చంద్రబాబు ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది | k ramakrishna takes on chandrababu naidu govt | Sakshi

చంద్రబాబు ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది

Oct 13 2015 9:56 AM | Updated on Aug 13 2018 4:30 PM

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేసే ప్రతిపార్టీతో కలుస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఒంగోలులో స్పష్టం చేశారు.

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేసే ప్రతిపార్టీతో కలుస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఒంగోలులో స్పష్టం చేశారు. మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో కె.రామకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ.... ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ దీక్ష చేస్తుంటే... ఆయన ఆరోగ్యంపై చంద్రబాబు ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. 

రాజధాని శంకుస్థాపన కోసం ఈ నెల 22న రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. అలాగే ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని చంద్రబాబు సర్కార్కు సూచించారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కె. రామకృష్ణ హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement