గుప్కార్‌ నేతల గృహనిర్బంధం | 3 ex-JK CMs house arrest before protest against Delimitation Commission proposals | Sakshi

గుప్కార్‌ నేతల గృహనిర్బంధం

Jan 2 2022 6:16 AM | Updated on Jan 2 2022 6:16 AM

3 ex-JK CMs house arrest before protest against Delimitation Commission proposals - Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ డీలిమిటేషన్‌ కమిషన్‌ ప్రతిపాదనలకు నిరసనగా ర్యాలీ తలపెట్టిన ముగ్గురు మాజీ సీఎంలు సహా గుప్కార్‌ కూటమి రాజకీయ నేతలను పోలీసులు శనివారం గృహనిర్బంధంలో ఉంచారు. ‘గుడ్‌మార్నింగ్, 2022కు స్వాగతం. సాధారణ ప్రజాస్వామ్య కార్యకలాపాలకు భయపడిన జమ్మూకశ్మీర్‌ పోలీసులు చట్టవిరుద్ధంగా మళ్లీ ప్రజలను గృహనిర్బంధం చేశారు’అంటూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా శనివారం ఉదయం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తన తండ్రి, మాజీ సీఎం ఫరూక్‌  ఇంటి లోపలి గేటును పోలీసులు మూసివేశారన్నారు. మరో మాజీ సీఎం మెహబూబా ముఫ్తీని  పోలీసులు నిర్బంధంలో ఉంచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement