చంద్రబాబుపై చాంద్ బాషా ఫైర్ | ysrcp mla takes on Chandrababu naidu govt | Sakshi

చంద్రబాబుపై చాంద్ బాషా ఫైర్

Jan 20 2015 1:40 PM | Updated on May 29 2018 2:28 PM

చంద్రబాబుపై చాంద్ బాషా ఫైర్ - Sakshi

చంద్రబాబుపై చాంద్ బాషా ఫైర్

ఏపీ సీఎం చంద్రబాబుపై అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా మంగళవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు.

అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబుపై అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా మంగళవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. బాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ఇసుక విధానం వల్ల సామాన్యులకు సొంతింటి కల దూరం అవుతుందని ఆయన ఆరోపించారు. ట్రాక్టర్ ఇసుక రూ. వెయ్యి నుంచి రూ. 5 వేలకు పెరిగిందన్నారు.

ఇసుక ధర పెరగడం వల్ల రాష్ట్రంలో గృహ నిర్మాణాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయని ఆయన విమర్శించారు. వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక విధానంపై వైఖరీ మార్చుకుంటే ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా చంద్రబాబును చాంద్ బాషా హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement