ఒత్తిడికి దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవన శైలికి అలవర్చుకోవాలి.
విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలుతీసుకోవాలి.
బాదం: చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెంచుతుంది.
ఫైబర్, పోషకాలు లభించే బ్రౌన్ రైస్, హోల్ వీట్ బ్రెడ్ ,క్వినోవా లాంటి తృణధాన్యాలు మంచిది.
ఉప్పును బాగా తగ్గించాలి, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
మాంసాహారాన్ని మితంగా తింటూ,చేపలు, చిక్కుళ్లు లాంటివి తీసుకోవాలి.
ఇప్పటికే రక్తపోటు లాంటివి ఉంటే, క్రమం తప్పకుండా మందులువాడాలి.
వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయించుకోవాలి.
రెగ్యులర్ వ్యాయామం గుండె ఆరోగ్యానికి మంచిది
రోజుకు 7-9 గంటలు నిరంతరాయంగా నిద్రపోవాలి.