‘పచ్చి బూతులు మాట్లాడుతూ బెదిరించారు’ | Lokeswar Reddy Claims TDP Manipulate Andhra Voter Data | Sakshi

‘ఏపీ పోలీసులు నన్ను వేధిస్తున్నారు’

Mar 3 2019 3:11 PM | Updated on Mar 3 2019 3:34 PM

Lokeswar Reddy Claims TDP Manipulate Andhra Voter Data - Sakshi

హైదరాబాద్‌: ఐటీ గ్రిడ్స్ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి ఏపీ ఓటర్ల సమాచారం లీక్‌ అయ్యిందని ఫిర్యాదు చేస్తే తనను వేధింపులకు గురిచేస్తున్నారని కూకట్‌పల్లి చెందిన లోకేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఓటర్ల డేటా ప్రైవేటు సంస్థలు చేతుల్లోకి ఎలా వెళ్లిందని ప్రశ్నిస్తే ఏపీ పోలీసులు తనను వేధిస్తున్నారన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని సీపీ కార్యాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడిన లోకేశ్వర్‌రెడ్డి.. ‘ఏపీలో వ్యవస్థలు నాశనం అవుతున్నాయి. అసలు ఏపీ ప్రజల డేటా ప్రైవేటు సంస్థలకు ఎలా చేరింది. ఓటర్లను భయభ్రాంతలను గురి చేస్తున్నారు. తప్పులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తే నాపైనే వేధింపులకు దిగుతున్నారు. దొంగ ఓట్లపై ఒకటిన్నర సంవత్సరంగా పోరాటం చేస్తున్నాం. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారు.
(ఇక్కడ చదవండి: ఐటీ గ్రిడ్స్‌ డేటా కుంభకోణంలో మరో మలుపు)

ఒక సామాజిక కార్యకర్తగా, టెక్నికల్‌ అంశాలు తెలిసిన వ్యక్తిగా నేను ఈ కేసు వేశాను. ఏపీలో దొంగ ఓట్లపై ప్రశ్నించా. నేను కేసు నమోదు చేసినప్పటి నుండి నాపైనే బెదిరింపులకు దిగుతున్నారు. ఏపీ పోలీసులు మా ఇంటిపై దాడి చేశారు. అరగంట పాటు మా ఇంట్లో పచ్చి బూతులు మాట్లాడుతూ బెదిరించారు. ఒక ప్రైవేటు సంస్థకి ఏపీ ప్రజల వివరాలు ఎలా వచ్చాయి. ఏపీ ప్రభుత్వం దగ్గరుండి చేయిస్తుంది. విచారణ చేయాల్సిన ఏపీ అధికారులు నన్ను వేధిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. లక్షల ఓట్లను ఏపీ ప్రభుత్వం తొలగిస్తుంది. నాకు ప్రాణ హానీ ఉంది. నాకు రక్షణ కల్పించాలని తెలంగాణ పోలీసుల్ని ఆశ్రయించా. ఈ మేరకు సైబరాబాద్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశా’ అని లోకేశ్వర్‌రెడ్డి పేర్కొన‍్నారు.

(ఇక్కడ చదవండిఐటీ గ్రిడ్‌ కంపెనీలో సోదాలపై టీడీపీలో వణుకు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement