపారు.శివ కార్తికేయన్‌తో నాకు ప్రత్యేక అనుబంధముందని హీరో నితిన్ అన్నారు. హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ గత నాలుగేళ్లుగా మేము కలవడానికి కుదర్లేదన్నారు. చాలా రోజుల తర్వాత మేమిద్దరం కలిశామని సంతోషం వ్యక్తం చేశారు. అమరన్ సినిమాకు శివ కార్తికేయన్ చాలా కష్టపడ్డారని.. ఇక నుంచి మా తెలుగు హీరో, మా తెలుగబ్బాయి అయిపోయాడని నితిన్ అన్నారు. కాగా.. నితిన్ ప్రస్తుతం రాబిన్‌హుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రష్మిక మందన్నా హీరోయిన్లుగా కనిపించనున్నారు.
మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు
ప్రముఖ బుల్లితెర నటి రూపాలీ గంగూలీ తనను ఎంతో వేధించిందంటోంది ఆమె సవతి కూతురు ఈషా. తన తండ్రిని తమకు దూరం చేసిందని, మా పేరెంట్స్‌ను విడగొట్టిందని ఆరోపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాలుగేళ్ల కిందట నేను పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరలవుతోంది. దీన్ని రూపాలి, నాన్న (అశ్విన్) ఎలా సమర్థించుకుంటారో అర్థం కావట్లేదు.పేరెంట్స్ బెడ్రూమ్లో తిష్టఅప్పటికీ మా నాన్న ఎక్స్(ట్విటర్)లో ఈ గొడవకు, రూపాలీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు. అది అన్నింటికంటే పెద్ద అబద్ధం. ఎందుకంటే అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న మా ఇంటికి రూపాలీ తరచూ వచ్చేది. మా అమ్మ నాన్నతో షేర్ చేసుకున్న బెడ్‌పైనే తనూ నిద్రించేది. ఆమె నన్ను, మా అమ్మను శారీరకంగా, మానసికంగా వేధించింది. మాటలతో చిత్రవధ చేసింది. ఆమె వల్ల ఎంతో నరకం అనుభవించాం.సీరియల్లో హీరోయిన్.. బయట విలన్నాన్న-రూపాలీ ఎఫైర్ వ్యవహారంలో ఇద్దరి తప్పు ఉంది. రూపాలీ ప్రధాన పాత్రలో నటించే అనుపమ సీరియల్లో.. ఆమె భర్త మరొకరితో ఎఫైర్ పెట్టుకుని తనను మోసం చేస్తాడు. ఆమె తనకోసమే కాకుండా మహిళలందరి పక్షాన నిలబడి పోరాడుతున్నట్లు ప్రవర్తిస్తుంటుంది. మరి నిజ జీవితంలో ఏం జరిగింది? ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న మా జీవితాల్లో అడుగుపెట్టింది. మా అమ్మను, నాన్నను విడదీసింది. శాశ్వతంగా విడగొట్టాలని ప్రయత్నాలుబలవంతంగా మా నాన్నతో రెండుసార్లు విడాకుల పత్రాలు పంపించింది. రూపాలీ కోసం మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇండియాకు వెళ్లిపోయాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫైర్ పెట్టుకోవడమనేది చాలా పెద్ద తప్పు అని ఈషా చెప్పుకొచ్చింది. కాగా అశ్విక్ కె వర్మ.. 1997లో సప్నను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఈషాతో పాటు మరో కూతురు సంతానం. 2013లో అశ్విన్.. నటి రూపాలీ గంగూలీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రుద్రాన్ష్ అనే కుమారుడు జన్మించాడు. View this post on Instagram A post shared by Esha Verma (@eshav.official) చదవండి: రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో భూముల మార్కెట్ విలువ అమాంతం పెంచేందుకు సిద్ధమవుతున్న కూటమి సర్కార్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్ చార్జీల పిడుగు. ఏకంగా 11వేల కోట్ల రూపాయల ట్రూ అప్ చార్జీల భారం మోపే చాన్స్
సంపద సృష్టించడం అంటే ప్రభుత్వ భూములు విక్రయించడమేనా? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర రాజకీయాలు.. డైవర్షన్ పాలిటిక్స్‌పై జనం ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో కొందరికే గ్యాస్ సిలిండర్ పథకం... 55 లక్షల మంది లబ్ధిదారులకు పథకాన్ని ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం యత్నం
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. కచ్ బోర్డర్లో జవాన్లతో కలిసి ప్రధాని మోదీ వేడుకలు
జనగణనలోనే ఓబీసీ కులగణన చేపట్టాలి... కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానం
కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఐక్యంగా పోరాడండి... వైఎస్సార్‌సీపీ నాయకులకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు.. ఇంకా ఇతర అప్డేట్స్
జనగణన వచ్చే ఏడాదే షురూ!. కేంద్రం కీలక నిర్ణయం. 2026 నాటికి ప్రక్రియ పూర్తి. తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన?
కరెంట్ చార్జీల పెంచడమే దీపావళి కానుకా?.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
క్రీడలు
Ranji Trophy: చరిత్ర సృష్టించిన జలజ్ సక్సేనా
కేరళ ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా సరికొత్త చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీలో 6000 పరుగులు సహా 400 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఎలైట్ గ్రూప్-సిలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సక్సేనా 400 వికెట్ల మార్కును క్రాస్ చేశాడు. సక్సేనా బెంగాల్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 6000 పరుగుల మార్కును తాకాడు. యూపీతో జరుగుతున్న మ్యాచ్‌లో నితీశ్ రాణా వికెట్ తీయడంతో సక్సేనా 400 వికెట్ల క్లబ్లో చేరాడు. సక్సేనా ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన కూడా నమోదు చేశాడు. రంజీ కెరీర్లో అతనికి ఇది 29వ ఐదు వికెట్ల ఘనత. 37 ఏళ్ల సక్సేనా రంజీ చరిత్రలో 400 వికెట్లు తీసిన 13వ బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు. 2005లో మధ్యప్రదేశ్‌తో తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను మొదలుపెట్టిన సక్సేనా.. ఆ రాష్ట్రం తరఫున 11 ఏళ్ల వ్యవధిలో 159 వికెట్లు, 4041 పరుగులు స్కోర్ చేశాడు. ఆతర్వాత 2016-17 సీజన్ నుంచి సక్సేనా కేరళ జట్టుకు మారాడు. ప్రస్తుతం సక్సేనా కేరళ తరఫున రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. కేఎన్ అనంతపద్మనాభన్ టాప్‌లో ఉన్నాడు. సక్సేనా గత రంజీ సీజన్లో దిగ్గజాల సరసన చేరాడు. భారత దేశవాలీ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో) 9000 పరుగులు, 600 వికెట్లు తీసిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. సక్సేనాకు ముందు వినూ మన్కడ్, మదన్‌లాల్, పర్వేజ్ రసూల్ మాత్రమే ఈ ఘనత సాధించారు.మ్యాచ్ విషయానికొస్తే.. జలజ్ సక్సేనా విజృంభించడంతో (5/56) ఉత్తర్‌ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు ఆలౌటైంది. కేరళ బౌలర్లలో బాసిల్ థంపి 2, సర్వటే, కేఎమ్ ఆసిఫ్, అపరాజిత్ తలో వికెట్ పడగొట్టారు. యూపీ ఇన్నింగ్స్‌లో 10వ నంబర్ ఆటగాడు శివమ్ శర్మ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. బాబా అపరాజిత్ (21), సర్వటే (4) క్రీజ్‌లో ఉన్నారు. యూపీ బౌలర్లలో శివమ్ మావి, ఆకిబ్ ఖాన్లకు తలో వికెట్ దక్కింది. యూపీ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కేరళ ఇంకా 80 పరుగులు వెనుకపడి ఉంది. చదవండి: సెలెక్టర్లకు సవాలు విసిరిన శ్రేయస్ అయ్యర్.. వరుసగా రెండు సెంచరీలు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. విరాట్ కోహ్లికి గుడ్ టైమ్ స్టార్ట్ కానుందా..?
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాడు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన ట్రంప్.. డెమోక్రాట్ అభ్యర్థి కమలా హ్యారిస్‌పై ఘన విజయం సాధించాడు.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. విరాట్‌కు గుడ్ టైమ్ స్టార్ట్ కానుందా..?ఇక్కడ ట్రంప్ ఎన్నికకు విరాట్ కోహ్లికి సంబంధం ఏముందని అనుకుంటున్నారా..? అయితే ఈ లెక్కలు చూడండి విషయం మీకే అర్థమవుతుంది. కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి 2015 వరకు విరాట్ కోహ్లికి బ్యాటర్‌గా మంచి సక్సెసే వచ్చింది. అయితే ఇవన్ని అతనికి తగినంత ఫేమ్ తెచ్చిపెట్టలేదు.2016 నుంచి విరాట్‌కు ప్రపంచ మేటి బ్యాటర్‌గా గుర్తింపు రావడం మొదలైంది. 2016 నుంచి 2021 వరకు విరాట్ అడ్డూఅదుపూ లేకుండా క్రికెట్లోని దాదాపు అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ ఐదేళ్ల కాలంలో విరాట్ తన సమకాలీకులకు అందంనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఈ మధ్యకాలంలో విరాట్ ఫార్మాట్లకతీతంగా అత్యుత్తమ ప్రదర్శనలు నమోదు చేశాడు.విరాట్ హవా పీక్స్‌లో కొనసాగుతున్న కాలంలోనే (2016-2021) ట్రంప్ అమెరికాకు తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ట్రంప్ అమెరికాకు తొలి దఫా అధ్యక్షుడిగా ఉన్నంతకాలం విరాట్ ప్రపంచ క్రికెట్‌ను మకుటం లేని మహారాజుగా శాశించాడు. ట్రంప్ 2016 నవంబర్‌లో అమెరికాకు తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నిక కాగా.. సరిగ్గా అదే సమయం నుంచి విరాట్‌కు గుడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది.ట్రంప్ ఓడిపోవడంతో విరాట్‌కు బ్యాడ్ టైమ్..!2020లో ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడంతో విరాట్‌కు కూడా బ్యాడ్ టైమ్ స్టార్ అయ్యింది. 2021 నుంచి 2023 మధ్య వరకు విరాట్ తన కెరీర్లో ఎన్నడూ ఎదుర్కోని గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నాడు. 2021, 2022లో అయితే విరాట్ అదఃపాతాలానికి పడిపోయాడు. ఈ రెండేళ్లలో విరాట్ బ్యాట్ నుంచి చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్సూ లేదు.విరాట్ 2023లో అడపాదడపా ఫామ్‌ను అందుకున్నా తిరిగి 2024లో తన ఫామ్‌ను కోల్పోయాడు. ఈ ఏడాది ఇప్పటివరకు విరాట్ బ్యాట్ నుంచి ఒక్క మంచి ఇన్నింగ్స్ జాలువారలేదు. ఈ ఏడాది ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కనీసం ఇప్పటి నుంచైనా విరాట్‌కు మంచి టైమ్ స్టార్ అవుతుందేమో వేచి చూద్దాం.
దశాబ్దకాలం తర్వాత విరాట్ కోహ్లి చేదు అనుభవం
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి దశాబ్దకాలం తర్వాత చేదు అనుభవం ఎదురైంది. 10 ఏళ్ల తర్వాత విరాట్ ఐసీసీ టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-20లో నుంచి బయటికి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పేలవ ప్రదర్శన తర్వాత విరాట్ 8 స్థానాలు కోల్పోయి 22వ స్థానానికి పడిపోయాడు. టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ ముంబై టెస్ట్‌లో తన ట్విన్ ఫిఫ్టీలకు రివార్డ్ పొందాడు. పంత్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి చేరుకున్నాడు.న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 8 స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకాడు. టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓ స్థానం కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోగా.. జో రూట్, కేన్ విలియమ్సన్ టాప్-2 బ్యాటర్లుగా కొనసాగుతున్నారు. ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు. స్టీవ్ స్మిత్ ఐదో స్థానంలో.. ఉస్మాన్ ఖ్వాజా, సౌద్ షకీల్, మార్నస్ లబూషేన్, కమిందు మెండిస్ తలో రెండు స్థానాలు కోల్పోయి 8 నుంచి 11 స్థానాల్లో ఉన్నారు. లంక ఆటగాళ్లు దిముత్ కరుణరత్నే, ధనంజయ డిసిల్వ తలో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 14, 15 స్థానాలకు ఎగబాకగా.. టీమిండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 16వ స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు స్థానాలు కోల్పోయి 26వ స్థానానికి పడిపోయాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ముంబై టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై పది వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తర్వాత రవీంద్ర జడేజా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకాడు. దక్షిణాఫ్రికా పేసర్ రబాడ, ఆసీస్ స్పీడ్‌స్టర్ హాజిల్‌వుడ్, టీమిండియా పేసు గుర్రం బుమ్రా టాప్-3 బౌలర్లుగా కొనసాగుతుండగా.. ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ ఓ స్థానం మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్.. ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోగా.. నాథన్ లయోన్, ప్రభాత్ జయసూర్య, నౌమన్ అలీ, మ్యాట్ హెన్రీ టాప్-10లో ఉన్నారు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ టాప్-2 ఆల్రౌండర్లుగా కొనసాగుతుండగా.. అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
‘ఆర్సీబీతో నా ప్రయాణం ముగియలేదు.. నన్ను మళ్లీ కొనుక్కుంటారు’
ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో తన ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని పేర్కొన్నాడు. వేలంపాటలో ఫ్రాంఛైజీ తనను తిరిగి కొనుక్కునే అవకాశం ఉందన్నాడు.బాధ లేదు..ఇక రిటెన్షన్ విషయంలో ఆర్సీబీ వ్యూహాలు పక్కాగా ఉన్నాయన్న మాక్సీ.. తనను విడిచిపెట్టడం వల్ల పెద్దగా బాధ కలగలేదని తెలిపాడు. కాగా ఈసారి ఆర్సీబీ కేవలం ముగ్గురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి సహా రజత్ పాటిదార్, యశ్ దయాళ్‌లను అట్టిపెట్టుకుని.. మిగతా ప్లేయర్లందరినీ రిలీజ్ చేసింది.ఈసారి పర్సు వాల్యూ రూ. 120 కోట్లకు పెంచడంతో.. రిటెన్షన్స్ పోనూ ఆర్సీబీ పర్సులో రూ. 83 కోట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాక్స్వెల్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘వారు ఏం చేయబోతున్నారో నాకు పూర్తిగా అర్థమైంది. పటిష్టమైన జట్టును నిర్మించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.ఆర్సీబీతో నా ప్రయాణం ఇంకా ముగియలేదుముఖ్యంగా స్థానిక ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటికీ ఆర్సీబీతో నా ప్రయాణం ఇంకా ముగియలేదు. నేను తిరిగి అక్కడికి వెళ్లాలనే కోరుకుంటున్నాను. ఆర్సీబీ అద్భుతమైన ఫ్రాంఛైజీ. అక్కడి వారితో నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.రిటెన్షన్ సమయంలోనూ నాకు వారి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఆండీ ఫ్లవర్ , మొ బొబాట్ నాకు జూమ్ కాల్లో అంతా వివరించారు. వారి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పారు. నాకు వారు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని హర్షం వ్యక్తం చేశాడు. నిరాశపరిచిన మాక్సీకాగా పదకొండు కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి కొనుగోలు చేస్తే మాక్సీ ఐపీఎల్-2024లో ఆర్సీబీ యాజమాన్యాన్ని పూర్తిగా నిరాశపరిచాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 52 పరుగులే చేశాడు. అయితే, తనదైన రోజు చెలరేగి ఆడే ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్‌ను ఆర్సీబీ రైట్ టూ మ్యాచ్ కార్డు ద్వారా తిరిగి సొంతం చేసుకున్నా ఆశ్చర్యం లేదు. ఇక ఆర్సీబీ స్టార్, టీమిండియా కింగ్ విరాట్ కోహ్లితో మాక్సీకి మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. నవంబరు 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో ఐపీఎల్-2025 మెగా వేలం జరుగనుంది.చదవండి: Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే
బిజినెస్
ఆఫీస్‌కు రండి.. లేదా కంపెనీ మారండి!
ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులకు అమెజాన్ ఇకపై పూర్తిగా ఆఫీస్ నుంచి పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జనవరి, 2025 నుంచి వారానికి ఐదు రోజులు కార్యాలయం నుంచే పని చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) సీఈఓ మాట్ గార్మాన్ స్పష్టం చేశారు. కంపెనీ వృద్ధి కోసం విభిన్న ఆలోచనలు పంచుకునేందుకు ఉద్యోగుల వ్యక్తిగత సహకారం అవసరమని తెలిపారు.పదిలో తొమ్మిది మంది ఓకేఈ సందర్భంగా గార్మాన్ మాట్లాడుతూ..‘కంపెనీ వృద్ధికి ఉద్యోగులు సహకరించాలి. ఇప్పటి వరకు చాలామంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఇకపై ఈ విధానం మారనుంది. 2025, జనవరి నుంచి ఉద్యోగులు పూర్తిగా కార్యాలయం నుంచే పని చేయాల్సి ఉంటుంది. ఈ చర్య సంస్థ ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతున్నాం. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడని వారు ఇతర సంస్థల్లో చేరవచ్చు. పూర్తి సమయం పని చేసేందుకు ఇష్టపడని ఉద్యోగుల కోసం ఇతర కంపెనీలు వారి అవసరాలకు బాగా సరిపోయే పని వాతావరణాన్ని అందించవచ్చు. చాలా మంది ఉద్యోగులు మార్పుకు మద్దతు ఇస్తున్నారు. నేను మాట్లాడిన పది మంది ఉద్యోగుల్లో తొమ్మిది మంది కంపెనీ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నారు’ అని గార్మాన్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మస్క్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు: ఆయనో మేధావి అంటూ..ఉత్పాదకత పెరుగుతున్నట్లు ఆధారాలు లేవుఇదిలాఉండగా, చాలా మంది అమెజాన్ ఉద్యోగులు కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐదు రోజులు కార్యాలయంలో పని చేసేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. ఆఫీస్‌లో పని చేయడం ద్వారా ఉత్పాదకత మెరుగవుతుందనడానికి స్పష్టమైన ఆధారాలు లేవన్నారు. కార్యాలయానికి వెళితే అనవసరమైన ప్రయాణ సమయం, ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఇప్పటి వరకు అమెజాన్ తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు కార్యాలయంలో పని చేయాలని కోరింది. కొంతమంది ఉద్యోగులు ఇప్పటికీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను వారానికి రెండు లేదా మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేయడానికి అనుమతించింది. ఈ విధానాన్ని కాదని అమెజాన్ ఐదు రోజులు ఆఫీస్‌కు రమ్మనడం తగదని కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
ఎలాన్ మస్క్‌పై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల జల్లు
యూఎస్ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ వీడింది. రిపబ్లికన్ పార్టీ భారీ మెజారిటీతో దూసుకుపోతోంది. దీంతో అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఫ్లోరిడాలో ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ.. అధ్యక్ష ఎన్నికలలో టెస్లా అధినేత 'ఎలాన్ మస్క్' ముఖ్యమైన వ్యక్తి అని కొనియాడారు.ఒక స్టార్ ఉంది.. అని మస్క్ గురించి మాట్లాడుతూ.. అతను ఒక మేధావి. మన మేధావులను మనం రక్షించుకోవాలి. అంతే కాకుండా తన సంస్థ స్పేస్ ఎక్స్ ప్రయత్నాలతో అమెరికా అంతరిక్ష రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మస్క్ చేసిన కృషిని కూడా ఈ సందర్భంగా కొనియాడారు.ట్రంప్ ప్రసంగం సమయంలో మస్క్ స్వయంగా ఈవెంట్‌కు హాజరు కానప్పటికీ.. ఓటింగ్ రోజు వరకు రిపబ్లిక్ అభ్యర్థి ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. మొత్తానికి ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ ఆశించిన విధంగానే.. ట్రంప్ మరో మారు అమెరికా అధ్యక్ష పదవిని అలంకరించబోతున్నారు.'ట్రంప్'కు మద్దతుగా మస్క్ ఫిలడెల్ఫియా ప్రాంతంలో అక్టోబర్ 17న తొలి వ్యక్తిగత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంతకు ముందు ట్రంప్ పాలనలో చోటు చేసుకున్న ముఖ్యమైన అంశాలను గురించి వెల్లడించారు. అప్పటి నుంచి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం.. మస్క్ గట్టిగా కృషి చేస్తూనే ఉన్నారు.చదవండి: తెలుగింటి అల్లుడిపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలుట్రంక్ విజయం కోసం మస్క్ ప్రచారం చేయడం మాత్రమే కాకుండా.. భారీ మొత్తంలో ఎలక్షన్ ఫండ్స్ కూడా సమకూర్చారు. స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రైజ్ మనీరూపంలో 100 డాలర్లు ఇస్తామని కూడా ప్రకటించారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికే ఈ ప్రైజ్ మనీ అని డెమోక్రట్లు ఆరోపించారు.జోష్‌లో ఎలాన్ మస్క్డొనాల్డ్ ట్రంప్ ఘన విజయంతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అమెరికా భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని పేర్కొంటూ.. అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న రాకెట్ ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశారు. అమెరికా ప్రజలు మార్పు కోసం ఓటు వేశారని, డొనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ స్పష్టమైన తీర్పు ఇచ్చారని మస్క్ వ్యాఖ్యానించారు. The future is gonna be fantastic pic.twitter.com/I46tFsHxs3— Elon Musk (@elonmusk) November 6, 2024
స్కోడా కొత్త కారు 'కైలాక్' వచ్చేసింది: రూ.7.89 లక్షలు మాత్రమే
దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా మరో కాంపాక్ట్ ఎస్‌యూవీని 'కైలాక్' (Kylaq) పేరుతో లాంచ్ చేసింది. ప్రత్యేకంగా భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ కారును లాంచ్ చేసింది. దీని ధర రూ. 7.89 లక్షలతో ప్రారంభమవుతుంది. ఈ కారు కోసం 2024 డిసెంబర్ 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభమవుతుంది.ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఇతర స్కోడా కార్ల కంటే కైలాక్ కొంత భిన్నంగా ఉండటం చూడవచ్చు. 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందిన ఈ ఎస్యూవీ డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, లెథెరెట్ అప్హోల్స్టరీ, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, యాంబియంట్ లైటింగ్, సిక్స్-స్పీకర్ కాంటన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ పొందుతుంది.ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు, హెడ్‌రెస్ట్‌లు, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా కైలాక్ కారులో అందుబాటులో ఉన్నాయి. 189 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ కారు బూట్ స్పేస్ 1265 లీటర్ల వరకు ఉంటుంది.స్కోడా కైలాక్ 1.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 114 Bhp పవర్, 178 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ కొత్త కారు మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, మారుతి ఫ్రాంక్స్, బ్రెజ్జా, టయోటా టైసర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌గా ఇండిగో కో-ఫౌండర్
ఇండిగో కో-ఫౌండర్ 'రాకేష్ గంగ్వాల్' అమెరికాలోనే ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటైన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. జులైలో బోర్డులో మెంబర్‌షిప్‌గా చేరిన గంగ్వాల్.. ఇటీవల 108 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 900 కోట్లు) విలువైన షేర్స్ కొనుగోలు చేశారు.కొత్త బోర్డు కమిటీ అధ్యక్షుల పేర్లతో పాటుగా గంగ్వాల్ స్వతంత్ర బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని ప్రకటించింది. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ తిరిగి బలమైన ఆర్థిక పనితీరుకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రెసిడెంట్, సీఈఓ బాబ్ జోర్డాన్ సహకారం కూడా ఉంటుందని గంగ్వాల్ పేర్కొన్నారు.సెప్టెంబరు 30, అక్టోబరు ప్రారంభంలో గంగ్వాల్ 3.6 మిలియన్ షేర్లను సౌత్‌వెస్ట్‌లో కొనుగోలు చేశారు. ఒక్కో షేరుకు 29 డాలర్ల నుంచి 30 డాలర్ల మధ్యలో ఉన్నాయి. మొత్తం పెట్టుబడి 108 మిలియన్ డాలర్లు. గంగ్వాల్ వరల్డ్‌స్పాన్ టెక్నాలజీస్‌కు చైర్మన్ & సీఈఓగా కూడా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఈయన ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్ధి. 2022లో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీని స్థాపించారు.
ఫ్యామిలీ
న్యాయ సలహా : మిమ్మల్ని వెళ్లగొట్టే హక్కు వారికి లేదు!
నా వయసు 45 సంవత్సరాలు. మా పెళ్లి జరిగి పాతికేళ్లకు పైగా అయింది. పెళ్లయిన నాటినుంచి నాకు భర్త నుంచి ఆదరణ లేదు సరికదా, చీటికిమాటికీ నాపై చెయ్యి చేసుకోవడం, అత్తమామలు, ఆడబిడ్డల నుంచి ఆరళ్లు... పిల్లలు పుట్టి, పెద్దవాళ్లయినా నాకీ మానసిక, శారీరక బాధలు తప్పడం లేదు. అదేమంటే నన్ను ఇంటిలోనుంచి వెళ్లగొడతానని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు. – కె. సుజాత, శంషాబాద్పెళ్ళైన తర్వాత భర్త ఇంటికి వెళ్ళి, గృహిణిగా వుండే స్త్రీలే మన సమాజంలో ఎక్కువ. అలా గృహిణిగా వుంటున్న స్త్రీలని ఏదో వారికి సేవ చేయటానికి మాత్రమే కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేశారు అనే పురుషాహంకార భావజాలాలు కల్గిన భర్తలు, అత్త–మామలూ కూడా ఎక్కువే! ఉద్యోగం వదిలేసి, తనకంటూ స్వంత ఆదాయం లేకుండా కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేశాక ‘‘నేను వదిలేస్తే నీకు జీవితం లేదు.. వుండటానికి నీడ కూడా దొరకదు.. నీకు విడాకులు ఇస్తాను, రోడ్డున పడతావ్’’ అంటూ బెదిరిస్తూ మహిళలపై అజమాయిషి చలాయించేవారిని తరచు చూస్తుంటాం. ముందూ వెనుకా ఎవరి సహాయం లేకుండా, పెద్దగా చదువుకోకుండా, ఉద్యోగంలో చాలా గ్యాప్ వచ్చి లేదా పుట్టినింటినుంచి పెద్దగా ఆదరణ లేదు అని అనుకున్న స్త్రీలైతే భర్త వదిలేస్తే వారి పరిస్థితి ఏమిటి అని భయపడుతూ, వారికి ఎదురయ్యే గృహహింసను కూడా మౌనంగా భరిస్తూ ఉంటారు.నిజానికి అలా భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మహిళలకు ఎంతో బాగా ఉపయోగపడే, రక్షణ కల్గించే చట్టమే ‘గృహ హింస చట్టం, 2005’. ఈ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం, భర్త (లేదా అత్త–మామలు) నివసిస్తున్న ఇంట్లోనే, విడాకుల కేసు లేదా మరేయితర కేసులు నడుస్తున్నప్పటికీ గృహహింసకు గురైన మహిళకు కూడా సమానంగా నివసించే హక్కు వుంటుంది. కొన్ని సందర్భాలలో ఐతే భార్య/ గృహ హింసకి గురవుతున్న స్త్రీ రక్షణ కొరకు భర్తను ఇంట్లోనుంచి వెళ్లిపోవాలి అని కూడా కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి. భర్త పేరిట ఇల్లు ఉన్నా గాని, అలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం కల్పిస్తుంది ఈ చట్టం. అలా కుదరని పక్షంలో భర్త నివసించే ఇంటికి సమానమైన ప్రత్యామ్నాయ వసతిని కల్పించవలసి ఉంటుంది. అంతేకాక, మరలా గృహహింసకు పాల్పడే వీలు లేకుండా భర్త – తన కుటుంబ సభ్యులపై కూడా ఇంజక్షన్ ఇస్తూ కోర్టు ‘ ప్రొటెక్షన్ ఆర్డరు / రక్షణ ఉత్తర్వులు ’’ ఇవ్వవచ్చు. కాబట్టి, భర్త వదిలేస్తే ఇక తనకి జీవితం వుండదు అనుకునే ధోరణి అవసరం లేదు. గృహ హింసని భరించాల్సి అవసరం అంతకంటే లేదు. గృహహింస చట్టం, 2005 అనేది ఒక ప్రత్యేక చట్టం. ఇందుకుగాను మీరు నేరుగా మెజిస్ట్రేట్ ను గానీ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖను గానీ సంప్రదించ వచ్చు. ఐపీసీ 498అ (కొత్త చట్టం – సెక్షన్ 85 బీ.ఎన్.ఎస్) కు, గృహ హింస చట్టానికి సంబంధం లేదు. ఆరోపణలు, గృహహింస ఒకటే అయినప్పటికీ రెండు కేసులు వేర్వేరుగా పిర్యాదు చేయాలి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు.
ప్లీజ్... ఇంకో బిడ్డను కనవచ్చు కదా!
‘మీరు ఇప్పుడు ప్రెగ్నెంటా?’ అని ప్రభుత్వ అధికారులు చైనాలోని మహిళలకు ఫోన్ చేసి అడుగుతున్నారు. అడిగితే అడిగారు అని సర్దుకున్నా ‘ఇంకో బిడ్డను కనవచ్చు కదా’ అని సలహా కూడా ఇస్తున్నారు. ఒకప్పుడు కఠినమైన జనన నియంత్రణ చర్యలు చేపట్టిన చైనా ఇప్పుడు అదనపు జనాభా కోసం ఎందుకు ఆరాటపడుతుంది?ప్రధాన కారణాలలో ఒకటి చైనాలో సంతానోత్పత్తి రేటు తగ్గడం. 2035 నాటికి చైనా జనాభాలో మూడింట ఒక వంతు 60 ఏళ్ల పైబడిన వారు ఉంటారని ‘వ్యూ’ రీసెర్చి నివేదిక చెప్పింది. ‘ప్రపంచ కర్మాగారం’గా తనకు తాను గర్వించుకునే చైనాకు యువ జనాభా అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జనాభా పెంచడానికి కృషి చేస్తోంది. జనాభా నియంత్రణ కోసం ‘వన్–చైల్డ్ పాలసీ’ని కఠినంగా అమలుచేసిన దేశంలో ఈ సరికొత్త మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. (చదవండి: వారి పిల్లలు చెట్లు దైవం, కృష్ణజింక)
సాంగ్లీ నుంచి స్టాన్ఫోర్డ్ వరకు.. పేద ఇంటి బిడ్డ సక్సెస్ స్టోరీ
‘పెద్ద చదువులు చదవాలి’ అనేది పేదింటి అమ్మాయి ఆక్సా కోరిక. అయితే అదంత తేలికైన విషయం కాదని ఆమెకు అర్థం అయింది. దారి పొడగునా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. అయినా సరే ఆమె ప్రయాణం ఆగలేదు. ‘పెద్ద చదువులు చదవడానికి పేదరికం అడ్డు కాదు’ అని నిరూపించి ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తోంది అక్సా పులారా. టెక్ దిగ్గజం గూగుల్‌లో ఇన్నోవేషన్ ప్రాజెక్ట్‌లలో కీలక బాధ్యతలు చూస్తోంది. మహారాష్ట్రలోని సాంగ్లీలో పుట్టిన ఆక్సా పులారా ‘వాల్చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్’ నుండి బ్యాచిలర్ డిగ్రీ చేసింది. ‘చదివింది చాలు’ అన్నారు ఇంటి పెద్దలు. ఉన్నత చదువులు చదవాలనేది అక్సా లక్ష్యం.‘నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను’ అంటే ససేమిరా అన్నారు.అదేపనిగా అడిగితే పెద్దల మనసు కరిగింది. ‘సరేలే. చదువుకో’ అన్నారు. ఆరోజు తనకు ఎంత సంతోషమైందో!‘యస్...నేను సాధించగలను’ అనే గట్టి నమ్మకం వచ్చింది. ఆ నమ్మకమే అక్సాకు ఎంతో శక్తిని ఇచ్చింది. ఆ శక్తే తనను అమెరికా వరకు తీసుకెళ్లింది. అమెరికాలో చదువుకుంటున్న వారి గురించి వినడమే కాని తాను కూడా చదువు కోసం అక్కడికి వెళతానని కలలో కూడా అనుకోలేదు. సదరన్ కాలిఫోర్నియా యూనివర్శిటీలో చేరింది. ఆ తరువాత స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో కొంతకాలం పనిచేసింది. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్(యంఎల్)తో సహా అత్యాధునిక సాంకేతికతలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంది. (రోజుకు నాలుగు గంటలే పని, నెల ఆదాయం 15 లక్షలకు పై మాటే!)ఆ తరువాత గూగుల్‌లో చేరింది. అక్కడ ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇన్నోవేషన్లకు సంబంధించిన ప్రాజెక్ట్‌లను లీడ్ చేస్తోంది. కాలేజీ, యూనివర్శిటీ రోజుల్లో గూగుల్‌లో ఆవిష్కరణల గురించి ఆసక్తిగా తెలుసుకునేది. ఇప్పుడు ఆ ఆవిష్కరణలలో తాను కూడా భాగం అయింది. అక్సాకు మొదటి నుంచి టెక్నాలజీ అంటే ఇష్టం. ముఖ్యంగా కట్టింగ్–ఎడ్జ్ టెక్నాలజీగా చెప్పే ఏఐ, ఎంఎల్లో ప్రతి చిన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేసేది. నిజజీవితంలో మనం ఎదుర్కొనే ట్రాఫిక్జామ్లాంటి సమస్యలకు ఏఐ, ఎంఐ సాంకేతికత పరిష్కారం చూపుతుందని అంటుంది ఆక్సా పులారా.గూగుల్‌లో చేరిన తరువాత ఆ సంస్థ ఏఐ అండ్ ఎంఎల్ డెవలప్‌మెంట్స్‌లో ప్రధానపాత్ర పోషిస్తోంది. టీమ్ వర్క్‌స్పేసెస్, లుకర్ స్టూడియో ప్రో మొదలైన ఇన్నోవేటివ్ గూగుల్ ప్రొడక్ట్స్‌లో తన వంతు పాత్ర నిర్వహించింది. మనలో సామర్థ్యం ఉండగానే సరి΄ోదు. ఆ సామర్థ్యానికి తగిన వేదిక కూడా దొరకాలి. గూగుల్ రూపంలో ఆమెకు సరైన వేదిక దొరికింది.‘గూగుల్‌లో కనిపించే కల్చరల్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రభావంతో పరిశోధనలపై ఆసక్తి పెరిగింది. సంక్లిష్టమై సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలనే కుతూహలం నన్ను ముందుకు నడిపించింది’ అంటుంది అక్సా పులారా. ఆమె పట్టుదల, ఉత్సాహం చూస్తుంటే ఎన్నో ఆవిష్కరణలలో కీలకపాత్ర పోషించబోతుందని గట్టిగా చెప్పవచ్చు.
వారి పిల్లలు చెట్లు, దైవం కృష్ణజింక
సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు రావడంతో బాలీవుడ్ సూపర్‌స్టార్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ‘కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్ నిర్దోషి’ అని అతని తండ్రి సలీంఖాన్ ప్రకటనపై బిష్ణోయ్ సంఘాలు నిరసన ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కృష్ణజింకలు, వాటితో బిష్ణోయ్ సమాజానికి ఉన్న అనుబంధం మరో సారి వార్తల్లోకి వచ్చింది.వారిది 550 సంవత్సరాల అనుబంధం!పదిహేనవ శతాబ్దంలో గురు జంబేశ్వర్ (జాంబాజీ అని కూడా పిలుస్తారు) స్థాపించిన బిష్ణోయ్ శాఖ 29 సూత్రాలతో మార్గనిర్దేశం చేయబడింది. జాంబాజీ బోధనలు వన్య ప్రాణులు, చెట్ల ప్రాముఖ్యత, సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తాయి. కృష్ణజింకను తమ ఆధ్యాత్మిక గురువుగా జాంబేశ్వర్ పునర్జన్మగా నమ్మి పూజిస్తారు.బిష్ణోయ్‌ల జానపద కథల్లోనూ కృష్ణజింక ప్రధానంగా కనిపిస్తుంది. కృష్ణజింకను తన ప్రతీకగా, వ్యక్తీకరణగా ఆరాధించమని జాంబేశ్వర్ తన అనుచరులకు ఆదేశించినట్లు చెబుతారు. తాము కృష్ణజింకలుగా పునర్జన్మ పొందుతామని బిష్ణోయ్‌లు నమ్ముతారు.చెట్లను బిడ్డల్లా చూసుకోవడం విషయానికి వస్తే...1730లో జోద్పూర్ సమీపంలోని ఖేజర్లీ గ్రామంలో చెట్లను నరికి వేయకుండా కాపాడే క్రమంలో 362 మంది బిష్ణోయిలు మరణించారు. జోద్పూర్ మహారాజా అభయ్‌సింగ్ ఆదేశాల మేరకు ఈ మారణకాండ జరిగింది.కొత్త రాజభవనాన్ని నిర్మించడానికి అభయ్ సింగ్ కలప కోసం చెట్లను నరికి వేయడానికి సైనికులను పంపాడు. అమృతాదేవి అనే మహిళ నాయకత్వంలో బిష్ణోయ్ ప్రజలు ప్రతిఘటించారు. అమృతాదేవి తదితరులు చెట్లను కౌగిలించుకొని వాటిని రక్షించడానికి సాహసోపేతంగా ప్రతిఘటించారు. ఈ సంఘటన 1973 చిప్కో ఉద్యమానికి ప్రేరణ ఇచ్చింది.(చదవండి: భారతీయ వంటకాలపై రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పొగడ్తల జల్లు..!)
ఫొటోలు
సమంత కిల్లింగ్ లుక్స్.. ఘాటు పోజులిస్తూ ఆ హీరోతో ఫొటోషూట్ (ఫొటోలు)
కోహ్లికి స్పెషల్ విషెస్: అక్క, అన్న పిల్లలతో విరాట్ రేర్ ఫొటోలు
హ్యాండిల్, సీటు లేని హోండా ఇంజిన్!
కౌంట్‌డౌన్ మొదలైంది..చైతూ- శోభిత పెళ్లి పనులపై సమంత పోస్ట్! (ఫొటోలు)
స్టైలిష్ లుక్‌లో అదుర్స్ అనిపిస్తోన్న నభా నటేష్
గెలుపు తర్వాత ట్రంప్ సంతోష క్షణాలు.. ప్రసంగం (ఫొటోలు)
ఛత్రపతి మూవీ హీరోయిన్.. తెలుగులో ఆ ఒక్క సినిమాతోనే!
ఫ్యాషన్‌కే పాఠాలు చెప్పే ఫ్యాషన్ క్వీన్, బిజినెస్ మాగ్నేట్ భార్య (ఫోటోలు)
చీరలో సన్నజాజితీగలా అంజలి, క్యూట్ పప్పీతో హ్యపీగా (ఫోటోలు)
కార్తీక సోమవారం: సురేఖవాణి, ప్రణీత, వాసంతి కృష్ణన్ కార్తీక శోభ (ఫోటోలు)
International View all
నర్గీస్‌ను చంపేందుకు కుట్ర
టెహ్రాన్: నోబెల్ గ్రహీత, మానవ హక్కుల కార్య కర్త నర్గీస్ మ
Donald Trump: మళ్లీ హౌడీ.. అంటారా?
న్యూఢిల్లీ: చరిత్రాత్మక విజయంతో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ
Donatd Trump: వివాదాలకు పెద్దన్న
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జయకేతనం ఎగ
USA Presidential Election Results 2024: హారిస్.. ఐదు వైఫల్యాలు
1. ప్రభుత్వ వ్యతిరేకత–బైడెన్ అసమర్థత
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 'ట్రంప్ 2.0'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దుమ్ము రేపారు.
National View all
Donald Trump: మళ్లీ హౌడీ.. అంటారా?
న్యూఢిల్లీ: చరిత్రాత్మక విజయంతో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ
కమల యోధురాలు
తిరువరూర్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేత
హిమాచల్ కాంగ్రెస్ సంచలన నిర్ణయం
షిమ్లా: కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది.
రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి.. ప్లాట్‌ఫాం మధ్యలో పడిన యువతి
తిరువనంతపురం: కదులుతున్న రైలును ఎక్కే ప్రయత్నం చేసిన యువతి..
రుణాల పంపిణీపై బ్యాంకర్లతో సమీక్ష
వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశుపోషణ, పాడి పరిశ్రమ..వంటి విభిన్న విభాగాలకు అందించే రుణాల పంపిణీ పురోగతిని కేంద్రం సమీక్ష
NRI View all
అమెరికా ఎన్నికల్లో ఎన్నారైల సత్తా.. ఎంతమంది గెలిచారంటే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని విజయాన్ని నమోదు చేసుకు
ఎన్నారైలకు శుభవార్త: యూపీఐతో రోజుకు లక్ష పంపొచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రవాస భారతీయులకు (ఎన్నారైలు) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
లండన్ వేదికగా ప్రారంభమైన వరల్డ్ ట్రావెల్ మార్కెట్
నవంబర్ 5-7 వరకు లండన్‌లో జరిగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM)లో భారతదేశం పాల్గొంటుంది.ఇన్‌బౌండ్ టూరిజంను మెరుగుపరచడం , ద
టాంపలో నాట్స్ బోర్డ్ సమావేశం సంబరాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్..
టాంపలో ఘనంగా సంబరాల గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఘనంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు టాంప లో
క్రైమ్
ప్రాణం తీసిన ఫుడ్‌పాయిజన్
నిర్మల్: మంచిబోజనం ఆరగిద్దామని హోటల్‌కి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు ఆ కస్టమర్స్. ఆహారం విషతుల్యం కావడంతో ఏకంగా ఒకరి ప్రాణంపోగా, 20 మంది వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రిల్–9 హోటల్లో ఈనెల 2, 3 తేదీల్లో భోజనం చేసిన వారంతా ఆస్పత్రుల పాలయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. యువతి మృతి.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర క్రాస్‌రోడ్డు వద్ద గల సెయింట్ థామస్ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ స్మితా జార్జ్, వైస్ ప్రిన్సిపాల్ దీపక్, ఉపాధ్యాయులు సోఫీ, ఫిజీ, వంటమనిషి ఫూల్‌కాలీబైగా (19) ఈనెల 2న షాపింగ్ కోసం నిర్మల్‌కు వచ్చారు. రాత్రి తిరిగి వెళ్తూ గ్రిల్–9 హోటల్లో రాత్రి భోజనం చేశారు. చికెన్–65, తందూరి చికెన్, చికెన్ ఫ్రైడ్‌రైస్ ఆరగించారు. అదేరోజు అర్ధరాత్రి నుంచి ఐదుగురికీ వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. స్థానిక బోథ్ సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి ఫూల్‌కాలీబైగా మంగళవారం మృతిచెందింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఫూల్‌కాలీబైగా ఉపాధి నిమిత్తం సెయింట్ థామస్ స్కూల్లో వంటపని చేసేందుకు వచ్చింది. ప్రిన్సిపాల్ స్మితాజార్జ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోథ్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిర్మల్ పోలీసులకు పంపించారు. 25 మందికిపైగా.. గ్రిల్–9 హోటల్లో వండిన ఆహారం విషతుల్యం కావడం వల్లే భోజనం చేసినవారిలో పదుల సంఖ్యలో అస్వస్థతకు గురైనట్లు తేలింది. ఖానాపూర్‌కు చెందిన పదిమంది వరకు యువకులు ఈ హోటల్లో ఆరగించి వెళ్లగానే వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన మరో ఆరుగురు కుటుంబ సభ్యులు ఇక్కడి మండీ విభాగంలో చికెన్ ఆరగించడంతో వారూ బాధితులయ్యారు. బోథ్ స్కూల్ స్టాఫ్‌తో కలిసి దాదాపు 25 మంది అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఈ ఘటన నేపథ్యంలో గ్రిల్–9 హోటల్ పరిసరాలను ‘సాక్షి’పరిశీలించగా, ఏమాత్రం శుభ్రత, నాణ్యత పాటించడం లేదన్న విషయం స్పష్టమైంది. హోటల్ వ్యర్థాలు, మురికినీరు అంతా వెనుకభాగంలో నిలిచి ఉంది. దీనిపై ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ ప్రత్యూషను ఫోన్లో వివరణ కోరగా, తాము సదరు హోటల్‌కు వెళ్లామని, తాళం వేసి యాజమాన్యం, వర్కర్లు పరారీలో ఉన్నారని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బెయిల్‌పై బయటకొచ్చి.. భార్య, ముగ్గురు పిల్లలపై కాల్పులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హత్య కేసులో బెయిల్ బయటకు వచ్చిన ఓ వ్యక్తి.. తన భార్య, ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఈ ఘోరం వారణాసిలోని భైదానీ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి వెలుగుచూసింది.పోలీసుల వివరాల ప్రకారం.. రాజేంద్ర గుప్తా అనే వ్యక్తి 1997కు సంబంధించి ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాయడు. సోమవారం రాత్రి తన ఇంట్లోకి ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్న భార్య నీతూ గుప్తా(45), కుమారులు నవేంద్ర(25), సుబేంద్ర(15), కూతురు గౌరంగి(16)పై కాల్పులు జరిపాడు. వారు మరణించారని ధృవవీకరించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.కుటుంబం హత్యపై సమాచారం అందుకున్న వారణాసి పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు సైతం వారణాసిలోని రోహనియా ప్రాంతంలో శవమై కనపించాడు. తన భార్య, పిల్లలను చంపిన తర్వాత నిందితుడు హత్య చేసుకొని మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా కొన్ని రోజులుగా బార్యభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయని రాజేంద్ర గుప్తా తల్లి పోలీసులకు తెలిపారు.ఈ సంఘటనపై వారణాసి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ్ బన్స్వాల్ మాట్లాడుతూ. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కాల్చి చంపినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. కుటుంబ కలహాలు, చేతబడి వంటి అనేక కోణాల్లో మేము కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాజేంద్ర గుప్తా మృతదేహాన్ని కూడా వారణాసి నుంచి స్వాధీనం చేసుకున్నామని, అతను హత్యకు గురయ్యాడా లేదా ఆత్మహత్య చేసుకొని మరణించాడా అని తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.
పందెం విసిరిన స్నేహితులు.. బాంబు మీద కూర్చున్న యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే?
బెంగళూరు : స్నేహితులతో పందెం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. బాంబు మీద కూర్చొని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.బెంగళూరు పోలీసుల వివరాల మేరకు.. దీపావళి పండుగ సందర్భంగా శబరిష్ (32) అతని ఆరుగురు స్నేహితులు మధ్య పందెం వేసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న శబరీష్‌కు అతని స్నేహితులు పందెం విసిరారు. పందెం ప్రకారం..శబరీష్ కార్డ్ బోర్డ్ కింద అమర్చిన బాంబులపై కూర్చోవాలి. అనంతరం బాంబుకు నిప్పు అంటిస్తాము. నిప్పు అంటించినా అలాగే కూర్చుంటే ఓ కొత్త ఆటో కొనిస్తామని ఆఫర్ ఇచ్చారు.చదవండి : తెగిపడిన కుమారుడి తల.. ఒడిలోకి తీసుకుని లాలిస్తూ.. రోదిస్తూదీంతో మద్యం మత్తులో ఉన్న శబరీష్ స్నేహితులు చెప్పినట్లుగానే బాంబులు అమర్చిన కార్డ్ బోర్డ్‌పై కూర్చున్నాడు. అంనతరం అతని స్నేహితులు కార్డ్ బోర్డ్ కింద ఉన్న బాంబులకు నిప్పు అంటించి దూరంగా పరిగెత్తారు. సెకన్ల వ్యవధిలో భారీ శబ్ధాలతో బాంబులు పేలాయి.శబరీష్ అలాగే ఉన్నాడు. అతనికి ఏమైందా అని చూద్దామని ముందుకు వచ్చిన స్నేహితుల్ని చూసిన శబరీష్ వెంటనే కుప్పకూలాడు. ప్రాణాలు కోల్పోయాడు. అత్యవసర చికిత్స కోసం శబరీష్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బాంబు పేలుడు ధాటికి శబరీష్ అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని నిర్ధారించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడికి పందెం విసిరిన అతని ఆరుగురు స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్నారు. A Bet that proved costly, takes a Life in #Bengaluru !In a shocking incident a 32-yr-old Shabari died in a tragic way on #Diwali, after he accepted a challenge to sit on a box full of #firecrackers in it to win an auto rickshaw, in Konanakunte, South Bengaluru. His friends lit… pic.twitter.com/YGHEmxViV2— Surya Reddy (@jsuryareddy) November 4, 2024
మహిళలపై టీడీపీ నేతల మరో అరాచకం
సాక్షి టాస్‌్కఫోర్స్: ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ అరాచకాలు మరీ శ్రుతిమించాయి. ఆదివారం అర్ధరాత్రి ఆత్మకూరు మండలం బ్రాహ్మణ యాలేరులో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. బాధితుల కథనం మేరకు.. బ్రాహ్మణ యాలేరుకు చెందిన రహమత్బీ అన్న ఇస్మాయిల్ వైఎస్సార్‌సీపీ తరఫున చురుగ్గా పనిచేసేవాడు. అతడిపై కొందరు టీడీపీ నాయకులు అక్కసు పెంచుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇస్మాయిల్ గ్రామం వదలి వేరేచోట తలదాచుకున్నాడు. పది రోజుల క్రితం గ్రామానికి తిరిగొచ్చాడు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు గ్రామానికి చెందిన యువతిపై ఇస్మాయిల్ దాడి చేశాడంటూ అనంతపురం పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి వేళ టీడీపీకి చెందిన దాసరి అనిల్, దాసరి ఈశ్వరయ్య, మిలటరీ ఈశ్వరయ్య, దాసరి నీరజ ద్విచక్ర వాహనాలపై వచ్చి రహమత్బీ ఇంట్లోకి చొరబడ్డారు.బూతులు తిడుతూ ఆమెతో పాటు కులసింబీ, అమనాబీలపై చెప్పులతో దాడి చేశారు. మెడలో ఉన్న నల్లపూసల దండలు తెంచేశారు. ఊరు వదిలి వెళ్లిపోవాలని, లేకుంటే అంతు చూస్తామని బెదిరించారు. ఈ ఘటనపై సోమవారం ఉదయం ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళుతుండగా మాపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ మరోసారి దాడి చేశారు.
వీడియోలు
అమరన్ సక్సెస్.. నితిన్ సినిమా సాంగ్ పాడిన శివ కార్తికేయన్
అమ్మా.. నీకు మాటిస్తున్నా..!
30 రాష్ట్రాల్లో ట్రంప్ ప్రభంజనం..
రాహుల్ గాంధీది ఏ కులం..?
రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు పోలీసుల వేధింపులు..
మేరుగు నాగార్జునపై తప్పుడు కేసు..
లోకేష్ ఇంటికి టీడీపీ మంత్రులు..
డియర్ మస్క్ ఐ లవ్ యూ..!
చట్టవ్యతిరేకంగా పనిచేసిన ఏ పోలీసునూ వదిలేది లేదు
YSRCP సోషల్ మీడియా సైన్యానికి అంబటి భరోసా