Reviews
-
రేపటి కోసం యుద్ధం.. ఉత్కంఠతతో సాగే 'ది టుమారో వార్'
చిత్రం: ది టుమారో వార్విడుదల: జులై 02,2021నటీనటులు: క్రిస్ ప్రాట్, వైవోన్నే స్ట్రాహోవ్స్కీ, సిమన్స్, గిల్పిన్, సామ్ రిచర్డ్సన్, ఎడ్విన్ హాడ్జ్, జాస్మిన్ మాథ్యూస్, ర్యాన్ కీరా ఆర్మ్‌స్ట్రాంగ్, కీత్ పవర్స్ తదితరులుదర్శకుడు : క్రిస్ మెక్కేసంగీతం: లోర్మీ బ్లాఫీసినిమాటోగ్రఫీ: ల్యారీ ఫాంగ్నిర్మాతలు: డేవిడ్ ఎల్లిసన్, డానా గోల్డ్బెర్గ్, డాన్ గ్రాంజెర్, జులెస్ డాలీ, డేవిడ్ ఎస్.గోయర్, ఆడమ్ కోల్బెర్నర్ఓటీటీ భాగస్వామి: అమెజాన్ ప్రైమ్ వీడియో (తెలుగు)స్ట్రీమింగ్ భాషలు: తెలుగు,ఇంగ్లీష్,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళంహాలీవుడ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు భారీగానే ఆదరిస్తారు. అందుకే అవన్నీ తెలుగులో కూడా డబ్ అవుతుంటాయి. సైన్స్ ఫిక్షన్ చిత్రాలతో పాటు యాక్షన్ అడ్వెంచర్ చిత్రాలను టాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మార్వెల్ చిత్రాలతో పాటు ఏలియన్స్ సబ్జెక్ట్‌తో వచ్చిన సినిమాలు ఎన్నో థియేటర్లలో సందడి చేశాయి. ఈ క్రమంలో తెరకెక్కిన మిలటరీ సైన్స్ ఫిక్షన్ సినిమానే 'ది టుమారో వార్'. 2021 కోవిడ్ సమయంలో డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. హలీవుడ్లో తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్‌లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా కథేంటో తెలుసుకుందాం. భవిష్యత్ కాలంలో భూమి మీద ఎలాంటి ఇబ్బందులు రావచ్చేనే కాన్సెప్ట్‌తో 'ది టుమారో వార్' కథ ఉంటుంది. గ్రహాంతర వాసులకు.. జీవరాశులకు మధ్య జరిగే భారీ యాక్షన్ వార్‌గా చాలా ఉత్కంఠతో కూడుకొని కథ ఉంటుంది.కథ ఎంటి..?డాన్ ఫారెస్టర్ (క్రిస్ ప్రాట్) మాజీ ఇరాక్ సైనికాధికారి. రిటైర్డ్ అయ్యాక స్కూల్ పిల్లలకు బయాలజీ చెబుతూ తన భార్య (బెట్టీ గ్లిపిన్), కూతురు (రియాన్ కైరా)తో కలిసి జీవితం గడుపుతుంటాడు. ఒకరోజు ఆకాశం నుంచి ఓ ఆర్మీ యూనిట్ ఆయనముందు ప్రత్యక్షమవుతుంది. తామందరం భవిష్యత్ కాలం నుంచి వచ్చామని చెబుతూ ఎలియన్స్‌తో యుద్ధం చేసేందుకు సైన్యం అవసరం ఉందని చెబుతారు. ఆయనొక ఆర్మీ అధికారి కాబట్టి ఎలియన్స్ మీద పోరాటం చేసేందుకు తీసుకెళ్తారు. భవిష్యత్తు యుద్ధం కోసం అతను చేసిన త్యాగం ఏమిటి? ఒక బృందంగా వెళ్లిన డాన్ ఫారెస్టర్ ఏం చేశాడు..? ఏలియన్స్ ఎలా అంతమయ్యాయి..? డాన్ ఫారెస్టర్ కోసమే భవిష్యత్ కాలం నుంచి వారు ఎందుకు వచ్చారు..? ఇవన్నీ తెలియాలంటే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ది టుమారో వార్' చూడాల్సిందే.ఎలా ఉందంటే..?గ్రహాంతర వాసులకు.. జీవరాశులకు మధ్య జరిగే యుద్ద నేపథ్యంలో వచ్చిన ఈ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చాలా అంశాల్లో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఏలియన్స్ కాన్సెప్ట్‌తో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. అన్నీ సినిమాల మాదిరి కాకుండా ది టామారో వార్ సినిమాను చాలా ప్రత్యేకంగా తెరకెక్కించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ భిన్నమైనది. ఎలియన్స్‌ను ఎదుర్కొనేందుకు భవిష్యత్ తరం వారు సాయం కోసం వర్తమాన కాలానికి చెందిన వారిని కలవడం అనేది చాలా ఆసక్తి తెప్పించే అంశం. ఈ పాయింట్‌తో సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ క్రిస్ మెకే భారీ విజయం సాధించారు.డాన్ ఫారెస్టర్ ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత ఎలా భవిష్యత్ కాలంలో అడుగుపెట్టాడో చూపించిన విధానం బాగుంది. అక్కడ ఎలియన్స్ మీద రీసెర్చ్ చేస్తున్న ఆ యూనిట్లో డాన్ ఫారెస్టర్ ఎలా కీలకం అయ్యాడో చూపించిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. అప్పటికే చాలామంది ఏలియన్స్ మరణించి ఉంటారు. అలాంటి సమయంలో ఎంట్రీ ఇచ్చిన డాన్ ఫారెస్టర్ యూనిట్ మీద ఏలియన్స్ ఎటాక్ చేస్తాయి. చాలా ఉత్కంఠతతో ఆ సీన్స్ ఉంటాయి.ఈ క్రమంలో ఓ ఏలియన్‌ను డాన్ ఫారెస్టర్ యూనిట్ పట్టుకుంటుంది. ఆ సమయంలో ప్రతి ప్రేక్షకుడిని చూపుతిప్పనివ్వకుండా దర్శకుడు చిత్రీకరించాడు. సరిగ్గా ఈ సమయంలోనే మరో ఆర్మీ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్న మ్యూరి ఫారెస్టర్ తన కుమార్తె అని తెలుసుకుని డాన్ ఫారెస్టర్ చాలా సంతోషిస్తాడు. చాలా ఎమెషనల్‌గా కొన్ని సీన్లు వారి మధ్య ఉంటాయి. భవిష్యత్ కాలానికి వెళ్లి తన కుమార్తెను కలుసుకున్న ఒక తండ్రి కాన్సెప్ట్ అందరినీ మెప్పిస్తుంది. ఎలియన్స్‌ను అంతం చేయాలంటే దానితోనే వాటిని చంపాలని డాన్ ఫారెస్టర్ ఒక వ్యూహం వేస్తాడు. వారి చేతికి చిక్కిన ఎలియన్ శరీరం నెంచి టాక్సిన్ను తయారు చేసి దానితోనే వాటిని అంతం చేయాలని స్కెచ్ వేస్తాడు. అయితే, వారి చేతికి చిక్కిన ఏలియన్‌ను కాపాడుకునేందుకు మిగిలిన ఏలియన్స్ చేసిన పోరాటంతో ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అలాంటి సమయంలో డాన్ ఫారెస్టర్ వేసిన మరో అద్భుతమైన ప్లాన్ ఎంటి..? అనేది చాలా ఆసక్తిని పెంచుతుంది. యాక్షన్ చిత్రాలను ఆదరించేవారికి ఈ సినిమా మంచి థ్రిల్‌ను తప్పకుండా ఇస్తుంది.ఎవరెలా చేశారంటే..?డాన్ ఫారెస్టర్ పాత్రలో క్రిస్ ప్రాట్ అదరగొట్టేశాడు. ఆయన కూతురి పాత్రలో స్ట్రావోస్కీ కూడా మెప్పించింది. సిమన్స్, సామ్ రిచర్డ్సన్ వారి పాత్రలకు సరైన న్యాయం చేశారు. 'ది టుమారో వార్' చిత్రానికి ప్రధాన బలం విజువల్స్ అని చెప్పవచ్చు. ల్యారీ ఫాంగ్ సినిమాటోగ్రఫీ సినిమాను మరో రేంజ్‌కు చేర్చుతుంది. ఇలాంటి సినిమాలు బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఆ మజానే వేరు అనేలా ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లను ఎలివేట్ చేయడానికి అద్భుతమైన విఎఫెక్స్, క్వాలిటీ సీజిఐను ఉపయోగించడంతో ఈ సినిమా విజువల్ వండర్‌గా తెరకెక్కింది. అయితే దర్శకుడు కథ చెప్పే తీరు కాస్త నెమ్మదిగా ఉంటుంది. ముఖ్చంగా తండ్రీ, కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త బలంగా ఉండాల్సింది. ఫైనల్‌గా ‘ది టుమారో వార్’ అద్భుతాన్ని చూడాల్సిందే. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. -
Galli Gang Stars Movie Review: గల్లీ గ్యాంగ్ స్టార్స్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: గల్లీ గ్యాంగ్ స్టార్స్ నటీనటులు : సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక, ఆర్జే బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి తదితరులుదర్శకత్వం: వెంకటేష్ కొండిపోగు, ధర్మనిర్మాణ సంస్థ: ఏబీడీ ప్రొడక్షన్స్నిర్మాత: డా. ఆరవేటి యశోవర్ధన్సంగీత దర్శకుడు: సత్య, శరత్ రామ్ రవిఎడిటర్ : ధర్మఅసలు కథేంటంటే..గల్లీ గ్యాంగ్ స్టార్స్ మూవీ నెల్లూరు పరిసర ప్రాంతంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. గాంధీ, తప్పెట్లు, మూగోడు, చెత్తోడు, కర్రోడు, క్వార్టర్ అనే పేర్లతో నెల్లూరు గల్లీలో పెరుగుతున్న అనాధల కథే ఈ చిత్రం. ఆ గల్లిని ఎప్పటినుంచో తన గుప్పెట్లో పెట్టుకున్న గోల్డ్ రెడ్డి అనే రౌడీషీటర్. అక్కడ ఉన్న అనాధల్ని తీసుకెళ్లి వాళ్లతో డ్రగ్ అమ్మిస్తూ నేరాలు చేయిస్తూ ఉంటాడు. గాంధీ అనే వ్యక్తి గోల్డ్ రెడ్డి కింద పనిచేస్తూ ఉంటాడు. గాంధీ ప్రియురాలు లక్ష్మీని గోల్డ్ రెడ్డి ఏడిపిస్తాడు. అదేవిధంగా ఆ గల్లీ ప్రజలని భయపెడుతూ ఉంటాడు. ఈ గల్లీ కుర్రాళ్లకి సత్య అని చదువుకున్న యువకుడు తోడు అవుతాడు. ఆ తర్వాత గోల్డ్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని అర్థం చేసుకున్న గల్లీ కుర్రాళ్ళు గల్లీ గ్యాంగ్ స్టార్స్‌గా ఎలా మారారు? ఈ ఆరుగురు అనాధలు ఎలా కలిశారు? గోల్డ్ రెడ్డిని ఎలా ఎదిరించారన్నదే అసలు కథ.ఎలా ఉందంటే..డైరెక్టర్ వెంకటేష్ కొండిపోగు కథలోకి నెమ్మదిగా ప్రేక్షకులను తీసుకెళ్లాడు. రోటీన్ వచ్చే సన్నివేశాలు, కామెడీతో హాఫ్ సాగింది. కాస్తా బోరింగ్ అనిపించిన అక్కడక్కడ నవ్వించే సీన్స్‌తో కవర్ చేశాడు. గల్లీ కుర్రాళ్లు, రౌడీషీటర్ గోల్డ్ రెడ్డి మధ్య జరిగే సన్నివేశాల్లో అంతగా వర్కవుట్ కాలేదు. సెకండాఫ్ వచ్చేసరికి కథను కాస్తా సాగదీసినట్లు అనిపిస్తుంది. గోల్డ్ రెడ్డి, కుర్రాళ్ల గ్యాంగ్‌ను ఎలా ఎదుర్కొన్నారనే దాని చుట్టే కథ తిరుగుతుంది. క్లైమాక్స్ సీన్ ఫర్వాలేదు. డైరెక్టర్ తాను రాసుకున్న కథను తెరపై ఆవిష్కరించడంలో కొత్తదనం చూపించలేకపోయాడు. చివరికీ గోల్డ్ రెడ్డిని ఆ కుర్రాళ్ల గ్యాంగ్ ఎలా ఎదిరించారో తెలియాలంటే గల్లీ గ్యాంగ్ స్టార్స్‌ను చూడాల్సిందే.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో కొత్త వారైనా కూడా మంచి నటనతో ఆకట్టుకున్నారు. సంజయ్ శ్రీ రాజ్ గాంధీగా మంచి పాత్ర పోషించాడు. ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక, ఆర్జే బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఏబిడి ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు ఫర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. ధర్మ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. సత్య శరత్ రామ్ రవి సంగీత నేపథ్యం బాగుంది. -
‘ఆపరేషన్ రావణ్’ మూవీ రివ్యూ
టైటిల్: ఆపరేషన్ రావణ్నటీనటులు: రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్ తదితరులునిర్మాత: ధ్యాన్ అట్లూరిరచన-దర్శకత్వం: వెంకట సత్యసంగీతం: శరవణ వాసుదేవన్సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టివిడుదల తేది: జులై 26, 2024పలాస, నరకాసుర వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి. తాజాగా ఆయన నటించిన చిత్రం ఆపరేషన్ రావణ్. రక్షిత్ తండ్రి వెంకట సత్య ఈ మూవీలో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘ఆపరేషన్ రావణ్’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(జులై 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సైకో థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఆమని(సంగీర్తన విపిన్) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. స్థానిక మంత్రి(రఘు కుంచె) చేసే అవినీతిపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఓ స్టోరీ రెడీ చేస్తుంది. అయితే ఆ స్టోరీని టీవీ చానెల్ సీఈఓ(మూర్తి) టెలికాస్ట్ చేయకుండా జాప్యం చేస్తుంటాడు. అంతేకాకుండా అది పక్కకి పెట్టి ఓ సీరియల్ కిల్లర్ కేసుని కవర్ చేయమని ఆమనికి ఆదేశిస్తాడు. ఆమెకు అసిస్టెంట్‌గా అప్పుడే ఉద్యోగంలో చేరిన రామ్(రక్షిత్ అట్లూరి)ని పంపిస్తాడు. రామ్ ఓ నిజాన్ని దాచి ఆమని కోసం ఆ చానెల్లో ఉద్యోగిగా చేరతాడు. ఆమె ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు నగరంలో ఆ సీరియల్ కిల్లర్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుంటాడు. తన కూతురు కూడా కనిపించడం లేదని తమ్ముడి వర్మతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది సుజాత(రాధికా శరత్ కుమార్). పోలీసులతో పాటు ఆమని, రామ్‌లు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని విచారణ జరుపుతుంటారు. ఈ క్రమంలో ఓ రోజు ఆ సీరియల్ కిల్లర్ ఆమనిని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను హత్య చేస్తున్నాడు? పెళ్లికి రెడీ అయిన సుజాత కూతుర్ని కిడ్నాప్ చేసిందెవరు? సీరియల్ కిల్లర్ నుంచి తన ప్రియురాలు ఆమనిని రామ్ ఎలా రక్షించుకున్నాడు? సుజాతకు ఆ సీరియల్ కిల్లర్‌తో ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. సాధారణంగా సైకో థ్రిల్లర్ సినిమాల్లో ఎవరు ఎవరిని, ఎందుకు చంపుతున్నారు? దాని వెనక మిస్టరీని తెలుసుకోవడంలోనే కథనం సాగిపోతూ ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో నేరం జరిగిన తీరు..వాటి చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్..దాన్ని హీరో ఎంత తెలివిగా ఛేదించాడన్న అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. బిగిసడలని స్క్రీన్‌ప్లే ఉండాలి. అప్పుడే రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను థియేటర్స్‌లో కూర్చొబెట్టగలుగుతాం. ఆపరేషన్ రావణ్ సినిమా విషయంలో ఆ ప్రయత్నం కొంతవరకు మాత్రమే సఫలం అయింది. సైకో థ్రిల్లర్ చేసే హత్యలు.. దాన్ని చూపించిన తీరు ఉత్కంఠబరితంగా ఉన్నా.. దాని చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్ మాత్రం సాదా సీదా అనిపిస్తుంది. సైకో కిల్లర్‌ని కనిపెట్టేందుకు పోలీసులతో పాటు హీరోహీరోయిన్లు చేసే ఇన్వెస్టిగేషన్ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అయితే సైకో కిల్లర్ ఎవరని తెలిసిన తర్వాత షాక్‌కి గురవుతాం. అలాగే అతను అలా మారడానికి గల కారణం కూడా వాస్తవికంగా ఉంటుంది. సైకో ఎవరనేది చివరివరకు తెలియకుండా దర్శకుడు జాగ్రత్తగా కథనాన్ని నడిపాడు. తొలి సినిమానే అయినా..కొన్ని సీన్లను అనుభవం ఉన్న డైరెక్టర్లా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభంలోనే సైకో కిల్లర్ హత్య సీన్ పెట్టి కథపై ఆస్తకి కలిగించాడు. ఆ తర్వాత హీరో ఎంట్రీ, హీరోయిన్‌తో లవ్ అంతా సాదా సీదాగా సాగిపోతుంది. కొన్ని అనవసరపు సన్నివేశాలను పెట్టి కథను సాగదీశాడు. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరై ఉంటారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో మరింత పెరుగుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. సైకో కిల్లర్ ఫేస్ రివీల్ చేసే సీన్, ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఆపరేషన్ రావణ్ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. గత సినిమాలతో పోలిస్తే రక్షిత్ అట్లూరి నటన మరింత మెరుగు పడింది. జర్నలిస్ట్ రామ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. ముఖ్యంగా సైకో కిల్లర్‌ని ఛేజింగ్ చేసే సీన్ సినిమాకే హైలెట్. ఇక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆమనిగా సంగీర్తన విపిన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. సైకో కిల్లర్‌గా నటించిన వ్యక్తి కూడా క్లైమాక్స్‌లో తన నటనతో బయపెడతాడు. రాధికా శరత్ కుమార్ పాత్ర నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా ఆకట్టుకుంది. చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. శరవణ వాసుదేవన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే. సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' సినిమా రివ్యూ
టైటిల్: పురుషోత్తముడునటీనటులు: రాజ్ తరుణ్, హాసిని సుధీర్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ముకేశ్ ఖన్నా తదితరులుదర్శకుడు: రామ్ భీమననిర్మాతలు: రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్విడుదల తేదీ: 26 జూలై, 2024ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్ వంటి సూపర్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ గత కొంతకాలంగా ఫ్లాప్స్‌తో కొట్టుమిట్టాడుతున్నాడు. చాలాకాలంగా ఇతడికి మంచి హిట్ లేదు. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరో కొంచెం గ్యాప్ తీసుకొని పురుషోత్తముడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్ పర్వాలేదనిపించాయి. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో ఓ మోస్తరు హైప్ క్రియేట్ అయింది. మరి ఈ రోజు (జూలై 26న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథరచిత రామ్ (రాజ్ తరుణ్) లండన్‌లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తాడు. అతడిని తన కంపెనీకి సీఈవో చేయాలని తండ్రి (మురళీ శర్మ) భావిస్తాడు. అయితే కంపెనీ నిబంధన ప్రకారం.. సీఈవో కావాలంటే ముందు ఆ వ్యక్తి వంద రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లాలి. ఆ విషయాన్ని రామ్ పెద్దమ్మ (రమ్య కృష్ణ) అందరికీ గుర్తు చేస్తుంది. ఆ కంపెనీలో తనకు 50 శాతం వాటా ఉండటంతో రామ్ అజ్ఞాతంలోకి వెళ్లక తప్పదు. రాజమండ్రి దగ్గర్లోని కడియపులంక అనే గ్రామానికి ఒంటరిగా వెళ్లిపోతాడు.ఆ గ్రామంలో నర్సరీ నడుపుతున్న అమ్ములు (హాసిని సుధీర్) దగ్గర పనిలో చేరతాడు. ఆ గ్రామంలోని రైతుల్ని స్థానిక ఎమ్మెల్యే, అతని కుమారుడు ఇబ్బందులకు గురి చేస్తారు. దీంతో వారు రామ్ సాయం కోరతారు. మరోవైపు రామ్ వివరాలను బయటకు తెలియజేసి తను సీఈవో కాకుండా అడ్డుకోవాలని పెద్దమ్మ, ఆమె కుమారుడు (విరాన్ ముత్తం శెట్టి) కుట్ర పన్నుతారు. తమ మనుషులతో అతడి ఆచూకీ కోసం గాలిస్తుంటారు. మరి రామ్ సీఈవో అయ్యాడా? ఆ రైతుల కోసం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే?హీరోకు వందల కోట్ల ఆస్తి ఉన్నా అవన్నీ వదిలేసి సాధారణ జీవితం గడుపుతుంటాడు.. ఈ క్రమమంలో పేద ప్రజల జీవన విధానం, కష్టాలు తెలుసుకుని చలించిపోతాడు. వారికి సాయం చేస్తాడు.. ఈ పాయింట్‌తో శ్రీమంతుడు, బిచ్చగాడు, పిల్ల జమీందార్.. ఇలా పలు తెలుగు చిత్రాలు వచ్చాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కూడా ఇదే! కథ రొటీన్ అయినా తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు.కానీ పాత కథే కావడంతో సినిమా చూస్తున్నంతసేపు అవే గుర్తుకు వస్తుంటాయి. కథనం కూడా ఊహకు తగ్గట్లే సాగిపోతుంది. ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సెకండాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు సహజంగా ఉండకుండా సినిమాటిక్‌గా అనిపిస్తాయి. సినిమా అంతా కూడా పెద్దగా ట్విస్టుల్లేకుండా సాఫీగా సాగిపోతుంది. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదనిపించాయి. చివర్లో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగులు బాగా పేలాయి. రన్ టైం రెండు గంటలే ఉండటం ప్లస్ పాయింట్.ఎవరెలా చేశారంటే?రామ్ పాత్రకు రాజ్ తరుణ్ న్యాయం చేశాడు. హీరోయిన్ హాసిని సుధీర్ అందంతో మెప్పించింది. నటనలోనే ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాలి. రమ్యకృష్ణ ఎప్పటిలాగే హుందాగా నటించింది. ప్రకాశ్ రాజ్, విరాన్ ముత్తం శెట్టి, మురళీ శర్మ.. తమ పాత్రల్లో లీనమైపోయారు. మిగతావారు పర్వాలేదనిపించారు. చదవండి: ఆ షోలో అన్నీ నిజమే.. నన్ను తేళ్లు కుట్టాయి: నటి -
'రాయన్' సినిమా రివ్యూ
ధనుష్‌కి తమిళంలో ఉన్నంత క్రేజ్ తెలుగులోనూ ఉంది. 'సార్', 'తిరు' లాంటి సినిమాలతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. అలాంటిది ఇతడు హీరోగా నటించి దర్శకత్వం వహించిన మూవీ 'రాయన్' వస్తుందంటే ఆ మాత్రం అంచనాలు ఉంటాయి కదా! అందున ఇది ధనుష్‌కి 50వ మూవీ. ఇంతకీ ఇది ఎలా ఉంది? హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కాతవరాయన్ (ధనుష్) చిన్నతనంలోనే తల్లిదండ్రులు కనిపించకుండా పోతారు. దీంతో ఉన్న ఊరిని వదిలిపెట్టి ఇద్దరు తమ్ముళ్లు, చెల్లితో వేరేచోటకు వలస పోతాడు. పెద్దయిన తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని బతికేస్తుంటాడు. సాఫీగా సాగిపోతున్న ఇతడి జీవితం.. అదే ఊరిలో పేరు మోసిన గూండాలు దురై, సేతు వల్ల తల్లకిందులవుతుంది. ఓ టైంలో సొంత తమ్ముడే.. రాయన్ని చంపాలనుకుంటాడు. ఇలా జరగడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?హీరో కమ్ దర్శకుడిగా ధనుష్.. ఈ పాయింట్ చాలు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవడానికి. కానీ యాక్టర్‌గా న్యాయం చేసిన ధనుష్.. రైటర్ కమ్ డైరెక్టర్‌గా విఫలమయ్యాడు. కథగా చూసుకుంటే 'రాయన్' పాతదే. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ఈ తరహా స్టోరీలతో మూవీస్ చాలానే వచ్చాయి. అంతెందుకు ఇలాంటి ఫ్లేవర్ ఉన్న స్టోరీల్లో గతంలో ధనుషే హీరోగా నటించాడు.ఫస్టాప్ విషయానికొస్తే.. రాయన్ బాల్యంతో కథ మొదలవుతుంది. ఊరెళ్లి వస్తానని చెప్పిన తల్లిదండ్రులు రాకపోవడం, కొన్ని అనుకోని పరిస్థితుల్లోని ఊరి నుంచి తప్పించుకుని రావడం.. ఇలా ఎక్కడో చూశామే అనిపించిన సీన్లతో టైటిల్స్ పడతాయి. ప్రస్తుతంలోకి వచ్చిన తర్వాత అయినా స్టోరీ కదులుతుందా అంటే అస్సలు కదలదు. రాయన్, అతడి షాప్, తమ్ముళ్లు, వాళ్ల చుట్టూ ఉండే వాతావరణం.. ఇలా బోరింగ్‌గా సాగుతూ ఉంటుంది. కాస్త హై ఇచ్చే ఫైట్ సీన్‌తో ఇంటర్వెల్ పడుతుంది.సెకండాఫ్‌లో అయినా ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అంటే అసలు కన్విన్స్ కాని, లాజిక్ లేని విధంగా స్టోరీ ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే ఫైట్ సన్నివేశాలు మినహా 'రాయన్' పూర్తిగా నిరాశపరుస్తుంది. పాత్రల మధ్య డ్రామా సరిగా వర్కౌట్ కాలేదు. రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తీద్దామనుకున్న ధనుష్.. అసలేం తీశాడో అర్థం కాని విధంగా సినిమా ఉంటుంది. సెకండాఫ్‌లో అన్నదమ్ముల మధ్య చిన్నపాటి ట్విస్ట్ పెట్టి ఏదో మేనేజ్ చేద్దామనుకున్నారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది.ఎవరెలా చేశారు?నటుడిగా ధనుష్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇతడి చెల్లిగా నటించిన దుశరా విజయన్, తమ్ముడిగా చేసిన సందీప్ కిషన్‌కి ఉన్నంతలో మంచి రోల్స్ పడ్డాయి. సెకండాఫ్‌లో హాస్పిటల్లో జరిగే ఫైట్ సీన్లో దుశరా యాక్టింగ్‌కి విజిల్ వేయాలనిపిస్తుంది. విలన్‌గా చేసిన ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది కానీ కథలో దమ్ము లేకపోవడంతో ఆ పాత్ర తేలిపోయింది. వీళ్లతో పాటు ప్రకాశ్ రాజ్, అపర్ణ బాలమురళి, కాళీదాస్ జయరాం, సెల్వరాఘవన్.. ఇలా మంచి మంచి యాక్టర్స్‌ని పెట్టుకున్నారు. కానీ వీళ్లకు సరైన సీన్స్ పడలేదు. అసలు ఇంతమంది స్టార్స్‌ని సినిమాలో ఎందుకు పెట్టుకున్నారా అనే డౌట్ వస్తుంది.టెక్నికల్ విషయాలకొస్తే పాటలు అస్సలు బాలేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల మాత్రమే బాగుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. యాక్టర్‌గా ధనుష్‌ని వంకపెట్టడానికి లేదు కానీ దర్శకుడిగా మాత్రం ఫ్లాఫ్ అయ్యాడు. దానికి తోడు 'రాయన్' చూస్తున్నంత సేపు తమిళ ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది. ఇది 'రాయన్' సంగతి!రేటింగ్: 1.75-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
Kill Movie Review: 'కిల్' సినిమా రివ్యూ
మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అస్సలు మిస్ కావొద్దు. 'కల్కి' రిలీజైన వారం తర్వాత థియేటర్లలోకి వచ్చిన హిందీ సినిమా 'కిల్'.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేస్తున్నారు. అలాంటిది థియేటర్లలో ఉండగానే ఈ చిత్రాన్ని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం యూఎస్, యూకేలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ 'కిల్' ఎలా ఉందో తెలియాలంటే రివ్వ్యూ చదివేయండి.కథేంటి?అమిత్ రాథోడ్ (లక్ష్య లల్వానీ) ఆర్మీలో ఎన్ఎస్జీ కమాండర్. తులికా (తన్య మనిక్తలా) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్‌లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ల వల్ల తులికా కుటుంబానికి ఊహించని చిక్కులు! తర్వాత ఏమైంది? తులికా ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్లని అమిత్ కాపాడాడా లేదా అనేది స్టోరీ.ఎలా ఉందంటే?నరకడం, పొడవడం, చంపడం.. కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకుని ఓ డైరెక్టర్ సినిమా తీస్తే అదే 'కిల్'. హాలీవుడ్లో 'జాన్ విక్' అని ఓ మూవీ సిరీస్.. హీరో, విలన్ గ్యాంగ్ ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీశారు. కథ చూస్తే కొత్తదేం కాదు. హీరోయిన్ ఫ్యామిలీ.. విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది. హీరో ఎలా కాపాడాడు అనేదే స్టోరీ లైన్. కానీ ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే 'కిల్'లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్.ఈ సినిమా అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరివరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజులో యాక్షన్, స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్.. ఇద్దరు ఎన్ఎస్జీ కమాండోలు.. 40 మంది బందిపోట్లు.. వీళ్ల మధ్య జరిగే భీకర ఫైటింగ్. మొత్తం అంతా ఇదే. పస్టాఫ్‌లో హీరో.. విలన్ గ్యాంగ్‌ని చంపకుండా కేవలం కొట్టి కిందపడేస్తుంటాడు. ఓ ఊహించని ఘటన జరిగేసరికి కృూరంగా మారిపోతాడు. పొడవడం, నరకడంలో విలన్ గ్యాంగ్‌కే చుక్కలు చూపిస్తాడు.ఒంటి నిండా కత్తిపోట్లతో తోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్‌ని నామరూపాల్లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీ ఇదే ఫస్ట్ టైమ్. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా.హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా గానీ అదరగొట్టేశాడు. విలన్ గ్యాంగ్‌లో ఫణి అనే పాత్ర చేసిన రాఘవ జూయల్ కూడా ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కనబెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ ఉంటాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అయిపోద్ది. సినిమాటోగ్రాఫీ అయితే ఇంకా కేక. ట్రైన్ సెట్లో మూవీ తీసుండొచ్చు. కానీ ఎక్కడా కూడా మనకు ఆ ఆలోచనే రాదు. నిజంగా మనం కూడా ఆ ట్రైన్లో చిక్కుకుపోయాం అనే రేంజులో భయపడతాం. ఫైనల్‌గా చెప్పాలంటే మీకు గుండె ధైర్యం ఎక్కువుంటే 'కిల్' చూడండి!-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
‘నాగేంద్రన్స్ హనీమూన్స్’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: నాగేంద్రన్స్ హనీమూన్స్నటీనటులు: సూరజ్ వెంబరమూడు, శ్వేత మీనన్, గ్రేస్ ఆంటోనీ, నిరంజన, అనూప్ తదితరులునిర్మాత: నితిన్ రెంజీ పనికర్దర్శకత్వం: నితిన్ రెంజీ పనికర్ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్స్టార్నాగేంద్రన్స్ హనీమూన్స్ సిరీస్ పేరు వినగానే ఇదేదో రొమాంటిక్ కథ అనుకుంటాం. కాని ఈ కథలో రొమాన్స్ తో పాటు మంచి కామెడీ కూడా ఉండడం విశేషం. మెల్ల మెల్లగా భారతీయ ఓటీటీ ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను కూడా ఆదరించడం హర్షణీయం. నాగేంద్రన్స్ హనీమూన్ సిరీస్ ఓ మంచి రొమాంటిక్ కామెడీ అని చెప్పవచ్చు. ఓ పెళ్ళి చేసుకోవడానికి వంద అబద్ధాలైనా ఆడవచ్చు అన్న నానుడి వినే ఉంటాం. కాని ఈ కథలోని కథానాయకుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పెళ్ళిళ్ళు ఎలా చేసుకున్నాడు అన్నదే పాయింట్. వధువు ఇచ్చే కట్నకానుకలపై కన్నేసిన కథానాయకుడు ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహమాడుతూ చివరికి ఏమయ్యాడన్నదే ఈ నాగేంద్రన్స్ హనీమూన్. విలక్షణ మళయాళ నటుడు సూరజ్ వెంజరమూడు నటించిన ఈ సినిమాను నితిన్ రెంజి పానికర్ దర్శకత్వంలో రూపొందించారు. కథ సిరీస్ కాబట్టి స్క్రీన్ ప్లే సరదాగా రాసుకున్నాడు దర్శకుడు. ఎక్కడా బోర్ ఫీలవకుండా ప్రేక్షకుడు ఎపిసోడ్ స్కిప్ చేయకుండా చూసేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. అక్కడక్కడా కొంత లాగ్ ఉన్నా వెరైటీ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు మంచి వాచబుల్ సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్.-ఇంటూరు హరికృష్ణ -
'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ)
రొటీన్ రొట్టకొట్టుడు కమర్షియల్ కథలు కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ సినిమాలు వస్తుంటాయి. అలా ఈ ఏడాది మార్చిలో తమిళంలో రిలీజైన 'హాట్ స్పాట్' మూవీ తెలుగు వెర్షన్ ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో అంతలా ఏముంది? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి!కథేంటి?రివేంజ్, యాక్షన్, ప్రేమ కథలు విని విని ఓ నిర్మాతకు చిరాకొస్తుంది. అలాంటి టైంలో స్టోరీలు పట్టుకుని డైరెక్షన్ ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్న మహమ్మద్ షఫీ (విఘ్నేశ్ కార్తీక్) వస్తాడు. 10 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇవ్వనని అనడంతో ఓ నాలుగు కథల్ని ఎదురుగా కూర్చున్న నిర్మాతకు చెప్తాడు. ఇంతకీ ఆ నాలుగు స్టోరీలు ఏంటి? ఇవన్నీ విన్న తర్వాత నిర్మాత ఏమన్నాడు? అసలు షఫీ.. సదరు నిర్మాతకే ఎందుకు చెప్పాడు అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటే?దీన్ని సినిమా అనడం కంటే 'ఆంథాలజీ' అనొచ్చు. 'హ్యాపీ మ్యారీడ్', 'గోల్డెన్ రూల్', 'టమాటో చట్నీ', 'ఫేమ్ గేమ్' అనే నాలుగు వేర్వేరు కథల్ని ఓ సినిమాగా తీశారు. చూస్తున్నంతసేపు ఫ్యూజులు ఎగిరిపోవడం గ్యారంటీ. ఎందుకంటే అంతలా ఆశ్చర్యపరుస్తాయి. అవాక్కయ్యేలా చేస్తాయి. ఏడిపిస్తాయి. భయపెడతాయ్!పెళ్లి తర్వాత ఆడపిల్లలు.. తమ ఇంటిని ఎందుకు వదిలిపెట్టాలి? అనేదే మొదటి స్టోరీ. ప్రేమ పెళ్లికి సిద్ధమైన ఓ జంటకు ఇలా కూడా జరిగే అవకాశముందా? అనేది రెండో స్టోరీ. తప్పు చేసి దాన్ని సమర్థించుకునే ప్రియుడికి బుద్ధిచెప్పే అమ్మాయి.. మూడో స్టోరీ. టీవీ షోల వల్ల పిల్లలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారనేది నాలుగో స్టోరీ.ఈ సినిమాలో ఒక్కో స్టోరీ ఒక్కో ఆణిముత్యం. ఎందుకంటే ఏ మూవీలో అయినా ఒకటో రెండో సీన్లు వేరే వాటితో పోలిక రావొచ్చు. కానీ ఇందులో ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే చూస్తున్న మీకే నమ్మశక్యం కాని విధంగా సన్నివేశాలు ఉంటాయి. మొదటి కథ కాస్త కొత్తగా ఉంటుంది. చివరికొచ్చేసరికి ఆలోచింపజేస్తుంది. రెండో కథలో ఓ ట్విస్ట్ ఉంటుంది. అది ఇబ్బందిగా అనిపిస్తూనే మైండ్ బ్లాంక్ చేస్తుంది. మూడో కథ అయితే రెండో దానికంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ మూడు స్టోరీలు.. యూత్‌ని టార్గెట్ చేసి తీసినవే.నాలుగో కథలో మాత్రం పిల్లలు.. ప్రస్తుతం సోషల్ మీడియా, టీవీ షోల కల్చర్ వల్ల ఎంత దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారనేది చూపిస్తారు. చిన్న పిల్లలున్న పేరెంట్స్ కచ్చితంగా చూడాల్సిన స్టోరీ ఇది. అయితే ఈ నాలుగింటిలోనూ దేనికది బాగానే ఉంటాయి కానీ మొదటి, చివరి స్టోరీలో మాత్రమే సరైన ముగింపు ఉంటుంది. మిగతా రెండింటిని మధ్యలో ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది.టెక్నికల్ విషయాలకొస్తే.. డైరెక్టర్ విఘ్నేశ్ కార్తీక్ రాసుకున్న స్క్రిప్ట్ మేజర్ హైలైట్. చూపించేది బోల్డ్ కంటెంట్ అయినప్పటికీ ఫన్నీ వేలో చెప్పడం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా సరిపోయింది. సినిమాటోగ్రాఫీ ఫెర్ఫెక్ట్. డైలాగ్స్ బాగున్నాయి. చూస్తున్నంతసేపు తెలుగు సినిమాలా ఉందేంటి అనిపిస్తుంది. యాక్టర్స్ తమిళవాళ్లే. కానీ పెద్దగా ఇబ్బంది ఉండదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ సినిమాని పొరపాటున కూడా ఫ్యామిలీతో చూడకండి. ఆహా ఓటీటీలో తెలుగులోనే అందుబాటులో ఉంది.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?
'యానిమల్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన తృప్తి దిమ్రి.. హీరోయిన్గా వరస అవకాశాలు దక్కించుకుంటోంది. అలా చేసిన ఓ మూవీనే 'బ్యాడ్ న్యూజ్'. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఫన్నీ ఎంటర్టైనర్ సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? తెలుగోళ్లకు నచ్చుతుందా లేదా అనేది చూద్దాం.కథేంటి?చెఫ్‌గా ఇంటర్నేషనల్ లెవల్లో అవార్డ్ తెచ్చుకోవాలనే లక్ష్యమున్న సలోని (తృప్తి దిమ్రి).. కుటుంబ సభ్యుల తాకిడి తట్టుకోలేక అఖిల్ చద్దా (విక్కీ కౌశల్)ని పెళ్లి చేసుకుంటుంది. హనీమూన్‌కి వెళ్తారు గానీ అక్కడ గొడవ జరగడంతో విడాకులు తీసుకునేందుకు రెడీ అయిపోతారు. పనిలో భాగంగా ముస్సోరికి వెళ్లిన సలోని.. గుర్బీర్ పన్ను(అమీ విర్క్)తో కాస్త దగ్గరవుతుంది. దీంతో ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే సలోని కడుపులో అఖిల్, గుర్బీర్‌కి చెందిన కవలలు ఉన్నారని డాక్టర్స్ చెబుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రులిద్దరూ ఏం చేశారనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)ఎలా ఉందంటే?వినగానే స్టోరీ పాయింట్ కాస్త వింతగా ఉన్నప్పటికీ.. కామెడీ కోసమే అన్నట్లు సినిమా తీశారు. కాకపోతే స్క్రీన్ ప్లేతోపాటు నవ్వించాల్సిన సీన్స్ సరిగా వర్కౌట్ కాలేదు. మరీ ముఖ్యంగా తృప్తి దిమ్రి ఓకే అనిపించే యాక్టింగ్ చేసింది. నటన పరంగా ఈమె ఇంకా చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. సెకండాఫ్‌లో ప్రధాన పాత్రధారులు ఇద్దరూ కలుసుకునే సీన్స్ చాలా సాగదీశారు. దీంతో అప్పటివరకు కాస్తోకూస్తో ఎంటర్టైన్ చేసిన సినిమా బోర్ కొట్టేస్తుంది. 'బ్యాడ్ న్యూజ్'లో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా అంటే అది విక్కీ కౌశల్ మాత్రమే. తన వంతు చాలా కష్టపడ్డాడు.'కల్కి' రిలీజై నాలుగు వారాలు అయిపోతున్నప్పటికీ చాలాచోట్ల ఇంకా దీని హవానే నడుస్తోంది. గత వారం 'భారతీయుడు 2' వచ్చింది గానీ బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. తెలుగులోనూ 'డార్లింగ్', 'పేకమేడలు' పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కానీ ఏ మేరకు నిలబడతాయనేది చూడాలి. ఇక 'బ్యాడ్ న్యూజ్' కూడా బాలీవుడ్ ఆడియెన్స్‌కి నచ్చొచ్చు ఏమో గానీ మరీ ఎగబడి వెళ్లేంత అయితే ఈ మూవీలో ఏం లేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చని అంటున్నారు.(ఇదీ చదవండి: 'ద బర్త్ డే బాయ్' మూవీ రివ్యూ) -
'ద బర్త్ డే బాయ్' మూవీ రివ్యూ
చిన్న సినిమాలపై పెద్దగా అంచనాలు ఉండవు. కొన్ని మూవీస్ అలా థియేటర్లలోకి వచ్చి సర్ప్రైజ్ చేస్తుంటాయి. అలాంటి చిత్రమే 'ద బర్త్ డే బాయ్'. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రంలో ఒకరిద్దరు మినహా దాదాపు కొత్త వాళ్లే నటించారు. దర్శకుడి ఫేస్ అయితే ఇప్పటివరకు బయటపెట్టలేదు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?బాలు, అర్జున్, వెంకట్, సాయి, సత్తి అనే కుర్రాళ్లు. అమెరికాలో చదువుకుంటూ ఉంటారు. వీళ్లలో బాలు పుట్టినరోజుని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ సెలబ్రేషన్స్‌లో బర్త్ డే బంప్స్ అని చెప్పి బాలుని ఎలా పడితే అలా కొడతారు. నొప్పి తట్టుకోలేక బాలు చనిపోతాడు. ఉన్నది అమెరికా కావడంతో కుర్రోళ్లు భయపడతారు. వీళ్లందరూ అర్జున్ సోదరుడు భరత్ (రవికృష్ణ)ని పిలుస్తారు. లాయర్ అయిన ఇతడు.. చనిపోయిన బాలు తల్లిదండ్రులకు విషయం చెప్పి అమెరికా రప్పిస్తాడు. ఇంతకీ బాలు చనిపోయాడా చంపేశారా? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ప్రియదర్శి 'డార్లింగ్' సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే?)ఎలా ఉందంటే?రియల్ లైఫ్ సంఘటన ఆధారంగా 'ద బర్త్ డే బాయ్' మూవీ తీశారు. సూటిగా సుత్తి లేకుండా మొదలైన పావుగంటకే స్టోరీలోకి తీసుకెళ్లిపోయిన దర్శకుడు.. శవంతో సినిమా అంతా నడిపించి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ థ్రిల్ అందించాడు. బర్త్ డే బంప్స్ పేరుతో కుర్రాళ్లు చేసే హడావుడి చాలా సహజంగా ఉంది. ఓవైపు డెడ్ బాడీనే స్టోరీలో మెయిన్ అయినప్పటికీ మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్‌ని కూడా క్యారీ చేసిన విధానం బాగుంది.ఫస్టాప్ అంతా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు మాత్రం ఆకట్టుకుంటాయి. రెండు గంటల సినిమానే అయినప్పటికీ.. కొన్ని సీన్ల వల్ల సాగదీసినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ చూస్తున్నంతసేపు భలేగా ఉంటుంది. తీసింది కొత్త డైరెక్టరేనా అని సందేహం వస్తుంది. స్టోరీ అంతా అమెరికాలో జరుగుతున్నట్లు రాసుకున్నారు. కానీ తీసింది ఇండియాలోనే అని చూస్తుంటే తెలిసిపోతుంది. బడ్జెట్ పరిమితుల వల్లనో ఏమో అమెరికా సెటప్ ఇండియాలోనే వేసుకున్నారు!ఎవరెలా చేశారు?ఈ సినిమాలో నటించిన వాళ్లంతా కొత్త వాళ్లే. అయినా సరే చాలా నేచురల్‌గా చేసుకుంటూ వెళ్లిపోయారు. రవికృష్ణ, రాజీవ్ కనకాల, సమీర్.. ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు. వీళ్లు తమతమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. విజువల్స్ బాగున్నాయి. ఓ సాంగ్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్‌గా ఉంది. సింక్ సౌండ్ వల్ల సినిమా చూస్తున్నంతసేపు మన పక్కనే జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. పేరుకే చిన్న మూవీ గానీ బాగానే ఖర్చు చేసినట్లు అర్థమైంది. బర్త్ డే పార్టీల పేరిట బంప్స్ అని చెప్పి ఎలాపడితే అలా కొడుతూ ఎంజాయ్ చేసేవాళ్లు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.(ఇదీ చదవండి: టీమిండియా క్రికెటర్ గిల్‌తో పెళ్లి? సిగ్గుపడుతూనే హీరోయిన్ క్లారిటీ) -
'డార్లింగ్' సినిమా రివ్యూ
కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి 'మల్లేశం', 'బలగం' సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డార్లింగ్'. గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ గట్టిగానే చేసిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఇది ఎలా ఉంది? హిట్ కొట్టిందా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?రాఘవ్ (ప్రియదర్శి).. పెళ్లి చేసుకుని భార్యని హనీమూన్‌కి పారిస్ తీసుకెళ్లాలనే ధ్యేయంతో పెరిగి పెద్దవుతాడు. తల్లిదండ్రులు చూపించిన నందిని(అనన్య నాగళ్ల)తో పెళ్లికి రెడీ అవుతాడు. కానీ ఈమె, ప్రేమించిన వాడితో వెళ్లిపోతుంది. పెళ్లి పెటాకులైందని రాఘవ్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. సరిగ్గా అక్కడ ఆనంది (నభా నటేష్) కలుస్తుంది. పరిచయమైన ఆరు గంటల్లోనే రాఘవ్ ఈమెని పెళ్లి చేసుకుంటాడు. ఇంతకీ ఆనంది ఎవరు? ఆమె ఒక్కో టైంలో ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తుంది అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఒకే మనిషి ఒక్కో సమయంలో ఒక్కోలా ప్రవర్తించడం.. దీన్నే ఇంగ్లీష్‌లో స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. గతంలో 'అపరిచితుడు' మూవీని ఇదే కాన్సెప్ట్‌తో తీశారు. కాకపోతే అది పూర్తిగా ఎమోషనల్ వేలో సాగుతుంది. ఒకవేళ ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీ అమ్మాయికి ఉందని తెలిస్తే ఏమైందనేదే 'డార్లింగ్' సినిమా.ట్రైలర్, ప్రచార చిత్రాలు చూస్తే ఈ మూవీ కథేంటనేది తెలిసిపోతుంది. ఇందులో పెద్దగా దాపరికాలు లేవు. ఫస్టాప్ అంతా హీరో... పెళ్లి ధ్యేయమన్నట్లు పెరిగి పెద్దవడం, పెళ్లి నిశ్చయమైన తర్వాత అమ్మాయి మరో వ్యక్తితో లేచిపోవడం, సూసైడ్ చేసుకోవాలనుకోవడం, ఊహించని పరిస్థితుల్లో ఊరు పేరు తెలియని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం.. మధ్యమధ్యలో కామెడీ.. ఇలా సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్‌కి పర్వాలేదనిపించే ట్విస్ట్.సెకండాఫ్‌లో భార్యకు ఎందుకు స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తెలుసుకోవడానికి భర్త చేసే ప్రయత్నాలు, మొదట్లో కామెడీ కామెడీగా ఉండే సినిమా.. చివర్లో ఎమోషనల్‌గా ఎందుకు ఎండ్ కావాల్సి వచ్చిందనేది మూవీ చూసి తెలుసుకోవాలి. స్టోరీ పరంగా ఇది మంచి లైనే. కానీ డైరెక్టర్ చాలాసార్లు తడబడ్డాడు. స్ప్లిట్ పర్సనాలిటీ అని ఫస్టాప్ అంతా నవ్వించాడు. ఇంటర్వెల్‌కే కథని ముగించిన ఫీలింగ్ తెప్పించాడు.అక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చి హీరోయిన్‌కి మల్టీపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని చెప్పి, మరోసారి ఇదే కాన్సెప్ట్‌పై నవ్వించాలనుకున్నాడు. కానీ సెకండాఫ్‌లో ఇది సరిగా వర్కౌట్ కాలేదు. స్టోరీ అంతా ఒకే పాయింట్ దగ్గర తిరిగిన ఫీలింగ్ వస్తుంది. కానీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి కొన్ని ఎమోషనల్ సీన్లు పడటంతో మరీ సూపర్ కాకపోయినా పర్లేదు అనిపించే సినిమా చూశాంలే అనే అభిప్రాయంతో థియేటర్ బయటకు వస్తాం.హీరోయిన్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ ప్రేక్షకుడికి ఎక్కవు, నచ్చవు. ఆమె కంటే ప్రియదర్శి కామెడీ, ఎమోషన్ అంతో ఇంతో కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడన్నది వదిలేస్తే.. సీన్లు సీన్లుగా చూస్తే మాత్రం కొన్ని చోట్ల బాగానే పేలాయి. ఎవరెలా చేశారు?'డార్లింగ్' స్టోరీని హీరోయిన్ బేస్డ్గా రాసుకున్నారు. కానీ నభా నటేష్‌ని ఆ పాత్ర కోసం తీసుకుని పొరపాటు చేశారు! ఎందుకంటే ఈమె పాత్రతో ప్రేక్షకులు అస్సలు కనెక్ట్ కాలేకపోతారు. కొన్ని సీన్లలో పర్లేదనిపిస్తుంది కానీ కొన్నిచోట్ల విసిగిస్తుంది. హీరోగా చేసిన ప్రియదర్శి.. తనకు అలవాటైన కామెడీ ప్లస్ ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. ఓ పాటలో డ్యాన్స్ కూడా చేశాడు. హీరో తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్, మామగా చేసిన రఘబాబు, పిన్నిగా చేసిన నటి బాగా నటించారు. బ్రహ్మానందం, సుహాస్, నిహారిక లాంటి స్టార్స్ అతిథి పాత్రలు చేశారు. కాకపోతే పెద్దగా వర్కౌట్ కాలేదు.టెక్నికల్ టీమ్ 'డార్లింగ్' కోసం బాగానే కష్టపడ్డారు. పాటలు పెద్దగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ బాగుంది. సినిమాటోగ్రఫీ గుడ్. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. కొత్త డైరెక్టర్ అశ్విన్ రామ్.. స్క్రిప్ట్‌ని ఇంకాస్త బెటర్‌గా రాసుకుని ఉండాల్సింది. అలానే 2 గంటల 41 నిమిషాల నిడివి ఎక్కువైపోయింది. 15-20 నిమిషాలు తగ్గించి, సెకాండాఫ్ కాస్త ట్రిమ్ చేసుంటే సినిమా ఎంటర్ టైనింగ్‌గా ఉండేది. జస్ట్ ఫన్ కోసమే థియేటర్‌కి వెళ్లాలనుకునే ప్రేక్షకులకు 'డార్లింగ్' మంచి ఆప్షన్.రేటింగ్: 2.75-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
Thanksgiving Movie: వయొలెన్స్.. వయొలెన్స్.. ధైర్యం ఉంటే చూసేయండి!
ఆఫర్.. ఆఫర్.. ఈ పేరు వినిపిస్తే చాలు జనాలు చేతిలో డబ్బులున్నాయా? లేవా? అని కూడా చూసుకోరు. ఆఫర్లో వస్తున్నాయంటూ ఎగబడి మరీ కొనేస్తారు. అలాగే అమెరికాలో బ్లాక్ ఫ్రైడే సేల్స్ కోసం ఓ షాపింగ్ స్టోర్ సిద్ధమైంది. మొదట వచ్చిన 100 మంది కస్టమర్ల కోసం ప్రత్యేక బహుమతులు కూడా ప్రకటించింది. ఇంకేముంది.. జనాలు షాపు చుట్టూ గుమిగూడారు. వారిని ఆపడం అక్కడి సెక్యూరిటీ వల్ల కూడా కావడం లేదు.కథఇంతలో ఆ షాపు యజమాని కూతురు జెస్సికా (నెల్ వర్లఖ్) తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో అక్కడికి వస్తుంది. ఆమె ప్రియుడు కొత్త ఫోన్ తీసుకోవాలంటూ దర్జాగా షాపులోకి వెళ్తాడు. ఇది చూసిన జనాలు ఆగ్రహానికి లోనవుతారు. వారిని ఎందుకు లోనికి వెళ్లనిచ్చారు? మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? అని మండిపడ్డారు. ఇంతలో జనం సునామీలా ముందుకు వచ్చారు. స్టోర్ తలుపు తెరిచేవరకు ఆగకుండా దూసుకొచ్చేయడంతో తొక్కిసలాట జరిగింది. పలువురూ ప్రాణాలు కోల్పోయారు. దాంతో బ్లాక్ ఫ్రైడే విషాదంగా మారిపోయింది. సరిగ్గా ఏడాదికి..అయితే దీన్ని హీరోయిన్ బాయ్‌ఫ్రెండ్ లైవ్‌లో వీడియో తీడయంతో అది వైరల్‌గా మారుతుంది. ఏడాది తర్వాత మరోసారి అదే స్టోర్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్స్ పెట్టాలని షాపు యజమాని డిసైడ్ అవుతాడు. అంతలోనే గతేడాది విషాదానికి కారణమైన ఒక్కొక్కరూ అత్యంత దారుణంగా చనిపోతారు. ఈ హత్యల వెనుక ఉన్నదెవరు? ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో అందరూ చనిపోయారా? ఎవరైనా ప్రాణాలతో బతికి బట్టకట్టారా? మళ్లీ బ్లాక్ ఫ్రైడే సేల్స్ జరిగాయా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!ఆ సీన్ హైలైట్సినిమా ప్రారంభమైన కొద్ది సేపటికే బ్లాక్ ఫ్రైడే సేల్స్.. ఎంత విధ్వంసంగా మారిందో చూపించారు. ఆ దారుణాన్ని చూస్తున్నప్పుడు మనసు చివుక్కుమంటుంది. సినిమా మొత్తంలో ఈ సీనే హైలైట్‌గా ఉంటుంది. తర్వాత విలన్ చేసే హత్యలు కొన్ని కామెడీగా ఉంటే, మరికొన్ని సీరియస్‌గా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. సెకండాఫ్‌లో అదుర్స్ అని చెప్పుకునేలా ఏ సన్నివేశమూ ఉండదు. కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ ఎవరన్న ఉత్సుకత మాత్రం మనలో కలగక మానదు.ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ఎలి రోత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాట్రిక్ డింప్సే, జీనా జెర్షన్, టై ఒల్సన్, నెల్ వెర్లాక్.. తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎలి రోత్‌తో పాటు జెఫ్ రెండల్ డైలాగ్స్ రాశాడు. జనాలకు షాపింగ్, ఆఫర్స్ మీద ఉన్న పిచ్చిని.. అలాగే సోషల్ మీడియాలో వైరలవ్వాలన్న తాపత్రయాన్ని సినిమాలో సెటైరికల్‌గా చూపించారు. దాని పరిణామాలు ఎలా ఉంటాయో చక్కగా చూపించారు. మిస్టరీ థ్రిల్లర్స్ సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమా చూడొచ్చు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. చదవండి: అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్‌గా కోట్ల విలువైన వాచీలు -
సారంగదరియా సినిమా రివ్యూ
టైటిల్: ‘సారంగదరియా’నటీనటులు: రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహమద్ ,మోహిత్ పేడాడ, నీల ప్రియా, కదంబరి కిరణ్ తదిరతులునిర్మాణ సంస్థ: సాయిజా క్రియేషన్స్నిర్మాతలు: ఉమాదేవి, శరత్ చంద్ర, చల్లపల్లిదర్శకత్వం: పద్మారావు అబ్బిశెట్టి(పండు)సంగీతం: ఎం. ఎబెనెజర్ పాల్సిసిమాటోగ్రఫీ: సిద్ధార్థ స్వయంభువిడుదల తేది: జూలై 11, 2024కథమిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కృష్ణ కుమార్(రాజా రవీంద్ర) ఓ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్‌గా పని చేస్తుంటాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. పెద్ద కొడుకు అర్జున్(మెయిన్ మొహమద్) తాగుడుకు బానిసవుతాడు. రోజూ మద్యం తాగుతూ బార్లో గొడవపడుతుంటాడు. చిన్నోడు సాయి (మోహిత్) అమ్మాయిల చుట్టూ తిరుగుతూ.. చివరకు తమ ఏరియాలోనే ఉండే కాలేజీ అమ్మాయి ఫాతిమా(మధులత)ను ప్రేమలోకి దింపి, రొమాంటిక్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. కూతురు అనుపమ(యశస్విని) మాత్రం బుద్ధిగా చదువుకుంటూ.. బయటి ప్రపంచానికి దూరంగా ఉంటుంది. అనుపమ అంటే అదే కాలేజీలో చదువుతున్న రాజ్(శివచందు)కి చాలా ఇష్టం. తన ప్రేమను అంగీకరించాలంటూ ఆమె చుట్టూ తిరుగుతుంటాడు. అనుపమ మాత్రం అతన్ని దూరం పెడుతుంది. మిస్ బ్యూటీ క్వీన్ కావాలనేది ఆమె లక్ష్యం. అయితే ఓ రోజు కృష్ణకుమార్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా.. రాజ్ తండ్రి(కదంబరి కిరణ్)వచ్చి గొడవ చేస్తాడు. దీంతో అనుపమకు సంబంధించిన ఓ పెద్ద రహస్యం బయట పడుతుంది. అదేంటి? కృష్ణకుమార్ సొంత ఊరిని వదిలి వచ్చి వేరే చోట బతకడానికి గల కారణం ఏంటి? రెస్టారెంట్ పెట్టి మంచి బిజినెస్ చేసే అర్జున్.. తాగుడుకు ఎందుకు బానిసగా మారాడు? ఫాతిమాతో ప్రేమాయణం.. సాయి జీవితాన్ని ఎలా మార్చేసింది? మిస్ బ్యూటీ క్వీన్ పోటీల్లో పాల్గొనే క్రమంలో అనుపమకు ఎదురైన సమస్యలు ఏంటి? తనకు తండ్రి కృష్ణ కుమార్ ఎలా సపోర్ట్‌గా నిలిచాడు? కృష్ణకుమార్ ఫ్యామిలీకి సమాజం నుంచి ఎదురైన సమస్యలేంటి? వాటిని అధిగమించి తన పిల్లలను ఎలా ప్రయోజకులుగా మార్చుకున్నాడు? అన్నదే మిగతా కథ.ఎలా ఉందంటే?ఇదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. ‘సమానత్వం’ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంలో డైరెక్టర్ పండు మధ్య తరగతి కుటుంబంలోని కష్టాలను కొత్త కోణంలో చూపించాడు. ఇందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సమస్యలు మాత్రమే కాదు.. కులమత ప్రస్తావన, లింగ మార్పిడి ప్రస్తావన కూడా ఉంది. ట్రాన్స్ ఉమెన్స్‌ని సమాజం ఎలా చూస్తుంది? సొంతవాళ్ల నుంచే వాళ్లకు ఎలాంటి అవమానాలు ఎదురవుతాయి? అనేది చూపిస్తూనే.. వారిని ఎంకరేజ్ చేస్తే ఎలా రాణించగలరో ఇందులో చూపించారు. ఓ వైపు భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తూనే.. మరోవైపు మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ పండు. ఒకే సినిమా ద్వారా నాలుగైదు సందేశాత్మక కథలను చెప్పాడు. ఇలాంటి సబ్జెక్ట్‌ను డీల్ చేయడం మాములు విషయం కాదు. తొలి సినిమాతోనే మంచి సందేశం అందించిన డైరెక్టర్ని అభినందించాల్సిందే. కానీ ఇలాంటి సందేశాత్మక సినిమాలను ఎంకరేజ్ చేసేందుకు ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించరు. అటు సరదాగా, ఇటు కమర్షియల్‌గా చెబితేనే సినిమా చూస్తామంటున్నారు. దర్శకుడు పద్మారావు ఆ కోణంలో సినిమా తీయాలని ప్రయత్నించాడు కానీ పూర్తిగా సఫలం కాలేకపోయాడు.విశ్లేషణకృష్ణకుమార్ కుటుంబ సభ్యులందరి గురించి వివరంగా చెప్పడంతో మూవీ కొంత సాగదీసినట్లు అనిపిస్తుంది. అర్జున్ పాత్ర ఎమోషనల్‌గా ఉంటే సాయి పాత్ర టీనేజ్ కుర్రాళ్లకు కనెక్ట్ అయ్యేలా చిల్‌గా ఉంటుంది. ఫస్టాఫ్ ఓకే అనిపిస్తుంది. రెండో భాగంలో ఏమైనా మెరుపులు ఉంటాయా? అంటే అక్కడ తడబాటే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి సీన్‌ను డీటెయిల్‌గా చెప్పేందుకు ప్రయత్నించడంతో బోర్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. వరుసగా కష్టాలు ఎదురవడంతో సినిమా చూసే ప్రేక్షకుడికి ఓరకమైన నిస్సహాయత అలుముకున్న భావన రాక మానదు. అను పాత్ర యాక్టివ్‌గా ఉంటుంది.'ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం. కానీ, జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది' అన్న డైలాగ్ అదిరిపోయింది. క్లైమాక్స్‌లో అను తండ్రి గురించి చెప్పే డైలాగ్స్‌కు విజిల్ వేయాల్సిందే! తన స్పీచ్.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, వివక్ష గురించి చర్చించేలా చేస్తుంది. ఎక్కువ సాగదీత వల్లే సినిమాలో ఎమోషన్ ఆశించినంత పండలేదు.నటీనటులుకృష్ణ కుమార్‌గా రాజా రవీంద్ర బాగా యాక్ట్ చేశాడు. ఎప్పుడూ పాజిటివ్, నెగెటివ్ రోల్స్ చేసే ఆయనకు తొలిసారి పూర్తి స్థాయి ఎమోషనల్ పాత్ర దక్కింది. ఆ అవకాశాన్ని ఆయన పూర్తిగా వాడుకున్నాడు. ప్లేబాయ్ తరహా పాత్రలో సాయి మెప్పించాడు. అనుగా యశస్వి ఆకట్టుకుంది. అర్జున్ పాత్రలో మెయిన్ మొహమ్మద్ లీనమైపోయి నటించాడు. మిగతా పాత్రలు పర్వాలేదనిపించాయి. -
Indian 2 Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ
టైటిల్: భారతీయుడు 2(ఇండియన్ 2)నటీనటులు: కమల్ హాసన్, ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్,సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం తదితరులునిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్నిర్మాత: సుభాస్కరన్ కథ, దర్శకత్వం: ఎస్.శంకర్‌సంగీతం: అనిరుధ్ రవిచందర్ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌విడుదల తేది: జులై 12, 2024కమల్ హాసన్ నటించిన బెస్ట్ చిత్రాల్లో ‘భారతీయుడు’ ఒకటి. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1996లో విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘భారతీయుడు 2’(Bharateeyudu 2 Review) పై భారీ హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(జులై 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. భారతీయుడు 2 కథేంటంటే..చిత్ర అరవిందన్(సిద్దార్థ్), హారతి(ప్రియాభవాని శంకర్) ఇంకో ఇద్దరు స్నేహితులు కలిసి సోషల్ మీడియా వేదికగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు చేసే అన్యాయాలపై వీడియోలు చేసి బార్కింగ్ డాగ్స్ అనే పేరుతో య్యూట్యూబ్, ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేస్తుంటారు. వారి చుట్టు జరిగిన కొన్ని సంఘటనలు చూసి చలించిపోయిన అరవిందన్.. మళ్లీ భారతీయుడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. కమ్‌బ్యాక్ ఇండియా(Comeback India) హ్యాష్‌ట్యాగ్‌తో సేనాపతి(కమల్ హాసన్) మళ్లీ ఇండియా రావాలని పోస్టులు పెడతారు. అవికాస్త వైరల్ అయి.. చైనీస్ తైపీలో ఉన్న సేనాపతి అలియాస్ భారతీయుడుకి చేరతాయి. దీంతో సేనాపతి తిరిగి ఇండియా వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అధికారి ప్రమోద్(బాబీ సింహా).. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ భారతీయుడు గెటప్స్ మారుస్తూ అవినీతికి పాల్పడిన వారిని దారుణంగా హత్య చేస్తుంటారు. భారతీయుడు ఇచ్చిన పిలుపుతో దేశంలోని యువత కూడా అవితీనికి వ్యతిరేకంగా పని చేస్తుంటుంది. ఈ క్రమంలో అరవిందన్ ఫ్యామిలీలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి కారణంగా భారతీయుడే అని అరవిందన్‌తో సహా అందరూ నిందిస్తారు. అసలు అరవిందన్ ఇంట్లో చోటు చేసుకున్న ఆ విషాదం ఏంటి? దానికి భారతీయుడు ఎలా కారణం అయ్యాడు? కమ్‌బ్యాక్ ఇండియా అని భారతీయుడిని ఆహ్వానించిన యువతే.. గోబ్యాక్ ఇండియా అని ఎందుకు నినదించారు? సామాన్యులకు సైతం భారతీయుడుపై ఎందుకు కోపం పెరిగింది? రియల్ ఎస్టేట్ పేరుతో అక్రమంగా భూములను స్వాధీనం చేసుకుంటూ వేలకోట్లు సంపాదించిన సద్గుణ పాండ్యన్(ఎస్ జే సూర్య)..సేనాపతిని చంపేందుకు వేసిన ప్లాన్ వర్కౌంట్ అయిందా? సీబీఐ అధికారులకు దొరికిన సేనాపతి..వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అసలు సేనాపతి టార్గెట్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే అంటెండర్ దగ్గర నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో ‘భారతీయుడు’లో కళ్లకు కట్టినట్లు చూపించాడు శంకర్. ఆ సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా.. ఆ కథ, అందులోని పాత్రలు మనకు అలా గుర్తిండిపోతాయి. అలాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే..కచ్చితంగా అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా భారతీయుడు 2ని తీర్చిదిద్దలేకపోయాడు శంకర్. స్టోరీ లైన్ మాత్రమే కాదు చాలా సన్నివేశాలు ‘భారతీయుడు’చిత్రాన్నే గుర్తు చేస్తాయి. అయితే అందులో వర్కౌట్ అయిన ఎమోషన్ ఇందులో మిస్ అయింది. ప్రతి సీన్ సినిమాటిక్‌గానే అనిపిస్తుంది కానీ.. ఎక్కడ కూడా రియాల్టీగా దగ్గరగా ఉండదు. స్క్రీన్‌ప్లే కూడా చాలా రొటీన్‌గా ఉంటుంది. పార్ట్ 3 కోసమే అన్నట్లుగా కథను సాగదీశారు. కొన్ని సీన్లు చూస్తే నిజంగానే ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారా అనే అనుమానం కలుగుతుంది. భారతీయుడులో అవినీతికి పాల్పడిన వారిని సేనాపతి చంపుతుంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కానీ ఇందులో మాత్రం అలాంటి సీన్లను కూడా చాలా చప్పగా తీసేశాడు. సినిమా నిడివి( 3 గంటలు) కూడా మైనస్సే. కొన్ని సీన్లను తొలగించి.. నిడివిని తగ్గిస్తే బాగుండేది (తొలగించడానికి ఒక్క సీన్ లేదనే పార్ట్ 3 ప్లాన్ చేశామని ఓ ఇంటర్వ్యూలో శంకర్ చెప్పారు..కానీ సినిమా చూస్తే సాధారణ ప్రేక్షకుడు సైతం కట్ చేయాల్సిన సీన్ల గురించి చెప్పగలడు). ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. భారతీయుడు సినిమాలాగే ఈ కథ కూడా మొత్తం లంచం చుట్టే తిరుగుతుంది. సినిమా ప్రారంభ సీన్‌తోనే ఆ విషయం అర్థమైపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా చిత్ర అరవిందన్ గ్యాంగ్ చేసే పోరాటం కాస్త ఆసక్తికరంగా అనిపించినప్పటికీ.. అవినీతి జరిగే సీన్లను బలంగా చూపించలేకపోయాడు. ఇక సేనాపతి ఎంట్రీ సీన్‌తో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత..కథనం రొటీన్‌గా సా..గూ..తూ.. చిరాకు తెప్పిస్తుంది. తరువాత ఏం జరుగుతందనే విషయం ముందే తెలిసిపోవడంతో.. కథపై అంత ఆసక్తి కలగదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సింపుల్‌గానే ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథ మరింత సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మర్మకళను ఉపయోగించి సీక్స్ ఫ్యాక్‌తో కమల్ చేసే యాక్షన్ సీన్ బాగుంటుంది. కానీ ఆ తర్వాత వచ్చే ఛేజింగ్ సీన్ అయితే సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపులో పార్ట్ 3 స్టోరీ ఎలా ఉంటుందో చూపించారు. అది కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అవినీతిని అంతం చేయాలంటే అది మొదట మన ఇంటి నుంచే ప్రారంభించాలని యూత్‌కి ఇచ్చిన మెసేజ్ మాత్రం బాగుంది. ఎవరెలా చేశారంటే..వైవిధ్యమైన పాత్రలు పోషించడం కమల్ హాసన్‌కు కొత్తేమి కాదు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతుంటాడు. సేనాపతి పాత్రలో కమల్ ఒదిగిపోయాడు. రకరకాల గెటప్స్‌లో కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. అయితే ఆయన గొంతే ఒక్కో చోట ఒక్కోలా వచ్చింది. సిక్స్ ఫ్యాక్స్‌తో కమల్ చేసే యాక్షన్ సీన్‌కి థియేటర్లో ఈళలు పడతాయి.ఇక హీరో సిద్ధార్థ్‌కి మంచి పాత్ర దక్కింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే చిత్ర అరవిందన్ పాత్రకు న్యాయం చేశాడు. ఎమోషన్ సీన్లలో అదరగొట్టేశాడు. సిద్ధార్థ్ స్నేహితురాలికిగా ప్రియా భవానీ శంకర్ ఆకట్టుకుంది. సిద్ధార్థ్ ప్రియురాలు దిశగా నటించిన రకుల్‌కి ఈ చిత్రంలో ఎక్కువగా స్క్రీన్ స్పేస్ లభించలేదు. సినిమా మొత్తంలో రకుల్ మూడు, నాలుగు సీన్లలో మాత్రమే కనిపిస్తుంది. సీబీఐ అధికారి ప్రమోద్‌గా బాబీ సింహా ఉన్నంతగా బాగానే నటించాడు. వ్యాపారీ సద్గుణ పాండ్యన్‌గా ఎస్ జే సూర్యకి పార్ట్ 3లోనే ఎక్కువ నిడివి ఉన్నట్లు ఉంది. ఇందులో కేవలం మూడు సీన్లలో కనిపించి వెళ్తాడు. ఏసీబీ అధికారిగా సముద్రఖనితో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్‌గా సినిమా పర్వాలేదు.అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం యావరేజ్‌గా ఉంది. ఇక పాటలు గురించి మాట్లాడుకోవద్దు. ఒక్కటి కూడా గుర్తుంచుకునే విధంగా లేవు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో సాగదీత సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.(Bharateeyudu 2 Telugu Movie Review)-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
భోజనం చేస్తూ అస్సలు ఈ సినిమా చూడొద్దు.. డేర్ చేసి చూస్తే మాత్రం?
సినిమాలంటే ఎంటర్టైన్ చేయాలి. చాలామంది ఇలాంటి వాటిని చూడటానికే ఇష్టపడతారు. కొందరు మాత్రం డిఫరెంట్‌గా ఉండేవి లేదంటే డిస్ట్రబ్ చేసే మూవీస్ చూడటానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వాళ్లకోసమే ఈ మూవీ. ఎందుకంటే చూసిన తర్వాత ఒళ్లంతా కలిపేయడం గ్యారంటీ. మరి అంతలా డిస్ట్రబ్ చేసిన 'ద ఫ్లాట్‌ఫామ్' మూవీ ఏ ఓటీటీలో ఉంది? ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూసేద్దాం.(ఇదీ చదవండి: Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ వెబ్‌సిరీస్ రివ్యూ)కథేంటి?గోరెంగ్ అనే వ్యక్తి ఓ గుహ లాంటి గదిలో నిద్ర లేస్తాడు. అతడితో పాటు త్రిమగాసి అనే వృద్ధుడు అదే గదిలో ఉంటాడు. అసలు అక్కడ ప్రతిరోజూ ఏం జరుగుతుందనేది త్రిమగాసి.. గోరెంగ్కి వివరిస్తాడు. పెద్ద బిల్డింగ్‌లో ఫ్లోర్స్లా ఉండే ఆ గుహలో, గదికి ఇద్దరు చొప్పున మనుషులు ఉంటారని, ప్రతిరోజూ ఒక్కసారే ఆహారంతో ఉన్న ఫ్లాట్‌ఫామ్ ప్రతి ఫ్లోర్లో రెండు నిమిషాలు ఆగుతుందని, పై ఫ్లోర్స్‌లో ఉండే వాళ్లు మిగిల్చిన ఆహారాన్ని మనం తిని బతకాల్సి ఉంటుందని చెబుతాడు. ఇంతకీ వీళ్లు జైలు లాంటి గుహలో ఎందుకు ఉన్నారు? ఇక్కడ మనుషులు తోటి మనుషుల్ని ఎందుకు చంపి తినాల్సి వచ్చింది? చివరకు గోరెంగ్ బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?ప్రపంచంలో రోజూ ఎన్నో లక్షల మంది ఆకలితో అలమటించి చనిపోతున్నారు. మరోవైపు అవసరానికి మించి తినడమే కాకుండా, ఆహారాన్ని వృథా చేసే వాళ్లు కూడా మన చుట్టూనే చాలామంది ఉన్నారు. ఇలా మనిషి తన విచక్షణ కోల్పోయి ఆహారాన్ని వేస్ట్ చేస్తే.. తిరిగి అది తన ప్రాణాల మీదకే ఎలా వస్తుంది అనే కాన్సెప్ట్‌తో తీసిన సినిమానే 'ద ఫ్లాట్‌ఫామ్'. ఓటీటీలోనే దీన్ని వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్ట్రబింగ్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చూసిన తర్వాత మీకు ఆ రేంజులో ఒళ్లు కలిపేస్తుంది.(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)ఈ సినిమాలో దాదాపు 333 ఫ్లోర్స్‌లో ఇద్దరు చొప్పున ఉంటారు. ప్రతిరోజూ వీళ్లలో ప్రతి ఒక్కరికీ ఇష్టమైన ఫుడ్‌ని సున్న ఫ్లోర్‌లోనే తయారు చేసి, అందంగా అమర్చి కిందకు దింపుతుంటారు. కానీ పైపై ఫ్లోర్స్‌లో ఉన్నోళ్లు తమకు అవసరమైనది మాత్రమే తినకుండా పక్కనోళ్ల ఫుడ్ కూడా తినేస్తుంటారు. దీంతో దిగువ ఫ్లోర్స్లోకి ఆహారంతో ఉన్న ఫ్లాట్‌ఫామ్ వచ్చేసరికి ఆహారం సంగతి అటుంచితే ఎముకల కూడా మిగలవు. దీంతో మనిషిలో జంతు ప్రవృత్తి బయటకు వస్తుంది. కింద ఫ్లోర్స్‌లోని వ్యక్తులు.. బతకడం కోసం తమ గదిలోనే తోటి మనిషిని చంపేసుకుంటారు. వాళ్ల శరీరంలోని మాంసాన్ని కొద్ది కొద్దిగా తింటూ నెలంతా బతికేస్తుంటారు.ఇలాంటి చోటకు గోరెంగ్ అనే వ్యక్తి స్వచ్ఛందంగానే వస్తాడు. కొన్నిరోజులకు బాగానే ఉంటాడు. కానీ ఆహారం దొరక్కపోయే సరికి రెండుసార్లు తన రూమ్మేట్స్ని చంపి తింటాడు. మరి చివరకు ఈ జైలు లాంటి గుహ నుంచి ఎలా బయటపడ్డాడనేది క్లైమాక్స్. మనలో చాలామందికి ఆహారం విలువ తెలీదు. ఎక్కువైందని అన్నం పారేయడం, అవసరం లేకపోతే ఫుడ్ వేస్ట్ చేయడం చేస్తుంటారు. చాలా మందికి ఇది కూడా దొరక్కే ఆకలితో చనిపోతున్నారు. కాబట్టి ఎంత కావాలో అంతే తినండి, అలానే పక్కనోళ్లకు పెట్టండి అనే కథతో తీసిన ఈ సినిమా మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.అలానే ఇది అందరూ చూసే సినిమా కాదు. ఎందుకంటే మరీ దారుణమైన సీన్స్ కూడా ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ మూవీస్ అందులోనూ డిస్ట్రబింగ్ విజువల్స్ ఉండే సినిమాలు చూడాలనుకునేవాళ్లు మాత్రమే దీన్ని ట్రై చేయొచ్చు. పొరపాటున ఫ్యామిలీతో గానీ భోజనం చేసేటప్పుడు గానీ 'ద ఫ్లాట్‌ఫామ్' చూడొద్దు! నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!) -
బిగ్‌బాస్ నోయల్ '14' సినిమా రివ్యూ
బిగ్‌బాస్ ఫేమ్ నోయల్ లేటెస్ట్ మూవీ '14'. ఇందులో ఇతడు డిటెక్టివ్ పాత్ర పోషించాడు. రామ్ రతన్ రెడ్డి, విషాక ధీమాన్ హీరోహీరోయిన్లుగా నటించారు. పోసాని కూడా కీ రోల్ చేశారు. లక్మీ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. సుబ్బారావు రాయన, శివకృష్ణ నిచ్చన మెట్ల సంయుక్తంగా నిర్మించారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సస్పెన్స్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది? టాక్ ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?రతన్ (రామ్ రతన్ రెడ్డి).. ముఖ్యమంత్రి (పోసాని కృష్ణ మురళి) కుమారుడు. ఇతడిది జాలీ లైఫ్. నేహా (విషాక ధీమాన్) అనే డాక్టర్‌తో ప్రేమలో ఉంటాడు. ఉన్నట్టుండి ఓరోజు.. నేహా ఫ్లాట్‌లో వీళ్లిద్దరూ విగత జీవులుగా కనిపిస్తారు. ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి పోలీసులు.. కేస్ మూసేస్తారు. జర్నలిస్ట్ సుబ్బు(శ్రీకాంత్ అయ్యంగార్) మాత్రం వీరిది ఆత్మహత్య కాదని, హత్య అని ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఇంతకీ సుబ్బు ఏం కనుక్కొన్నాడు. ఈ చావులో సీఎం పాత్ర ఏంటి? డిటెక్టివ్ నోయల్ ఈ కేస్ స్టడీలో ఎంత వరకూ ఉపయోగపడ్డాడు? అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?)ఎలా ఉందంటే?మొదట్లో ఓ సాధారణ మర్డర్ మిస్టరీలాగ సినిమా ప్రారంభించారు. ఆ తరువాత ఇంట్రెస్టింగ్ మలుపులతో స్క్రీన్ ప్లే నడిపించారు. మధ్యలో యూత్‌ని ఎంటర్ టైన్ చేయడం కోసం రొమాంటిక్ సీన్స్ పెట్టారు. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ట్విస్టులతో ఆకట్టుకున్నారు. 14 ఏళ్ల యువకుల్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి? వారు టెక్నాలజీలో పడి ఎలాంటి వాటికి బానిస అవుతున్నారు? తల్లిదండ్రులు వారి పట్ల ప్రవర్తిస్తున్న తీరు తదితర విషయాలను ప్రీ క్లైమాక్స్ నుంచి బాగా చూపించి... తల్లిదండ్రులకు ఓ మెసేజ్ ఇచ్చారు. పిల్లల ఎదురుగా తల్లిదండ్రులు ఎలాంటి పనులు చేయకూడదో... అలా చేయడం వల్ల వారు ఎలాంటి క్షణికావేశాలకు లోనవుతారనేది ఇందులో చూపించారు.ఎవరెలా చేశారు?నోయల్ డిటెక్టివ్‌గా... ప్రీ క్లైమాక్స్‌లో ఆకట్టుకుంటారు. లీడ్ రోల్స్ చేసిన రతన్, విషాక పర్లేదు. రొమాంటిక్స్ సీన్లలో బాగానే చేశారు. పోసాని కృష్ణ మురళి పాత్ర ఓకే. జబర్దస్త్ మహేష్ పాత్ర కాసేపు ఉన్నా... తన మార్క్ సంభాషణలతో ఆకట్టుకుంటారు. జర్నలిస్ట్ సుబ్బు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రకు న్యాయం చేశారు. మిగతా పాత్రధారులు తమ తమ పరిధి మేరకు నటించారు. దర్శకుడు లక్ష్మీ శ్రీనివాస్ రాసుకున్న కథ... కథనాలు చాలా బాగున్నాయి. రొమాంటిక్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ తీసినప్పటికీ.. చివర్లో ఓ మంచి మెసేజ్ ఇచ్చి ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాటోగ్రఫ, సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ఉండాల్సింది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'... ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటన) -
Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ వెబ్‌సిరీస్ రివ్యూ
మీర్జాపూర్.. ఓటీటీల్లో సూపర్ హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ల లిస్ట్‌లో టాప్‌లో ఉంటుంది. 2018లో తొలి సీజన్‌తో మిర్జాపూర్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత 2020లో రెండో సీజన్‌తో ప్రేక్షకుల అంచనాలకు మించి హిట్ కొట్టారు. ఇప్పుడు మీర్జాపూర్ సీజన్-3 ద్వారా ఓటీటీలో తమ సత్తా చూపించారు. క్రైమ్ యాక్షన్ జానర్లో వచ్చిన ఈ సిరీస్‌లు యూత్ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాయి. ఈ కథ మొత్తం ప్రధానంగా కొన్ని పాత్రల చుట్టే తిరుగుతుంది. కాలీన్‌భయ్యా (పంకజ్ త్రిపాఠి), గుడ్డు పండిత్ ( అలీ ఫజల్) బబ్లూ పండిత్ (విక్రాంత్ మాస్సే), మున్నా భాయ్ (దివ్యేందు) గోలు (శ్వేతా త్రిపాఠి), బీనా త్రిపాఠి (రసిక దుగల్) భరత్ త్యాగి (విజయ్ వర్మ) పేర్లతోనే ఎక్కువ పాపులర్ కావడం కాకుండా మీర్జాపూర్లో మెప్పించారు.మీర్జాపూర్ వెబ్‌సిరీస్.. మొదటి రెండు సీజన్లు ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. భారీ క్రైమ్ యాక్షన్ జానర్లో వచ్చిన ఈ సిరీస్ ముఖ్యంగా యువతను విశేషంగా అలరించాయి. అందుకే ఈ సీరిస్ నుంచి మిలియన్ల కొద్ది మీమ్స్ వైరల్ అయ్యాయి. సీజన్-3 కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల నిరీక్షణకు ఫుల్స్టాప్ పడింది. నేడు (జులై 5) నుంచి మిర్జాపూర్-3 అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించారు.మీర్జాపూర్ మొదటి సీజన్లో గుడ్డూ భయ్యా (అలీ ఫజల్),బబ్లూ పండిత్ (విక్రాంత్ మాస్సే) అనే ఇద్దరు అన్నదమ్ములు కాలీన్ భయ్యా కోసం పనిచేయడం. ఆ సీజన్ చివర్లో కాలీన్ భయ్యా కుమారుడు మున్నా చేతిలో గుడ్డూ భయ్యా తన సోదరుడితో పాటు సన్నిహితులను కోల్పోతాడు. దానికి రెండో సీజన్లో గుడ్డూ భయ్యా రివేంజ్ తీర్చుకుంటాడు. సీజన్ చివరకు మీర్జాపూర్ గద్దెపై ఎలా కూర్చుంటాడన్నది చూపించారు. ఈ క్రమంలో కాలీన్, మున్నా భయ్యాలపై దాడి చేసి మున్నాను గుడ్డు చంపేస్తాడు. కానీ, కాలీన్ భయ్యా మాత్రం తప్పించుకొని వెళ్లిపోవడం చూపించారు. సరిగ్గా అక్కడి నుంచే సీజన్- 3 ప్రారంభం అవుతుంది.సీజన్-3 కథ ఏంటి..?సీజన్-3 మున్నా భయ్యా అంత్యక్రియలతో ప్రారంభం అవుతుంది. మున్నా సతీమణి మాధురి (ఇషా తల్వార్) ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆమెను శరద్ శుక్లా కలుస్తాడు. మీర్జాపూర్‌ను తిరిగి దక్కించుకునేందుకు ఒకరికొకరం సాయంగా ఉండాలని కోరుతాడు. కానీ, కాలీన్ భయ్యాను కాపాడిన సంగతి ఆమెకు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాలిన్ భార్య బీనా త్రిపాఠి (రషిక దుగల్) అండతో మీర్జాపూర్‌కు కొత్త డాన్‌గా గుడ్డు భయ్యా అవుతాడు. గోలు (శ్వేతా త్రిపాఠి) అతడికి లెఫ్ట్ అండ్ రైట్ సపోర్టర్‌గా ఉంటుంది. గుడ్డు భయ్యా మిర్జాపూర్ సింహాసనంపై కూర్చున్నప్పటికీ పూర్వాంచల్‌లో అధికార పోరు కొనసాగుతోంది. కాలీన్ భయ్యాను కాపాడిన శరద్ శుక్లా, శతృఘ్న కూడా మీర్జాపూర్ సింహాసనంపై దృష్టి సారిస్తారు. దీంతో శరద్ శుక్లా , గుడ్డు భయ్యా మధ్య నేరుగా ఘర్షణ జరుగుతుంది. అలా కాలీన్ భయ్యా లేకుండానే మొదటి నాలుగు ఎపిసోడ్లు పూర్తి అవుతాయి. ఈ అధికార పోరు మధ్య, SSP మరణానికి సంబంధించి పండిట్ జీ ఆరోపణలను ఎదుర్కోవడంతో, ఒక రాజకీయ ఆట సాగుతుంది.మరోవైపు ముఖ్యమంత్రి మాధురీ యాదవ్ కూడా శరద్ శుక్లాతో పాటు దద్దా త్యాగి (లిల్లిపుట్ ఫరూఖీ), అతని కుమారుడు (విజయ్ వర్మ) నుంచి మద్దతు తీసుకుంటుంది. ఇలా వీరందరూ గుడ్డు భయ్యాను బలహీనపరచేందుకు పెద్ద ఎత్తున ప్లాన్స్ వేస్తుంటారు. జైలులో ఉన్న గుడ్డు పండిట్ తండ్రి రమాకాంత్ పండిట్ జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. కొత్త శత్రుత్వాలు, స్నేహాల ఆవిర్భావంతో, కాలీన్ భయ్యా పునర్జన్మను పొందుతారు. మిర్జాపూర్ సింహాసనం కోసం కొత్త, చివరి సరైన వారసుడి కోసం పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. బీనా త్రిపాఠి బిడ్డకు అసలు తండ్రి ఎవరనే అనుమానం ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. దీనికి సంబంధించిన క్లూ సీజన్లో వెల్లడి అవుతుంది. చివరికి, కాలీన్ భయ్యాతో కోడలు మాధురి కలిసి కథకు నిజమైన ట్విస్ట్ జోడించి మొత్తం ఆటను మలుపు తిప్పుతుంది. మొత్తం 10 ఎపిసోడ్లలో మీరు ఊహించని విధంగా చివరి 15 నిమిషాల్లో అద్భుతమైన క్లైమాక్స్ ఉంటుంది. మీరు ఈ కథను ఉత్తరప్రదేశ్‌లోని ఇటీవలి రాజకీయాలకు కూడా అనుబంధించవచ్చు. "భయం లేని రాష్ట్రం" అనే పదే పదే వచ్చే థీమ్ మీకు యోగి ఆదిత్యనాథ్ పరిపాలనను గుర్తు చేస్తుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో అతిక్ అహ్మద్ మరణం తర్వాత గ్యాంగ్స్టర్లలో చట్టాన్ని అమలు చేయడం పట్ల భయం కూడా చిత్రీకరించబడింది. రాజకీయ ఫిరాయింపులు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశాలన్నీ ఈ సీజన్‌ని ఇటీవలి ఈవెంట్లకు సంబంధించినవిగా చేస్తాయి.గుడ్డు భయ్యా, గోలు ఇద్దరూ మీర్జాపూర్‌ను తమ గుప్పిట్లో ఉంచుకోగలిగారా..? గుడ్డు భయ్యాకు ప్రధాన శత్రువు ఎవరు..? జైలుకు ఎందుకు వెళ్తాడు..? మీర్జాపూర్ పీఠం దక్కిన సమయంలో వారికి ఎదురైన సవాళ్లు ఏంటి..? మీర్జాపూర్ పీఠం కోసం ఎంతమంది పోరాటం చేస్తున్నారు..? కాలీన్ భయ్యా భార్య బీనా నిజంగానే గుడ్డు, గోలుకు అండగా నిలిచిందా..? పూర్వాంచల్ పవర్ కోసం ఎటువంటి రక్తపాతం జరిగింది..? గుడ్డు షూట్ చేశాక కాలిన్ ఎలా తిరిగొచ్చాడు..? మీర్జాపూర్ గద్దెను కూల్చేయాలనే ముఖ్యమంత్రి మాధురి (ఇషా తల్వార్) లక్ష్యం నెరవేరిందా..? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సీజన్ 3 చూడాల్సిందే. ముఖ్యంగా చివరి 15 నిమిషాలు అందరినీ మెప్పిస్తుంది.సిరీస్ ఎలా ఉంది..?'మీర్జాపూర్'కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు, నాలుగేళ్లుగా ఈ సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ఈ సీజన్ గత వాటితో పోలిస్తే అంతగా మెప్పించకపోవచ్చు. ముఖ్యంగా మున్నా భయ్యా లేకపోవడం, ఆపై కథలో కాలీన్ భయ్యాకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఈ సీజన్‌కు బిగ్ మైనస్ అని చెప్పవచ్చు. సీజన్ మొత్తం చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. మూడవ ఎపిసోడ్ వరకు కథలో వేగం కనిపించదు. కథ బలహీనంగా ఉండటమే కాకుండా ప్రధాన పాత్రల నుంచి వచ్చే సీన్లు ప్రేక్షకుల అంచనాలకు దగ్గరగా కనిపిస్తాయి. కానీ, మీర్జాపూర్ అభిమానులకు మాత్రం తప్పకుండా నచ్చుతుంది. గత సీజన్లను పోల్చుకుంటూ చూస్తే మాత్రం కాస్త కష్టం. మీర్జాపూర్ అంటేనే వయలెన్స్, సీరిస్‌కు అదే ప్రధాన బలం. కానీ, ఈ సీజన్లో హింసను చాలా వరకు తగ్గించారు. పొలిటికల్ డ్రామాను ఎక్కువగా చూపించారు. ఫిమేల్ పాత్రలకు భారీగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులోని ప్రతి ఎపిసోడ్ సుమారు 45 నుంచి 50 నిమిషాల పాటు ఉంటుంది. దీంతో సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి. కథలో నెక్స్ట్ ఏంటి..? అనే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ కనిపించలేదు. ఇందులోని స్క్రీన్ ప్లే కూడా చాలా సీన్స్‌లలో ప్రేక్షకుల ఊహకు అనుగుణంగానే ఉంటాయి.ఎవరెలా చేశారంటే..?గుడ్డు భయ్యా పాత్రలో అలీ ఫజల్ చక్కటి నటన కనబరిచారు. ఈ సీజన్ మొత్తం తన తన భుజాలపై మోశారు. కానీ, ఒక్కడిపై భారం అంతా పడటంతో షో రన్ చేయడం కష్టమైంది. గోలు పాత్రలో శ్వేతా త్రిపాఠి ఎక్కడా నిరుత్సాహపరచదు. ఇందులో ఆమె పాత్ర అందరినీ మెప్పిస్తుంది. అంజుమ్ శర్మ సైతం తమ పాత్రల్లో ఒదిగిపోయారు. బీనా త్రిపాఠి పాత్రకు రషిక దుగల్ మరోసారి ప్రాణం పోశారు. ఆమె పాత్ర అండర్ రైట్‌గా అనిపిస్తుంది. సీఎంగా ఇషా తల్వార్ నటన బావుంది. అందరి కంటే విజయ్ వర్మ ఎక్కువ ఆకట్టుకున్నారు. పంకజ్ త్రిపాఠి కనిపించేది కొన్ని సన్నివేశాలు అయినా సరే తన మార్క్ చూపించారు. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ ఈ సిరీస్‌ను అనుకున్నంత స్థాయిలో తెరకెక్కించారు. కానీ, అంచనాలు ఎక్కువగా ఉండటం వల్ల కాస్త రెస్పాన్స్ తగ్గే అవకాశం ఉంది. 'మీర్జాపూర్ సీజన్ -3' చూడదగినది. మునుపటి సీజన్ల మాదిరి మెప్పంచకపోవచ్చు కానీ, మీరు ఈ సిరీస్‌కి అభిమాని అయితే, మీరు దీన్ని మిస్ చేయకండి. -
Black Widow Review: ఓటీటీలో కళ్లు చెదిరే స్పై యాక్షన్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే?
టైటిల్: బ్లాక్ విడోనటీనటులు: స్కార్లెట్ జాన్సన్, ఫ్లోరెన్స్ పగ్, డేవిడ్ హార్బర్ తదితరులుదర్శకుడు: కేట్ షార్ట్ల్యాండ్నిర్మాత: కెవిన్ ఫీగేసంగీత దర్శకుడు: లోర్న్ బాల్ఫ్సినిమాటోగ్రఫీ: గాబ్రియెల్ బెరిస్టెన్ఎడిటర్: లీ ఫోల్సమ్ బోయ్డ్, మాథ్యూ ష్మిత్ఓటీటీ: డిస్నీ హాట్‌స్టార్(2021లో థియేటర్లలో రిలీజైంది)కథేంటంటే..బ్లాక్ విడో అదే పేరుతో ఉన్న మార్వెల్ కామిక్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించిన సూపర్ హీరో చిత్రం. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిచర్స్లో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. కేట్ షార్ట్‌ల్యాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్ టైటిల్ పాత్రలో నటించారు. కెప్టెన్ అమెరికా సివిల్ వార్ సంఘటనలతో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఈ మూవీ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి ఈ లేడీ-ఓరియెంటెడ్ సూపర్ హీరో సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.ఎలా ఉందంటే..ఈ మూవీ అంతా కూడా అంతుకుముందు మనకు అవెంజర్స్ సిరీస్‌లాగా ఉన్న స్టోరీలానే అనిపిస్తుంది. రష్యాకు చెందిన ఓ విలన్(డేవిడ్ హార్బర్) ముఖ్యంగా అనాథ అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారిని.. ఒక సైన్యంలా తయారు చేస్తాడు. తాను చెప్పినట్లు నడుచుకునేలా వాళ్ల బ్రెయిన్‌ను మారుస్తాడు. ఆ తర్వాత అమెరికాలోని రహస్యాన్ని తెలుసుకునేందుకు ఒక ఫేక్ కుటుంబాన్ని సృష్టిస్తాడు. ఆ తర్వాత ఆ కుటుంబంలోని వాళ్లను మొత్తం విడదీస్తాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు పిల్లలను మళ్లీ తన సైన్యంలోనే చేర్చుకుంటాడు. ఆ తర్వాత అందులో ఉన్న స్కార్లెట్ జాన్సన్(బ్లాక్ విడో) బయటికి వచ్చి అతనితో పోరాటం చేస్తుంది. తన మిత్రులు మరికొందరితో కలిసి అతన్ని అంతం చేసేందుకు యత్నిస్తుంది. మరి అసలు అతని నుంచి అనాథ అమ్మాయిలను కాపాడిందా? ఆ విలన్‌ను అంతం చేసిందా? అనే ఆసక్తికర అంశాలు తెలియాలంటే బ్లాక్ విడో చూడాల్సిందే.ఈ స్పై థ్రిల్లర్ సినిమాలో ఫైట్ సీక్వెన్స్‌లు, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆడియన్స్‌ను మాత్రమే ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా కొన్ని ట్విస్టులు కూడా ఫర్వాలేదనిపించాయి. ఒక్క ట్విస్ట్ మాత్రం సర్ప్రైజింగా ఉంటుంది. అయితే ఈ కథలో స్క్రీన్ ప్లేను అద్భుతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ కేట్ షార్ట్‌ల్యాండ్ విఫలమయ్యాడు. ఆడియన్స్‌కు ఎమోషనల్ కనెక్ట్ అయ్యే సీన్స్ ఎక్కడా కూడా కనిపించవు. విజువల్ పరంగా ఆకట్టుకున్నా.. ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడం పెద్ద మైనస్. దర్శకుడు కేట్ షార్ట్‌ల్యాండ్ కథను ఇంకా బాగా రాసుకుంటేనే బాగుండేది. కేవలం యాక్షన్ సీన్స్, వీఎఫ్ఎక్స్ కోసమైతే ఈ బ్లాక్ విడో మూవీని ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..బ్లాక్ విడో పాత్రలో స్కార్లెట్ జాన్సన్ యాక్షన్ సీన్స్‌లో అద్భుతంగా నటించారు. ఆమె తన సూపర్ హీరో హోదాకు న్యాయం చేశారు. ఫ్లోరెన్స్ పగ్, డేవిడ్ హార్బర్ తన పాత్రల్లో మెప్పించారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో మెప్పించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ
టైటిల్: కల్కి 2898 ఏడీనటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పఠాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, అన్నాబెన్ తదితరులునిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్నిర్మాత: అశ్వనీదత్దర్శకత్వం: నాగ్ అశ్విన్సంగీతం: సంతోష్ నారాయణన్సినిమాటోగ్రఫీ: జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావువిడుదల తేది: జూన్ 27, 2024ఈ ఏడాది యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన సినిమాల్లో కల్కి ‘2898 ఏడీ’ ఒకటి. ప్రభాస్ హీరోగా నటించడం.. కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్లు సినిమాపై ఎంతో హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘కల్కి 2898 ఏడీ’ కథేంటంటే..కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతుంది. మొదటి నగరంగా చెపుకునే కాశీలో తాగడానికి నీళ్లు కూడా లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ప్రకృతి మొత్తం నాశనం అవుతుండటంతో సుప్రీం యాష్కిన్(కమల్ హాసన్) కాంప్లెక్స్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్‌లో ఉంటాయి. ఆ ప్రపంచంలోకి వెళ్లాలంటే కనీసం ఒక మిలియన్ యూనిట్స్(డబ్బులు) ఉండాలి. ఆ యూనిట్స్ కోసం కాశీ ప్రజలు చాలా కష్టపడుతుంటారు. అందులో ఫైటర్ భైరవ(ప్రభాస్) కూడా ఒకడు. ఎప్పటికైనా కాంప్లెక్స్‌లోకి వెళ్లి సుఖపడాలనేది అతడి కోరిక. యూనిట్స్ కోసం ఎలాంటి పనులైనా చేయడానికి సిద్ధపడుతుంటాడు. అతనికి బుజ్జి((ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆలోచించే మెషీన్)తోడుగా ఉంటుంది. మరోవైపు యాష్కిన్ చేస్తున్న అన్యాయాలపై రెబల్స్ తిరుగుబాటు చేస్తుంటారు. సుప్రీం యాష్కిన్ని అంతం చేసి కాంప్లెక్స్ వనరులను అందరికి అందేలా చేయాలనేది వారి లక్ష్యం. దాని కోసం ‘శంబాల’ అనే రహస్య ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని అక్కడి నుంచే పోరాటం చేస్తుంటారు. ‘కాంప్లెక్స్’లో ‘ప్రాజెక్ట్ కే’పేరుతో సుప్రీం యాష్కిన్ ఓ ప్రయోగం చేస్తుంటాడు. గర్భంతో ఉన్న సమ్-80 అలియాస్ సుమతి(దీపికా పదుకొణె) కాంప్లెక్స్ నుంచి తప్పించుకొని శంబాల వెళ్తుంది.. సుమతిని పట్టుకునేందుకు కాంప్లెక్స్ మనుషులు ప్రయత్నిస్తుంటారు. ఆమెను అప్పగిస్తే కాంప్లెక్స్‌లోకి వెళ్లొచ్చు అనే ఉద్దేశంతో భైరవ కూడా సుమతి కోసం వెళ్తాడు.వీరిద్దరి బారి నుంచి సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ(అమితాబ్ బచ్చన్) ప్రయత్నిస్తాడు. అసలు అశ్వత్థామ ఎవరు? వేల సంవత్సరాలు అయినా అతను మరణించకుండా ఉండడానికి గల కారణం ఏంటి? సుమతిని ఎందుకు కాపాడుతున్నాడు? ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఎవరు? సుప్రీం యాష్కి చేపట్టిన ‘ప్రాజెక్ట్ కే’ ప్రయోగం ఏంటి? కాంప్లెక్స్‌లోకి వెళ్లాలనుకున్న భైరవ కోరిక నెరవేరిందా? అసలు భైరవ నేపథ్యం ఏంటి? అశ్వత్థామతో పోరాడే శక్తి అతనికి ఎలా వచ్చింది? భైరవ, అశ్వత్థామ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..వెండితెరపై ప్రయోగాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. కొద్ది మంది దర్శకులు మాత్రమే వైవిధ్యభరిత కథలను తెరకెక్కిస్తుంటారు. అది విజయం సాధించిందా? లేదా? అనేది పక్కన పెడితే.. ఆ ప్రయోగం మాత్రం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ‘కల్కి 2898’తో అలాంటి ప్రయోగమే చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడనటువంటి ప్రపంచాన్ని సృష్టించాడు. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. విజువల్స్, గ్రాఫిక్స్ పరంగా అద్భుతమనే చెప్పాలి. కాంప్లెక్స్, శంబాల ప్రపంచాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. అయితే కథ పరంగా చూస్తే మాత్రం ఇందులో పెద్దగా ఏమీ ఉండడు. అసలు కథంతా పార్ట్ 2లో ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు. వాస్తవానికి నాగ్ అశ్విన్ రాసుకున్న కథ చాలా పెద్దది. అనేక పాత్రలు ఉంటాయి. ఒక్క పార్ట్‌లో ఇది పూర్తి చేయడం సాధ్యం కాని పని. అది నాగికి కూడా తెలుసు. అందుకే పార్ట్ 1ని ఎక్కువగా పాత్రల పరిచయాలకే ఉపయోగించాడు. కురుక్షేత్ర సంగ్రామంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా ఆరువేల సంవత్సరాల తర్వాత కాలంలోకి వెళ్తుంది. కాశీ, కాంప్లెక్స్, శంబాల ప్రపంచాల పరిచయం తర్వాత ప్రేక్షకుడు కథలో లీనం అవుతాడు. భారీ యాక్షన్ సీన్‌తో ప్రభాస్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. బుజ్జి, భైరవల కామెడీ సంభాషణలు కొంతవరకు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. ఫస్టాఫ్‌లో ఎక్కువగా పాత్రల పరిచయమే జరుగుతుంది. ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఓ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడం కాస్త ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. ఇంటెర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్థంలో కథనంలో వేగం పుంజుకుంటుంది. ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే యాక్షన్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. మధ్య మధ్యలో అమితాబ్ పాత్రతో మహాభారతం కథను చెప్పించడం.. రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించడంతో ప్రేక్షకుడికి మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక చివరి 20 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు పార్ట్ 2పై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. దీంతో ప్రభాస్ కూడా తెరపై తక్కువ సమయమే కనిపిస్తాడు. భైరవగా ఆయన చేసే యాక్షన్, కామెడీ ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్ మరో పాత్ర కూడా పోషించాడు అదేంటనేది వెండితెరపైనే చూడాలి. ప్రభాస్ తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్ర అమితాబ్‌ది. అశ్వత్థామ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ వయసులోనూ యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. ప్రభాస్-అమితాబ్ మధ్య వచ్చే పోరాట ఘట్టాలు సినిమాకు హైలెట్. సుప్రీం యాష్కిన్‌గా కమల్ హాసన్ డిఫరెంట్ గెటప్‌లో కనిపించాడు. అయితే ఆయన పాత్ర నిడివి చాలా తక్కువే. పార్ట్ 2లో ఆయన రోల్ ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీ సుమతిగా దీపికా పదుకొణె తనదైన నటనతో ఆకట్టుకుంది. శంబాల ప్రంచానికి చెందిన రెబల్ ఖైరాగా అన్నాబెన్, రూమిగా రాజేంద్ర ప్రసాద్, వీరణ్గా పశుపతితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్‌వర్క్ చాలా బాగుంది. నాగ్ అశ్విన్ ఊహా ప్రపంచానికి టెక్నికల్ టీమ్ ప్రాణం పోసింది. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. పాటలు అయితే తెరపై మరీ దారుణంగా అనిపించాయి. నేపథ్య సంగీతం కూడా యావరేజ్‌గానే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
సుత్తి లేకుండా సాగే థ్రిల్లర్ సినిమా.. లూ మూవీ రివ్యూ
థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడని సినీప్రేక్షకులు ఉండరు. అలాంటివారి కోసం ఏ యేటికాయేడు కొత్త సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అందులో చాలా చిత్రాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కొన్ని మాత్రమే బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాబడతాయి. మరికొన్ని మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా అవార్డులు అందుకుంటాయి. అలాంటి చిత్రమే లూ. 2022లో వచ్చిన ఈ సినిమా గతేడాది రీఫ్రేమ్ స్టాంప్ అవార్డు అందుకుంది. మరి లూ మూవీ ఎలా ఉందో చూసేద్దాం..లూ అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా నివసిస్తుంది. ఓ రోజు తన బ్యాంక్‌లో నుంచి పెద్ద మొత్తంలో డబ్బు విత్ డ్రా చేసుకుని ఇంటికి వస్తుంది. అలాగే పెంపుడు కుక్కకు కొన్ని వారాలపాటు అవసరమయ్యే మాంసాన్ని ఫ్రిజ్‌లో భద్రపరుస్తుంది. తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను, పేపర్లను మంటల్లో తగలబెట్టి కుర్చీలో కూలబడుతుంది. పెద్ద తుపాకీ అందుకుని చనిపోవడానికి సిద్ధమవుతుంది. సరిగ్గా ట్రిగర్ నొక్కే సమయంలో హన్నా అనే మహిళ తన ఇంట్లోకి పరుగు పరుగున వస్తుంది. తన కూతురు వీ తప్పిపోయిందని చెప్తుంది. ఆ చిన్నారిని క్షేమంగా తీసుకొస్తానని మాటిచ్చిన లూ ఆత్మహత్య ఆలోచన విరమించుకుంటుంది. మరి లూ మాట మీద నిలబడిందా? చిన్నారిని కిడ్నాప్ చేసిందెవరు? తనను కాపాడిందా? లేదా? అసలు ఆమె ప్రాణాలు తీసుకోవడానికి ఎందుకు సిద్ధపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!లూ మహిళ విచిత్రంగా ప్రవర్తించినప్పుడే తన వెనుక ఏదో ఫ్లాష్‌బ్యాక్ ఉందని అర్థమైపోతుంది. భీకరమైన వర్షం రాబోతోంది.. అప్రమత్తంగా ఉండండి అన్న ప్రకటనతో ఏదో ఘోరం జరగబోతుందని ముందుగానే హింటిచ్చాడు డైరెక్టర్ అన్నా ఫోరెస్టర్. పొరుగింట్లో ఉండే చిన్నారి వీని కనీసం ఒక్కసారైనా పలకరించని లూ.. ఆమె కోసం ప్రాణాలకు తెగించి పోరాడటం, ప్రయత్నించడం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.లూగా అలిసన్ జానీ నటన అద్భుతంగా ఉంది. హన్నాగా జుర్నీ స్మోలెట్, వీగా రైడ్లీ ఆషా నటన పర్వాలేదు. ప్రీక్లైమాక్స్ బాగుంది. కథను మలుపు తిప్పే ట్విస్టు బాగుంటుంది. కానీ కొన్ని సన్నివేశాలను జీర్ణించుకోవడం కష్టంగా అనిపిస్తుంది. డైరెక్టర్ కథకు ఇంకాస్త మెరుగులు దిద్ది ఉంటే లూ అద్భుతాలు సృష్టించేదనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారైతే పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూసేయొచ్చు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అందుబాటులో ఉంది. -
పద్మవ్యూహంలో చక్రధారి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: పద్మవ్యూహంలో చక్రధారినటీనటులు: ప్రవీణ్ రాజ్‌కుమార్, శశికా టిక్కూ, అషురెడ్డి, మధునందన్, భూపాల్ రాజ్, ధనరాజ్, రూపా లక్ష్మి , మాస్టర్ రోహన్, మురళీధర్ గౌడ్, మహేష్ విట్టా తదితరులు.దర్శకత్వం: సంజయ్‌రెడ్డి బంగారపునిర్మాత: కే.ఓ.రామరాజునిర్మాణ సంస్థ: వీసీ క్రియేషన్స్సంగీత దర్శకుడు: వినోద్ యాజమాన్యసినిమాటోగ్రఫీ: జీ. అమర్ఎడిటర్: ఎస్ బీ ఉద్దవ్విడుదల:21 జూన్ 2024వీసీ క్రియేషన్స్ బ్యానర్‌పై కే. ఓ రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం పద్మవ్యూహంలో చక్రధారి. ప్రవీణ్ రాజ్‌కుమార్ హీరోగా పరిచయం అయిన ఈ సినిమా నేడు థియేటర్లో విడుదలైంది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..రాయలసీమలోని ఓ గ్రామంలో జరిగే కథే పద్మవ్యూహంలో చక్రధారి. ఆ గ్రామానికి చెందిన చక్రీ(ప్రవీణ్ రాజ్‌కుమార్) సిటీలో ఐటీలో జాబ్ చేసుకుంటూ స్నేహితులతో ఉంటాడు. అదే సమయంలో హీరో ఊరినుంచి సత్య(శశికా టిక్కూ) జాబ్ కోసం హైదరాబాద్ వస్తుంది. చక్రీ, సత్యకు జాబ్ రావడంలో హెల్ప్ చేస్తాడు. దాంతో ఇద్దరు మంచి స్నేహితులవుతారు. ఆ తరువాత ప్రేమికులుగా మారుతారు. అదే సమయంలో అనుకోకుండా సత్య జాబ్ వదిలేసి ఊరికి వెళ్లిపోతుంది. విషయం తెలుసుకున్న చక్రీ తన ఉద్యోగానికి లీవ్ పెట్టి తాను కూడా విలేజ్‌కి వెళ్తాడు. హీరో స్నేహితుడు శ్రీను(మహేష్ విట్టా) ఊరిలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. అతని సాయంతో సత్యను కలవాలని ప్లాన్ చేస్తాడు. అదే విలేజ్‌లో స్కూల్ టీచర్‌గా పద్మ(అషురెడ్డి) పనిచేస్తుంది. తన భర్త కోటి(భూపాల్ రాజ్) ఓ తాగుబోతు. బ్యాంక్ మేనేజర్ ప్రసాద్(మధునందన్) కూడా గతంలో జరిగిన సంఘటనలకు ఆ ఊరి వారంటే ద్వేషం పెంచుకుంటాడు. అతను తాగుబోతుగా మారతాడు. అసలు తన ప్రేమ కోసం వచ్చిన చక్రీ.. సత్యను దక్కించుకున్నాడా ? పద్మ (అషురెడ్డి)తాగుబోతు అయిన కోటిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది.? అసలు బ్యాంక్ మేనేజర్ గతం ఏంటి? సత్యను పెళ్లి చేసుకోవాలంటే వాళ్ల నాన్న హీరోకు పెట్టిన కండీషన్స్ ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఫస్ట్ సిటీలో మొదలైన ప్రేమ కథను విలేజ్‌కు తీసుకెళ్లాడు డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్‌లోనే అన్ని క్యారెక్టర్లను రివీల్ చేసి సినిమాపై ఇంట్రస్ట్ తగ్గించేశాడు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ వర్కవుట్ అయింది. విలేజ్‌లో ఉండే క్యారెక్టర్లను కాస్తా ఫన్నీగా చూపించారు. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ రోటీన్‌గానే అనిపిస్తాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ కాలేదు. హీరోయిన్ కోసం గ్రామానికి హీరో రావడం...ఫ్రెండ్ శ్రీను హెల్ప్ తీసుకోవడం...అంతా పాత చింతకాయ పచ్చడిలానే చూపించారు. అయితే సెకండ్ హాఫ్‌లో కామెడీ ఎక్కడా ఫరవాలేదు. ఇక హీరో, హీరోయిన్ ప్రేమ విషయం అమ్మాయి తండ్రికి తెలియడం.. అల్లుడికి ఉండాల్సిన లక్షణాల గురించి ఆయన చెప్పడం గతంలో చూసిన సినిమా లాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ దగ్గరకు వెళ్లడం, నిజం తెలుసుకొని ప్రసాద్ మారడం రోటీన్‌గానే అనిపిస్తుంది. ఇక హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ ఫర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల భావోద్వేగాలతో కట్టిపడేశారు. ఓవరాల్‌గా రోటీన్ లవ్ స్టోరీనే తెరపై చూపించే ప్రయత్నం చేశారు. విలేజ్ నేపథ్యంలో సాగే కథను పల్లె వాతవరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.ఎవరెలా చేశారంటే..హీరోగా ప్రవీణ్ రాజ్‌కుమార్ తొలిపరిచయం అయినా నటనతో మెప్పించారు. అలాగే హీరోయిన్ శశికా టిక్కూ అద్భుతంగా నటించింది. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో అలరించింది. అషురెడ్డి తను గ్లామర్‌తో కట్టిపడేసింది. మురళిధర్ గౌడ్, మహేష్ విట్టా, మధునందన్, భూపాల్ రాజ్, ధనరాజ్, రూపా లక్ష్మి, తమ పాత్రల మేర మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే.. రచయిత దర్శన్ రాసుకున్న డైలాగ్స్ విలేజ్ నెటివిటీకి సరిపోయాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఎడిటింగ్‌లో ఇంకాస్తా కట్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
OMG Review: ‘ఓ మంచి ఘోస్ట్’ మూవీ రివ్యూ
టైటిల్: OMG (ఓ మంచి ఘోస్ట్)నటీనటులు: వెన్నెల కిషోర్, నందితా శ్వేత, నవమి గాయక్, షకలక శంకర్, రజత్ రాఘవ్, నవీన్ నేని, రఘు బాబు, నాగినీడు, బాహుబలి ప్రభాకర్, షేకింగ్ శేషు, తదితరులు.నిర్మాత: డా.అబినికా ఇనాబతునిదర్శకుడు: శంకర్ మార్తాండ్సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్సినిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూఎడిటర్: ఎం.ఆర్.వర్మవిడుదల తేది: జూన్ 21, 2024కథేంటంటే.. చైతన్య (రజత్), రజియా (నవమి గాయక్), లక్ష్మణ్ (నవీన్), పావురం (షకలక శంకర్).. ఈ నలుగురికి డబ్బు సమస్య ఉంటుంది. మనీ కోసం తన తన మేన మరదలు, స్థానిక ఎమ్మెల్యే సదాశివరావు(నాగినీడు) కూతురు కీర్తి (నందిత శ్వేత)ను కిడ్నాప్ చేయాలని చైతన్య ప్లాన్ వేస్తాడు. అనుకున్నట్లే ఈ నలుగురు కలిసి కీర్తిని కిడ్నాప్ చేసి ఊరి చివర ఉన్న బంగ్లాలోకి తీసుకెళ్తారు. ఈ బంగ్లాలో ఓ దెయ్యం ఉంటుంది. కిడ్నాప్ చేసేవాళ్లు అంటే దానికి అస్సలు పడదు. అలాగే కిర్తీకి కూడా ఓ సమస్య ఉంటుంది? అటు దెయ్యం, ఇటు కీర్తికి ఉన్న సమస్య కారణంగా ఈ నలుగురికి ఎదురైన సమస్యలు ఏంటి? బంగ్లాలో ఉన్న దెయ్యం కిడ్నాప్ చేసినవాళ్లను మాత్రమే ఎందుకు చంపుతుంది? చైతన్యకు తన మేనమామ, ఎమ్మెల్యే సదాశివరావుపై ఎందుకు కోపం? కీర్తికి ఉన్న సమస్య ఏంటి? చివరకు ఆ బంగ్లా నుంచి నలుగురు బతికి బయటపడ్డారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. హారర్ కామెడీ జానర్లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఓ మంచి ఘోస్ట్ కూడా ఆ జానర్లో తెరకెక్కిన చిత్రమే. ఒకవైపు ప్రేక్షకులను నవ్విస్తూనే.. భయపెట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే కథ విషయంలో మాత్రం కొత్తదనం లేదు. దెయ్యం, కిడ్నాప్ డ్రామా..ప్రతీది పాత సినిమాలను గుర్తు చేస్తుంది. అనుభవం ఉన్న నటీనటులు కావడంతో.. రొటీన్ సన్నివేశాలే అయినా తమదైన నటనతో బోర్ కొట్టకుండా చేశారు. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. కిడ్నాప్ డ్రామ అంతగా ఆకట్టుకోదు. నలుగురి గ్యాంగ్ బంగ్లాలోకి వెళ్లిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఆత్మ పాత్రలో వెన్నెల కిశోర్ ఎంట్రీ.. అతన్ని దెయ్యం అనుకొని ఆ నలుగు భయపడే సన్నివేశాలు.. ఎవరు దెయ్యం అనే విషయాన్ని కనిపెట్టే ప్రయత్నాలు.. ఈ క్రమంలో శకలక శంకర్ చేసే పనులు అన్నీ థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో దెయ్యాలు చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. ఇక దెయ్యాల ప్లాష్‌బ్యాక్ స్టోరీ రొటీన్‌గా అనిపిస్తుంది. సీక్వెల్ ఉంటుందని తెలియజేసేలా క్లైమాక్స్ ఉంటుంది. మొత్తంగా ఓ మంచి దెయ్యం కొన్ని చోట్ల నవ్విస్తూనే.. మరికొన్ని చోట్ల భయపెడుతుంది. హారర్ కామెడీ చిత్రాలను ఇష్ట పడేవారికి ఈ మూవీ నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే.. వెన్నెల కిషోర్, షకలక శంకర్ థియేటర్లో ప్రేక్షకుల్ని పగలబడేలా నవ్విస్తుంటారు. వీరిద్దరికీ ఇలాంటి పాత్రలేమీ కొత్త కాదు. మరోసారి ఈ చిత్రంతో ఆడియెన్స్‌ను విరగబడేలా నవ్విస్తారు. నందిత ఆల్రెడీ ఘోస్ట్‌గా ఇది వరకు భయపెట్టేసింది. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంలో అదరగొట్టేసింది. నవమి గాయక్ గ్లామరస్‌గా అనిపిస్తుంది. రఘుబాబు కనిపించినంత సేపు నవ్విస్తాడు. రజత్ చక్కగా నటించాడు. నవీన్ నేని మధ్య మధ్యలో నవ్విస్తాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి. -
హెబ్బా పటేల్ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ ఎలా ఉందంటే..?
టైటిల్: హనీమూన్ ఎక్స్ప్రెస్నటీనటులు: చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులునిర్మాతలు: కేకేఆర్, బాలరాజ్ రచన, దర్శకత్వం : బాల రాజశేఖరునిసంగీతం: కళ్యాణి మాలిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఆర్ పి పట్నాయక్ఎడిటింగ్ : ఉమా శంకర్ జి (యు ఎస్ ఎ), శ్రీ కృష్ణ అత్తలూరివిడుదల తేది: జూన్ 21, 2024కథేంటంటే.. వేరు వేరు మనస్తత్వాలు ఉన్న సోనాలి(హెబ్బా పటేట్), ఈషాన్(చైతన్య రావు) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత తొలి రాత్రి నుంచే వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. ముఖ్యంగా శృంగార జీవితాన్ని వీరిద్దరు ఆస్వాదించలేకపోతారు. కౌన్సిలింగ్ కోసం థెరపిస్ట్‌లను కలుస్తారు. అయినా ప్రయోజనం ఉండడు. ఓ సారి వీరిద్దరు కారులో వెళ్తుంటే.. ఓ వృద్ధ జంట(తనికెళ్ల భరణి, సుహాసిని) పరిచయమై హనీమూన్ ఎక్స్‌ప్రెస్(రిస్టార్ట్) గురించి చెబుతుంది. ఆ రిసార్ట్‌కి వెళ్లిన తర్వాత వీరిద్దరి ఎదురైన అభువాలు ఏంటి? అసలు ఈ వృద్ధ జంట ఎవరు? హనీమూన్ ఎక్స్‌ప్రెస్ కాన్సెప్ట్ ఏంటి? ప్రేమ వివాహం చేసుకున్న సోనాలి, ఈషాన్ శృంగార జీవితం సరిగ్గా ఉండకపోవడానికి గల కారణం ఏంటి? రిసార్ట్‌లోకి వెళ్లిన తర్వాత వీరిలో వచ్చిన మార్పు ఏంటి? చివరకు వీరిద్దరు విడిపోయారా? ఒక్కటయ్యరా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ప్రస్తుతం విడాకులు అనేది చాలా సింపుల్ మ్యాటర్ అయిపోయింది.చిన్న చిన్న విషయాల్లో గొడవపడి విడిపోతున్నారు. భార్యకు నచ్చినట్లుగా భర్త, భర్తకు నచ్చినట్లుగా భార్య ప్రవర్తించకపోవడంతో గొడవలు మొదలవుతున్నాయి. ఒకరికొకరు సరిగ్గా అర్థం చేసుకుంటే కాపురంలో గొడవలే ఉండవు. ఈ పాయింట్‌తోనే హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌ని తెరకెక్కించాడు దర్శకుడు బాల రాజశేఖరుడు. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ అనుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో పూర్తిగా సఫలం కాలేదు. స్క్రీప్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సింది. చాలా చోట్ల కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. కథ ప్రారంభం కాస్త ఆసక్తికరంగా ఉన్నా.. ప్రేమ, పెళ్లి, శోభనం ఇదంతా చాలా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. వృద్ధ జంట ఎంట్రీ తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ గేమ్ గురించి వివరించిన తర్వాత ఏదో జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. రిసార్ట్‌లోకి వెళ్లిన అక్కడ వచ్చే ట్విస్ట్ కథపై మరింత ఆసక్తిని పెంచుతుంది. అయితే ఆ ట్విస్ట్ తర్వాత క్లైమాక్స్ ఏంటో ఈజీగా అర్థం అవుతుంది. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు యూత్‌ని ఆకట్టుకున్నా..ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. బడ్జెట్ ప్రాబ్లమో ఇంకేదో కానీ.. చాలా సన్నివేశాలు చుట్టేశారనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్క్రీన్‌ప్లే బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. ఈషాన్ పాత్రకు చైతన్యరావు న్యాయం చేశాడు. డీసెంట్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. హెబ్బా పటేల్ అందాల ప్రదర్శన ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నటన కంటే ఎక్స్ఫోజింగ్పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. సీనియర్ నటులు తనికెళ్ల భరణి, సుహాసిని డిఫరెంట్ పాత్రల్లో మెరిశారు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కొంతవరకు ఓవరాక్షన్‌గా అనిపించినా.. నవ్వుకోవచ్చు. అలీ కనిపించేది ఒక సీన్లో అయినా..నవ్వించే ప్రయత్నం చేశాడు. అరవింద్ కృష్ణ, సురేఖ వాణి, రవి వర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా ఈ సినిమా జస్ట్ ఒకే. కల్యాణీ మాలిక్ అందించిన పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. నేపథ్యం సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
'ప్రభుత్వ జూనియర్ కళాశాల' సినిమా రివ్యూ
కాలేజీ ప్రేమకథా సినిమాలకు ఉండే డిమాండే వేరు. 'కొత్త బంగారు లోకం' నుంచి 'కలర్ ఫోటో' వరకు చెప్పుకొంటే ఎన్నో మూవీస్ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమానే 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. అందరూ కొత్తోళ్లే నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలోకి వచ్చింది. మరి ఇది ఎలా ఉంది? ఏంటనేదే ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)కథేంటి?అది 2004. రాయలసీమలోని పుంగనూరు అనే ఊరు. ఇంటర్మీడియట్ ఫస్టియర్ కుర్రాడు వాసు (ప్రణవ్ ప్రీతమ్). అదే కాలేజీలో సీఈసీ చదువుతున్న కుమారి (శాగ్నశ్రీ వేణున్) అనే అమ్మాయి. అసలు పరిచయమే లేని వీళ్లిద్దరూ అనుకోని పరిస్థితుల్లో ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ప్రేమలో పడతారు. కానీ కుమారి గురించి కొన్ని విషయాలు తెలిసేసరికి ఆమెతో గొడవపడతాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. వాసు ఎందుకు చనిపోవాలనుకున్నాడు? చివరకు వీళ్ల ప్రేమ కంచికి చేరిందా? అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?తొలి ప్రేమ.. ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని ఓ జ్ఞాపకం. అయితే అది మంచి జ్ఞాపకమా? చేదు జ్ఞాపకమా అనేది ఆయా పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటుంది. 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' కూడా అలాంటి ఓ స్టోరీనే. ఇంటర్మీడియట్ చదివే కుర్రాడి జీవితంలో తొలి ప్రేమ అనేది తీపి గుర్తుల్ని మిగిల్చిందా? చేదు అనుభవాల్ని పరిచయం చేసిందా అనేదే మెయిన్ పాయింట్.ఫస్టాప్ అంతా కూడా గవర్నమెంట్ కాలేజీలో వాసు, అతడి ఫ్రెండ్స్, చుట్టూ ఉండే వాతావరణం, కుమారితో ప్రేమ లాంటివి చూపిస్తూ వెళ్లారు. ఇక సెకండాఫ్ వచ్చేసరికి ప్రేమలో కలతలు, మనస్పర్థలు లాంటివి ఉంటాయి. ఇందులో చెప్పుకోవడానికి కథేం కొత్తగా ఉండదు. ఇప్పటికే ఎన్నో కాలేజీ లవ్ స్టోరీల్లో కనిపించే సీన్స్ ఉంటాయి. కానీ అంతా కూడా మలయాళ సినిమాల్లో తీసినట్లు చాలా నిదానంగా అదే టైంలో క్యూట్‌గా సాగుతుంది. 90ల్లో పుట్టి పెరిగిన వాళ్లు ఈ సినిమా చూస్తే.. గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతారు. తొలి ప్రేమ, తొలి ముద్దు లాంటివి మనసులో గిలిగింతలు పెట్టేస్తాయి. పాత ప్రేమలు మళ్లీ గుర్తొస్తాయి.(ఇదీ చదవండి: 'నింద' సినిమా రివ్యూ)మధ్య మధ్యలో ఫన్ మూమెంట్స్, జోకులతో సినిమా అంతా సరదా సరదాగా సాగిపోతుంది. కానీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఎమోషనల్‌గా ఎండ్ చేయడం బాగుంది. సినిమాలో పెద్ద కంప్లైంట్స్ ఏం లేవా అంటే ఉన్నాయి. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ కాదు. 90ల్లో పుట్టి, ఫోన్లు లేని కాలంలో ఇంటర్మీడియట్ చేసిన అమ్మాయిలు అబ్బాయిలకు అయితే బాగా నచ్చుతుంది. ఈ కాలంలో పుట్టి పెరిగిన కుర్రాళ్లకు అబ్బే అని చెప్పి విసుగు వచ్చేస్తుంది.ఎవరెలా చేశారు?లీడ్ రోల్స్ చేసిన ప్రణవ్, శాగ్నశ్రీ.. ఇద్దరూ భలే క్యూట్‌గా చేశారు. వీళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. పాటలు పెద్దగా గుర్తుండవు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. రైటర్, ఎడిటర్, దర్శకుడు.. ఇలా అన్ని బాధ్యతలు భుజానికెత్తుకున్న శ్రీనాథ్ పులకరం.. ఫీల్ గుడ్ మూవీని అందించాడు. కానీ 'కల్కి' మేనియాలో దీన్ని పట్టించుకుంటారా అనేది సస్పెన్స్.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?)