Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Press Meet Updates1
నా మతం మానవత్వం.. డిక్లరేషన్‌లో రాసుకోండి: వైఎస్‌ జగన్‌

సాక్షి,తాడేపల్లి: ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందంటూ చంద్రబాబు క్షుద్ర రాజకీయాలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవుడి దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునేందుకు చూస్తున్నారని.. నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు.ప్రెస్‌మీట్‌ ముఖ్యాంశాలు..రాష్ట్రంలో రాక్షస రాజ్యంరాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది. దేవుడి దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం నా రాజకీయ జీవితంలో ఏనాడూ చూడలేదు. దేవుడి దర్శనానికి వెళ్తుంటే కూడా అడ్డుకుంటున్నారు. అందుకే ఇది రాక్షస రాజ్యం.ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులకు నోటీసులు ఇచ్చారు.ఇక ఆ నోటీసులో ఏం రాశారంటే అంటూ.. చదివి వినిపించారు.‘మాజీ సీఎం వైయస్‌ జగన్‌ తిరుమల తిరుపతి సందర్శనకు, సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున, మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో, మరియు మీ సొంత వాహనాల్లో బయలుదేరి తిరుపతి చేరుకుని, వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమంలో పాల్గొనడం, చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తున్న నోటీస్‌’.అంటే, జగన్‌ అనే వ్యకి మాజీ ముఖ్యమంత్రి. ఆయన తిరుమల తిరుపతి దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తుంటే, అందుకు మీకు పర్మిషన్‌ లేదు. మీరు వెళ్తే అరెస్టు చేస్తామని నోటీసులు ఇస్తున్నారు. ఒక్కసారి ఆలోచనే చేయండి.ఏ ప్రపంచంలో ఉన్నాం. ఇది రాక్షస రాజ్యం కాదా? ఒకవైపున ఏమో, నన్ను వెళ్లనీయకుండా, వైయస్సార్‌సీపీ శ్రేణులు వెళ్లకుండా నోటీసులు ఇస్తున్నారు. మరోవైపున టీవీల్లో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి బీజేపీ శ్రేణులను రప్పిస్తున్నారు. ఇది పార్టీ నాయకత్వానికి తెలుసో? లేదో?వేల మంది పోలీసులను మొహరించారు. ఎందుకంతగా టాపిక్‌ డైవర్ట్‌ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు? టాపిక్‌ డైవర్షన్‌ కోసం ఎందుకు ఆరాటపడుతున్నారు?.చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలు అని ఒక్కొక్కటిగా రుజువు అవుతూ కనిపిస్తున్నాయి. ఆ కనిపించే నేపథ్యంలో, 100 రోజుల పాలన మీద డైవర్ట్‌ చేస్తూ, లడ్డూల టాపిక్‌ తీసుకొచ్చారు. అడ్డగోలుగా తప్పు చేసి, గుడి పవిత్రత దెబ్బతీస్తూ అడ్డంగా దొరికిపోయే సరికి, లడ్డూల టాపిక్‌ను డైవర్ట్‌ చేసేందుకు కొత్తగా డిక్లరేషన్‌ టాపిక్‌ తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారు.ఒకసారి గమనించినట్లయితే, తిరుమల పవిత్రత, స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్భుద్ధితో, జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారైనట్టుగా, ఒక జరగని విషయాన్ని జరిగినట్లుగా.. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా.. నిజంగా సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి తెలిసి అబద్దాలు ఆడుతూ, అసత్యాలు పలుకుతూ.. స్వామి వారి పేరు ప్రఖ్యాతలను, తిరుపతి లడ్డూ విశిష్టతను దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం, సాక్షాత్తూ ఒక ముఖ్యమంత్రి చేస్తుంటే.. ఇంత కంటే దారుణం, అధర్మం ఎక్కడైనా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి వాటికి సంబం«ధించిన అన్ని విషయాలు చెబుతాను. చంద్రబాబు అనే వ్యక్తి ఏ రకంగా అబద్దాలు చెప్పి, రెక్కలు కట్టాడనేది ఆధారాలతో చూపిస్తా. దీన్ని రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలంతా చూడమని విజ్ఞప్తి చేస్తున్నాను.అది రొటీన్‌ ప్రాసెస్‌తిరుమలలో లడ్డూల కోసం నెయ్యి కొనుగోల చేసే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకోసారి రొటీన్‌గా, దశాబ్ధాలుగా జరుగుతోంది. ఆరు నెలలకు ఒకసారి ఈ–టెండర్‌ పిలుస్తారు. అర్హులు బిడ్‌ వేస్తారు. ఇప్పుడు కొత్తగా నియమాలు పెట్టలేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తిరుపతి లడ్డూకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ టేస్ట్‌ మరెక్కడా ఉండదు. ఆరు నెలలకోసారి ఈ–టెండర్‌. బిడ్లు వేస్తే, ఎల్‌–1 గా వచ్చిన వారికి టెండర్‌ ఖరారు చేస్తారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు.టీటీడీ బోర్డు ఒక ప్రసిద్ధి గాంచిన బోర్డు. అందులో సభ్యుల కోసం కేంద్ర మంత్రులు, చుట్టుపక్కల రాష్ట్రాల సీఎంలు కూడా రికమెండ్‌ చేస్తారు. వారి వారి రాష్ట్రాల్లో ప్రముఖులను సిఫార్సు చేస్తారు. అంత మంచి లక్షణాలు ఉన్న వారితో బోర్డు ఏర్పాటవుతుంది. వారంతా ప్రసిద్ధి పొందిన వారు. దేవుడికి ఇంకా సేవ చేయాలని, భక్తులకు మంచి చేయాలని నిర్ణయాలు తీసుకుంటారు. చెడు చేయాలన్నా చేయబోరు. అక్కడ నెయ్యి సరఫరా కోసం ఆరు నెలలకోసారి ఈ–టెండర్లు పిలుస్తారు. ఎల్‌–1గా వచ్చిన వారికి కూడా పూర్తి టెండర్‌ ఖరారు చేయరు. 65 శాతం వారికిచ్చి, మిగతా వారిని కూడా రేటు తగ్గించమని చెప్పి, వారికి టెండర్‌ ఇస్తారు.సరఫరాలో రొబస్ట్‌ పద్ధతితిరుమలకు సరఫరా చేసే నెయ్యిలో కూడా రొబస్ట్‌ (ధృఢమైన) విధానం ఉంటుంది. నెయ్యి సరఫరా చేసేవారు, ప్రతి ట్యాంకర్‌తో ఎన్‌ఏబీఎల్‌ (నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ క్యాలిబ్రేషన్‌ ల్యాబరేటరీస్‌) సర్టిఫై చేసిన ల్యాబ్‌ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్‌ తీసుకొస్తారు. అలా వచ్చిన నెయ్యిని కూడా ప్రతి ట్యాంకర్‌ నుంచి శాంపిల్‌ తీసి, మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్‌ అయితేనే, ట్యాంకర్‌ను ముందుకు పంపుతారు. ఒక్క టెస్టు ఫెయిల్‌ అయినా ట్యాంకర్‌ను వెనక్కు పంపిస్తారు.చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య 14 నుంచి 15 ట్యాంకర్లు అలా వెనక్కు పోయారు. అంటే ఎవరూ తప్పు చేయని విధంగా అక్కడ రొబస్ట్‌ విధానం ఉంది. మా ప్రభుత్వ హయాంలో కూడా 18 ట్యాంకర్లు వెనక్కు పంపారు. ఏ సరుకైనా సరే, క్వాలిటీ టెస్టులో ఫెయిల్‌ అయితే వెనక్కు పంపిస్తారు.ఇప్పుడు ఏం జరిగింది?ఇప్పుడు కూడా అదే జరిగింది. టీటీడీ ట్రస్ట్‌ బోర్డు అనుమతించిన బిడ్డర్లు జూన్‌ 12 నుంచి సరఫరా మొదలుపెట్టారు. అంటే, అప్పటికే చంద్రబాబుగారి ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాతే నెయ్యి సరఫరా మొదలైంది. అలా జూన్‌ 12, జూన్‌ 21, జూన్‌ 25, జూలై 4న వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టుల్లో పాస్‌ అయి, ముందుకు కదిలాయి. వాటిని లడ్డూల తయారీలో వాడారు.ఆ తర్వాత జూలై 6న రెండు ట్యాంకర్లు, జూలై 12న మరో రెండు ట్యాంకర్లలో వచ్చిన నెయ్యి, టీటీడీ టెస్టుల్లో ఫెయిల్‌ కావడంతో, వెనక్కు పంపడానికి సిద్ధం చేశారు. మరోసారి ఆ శాంపిల్స్‌ పరీక్ష కోసం మామూలుగా మైసూర్‌లోని సీఎఫ్‌టీఆర్‌ఐ (సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌)కు పంపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ (నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌)కి పంపారు. ఇది టీటీడీ చరిత్రలో తొలిసారి. టీటీడీ పంపించిన శాంపిల్స్‌పై ఎన్‌డీడీబీ వారు జూలై 23న రిపోర్ట్‌ పంపారు. నెయ్యిలో కల్తీ ఉందన్న విషయం చెప్పారు. దాంతో ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు. అలా 4 ట్యాంకర్లను వెనక్కు పంపడంతో పాటు, ఆ కంపెనీకి షోకాజ్‌ నోటీస్‌ కూడా ఇచ్చారు.ఇప్పుడు నేను అడుగుతున్నానుఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడకపోయినా, రెండు నెలల తర్వాత సెప్టెంబరు 18న, చంద్రబాబుగారు ఆ నెయ్యిని వాడారని ఉద్దేశపూర్వకంగా ఎందుకు అన్నారు?. ఇప్పుడు ఒకసారి, చంద్రబాబు నియమించిన టీటీడీ ఈఓ, ఆ నెయ్యి నాణ్యత గురించి జూలై 23న ఏమన్నారో చూద్దాం అంటూ.. ఆ వీడియో చూపారు.ఆ రెండు ట్యాంకర్లను రిజెక్ట్‌ చేశాం. షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చామని, వాటిలో వనస్పతి ఆయిల్‌ కలిపినట్లు తేలిందని చాలా క్రిస్టల్‌ క్లియర్‌గా ఈఓ చెప్పినా.. రెండు నెలల తర్వాత చంద్రబాబుగారు సెప్టెంబరు 18న ఏ రకంగా అబద్ధాలు మాట్లాడారో చూడండి.. అంటూ ఆ వీడియో కూడా ప్రదర్శించి చూపారు.ఘీకి బదులు జంతువుల కొవ్వు వాడారని, లడ్డూలు తయారు చేశారని, వాటిని భక్తులు తిన్నారని అన్నీ తెలిసినా, చంద్రబాబు అబద్దాలు చెప్పారు.టీడీపీ ఆఫీస్‌లో కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్‌చంద్రబాబుగారు సెప్టెంబరు 18న ఆ ఆరోపణలు చేస్తే, ఆ మర్నాడే.. అంటే సెప్టెంబరు 19న తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను రిలీజ్‌ చేశారు. నిజానికి అది కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్‌. అయినా దాన్ని టీడీపీ ఆఫీస్‌లో రిలీజ్‌ చేశారు.ఆ వెంటనే, మర్నాడు, అంటే సెప్టెంబరు 20 టీటీడీ ఈఓ మళ్లీ ఏం మాట్లాడాడో చూద్దాం.. అంటూ వీడియో ప్రదర్శించారు.ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిలో నాణ్యత లేదని తేలినందువల్ల, ఆ నెయ్యిని వెనక్కి పంపామని, వాడలేదని చెప్పారు. అంతే కాకుండా, సెప్టెంబరు 22న ఈఓ, తాను స్వయంగా సంతకం చేసి, ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చారని చెబుతూ.. అందులోని అంశాలు చదివి వినిపించారు.కల్తీ నెయ్యితో వచ్చిన ట్యాంకర్లను వెనక్కు పంపాం. ఆ కంపెనీకి షోకాజ్‌ నోటీస్‌ కూడా ఇచ్చామని.. తమకు ఎన్‌డీడీబీ రిపోర్టు చాలా గోప్యమని అందులో ప్రస్తావించారు. అయినా దాన్ని, అంతకు ముందే తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో రిలీజ్‌ చేశారు.అది అపవిత్రత కాదా?మళ్లీ సెప్టెంబరు 22న మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, అవే పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కల్తీ నెయ్యి వాడారని చెప్పారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల తిరుపతి ప్రతిష్టను, శ్రీ వెంకటేశ్వరస్వామివారి ప్రసాద పేరు ప్రఖ్యాతలను, ఈ మాదిరిగా అబద్దాలతో తగ్గించడం, కుట్ర పూరితంగా వ్యవహరించడం.. అపవిత్రత కాదా?.ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ డిస్‌క్లెయిమర్‌పోనీ.. ఆ ఎన్‌డీడీబీ రిపోర్టు అయినా కచ్చితమైందా? అని చూస్తే, ఆ రిపోర్టులో వాళ్లే డిస్‌క్లెయిమర్‌ రాశారు.‘నెయ్యిలో ఉండాల్సిన స్టాండర్డ్‌ వాల్యూ కన్నా.. శాంపిల్స్‌లోని స్టాండర్డ్‌ వాల్యూస్‌లో డీవియేషన్స్‌ ఉన్నాయి. అయినా, ఈ పరిస్థితుల్లో ఒక ఫాల్స్‌ పాజిటివ్‌ ఫలితం కూడా రావొచ్చు. ఆ పరిస్థితులు ఏమిటంటే.. అంటూ.. పాల సేకరణ, ఆవులు, వాటి దాణ గురించి ప్రస్తావించారు. అలాగే ఆవులకు సరైన ఆహారం లేనప్పుడు, అవి సరిగ్గా తినకుండా బలహీనంగా ఉన్నప్పుడు తీసిన పాల నుంచి కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయని రాశారు’.పచ్చి అబద్ధాలు. అపవిత్రం కాదా?ఇవన్నీ తెలిసినా చంద్రబాబు కావాలని అబద్దాలు ఆడుతూ, తిరుమల వెంకటేశ్వరస్వామివారి విశిష్టతను, ప్రసాదాల పవిత్రతను దగ్గరుండి, కావాలని అబద్దాలు చెప్పి, అనుమానపు బీజాలు ప్రసాదం స్వీకరించే ప్రతి ఒక్కరిలో లేపడం దుర్మార్గం కాదా? అపవిత్రం కాదా?నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజారుస్తున్నావు. స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తున్నావు. జరగనిది జరిగినట్లుగా, జంతువుల కొవ్వుతో ప్రసాదం తయారు చేసినట్లుగా ఒక అబద్దాన్ని ప్రచారం చేస్తున్నావు. ధర్మమేనా?.మీ హయాంలో ఎందుకు వాడలేదు?నందిని బ్రాండ్‌ ఎందుకు వాడడం లేదని అంటున్నారు. మరి చంద్రబాబు పాలన సమయంలో 2015 నుంచి 2018 అక్టోబరు వరకు కెఎంఎఫ్‌కు చెందిన నందిని బ్రాండ్‌ నెయ్యి ఎందుకు లేదు? అప్పుడు కూడా టెండర్లు పిల్చారు కదా? నందిని వాళ్లు ఇష్టం వచ్చినప్పుడే టెండర్లలో పాల్గొంటారు.అప్పుడు ఇంత కంటే తక్కువ ధరఇంకొకరు అంటారు. రూ.320కి కిలో నెయ్యి ఎలా వస్తుందని అంటారు. మరి చంద్రబాబుగారి కూడా 2014–19 మధ్య నెయ్యిని ఏ ధరకు సేకరించారు? ఇప్పుడు కూడా అదే క్వాలిటీ నెయ్యి కదా? దశాబ్దాలుగా అదే క్వాలిటీ. అదే నెయ్యి. మరి చంద్రబాబు హయాంలో 2015లో కిలో నెయ్యిని రూ.276కి కొన్నారు. అదే 2019 జనవరిలో కిలో ఆవు నెయ్యిని రూ.324కు కొన్నారు. మరి ఇక్కడ రూ.320కి కొంటే తప్పేం జరిగింది?.అదే చంద్రబాబు కుట్రమీ హయాం అంతా అవే రేట్లకు కొన్నారు. మరి ఇప్పుడు కూడా అవే ధరలు. చంద్రబాబు తన హెరిటేజ్‌ డెయిరీ కోసం, పాలు కార్టల్‌ ఫామ్‌ చేసి, నెయ్యి రేట్లు పెంచేసి, ఆ కార్టల్‌లో చంద్రబాబునాయుడు, హెరిటేజ్‌ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో, కొత్తగా రేట్లు పెంచడం కోసం మాట్లాడుతున్నాడు. అదే క్వాలిటీ నెయ్యి. అవే స్పెఫికేషన్స్‌. అప్పుడు ఇప్పుడూ ఒకటే. తిరుపతి లడ్డూ చాలా టేస్టు ఉంటుందని గొప్పగా చెప్పుకుంటాం. ఆ లడ్డూ అప్పుడూ, ఇప్పుడూ ఒకటే.చంద్రబాబుగారి పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో, ప్రజలంతా కూడా ఆయనను వేలెత్తి చూపే కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో.. లడ్డూ టాపిక్‌లో చంద్రబాబు చేసిన తప్పును ప్రశ్నించడం మొదలు పెట్టారో.. వారికి వాస్తవాలు తెలియడం మొదలైందో.. ఆ పెద్దమనిషి ఏం చేస్తున్నారు.నా డిక్లరేషన్‌ కోరడం ఏమిటి?టాపిక్‌ డైవర్షన్‌ కోసం డిక్లరేషన్‌ అంటున్నాడు. జగన్‌ ఏమైనా కొత్తనా? రాజశేఖర్‌రెడ్డిగారు కొత్తనా? ఆయన ఏమిటో తెలియదా?నా మతం ఏమిటో రాష్ట్రంలో కానీ, దేశంలో తెలియదా? నా కులం ఏమిటో తెలియదా? రాజశేఖర్‌రెడ్డిగారు సీఎంగా 5 ఏళ్లు వరసగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయన కొడుకునే కదా?నేను గతంలో చాలాసార్లు వెళ్లాను కదా? సీఎం కాక ముందు కూడా వెళ్లాను కదా?అంతెందుకు నా పాదయాత్ర మొదలుపెట్టే ముందు కూడా స్వామివారిని దర్శించుకున్నాను. 3648 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా, తిరుపతి నుంచి కొండ ఎక్కాను. స్వామివారిని దర్శించుకున్న తర్వాతే ఇంటికి వెళ్లాను. అప్పుడు ఉన్నది చంద్రబాబుగారి ప్రభుత్వం. నేను ప్రతిపక్ష నాయకుడిని. రెండుసార్లు స్వామివారిని దర్శించుకున్నాను కదా?ఆ తర్వాత సీఎంగా వరసగా 5 ఏళ్లు, స్వామివారికి భక్తి శ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాను కదా?తొలిసారి ఎవరైనా వెళ్తుంటే, ఇలా అడగొచ్చు. కానీ 10, 11 సార్లు పోయిన తర్వాత, ఈరోజు నేను తిరుపతి వెళ్తానంటే. అడ్డుకుంటూ నోటీసులు ఇవ్వడం ఏమిటి?. డిక్లరేషన్‌ అడగడం ఏమిటి? మా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు నోటీసులు పంపడం ఏమిటి?రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశాను. 5 ఏళ్లు బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాను. ఎన్నోసార్లు స్వామి వారిని దర్శించుకున్నాను.నా మతం మానవత్వం. అదే నా డిక్లరేషన్‌ఈరోజు నేను వెళ్లకూడదట. కారణం నా మతం అంటున్నారు.అసలు నా మతం ఏమిటని అడుగుతున్నాను. నాలుగు గోడల మధ్య నేను బైబిల్‌ చదువుతాను. తప్పేముంది? బయటకు పోతే హిందూ సంప్రదాయాలను అనుసరిస్తాను. గౌరవిస్తాను. ఇస్లాంను అనుసరిస్తాను. గౌరవిస్తాను. సిక్కిజమ్‌ను అనుసరిస్తాను. గౌరవిస్తాను.నా మతం ఏమిటి అంటున్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్‌లో రాసుకుంటారేమో రాసుకొండి.దేశ రాజ్యాంగంలో ఏం చెప్పారు. నేను చదువుతాను వినండి.‘ఇండియా ఈజ్‌ ఎ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌’.సెక్యులర్‌ అంటే అర్ధం తెలుసా?. నీ మతం చెప్పకపోతే గుడిలోకి రావొద్దు అంటున్నావు. ఇది సెక్యులర్‌ దేశం అంటున్నాం.సీఎంగా పని చేసిన వ్యక్తి పరిస్థితి ఇలా ఉంటే, దళితుల పరిస్థితి ఏమిటి? దళితులను గుడిలోకి పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తాం?చంద్రబాబును ఎందుకు సమర్థిస్తున్నారు?మతం పేరుతో రాజకీయం చేయడం ఎంత దౌర్భాగ్యం? బీజేపీని అడుగుతున్నాను. తామే హిందుత్వానికి ప్రతినిధులం అంటారు. మిమ్మల్నే అడుగుతున్నాను.మీ కళ్ల ఎదుటే, మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే, శ్రీ వెంకటేశ్వరస్వామి విశిష్టతను, తిరుపతి లడ్డూ పేరు ప్రఖ్యాతలను, స్వామి వారి వైభవాన్ని, దగ్గరుండి అబద్ధాలు చెబతూ, జంతువుల కొవ్వు వాడకపోయినా, వాడి లడ్డూలు తయారు చేసినట్లుగా.. ఇన్ని ఆధారాలతో సహా, రుజువు అవుతున్నా.. అబద్ధాలతో దుష్ప్రచారం చేసి, వెంకటేశ్వరస్వామివారిని అపవిత్రం చేసిన ఈ వ్యక్తిని ఎందుకు మందలించడం లేదు? ఎందుకు వెనకేసుకొస్తున్నారు?.అంటే మీ వాళ్లు ఏం చేసినా ఫరవాలేదు. మిగిలిన వారు ఏం చేసినా తప్పే? ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇదెక్కడి హిందుత్వం?. హిందుత్వానికి మీకు టార్చ్‌ బేరర్స్‌ అంటారు. అందరూ ఆలోచించండి. నిజంగా హిందుత్వం ఏమిటంటే, మానవత్వం చూపడమే. అలా మానవత్వాన్ని చూపలేని వారు మంచి హిందువును అని చెప్పుకోలేరు.తానే దోషి. తానే జడ్జీ. ఇదెక్కడి ధర్మం?చంద్రబాబునాయుడే తప్పు చేస్తాడు. ఆయనే సిట్‌ వేస్తాడు. ఆయన చెప్పుచేతుల్లో ఉన్న అధికారులతో సిట్‌ అంటాడు. ఇదెక్కడి ధర్మం? ఇదెక్కడి పద్ధతి?. చంద్రబాబు ఈ మాదిరిగా హిందూ ధర్మం మీద దుష్ప్రచారం చేస్తూ, రాజకీయం చేయడం ధర్మమేనా? ఆలోచించండి.ఇదే అందరికీ నా విజ్ఞప్తినేను గుడికి వెళ్లకపోయినా ఫరవాలేదు. కానీ, చంద్రబాబు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మన పార్టీ తరపున మీమీ ఊళ్లలో పూజలు చేయండి. తప్పు చేసింది మేం కాదు. చంద్రబాబు అని వేడుకొండి. అందుకే ఆ కోపాన్ని ప్రజలపై కాకుండా, చంద్రబాబుపై చూపమని వేడుకొమ్మని కోరుతున్నాను.ఒకవైపున మా నాయకులు, ప్రజాప్రతినిధులకు నోటీస్‌లు ఇస్తూ, హౌజ్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. మరోవైపు పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ కార్యకర్తలను రప్పించి, గొడవలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు.అలా టాపిక్‌ను డైవర్ట్‌ చేసేందుకు, చంద్రబాబునాయుడు తాను చేసిన తప్పు కప్పిపుచ్చుకునేందుకు ఇన్ని కుట్రలు చేస్తున్నారు.అందుకే నా పర్యటన వాయిదాఈ పరిస్థితుల్లో నేను అక్కడికి వెళ్లి, టాపిక్‌ డైవర్ట్‌ చేయడం ఇష్టం లేక, వెంకటేశ్వరస్వామిని ప్రేమించే వ్యక్తిగా, గౌరవించే వ్యక్తిగా, టాపిక్‌ డైవర్ట్‌ కాకూడదనే ఉద్దేశంతో.. తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని అబద్దాలతో, అవమానించి, అగౌరవపర్చాడో.. లడ్డూపై దుష్ప్రచారం చేశాడో.. చేసిన తప్పు ఆధారాలతోసహా కనిపిస్తున్న ఈ సత్యం బయటకు రావాలి.చంద్రబాబునాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి. అది రాష్ట్ర ప్రజల మీదకు రావొద్దు. పాపం చేసిన చంద్రబాబు మీదే కట్టడి కావాలి.దాని కోసం, టాపిక్‌ డైవర్ట్‌ కాకూడదన్న ఉద్దేశంతో నా పర్యటనను వాయిదా వేసుకున్నాను.పూజలు చేయమని కోరుతున్నానురాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్‌సీపీ అభిమానులే కాదు, ప్రజలందరిని కోరుతున్నాను. చంద్రబాబు చేసిన పాపం వల్ల, వెంకటేశ్వరస్వామికి కోపం వచ్చి రాష్ట్రం మీద చూపకుండా, కోపం కేవలం చంద్రబాబుమీదే చూపించే విధంగా పూజలు చేయండి.ఎందుకంటే, జరిగింది ఘోర అపచారం. వెంకటేశ్వరస్వామిని పలచన చేస్తూ, ఆయన ప్రసాదాన్ని లోకువ చేస్తూ.. జరగనిది జరిగినట్లుగా.. జంతువుల కొవ్వు వాడనిది వాడినట్లుగా, ఆ లడ్డూలు పంపిణీ చేసినట్లుగా.. పచ్చి అబద్దాలు ఆడుతూ, ఇంత ఘోరం చేసిన వ్యక్తి. ఆ పాపం కడగబడాలి. అందుకే అందరినీ కోరుతున్నాను. పూజలు చేయమని వేడుకుంటున్నాను.ఏ మెస్సేజ్‌ ఇస్తున్నారు?బీజేపీవారిలో సిన్సియారిటీ ఉంటే, ఇంత ఘోరం చేసిన చంద్రబాబును రిప్రిమాండ్‌ చేయకుండా, టీటీడీ పేరు ప్రఖ్యాతలు మంట కలిపిన ఈ వ్యక్తిని ఎలా ఉపేక్షిస్తున్నారు? ఎందుకు బుద్ధి చెప్పడం లేదు? ఎందుకు మందలించడం లేదు?. చేసింది మన వాడే అనుకుని వదిలేస్తే.. ఏ మెసేజ్‌ ఇస్తున్నట్లు?మళ్లీ ఘోరమైన తప్పులు జరగొద్దు. అందుకు చంద్రబాబుకు తిట్లు పడాలి. మతాన్ని, దేవుణ్ని రాజకీయాల్లోకి తీసుకురాకుండా, ఆయనను మందలించాలి. సుప్రీంకోర్టు నుంచి ప్రధాని నుంచి పడాలి. అప్పుడైనా ఈ మనిషికి జ్ఞానం కలుగుతుందని శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

Tirupati Laddu Row: YS Jagan Counter On Chandrababu Naidu Allegations2
దొరికిపోయిన చంద్రబాబు.. అబద్ధాలు బట్టబయలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధికోసం చేస్తున్న తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈరోజు(శుక్రవారం) ‍ తాడేపల్లిలో ప్రెస్‌మీట్‌ నిర్వహించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. చంద్రబాబు చేస్తున్న విష రాజకీయాలను ఎండగట్టారు. చంద్రబాబు మళ్లీ మళ్లీ అబద్ధాలుసెప్టెంబర్‌ 18వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూలో‘యానిమల్‌ ఫ్యాట్‌ కలిసిందంటూ కొత్త వివాదానికి తెరలేపడాన్ని కూడా వైఎస్‌ జగన్‌ వీడియో ముఖంగా ప్రస్తావించారు. ‘‘భక్తులకు పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఉంది, ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రిడియంట్స్‌ కాకుండా యానిమల్‌ ఫ్యాట్‌ కూడా వాడారు’’అని చంద్రబాబు పేర్కొనడాన్ని వైఎస్‌ జగన్‌ కౌంటర్‌ చేశారు.సెప్టెంబర్‌ 22వ తేదీన తిరుమలకు నాలుగు నెయ్యి ట్యాంకర్లు వచ్చాయని, దానిని వాడారని చంద్రబాబు చెప్పడాన్ని వైఎస్‌ జగన్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ఆ ట్యాంకర్లను ఈవో వాడలేదని , వెనక్కి పంపామని చెబితే, ఏకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు.. ఆ నెయ్యి వాడారంటూ అసత్యపు ప్రచారం చేయడాన్ని వీడియో ప్లే చేసి మరీ చూపించారు వైఎస్‌ జగన్‌జూలై 23వ తేదీన టీటీడీ ఈవో ఇలా.. తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి చంద్రబాబు నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావులు వేర్వేరు సందర్భాల్లో ఏమి మాట్లాడారో వీడియోలు ప్లే చేసి మరీ చూపించారూ వైఎస్‌ జగన్‌. స్వయంగా చంద్రబాబు నాయుడు నియమించిన టీటీడీ ఈవో శ్యామలరావు జూలై 23 వ తేదీన ఏం మాట్లాడారో వీడియో ముఖంగా చూపించారు వైఎస్‌ జగన్‌ఆ నెయ్యి వాడలేదని ఈవోనే రిపోర్ట్‌ ఇచ్చాడు..మళ్లీ సెప్టెంబర్‌ 20వ తేదీన టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా ముఖంగా మాట్లాడుతూ ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని వాడలేదంటూ ధృవీకరించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు వైఎస్‌ జగన్‌. 22వ తేదీన తాను సంతకం చేసి మరీ ప్రభుత్వానికి రిపోర్ట్‌ ఇచ్చాడు ఈవో శ్యామలరావు. ల్యాబ్‌ టెస్టులో ఫెయిలైన నెయ్యిని వాడలేదని, సదరు ట్యాంకర్లను తిరిగి వెనక్కి పంపామని ఈవో తన రిపోర్ట్‌లో పేర్కొన్నాడు.

T​elangana Highcourt Summoned Hydra Commissioner3
హైడ్రా కమిషనర్‌ విచారణకు రావాలి: హైకోర్టు

సాక్షి,హైదరాబాద్‌:కూల్చివేతలపై హైడ్రాను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.శనివారం నోటీసులిచ్చి ఆదివారం కూలగొడతారా? అని హైడ్రాను హైకోర్టు నిలదీసింది. కోర్టు స్టే ఉన్నా ఎలా కూల్చివేస్తారని సంగారెడ్డి అమీన్‌పూర్‌ వాసి వేసిన పిటిషన్‌పై శుక్రవారం(సెప్టెంబర్‌27) హైకోర్టు విచారించింది.తన ఆస్పత్రిని కూల్చి మందులన్నీ నేలపాలు చేశారని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు.దీనిపై సోమవారం కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.ఫిజికల్‌గా లేదా వర్చువల్‌గా సోమవారం ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని కోరింది.ఇదీ చదవండి: హైడ్రా ఎఫెక్ట్‌..మూసీ పరివాహక ప్రాంతంలో ఉద్రిక్తత

Credit and Debit Card Rules From October 1st 20244
అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!

సెప్టెంబర్ ముగుస్తోంది.. అక్టోబర్ నెల మొదలవడానికి మరికొన్ని రోజుల మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి నెలలో మాదిరిగానీ వచ్చే నెలలో (2024 అక్టోబర్) కూడా ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ వంటివాటికి సంబంధించిన చాలా నిబంధలను మారతాయి. ఈ కథనంలో వచ్చే నెలలో ఏ రూల్స్ మారుతాయనే విషయం తెలుసుకుందాం..స్మాల్ సేవింగ్ స్కీమ్2024 అక్టోబర్ 1 నుంచి స్మాల్ సేవింగ్ రూల్స్ మారనున్నాయి. ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతాల వంటి పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు ఖాతాలు కొత్త సర్దుబాట్లకు లోబడి ఉంటాయి. రెగ్యులర్ కానీ నేషనల్ స్మాల్ సేవింగ్ (NSS) ఖాతాలపై కూడా కొంత ప్రభావం ఉంటుంది. కొన్ని అకౌంట్స్ క్రమబద్దీకరించాల్సి ఉంటుంది.ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఛార్జీలుఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. 2024 అక్టోబర్ 1 నుంచి మీరు రూ. 10వేలు ఖర్చు చేయడం ద్వారా రెండు కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌ పొందవచ్చు. మునుపటి క్యాలెండర్ త్రైమాసికంలో చేసిన ఖర్చులు.. తరువాత క్యాలెండర్ త్రైమాసికానికి యాక్సెస్‌ను అన్‌లాక్ చేస్తాయి.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మార్పులువచ్చే నెల ప్రారంభం నుంచే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్దులో కొన్ని మార్పులు జరగనున్నాయి. స్మార్ట్‌బై ప్లాట్‌ఫామ్‌లో.. యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే.. అందులో వచ్చే రివార్డ్ పాయింట్స్ కేవలం ప్రొడక్ట్‌కు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పుడు 1వ తేదీ నుంచి స్మార్ట్‌బై పోర్టల్ ప్రతి క్యాలెండర్ త్రైమాసికానికి 50,000 రివార్డ్ పాయింట్‌ల చొప్పున తనిష్క్ వోచర్‌ల కోసం రివార్డ్ పాయింట్‌ల రిడీమ్‌ను పరిమితం చేస్తుంది. ఈ మార్పులు ఇన్ఫినియా, ఇన్ఫినియా మెటల్ కార్డ్‌లకు మాత్రమే వర్తిస్తాయి.ఇదీ చదవండి : ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్‌ చరిత్రలో గూగుల్‌ శకం.. అనన్య సామాన్యంటీడీఎస్ వడ్డీ రేట్లుకేంద్ర బడ్జెట్ సమయంలో సెక్షన్ 194DA - జీవిత బీమా పాలసీకి సంబంధించి చెల్లింపును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. ఇది అక్టోబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. సెక్షన్ 194G - లాటరీ టిక్కెట్ల విక్రయంపై కమీషన్ తదితరాలను కూడా 5 నుంచి 2 శాతానికి తగ్గించాలని పేర్కొన్నారు. ఇది కూడా 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. కమిషన్ లేదా బ్రోకరేజీ చెల్లింపులు, హెచ్‌యూఎఫ్‌లు చేసే అద్దె చెల్లింపులు వంటి వాటికి అక్టోబర్ 1 నుంచి టీడీఎస్ రేట్లు తగ్గుతున్నట్లు సమాచారం.

Second Mpox case confirmed in Kerala5
దేశంలో మరో మంకీపాక్స్‌ కేసు నమోదు

తిరువనంతపురం: ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్‌ (ఎంపాక్స్‌) భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. ఎర్నాకుళం జిల్లాలో ఈ కేసు వెలుగుచూసినట్లు శుక్రవారం ఆ రాష్ట్ర వైద్య శాఖ ధ్రువీకరించింది. కేరళ ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం. .ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల్లోమంకీపాక్స్‌ ఉన్నట్లు నిర్ధారించారు. వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తేలింది. బాధితుడికి సోకిన ఎంపాక్స్‌ వైరస్ జాతి ఇంకా వెలుగులోకి రాలేదు. అంతకుముందు సెప్టెంబర్ 18 న, యూఏఈ నుండి ఇటీవల కేరళ మలప్పురం జిల్లాకు వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అతడికి వైద్య పరీక్షలు చేయగా పాజిటీవ్‌ వచ్చింది. దీంతో కేరళలో తొలి మంకీ పాక్స్‌ కేను నిర్ధారణైంది. తాజాగా రెండో కేసు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. మంకిపాక్స్‌ కేసులు నమోదు దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. వైరస్‌ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.చదవండి : మంకీపాక్స్‌ వైరస్‌ లక్షణాలు

TDP And Other Party Leaders Plan To Stop YS Jagan At Tirumala6
తిరుపతిలో వైఎస్‌ జగన్‌పై దాడికి కుట్ర?!

సాక్షి, తాడేపల్లి: సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ విధింపుతో పాటు తిరుమల వెళ్లకుండా తమ పార్టీ నేతలకు నోటీసులు, హౌజ్‌ అరెస్టులు చేస్తుండడంపై వైఎస్సార్‌సీపీ భగ్గుమంటోంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణకు దిగింది.తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా అవాంతరాలు సృష్టించేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అంటోంది. అంతేకాదు.. తిరుపతిలో జగన్‌పై దాడి చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఓ సంచలన ట్వీట్‌ చేసింది. ‘తిరుపతిలో వైఎస్‌ జగన్‌పై దాడికి కుట్ర!. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వైఎస్‌ జగన్‌ శుక్రవారం తిరుమల చేరుకోనున్నారు. తిరుమల పర్యటన సందర్భంగా ఆటంకాలు సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైఎస్‌ జగన్‌పై దాడి చేసేందుకు కూటమి నేతలు ప్లాన్‌ చేసినట్టు సమాచారం. బీజేపీ భాను ప్రకాశ్‌ రెడ్డి, జనసేన కిరణ్‌ రాయల్‌, టీడీపీ నేతలు కలిసి.. గూండాలను పురిగొల్పుతున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి, వాహన శ్రేణిపై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషులను కూడా పురమాయించినట్టు తెలుస్తోంది. వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటనతో లడ్డూ విషయంలో నీ బండారం బయటపడుతుందని భయపడుతున్నావా చంద్రబాబు?’ అని కామెంట్స్‌ చేసింది.తిరుపతిలో మాజీ సీఎం @ysjagan గారిపై దాడికి కుట్ర!శ్రీవారి దర్శనార్థం శుక్రవారం సాయంత్రం తిరుమలకి చేరుకోనున్న వైయస్ జగన్ గారుతిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైయస్ జగన్ గారిపై దాడికి భానుప్రకాశ్ రెడ్డి (@BJP4Andhra), కిరణ్ రాయల్ (@JanaSenaParty), @JaiTDP…— YSR Congress Party (@YSRCParty) September 27, 2024వైఎస్‌ జగన్‌ తిరుమల వెళ్తున్న సందర్భంగా ఎలాగైనా అవాంతరాలు కలిగించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అధికారం చేతుల్లో ఉంది కదా అని అడ్డగోలు ఆంక్షలతో ఆధ్యాత్మిక నగరాన్ని పోలీసుల వలయంగా మార్చేసింది. మరోవైపు నోటీసులు, హౌజ్‌ అరెస్టులతో వైఎస్సార్‌సీపీ నేతలనూ పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారు.ఇది కూడా చదవండి: డిక్లరేషన్‌ పేరుతో డ్రామాలు ఎందుకు?: వైఎస్సార్‌సీపీ

Let India Have Bad Game Gambhir Real Character Will Come Out :Tamim Iqbal7
‘చెత్తగా ఆడండి.. అప్పుడు అసలైన గంభీర్‌ను చూస్తారు’

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ గురించి బంగ్లాదేశ్‌ వెటరన్‌ క్రికెటర్‌ తమీమ్‌​ ఇక్బాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టును విజయపథంలో నడపగల సత్తా గౌతీకి ఉందని.. అయితే, అతడి కోచింగ్‌ స్టైల్‌ గురించి ఇప్పుడే అంచనాకు రాలేమన్నాడు. టీమిండియా చెత్తగా ఆడినపుడు గంభీర్‌ ‘నిజ స్వరూపం’ బయటపడుతుందని వ్యాఖ్యానించాడు.ద్రవిడ్‌ తర్వాతటీ20 ప్రపంచకప్‌-2024లో రోహిత్‌ సేన చాంపియన్‌గా నిలిచిన అనంతరం రాహుల్‌ ద్రవిడ్‌ ప్రధాన కోచ్‌ పదవి నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ను టీమిండియా హెడ్‌కోచ్‌గా నియమించింది బీసీసీఐ. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌(రెండుసార్లు ప్లే ఆఫ్స్‌) జట్టుకు మార్గదర్శనం చేయడంతో పాటు.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన మెంటార్‌గా ఘనత వహించిన అతడికి భారత జట్టు బాధ్యతలు అప్పగించింది.తన దూకుడు వైఖరికి విరుద్ధంగాశ్రీలంక పర్యటన సందర్భంగా జూలైలో కోచ్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన గంభీర్‌కు శుభారంభం దక్కింది. సూర్యకుమార్‌ సేన ఆతిథ్య జట్టు టీ20 సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అయితే, వన్డే సిరీస్‌లో మాత్రం రోహిత్‌ సేనకు ఘోర పరాభవం ఎదురైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత శ్రీలంక చేతిలో సిరీస్‌ ఓడిపోయింది. రెండో ప్రయత్నంలోనే గంభీర్‌కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైనా.. తన దూకుడు వైఖరికి విరుద్ధంగా ప్రశాంతంగానే కనిపించాడు. ఈ క్రమంలో స్వదేశంలో తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌తో టెస్టుల ప్రయణాన్ని మొదలుపెట్టిన గంభీర్‌కు.. రోహిత్‌ సేన ఘన విజయంతో స్వాగతం పలికింది. చెన్నై టెస్టులో బంగ్లాను 280 పరుగుల తేడాతో చిత్తు చేసి క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. గంభీర్‌ విశ్వరూపం చూస్తారుఈ నేపథ్యంలో భారత్‌- బంగ్లా సిరీస్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న తమీమ్‌ ఇక్బాల్‌ జియో సినిమా షోలో మాట్లాడుతూ గంభీర్‌ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘మీరు(టీమిండియా) వరుసగా గెలుస్తూ ఉంటే.. అతడి మనసులో నిజంగా ఏం దాగుందో బయటకు రాదు. మీరు ఎప్పుడైతే ఓ సిరీస్‌ కోల్పోతారో.. ఆ వెంటనే మరొకటి ఓడిపోతారో.. అప్పుడు తన నిజ స్వరూపం బయటపడుతుంది. జట్టును విజయవంతంగా ముందుకు నడిపించగల సామర్థం అతడికి ఉంది. అయితే, ఇప్పుడే తన కోచింగ్‌ స్టైల్‌పై నిశ్చితాభిప్రాయానికి రాకూడదు. టీమిండియా ఒక్క చెత్త మ్యాచ్‌ ఆడనివ్వండి.. అప్పుడు తెలుస్తుంది’’ అని తమీమ్‌ ఇక్బాల్‌ పేర్కొన్నాడు. గంభీర్‌ మరీ అంత కూల్‌ కాదని.. జట్టు ఓటములపాలైతే ఆటగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడడని అభిప్రాయపడ్డాడు.గంభీర్‌ ముందున్న సవాళ్లువరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 ఫైనల్‌ చేరడం సహా చాంపియన్స్‌ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్‌-2026, వన్డే వరల్డ్‌కప్‌-2027 రూపంలో గంభీర్‌కు కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి

Lokayukta Police registers FIR against Karnataka CM Siddaramaiah in MUDA case8
ముడా కుంభకోణం.. సీఎం సిద్దరామయ్యపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మైసూర్‌ అర్బర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ముడా) భూ కుంభకోణం వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో సిద్ధరామయ్యను మొదటి ముద్దాయిగా పేర్కొనగా.. ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామి, దేవరాజ్‌, మల్లికార్జున స్వామిలను వరుస నిందితులుగా చేర్చింది.మూడా భూ కుంభకోణానికి సంబంధించి సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని ట్రయల్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే లోకాయుక్త పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్‌ అనుమతివ్వడాన్ని బుధవారం హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. ఈ అనుమతిని సవాల్‌ చేస్తూ సీఎం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. గవర్నర్‌ చర్యలుచట్ట ప్రకారం ఉన్నాయని తెలిపింది. చదవండి: రాహుల్‌ ధైర్యవంతుడు, నిజాయితీ కలిగిన నేత: సైఫ్‌ ప్రశంసలు

"Devara" Telugu Movie Review And Rating; Deets Inside9
‘దేవర’ మూవీ రివ్యూ

టైటిల్‌: దేవరనటీనటులు: జూ.ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌, శృతి మారాఠే, శ్రీకాంత్‌, షైన్‌ టామ్‌ చాకో, చైత్ర రాయ్‌ తదితరులునిర్మాణ సంస్థ: ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్నిర్మాతలు: నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని,కొసరాజు హరికృష్ణదర్శకత్వం- స్క్రీన్‌ప్లే: కొరటాల శివసంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌సినిమాటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలుఎడిటింగ్‌: అక్కినేని శ్రీకర్‌ ప్రసాద్‌విడుదల తేది: సెప్టెంబర్‌ 27, 2024ఎన్టీఆర్‌ అభిమానుల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆయన సోలో హీరోగా నటించిన ‘దేవర’ మూవీ ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్‌ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఎన్టీఆర్‌, ఆచార్య లాంటి అట్టర్‌ ఫ్లాప్‌ తర్వాత డెరెక్టర్‌ కొరటాల శివ కలిసి చేసిన సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘దేవర’పై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది? కొరటాల శివకు భారీ బ్రేక్‌ వచ్చిందా? ఎన్టీఆర్‌కు ఇండస్ట్రీ హిట్‌ పడిందా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప( శ్రీకాంత్), కుంజర(షైన్‌ టామ్‌ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్‌ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా... దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం( జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్‌ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటేదాదాపు ఆరేళ్ల గ్యాప్ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో దేవర పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ ఓ మాదిరిగి ఉన్నా... సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుంది. లేకపోతే ఎన్టీఆర్ ఒప్పుకోరు కదా అని అంతా అనుకున్నారు. కానీ కొరటాల మరోసారి రొటీన్‌ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ట్రెడింగ్‌లో ఉన్న ఎలివేషన్‌ ఫార్ములాని అప్లై చేస్తూ కథనాన్ని నడిపించడం కొంతవరకు కలిసొచ్చే అంశం. యాక్షన్‌ సీన్లు కూడా బాగానే ప్లాన్‌ చేశారు. అయితే ఇవి మాత్రమే ప్రేక్షకుడికి సంతృప్తిని ఇవ్వలేవు. ఎన్టీఆర్‌ లాంటి మాస్‌ హీరో స్థాయికి తగ్గట్టుగా కథను తీర్చిదిద్దడంతో కొరటాల సఫలం కాలేదు.గతంలో కొరటాల తీసిన సినిమాల్లో ఆచార్య మినహా ప్రతి దాంట్లో కొన్ని గూస్‌బంప్స్‌ వచ్చే సీన్లతో పాటు ఓ మంచి సందేశం ఇచ్చేవాడు. ఒకటి రెండు పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ ఉండేవి. కానీ దేవరలో అలాంటి సీన్లు, డైలాగ్స్‌ పెద్దగా లేవు. స్క్రీన్‌ప్లే కూడా కొత్తగా అనిపించదు.ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ఎలివేషన్‌ ఫార్ములాతో కథను ప్రారంభించాడు. గ్యాంగ్‌స్టర్‌ని పట్టుకునేందుకు పోలీసు అధికారి(అజయ్‌) ఎర్రసముద్రం రావడం.. అక్కడ ఓ వ్యక్తి (ప్రకాశ్‌ రాజ్‌) దేవరకు భారీ ఎలివేషన్స్‌ ఇస్తూ పన్నెడేంళ్ల క్రితం ఆ ఊరిలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా ఎర్రసముద్రం, దేవర చుట్టు తిరుగుతుంది. ప్రేక్షకుల్ని మెల్లిగా దేవర ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఎర్ర సముద్రం నేపథ్యం, వారు దొంగలుగా మారడానికి గల కారణాలు, దేవర చూపించే భయం, ప్రతిది ఆకట్టుకుంటుంది. చెప్పే కథ కొత్తగా ఉన్నా తెరపై వచ్చే సీన్లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ మాత్రం బాగా ప్లాన్‌ చేశాడు. ఫస్టాఫ్‌ అంతా దేవర చుట్టు తిరిగితే.. సెకండాప్‌ వర చుట్టూ తిరుగుతుంది. రెండో ఎన్టీఆర్‌ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కథ సాగదీతగా అనిపిస్తుంది. జాన్వీ కపూర్‌ ఎపిసోడ్స్‌ అతికినట్లుగా అనిపిస్తాయి. పాట మినహా ఆమెతో వచ్చే సీన్లన్ని బోరింగ్‌గానే సాగుతాయి. ప్రీ క్లైమాక్స్‌లో సముద్రం లోపల ఎన్టీఆర్‌తో వచ్చే యాక్షన్‌ సీన్లు అదిరిపోతాయి. పార్ట్‌ 2కి లీడ్‌ ఇస్తూ కథను ముగించారు. క్లైమాక్స్‌ కొంతవరకు ఆసక్తికరంగా సాగినా.. ట్విస్ట్‌ పాయింట్‌ బాహుబలి సినిమాను గుర్తు చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్‌ నటనకు ఏం వంక పెట్టగలం. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. ఇక దేవర, వర(వరద) అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన ఎన్టీఆర్‌.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్‌ తో మాస్‌ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. ఇక డ్యాన్స్‌ కూడా ఇరగదీశాడు.ఈ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. పల్లెటూరి అమ్మాయి ‘తంగం’ పాత్రలో ఒదిగిపోయింది. తెరపై అచ్చం తెలుగమ్మాయిలాగే కనిపించింది. కాకపోతే ఈమె పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. ఇందులో సైఫ్‌ అలీఖాన్‌ భైరవ అనే ఓ డిఫరెంట్‌ పాత్రను పోషించాడు. నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా నటించాడు. పార్ట్‌ 2 ఆయన పాత్ర పరిధి ఎక్కువగా ఉంటుంది. శ్రీకాంత్‌, ప్రకాశ్‌ రాజ్‌, షైన్‌ టామ్‌ చాకో, చైత్ర రాయ్‌ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. అనిరుధ్‌ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. చుట్టంమల్లే పాటకు థియేటర్స్‌లో ఈలలు పడతాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

KSR Comments On Chandrababu Over Tirumala Laddu10
తిమ్మిని బమ్మిని చేసే యత్నం.. బాబు పాత టెక్నిక్‌!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక విశిష్టత ఉంది. చెప్పదలుచుకున్న అబద్ధాన్ని నిజం అనిపించడానికి అన్ని అవకాశాలూ వాడుకుంటారు. రాజకీయ ప్రత్యర్థులపై బురద వేయడానికి ఏ అవకాశాన్నీ వదులుకోరు. మొహమాటపడరు కూడా. శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఒక తప్పుడు ఆరోపణ చేసి దాన్ని నిజం చేసేందుకు ఇప్పుడు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు చంద్రబాబు నైజానికి తాజా నిదర్శనం. సీబీఐ విచారణకు ససేమిరా అంటూ తనకు కావాల్సిన అధికారులతో ఏర్పాటు చేసుకున్న సిట్‌తో కొత్త డ్రామా కూడా అదే. ఈ కుతంత్రాలను ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ కూడా పూర్తిస్థాయిలో సిద్ధం కావడంతో తెలుగుదేశం అనుకూల మీడియా ఇప్పుడు హైరానా పడుతోంది. నెపాన్ని వైఎస్సార్‌సీపీపై నెట్టేందుకు కనిపించిన చెత్తా చెదారమంతా పోగేసి ప్రచారం చేస్తోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపేశామని ముందు చెప్పిన టీటీడీ అధికారులు ఇప్పుడు మాట మారుస్తూండటం! కల్తీ గురించి తెలియక నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీలో వాడేశామంటున్నారు వాళ్లిప్పుడు! ఈ కథనం కూడా ఈనాడులోనే ప్రచురితమైంది. అంతేకాదు... ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని మాకు సరఫరా చేసిందంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు.. అంటే రెండు నెలల తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలస్యమైంది ఎందుకు అన్న ప్రశ్నకు వారిస్తున్న సమాధానం మరీ విచిత్రంగా ఉంది. సరఫరా అయిన తరువాత అనుమానం కొద్దీ నమూనాలు సేకరించి పరీక్షలకు పంపామని అంటున్నారు! కొందరు స్వార్థపూరిత శక్తులతో చేతులు కలిపిన ఏఆర్‌ డెయిరీ కుట్రపూరితంగా ఇలా చేసిందని టీటీడీ జీఎం మురళీ కృష్ణ తన ఫిర్యాదులో చెప్పుకొచ్చారని సమాచారం. ఈ ఫిర్యాదులోని అంశాల్లో నిజానిజాలను కాసేపు పక్కన బెడదాం. టీటీడీ అధికారులు స్వయంగా.. కల్తీ గురించి తెలియక లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యిని వాడేశామంటే.. అది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసినట్లు ఒప్పుకోవడమే కదా? అంటే... ప్రభుత్వం ఇంతకూ తెగించిందన్నమాట. ప్రజలన్ని మోసం చేసినా ఫర్వాలేదు కానీ.. తమ రాజకీయ లక్ష్యాలు మాత్రం నెరవేరాలని అనుకుంటున్నట్లే. కల్తీ జరిగిన నెయ్యిని భక్తులు తిన్నారని చెప్పడం దుర్మార్గం. ఇదంతా చంద్రబాబు కుత్సిత రాజకీయ నాటకంలో రెండో అంకమని అనుకోవాలి. ఈవో అబద్ధం చెప్పాడా? లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీపై బాబు అసత్య ప్రచారం మొదలైన సమయంలో ఆయన స్వయంగా నియమించిన టీటీడీ ఈవో శ్యామలరావు ఏమన్నాడన్నది ఒకసారి గుర్తు చేసుకోవాలిప్పుడు. ఏఆర్‌ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని గుర్తించి వెనక్కు పంపామని ఆయన ఎందుకు చెప్పారు? అందుకు భిన్నంగా నెయ్యిని వాడేసి ఉంటే ఆయనపై చర్యలు తీసుకోవాలి కదా? ఎందుకు బాబు ప్రభుత్వం వెనకాడుతోంది? కల్తీ జరిగిందని గుర్తించక వాటిని వాడేశామని టీటీడీ అధికారులు నిస్సిగ్గుగా చెబుతుంటే మూడు నెలలైనా వారిపై చర్యలేవి? కేసు వివరాలు ఇప్పుడు ఈనాడులో ప్రముఖంగా వచ్చాయి. ఆ పత్రిక ఎక్కడా ఇలాంటి సందేహాలను లేవనెత్తక పోవడం.. ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లుగా కథనం ప్రచురించడం వెనుక ఆంతర్యం ఏమిటి? అదే సమయంలో లడ్డూ తయారీకి వాడుతున్న జీడిపప్పు, యాలకులు నాసిరకం అంటూ మరో కథనాన్ని ఈనాడు అచ్చుగుద్దింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో అడుగడుగునా అవకతవకలు జరిగాయని విజిలెన్స్‌ వారు ఇప్పుడు కనిపెట్టారట. ఎంత హాస్యాస్పదం. నిజానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా టీటీడీకి సంబంధించిన వివిధ సమస్యలపై వార్తలు వస్తునే ఉంటాయి. తిరుమల భక్తుల అగచాట్లపై ఇదే ఈనాడు మూడు దశాబ్దాల క్రితం కూడా కథనాలు ప్రచురించింది. విశేషమేమిటంటే మతం, దైవం అంటే అంత విశ్వాసం లేని సీనియర్ పాత్రికేయుడు, ఏడు తరాల పేరుతో రూట్స్ గ్రంథానిన అనువదించిన ప్రముఖుడు అయిన ఉమా మహేశ్వర రావును ఇందుకోసం ఈనాడు యాజమాన్యం ప్రత్యేకంగా తిరుమలకు పంపి మరీ కథనాలు సిద్ధం చేయించింది. మరి... ఇందుకు అప్పుడు తిరుమలకు అపచారం జరిగిందని అప్పుడెవరూ గొడవ చేయలేదే! కానీ ఇప్పుడు వైఎస్సార్ సీపీపై ఏదో ఒక బురద చల్లడం కోసం రకరకాల దిక్కుమాలిన రిపోర్టులు తయారు చేస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తోంది ఈనాడు! ఇక ఆంధ్రజ్యోతి ఒక కథనం రాస్తూ లడ్డూ ప్రసాదం అపవిత్రం అవడం పట్ల ప్రభుత్వం సీరియస్ గా ఉందని రాశారు. అంటే చంద్రబాబు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా వీరు భజన చేస్తున్నారన్న మాట. ఈ విషయమై డిజిపి సిట్ అధికారులకు దిశా నిర్దేశం చేశారట. కల్తీ నెయ్యిపై శ్రీ వైష్ణవులు అభ్యంతరం చెబితే వారిని బెదిరించారని కొత్త కథలు అల్లుతున్నారు. ఈ రకంగా చంద్రబాబు చేసిన తప్పును కప్పిపుచ్చి వైఎస్సార్‌సీపీపై ఆరోపణ చేయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాయి. జంతు కొవ్వు కలిసిన నెయ్యి తమ చేతికి అంటిందని భావించి ఉంటే శ్రీవైష్ణవులు అప్పుడే కచ్చితంగా నిరసన తెలిపేవారు. అసలు అలాంటి కల్తీ జరిగితే ఆ వాసనను వీరు భరించడమే కష్టమయ్యేది. శ్రీవారిని నమ్మే వారు ఎవరో చేసిన బెదిరింపులకు ఎందుకు భయపడతారు? టీటీడీ మీడియా కట్టు కథలు రాస్తున్నది అనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? ఈ మీడియా చెప్పేవాటిలో నిజముంటే చంద్రబాబు ప్రభుత్వం ఇంతకాలం చర్య తీసుకోకుపోవడంలో మతలబు ఏంటో వివరించాలి కదా! మొత్తం ఇదంతా కూడా బ్లాక్‌ మెయిల్‌ వ్యూహంలో ఒక భాగంగా కనిపిస్తోంది. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ జరిగితే తాము చేసిన ఘోర అపచారం బయటకు వస్తుందేమోనని భయపడి చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే మీడియా ముందస్తుగా కొత్త కథలు అల్లి జనంపై రుద్దుతున్నట్టుగా వుంది. వైఎస్సార్‌సీపీ హయాంలో దేవాలయాలకు సంబంధించి ఏ చిన్న ఘటన జరిగినా దాని వెనక పలుచోట్ల జనసేన, తెలుగుదేశం వారి హస్తముందని పోలీసుల విచారణలో వెల్లడైనా అదంతా వైఎస్సార్సీపీవారి పనేననంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ వంటి వారు అసత్య ప్రచారం చేసేవారు. మత రాజకీయం చేయడానికి ఎక్కడా వెనకాడేవారు కాదు. ప్రస్తుతం తిరుమల లడ్డూ విషయంలో కూడా అదే తరహా మత రాజకీయం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రెండు రోజుల క్రితం ఒక రథాన్ని కొందరు దుండగులు దగ్ధం చేశారు. మరి ఇది టీడీపీ ప్రభుత్వానికి మచ్చ కాదా? ఈ దుశ్చర్యను వైసీపీకి పులమడానికి చంద్రబాబు ప్రయత్నిస్తే రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మాత్రం ఈ ఘటనకు రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు రాజకీయం ఇలా ఉంటుందన్నమాట. అంతే కాకుండా ఇలాంటి నేరాలు చేస్తే మక్కెలిరగ్గొడతామని సీఎం చెబుతున్నారు.ఇంతకాలం జరిగిన హింసాకాండను ఆయన ఎలా సమర్థించారో చెప్పాలి. దౌర్జన్యాలకు పాల్పడ్డ ఎంతమంది టీడీపీ శ్రేణుల మక్కెలు విరగ్గొట్టారు? కబుర్లు ఆకాశానికి అంటుతాయి. చర్యలు మాత్రం పాతాళంలో ఉంటాయి.! వైఎస్‌ జగన్ హయాంలో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేయడానికి చంద్రబాబు ,పవన్ కల్యాణ్‌ లు ఎన్నిరకాలుగా రెచ్చగొట్టేవారో చూశాం. ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చాక కూడా అదే రకంగా మత రాజకీయాలు చేస్తూ ఉసిగొలుపుతూ, పైగా ఎదురు దాడి చేస్తున్నారు. అదే కాదు విజయవాడ వరదల్లో చాలా సాయం చేశామంటూ ఒక సమావేశం పెట్టుకొని అందులో కూడా తన కుట్ర రాజకీయాలను వదలి పెట్టలేదు. బోట్లను నదిలోకి వదిలి ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికి వైఎస్సార్‌సీపీ కుట్ర పన్నిందని ఆయన మరోసారి ఆరోపించారు. ఆ బోట్లు తెలుగు దేశం వారివి అని తెలిసినా ఆయన ఇలా మాట్లాడుతూనే ఉంటారు. వరదల్లో ఆయనకు ఆయనే సర్టిపికెట్‌ ఇచ్చుకుంటారు. మంచి చేస్తే ఫర్వాలేదు. కానీ వరద బాధితులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నవారు ఉన్నారు. వరద సాయం అందడంలో కొన్ని సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. రేషన్ కార్డులు లేవని సాయం అందని భవానీ పురం కరకట్ట వాసులు ఆందోళనకు దిగితే వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఈ విషయాన్ని కూడా మరిచిపోవద్దు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో, చంద్రబాబు పాలన గతంలో ఎన్నడూ లేని విధంగా నాసిరకంగా, మత రాజీకాయలు చేయాలన్న లక్ష్యంతో, అబద్దాల పాలన సాగుతుండడం అత్యంత దురదృష్టకరం. వీటితో సూపర్ సిక్స్ హామీలను జనం మరిచిపోతారని ప్రభుత్వ నేతలు భ్రమపడుతున్నారేమో!-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
NRI View all
title
హాలీవుడ్‌లో మనోడి సినిమా

కరీంనగర్‌ అర్బన్‌: సినిమా.. అదో రంగుల ప్రపంచం.

title
టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'': తెలుగు సాహిత్య వేదిక 206వ సాహిత్య సదస్సు

ఈ నెల (సెప్టెంబరు నెల) 21వ తేదీ  శనివారం  డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ ''నెలనె

title
డాలస్‌లో ఘనంగా అక్కినేని శతజయంతి వేడుకలు..!

దాదాసాహెబ్ పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్, నట సామ్రాట్, డా.

title
అమెరికాలో గుండెపోటుతో తెలుగు విద్యార్థి హఠాన్మరణం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు డల్లాస్‌లో గుండెపోటుతో మరణించాడు.

title
న్యూజెర్సీలో విజయవంతంగా నాట్స్ పికిల్‌బాల్ టోర్నీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలుగు వారిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు న్యూజెర్సీలో తాజాగా పికిల్ బాల్ టోర్న

Advertisement
Advertisement