Breaking News

మరింత ఖరీదైన బంగారం.. కొనాలంటే..

Published on Thu, 01/09/2025 - 11:50

దేశంలో బంగారం ధరలు (Gold Price) వరుసగా రెండో రోజూ మరింత పెరిగాయి. మూడు రోజులు స్థిరంగా ఉన్న పసిడి ధరలు క్రితం రోజున ఉన్నట్టుండి స్వల్పంగా పెరిగాయి. ఈ పెరుగుదలను కొనసాగిస్తూ నేడు (January 9) మరింతగా ఎగిశాయి. దీంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు.

బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతంలో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.350 (22 క్యారెట్స్), రూ.380 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 72,600కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,200 వద్దకు ఎగిశాయి.

ఇతర ప్రాంతాల్లో.. 
దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.79,350 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.72,750 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.350,  రూ.380 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.

చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.350 పెరిగి రూ. 72,600 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.380 బలపడి రూ. 79,200 వద్దకు చేరాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.

వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా రెండు రోజుల క్రితం వెండి ధర కేజీకి రూ.1000 మేర పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్ద, ఢిల్లీలో రూ. 92,500 వద్ద ఉన్నాయి.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Videos

LIVE: తిరుపతి ఘటనపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

ఈ ఘటన రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి

అంబులెన్సుకు ఫోన్ చేయమంటే ఫోన్లో వీడియోలు చూస్తున్నారు

బాబు దొంగ డ్రామా.. మైక్ లేకుండా.. మైక్ పెట్టుకుని

తప్పు ప్రభుత్వానిదే పవన్ మరో ప్రాయశ్చిత్త దీక్ష ?

తిరుపతి తొక్కిసలాట బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ

రోజా ఫైర్...!

వైఎస్ జగన్ గూస్ బంప్స్ విజువల్స్

పుష్ప-2 టార్గెట్ రూ. 2వేల కోట్లు కాదు..

అడ్డుకున్న పోలీసులు... తగ్గేదేలే అంటూ నడుచుకుంటూ వెళ్లిన జగన్

Photos

+5

వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ అడ్డగింత (ఫోటోలు)

+5

తిరుపతి తొక్కిసలాట - క్షతగాత్రులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫోటోలు)

+5

రెండో పెళ్లి.. ఫోటోలు షేర్‌ చేసిన నటుడు సాయికిరణ్‌ (ఫోటోలు)

+5

డైమండ్‌ ఆభరణాలతో మహారాణిలా సితార, ‘తండ్రికి తగ్గ బిడ్డ’ అంటూ ప్రశంసలు

+5

సంక్రాంతి సంబరాల్లో మోహన్ బాబు (ఫొటోలు)

+5

తిరుపతి తొక్కిసలాట ఘటన..ఈ పాపం మీదే (ఫొటోలు)

+5

‘గేమ్ ఛేంజర్’ మూవీ HD స్టిల్స్‌

+5

‘నిన్ను నన్ను కన్న ఆడది..రా!’ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కొత్త వైరస్‌ వచ్చేసింది.. మాస్క్‌ ఈజ్‌ బ్యాక్‌ (ఫొటోలు)

+5

తిరుపతి తొక్కిసలాట : హృదయ విదారక దృశ్యాలు (ఫొటోలు)