Money Mantra
-
గ్రీన్‌లో కదలాడుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 24,821కు చేరింది. సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 81,314 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.01 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.18 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.27 శాతం లాభపడింది.ఇదీ చదవండి: 2030 నాటికి రూ.32 లక్షల కోట్లు అవసరంఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల కారణంగా ఇటీవల భారీగా పడిన మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇరాన్ ఆయిల్ రిఫైనరీలపై దాడి చేయబోమని ఇజ్రాయెల్ ప్రకటించడంతో క్రూడాయిల్ ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. ఇది ఒకింత సానుకూలాంశమే. కానీ అక్టోబర్ నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎఫ్ఐఐలు భారీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ నుంచి షేర్లు అమ్ముతున్నారు. దాంతో మార్కెట్లు పతనమవుతున్నాయి. దానికితోడు నవంబర్ మొదటి వారంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉండడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 72 పాయింట్లు తగ్గి 24,781 వద్దకు చేరింది. సెన్సెక్స్ 73 పాయింట్లు దిగజారి 81,151 వద్ద ముగిసింది.మదుపర్లు లాభాలు స్వీకరించడం, అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్ ఈరోజు దేశీయ స్టాక్‌మార్కెట్‌ను నడిపించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తన ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగుస్తున్నాయి. చైనా మార్కెట్లో ప్రభుత్వ నిర్ణయాలు కొంత అంతర్జాతీయ మార్కెట్లకు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. రానున్న యూఎస్ ఎన్నికలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: అమ్మో ఏఐ.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్!సెన్సెక్స్ 30 సూచీలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా, నెస్లే, ఎల్ అండ్ టీ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, హెచ్‌యూఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, సన్‌ఫార్మా కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం అధిక స్థాయిలో ప్రారంభమయ్యాయి.ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 420 పాయింట్లు లేదా 0.52 శాతం పెరిగి 81,645 వద్ద, నిఫ్టీ 50 108 పాయింట్లు లేదా 0.44 శాతం పెరిగి 24,962 వద్ద పయనిస్తున్నాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఏషియన్ పెయింట్స్, విప్రో టాప్ గెయినర్స్‌గా లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు టాటా కన్య్సూమర్ ప్రొడక్ట్స్, కొటక్ మహీంద్రా, బీపీసీఎల్, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ లూజర్స్‌గా భారీ నష్టాల్లో చలిస్తున్నాయి.కాగా సోమవారం ఉదయం చైనా సెంట్రల్ బ్యాంక్ ప్రకటించిన రేటు తగ్గింపును ట్రేడర్లు అంచనా వేయడంతో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మార్కెట్లు స్వల్పంగా పెరిగాయి. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఒక సంవత్సరం రుణ ప్రైమ్ రేటుని 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 3.1 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. అయితే ఐదేళ్ల ఎల్పీఆర్ 3.6 శాతానికి తగ్గింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పతనమవుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ 114 పాయింట్లు తగ్గి 24,635కు చేరింది. సెన్సెక్స్ 427 పాయింట్లు నష్టపోయి 80,573 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 103.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.7 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.09 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.02 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.04 శాతం లాభపడింది.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల కారణంగా ఇటీవల భారీగా పడిన మార్కెట్లు క్రమంగా పుంజుకున్నాయి. గడిచిన రెండు రోజుల నుంచి తిరిగి మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. ఇరాన్ ఆయిల్ రిఫైనరీలపై దాడి చేయబోమని ఇజ్రాయెల్ ప్రకటించడంతో క్రూడాయిల్ ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. ఇది ఒకింత సానుకూలాంశమే. కానీ అక్టోబర్ నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎఫ్ఐఐలు భారీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ నుంచి షేర్లు అమ్ముతున్నారు. దాంతో మార్కెట్లు పతనమవుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ 125 పాయింట్లు తగ్గి 24,857కు చేరింది. సెన్సెక్స్ 215 పాయింట్లు నష్టపోయి 81,288 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 103.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.7 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.03 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.47 శాతం పెరిగింది. నాస్డాక్ 0.28 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: టాటా కంపెనీకి షోకాజ్ నోటీసులుకెనడా, భారత్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు తీవ్రస్థాయికి చేరాయి. నిజ్జర్ సింగ్ అనే ఖలిస్థానీను గతంలో కెనడాలో హత్య చేశారు. అందుకు భారత ప్రభుత్వం కారణమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర విమర్శలు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర దుమారం రేగింది. నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, ఆధారాలుంటే వెంటనే వెల్లడించాలని భారత్ చెప్పింది. ఈ పరిణామాలు ఇండియన్ ఈక్విటీ మార్కెట్లపై కొంత ప్రభావం చూపుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలలో ముగిసిన మార్కెట్లు.. దెబ్బేసిన ఆటో, ఐటీ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలలో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 318.76 పాయింట్లు లేదా 0.39% క్షీణించి 81,501.36 వద్ద స్థిరపడగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 98.20 పాయింట్లు 0.39% నష్టపోయి 24,959.15 వద్ద ముగిసింది.నిఫ్టీ లిస్టింగ్‌లో ట్రెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హీరో మోటర్ కార్ప్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్‌గా అధిక నష్టాలను చవిచూశాయి. మరోవైపు హెచ్డీఎఫ్సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, గ్రాసిమ్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్స్‌గా మంచి పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా కదలాడుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:58 సమయానికి నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 25,078కు చేరింది. సెన్సెక్స్ 54 పాయింట్లు పుంజుకుని 81,882 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 103.25 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.69 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.04 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.76 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.01 శాతం దిగజారింది.ఇదీ చదవండి: ‘స్మార్ట్’ ఉన్నా ఫీచర్ ఫోన్లను ఎందుకు కొంటున్నారు?కెనడా, భారత్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు తీవ్రస్థాయికి చేరాయి. నిజ్జర్ సింగ్ అనే ఖలిస్థానీను గతంలో కెనడాలో హత్య చేశారు. అందుకు భారత ప్రభుత్వం కారణమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర విమర్శలు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర దుమారం రేగింది. నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, ఆధారాలుంటే వెంటనే వెల్లడించాలని భారత్ చెప్పింది. ఈ పరిణామాలు ఇండియన్ ఈక్విటీ మార్కెట్లపై కొంత ప్రభావం చూపుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
82 వేల మార్కు చేరిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ 58 పాయింట్లు పెరిగి 25,185కు చేరింది. సెన్సెక్స్ 183 పాయింట్లు పుంజుకుని 82,142 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 103.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75.3 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.09 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.77 శాతం లాభపడింది. నాస్డాక్ 0.87 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ సేవలకు డేట్ ఫిక్స్విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. చైనా సహాయక ప్యాకేజీలు, అక్కడ అందుబాటులో ఉన్న షేర్ల విలువలు ఎఫ్‌పీఐలను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రానున్న యూఎస్ ఎన్నికలు, ఎఫ్ఐఐలు చైనావైపు మొగ్గు చూపుతుండడం వంటి అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నట్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ మార్కెట్ క్రాష్‌ను సదవకాశంగా మలచుకోవాలని సూచిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
25,000 మార్కు దాటిన నిఫ్టీ.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 25,052కు చేరింది. సెన్సెక్స్ 291 పాయింట్లు పుంజుకుని 81,656 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 102.89 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79.03 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.09 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.61 శాతం లాభపడింది. నాస్డాక్ 0.33 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల కారణంగా గత వారం ముడిచమురు ధరలు రివ్వున పైకెగశాయి. మరోపక్క డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ సరికొత్త కనిష్టం 84ను దాటి ముగిసింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ అంశాలన్నీ విదేశీ మారక నిల్వలపై ప్రతికూల ప్రభావాన్ని చూపగలవని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చైనా సహాయక ప్యాకేజీలు, అందుబాటులో ఉన్న షేర్ల విలువలు ఎఫ్‌పీఐలను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 230.05 పాయింట్లు లేదా 0.28 శాతం క్షీణించి 81,381.36 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 34.20 పాయింట్లు లేదా 0.14 శాతం క్షీణించి 24,964.25 వద్ద ముగిసింది.టీసీఎస్, మహీంద్రా&మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్, సిప్లా, అదానీ ఎంటర్ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్ నేతృత్వంలోని 30 సెన్సెక్స్ స్టాక్‌లలో 13, 50 నిఫ్టీ స్టాక్‌లలో 22 ప్రతికూలంగా ముగిశాయి. ఈ షేర్ల ధరలు 1 శాతం నుంచి 2 శాతం వరకు తగ్గాయి.మరోవైపు హెచ్‌సీఎల్ టెక్, ట్రెంట్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్టెల్, ఎల్అండ్టీలో లాభాలను అందుకున్నాయి. విస్తృత మార్కెట్లలో బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.44 శాతం లాభాలతో బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:57 సమయానికి నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 25,005కు చేరింది. సెన్సెక్స్ 28 పాయింట్లు నష్టపోయి 81,585 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 102.8 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.06 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.21 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.05 శాతం దిగజారింది.ఇదీ చదవండి: ఎప్పటికీ మారనిది ఏంటో చెప్పిన టాటాపశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం ముగియడం, చైనాలో పెరుగుతున్న ఎఫ్‌డీఐ ఇన్వెస్ట్మెంట్లు, జపాన్ మార్కెట్లు పుంజుకుంటుండడంతో దేశీయ మార్కెట్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లు పడిపోవడం దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఒక సదావకాశమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి మార్కెట్లు పడినప్పుడు నిరాశ చెందుకుండా మంచి కంపెనీలు ఎంచుకుని అందుకు తగ్గట్టుగా మదుపు చేయాలని సూచిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సానుకూలంగా ముగిసిన మార్కెట్లు.. మెరిసిన బ్యాంకింగ్ షేర్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం గురువారం సానుకూలంగా ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ 140.75 పాయింట్లు లేదా 0.17 శాతం పెరిగి 81,607.55 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ మునుపటి ముగింపుతో పోలిస్తే 16.50 పాయింట్లు లేదా 0.07 శాతం పెరిగి 24,998.45 వద్ద ముగిసింది.నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 27 నష్టాలలో ముగిశాయి. సిప్లా, టెక్ మహీంద్రా, ట్రెంట్, సన్ ఫార్మా , ఇన్ఫోసిస్‌లు 3.37 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. మరోవైపు బ్యాంకింగ్ షేర్లు లాభాలతో మెరిశాయి. కోటక్ మహింద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:58 సమయానికి నిఫ్టీ 79 పాయింట్లు పెరిగి 25,061కు చేరింది. సెన్సెక్స్ 288 పాయింట్లు పుంజుకుని 81,775 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 102.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 76 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.07 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.71 శాతం లాభపడింది. నాస్డాక్ 0.6 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడుపశ్చిమాసియా ఉద్రిక్తతలు ఉండడంతో మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య పోరు లెబనాన్‌కు పాకడం.. ఇరాన్ కూడా రంగంలోకి దూకి ఇజ్రాయెల్‌పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ మార్కెట్ క్రాష్‌ను సదవకాశంగా మలచుకోవాలని సూచిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ల తిరోగమనం.. నష్టాల్లో ముగింపు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ప్రారంభ లాభాలను కోల్పోయి ప్రతికూలంగా తిరోగమించాయి. సెన్సెక్స్ 167.71 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టపోయి 81,467.10 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ ఈరోజు 82,319.21 - 81,342.89 స్థాయిల శ్రేణిలో ట్రేడైంది. సెన్సెక్స్‌ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ కూడా 31.20 పాయింట్లు లేదా 0.12 శాతం తగ్గి 24,981.95 వద్దకు పడిపోయింది. బుధవారం ఇది 25,234.05 - 24,947.70 రేంజ్లో చలించింది.నిఫ్టీ50 ఇండెక్స్‌లోని 50 స్టాక్స్‌లో సిప్లా, ట్రెంట్, టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , టెక్ మహీంద్రా నేతృత్వంలోని 31 స్టాక్స్ గ్రీన్‌లో ముగిసి 2.58 శాతం వరకు పెరిగాయి. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఒఎన్జీసీ, హిందుస్తాన్ యూనిలీవర్ 19 స్టాక్‌లలో దిగువన ముగిశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎంపీసీ సమావేశం..లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 25,068కు చేరింది. సెన్సెక్స్ 170 పాయింట్లు పుంజుకుని 81,801 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 102.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 77.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.01 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.97 శాతం లాభపడింది. నాస్డాక్ 1.44 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: కిక్కెక్కిస్తోన్న ‘క్విక్ కామర్స్’!ఈరోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం వివరాలు వెల్లడి కానున్నాయి. మార్కెట్లు కొంత ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దానికితోడు పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఉండడంతో మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య పోరు లెబనాన్‌కు పాకడం.. ఇరాన్ కూడా రంగంలోకి దూకి ఇజ్రాయెల్‌పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గడిచిన రెండేళ్ల కాలం నుంచి వారం రోజుల్లో మార్కెట్లు భారీగా పడిపోయాయి. అయితే, ఈ పతనాలను చూసి రిటైల్ ఇన్వెస్టర్లు మరీ అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ మార్కెట్ క్రాష్‌ను సదవకాశంగా మలచుకోవాలని సూచిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు ముగింపు! లాభాల్లోకి మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. 5-రోజుల నష్టాల నుంచి బయటపడి విజయాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 584.81 పాయింట్లు లేదా 0.72 శాతం లాభపడి 81,634.8 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా 217.38 పాయింట్లు లేదా 0.88 శాతం పెరిగి 25,013.15 వద్ద ముగిసింది.సెన్సెక్స్ వ్యక్తిగత స్టాక్‌లలో అదానీ పోర్ట్స్, ఎం&ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్&టీ, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. 1 శాతం నుండి 4.5 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు టాటా స్టీల్, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫిన్సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఐటీసీ షేర్లు 2.7 శాతం వరకు క్షీణించి సెన్సెక్స్ టాప్ లూజర్‌గా ఉన్నాయి.విస్తృత మార్కెట్లలో వీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.86 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.44 శాతం పెరిగింది. విస్తృత సూచీలు నేడు బెంచ్‌మార్క్ సూచీలను అధిగమించాయి. ఇదిలా ఉండగా సెక్టార్లలో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ మినహా అన్ని సూచీలు ఈరోజు ట్రేడింగ్‌లో ర్యాలీ చేశాయి. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 3 శాతం, నిఫ్టీ ఆటో 1.84 శాతం, నిఫ్టీ ఫార్మా 1.5 శాతం చొప్పున ఎగబాకాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 24,808కు చేరింది. సెన్సెక్స్ 84 పాయింట్లు పుంజుకుని 81,142 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 102.53 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 80.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.02 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.96 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.18 శాతం దిగజారింది.ఇదీ చదవండి: హైడెల్బర్గ్ సిమెంట్‌పై అదానీ కన్ను!రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థలకు తాజాగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు తీవ్ర అనిశ్చితులకు గురిచేస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య పోరు లెబనాన్‌కు పాకడం.. ఇరాన్ కూడా రంగంలోకి దూకి ఇజ్రాయెల్‌పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గడిచిన రెండేళ్ల కాలం నుంచి వారం రోజుల్లో మార్కెట్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. అయితే, ఈ పతనాలను చూసి రిటైల్ ఇన్వెస్టర్లు మరీ అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ మార్కెట్ క్రాష్‌ను సదవకాశంగా మలచుకోవాలని సూచిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 25,095కు చేరింది. సెన్సెక్స్ 285 పాయింట్లు పుంజుకుని 81,958 వద్ద ట్రేడవుతోంది. గడిచిన సెషన్‌ల్లో మార్కెట్లు నష్టాలపాలయ్యాయి. సోమవారం కొంత పుంజుకుని లాభాల్లో ట్రేడవుతున్నాయి.అమెరికా డాలర్ ఇండెక్స్ 102.52 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 78.12 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.97 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.9 శాతం లాభపడింది. నాస్డాక్ 1.22 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: అక్టోబర్ నుంచి ఆరు మార్పులు ఇవే..భవిష్యత్తులో అంతర్జాతీయ అనిశ్చితులు దేశీయ మార్కెట్‌ను ప్రభావితం చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. అమెరికా ఎన్నికలు ముగిసే వరకు ఈ యుద్ధ భయాలు ఉండవచ్చని అంచనా. ముడిచమురు ధరలు మరింత పెరిగే ప్రమాదముందని చెబుతున్నారు. ఈ నెల 9న ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు మార్కెట్‌కు కీలకంగా మారనున్నాయి. గతంలో ఆర్బీఐ గవర్నర్ తెలిపిన వివరాల ప్రకారం కీలక వడ్డీరేట్లను వెంటనే తగ్గించబోమనే సంకేతాలు వెలువరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి కంపెనీలు ఆర్థిక ఫలితాలను త్వరలో ప్రకటించనున్నాయి. దాంతో రాబోయే రోజుల్లో మార్కెట్లు కొంత ఒడిదొడుకులకు లోనయ్యే అవకాం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ట్రేడ్ అయిన దేశీయ ప్రామాణిక సూచీలు వారంతపు ట్రేడింగ్ సెషన్‌ను ప్రతికూలంగా ముగించాయి. అన్ని రంగాలలో అమ్మకాలు జోరందుకోవడంతో నష్టాలు తప్పలేదు.బీఎస్ఈ సెన్సెక్స్ 808.65 పాయింట్లు లేదా 0.98 శాతం క్షీణించి 81,688.45 వద్దకు చేరుకుంది. అలాగే నిఫ్టీ 50 కూడా శుక్రవారం 200.25 పాయింట్లు లేదా 0.79 శాతం పడిపోయి 25,049.85 వద్ద స్థిరపడింది.నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 37 స్టాక్‌లు నష్టాల్లో ముగిశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, బీపీసీఎల్, హీరో మోటోకార్ప్ భారీగా నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:57 సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 25,274కు చేరింది. సెన్సెక్స్ 83 పాయింట్లు పుంజుకుని 82,575 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 102 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.84 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.17 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.04 శాతం దిగజారింది.ఇదీ చదవండి: మార్కెట్ కల్లోలానికి కారణాలుపశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితంగా ఇజ్రాయెల్, లెబనాన్, జోర్డాన్ తదితర దేశాలతో భారత్ వాణిజ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కల్లోల పరిస్థితుల్లో, పశ్చమాసియాలో వేగంగా మారిపోతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు భారత్ నుంచి ఎగుమతులు 63.5 శాతం తగ్గిపోయాయని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. జోర్డాన్‌కు 38.5 శాతం క్షీణించాయని తెలిపాయి. లెబనాన్‌కు సైతం 6.8 శాతం తగ్గాయని చెప్పాయి. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలు కాగా, అది ఇప్పుడు లెబనాన్, సిరియాకు విస్తరించిందని.. ప్రత్యక్షంగా జోర్డాన్, ఇరాన్‌పైనా ప్రభావం చూపిస్తున్నట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దలాల్ స్ట్రీట్.. ఢమాల్! మార్కెట్ల భారీ పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,729.77 పాయింట్లు లేదా 2.05% పతనమై 82,536.52 వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 529.95 పాయింట్లు లేదా 2.05% క్షీణించి 25,266.95 వద్దకు పడిపోయింది.బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఒక్క జేఎస్‌డబ్ల్యూ స్టీల్ మాత్రమే గ్రీన్‌లో ట్రేడవుతోంది. మిగిలిన షేర్లు స్టాక్‌లు ఎరుపు రంగులో ఉన్నాయి. లార్సెన్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటర్స్, రిలయన్స్, మారుతీ సుజుకీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.అదేవిధంగా నిఫ్టీ 50లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ మాత్రమే లాభపడగా, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటర్స్ భారీ నష్టాలను చవి చూశాయి.పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితంగా భారత్ వాణిజ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చమాసియాలో వేగంగా మారిపోతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తమైన మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనంలో కొనసాగుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
యుద్ధ భయాలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ 168 పాయింట్లు తగ్గి 25,628కు చేరింది. సెన్సెక్స్ 549 పాయింట్లు నష్టపోయి 83,712 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.64 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.74 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.78 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.01 శాతం లాభపడింది. నాస్డాక్ 0.08 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: రూ.83 లక్షల కోట్లకు డిజిటల్ ఎకానమీపశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితంగా ఇజ్రాయెల్, లెబనాన్, జోర్డాన్ తదితర దేశాలతో భారత్ వాణిజ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కల్లోల పరిస్థితుల్లో, పశ్చమాసియాలో వేగంగా మారిపోతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు భారత్ నుంచి ఎగుమతులు 63.5 శాతం తగ్గిపోయాయని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. జోర్డాన్‌కు 38.5 శాతం క్షీణించాయని తెలిపాయి. లెబనాన్‌కు సైతం 6.8 శాతం తగ్గాయని చెప్పాయి. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలు కాగా, అది ఇప్పుడు లెబనాన్, సిరియాకు విస్తరించిందని.. ప్రత్యక్షంగా జోర్డాన్, ఇరాన్‌పైనా ప్రభావం చూపిస్తున్నట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 89 పాయింట్లు పెరిగి 25,895కు చేరింది. సెన్సెక్స్ 341 పాయింట్లు లాభపడి 84,645 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 100.84 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.77 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.42 శాతం లాభపడింది. నాస్డాక్ 0.38 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: డిపాజిట్ల పెంపునకు వినూత్న ప్రయత్నాలుమదుపర్లు లాభాలు స్వీకరించడం, అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్ సోమవారం దేశీయ స్టాక్‌మార్కెట్‌ను నడిపించాయని నిపుణులు తెలియజేశారు. ఇప్పటికే జీవితకాల గరిష్ఠాలను చేరిన మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో నిన్నటి మార్కెట్లో నష్టాలు ఎదురయ్యాయి. రానున్న యూఎస్ ఎన్నికలు, ఎఫ్ఐఐలు చైనావైపు మొగ్గు చూపుతుండడం వంటి అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు నుంచి ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ సంబంధించి జులైలో ప్రకటించిన నిబంధనలు అమలు చేయబోతున్నట్లు సెబీ తెలిపింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఒక్కరోజులోనే రూ.నాలుగు లక్షల కోట్లు ఆవిరి!
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 368 పాయింట్లు తగ్గి 25,810 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1272 పాయింట్లు దిగజారి 84,299 వద్ద ముగిసింది. ఈరోజు స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.నాలుగు లక్షల కోట్లు ఆవిరైనట్లు మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.మదుపర్లు లాభాలు స్వీకరించడం, అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్ ఈరోజు దేశీయ స్టాక్‌మార్కెట్‌ను నడిపించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే జీవితకాల గరిష్ఠాలను చేరిన మార్కెట్లలో ఇన్వెస్టర్లు ఉదయ నుంచే లాభాలు స్వీకరించినట్లు తెలిసింది. రానున్న యూఎస్ ఎన్నికలు, ఎఫ్ఐఐలు చైనావైపు మొగ్గు చూపుతుండడం వంటి అంశాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేసినట్లు నిపుణులు చెప్పారు.ఇదీ చదవండి: ఎట్టకేలకు రెండేళ్ల వివాదానికి పరిష్కారం!సెన్సెక్స్ 30 సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, నెస్లే, బజాజ్ ఫిన్సర్వ్, మారుతి సుజుకీ, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్లు.. ఊపు మీదున్న ఐటీ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:15 సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 78.99 పాయింట్లు లేదా 0.092% లాభపడి 85,915.11 వద్ద ట్రేడవుతోంది. అలాగే నిఫ్టీ 9.40 పాయింట్లు లేదా 0.036% పెరిగి 26,225.45కు చేరింది.నిఫ్టీ లిస్టింగ్‌లో ఎల్టీఐ మైండ్‌ట్రీ, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా షేర్లు టాప్ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్, భారతీ ఎయిర్టెల్, ఓన్ఎన్జీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వంటివి ప్రతికూలంగా ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)