‘కౌంటింగ్‌ తర్వాత కూడా రీపోలింగ్‌ అవకాశాలు’ | AP CEO Gopal Krishna Dwivedi Comments Over Repolling | Sakshi

కౌంటింగ్‌ తర్వాత కూడా రీపోలింగ్‌ అవకాశాలు : ద్వివేది

May 21 2019 3:11 PM | Updated on May 21 2019 9:00 PM

AP CEO Gopal Krishna Dwivedi Comments Over Repolling - Sakshi

సాక్షి, అమరావతి : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తప్పనిసరి పరిస్థితుల్లో కౌంటింగ్‌ పూర్తైన తర్వాత కూడా రీపోలింగ్‌ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈవీఎంలు మొరాయించి, వీవీప్యాట్‌ లెక్కలో తేడా వచ్చినా, మిగతా లెక్కింపులో పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం అతి తక్కువగా ఉంటే రీపోలింగ్‌కు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఇక మే 27 అర్ధరాత్రి వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని, ఫలితాల వెల్లడిలో ఆర్వోలదే తుది నిర్ణయమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement