ఆన్‌లైన్‌ మోసాలకు అంతేలేదు | Indiscriminate exploitation through credit card and UPIs: AP | Sakshi

ఆన్‌లైన్‌ మోసాలకు అంతేలేదు

Jun 19 2024 5:14 AM | Updated on Jun 19 2024 5:15 AM

Indiscriminate exploitation through credit card and UPIs: AP

దేశవ్యాప్తంగా క్రెడిట్‌ కార్డు, యూపీఐల ద్వారా విచ్చలవిడిగా దోపిడీ

గడిచిన మూడేళ్లలో అత్యధికంగా 47 శాతం మంది బాధితులు పట్టణ వాసులే 

అనధికారిక యూపీఐ స్కాన్, లింక్‌లను క్లిక్‌ చేయడం ద్వారా ఖాతాల్లో నగదు మాయం 

2023–24లో అత్యధికంగా 36,075 మోసాలు.. 

2022–23తో పోలిస్తే 166 శాతం మేర పెరుగుదల 

వీటి విలువ సుమారు రూ.13,930 కోట్లు  

మోసాలపై ఫిర్యాదులు చేసేందుకు వెనుకాడుతున్న బాధితులు 

సోషల్‌ మీడియా రీసెర్చ్‌ ఫ్లాట్‌ఫారం సంస్థ లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో వెల్లడి

దేశంలో ఆర్థిక మోసాలు పెచ్చరిల్లుతున్నాయి. వినియోగదారుల ఆర్థిక డేటా వివరాలు అంగట్లో సరుకులా అమ్ముడవుతున్నాయి. గడిచిన మూడేళ్లలో పట్టణ భారతీయుల్లో అధిక శాతం మంది క్రెడిట్‌ కార్డు మోసాలకు గురయ్యారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతుంది. ఆ తర్వాత.. నిత్యం లావాదేవీలకు కోసం వాడే యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా సరికొత్త చోరీలు తెరపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశంలోని వేలాది మంది డేటా విక్రేతల ద్వారా దేశీయ వినియోగదారుల క్రెడిట్‌ కార్డు సమాచారం మార్కెట్‌లో సులభంగా లభిస్తోందని సోషల్‌ మీడియా రీసెర్చ్‌ ఫ్లాట్‌ఫారం సంస్థ లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో తేలింది.      సాక్షి, అమరావతి

క్రెడిట్‌ కార్డుల ద్వారా 43శాతం మోసాలు..
దేశవ్యాప్తంగా గడిచిన 36 నెలల్లో ఏకంగా 47 శాతం మంది పట్టణ భారతీయులు, వారి కుటుంబ సభ్యులు ఆర్థిక మోసాల బారినపడినట్లు నివేదిక పేర్కొంది. 43 శాతం మంది తమ క్రెడిట్‌ కార్డు ద్వారా.. 30 శాతం మంది యూపీఐ లావాదేవీల ద్వారా మోసపోయారు. క్రెడిట్‌ కార్డు ద్వారా జరిగిన మోసాల్లో దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు దేశీయ, అంతర్జాతీయ వ్యాపారులు వెబ్‌సైట్‌ల ద్వారా అనధికారిక చార్జీల మోతను భరించాల్సి వచి్చంది. బ్యాంకర్ల పేరుతో ఫోన్లుచేసి ఓటీపీలు ద్వారా డెబిట్‌ కార్డు వివరాలు అప్‌డేట్‌ చేయాలంటూ ఖాతాల్లోని నగదును దోచేస్తున్నారు. ఇక యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌ దోపిడీ విషయంలో ప్రతి పదిమంది బాధితుల్లో నలుగురు చెల్లింపునకు అంగీకరించడానికి పంపించే లింక్‌ను క్లిక్, క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా డబ్బులను పోగొట్టుకున్నారు.  

ఇక యూపీఐ, క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆ అధ్యయనం అభిప్రాయపడింది. ఆర్‌బీఐ, యూపీఐ.. క్రెడిట్‌ కార్డులు జారీచేసే బ్యాంకులు ఇలాంటి ఆరి్థక మోసాలను నిరోధించేందుకు మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని తేల్చిచెప్పింది. సైబర్‌ క్రైం పోలీసుస్టేషన్లు, నిమిషాల వ్యవధిలో ఆన్‌లైన్‌ ఫిర్యాదును ఫైల్‌చేసే వ్యవస్థ అందుబాటులోకి రావాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.

ఇక యూపీఐ, క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆ అధ్యయనం అభిప్రాయపడింది. ఆర్‌బీఐ, యూపీఐ.. క్రెడిట్‌ కార్డులు జారీచేసే బ్యాంకులు ఇలాంటి ఆర్థిక మోసాలను నిరోధించేందుకు మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని తేలి్చచెప్పింది. సైబర్‌ క్రైం పోలీసుస్టేషన్లు, నిమిషాల వ్యవధిలో ఆన్‌లైన్‌ ఫిర్యాదును ఫైల్‌చేసే వ్యవస్థ అందుబాటులోకి రావాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.

అమ్మకానికి క్రెడిట్‌ కార్డు డేటా.. 
మరోవైపు.. దేశంలోని వినియోగదారుల క్రెడిట్‌ కార్డు డేటా సులభంగా అమ్మకానికి అందుబాటులో ఉందని ఈ అధ్యయనం చెబుతోంది. పాన్‌కార్డు, ఆధార్, మొబైల్‌ నంబర్, ఈమెయిల్, చిరునామా వంటి వ్యక్తిగత  సమాచారంతో పాటు మొబైల్‌ నంబర్, ఈమెయిల్, ఇతర చిరునామాతో క్రెడిట్‌ కార్డుల వివరాలు కూడా అందుబాటులో ఉండటం సమాజానికి శ్రేయస్కరం కాదని పేర్కొంది.  

ఒక్క ఏడాదిలో రూ.13,930 కోట్ల దోపిడీ.. 
ఆర్బీఐ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 36వేల కంటే ఎక్కువ ఆర్థిక మోసాలు నమోదైనట్లు తెలుస్తోంది. ఇది గత ఆరి్థక ఏడాదితో పోలిస్తే 166 శాతం మేర గణనీయంగా పెరిగింది. బ్యాంకింగ్‌ రంగంలో ఈ మోసాల కేసులు 2022–23లో 13,564 నుంచి 2023–24లో 36,075కి చేరుకున్నాయి. అయితే, ఈ మోసాల విలువ 2023–24లో రూ.13,930 కోట్లకు చేరాయి. అయితే, ఇక్కడ ప్రతి పది మంది బాధితుల్లో ఆరుగురు ఎటువంటి ఫిర్యాదులు చేయడానికి ముందుకు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని నివేదిక పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement