Hyderabad City
-
HYD: ఎమ్మెల్యే రాజాసింగ్ హౌజ్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్:గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్‌ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడికి వెళ్లకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. హౌజ్అరెస్ట్పై రాజాసింగ్ స్పందించారు.‘అందరూ గుడికి వెళ్తున్నారు.నన్ను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారు.నన్ను ఇవాళ హౌజ్ అరెస్టు చేసినా రేపైనా గుడికి వెళ్తాను. హిందువులకు అండగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. హిందువుల గుళ్ల మీదనే దాడులు జరుగుతున్నాయి. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు అతడి మానసిక స్థితి సరిగా లేదని చెబుతున్నారు.ఇది సరికాదు. ఈ ఘటనలో మిగిలిన నిందితులను కూడా వెంటనే అరెస్టు చేయాలి.కఠిన చర్యలు తీసుకోవాలి’అని రాజాసింగ్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: టెన్షన్..టెన్షన్ -
HYD: భారీగా సైబర్ నేరగాళ్ల అరెస్ట్
సాక్షి,హైదరాబాద్:సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మందిని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్ల కోసం కర్ణాటక,మహారాష్ట్ర,రాజస్థాన్‌లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు.ఆరు ప్రత్యేక బృందాలతో హైటెక్ నేరగాళ్ల కోసం చేసి గాలింపు చేపట్టారు.ఈ ఆపరేషన్‌లో భాగంగా 18 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు ఆరెస్టు చేశారు.వీరిపై తెలంగాణలో 45కుపైగా సైబర్ క్రైమ్ కేసులు ఉండగా దేశవ్యాప్తంగా 319 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితుల నుంచి రూ.5 లక్షల నగదు,26సెల్ఫోన్లు,16 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.సెక్స్టార్షన్,పెట్టుబడులు, కొరియర్ పేరుతో వీరు దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లోని రూ.1.61 కోట్ల నగదును సీజ్ చేశారు. తెలంగాణలో ఈ నేరగాళ్లు బాధితుల నుంచి రూ.6.94 కోట్లు సైబర్ నేరాల ద్వారా కాజేసినట్లు పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: పోలీసులే షాక్ అయ్యేలా.. విశాఖ హానీ ట్రాప్ కేసులో -
HYD: చాదర్‌ఘాట్‌లో ‘మూసీ’ కూల్చివేతలు షురూ
సాక్షి,హైదరాబాద్: మూసీ నది ప్రక్షాళనలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదటి విడత పునరావాస కేంద్రాలకు తరలించిన వారి ఇళ్లను అధికారులు కూల్చేస్తున్నారు. చాదర్‌ఘాట్ మూసానగర్, శంకర్‌నగర్‌లో రెడ్‌మార్క్ వేసిన ఇళ్ల కూల్చివేత ప్రారంభమైంది. చాదర్‌ఘాట్ పరిసరాల్లో 20 ఇళ్ళకు మార్కింగ్ చేసిన అధికారులు ఇప్పటికే నిర్వాసితులను తరలించారు. రెవెన్యూ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం(అక్టోబర్1) తొలిసారిగా కూల్చివేతలు జరుగుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలతో హైడ్రాకు సంబంధం లేదని తెలుస్తోంది. ఇదీ చదవండి: మూసీ ప్రాజెక్టు కాంగ్రెస్‌కు రిజర్వు బ్యాంకు -
‘హైడ్రా’ బూచి కాదు: రంగనాథ్
సాక్షి,హైదరాబాద్: హైడ్రా బూచి కాదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ అన్నారు. భవిష్యత్ తరాలకోసమే అక్రమ కట్టడాలు కూలుస్తున్నామని స్పష్టం చేశారు. హైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదన్నారు. రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి(ఎంఏయూడీ)శాఖ కార్యదర్శి దానకిషోర్తో కలిసి రంగనాథ్ శనివారం(సెప్టెంబర్28) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గతంలోనూ మూసీ నిర్వాసితులను తరలించారు.చిన్న వర్షానికే సచివాలయం ముందు వరద పోటెత్తుతోంది. భారీగా వర్షపాతం నమోదైతే అధికారులు కూడా ఏమీ చేయలేరు.మూసీని సుందరీకరించడం కోసం కూల్చివేతలు చేయడం లేదు.గతంలో మూసీ సుందరీకరణ కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య పలు సూచనలు చేశారు’అని పురపాలక కార్యదర్శి దాన కిషోర్ తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడమే హైడ్రా లక్ష్యం: రంగనాథ్ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే హైడ్రా లక్ష్యం, 2 నెలలుగా హైడ్రా కూల్చివేతలు జరుపుతోందిచెరువుల ఆక్రమణలు తొలగించాం.. హైడ్రాపై సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారువరదల నుంచి ప్రజలను కాపాడటమే హైడ్రా లక్ష్యం. ముందుగా నోటీసులు ఇచ్చి కూల్చుతున్నాంఇష్టారాజ్యంగా ఆక్రమణలు చేసుకుంటూపోతే కట్టడి చేయవద్దా?ఆక్రమణల్లో పేదవాళ్ల ఇళ్లు ఉంటే వాళ్ల జోలికి వెళ్లడం లేదుమేము కూల్చిన ఏ భవనానికి అనుమతులు లేవుభవిష్యత్తులో వరదలతో కోటి మంది ఇబ్బంది పడతారుఆస్పత్రుల్లో పేషెంట్లు లేకపోయినా ఉన్నట్లుగా చూపిస్తున్నారుకొందరి తప్పుడు ప్రచారం వల్ల బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుందిహైడ్రాను భూతంలా చూపిస్తున్నారు. తప్పు చేసిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నాంహైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు హైడ్రాపై ఆందోళన వద్దు..నిర్వాసితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం: దానకిషోర్వందేళ్ల క్రితమే నిజాం మూసీ నది అభివృద్ధి నమూనాలు రూపొందించారు.ఈ నమూనాలు థేమ్స్ నది కంటే అద్భుతంగా ఉన్నాయి.హైదరాబాద్ నగరంలో ఇటీవల 20 నిమిషాలకే 9.1 సెంటీమీటర్ల వర్షం పడింది.20 నిమిషాల కొద్దిపాటి వర్షానికే నగరం మునుగుతోంది.మరో 20 నిమిషాలు వర్షం పడితే మేము కూడా ఏమీ చేయలేని పరిస్థితిమూసీ ఒడ్డున కూల్చివేతలు సుందరీకరణ కోసం మాత్రమే కాదు..ప్రమాదం నుంచి కాపాడేందుకు కూడాపేద ప్రజలు నీళ్ళల్లో ఉండొద్దు అనే ఉద్దేశంతోనే మూసీ ప్రక్షాళనప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాల పర్యటన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో అక్టోబర్‌లో ఉంటుంది.మూసీ నీళ్ల శుద్ధి కోసం 3800 కోసం కొత్త ఎస్టీపీలు తీసుకువస్తాం.మూసీ నీళ్లను మంచి నీళ్ళుగా మార్చేందుకు రూ. 10వేల కోట్లతో పలు కార్యక్రమాలు త్వరలో ప్రారంభమవుతాయి.మూసీ పరీవాహక ప్రాంతం ప్రజలు డబుల్ బెడ్ కోసం ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు.10వేల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తే వెళ్తామని మాతో చెప్పారు..కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి.మూసీ బాధితులకు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది.. ఈ విషయమై కమిటీ వేశాం.మూసీ నదీ పరివాహక ప్రాంత వాసులను 14 ప్రాంతాలకు తరలించాలనుకుంటున్నాం.పిల్లల చదువుల కోసం తల్లితండ్రులు ఆందోళన అవసరం లేదు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం.23 లోకేషన్లలో నిర్వాసితులు మానసికంగా ఆందోళన చెందకుండా కౌన్సెలింగ్ ఇస్తారు.సీనియర్ అధికారులతో కాంప్స్ ఏర్పాటు చేస్తాం.50 కుటుంబాలను ఇప్పటికే షిఫ్ట్ చేశారు... మరో 150 కుటుంబాలు షిఫ్ట్ చేస్తున్నారు.హైడ్రా వస్తుంది కూలుస్తుంది అనేది అవాస్తవం...ప్రజలు ఆందోళన అవసరం లేదు.ఏ కుటుంబాలను బలవంతంగా షిఫ్ట్ చేయించడం లేదు..స్వచ్చందంగా ప్రజలు సహకరించాలినష్టపరిహారం ఇవ్వాల్సిన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం 2013 చట్టం ప్రకారం ఇస్తుంది. ఇదీచదవండి: హైడ్రా బాధితుల తరపున కొట్లాడతాం: బీఆర్ఎస్ -
Ghmc: పోస్టర్లు బ్యాన్..ఆమ్రపాలి కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో వాల్ పోస్టర్లు బ్యాన్ చేయాలని కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి శుక్రవారం(సెప్టెంబర్27) సర్క్యులర్ జారీ చేశారు. జీహెచ్ఎంసీలో వాల్ పోస్టర్లు,వాల్ పెయింటింగ్స్ పై సీరియస్‌గా వ్యవహరించాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.సినిమాల పోస్టర్లు కూడా ఎక్కడా అతికించకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.ఒకవేళ ఆదేశాలను పట్టించుకోకుండా పోస్టర్లు వేస్తే మాత్రం జరిమానా విధించాలని సర్క్యులర్‌లో తెలిపారు.ఇదీ చదవండి: మూసీకి వరద..జీహెచ్ఎంసీ హై అలర్ట్ -
మూసీకి వరద..జీహెచ్ఎంసీ హైఅలర్ట్
సాక్షి,హైదరాబాద్: భాగ్యనగరానికి తాగునీరందించే జంట జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్‌సాగర్‌లో నీరు ఫుల్‌ట్యాంక్‌లెవెల్ (ఎఫ్టీఎల్) స్థాయికి చేరింది. ఎగువ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు వరద నీరురావడంతో నీటి మట్టం పెరిగింది. జలాశయానికి ఇన్‌ఫ్లో 500 క్యూసెక్కులు అధికారులు తెలిపారు.జలాశయం నిండడంతో పాటు ఇన్‌ఫ్లో ఉండడంతో రెండు గేట్లు ఎత్తి ఉస్మాన్‌సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో పాటు మూసీకి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బందిని కమిషనర్ అమ్రపాలి అప్రమత్తం చేశారు.ఇదీ చదవండి: హైడ్రా ఎఫెక్ట్..మూసీ పరివాహక ప్రాంతంలో ఉద్రిక్తత -
హైదరాబాద్‌కు మరోసారి భారీ వర్షసూచన
సాక్షి,హైదరాబాద్:రాజధాని హైదరాబాద్ నగరంలో వరుసగా మూడోరోజు ఆదివారం(సెప్టెంబర్22) భారీ వర్షం పడే ఛాన్సుందని వాతావరణశాఖ తెలిపింది.నాగోల్, బండ్లగూడ, ఉప్పల్, బోడుప్పల్, మీర్పేట్, ఎల్బీనగర్,దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడనుందని వాతావరణశాఖ తెలిపింది.కాగా, శుక్ర,శనివారాలు సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి నగరంలో రోడ్లపై వరదలు పోటెత్తి ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామ్ అయింది. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. పలు చోట్ల విద్యుత్‌తీగలపై చెట్లు,ఫ్లెక్సీలు పడి విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో కుండపోత వర్షం -
HYD: భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో నార్కొటిక్స్ అధికారులు భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. కోఠిలోని స్టెరాయిడ్స్ డిస్ట్రిబ్యూటర్ రాకేష్ షాపులో డ్రగ్ కంట్రోల్ అధికారులు శుక్రవారం(సెప్టెంబర్20) సోదాలు నిర్వహించారు. బాడీ బిల్డింగ్, జిమ్‌కు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మియాపూర్‌లోని శ్రీకాంత్ న్యూరో సెంటర్ లోను భారీగా స్టెరాయిడ్స్ పట్టుకున్నారు. రెండు చోట్ల 51 రకాల స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. స్టెరాయిడ్స్ మొత్తం విలువ రూ.3లక్షలుంటుందని నార్కొటిక్ అధికారులు భావిస్తున్నారు. స్టెరాయిడ్స్ వల్ల కాలేయ వ్యాధులతో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావుకు బిగుస్తున్న ఉచ్చు -
HYD: సుచిత్రలో అక్రమ కట్టడాల కూల్చివేత
సాక్షి,హైదరాబాద్:సికింద్రాబాద్ కంటోన్మెంట్లో అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను కంటోన్మెంట్ అధికారులు శుక్రవారం(సెప్టెంబర్20) కూల్చివేశారు. రక్షణ శాఖ భూముల్లో నిర్మించినందునే వీటిని కూల్చివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.కంటోన్మెంట్ పరిధిలోని సుచిత్ర మార్గంలో నాలా ఫుట్‌పాత్‌ను ఆక్రమిస్తూ కొందరు దుకాణాలు నిర్మించారు. ఈ నిర్మాణాల వల్ల ట్రాపిక్కు ఇబ్బందవుతోందని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో బుల్డోజర్లతో రంగంలోకి దిగిన అధికారులు దుకాణాలను నేలమట్టం చేశారు. కాగా, హైదరాబాద్ నగరంలో నాలాలు, చెరువులను ఎంతటివారు ఆక్రమించినా వదిలేది లేదని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇదే బాటలో కంటోన్మెంట్ కూడా అక్రమ కొట్టడాలపై చర్యలు ప్రారంభించడం గమనార్హంఇదీ చదవండి.. ప్రజాభవన్ చుట్టూ కంచెలు ఎందుకు: కేటీఆర్ -
HYD: రేపు ఉదయానికల్లా నిమజ్జనం పూర్తి: సీవీ ఆనంద్
సాక్షి,హైదరాబాద్: రేపు ఉదయంలోగా నగరంలో నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నిమజ్జనంపై మంగళవారం(సెప్టెంబర్17) మధ్యాహ్నం సీవీ ఆనంద్ మీడియాకు అప్డేట్ ఇచ్చారు.‘హైదరాబాద్‌లో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరుగుతోంది.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సౌత్ ఈస్ట్,సౌత్ వెస్ట్‌లో ఉన్న విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నాం. నిమజ్జనం ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నాం.మండప నిర్వాహకులతో మాట్లాడి త్వరగా నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకున్నాం. బాలాపూర్ వినాయకుడు కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా ప్రయత్నిస్తున్నాం.ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశాం.షిఫ్ట్ వారిగా 25 వేల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశాం.నిమజ్జనంలో పోలీసులు అలసిపోకుండా షిఫ్ట్‌ల ప్రకారం డ్యూటీలు చేస్తున్నారు.లక్ష విగ్రహాల్లో ఇంకా 20 వేల విగ్రహాలు పెండింగ్ ఉన్నాయి.నిమజ్జనం కోసం వచ్చే ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో రావాలని కోరుతున్నాం.మీడియాలో లైవ్ టెలికాస్ట్ చూడాలని కోరుతున్నాం. ఇదీ చదవండి.. గణేష్ నిమజ్జనానికి హాజరైన తొలి సీఎం రేవంత్ -
బీఆర్ఎస్ నేతల ధర్నా.. అరెస్టు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో నీట్ మెడికల్ కౌన్సిలింగ్ వెంటనే నిర్వహించాలని బీఆర్ఎస్ విద్యార్థి సంఘం(బీఆర్ఎస్వీ) నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం(సెప్టెంబర్ 15) బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ముందు ధర్నా నిర్వహించారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. మినిస్టర్ క్వార్టర్స్‌కు వెళ్లేందుకు యత్నంచిన మరికొందరు బీఆర్ఎస్వీ నేతలను బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణభవన్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు.ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్వీ నేతలకు వాగ్వాదం జరిగింది. పోలీసులను నెట్టివేసి వెళ్లేందుకు బీఆర్ఎస్వీ నేతలు ప్రయత్నించడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ స్థానిక విద్యార్థులకే మెడికల్ సీట్లు కేటాయించాలి. ఇతర రాష్ట్ర విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీట్లు అమ్ముకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నరసింహ కుట్ర చేస్తున్నారు. జీవో నెంబర్ 33 వల్ల తెలంగాణ స్థానిక విద్యార్థులకు నష్టం జరుగుతుంది. తెలంగాణలో పుట్టిన ప్రతి విద్యార్థి తెలంగాణ స్థానికుడే. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 33 పై సుప్రీంకోర్టులో వేసిన అప్పీలను ఉపసంహరించుకోవాలి’అని గెల్లు డిమాండ్ చేశారు. ఇదీ చదవండి.. ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసులు -
నిమజ్జనానికి వచ్చే వారికి ఉచిత ఆహారం: అమ్రపాలి
సాక్షి,హైదరాబాద్:గణేష్ నిమజ్జనానికి జిహెచ్ఎంసి తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి చెప్పారు. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడారు‘17,18,19 తేదీల్లో మూడు రోజులపాటు 15వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది పనిచేస్తారు.శానిటేషన్ సిబ్బంది,ట్యాంక్ బండ్లో గజ ఈతగాళ్లనుఏర్పాటు చేశాం.నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్‌లలో మంచినీళ్లు,ఆహారం ఏర్పాటు చేస్తున్నాం.ఇప్పటికే రోడ్లు రిపేర్ చేశాం.స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశాం.అన్ని మేజర్ చెరువుల వద్ద క్రేన్లు ఉంచాం.జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చిన్న చిన్న చెరువుల వద్ద బేబీ పాండ్స్ ను ఏర్పాటు చేశాం.కాలనీలలో ఏర్పాటు చేసే చిన్న విగ్రహాలు అక్కడే నిమజ్జనం చేస్తారు.గణేష్ నిమజ్జనానికి జోనల్ కమిషనర్లతో పాటు పోలీసులు కోఆర్డినేషన్ చేసుకుంటూ పనిచేస్తారు’అని అమ్రపాలి తెలిపారు.ఇదీ చదవండి.. 17న నిమజ్జనం సెలవు -
గణనాథుల వద్ద అన్నప్రసాద వితరణ
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం. 13 విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించగా, ప్రతాప్‌నగర్‌లో సాయినాథ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని టీపీసీసీ కార్యదర్శి పి.విజయారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో నిర్వాహకులు సతీష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
HYD: టెకీల ‘రేవ్’ పార్టీ భగ్నం..!
సాక్షి,హైదరాబాద్: నగరంలో డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఐటీ ఏరియా గచ్చిబౌలిలో ఎస్ఓటీ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఐటీ ఉద్యోగులే ఓ గెస్ట్‌హౌజ్‌లో రేవ్‌పార్టీని నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీలో పాల్గొన్నవారిలో 8 మంది అమ్మాయిలు,12 మంది అబ్బాయిలు ఉన్నారు. వీరి వద్ద నుంచి స్వల్పంగా గంజాయి, మద్యం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పార్టీలో పాల్గొన్న వారిని ఎస్ఓటీ పోలీసులు గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. రేవ్ పార్టీపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పార్టీ నిర్వహించిన వారికి, పాల్గొన్న వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నో రేవ్ పార్టీలను అడ్డుకుని కేసులు నమోదు చేశారు. ఇదీ చదవండి.. వ్యభిచారం చేసైనా డబ్బులు తెమ్మన్నాడు -
HYD: సాగర్‌లో నిమజ్జనం.. కాసేపట్లో హైకోర్టులో విచారణ
సాక్షి,హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం(సెప్టెంబర్10) మధ్యాహ్నం విచారణ జరగనుంది. సాగర్‌లో ప్లాస్టర్‌ఆఫ్‌పారిస్(పీవోపీ) విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఇప్పటికే ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ కేసులో హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.హుస్సేన్ సాగర్ పరిరక్షణ బాధ్యత హైడ్రాదే అయినందున ప్రతివాది ఆ సంస్థేనని పిటిషనర్ తెలిపారు. నిమజ్జనం పిటిషన్‌ను ఇవాళ లంచ్ విరామం తర్వాత మధ్యాహ్నం హైకోర్టు విచారించనుంది. సాగర్‌లో పీవోపీ వినాయక ప్రతిమల నిమజ్జనంపై హైకోర్టు ఏం నిర్ణయం వెలువరిస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదీ చదవండి: కిల్లర్ డాగ్స్..! -
హైడ్రా’ కూల్చివేతలు.. మాదాపూర్‌లో ఉద్రిక్తత
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. మాదాపూర్‌లోని అయ్యప్పసొసైటీలో మరో కట్టడాన్ని హైడ్రా ఆదివారం(సెప్టెంబర్8) కూల్చివేసింది. ఈ భవనంలో హోటల్ నిర్వహించే వాళ్లు కూల్చివేతలను అడ్డుకున్నారు. పెట్రోల్ పోసుకుని అంటించుకుంటామని ఆందోళనకు దిగడంతో అక్కడ ఉదద్రిక్త వాతావరణం నెలకొంది. పెట్రోల్ పోసుకున్న వ్యక్తి నిప్పంటించుకోకుండా పోలీసులు అడ్డుకున్నారు. హోటల్ భవనాన్ని కూల్చివేస్తామని ఇప్పటికే నోటీసులిచ్చినా పట్టించుకోకపోవడంతో హైడ్రా కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తోంది. మరళీమోహన్ ‘జయభేరి’కి నోటీసులుసినీనటుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరి కన్స్ట్రక్షన్స్కు హైడ్రా తాజాగా నోటీసులిచ్చింది. గచ్చిబౌలిలోని రంగలాల్‌కుంట చెరువులో జయభేరికి చెందిన అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసుల్లో పేర్కొంది. లేని పక్షంలో తామే కూల్చివేస్తామని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో ‘హైడ్రా’ కూల్చివేతలు..హైదరాబాద్‌లోని చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల కూల్చివేతలను హైడ్రా కొనసాగిస్తోంది. తాజాగా ఆదివారం(సెప్టెంబర్ 8) ఉదయం దుండిగల్ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులోని అక్రమ విల్లాలు, మదాపూర్‌లోని సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఇక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, సున్నం చెరువులో అక్రమంగా నిర్మించిన షెడ్లను కూల్చివేస్తుండగా భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. మియాపూర్‌లోని స్వర్ణపురి కాలనీలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. సంగాారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. హెచ్ఎంటీ నగర్, వాణి నగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇదీ చదవండి.. కూల్చివేతే చెరువుల పరిరక్షణా..? -
HYD: రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి,హైదరాబాద్: వినాయకచవితి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్‌లో బడా గణేష్‌తో పాటు హైదరాబాద్ నగరవ్యాప్తంగా వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు.సెప్టెంబర్ 7నుంచి 17వ తేదీ నిమజ్జనం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుని పరిసర ప్రాంతాలు ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, మింట్‌కాంపౌండ్‌లో ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.ఖైరతాబాద్ వినాయక విగ్రహం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ అనుమతించలేదు.పాత సైఫాబాద్ పీఎస్ నుంచి ఖైరతాబాద్ గణేష్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ రాజ్‌దూత్ లేన్‌లోకి అనుమతించరు.ఇక్బాల్ మినార్ నుండి మింట్ కాంపౌండ్ లేన్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ అనుమంతించరు.ఎన్టీఆర్ మార్గ్/ఖైరతాబాద్ ఫ్లైఓవర్/నెక్లెస్ రోడ్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ అనుమతించరు.నెక్లెస్ రోటరీ వద్ద తెలుగు తల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు నిరంకారి నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్ఖైరతాబాద్ పోస్టాఫీసు లేన్ ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు అనుమతించరు.నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వచ్చే సందర్శకులు తమ వాహనాలను ఐమాక్స్ థియేటర్ పక్కన అంబేద్కర్ స్క్వేర్ పార్కింగ్ స్థలం, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ స్థలాలు, ఐమాక్స్ ఎదురుగా, సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ ప్రాంగణం, రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ చేయాలని పోలీసులు కోరారు. -
లోన్‌యాప్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య
సాక్షి,కుత్బుల్లాపూర్: లోన్‌యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. కుత్బుల్లాపూర్‌కు చెందిన విద్యార్థి భానుప్రకాష్(22) పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం శుక్రవారం(సెప్టెంబర్6) వెలుగులోకి వచ్చింది. భానుప్రకాష్ మృతిపై గురువారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. భానుప్రకాష్ ఆరోరా కళాశాలలో పీజీ చదువుతున్నాడు. మొబైల్‌ఫోన్ లొకేషన్ ద్వారా భానుప్రకాష్ ఆచూకీ కనుక్కున్నారు. చెరువు వద్దకు వెళ్లి చూడగా అతని దుస్తులు,వాహనం గట్టుపై ఉండటంతో పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు చెరువు నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి మొబైల్లో లోన్ యాప్ కు సంబంధించిన చాటింగ్ లభ్యమైంది. -
HYD: నగరంలో రేపు భారీ వర్షాలు: అమ్రపాలి
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి విపరీతంగా వర్షం కురుస్తోందని, ఎక్కడ సమస్యలు లేకుండా అన్ని విభాగాల సమన్వయంతో చర్యలు తీసుకుంటాన్నామని గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్ఎంసీ) కమిషనర్ అమ్రపాలి తెలిపారు. వర్షాలపై ఆమె ఆదివారం(సెప్టెంబర్1) సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. వాటర్ లాగిన్ పాయింట్స్, మూసీ పరివాహక ప్రాంతాలు, హుస్సేన్ సాగర్‌పై నిరంతరం నిఘా పెట్టాం. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను అప్రమత్తం చేశాం. నగరానికి రేపు భారీ వర్ష సూచన ఉన్నందున అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాం. జీహెచ్ఎంసీ పరిధిలో ఉద్యోగులకు సెలవులను రద్దు చేశాం. జోనల్ కమిషనర్లు 24 గంటలు రోడ్లపైనే ఉంటున్నారు. ప్రాణనష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం’అని అమ్రపాలి చెప్పారు. -
భారీ వర్షాలు: హైదరాబాద్‌లో సోమవారం స్కూళ్లకు సెలవు
సాక్షి,హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో సోమవారం(సెప్టెంబర్2)స్కూళ్లకు సెలవు ప్రకటించారు. వర్షాలు, వరదల పరిస్థితిని అంచనా వేసి జిల్లాల పరిధిలో స్కూళ్లకు సెలవు ప్రకటించే విషయంలో కలెక్టర్లదే నిర్ణయమని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సోమవారం స్కూళ్లకు సెలవు దినంగా నిర్ణయించారు. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. తెలంగాణతో పాటు ఏపీకి ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. -
HYD: రాంనగర్ కూల్చివేతలు..‘హైడ్రా’ కమిషనర్ స్పందన ఇదే..
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లోని రాంనగర్ మణెమ్మ గల్లీలో కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. మణెమ్మ గల్లీలోని రోడ్డు ను ఆక్రమించి సర్వే నెంబర్ 20,21 ను కళ్ళు కాంపౌండ్, గ్రౌండ్‌ఫ్లోర్ ప్లస్ రెండు అంతస్తులు కట్టారని రికార్డులు పరిశీలించి వాటిని కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అక్రమ నిర్మాణాల కారణంగా మణెమ్మ గల్లీలో ఉండే వారు నిరంతరం డ్రైనేజీ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాంనగర్ సర్వే నెంబర్ 20,21లో పలు అక్రమ నిర్మాణాలను శుక్రవారం(ఆగస్టు30)న కూల్చివేశామని రంగనాథ్ తెలిపారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరుదైన విమానం
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గురువారం(ఆగస్టు29) అర్ధరాత్రి అరుదైన విమానం ల్యాండ్ అయింది. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన విమానం సైజు భారీగా ఉండటంతో దీనిని వేల్ ఆఫ్ ది స్కైగా పిలుస్తారు. ఇది ఎయిర్‌బస్‌కు చెందిన A300-608ST బెలుగా రకం విమానం.ఇంధనం నింపుకోవడంతో పాటు సిబ్బంది విశ్రాంతి కోసం బెలుగా విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. మస్కట్ నుంచి థాయిలాండ్ వెళ్తుండగా మార్గమధ్యలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ లోహవిహంగం వాలింది. ఇది శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి వెళుతుందని అధికారులు చెప్పారు. -
HYD: ‘ప్యారడైజ్’ హోటల్లో మంటలు
సాక్షి,హైదరాబాద్: బిర్యానీకి పాపులర్ అయిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ప్యారడైజ్ హోటల్లో శుక్రవారం(ఆగస్టు23) మంటలు కలకలకం రేపాయి. హోటల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వల్పంగా మంటలు చెలరేగాయి.వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది కొద్ది సేపటికే మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఘటన అనంతరం హోటల్ సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అగ్నిమాపక శాఖ అధికారులు హోటల్‌కు వచ్చి ప్రమాదం ఎలా జరిగిందనేదానిని పరిశీలించారు. -
పునాటి నరసింహారావుకు ఇండియన్ పోలీస్ మెడల్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగంలో నిబద్ధత కలిగి ఉండటం.. ఏ విభాగంలో పని చేసినా.. అక్కడ అత్యుత్తమ సేవలందించడం.. డిపార్ట్ మెంట్లో ఉన్నతాధికారుల చేత మన్ననలు అందుకోవడం ఆ పోలీసు అధికారికి మొదటి నుంచి ఉన్న ట్రాక్ రికార్డ్. అందుకే ఇప్పుడు ఇండియన్ పోలీస్ మెడల్ ను అందుకుని మరోసారి తన వర్క్‌లో సిన్సియారిటీని చూపించారు. ఆయన ఎవరో కాదు.. హైదరాబాదులోని మియాపూర్ ఏసీపీ నరసింహరావు. మియాపూర్ ఏసీపీగా పనిచేస్తున్న ఆయన ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన మెడల్‌ను అందుకున్నారు. 1995లో ఎస్సైగా విధుల్లో చేరిన ఆయన 2009లో సి.ఐగా పదోన్నతి పొందారు. వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయన విధులు నిర్వహించారు. పోలీస్ శాఖలో ఆయన చేసిన సేవలకు గాను గతంలోనూ ఉత్తమ సేవా పతకం అందుకోగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్(ఐ.పి.యమ్ )కు ఎంపిక చేసింది. 2021లో ఏసీపీగా పదోన్నతి పొందిన ఆయన.. ఇంటిలిజెన్స్ విభాగంలో కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం నరసింహారావు మియాపూర్ ఏసిపిగా విధుల్లో కొనసాగుతున్నారు. ఇండియన్ పోలీస్ మెడలను అందుకున్న ఆయనకు మియాపూర్ సబ్ డివిజన్ కు చెందిన పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరింత మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం, డిపార్ట్ మెంటుపై ప్రజలకు నమ్మకం కలిగించడం... అవగాహన, కౌన్సెలింగ్ ద్వారా నేరాలు చేయకుండా ప్రజలను అప్రమత్తం చేయడం లాంటివి చేస్తూ... తన ఉద్యోగధర్మ నిర్వర్తిస్తున్నట్టు ఏసీపీ నరసింహరావు మెడల్ అందుకున్న సందర్భంగా చెప్పారు. తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను డిపార్టుమెంటులో అత్యుత్తమ సేవా పతకాలు పొంది. ప్రజలకు మరింత చేరువ అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సహకారం మరువలేనిదని ఆయన అన్నారు. భవిష్యత్తులోనూ తన శక్తి మేరకు మంచి సేవలందించడమే తన కర్తవ్యమని ఆయన చెప్పారు.