-
Oct 12th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Live Updates.. 09:13 PM చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు: హెల్త్ బులిటెన్ ►చంద్రబాబు హెల్త్ బులిటెన్ ను విడుదల చేసిన జైలు అధికారులు ►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది బీపీ: 140/80 టెంపరేచర్: నార్మల్ పల్స్: 87 Spo2: 97 Heart: s1 s2 Lungs: క్లియర్ ఫిజికల్ యాక్టివిటీ : గుడ్ ►చర్మ సంబంధిత సమస్య గురించి చంద్రబాబు జైలు అధికారులకు తెలియజేశారు ►జైల్లో వైద్యాధికారిణి పరీక్ష చేసి మాకు నివేదిక ఇచ్చారు ►మా అభ్యర్థన మేరకు ప్రభుత్వ ఆసుపత్రి నుండి చర్మవ్యాధి నిపుణులు వచ్చి చంద్రబాబును పరీక్షించారు ►చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉంది ►ఎటువంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు :::రాజ్ కుమార్ , డిప్యూటీ సూపరిండెంట్, రాజమండ్రి కేంద్ర కారాగారం 08:46 PM సుప్రీంకోర్టులో చంద్రబాబు మరో పిటిషన్ ►సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసిన చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు ►ఫైబర్ నెట్ స్కాం కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు ►మంగళగిరి పోలీస్ స్టేషన్ హెడ్(SHO) ను ప్రతివాదిగా చేరుస్తూ పిటిషన్ 08:38 PM రేపు సుప్రీంలో చంద్రబాబు పిటిషన్ విచారణ ►రేపు చంద్రబాబు లీవ్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ ►విచారణ జరపనున్న జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ త్రివేది ధర్మాసనం ►సెక్షన్ 17 ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా ? లేదా? అన్నది తేల్చనున్న సుప్రీం కోర్టు ►చంద్రబాబు తరపున ఇప్పటికే వాదనలు వినిపించిన హరీష్ సాల్వే ►రేపు సీఐడీ తరపు వాదనలు వినిపించనున్న రోహత్గి, రంజిత్ కుమార్ 07:35 PM మరికాసేపట్లో చంద్రబాబు హెల్త్ బులిటెన్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు డెర్మటాలజీ ప్రాబ్లం ►స్పెషలిస్ట్ వైద్యులకు రిఫర్ చేసిన జైలు అధికారులు ►చంద్రబాబు కు వైద్య పరీక్షలు నిర్వహించిన రాజమండ్రి జీజీహెచ్ డెర్మటాలజిస్టులు ►కొన్ని మెడిసిన్స్, లోషన్లు వాడాలని సూచించిన వైద్యులు ►చంద్రబాబు ఒంటిపై రేషస్తో అలర్జీ:డాక్టర్ సత్యనారాయణ ►చర్మ సమస్యకు మందులు రాసిచ్చాం:డాక్టర్ సత్యనారాయణ ►మరి కొద్దిసేపట్లో చంద్రబాబు హెల్త్ బుల్ టెన్ విడుదల చేయనున్న జైలు అధికారులు 07:15 PM ఆవు చేనులో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? సీఎంగా చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తే.. మంత్రి హోదాలో కొడుకు నారా లోకేష్ కూడా అవినీతి బాటలోనే.. కేవలం పాలు, పెరుగు వ్యాపారం చేసి కోట్లు సంపాదించారని నారా భువనేశ్వరి అనడం జోక్ పాలు, పెరుగుతో కోట్లు ఎలా సంపాదించారో ఆ కిటుకు రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాలి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపి ఫైబర్ నెట్ లో స్కాం జరిగింది :::ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పున్నూరు గౌతమ్ రెడ్డి 06:55 PM రాజమండ్రి జైలుకు చేరుకున్న వైద్య బృందం ►టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు స్కిన్ అలర్జీ ►జైల్లో వైద్య పరీక్షల కోసం వెళ్లిన జీజీహెచ్ వైద్య బృందం ►చంద్రబాబును పరీక్షించనున్న డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ సునీతల బృందం 06:31 PM ముగిసిన నారాయణ అల్లుడి విచారణ.. మళ్లీ పిలిచే ఛాన్స్ ►ఇన్నర్ రింగ్‌రోడ్డు అక్రమాల కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ విచారణ ►అమరావతిలో భూముల కొనుగోలు లావాదేవీల పై ప్రశ్నించిన సీఐడీ ►సీఐడీ ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరైన పునీత్ ►మాటి మాటికి కార్ లోకి వెళ్లి ఫోన్ మాట్లాడి విచారణకు హాజరైన పునీత్ ►ఎన్ స్పైరా నుండి ఎందుకు రామకృష్ణ హౌసింగ్ కి డబ్బులు పంపారు? ►రామకృష్ణ హౌసింగ్ నుండి మళ్ళీ నిధులు ఎందుకు ఎన్ స్పైరా సంస్థకు వచ్చాయి? ►అమరావతిలో చట్టవిరుద్దంగా అసైన్డ్ భూములు ఎందుకు కొనుగోలు చేశారు? ►అమరావతి రైతులకు చెల్లించే కౌలు మొత్తం నారాయణ సంస్థల ఖాతాలోకి ఎందుకొచ్చాయి? ►నారాయణ ద్వారా IRR అలైన్మెంట్ మార్పుల సమాచారం పొందిన విషయంపై ప్రశ్నలు ► పునీత్ ని మరోసారి సీఐడీ ప్రశ్నించే అవకాశం 06:12 PM చంద్రబాబు కోసం డెర్మటాలజిస్ట్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడు ►చంద్రబాబుకి చర్మ సంబంధిత సమస్య ►వెంటనే అప్రమత్తమైన జైలు అధికారులు ►రాజమండ్రి జీజీహెచ్ నుంచి డెర్మటాలజిస్టు రాక ►వెను వెంటనే పరీక్షలు చేయించిన జైలు అధికారులు ►చంద్రబాబు విషయంలో నిరంతరం అలర్ట్ గా ఉన్న జైలు అధికారులు ►జైలు వద్ద గట్టి భద్రత కూడా 05:30 PM చంద్రబాబుకు స్వల్ప అస్వస్థత ►రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబు నాయుడికి స్వల్ప అస్వస్థత ► చర్మ సంబంధితగా గుర్తింపు ►చర్మ వ్యాధి వైద్య నిపుణులను పంపించాలని జైలు అధికారులు రాజమహేంద్రవరం జీజీహెచ్ సూపరింటెండెంటుకు లేఖ ►అత్యవసరంగా పంపించాలని లేఖలో వినతి ►ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసరును కేటాయించిన జీజీహెచ్ అధికారులు 4:52 PM అమిత్ షాకు అన్నీ చెప్పా: నారా లోకేష్ ►కేంద్ర హోం మంత్రి కలవాలనుకుంటున్నట్టు కిషన్‌రెడ్డి ఫోన్ చేశారు. ►చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాలపై హోం మంత్రి అమిత్ షాకు అన్ని విషయాలు వివరించా. ►చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పాను. ►ఆయనకు భద్రతా పరంగా ఉన్న ఆందోళన గురించి కూడా చెప్పాను. ►సీఐడీ ఎందుకు పిలిచింది.. ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడిగారు. ►అన్నింటి గురించి అమిత్ షాకు చెప్పా. ►అరెస్ట్‌లో బీజేపీ పాత్ర ఉందని నేను అనుకోవట్లేదు. ►నిజం వైపు ఉండాలని అమిత్ షాను కోరా. 04:20 PM ఫైబర్‌నెట్ పీటీవారెంట్కు కోర్టు అనుమతి ►ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం ►చంద్రబాబు పీటీ వారెంట్‌ను ఆమోదించిన ఏసీబీ కోర్టు ►పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ పోలీసులు ►సోమవారం చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని ఆదేశం ►ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు ప్రత్యక్షంగా హాజరుపర్చాలన్న కోర్టు ►రేపటి సుప్రీం తీర్పు వస్తే.. ఇంటర్వెన్ కావొచ్చని బాబు లాయర్లకు ఏసీబీ కోర్టు సూచన 03:13 PM లోకేష్ ప్రధాన అనుచరుడి ఇంట ఐటీ సోదాలు ►టీడీపీ నేత, నారా లోకేష్ ప్రధాన అనుచరుడు గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు ►కాకినాడలో.. మూడు బృందాలుగా సోదాలు నిర్వహిస్తున్న అధికారులు ►దాదాపు 5 గంటలకు కొనసాగుతున్న సోదాలు ►ఆక్వా, క్వారీ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టిన చంద్రమౌళి ►ఆదాయంలో తేడాలు చూపించి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారణ ►బినామీ ల ద్వారా వ్యాపారాలు చేసి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసిన్నట్లు గుర్తింపు 02:51 PM ఒక్క సెంట్ భూమి కూడా పంచని ఘనత చంద్రబాబుది ►చంద్రబాబు జైల్లో కూర్చుంటే సొంత పుత్రుడు బాగానే ఉన్నాడు ►దత్తపుత్రుడు మాత్రం రోడ్లు మీద దొల్లుతున్నాడు ►గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు ఒక్క సెంటు భూమిని కూడా కొనలేదు ►ఒకేసారి ఇన్ని లక్షల మందికి ఇల్లు ఇచ్చి కొత్తగా ఊర్లు నిర్మించిన ఘనత సీఎం జగన్‌ది ►ఓట్లు లేని విద్యార్థులు కోసం కూడా 65వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత జగన్ సర్కార్‌ది :::మంత్రి కారుమూరి కామెంట్స్ 02:10 PM అమ్మా.. మీ మరిది అవినీతికి పాల్పడ్డాడు ►చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు ►13సార్లు సంతకం పెట్టినా.. చట్టం వర్తింపజేయడానికి వీల్లేదని ఢిల్లీలో క్యాంపెయిన్ చేస్తున్నారు. ►ఒక ఫేక్ ఎగ్రిమెంట్‌తో స్కిల్ స్కాం చేశారని కేంద్ర ప్రభుత్వ ఈడీ అరెస్టులు కూడా చేసింది. ►ఆ ఒప్పందం ఫేక్ అని.. తమకు సంబంధం లేదని సీమన్స్ కంపెనీ కూడా ధ్రువీకరించింది. ►సాక్షాత్తు మీ మరిది ఆ డబ్బును షెల్ కంపెనీల ద్వారా ఎలా రూట్ చేశారో.. ఆయన పీయే వెల్లడించిన విషయం ఐటీ శాఖ నిర్ధారించింది. ►అంతేకాదు రూ.119 కోట్లకు సంబంధించి వ్యవహారంలో నోటీసులు కూడా ఇచ్చింది ►బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరిని ఉద్దేశించి విజయసాయిరెడ్డి ట్వీట్ 1/3. అమ్మా పురందేశ్వరిగారూ... మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించాడు. నేరం జరిగింది. మీ మరిది చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. 13సార్లు సంతకం కూడా పెట్టాడు. అయినా ఆయనకు చట్టం వర్తింపజేయటానికి వీల్లేదని మీరు ఢిల్లీలో క్యాంపెయిన్ చేస్తున్నారు. 2/3. ఒక ఫేక్ ఎగ్రిమెంట్‌తో స్కిల్… pic.twitter.com/nuT2FCcX9X — Vijayasai Reddy V (@VSReddy_MP) October 12, 2023 02:09 PM ముందస్తు బెయిల్‌కు చంద్రబాబు అర్హుడు కాడు ►అంగళ్ల విధ్వంసం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ►తీర్పు రిజర్వ్ చేసి రేపు వెల్లడిస్తామన్న కోర్టు ►పోలీసుల తరఫున న్యాయవాదుల వాదనలు ►చంద్రబాబు నాయుడు అంగళ్ళలో కార్యకర్తలను రెచ్చగొట్టాడు ►చంద్రబాబు నాయుడు కార్యకర్తలను ఎలా రెచ్చగొట్టాడో మా దగ్గర ఆధారాలు ఉన్నాయ్ ►అంగళ్ళలో చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టిన వీడియోలను పెన్ డ్రైవ్ లో న్యాయస్థానానికి అందించిన లాయర్లు ►ఈ కేసులో చంద్రబాబు నాయుడు కి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దు ►ముందస్తు బెయిల్ కు చంద్రబాబునాయుడు అర్హుడు కాడని వాదించిన పోలీసుల తరపు లాయర్లు 1:35 PM అంగళ్లు కేసుపై రేపు కోర్టు తీర్పు.. ►అంగళ్లు విధ్వంసం కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►కేసుపై కోర్టులో పూర్తైన ఇరుపక్షాల వాదనలు ►తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు ►రేపు(శుక్రవారం) తీర్పు వెల్లడిస్తామన్న కోర్టు. ►స్కిల్ స్కాం కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►41A నోటీసులు ఫాలో అవుతామని చెప్పిన సీఐడీ లాయర్లు. ►లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్పోజ్ చేసిన ఏపీ హైకోర్టు. 1:00 PM యువగళం సంగతేంటీ? భువనేశ్వరీ బస్సు యాత్ర ఎటు పోయింది? ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతల పడరాని పాట్లు ►చివరకు.. చంద్రబాబు భార్య భువనేశ్వరి బస్సు యాత్ర చేపడతారని ప్రకటన ►తనకు అంతగా రాజకీయాలు తెలియవని చెప్పినా భువనేశ్వరిని బలవంతంగా ఒప్పించిన సీనియర్లు ►ఈ నెల 5న కుప్పం నుంచి యాత్ర ప్రారంభిస్తారని ఎల్లో మీడియాలో కథనాలు ►మేలుకో తెలుగోడా అనే పేరు కూడా ఖరారు ►ఢిల్లీ నుంచి లోకేష్ రాగానే మారిన సీను ►తాను ఢిల్లీలో ఉంటూ అమ్మ ప్రజల్లో తిరిగితే తన పరిస్థితి ఏంటని చినబాబు సీరియస్ ►సుప్రీంకోర్టులో ఏదో ఒకటి తెలిసే వరకు ఆగాలని లోకేష్ సూచించినట్టు పార్టీలో ప్రచారం ►యువగళం ఇప్పుడు తిరిగి ప్రారంభించేకంటే.. ఇంకొన్నాళ్లు ఆగే ఉద్దేశ్యంలో లోకేష్ ►ఎన్నికలకు ఎలాగూ ఆరు నెలలు ఉంది కదా ఇప్పుడే తొందరెందుకు అన్నట్టుగా టిడిపి తీరు ►రాజకీయాలకు బ్రాహ్మణీ, భువనేశ్వరీ దూరంగా ఉంటారని మొన్న రాజమండ్రిలో ప్రకటించిన లోకేష్ ►ఎన్టీఆర్ కూతురే అయినా భువనేశ్వరీ ఇంతవరకు బయటకు రాలేదని సమర్థించుకున్న లోకేష్. 11:45 AM లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►స్కిల్ స్కాంలో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►ముందస్తు బెయిల్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా ►విచారణను మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 11:00 AM చంద్రబాబుకు మళ్లీ ఎదురుదెబ్బ ►చంద్రబాబుకు హైకోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది ►చంద్రబాబు బెయిల్‌పై విచారణ ఈనెల 17కు వాయిదా ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు ►స్కిల్ స్కాంలో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ ►ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ ►విచారణను వాయిదా వేసిన హైకోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశం. 10:20 AM రెండో రోజు సీఐడీ ఆఫీసుకు నారాయణ అల్లుడు పునీత్ ►ఏపీ సీఐడీ కార్యాలయానికి చేరుకున్న మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ ►రెండోరోజు పునీత్‌కు విచారించనున్న సీఐడీ ►అమరావతి ఐఆర్ఆర్ అలైన్మెంట్ అక్రమాల కేసులో సీఐడీ విచారణ ►పునీత్ నిర్వహిస్తున్న సంస్థ నుండి ఐఆర్ఆర్ పరిధిలో భూముల కొనుగోలు ►నారాయణ సంస్థలు, భూములకు లబ్ది చేకూరేలా అలైన్మెంట్ మార్పులు ►నారాయణ సంస్థల నుండి జరిగిన ఆర్థిక లావాదేవీలపై పునీత్‌ను విచారించనున్న సీఐడీ 10:15 AM పురంధేశ్వరికి కౌంటర్.. ►బాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందన్న ఆరోపణలకు పురంధేశ్వరి సమాధానమేంటి?. ►బావను కాపాడాలనే ఆరాటంలో అసలు విషయం మరిస్తే ఎలా.. ఎలాగైనా @JaiTDP, @BJP4India పార్టీల మధ్య "బావ" సారూప్యత తీసుకురావాలని @naralokeshని వెంటబెట్టుకుని మరీ ఢిల్లీ వెళ్ళారా @PurandeswariBJP? అయినా @ncbn అరెస్ట్ వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉంది.. కేంద్ర ప్రభుత్వం ఉంది అని ఆరోపణలు చేస్తోంది మీ బావగారి పార్టీ నాయకులే. కాబట్టి ఈ ప్రశ్న… https://t.co/Y8OYgjpXD0 — YSR Congress Party (@YSRCParty) October 11, 2023 8:40 AM ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌పై నేడు విచారణ ►చంద్రబాబును కోర్టుకు తీసుకురావాలని సీఐడీ న్యాయవాది వాదన ►పీటీ వారెంట్‌పై సీఐడీ న్యాయవాది సుదీర్ఘ వాదనలు ►పీటీ వారెంట్‌పై వాదనలు కొనసాగించేందుకు ఏసీబీ కోర్టు సమ్మతి ►ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు వాదనలు విననున్న ఏసీబీ కోర్టు ►వాదనలు అనంతరం నిర్ణయం వెల్లడించనున్న ఏసీబీ కోర్టు ►అంగళ్లు కేసులో బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ ►అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు ►ఐఆర్ఆర్ కేసులో మాజీమంత్రి నారాయణకు మళ్లీ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం 8:30 AM జైలులో 33వ రోజు చంద్రబాబు.. ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 33వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►చంద్రబాబును జైల్లో ప్రత్యేక ఖైదీగా పరిగణిస్తున్న అధికారులు ►కోర్టు నిబంధనల ప్రకారం స్పెషల్ ఎమినిటీస్‌ను చంద్రబాబుకు కల్పించిన అధికారులు ►ప్రతిరోజు రెండుసార్లు చంద్రబాబుకు వైద్య పరీక్షలు ►చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేస్తున్న జైలు అధికారులు ►యథావిధిగా చంద్రబాబుకు కొనసాగుతున్న భద్రత. 8:15 AM విజయవాడ కోర్టుల్లో పలు కేసులు విచారణ ►స్కిల్ కేసులో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదుల పిటిషన్ ►నేడు విచారణకు రానున్న కేసు. ►అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ. ►లోకేశ్‌కు వచ్చిన ముందస్తు బెయిల్ గడువు నేటితో ముగింపు ►ముందస్తు బెయిల్‌పై నేడు హైకోర్టులో విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో ఫైబర్ గ్రిడ్కేసులో చంద్రబాబుపై పీటీ వారెంట్‌పై విచారణ ►నిన్న ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్ ►ఇవాళ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ►ఐఆర్ఆర్ కేసులో మాజీమంత్రి నారాయణకు మళ్లీ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం ►ఇంటి దగ్గరే న్యాయవాది సమక్షంలో విచారించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని నిన్న ఆదేశాలు 8:00 AM ఢిల్లీలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం ►తమ పెద్దమ్మ, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో కలిసి అమిత్‌షాతో నారా లోకేశ్ భేటీ ►భేటీలో పాల్గొన్న టీబీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ►చంద్రబాబుపై కేసులు, అనంతర పరిణామాలు, జైల్లో చంద్రబాబు పడుతున్న ఇబ్బందులు వివరించిన లోకేశ్. 7:00 AM PT వారంటుపై నేడు విచారణ ► ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ నేటికి వాయిదా ► ఏసీబీ కోర్టులో నిన్న ఫైబర్ నెట్ కుంభకోణంపై స్పెషల్ పీపీ వివేకానంద వాదనలు ► ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన ముద్దాయి ► ఫైబర్ నెట్ స్కాం లో రూ. 115 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని సిట్ దర్యాప్తులో తేలింది ► సిట్ దర్యాప్తు లో చంద్రబాబు పాత్ర బయటపడడంతో కేసు నమోదు ► ఫైబర్ నెట్ స్కాం లో చంద్రబాబు పాత్రను గుర్తించిన తర్వాతే FIR లో చేర్చాం ► టెర్రా సాఫ్ట్ కి అక్రమ మార్గంలో టెండర్లు ఖరారు చేయడానికి అక్రమాలకు పాల్పడ్డారు ► టెర్రా సాఫ్ట్ కోసం నిబంధనలకు విరుద్ధంగా టెండర్ గడువును వారం రోజులు పొడిగించారు ► ఫైబర్ నెట్ స్కాం లో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది ► చంద్రబాబు సీఎం హోదాను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయి. రింగ్ మాయ.. ఆవుల ముందస్తు బెయిల్ 17న విచారణ ► ఆవుల మునిశంకర్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా ► తదుపరి విచారణను ఈ నెల 17 కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన మాజీ మంత్రి నారాయణ బావమరిది ఆవుల మునిశంకర్ మళ్లీ ఢిల్లీకి లోకేష్ ► విజయవాడ నుంచి ఢిల్లీకి నారా లోకేష్ ► ఎల్లుండి సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ ► పిటిషన్ అంశాలపై న్యాయవాదులతో మాట్లాడతానన్న లోకేష్. -
ఏలూరు యాసిడ్ దాడి కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
ఏలూరు టౌన్: ఏలూరులో మహిళపై యాసిడ్ దాడికి తెగబడిన కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎం.సునీల్‌కుమార్ సంచలన తీర్పు వెలువరించారు. యాసిడ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఎడ్ల ఫ్రాన్సికా కుటుంబానికి సత్వర న్యాయం అందిస్తూ కేవలం 117 రోజుల్లోనే తీర్పు వెలువరించారు. జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి మీడియాకు బుధవారం వెల్లడించారు. ఏలూరు కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు బోడ నాగసతీ‹Ùకు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, యాసిడ్ దాడికి పాల్పడిన ఏలూరుకు చెందిన బెహరా మోహన్, బూడిద ఉషాకిరణ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.15 వేల చొప్పున జరిమానా విధించారు. యాసిడ్ విక్రయించిన ఏలూరు గడియార స్తంభం ప్రాంతానికి చెందిన కొల్లా త్రివిక్రమరావు (68)కు రూ.1,500 జరిమానా విధించారు. దాడి జరిగిందిలా.. మృతురాలు ఫ్రాన్సికా భర్తకు దూరంగా ఉంటూ నగరంలోని ప్రైవేట్ దంత వైద్యశాలలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. కాగా.. ఫ్రాన్సికా సోదరితో ఏలూరు వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన బోడ నాగసతీష్ సన్నిహితంగా ఉండేవాడు. దీనిని ఫ్రాన్సికా వ్యతిరేకించింది. దీంతో కక్ష పెంచుకున్న సతీ‹Ù.. ఫ్రాన్సికాను హతమార్చేందుకు నగరానికి చెందిన మోహన్, ఉషాకిరణ్ అనే వ్యక్తులకు సుపారీ ఇచ్చాడు. వారిద్దరూ ఈ ఏడాది జూన్ 13న రాత్రి 8.30 గంటల సమయంలో ఫ్రాన్సికాపై యాసిడ్‌తో దాడి చేశారు. గాయపడిన ఆమెను ఏలూరు జీజీహెచ్‌లో చేర్పించగా.. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని విజయవాడ జీజీహెచ్‌కు, ఆ తరువాత మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు తల్లి ధనలక్ష్మి ఏలూరు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. సీఐ ఇంద్ర శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. కాగా, ఫ్రాన్సికాను బతికించాలనే తపనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితురాలి చికిత్స కోసం రూ.20 లక్షలు మంజూరు చేశారు. అయితే.. 8 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమె జూన్ 21న మృతి చెందింది. సత్వర విచారణతో నిందితులకు కఠిన శిక్షలు డీజీపీ కేవీ రాజేంద్రనాద్‌రెడ్డి ఆదేశాలతో కేసు సత్వర విచారణ బాధ్యతను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులుకు అప్పగించారు. నిందితుల్ని అరెస్ట్ చేసి కేవలం 21 రోజుల్లోనే చార్జ్ïÙట్ దాఖలు చేసి, పటిష్టమైన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. సునీల్‌కుమార్ కేవలం 117 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దోషులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.శ్రీవాణిబాయ్ వాదనలు వినిపించారు. సాక్షులను ప్రవేశ పెట్టడంతో కీలకంగా వ్యవహరించిన దిశ సీఐ ఇంద్ర శ్రీనివాస్, విశ్వం, డీఎస్పీ శ్రీనివాసులు, డీసీఆర్బీ సీఐ దుర్గాప్రసాద్‌ను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అభినందించారు. -
ఇన్నర్ కేసులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరట
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్పులో అక్రమాలు, క్విడ్ ప్రోకో ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు హైకోర్టు బుధవారం తాత్కాలిక ఊరటనిచ్చింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌లో తదుపరి ముందుకెళ్లొద్దని విజయవాడ ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 16వ తేదీ వరకు పీటీ వారెంట్ విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఈ కేసులో తదుపరి ఎలాంటి సమయం ఇచ్చే ప్రసక్తేలేదని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఒకవేళ సీనియర్ న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఏదైనా కేసులో వాదనలు వినిపించాల్సి ఉంటే ఒక్కరోజు మాత్రమే గడువునివ్వడం సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబునాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ సురేష్ రెడ్డి విచారించారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, స్పెషల్ పీపీ యడవల్లి నాగవివేకానంద వాదించారు. అప్పటివరకు రక్షణ కల్పించండి.. అంతకుముందు సిద్ధార్థ లూథ్రా తదితరులు వాదనలు వినిపిస్తూ.. 2022లో కేసు నమోదు చేశారని, ఇప్పటివరకు చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వడంగానీ, విచారణకు పిలవడంగానీ చేయలేదని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తరువాతే ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసిందన్నారు. పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు విచారించి చంద్రబాబు కస్టడీకి అనుమతినిస్తే తాము దాఖలు చేసిన ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకం అవుతుందని చెప్పారు. డీమ్డ్ కస్టడీగా పరిగణించలేమని హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే తాము ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. విచారణను ఈ నెల 16కి వాయిదా వేయాలని, అప్పటివరకు రక్షణ కల్పించాలని కోరారు. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు.. తరువాత సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకవేళ విచారణను 16కి వాయిదా వేస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో బెయిల్ కోసం చంద్రబాబు గతంలో దాఖలు చేసిన పిటిషన్లోనే తాము అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. చంద్రబాబు కస్టడీ కోసం సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ నెలరోజులుగా ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. ఫైబర్ గ్రిడ్ కేసులో హైకోర్టు ఇప్పటికే చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిందని తెలిపారు. పీటీ వారెంట్‌పై విచారణ కొనసాగించుకోవచ్చునని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. ఫైబర్ గ్రిడ్ కేసుకు, ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసుకు సారూప్యత ఉందని వివరించారు. చంద్రబాబు కోరుకున్న విధంగా ఈ కేసులో ఏ రక్షణ కల్పించినా, గత ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరించినట్లవుతుందని చెప్పారు. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై జరుగుతున్న విచారణను కొనసాగనివ్వాలని కోరారు. చంద్రబాబుకు అనుకూలంగా ఏ రకమైన ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 16వ తేదీ వరకు పీటీ వారెంట్ విషయంలో ఏరకంగాను ముందుకెళ్లొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించారు. విచారణను అదే రోజుకు వాయిదా వేశారు. అంగళ్లు కేసులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద టీడీపీ శ్రేణులు సాగించిన విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఈ నెల 12వ తేదీ వరకు అరెస్ట్ చేయబోమని ముదివీడు పోలీసులు హైకోర్టుకు నివేదించారు. అలాగే ఈ కేసులో చంద్రబాబుపై అదేరోజు వరకు పీటీ వారెంట్ కూడా దాఖలు చేయబోమని పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి కోర్టుకు చెప్పారు. ఈ కేసులో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించనున్నారని, అందువల్ల విచారణను గురువారానికి వాయిదా వేయాలని కోరారు. వాయిదాకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు సైతం అభ్యంతరం చెప్పలేదు. దీంతో న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అంగళ్లు కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ కుంభకోణంలో బెయిలివ్వాలని చంద్రబాబు పిటిషన్.. నేడు విచారణ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబునాయుడు హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేంతవరకు కనీసం మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయాలని కోర్టును అభ్యర్ధించారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని, సీఐడీ దర్యాప్తునకు అన్ని విధాలుగా సహకరిస్తానని పిటిషన్లో పేర్కొన్నారు. బెయిల్ మంజూరు సందర్భంగా ఎలాంటి షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటానని తెలిపారు. కస్టడీ తరువాత తాను దాఖలు చేస్తున్న తొలి బెయిల్ పిటిషన్ ఇదేనన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారించనుంది. -
తెలుగు యువత నాయకుల అత్యుత్సాహం
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా కుంచనపల్లిప్రాతూరు రోడ్డులో ఉన్న ఏపీ సీఐడీ సిట్ కార్యాలయం వద్ద మంగళవారం తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. సిట్ కార్యాలయం గోడలు దూకేందుకు ప్రయత్నం చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ సీఐడీ కార్యాలయం వద్ద ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విషయమై టీడీపీ నాయకుడు నారా లోకేశ్‌ను సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఆ సమయంలో బయటవారిని ఎవరినీ అనుమతించకుండా రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా కొందరు తెలుగు యువత నాయకులు... సిట్ కార్యాలయం వెనుక వైపు గోడదూకి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ, రెవెన్యూ సిబ్బంది వారిని అడ్డుకుని లోపలికి రావొద్దని పదేపదే చెప్పినా వినకుండా గోడదూకేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో దౌర్జన్యానికి పాల్పడ్డారు. అక్రమంగా లోపలికి వచ్చేందుకు ప్రయత్నించినవారిపై వీఆర్వో మౌలాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చిన్నబాబు, ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం, అధికార ప్రతినిధి సజ్జ అజయ్, చందర్లపాడు మండల అధ్యక్షుడు కమ్మ గోపీచంద్, నందిగామకు చెందిన గుళ్లపల్లి ఠాగూర్బాబు, ఈపూరి వినోద్, ఏలూరు జిల్లా ఎన్ఆర్ పేటకు చెందిన నాయుడు పవన్ ఉన్నారని చెప్పారు. -
Live: చంద్రబాబు కేసు లైవ్ అప్డేట్స్.. Click & Refresh
LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates 7:01PM, అక్టోబర్ 11, 2023 ►మళ్లీ ఢిల్లీకి నారా లోకేష్ ►గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరిన నారా లోకేష్ 6:25 PM, అక్టోబర్ 11, 2023 మళ్లీ ఢిల్లీకి లోకేష్ ► విజయవాడ నుంచి ఢిల్లీకి నారా లోకేష్ ► ఎల్లుండి సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ ► పిటిషన్ అంశాలపై న్యాయవాదులతో మాట్లాడతానన్న లోకేష్ 6:20 PM, అక్టోబర్ 11, 2023 మొన్న దోమలు, నిన్న వేడినీళ్లు, నేడు ఉక్కపోత ► పెరిగిపోతున్న చంద్రబాబు డిమాండ్లు ► చంద్రబాబు రాజమండ్రి జైలులో ఇబ్బందిపడుతున్నారు : లోకేష్ ► ఉష్ణోగ్రతలు పెరిగాయి..రాజమండ్రిలో ఉక్కపోత ఎక్కువ ఉంది : లోకేష్ ► వేడి వల్ల చంద్రబాబు డీ హైడ్రేషన్ అవుతోంది : : లోకేష్ ► మాజీ సిఎంగా చంద్రబాబుకు జైల్లో క్లాస్ ఏ సౌకర్యాలు ఇవ్వాలి ► చంద్రబాబుకు అందాల్సిన క్లాస్ ఏ సౌకర్యాలు ఇవ్వాలి : లోకేష్ 6:15 PM, అక్టోబర్ 11, 2023 రింగ్ మాయ.. ఆవుల ముందస్తు బెయిల్ 17న విచారణ ► ఆవుల మునిశంకర్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా ► తదుపరి విచారణను ఈ నెల 17 కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన మాజీ మంత్రి నారాయణ బావమరిది ఆవుల మునిశంకర్ 6:15 PM, అక్టోబర్ 11, 2023 PT వారంటుపై రేపు విచారణ ► ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ రేపటికి వాయిదా ► ఏసీబీ కోర్టులో ఫైబర్ నెట్ కుంభకోణంపై స్పెషల్ పీపీ వివేకానంద వాదనలు ► ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన ముద్దాయి ► ఫైబర్ నెట్ స్కాం లో రూ. 115 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని సిట్ దర్యాప్తులో తేలింది ► సిట్ దర్యాప్తు లో చంద్రబాబు పాత్ర బయటపడడంతో కేసు నమోదు ► ఫైబర్ నెట్ స్కాం లో చంద్రబాబు పాత్రను గుర్తించిన తర్వాతే FIR లో చేర్చాం ► టెర్రా సాఫ్ట్ కి అక్రమ మార్గంలో టెండర్లు ఖరారు చేయడానికి అక్రమాలకు పాల్పడ్డారు ► టెర్రా సాఫ్ట్ కోసం నిబంధనలకు విరుద్ధంగా టెండర్ గడువును వారం రోజులు పొడిగించారు ► ఫైబర్ నెట్ స్కాం లో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది ► చంద్రబాబు సీఎం హోదాను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయి : 6:05 PM, అక్టోబర్ 11, 2023 లోకేషా, జవాబులు చెప్పలేక సాక్షిపై రంకెలా? ► రెండోరోజు ముగిసిన లోకేష్ సిఐడి విచారణ ► ఆరు గంటలపాటు సిఐడి అధికారులు విచారించారు ► ఇవాళ నా ముందు ఒక డాక్యుమెంట్ పెట్టారు ► భువనేశ్వరి ఐటీ రిటర్న్‌లకు సంబంధించి డాక్యుమెంట్ పెట్టారు ► లింగమనేని రమేష్ కు రెంటల్ అడ్వాన్స్ రూ.27 లక్షలు కట్టారని చెప్పారు ► రెంటల్ అడ్వాన్స్ కు సంబంధించి ఐటీ రిటర్న్‌ల్లో లేదని చెప్పారు ► ఐటీ రిటర్న్‌లకు సంబంధించి ఆడిటర్ ను అడగాలని చెప్పా ► ఇంట్లో ఉండి అద్దె చెల్లిస్తే క్విడ్‌ప్రోకో ఎలా అవుతుంది ► ఐఆర్ఆర్కు సంబంధించి నాలుగైదు ప్రశ్నలు అడిగారు ► నా శాఖకు సంబంధించి పలు ప్రశ్నలు పదేపదే అడిగారు ► ఈ కేసులో మరోసారి ఏమైనా లేఖ ఇస్తారా అని అడిగా ► హెరిటేజ్ కొనుగోలు చేసిన 9 ఎకరాలు గూగుల్ ఎర్త్‌లో చూపించారు ► ఐఆర్ఆర్ లో నాకు, కుటుంబసభ్యులకు ఎలాంటి పాత్ర లేదు ► పదేళ్లుగా కుటుంబసభ్యుల ఆస్తుల ప్రజల ముందుంచుతున్నా ► ఒక కంపెనీలో షేర్లు కొన్నందుకు కంపెనీ నిర్ణయాలపై నన్ను ప్రశ్నించారు ► నాకు టిసీఎస్ సహా అనేక కంపెనీల్లో షేర్లు ఉన్నాయి ► సాక్షి మీడియా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసేందుకు లోకేష్ ప్రయత్నం ► సాక్షి మీడియా : లింగమనేని ఇల్లు మీకెందుకు ఇచ్చారు? ► లోకేష్ : 2019 తర్వాత మేం రూ.27 లక్షల అద్దె చెల్లించాం ► సాక్షి మీడియా : మరి 2014-19 మధ్య కాలంలో అద్దె ఎందుకు చెల్లించలేదు? ► సమాధానం చెప్పకుండా సబ్జెక్ట్ మార్చిన లోకేష్ (ఈ ఇంటిని లింగమనేని ప్రభుత్వానికి ఇచ్చారని గతంలో ప్రకటించిన చంద్రబాబు) ► సాక్షి మీడియా : మీ పాదయాత్రలో అత్యంత క్లోజ్‌గా కనిపించిన కిలారు రాజేష్ నోటీసులు ఇవ్వగానే అమెరికా ఎందుకు పారిపోయారు? ► లోకేష్ : నాకు తెలియని ప్రశ్నలు నన్నెలా అడుగుతారు? చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారు ► సాక్షి మీడియా : రిమాండ్ ఇచ్చింది కోర్టులు అయితే.. ప్రభుత్వం జైల్లో పెట్టిందని ఎలా చెబుతారు? ► సమాధానం చెప్పలేక సాక్షి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్ 5:05 PM, అక్టోబర్ 11, 2023 ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుని కూడా విచారించాల్సి ఉంది: స్పెషల్ పిపి వివేకానంద ► ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబు ప్రదాన ముద్దాయిగా ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పిటి వారెంట్ పై వాదనలు వినిపించిన స్పెషల్ పిపి వివేకానంద ► ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 115 కోట్ల నిధులగోల్ మాల్ అయ్యాయని సిట్ దర్యాప్తులో తేలింది ► 2021 లోనే ఫైబర్ నెట్ కుంభకోణంపై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది ► సిట్ దర్యాప్తులో చంద్రబాబు పాత్ర బయటపడడంతో ఆయనపైనా కేసు నమోదు ► ఎ-1 ముద్దాయిగా వేమూరి హరిప్రసాద్, మాజీ ఎండి సాంబశివరావు ఏ-2గా, చంద్రబాబు ఏ-25గా ఎఫ్ఐఆర్ నమోదు అయింది ► ఫైబర్‌నెట్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రని గుర్తించిన తర్వాతే ఎఫ్ఐఆర్లో చేర్చాం ► టెర్రా సాఫ్ట్‌కి అక్రమ మార్గంలో టెండర్లు ఖరారు చేయడానికి అక్రమాలకి పాల్పడ్డారు ► టెర్రా సాఫ్ట్ కోసం నిబంధనలకి విరుద్దంగా టెండర్ గడువుని వారం రోజులు పొడిగించారు ► బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కి టెండర్ దక్కేలా అక్రమాలకి పాల్పడ్డారు ► ఫైబర్ నెట్ లో ఫేజు-1 లో 320 కోట్లకి టెండర్లు పిలిస్తే 115 కోట్ల అవినీతి జరిగింది ► టెర్రా సాప్ట్ కి టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు పక్కన పెట్టారు ► సివిల్ సప్లైస్ శాఖకి నాసిరకం ఇ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ► బ్లాక్ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్ ని రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు ► నిబంధనలకి విరుద్దంగా అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు టెర్రా సాఫ్ట్ ని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు ► టెర్రా సాఫ్ట్‌ని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించాలని చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు ► టెర్రా సాఫ్ట్‌కి టెండర్లు కట్టబెట్టేందుకు పలు అక్రమాలకు పాల్పడ్డారు ► టెర్రా సాఫ్ట్‌తో కన్సార్టియంలో భాగమైన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీ ► టెండర్లు దక్కించుకున్న తర్వాత టెర్రా సాఫ్ట్ నుంచి హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపించారు ► తమని మోసం చేసి నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ. 115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ని టెర్రా సాఫ్ట్ కొనుగోలు చేసి ఫైబర్ నెట్ కి సరఫరా చేసినట్లు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ ► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్మెంట్ రికార్డు చేసిన సీఐడీ ► ఈ కేసులో చంద్రబాబుని కూడా విచారించాల్సి ఉంది ► చంద్రబాబు సీఎం హోదాని అడ్డుపెట్టుకుని అక్రమాలకి పాల్పడినట్లు ఆధారాలున్నాయి ► ఫైబర్ నెట్ కేసులో పిటి వారెంట్ అనుమతించండి 4:10 PM, అక్టోబర్ 11, 2023 చంద్రబాబు పిటిషన్ డిస్మిస్ ► చంద్రబాబు లాయర్లు వేసిన రైట్ టు ఆడియెన్స్ పిటిషన్ డిస్మిస్ ► రైట్ టు ఆడియెన్స్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు ► చంద్రబాబుపై పెండింగ్ లో ఉన్న పీటీ వారెంట్ల పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు ► హైకోర్టు ఆదేశాలు, జరిగిన పరిణామాలను జడ్జికి వివరించిన ఇరుపక్షాల లాయర్లు ► కేసు వివరాలు, ఎంత మందిని అరెస్ట్ చేశామన్న విషయాన్నీ జడ్జికి వివరించిన సీఐడీ లాయర్ వివేకా 3:10 PM, అక్టోబర్ 11, 2023 తప్పు చేయలేదని కాకుండా అరెస్ట్ గురించి వాదిస్తారా? : చంద్రబాబు తీరుపై సజ్జల విమర్శలు ► చంద్రబాబు అరెస్టు అయి నెల దాటింది ► రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత స్కాం ఆధారాలు ఉన్నాయని కోర్టు నమ్మి రిమాండ్ వేసింది ► చంద్రబాబును ప్రోటోకాల్ ప్రకారం అరెస్టు చేయలేదనే ఆయన లాయర్లు, ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు ► అంతేతప్ప నేరం జరగలేదని ఒక్క ఆధారం కూడా చూపించలేక పోయారు ► రూ.3,300 కోట్ల ప్రాజెక్టు అని క్యాబినెట్ ఆమోదం పొంది, జీవోలలో మొత్తం మార్చేశారు ► అసలు రూ.3వేల కోట్ల ప్రాజెక్టు వస్తే రూల్స్ ప్రకారం ఏందుకు వ్యవహరించలేదు? ► ఫైనాన్స్ విభాగం కూడా ఇందులో తప్పులు ఉన్నాయని చెప్పినా వినిపించుకోలేదు ► దీనిపై ఎలాంటి స్టడీ చేయకుండా డబ్బు ఎలా రిలీజ్ చేశారు? ► ఆ ప్రాజెక్టుతో సంబంధం లేదని సీమెన్స్ కూడా చెప్పారు? ► ఈ ప్రాజెక్టు మొత్తం కుట్రపూరితంగా జరిగిందనేందుకు అనేక సాక్ష్యాలు ఉన్నాయి ► ఇవన్నీ చూశాకనే చంద్రబాబును అరెస్టు చేశారు ► సుదీర్ఘ విచారణ జరిగాకనే ఈడీ కూడా కొందరిని అరెస్టులు చేసింది ► అన్ని వేళ్లూ చంద్రబాబు పైనే చూపిస్తున్నాయి ► కోర్టుకు సీఐడీ ఆధారాలు చూపించటం వలనే రిమాండ్ కు పంపింది ► విచారణ జరిగితే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ► పెండ్యాల శ్రీనివాస్, కిలారి రాజేష్ ల ద్వారా చంద్రబాబుకు డబ్బు ఎలా చేరిందో ఆధారాలు దొరికాయి ► అందుకే కొందరిని దేశం దాటించారు ► ఈ కుట్రలో పాత్రధారి, సూత్రధారి చంద్రబాబే ► ఈ విషయాల గురించి మాట్లాడకుండా 17A గురించి కోర్టులో వాదిస్తున్నారు ► రెండు ఎకరాల నుండి లక్షల కోట్లకు ఎలా ఎదిగిందీ అందరికీ తెలుసు ► కానీ టెక్నికల్ ఆధారాలు చూపించి కేసుల నుండి జారుకునేవారు ► ఐతే స్కిల్ స్కాం కేసులో పక్కా ఆధారాలు దొరికాయి ► ప్రజాకోర్టులో కూడా చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి ► ప్రజలు కూడా చంద్రబాబు మోసాలపై నిలదీయాలి ► టీడీపీ నేతలు కూడా బయటకు వచ్చి మాట్లాడాలంటే సిగ్గు పడుతున్నారు ► లోకేష్ కూడా ఢిల్లీ వెళ్లి కూర్చుంటారు ► రాజధాని పేరుతో వేల ఎకరాల భూములను కూడా అలాగే కొట్టేశారు ► రైతులను, ప్రజలను నిలువునా మోసం చేశారు ► ఆయన మనమడికి కూడా లక్షల కోట్ల ఆస్తిని సిద్ధం చేయాలని ప్లాన్ వేశారు ► రింగ్ రోడ్డు స్కాంలో కూడా ఇలాంటి కుట్రే చేశారు ► వ్యవస్థలను మేనేజ్ చేయగలమనే ధీమాతో ఢిల్లీ నుండి కిందివరకు వ్యవహరిస్తున్నారు ► జైల్లో ఉండి కూడా బాబు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారనటం పెద్ద జోక్ ► టిడిపి లీడర్లు ఇలాంటి దిగజారిన స్టేట్మెంట్లు ఇచ్చి జుగుప్స కలిగిస్తున్నారు ► లోకేష్ ఢిల్లీలో ఉంటే ఒక్క జాతీయ పార్టీ ఐనా సానుభూతి చూపిందా? ► అడ్డంగా దొరికిన దొంగకి ఎవరు సపోర్టు చేస్తారు? ► రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు మంచి భద్రత ఉంది 3:02 PM, అక్టోబర్ 11, 2023 చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ► చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ► ఇన్నర్ రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసుల్లో విచారణకు చంద్రబాబు సహకరిస్తాడని చెప్పిన బాబు లాయర్లు ► చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దమ్మాలపాటి ► సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులను కోరిన కోర్టు ► ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దన్న కోర్టు ► అంగళ్లు కేసుల్లో రేపటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దన్న కోర్టు ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీ పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు 3:00 PM, అక్టోబర్ 11, 2023 మన వాళ్లు బ్రీఫ్డ్ మీ.. బాబును వెంటాడుతున్న పాపాలు ► సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు ► చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని 2017లో సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే ఆళ్ల పిటిషన్ ► ఓటుకు నోటు కేసు సీబీఐకి బదిలీ చేయాలని మరో పిటిషన్ ► తమ లాయర్ లూథ్రా అందుబాటులో లేరని చెప్పిన చంద్రబాబు లాయర్ ► విచారణ 4 వారాలు వాయిదా వేయాలని కోరిన బాబు లాయర్ ► అభ్యంతరం వ్యక్తం చేసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరఫు న్యాయవాది ► త్వరలోనే విచారణ తేదీని ఖరారు చేస్తామన్న సుప్రీంకోర్టు 2:55 PM, అక్టోబర్ 11, 2023 తప్పు చేసి.. రాజకీయ కక్ష అంటారా? : సజ్జల ► చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ► స్కిల్ స్కామ్ లో చంద్రబాబు సాక్ష్యాధారాలతోనే అరెస్టు అయ్యారు ► చంద్రబాబు అరెస్టు లో కక్ష సాధింపు ఎక్కడ ఉంది ? ► నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించగలరా ? ► రూ. 300 కోట్లకు పైగా ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారు ► ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేసుకున్నారు ► సీమెన్స్ సైతం మాకు సంబంధం లేదని చెప్పింది ► ఫేక్ ఇన్వాయిస్ లతో నిధులు పక్కదారి పట్టించారు ► నిందితుల్లో ఇద్దరు విదేశాలకు పారిపోయారు ► ఈ స్కామ్ కు సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే : సజ్జల 2:50 PM, అక్టోబర్ 11, 2023 ఏపి హైకోర్టుకు కొత్త జడ్జిల నియామకం ► ఏపి హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలను నియమించిన సుప్రీంకోర్టు ► జడ్జిలుగా సీనియర్ న్యాయవాదులు హరినాథ్ , కిరణ్మయి, సుమిత్, విజయ్‌లు ► ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు కొలీజియం 2:40 PM, అక్టోబర్ 11, 2023 హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ► ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై వాదనలు ► ఏసిబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్ లో ఉందన్న ఏజీ శ్రీరామ్ ► ఈ దశలో చంద్రబాబుకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దన్న ఏజీ శ్రీరామ్ ► ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చూపించే అవకాశం ఉందన్న బాబు తరపు లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ ► చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన దమ్మాలపాటి శ్రీనివాస్ 2:10 PM, అక్టోబర్ 11, 2023 ఢిల్లీ: చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు విచారణ వాయిదా ►సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా అందుబాటులో లేరు ►4 వారాలు వాయిదా వేయాలని కోరిన బాబు తరపు న్యాయవాది ►విచారణ తేదీని ఖరారు చేస్తామన్న ధర్మాసనం 2:01 PM, అక్టోబర్ 11, 2023 కాసేపట్లో చంద్రబాబు పిటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో విచారణ ►ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కుంభకోణాలపై సీఐడీ వేసిన వారెంట్లపై వాదనలు విననున్న ఏసీబీ కోర్టు 1:49 PM, అక్టోబర్ 11, 2023 ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న ఏజీ శ్రీరామ్ ►చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ►ఐఆర్ఆర్, అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు ►ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై తీర్పు పెండింగ్‌లో ఉంది: ఏజీ ►కాబట్టి మధ్యంతర బెయిల్ ఇవొద్దు ►మధ్యాహ్నం 2.15కి వాదనలు వింటానన్న ధర్మాసనం 12:35 PM, అక్టోబర్ 11, 2023 చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ►రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసుల్లో విచారణకు సహకరిస్తామన్న చంద్రబాబు న్యాయవాదులు ►చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దమ్మాలపాటి ►సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులను కోరిన కోర్టు ►పిటిషన్లపై మధ్యాహ్నం విచారణ చేపడతామన్న హైకోర్టు 12:33 PM, అక్టోబర్ 11, 2023 సెలవులో రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ ►రేపటి నుంచి 4 రోజులు సెలవు తీసుకోనున్న రాహుల్ ►ఇంఛార్జ్ సూపరింటెండెంట్‌గా డిప్యూటీ సూపరింటెండెంట్ రాజ్‌కుమార్‌కు బాధ్యతలు 11:45 AM, అక్టోబర్ 11, 2023 లోకేష్‌కు సీఐడీ ప్రశ్నలు ►రెండో రోజు కొనసాగుతున్న నారా లోకేష్ సీఐడీ విచారణ ►మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయాలపై సీఐడీ వరుస ప్రశ్నలు ►ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుకి ఒత్తిడి చేశారా లేదా? ►మీరు మంత్రి అవ్వగానే మంత్రి వర్గ ఉప సంఘంలో ఎందుకు చేర్చారు? ►మంత్రి వర్గ ఉప సంఘంలో ఇతర సభ్యులను ఒత్తిడి చేశారా కదా..? ►హెరిటేజ్, లింగమనేని, నారాయణ భూములకు లబ్ధి చేసేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారు? ►ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పరిహారాన్ని భారీగా పెంచడంలో మీ పాత్ర ఉంది కదా? ►భూ సేకరణ వ్యయాన్ని 210 కోట్లు అదనంగా ఎందుకు పెంచారు? ►లింగమనేని రమేష్ మీకు ఎందుకు ఇల్లు ఉచితంగా ఇచ్చారు ►లింగమనేనికి మేలు చేసినందుకే మీకు ఇంటిని క్విడ్ ప్రోకోలో ఇచ్చారు కదా? ►ఇన్నర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ వ్యయాన్ని అదనంగా పెంచేందుకు సిఫార్స్ చేశారా? 11:45 AM, అక్టోబర్ 11, 2023 చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ►ఇన్నర్ రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసులో మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాదనలు వింటామన్న హైకోర్టు 11:19 AM, అక్టోబర్ 11, 2023 ఐఆర్ఆర్ కేసులో సీఐడీ విచారణకు నారాయణ అల్లుడు పునీత్ ►ఐఆర్ఆర్లో నారా లోకేష్, పునీత్ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సీఐడీ గుర్తింపు ►ఐఆర్ఆర్ కేసులో విచారణకు హాజరుకావాలని ఈ నెల 6న సీఐడీ నోటీసులు 10:10 AM, అక్టోబర్ 11, 2023 రెండో రోజు విచారణకు లోకేశ్ ►నారా లోకేశ్‌ను రెండో రోజు విచారిస్తున్న ఏపీ సీఐడీ ►సిట్ కార్యాలయంలో నారా లోకేశ్. ►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేశ్. ►తొలిరోజు నారా లోకేశ్ పొంతనలేని సమాధానాలు. ►సీఐడీ విచారణకు హాజరైన మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ 09:58 AM, అక్టోబర్ 11, 2023 చంద్రబాబు పై సీఐడీ పీటీ వారెంట్ల పై నేడు విచారణ ►నేడు విచారించనున్న విజయవాడ ఏసీబీ కోర్టు ►విచారణ అనంతరం ఆర్డర్ ఇవ్వనున్న న్యాయమూర్తి ►ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్లు 09:56 AM, అక్టోబర్ 11, 2023 మాజీమంత్రి నారాయణ బంధువు ముందస్తు బెయిల్ పిటిషన్ ►మునీశంకర్ బెయిల్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ►IRR కేసులో నిందితుడిగా చేరుస్తూ సీఐడీ పిటిషన్ 09:50 AM, అక్టోబర్ 11, 2023 సిట్ కార్యాలయానికి బయల్దేరిన నారా లోకేష్ ►రెండో రోజు లోకేష్‌ను ప్రశ్నించనున్న సీఐడీ ►ఐఆర్ఆర్ కేసులో లోకేష్‌ను విచారించనున్న అధికారులు ►నిన్న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు విచారించిన సీఐడీ ►నిన్న లోకేష్‌కు 30 ప్రశ్నలు వేసిన సీఐడీ అధికారులు ►హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్న సమంయలో లోకేష్ తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నించిన సీఐడీ ►నేడు లోకేష్‌తో పాటు విచారణకు మాజీమంత్రి నారాయణ అల్లుడు, లోకేష్, పునీత్‌ను వేర్వేరుగా విచారించనున్న సీఐడీ 09:14 AM, అక్టోబర్ 11, 2023 జైల్లో ఆరోగ్యంగానే ఉన్న చంద్రబాబు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 32వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►చంద్రబాబు పూర్తిస్థాయిలో జైల్లో భద్రత ►చంద్రబాబు స్వల్ప అస్వస్థత గురయ్యారని డీహైడ్రైజేషన్ లోనయ్యారని పచ్చ మీడియా హడావిడి ►ఎండ ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిగా ఉందని వైద్యాధికారికి చెప్పిన చంద్రబాబు ►దాంతో చంద్రబాబుకు మూడుసార్లు వైద్య పరీక్షలు జరిపిన జైలు అధికారులు ►ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసిన అధికారులు 08:13 AM, అక్టోబర్ 11, 2023 చంద్రబాబు పిటి వారెంట్లపై ఏసీబీ కోర్టులో నేడు విచారణ ►ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కుంభకోణాలపై సీఐడీ వేసిన పిటి వారెంట్లపై వాదనలు విననున్న ఏసీబీ కోర్టు ►నిన్న ఏసీబీ న్యాయమూర్తి సెలవు కావడంతో విచారణ నేటి మధ్యాహ్నానికి వాయిదా ►రైట్ టు ఆడియన్స్ పిటీషన్ ప్రకారం తమ వాదనలు వినాలని పట్టుబట్టిన చంద్రబాబు న్యాయవాదులు ►పిటి వారెంట్లలో రైట్ టు ఆడియన్స్ పిటీషన్ వర్తించదంటున్న సీఐడీ తరపు న్యాయవాదులు ►రైట్ టు ఆడియన్స్ పిటీషన్ వర్తిస్తుందా లేదా అనేది నిర్ణయించనున్న కోర్టు ►నేటి మధ్యాహ్నం 2.30 గంటల ప్రారంభం కానున్న వాదనలు ►చంద్రబాబు బెయిల్ పిటీషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు ►కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున చంద్రబాబుకి బెయిల్ ఇవ్వద్దని వాదనలు వినిపించిన సీఐడి న్యాయవాదులు ►చంద్రబాబు సాక్షులని ప్రభావితం చేస్తున్నారని వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు ►సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ చంద్రబాబు బెయిల్ పిటీషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు 07:31 AM, అక్టోబర్ 11, 2023 అత్యవసర విచారణ కుదరదు ►సాధారణ పద్ధతిలోనే ఆ పిటిషన్లను విచారణ చేస్తాం ►ఐఆర్ఆర్, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు.. నేడు విచారణ ►నారాయణ, ఆయన బావ మరిది పిటిషన్లపై నేడు విచారణ 07:13 AM, అక్టోబర్ 11, 2023 సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరించాలి: మంత్రి తానేటి వనిత ►అప్పుడే నిజాలు బయటకు వస్తాయి ►కేసుల్లో తీవ్రత ఉంది కాబట్టే బెయిల్ రావడం లేదు ►కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు.. బాబు తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారు ►చంద్రబాబును మోయడం తప్ప పవన్ కళ్యాణ్‌కు మరే ఎజెండా లేదు 07:04 AM, అక్టోబర్ 11, 2023 అన్నిటా బాబు బాటలోనే.. ►అవినీతికి పాల్పడటంలోనే కాదు.. సీఐడీ దర్యాప్తునకు సహకరించని లోకేష్ ►మొండికేయడంలో తండ్రి చంద్రబాబు బాటనే అనుసరించిన లోకేశ్ ►విచారణను తప్పించుకునేందుకు బెడిసికొట్టిన యత్నాలు ►అనివార్యంగా లోకేశ్ సీఐడీ ఎదుట హాజరు ►సీఐడీ అధికారులు ఏ ప్రశ్న అడిగినా తనకు తెలీదనే సమాధానం 06:57 AM, అక్టోబర్ 11, 2023 తెలుగు యువత నాయకుల అత్యుత్సాహం ►సీఐడీ సిట్ కార్యాలయం గోడలు దూకేందుకు ప్రయత్నం ►అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం ►ఏడుగురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు 06:47 AM, అక్టోబర్ 11, 2023 తత్తరపాటు.. బిత్తర చూపులు! ►ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాలపై సీఐడీ ►విచారణలో లోకేశ్ తడబాటు.. అసహనం ►అబ్బే నాకేం తెలీదు... మరి ఈ సంతకాలు మీవే కదా? ►ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాలపై ప్రశ్నించిన అధికారులు ►హెరిటేజ్ భూముల కొనుగోలు దందాపై ప్రశ్నల వర్షం ►సంతకాలతో సహా ఆధారాలను చూపిస్తూ సూటిగా ప్రశ్నలు ►కలవరపాటుతో న్యాయవాదులతో చినబాబు మంతనాలు ►ఆరు గంటల పాటు విచారణ.. నేడు మరోసారి విచారణ చంద్రబాబు అవినీతి చేశాడా లేదా ? సీమెన్స్ వాళ్ళు ఇస్తామన్న రూ.3,000 కోట్లు ఇచ్చారా ? ఇస్తే ఏమయ్యాయి. వీటికి రామోజీ, టీడీపీ సమాధానం చెప్పాలి.#BanYellowMediaSaveAP#GajadongaChandrababu#SkilledCriminalCBNInJail #CorruptionKingCBN pic.twitter.com/yzjhFzOVbq — YSR Congress Party (@YSRCParty) October 10, 2023 -
నారా లోకేష్‌కు మళ్లీ సీఐడీ నోటీసులు
సాక్షి, విజయవాడ: అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు విచారణ ముగిసింది. మంగళవారం ఆరు గంటలపాటు విచారించిన ఏపీ సీఐడీ.. విచారణలో సహకరించకపోవడంతో మళ్లీ నోటీసులు జారీ చేసింది. రేపు కూడా విచారణకు రావాలంటూ ఆయన్ని అధికారులు నోటీసుల్లో కోరారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసుకు సంబంధించి ఇవాళ నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ అధికారులు 50 దాకా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంటరాగేషన్‌లో లోకేష్ కీలక అంశాలకు సమాధానం ఇవ్వలేదు. చాలా ప్రశ్నలకు ఆయన నీళ్లు నమిలినట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆరు గంటలపాటు సాగిన విచారణలో.. చాలా ప్రశ్నలకు లోకేష్ తెలియదనే సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు.. చాలా ప్రశ్నలకు ఆయన పదే పదే లాయర్ల దగ్గరికి వెళ్లినట్లు తెలుస్తోంది. సీఐడీ విచారణలో.. హెరిటేజ్ బోర్డు మీటింగ్ నిర్ణయాలపై లోకేష్‌ను అధికారులు ప్రశ్నించగా.. తనకు తెలియదనే ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో.. లోకేష్ హాజరై స్వయంగా సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు సీఐడీ అధికారులు చూపించడంతో ఆయన ఖంగుతిన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. హెరిటేజ్ భూములు ఆ ప్రాంతంలోనే ఎందుకు కొన్నారని సీఐడీ ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానం ఇచ్చారని, కీలక అంశాలపై దాటవేత ధోరణిని ప్రదర్శించారు కాబట్టే.. మరోసారి ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉందని ఏపీ సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్చారన్నది నారా లోకేష్‌పై ఉన్న ప్రధాన అభియోగం. లోకేశ్ పాత్రకు సంబంధించి కీలకమైన 129 ఆధారాలను ఏపీ సీఐడీ సిట్ బృందం గుర్తించి, జప్తు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు ఏ1గా, మాజీ మంత్రి నారాయణ ఏ2గా, హెరిటేజ్ సంస్థ ఏ6గా, నారా లోకేష్‌ను ఏ14గా చేర్చింది ఏపీ సీఐడీ. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ పిటిషన్ వేయగా.. ఏపీ హైకోర్టు దానిని కొట్టేసింది. విచారణకు సహకరించాలని లోకేష్‌కు సూచిస్తూనే.. మరోవైపు 41ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాలని సీఐడీ పోలీసులకు తెలిపింది. దీంతో.. ఢిల్లీకి వెళ్లి మరీ లోకేష్‌ను నోటీసులు ఇచ్చి వచ్చారు. ఈ క్రమంలో కోర్టు నుంచి స్వల్ప ఊరట పొందిన లోకేష్‌ను ఇవాళ ఏపీ సీఐడీ విచారణ చేపట్టింది. -
నారాయణ అల్లుడికి హైకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, విజయవాడ: నారాయణ అల్లుడు పునీత్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని పునీత్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ నోటీస్ క్వాష్ చేయాలన్న పునీత్ పిటిషన్‌ను కోర్టు డిస్పోజ్ చేసింది. న్యాయవాదితో కలిసి రేపు సీఐడీ విచారణకు హాజరుకావాలని పునీత్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. కొత్త కోణాలు వెలుగులోకి టీడీపీ హయాంలో అమరావతి భూదోపిడీ పర్వంలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు..! మాకేం తెలియదంటూ చంద్రబాబు, నారాయణ, లోకేశ్ బృందం ఎంత బుకాయిస్తున్నా అక్రమాలు ఒక్కొక్కటిగాబయటపడుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ గురించి తమకు ముందుగా ఏమాత్రం తెలియదన్న వారి వాదనలో నిజం లేదని తేలిపోయింది. రైతులు, ఇతరుల ప్రయోజనాలను దెబ్బ తీయడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును కూడా అటకెక్కించినట్లు బహిర్గతమైంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలకు పాల్పడటం ద్వారా భారీ లబ్ధికి మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణ పక్కా ప్రణాళిక రచించారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబం, తమ బినామీల భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించేలా అలైన్మెంట్లో మూడు సార్లు మార్పులు చేసి మరీ ఖరారు చేశారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించి తాము ముందస్తుగానే ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరచాలని షరతు విధించారు. అప్పటికే తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించుకున్నారు. తద్వారా అటు అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధిలో ఇటు నదికి అవతల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తమ భూముల ధరలు అమాంతం పెరిగేలా కుట్ర పన్నారు. చదవండి: తోడు దొంగల ‘రింగ్’! -
చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. శుక్రవారానికి(13వ తేదీ) మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ‘‘17A.. అవినీతి పరులను కాపాడుకోవడం కోసం కాదు. నిజాయితీ పరులను కాపాడుకోవడం కోసమే. చంద్రబాబుకు 17ఏ వర్తించదని’’ ముకుల్ రోహత్గీ వాదించారు. యశ్వంత్ సిన్హా కేసును ప్రస్తావన.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే 17ఎ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను ప్రస్తావించారు. రఫేల్ కొనుగోళ్లపై యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్, అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు. రఫేల్ కేసులో జస్టిస్ కేఎం జోసెఫ్ ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. రఫేల్ కేసు ఆరోపణలు 2016కు సంబంధించినవి. 2019లో యశ్వంత్ సిన్హా పిటిషన్లపై తీర్పులు వచ్చాయి. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే 2019లో కేసు కొట్టేశారు. ‘1988 అవినీతి నిరోధక చట్టం’ ప్రకారం పోలీసులకు ఇన్వెస్టిగేషన్ జరిపే హక్కు ఉండదు. ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసుల బాధ్యత మాత్రమే. అన్నిరకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు సెక్షన్ 17ఎతో రక్షణ లభించింది’’అని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులను ఈ సందర్భంగా సాల్వే ప్రస్తావించారు. పూర్వ అంశాలకు కూడా వర్తించేలా ఆర్టికల్ 20(1)పై వచ్చిన తీర్పును ఆయన ఉదహరించారు. స్పందించిన జస్టిస్ అనిరుద్ధ బోస్.. సుప్రీంకోర్టులో తీర్పులు ఉన్నప్పుడు మిగిలిన హైకోర్టుల తీర్పుల ప్రస్తావన అవసరం లేదన్నారు. చంద్రబాబుకి వర్తించదు: రోహత్గీ 2018కి ముందు విచారణ కొంతవరకు జరిగి నిలిచిపోయిందని.. అంతమాత్రాన విచారణ జరగనట్లు కాదని సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ‘‘2018 మేలో మెమో దాఖలు చేశారు. అందులో తగిన వివరాలు ఉన్నాయి. మెమోకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బెంచ్ ముందు ఉంచుతున్నాం. విచారణ ముగిశాక పత్రాలు ఇచ్చామన్న దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాదనలు జరుగుతున్నప్పుడు 400 పేజీల బండిల్‌ను హైకోర్టు బెంచ్ ముందుంచారు. మేం కూడా అదేరోజు అవసరమైన డాక్యుమెంట్లను కోర్టు ముందుంచాం. 2018 చట్టసవరణ తర్వాత చంద్రబాబును ఎఫ్ఐఆర్లో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదు. ఆయనపై తగినన్ని ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేశారు. కేసులో చంద్రబాబును ఎప్పుడు చేర్చినప్పటికీ విచారణ కొనసాగుతున్నట్లుగానే పరిగణించాలి. చట్టసవరణకు ముందున్న ఆరోపణలకు అంతకుముందున్న చట్టమే వర్తిస్తుంది. చట్టసవరణకు ముందున్న నేరం కాబట్టి 17ఎ వర్తించదు. 2014-15 మధ్య ఈ స్కాం జరిగింది. 2018 లో 17A రాకముందే నేరం జరిగింది. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు కాదు. 2021లోనే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినా, 2023లో బాబు అరెస్ట్ జరిగింది. జిఎస్టీ పుణె ఫిర్యాదు ఆధారంగా కేసు ప్రారంభమైంది. దీని రిఫరెన్స్ రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. 17-A తెచ్చింది నిందితుల రక్షణ కోసం కాదు, నిజాయితీ కల అధికారుల రక్షణ కోసమే. 17-A గొడుగు కింద అవినీతి పరులు తప్పించుకోలేరు, నిజాయితీ పరులకు ఇది సహాయపడుతుంది. ప్రభుత్వ విధుల్లో దుర్వినియోగం చేశారా ? లేదా అన్నది విచారణలోనే తేలుతుంది ’’ అని రోహత్గీ తన వాదనలు వినిపించారు. ఈ క్రమంలో వాదనలు సుదీర్ఘంగా కొనసాగగా.. సమయం సరిపోదని, మిగతా వాదనలు వచ్చే విచారణలో వింటామని తెలిపింది. ఇక.. తదుపరి విచారణకు హరీష్ సాల్వే వర్చువల్‌గా హాజరు కానున్నట్లు తెలిపారు. సాక్షి వాట్సాప్ ఛానెల్‌తో ముఖ్యమైన వార్తల కోసం క్లిక్ చేయండి -
ఆకలే ఆమెకు శాపమైంది.. ఒక్కగానొక్క కూతురు ఇలా..
సాక్షి, పెందుర్తి: తమ కూతురు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు విధి తీరని విషాదం నింపింది. భోజనం చేసేందకు రోడ్డు దాటేందుకు ప్రయత్నించడమే ఆమె పాలిట శాపమైంది. బైక్ ఢీకొనడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నంద్యాల పట్టణానికి చెందిన ముల్లా షహీద(23) కుటుంబం ఉపాధి కోసం విశాఖ వలస వచ్చారు. ఆమె తల్లిదండ్రులు పెందుర్తి గాంధీనగర్‌లో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. కాగా, వీరికి ఒక్కగానొక్క కుమార్తె షహీద. అయితే, షహీద.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం పాఠశాలకు వెళ్లిన ఆమె.. స్కూల్లో ఒక విద్యార్థి భోజనం తీసుకురాకపోవడంతో తన భోజనాన్ని సదరు విద్యార్థికి ఇచ్చేశారు. ఇక, సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు ఆకలి వేయడంతో ఆమె ఇంటికి సమీపంలోనే ఓ బండి వద్ద పునుగులు తిన్నారు. అనంతరం నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా అతి వేగంగా దూసుకొచ్చిన బైక్.. ఆమెను ఢీకొట్టింది. దీంతో, షహీదా కుప్పకూలి కిందపడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఆమె కాలు విరిగిపోగా, చేతికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ట్రాఫిక్ పోలీసుల సహకారంతో 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలిస్తుండగా తీవ్ర రక్తస్రావం కావడంతో మార్గ మధ్యలోనే మృతి చెందారు. దీంతో, ఒక్కగానొక్క కూతురు ఇలా అర్ధాంతరంగా మృతిచెందడంతో పేరెంట్స్ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇక, ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పెందుర్తి సీఐ మరడాన శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రమాదానికి కారణమైన పురుషోత్తపురం ప్రాంతానికి చెందిన యువకుడు రవితేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతివేగం ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. ఇది కూడా చదవండి: రూ. కోట్లకొద్దీ డబ్బు, బంగారం స్వాధీనం -
Oct 10th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates 07:31PM, అక్టోబర్ 10, 2023 చంద్రబాబు పాపాలు పండాయి ►కేసు క్లోజ్ చేసుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు ►టెక్నికల్ అంశాలతో చంద్రబాబుకి రిలీఫ్ రాదు ►మేం అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే చంద్రబాబును జైల్లో పెట్టలేదు ►చంద్రబాబు ఏరకమైన దోపిడీకి శ్రీకారం చుట్టాడో అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాం ►చంద్రబాబు ప్రమేయం ఉందని తేలాకే అరెస్టు చేశారు ►చంద్రబాబు దోపిడీని కూడా కోర్టులు నమ్మాయి ►ముందస్తు బెయిల్స్ , క్వాష్ పిటిషన్ వేస్తే కోర్టులు కొట్టేశాయి ►అవినీతి , తప్పు చేయలేదని చంద్రబాబు ఎక్కడా చెప్పడం లేదు ►17ఏ ప్రకారం తనను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలనే అంటున్నాడు ►కోట్లు తీసుకునే చంద్రబాబు ఢిల్లీ లాయర్లు కూడా అదే చెబుతున్నారు ►చంద్రబాబు తన జీవితంలో 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు ►కేవలం టెక్నికల్ అంశాలను బేస్ చేసుకుని స్టేలు తెచ్చుకుంటాడు ►2016లోనే స్కిల్ స్కామ్ మీద సీఐడీ వాళ్లు ఎఫ్ఐఆర్ వేశారు ►ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఆపుకుంటూ వచ్చాడు ►చంద్రబాబు రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించాడు ►హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయని భువనేశ్వరి చెబుతున్నారు ►హెరిటేజ్ ఆస్తుల విలువ 20 వేల కోట్లని భువనేశ్వరి స్వయంగా ప్రజలకు చెప్పారు ►ఒక్క హెరిటేజ్ లో 20 వేల కోట్లు వైట్ మనీ ఐతే ... 70 వేల కోట్లు బ్లాక్ మార్కెట్ ఉంటుంది ►చంద్రబాబుకు కొండాపూర్ , మాదాపూర్ , అమరావతి , సింగపూర్ , దుబాయ్ లో లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి ► వినేవాడుంటే చంద్రబాబు హరికథ ఇంగ్లీష్ లో చెబుతాడు ►ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడు చంద్రబాబు ►రెండెకరాల పొలం నుంచి లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి చంద్రబాబు ►చంద్రబాబు పాపాలు పండాయి.. ఇప్పుడు బయట పడ్డాయి ►తన 14 ఏళ్ల పరిపాలన చూసి ఓటేయమని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా ►నేను మంచి చేశానని నమ్మితేనే ఓటేయమని అడిగే దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి :::మాజీ మంత్రి,కొడాలి నాని కామెంట్స్ 07:03PM, అక్టోబర్ 10, 2023 సీఎం జగన్ ప్రకటించినా.. ఏడుపే: YSRCP ►చంద్రబాబుపై తనకి ఎలాంటి కక్ష లేదన్న సీఎం వైఎస్ జగన్ ►బహిరంగంగా ప్రకటించినా టీడీపీ ఏడుపు ►2019లో చిత్తుగా ఓడిన తర్వాత టీడీపీ, బాబు అంపశయ్యపైకి ► ఎల్లో మీడియా కష్టపడి జాకీలేసి లేపే ప్రయత్నం చేసినా.. అవినీతి బయటపడి మరింత పాతాళంలోకి ►నిజంగా బాబుపై కక్ష సాధించాలనుకుంటే..? అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లు ఎదురుచూడాలా..? ► మీ బాబు నిప్పు.. తుప్పు అని ఎగిరెగిరి పడుతున్నారు కదా..? ► మరి.. క్వాష్ పిటీషన్లు వేసి పరువు తీసుకోవడం ఎందుకు? ► నిజాయతీగా విచారణ ఎదుర్కోవచ్చు కదా 06:45PM, అక్టోబర్ 10, 2023 రేపు హైకోర్టు ముందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును లంచ్‌మోషన్‌లో స్వీకరించాలని కోరిన బాబు లాయర్లు ► బాబు బెయిల్ పై వాదనలు వినాలని కోరిన చంద్రబాబు లాయర్లు ► రేపు రెగ్యులర్ కోర్టులో విచారిస్తామన్న హైకోర్టు ► ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులపై విచారణ రేపటికి వాయిదా ► సీఐడీ విచారణలో తన ఆరోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకోవాలని నారాయణ పిటిషన్ (చదవండి : బాబు సృష్టించిన మాయా ప్రపంచం, కరకట్ట రీఅలైన్మెంట్ పేరిట ఏం జరిగింది?) 06:15PM, అక్టోబర్ 10, 2023 నారాయణ అల్లుడికి హైకోర్టులో దక్కని ఊరట ► ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ పిటిషన్ ► సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని కోరిన పునీత్ ► పునీత్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు ► సీఐడీ విచారణకు సహకరించాలన్న హైకోర్టు ► న్యాయవాదుల సమక్షంలో విచారించాలని ఆదేశం ► ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పునీత్‌ను ప్రశ్నించనున్న దర్యాప్తు అధికారులు 06:25PM, అక్టోబర్ 10, 2023 తప్పు చేయలేదన్న వాదన కాదు, అరెస్ట్ గురించి బాబు బాధ : అంబటి ► చంద్రబాబు చట్టం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు : మంత్రి అంబటి ► చంద్రబాబు స్కాం చేయలేదని చెప్పలేకపోతున్నారు ► దొంగలు దొరికిపోయారని ప్రజలకు తెలిసిపోయింది ► టెక్నికల్ అంశాలపైనే చంద్రబాబు లాయర్లు ► వాదనలు వినిపిస్తున్నారు తప్పు....నేరం చేయలేదని చెప్పడం లేదు ► చట్టంలో లొసుగులున్నాయా అని చంద్రబాబు వెతుకులాట ► గతంలో అనేకసార్లు విచారణల నుంచి చంద్రబాబు తప్పించుకున్నారు ► సీఐడీ అన్ని ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ చేసింది ► దొంగ అన్ని సార్లు తప్పించుకోలేడని బాబు విషయంలో రుజువైంది ► ఇన్ని రోజులు లోకేష్ ఢిల్లీ ఓపెన్ జైలులో ఉన్నారు ► పురంధేశ్వరి బంధుత్వ ప్రేమతో ఆరాటపడుతున్నారు ► పురంధేశ్వరి తన మరిదిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ► చంద్రబాబును కాపాడేందుకు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు ► మంత్రి రోజా బండారు వ్యాఖ్యలను పురంధేశ్వరి ఖండించలేదు ► చంద్రబాబును పార్టీని కాపాడేందుకే పవన్ రాజకీయాలు ► కాపుల ఓట్లను చంద్రబాబుకు అమ్మేందుకు పవన్ పార్టీ పెట్టారు ► అది జనసేన కాదు బాబు సేన అని ప్రజలు గమనించారు 06:05PM, అక్టోబర్ 10, 2023 జైల్లో ముగిసిన ములాఖత్ ► రాజమండ్రి సెంట్రల్ జైలు :చంద్రబాబుతో ముగిసిన ములాఖత్ ► చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి, పయ్యావుల కేశవ్ ► ముందు కుటుంబసభ్యులతో మాట్లాడిన చంద్రబాబు ► అనంతరం పయ్యావుల కేశవ్‌తో చంద్రబాబు మంతనాలు ► ఇవ్వాళ సుప్రీంకోర్టులో జరిగిన కేసు పరిణామాలపై చర్చించినట్టు సమాచారం ► జనసేనతో పొత్తు పెట్టుకుంటే పర్యవసనాలపై చర్చ ► ఇటీవల బహిరంగ సభలో తెలుగుదేశం బలహీనపడిందని ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ 06:00 PM, అక్టోబర్ 10, 2023 లోకేష్‌కు ఎందుకంత ఉలుకు : మంత్రి ఆదిమూలపు ► అన్ని ఆధారాలతోనే చంద్రబాబు పై సీఐడీ కేసు పెట్టింది ► కేసులకు భయపడుతున్న లోకేష్ ఇప్పటివరకు ఢిల్లీ వెళ్లి కూర్చున్నాడు ► 20 మంది లాయర్లను పక్కనపెట్టుకుని బెయిల్ కోసం ప్రార్థనలు చేస్తున్నాడు ► IRR, ఫైబర్ నెట్ స్కామ్ లో లోకేష్ పాత్ర స్పష్టం : మంత్రి ఆదిమూలపు 05:55PM, అక్టోబర్ 10, 2023 పవన్ కల్యాణ్ కు వైరల్ ఫీవర్ ► జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు జ్వరం ► రేపు జరగాల్సిన జనసేన విస్తృతస్థాయి సమావేశం వాయిదా ► పవన్ కు వైరల్ ఫీవర్ వచ్చిందంటూ భేటీ వాయిదా వేసిన జనసేన ► రేపటి ఎజెండాలో క్షేత్ర స్థాయిలో టీడీపీతో కలిసి వెళ్లే అంశంపై జరగాల్సిన చర్చ ► పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేయాల్సిన పవన్ కళ్యాణ్ ► త్వరలో మరో తేదీ ప్రకటిస్తామన్న జనసేన నేతలు 05:35PM, అక్టోబర్ 10, 2023 మళ్లీ రేపు రమ్మన్నారు : లోకేష్ ► సీఐడీ అధికారులు నాకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారు : లోకేష్ ► నన్ను 50 ప్రశ్నలు అడిగారు, లేని ఇన్నర్ రింగ్ రోడ్డుపై ప్రశ్నించారు ► నాకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధం లేదు ► గూగుల్‌లో దొరికే సమాచారంపై నన్ను ప్రశ్నించారు ► మళ్లీ రేపు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని చెప్పారు ► సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపించకుండా విచారించారు ► వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చా 04:15PM, అక్టోబర్ 10, 2023 నాకేం తెలియదు: నారా లోకేష్ ►సీఐడీ విచారణలో నీళ్లు నములుతున్న నారా లోకేష్ ►అధికారులు అడిగిన ప్రతీ ప్రశ్నకు తెలియదనే సమాధానం ►హెరిటేజ్ బోర్డు మీటింగ్ నిర్ణయాలపై లోకేష్‌ను ప్రశ్నించిన సీఐడీ ►హేరిటేజ్ నిర్ణయాలు తనకు తెలియదని లోకేష్ సమాధానం ►లోకేష్ హాజరై స్వయంగా సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు చూపించిన సీఐడీ ►ఖంగుతిని తన లాయర్ల లాయర్ల వద్దకు వెళ్లి ఏం చెప్పాలో తెలుసుకున్న లోకేష్ ►హెరిటేజ్ భూములు ఆ ప్రాంతంలోనే ఎందుకు కొన్నారని సీఐడీ ప్రశ్న ►పొంతన లేని సమాధానం చెప్పిన లోకేష్ ►విచారణలో మాటిమాటికి లాయర్ల దగ్గరికి వెళ్లి వస్తున్న లోకేష్ 03:53PM, అక్టోబర్ 10, 2023 చంద్రబాబుతో ములాఖత్ కోసం.. ►చంద్రబాబుతో మలాఖత్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు కుటుంబ సభ్యులు ►భువనేశ్వరి, బ్రాహ్మణిలతో పాటు సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ► 45 నిమిషాల పాటు కొనసాగనున్న ములాఖత్ 02:40PM, అక్టోబర్ 10, 2023 నారాయణ అల్లుడికి హైకోర్టులో ఎదురుదెబ్బ ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌కు సీఐడీ నోటీసులు ►హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పునీత్ ►సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని పునీత్ పిటిషన్ ►పునీత్ పిటిషన్‌ను డిస్పోజ్ చేసి.. న్యాయవాదితో కలిసి రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన హైకోర్టు 02:29PM, అక్టోబర్ 10, 2023 లంచ్ తర్వాత ప్రారంభమైన లోకేష్ విచారణ ►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌ను ప్రశ్నిస్తున్న సీఐడీ ►ఏ14గా నారా లోకేష్ పేరును చేర్చిన సీఐడీ ►ఉదయం మూడు గంటలపాటు విచారించిన సీఐడీ ►ఆన్లైన్మెంట్ మార్పులో ముందస్తు సమాచారంపై లోకేష్‌కు ప్రశ్నలు ►హెరిటేజ్ భూముల కొనుగోలుపైనా ప్రశ్నలు ►భోజన విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన విచారణ 02:08PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టు : శుక్రవారం మిగతా వాదనలు ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సాల్వే మరో గంట వాదనలు ►అనంతరం కౌంటర్ వాదనలు వినిపించిన CID లాయర్ ముకుల్ రోహత్గీ 1:30 PM, అక్టోబర్ 10, 2023 జైల్లో చంద్రబాబును కలవనున్న కుటుంబ సభ్యులు ► రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు కుటుంబ సభ్యులు ► మధ్యాహ్నం మూడున్నరకు చంద్రబాబుతో ములాఖత్ ► బాబును కలవనున్న భువనేశ్వరి, బ్రాహ్మణి ► కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్ 1:15 PM, అక్టోబర్ 10, 2023 చంద్రబాబు కేసులో ఏం జరగవచ్చు? : నిపుణులు ఏమంటున్నారు? ► ఇరు వర్గాల వాదన భిన్నంగా ఉన్నాయి ► FIR కొట్టేయడానికి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎలాంటి ఆస్కారం లేదు ► అయితే అవినీతి నిరోధక చట్టంపై విస్తృతంగా పరిశీలన జరపాల్సి రావొచ్చు ► అవసరమయితే ఈ ఒక్క విషయంలో (17a) కేసును విస్తృత ధర్మాసనానికి నివేదించవచ్చు.! #CBN challenge to Sec 17A in Supreme Court is likely to be transferred to Constitution Bench which is to hear from Nov 20. Though FIR is unlikely to be quashed, any relief would be for PC Act provisions only. IPC provisions, 409, 468, 471 will continue to stay in FIR. 🙏🙏🙏 — PVS Sarma (@pvssarma) October 10, 2023 1:15 PM, అక్టోబర్ 10, 2023 విజయవాడ : ACB కోర్టులో బాబు కేసులు వాయిదా ► ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసులలో పిటి వారెంట్లపై విచారణ ► రేపటికి వాయిదా వేసిన ACB కోర్టు 1:10 PM, అక్టోబర్ 10, 2023 గుంటూరు జిల్లా : CID కార్యాలయంలో లోకేష్ విచారణ ► సీఐడీ కార్యాలయంలో లోకేష్‌ను ప్రశ్నించిన అధికారులు ► మధ్యాహ్నం ఒంటిగంటకు నారా లోకేష్‌కు లంచ్ బ్రేక్ ► గంట పాటు లంచ్ బ్రేక్ ► లోకేష్‌కు ఇంటి నుంచి భోజనం తెచ్చిన వ్యక్తిగత సిబ్బంది 1:06 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : అసలు ప్రజాధనం దుర్వినియోగం చేసిన ఇలాంటి కేసుల్లో ఎలాంటి రక్షణ లేదని సెక్షన్లు చెబుతున్నాయి ► జస్టిస్ బోస్ : వాదనలకు ఇంకా ఎంత సేపు కావాలి? ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒక గంట సరిపోతుంది ► జస్టిస్ బోస్ : అయితే మిగతా వాదనలు శుక్రవారం 2గంటలకు వింటాం ► బాబు లాయర్ లూథ్రా : దయచేసి ఈ కేసులో వాదనలను ఇవ్వాళ ముగించండి ► జస్టిస్ బోస్ : ముందే చెప్పాం కదా. మిగతా చాలా కేసులున్నాయి ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒకవేళ ఇవ్వాళ సాధ్యం కాదు అనుకుంటే శుక్రవారం వాదనలు వినిపిస్తాం. ► బాబు లాయర్ లూథ్రా : గురువారానికి కేసు వాయిదా వేయండి ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : శుక్రవారం లేదా సోమవారం ► బాబు లాయర్ లూథ్రా : మా లాయర్ సాల్వే మరో కేసులో వాదనలు వినిపించేందుకు వెళ్లాడు. ఆయన్ను అడిగి మీకు మధ్యాహ్నం 2గంటలకు చెబుతాను. ► జస్టిస్ బోస్ : సరే కోర్టుకు లంచ్ బ్రేక్ 1:05 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : సెక్షన్ 6 ఏం చెబుతుందంటే.. ► జస్టిస్ త్రివేదీ : విచారణ అవసరం లేదంటుంది కదా.! ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : అది నిజం లార్డ్‌షిప్. కానీ ఇక్కడ ముఖ్యమైన అంశమేమంటే FIR నమోదు అయిందా అన్నది.! 1:02 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : CrPC సెక్షన్ 468 ఏం చెబుతుందంటే.. ఒక వేళ ఒక కేసులో అభియోగాలు మూడేళ్ల జైలు శిక్ష కంటే మించినది అయితే అలాంటి కేసుల్లో దర్యాప్తుకు ఎలాంటి పరిధి ఉండదని స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు జరపవచ్చని, ఛార్జ్‌షీట్ నమోదు చేయవచ్చని చెబుతోంది. 1:00 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► జస్టిస్ త్రివేదీ : మీరు ఇంతకు ముందు చెప్పినట్టు సెక్షన్ 13(1)(c) మరియు సెక్షన్ 13(1)(d)లు 2018 సవరణలో తొలగించారు కదా. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : కళ్ల ముందు కనిపిస్తున్న ఏ నేరంలోనయినా FIR నమోదు చేయకుండా ఏ చట్టం అడ్డంకులు చెప్పలేదు. ఆ సెక్షన్ తొలగించామన్నది దానికి హేతువు కాలేదు. ► జస్టిస్ త్రివేదీ : ఈ విషయంలో మరింత విస్తృతంగా వాదనలు చెప్పండి ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(1) ఏం చెప్పిందంటే.. ఒక వ్యక్తి నేరం చేశాడన్న విషయం చాలా ఆలస్యంగా తెలిసిందనుకోండి. చట్టం ఏం చెబుతుందంటే.. కేసు నమోదు చేయమని.! కొన్ని పరిధులు ఉండొచ్చేమో కానీ అడ్డంకులు మాత్రం లేవు. ' (CID లాయర్ రోహత్గీ కోర్టు ముందుంచిన డాక్యుమెంట్) 12:55 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : అసలు చంద్రబాబు కేసులో మెరిట్స్‌లోకి క్వాష్ పిటిషన్ సమయంలో వెళ్లవచ్చా? అలా వెళ్లకూడదని కోర్టును కోరుతున్నాను. ► ఒక దర్యాప్తు అధికారి అధికారిక విధులేంటీ? ► దర్యాప్తు సంస్థ ముందు ఎలాంటి మార్గదర్శకాలున్నాయి? ► దర్యాప్తు అధికారి ఏం నిర్ణయాలు తీసుకున్నారు? ► ఈ ప్రశ్నలన్నింటికీ నిర్ణయించాల్సింది తన ముందున్న సాక్ష్యాధారాలను బట్టి మాత్రమే. ఇది మౌఖికంగా జరిగే వాదనలను బట్టి కాదు. దర్యాప్తు అధికారి దగ్గర ఏ ఏ సాక్ష్యాధారాలున్నాయన్న బట్టి మాత్రమే కోర్టు నిర్ణయం తీసుకోవాలి. ► జస్టిస్ త్రివేదీ : ఒక వేళ చట్ట సవరణ జరిగిన తర్వాత అసలు ఆ సెక్షన్‌ను సవరణలో తొలగించిన తర్వాత.. అదే సెక్షన్ కింద FIR నమోదు చేయవచ్చా? ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : కచ్చితంగా. దానికి వెసులుబాటు ఉంది. దానికొక పరిధి ఉంది. నేరం ఎప్పుడు జరిగిందన్న సమయం పక్కనబెడితే... FIR నమోదు చేయవచ్చు. 12:45 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : కేవలం 17a సవరణను అడ్డుపెట్టుకుని ఏమైనా చేయవచ్చా? తప్పు చేసిన ప్రతీ ఒక్కరు 17aను బూచిగా చూపించి ముందస్తు అనుమతి తీసుకురమ్మంటే ఎలా? అసలు ఇదే విధానం అన్ని కేసుల్లో అమలయితే అవినీతి కేసుల్లో దర్యాప్తు చేసేందుకు ఏ అధికారి అయినా ముందుకొస్తాడా? అసలు మన దేశ పార్లమెంట్ విధానమే అవినీతి రహిత దేశం కదా. ఇందులో భాగంగానే చట్టాలు, సవరణలు వచ్చాయి కదా.! ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : అవినీతికి పాల్పడే వారికి సెక్షన్ 17a అండగా ఉండరాదు, ఉండకూడదు. ► జస్టిస్ బోస్ : 17a సవరణలో తెచ్చిన ముందస్తు అనుమతి అన్నది పాత తేదీల్లో జరిగే నేరాలకు వర్తిస్తుందా? ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు. 17a ఉంది కదా అని పారాచ్యూట్‌తో గతంలోకి ప్రయాణం చేయగలమా? 12:35 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒక చట్ట సవరణను ఎప్పుడు చేయాలి? అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్నది పార్లమెంట్‌కు ఉన్న అధికారం. కానీ ఈ కేసులో ముందునుంచే వర్తిస్తుందని పార్లమెంట్ తెచ్చిన సవరణలో లేదు. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఈ అంశానికి సంబంధించి ఒక కీలక విషయం అర్థం చేసుకోవాలి. కొన్ని సెక్షన్లను 2018లో తొలగించారు. అయితే నేరం 2018కి ముందే జరిగి ఉంటే మాత్రం.. తొలగించిన సెక్షన్లు కూడా వర్తిస్తాయి. అందువల్ల 2018 కంటే ముందు జరిగిన ఈ నేరంలో సెక్షన్ 17a వర్తించడానికి అవకాశమే లేదు. చంద్రబాబుపై ఈ కేసులో సెక్షన్ 13(1), (c), (d) కింద అభియోగాలున్నాయి ► జస్టిస్ త్రివేదీ : ఆ సెక్షన్లను తొలగించారు కదా. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : సరిగ్గా ఆ పాయింట్‌నే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సెక్షన్ 482 ఈ సవాళ్లను నిర్ణయించలేదు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అంతులేని నష్టం వాటిల్లింది. జరిగిన అక్రమాల వల్ల ఖజానా నష్టపోయింది. ► జస్టిస్ త్రివేదీ : ఏ సమయంలో దర్యాప్తు సంస్థ ఈ విషయాలను కనుగొంది? ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : దర్యాప్తు జరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు తెరపైకి వచ్చాయి. ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరిగినపుడు.. ఈ కేసును ఆదిలోనే కొట్టేయాలన్న ఆలోచనే సరికాదు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17a ఏం చెబుతుందంటే.. ముందస్తు అనుమతి లేకుండా కూడా దర్యాప్తు చేపట్టేందుకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. (సుప్రీంకోర్టు బెంచ్ ముందు CID లాయర్ రోహత్గీ ఉంచిన డాక్యుమెంట్) 12:25 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఈ చట్ట సవరణ 2018లో జరిగింది. 17a అనేది ఇందులో కేవలం ఒక భాగం మాత్రమే. 2018కు ముందు జరిగిన నేరాలన్నింటిలో 2018 కంటే ముందున్న చట్టానికి లోబడి (17a సవరణకు ముందు) దర్యాప్తు జరుగుతాయి. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : 2018 తర్వాత జరిగిన నేరాల్లో మాత్రమే 17a సవరణకు లోబడి దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసును పరిశీలిస్తే.. నేరం 2018కు ముందు జరిగింది, అంటే పాత చట్టం ప్రకారమే దర్యాప్తు జరగాలి, అలాగే జరిగింది కూడా. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : మీకు స్పష్టత ఇవ్వడానికి ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక వ్యక్తి మరొకరిని కొట్టాడనుకుందాం. కొట్టిన వ్యక్తిపై సెక్షన్ 323 కింద కేసు నమోదవుతుంది. ఒక వేళ ఏదైనా కారణంతో సెక్షన్ 323 కొట్టేసినంత మాత్రాన.. అ వ్యక్తి మీద ఉన్న అభియోగాలు ఎటూ పోవు. ఆ వ్యక్తి చట్టానికి లోబడి శిక్ష అనుభవించాల్సిందే. కొత్తగా సెక్షన్లలో వచ్చిన సవరణ ఎలాంటి మార్పు తెచ్చిందన్నది కేవలం ప్రయోజనం దృష్ట్యా పరిశీలించాలి కానీ.. సవరణ వచ్చింది కదా అని కేసు పూర్తిగా కొట్టేయాలంటే ఎలా? (చదవండి : చంద్రబాబు స్క్వాష్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ హైకోర్టు ఏం చెప్పిందంటే..) (సుప్రీంకోర్టు ముందు CID తరపు లాయర్ రోహత్గీ వాదనలు (Right window)) 12:15 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒక కేసులో అవినీతి నిరోధక చట్టం, PC actను తొలగిస్తే.. మిగతా అభియోగాలన్నీ కేవలం IPC కిందకు వస్తే ఏమవుతుందన్న దానిపై ఇదే కోర్టు నేరుగా ఓ జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని మీ ముందుంచుతున్నాను. ► A శ్రీనివాసరెడ్డి (2023) కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏం చెప్పిందంటే : ప్రత్యేక కోర్టుకు ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక అధికారాలుంటాయి. అవినీతి నిరోధక చట్టం లేకున్నా.. ప్రత్యేక కోర్టులు IPC కింద నమోదయిన అభియోగాలపై కేసు విచారణ చేపట్టవచ్చు. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఈ కేసులో ఒక వేళ అవినీతి నిరోధక చట్టం, PC actను తొలగించినా.. మిగతా అభియోగాలపై దర్యాప్తు జరపవచ్చు ► జస్టిస్ త్రివేదీ : ఈ కేసులో బాబు లాయర్ సాల్వే ఏం చెబుతున్నారంటే.. కేసులో అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న అభియోగాలను తొలగిస్తే.. సెక్షన్ 4(3) కింద నమోదు చేసిన అభియోగాలకు అర్హత లేదంటున్నారు? అప్పుడు ప్రత్యేక కోర్టు పరిధి ఏంటీ? ఆ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల సంగతేంటీ? ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒక కేసులో సెక్షన్ 420 కింద అభియోగాలుంటే.. వాటిని తొలగించలేం. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం PC act ను తొలగించలేం. ► జస్టిస్ త్రివేదీ : అది కేవలం ఒక పరిశీలన మాత్రమే 12:08 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒక కేసులో అవినీతి నిరోధక చట్టం, PC act తో పాటు ఇండియన్ పెనల్ కోడ్,IPC సెక్షన్లు ఉంటే ఏం చేయాలి? చేసిన నేరం, మోపబడిన అభియోగాలు రెండు సెక్షన్లకు వర్తిస్తే ఏం చేయాలి? ప్రత్యేక కోర్టులో (ACB కోర్టు) ఉన్న న్యాయమూర్తికి ఈ రెండు కేసులను విచారించే పరిధి ఉంటుంది. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒక వేళ బాబు లాయర్ సాల్వే చెబుతున్నట్టుగా అవినీతి నిరోధక చట్టాన్ని తొలగిస్తే ఏమవుతుంది? CPC 1973 (2 of 1974) ఏం చెబుతుందంటే, ఒక ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఏ కేసులోనయినా.. సెక్షన్ 3లో పేర్కొన్న నేరంతో పాటు ఇతర అభియోగాలుంటే వాటిని కూడా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పరిశీలించవచ్చని చెబుతోంది. ► జస్టిస్ త్రివేదీ : ఒక వేళ బాబు లాయర్ సాల్వే చెబుతున్నట్టుగా అవినీతి నిరోధక చట్టాన్ని తొలగిస్తే సెక్షన్ 4(3) కూడా వర్తించదు కదా ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. ఎప్పుడయితే వేర్వేరు అభియోగాలు ఒకే కేసులో ఉన్నాయో.. అప్పుడు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కచ్చితంగా ఆ కేసును పరిశీలించవచ్చు. అలాంటి కేసుల్లో అది అవినీతి నిరోధక చట్టం సెక్షన్ లేకున్నా.. ఆ కేసును ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పరిశీలించవచ్చు. 12:00 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు CID తరపు వాదనలు ప్రారంభం ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : అవినీతి నిరోధక చట్టానికి లోబడి ఈ కేసు నమోదయింది. పైగా ఈ కేసులో ఎలాంటి రాజకీయ కక్ష లేదు, 2021లో FIR నమోదయింది. 2023లో లభించిన సాక్ష్యాధారాల మేరకు చంద్రబాబును ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : చంద్రబాబు నాయుడు ఎంత బలమైన వ్యక్తి అంటే.. అలా అరెస్ట్ అయ్యారో లేదో.. ఇలా వెంటనే క్వాష్ పిటిషన్‌ను (కేసునే పూర్తిగా కొట్టేయాలన్న సెక్షన్ 482 కింద స్పెషల్ లీవ్ పిటిషన్)ను ముందుకు తెచ్చారు. కేవలం రెండే రెండు రోజుల్లో క్వాష్ పిటిషన్ హైకోర్టు ముందుకొచ్చింది. అంటే ఈ కేసులో నిందితుడి ఉద్దేశ్యాలను కోర్టు అర్థం చేసుకోవాలి. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో న్యాయస్థానం ఏం చెప్పిందంటే.. అవినీతి నిరోధక చట్టం, 1988 కింద నమోదయిన కేసుకు సెక్షన్ 17a లోబడి ఉండదని స్పష్టం చేసింది. 11:45 AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► బాబు లాయర్ సాల్వే : మేం CID దాఖలు చేసిన FIRను సవాలు చేస్తున్నాం. ► జస్టిస్ త్రివేదీ : అసలు FIR ప్రకారం ఏ ఏ నేరాలున్నాయి? ► బాబు లాయర్ సాల్వే : ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు దురుద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడి ప్రయోజనం పొందాడన్నది ప్రధాన అభియోగం. ► బాబు లాయర్ సాల్వే : చంద్రబాబుపై ఏ ఏ అభియోగాలు ఉన్నాయంటే.. ► IPC S 120B (criminal conspiracy) ► Sec 420 (cheating and dishonestly inducing delivery of property), ► Sec 465 (forgery) ► PC Act Sec12 (punishment for abetment of offences) ► Sec 13 (criminal misconduct by a public servant) ► సాల్వే : ఇందులో అవినీతి నిరోధక చట్టాన్ని తీసేసి చూడలేం. కేసును పూర్తిగా దాని ఆధారంగానే నిర్మించారు PC చట్టాన్ని తీసేస్తే ఈ కేసులో ప్రత్యేక కోర్టు ఏం చేయలేదు. ఒక వేళ PC చట్టాన్ని తొలగిస్తే మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాల్సి ఉంటుంది ► జస్టిస్ బోస్ : ఇవన్నీ మేజిస్ట్రేట్ ముందు విచారణ జరగాల్సిన అభియోగాలనే.? ► బాబు లాయర్ సాల్వే : నా మిత్రుడు లూథ్రా చెప్పేదాని బట్టి ఇవన్నీ మేజిస్ట్రేట్ పరిధిలోని కేసులే ► బాబు లాయర్ లూథ్రా : మధ్యప్రదేశ్‌లో కొందరు సెషన్స్ కోర్టుకు వెళ్తారు, కానీ ► జస్టిస్ త్రివేదీ : దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉంటుంది, మేజిస్ట్రేట్ పరిధిలోనే ఉంటుంది ► బాబు లాయర్ సాల్వే : ఇంతటితో మా వాదనలు ముగిస్తున్నాం 11:35AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య సాల్వే వాదనలు ► బాబు లాయర్ సాల్వే : 2011లో వచ్చి దవీందర్ పాల్ సింగ్ భుల్లర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.. అసలు అరెస్ట్ విషయంలోనే సరైన విధానం అనుసరించనప్పుడు, కేసు దర్యాప్తు ఆరంభ సమయంలోనే సరైన పద్ధతి అనుసరించకుండా ఉన్నప్పుడు.. ఆ కేసును మూలాల్లోంచి తొలగించాలని తీర్పు ఇచ్చింది. అంటే కేసును కొట్టేయాలన్న మూల సిద్ధాంతాన్ని ఈ కేసుకు కూడా అమలు చేయాలన్నది నేను బలంగా చెబుతున్న పాయింట్ ► బాబు లాయర్ సాల్వే : ఒకే వ్యక్తి మీద వేర్వేరు అభియోగాలు మోపడం, దాని ప్రభావం ఏంటన్న దానిపై నా దగ్గర మూడు కేసులున్నాయి. ఒక కేసును మీ ముందుంచుతున్నాను. 2019లో వచ్చిన ఎభా అర్జున్ జడేజా కేసు. ► ఎభా అర్జున్ జడేజా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ? : సరైన అనుమతి లేకుండా ప్రారంభించే దర్యాప్తులో FIR నమోదు చేయకూడదని TADA కేసుల సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పింది. హత్య, అత్యాచారం, స్మగ్లింగ్, నార్కోటిక్స్, పోక్సో యాక్ట్ వంటి సీరియస్ అభియోగాలున్న కేసులను TADA కేసు కారణంగా దర్యాప్తు వాయిదా వేయకూడదు 11:25AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య సాల్వే వాదనలు ► బాబు లాయర్ సాల్వే : ఇటీవల రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(1)కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చూడండి. క్రిమినల్ కేసుల విచారణలో ప్రొసీజిరల్ మార్పులకు సంబంధించి (పాత తేదీల) గతం నుంచే అమలును ఆర్టికల్ 20(1) అడ్డుకోలేదని అయిదుగురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. దీనికి సంబంధించి హైకోర్టులు ఏం చెబుతున్నాయో చెబుతాను. ► జస్టిస్ బోస్ : ఒకసారి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన విషయంలోనే.. మళ్లీ హైకోర్టు కేసును ఉదహరించనవసరం లేదు. ► బాబు లాయర్ సాల్వే : అయితే రిమాండ్ విషయంలో ముందస్తు అనుమతి అంటే గవర్నర్ అనుమతి కావాల్సిందే అన్న విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను. చంద్రబాబు ప్రజా ప్రతినిధి కాబట్టి, CID ముందుగా గవర్నర్ అనుమతి తీసుకుని ఉండాల్సింది. ఇది స్పష్టం చేయడమే నా ఉద్దేశ్యం. 11:15AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య సాల్వే వాదనలు ► బాబు లాయర్ సాల్వే : 1988లో రూపొందిన అవినీతి నిరోధక చట్టాన్ని పరిశీలిస్తే.. దర్యాప్తు అధికారికి ఎలాంటి హక్కులు లేవని చెబుతుంది. దర్యాప్తు అనేది కేవలం ఒక విధి మాత్రమే తప్ప హక్కు కాదని చట్టం చెబుతుంది. 11:10AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య కొనసాగుతున్న సాల్వే వాదనలు ► జస్టిస్ బోస్ : ఈ కేసులో లంచ్‌కు ముందే వాదనలు ముగిస్తాం. తర్వాత రెగ్యులర్ కేసులను పరిశీలిస్తాం ► బాబు లాయర్ సాల్వే : 2019లో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో యశ్వంత్ సిన్హాపై దాఖలైన కేసులో జస్టిస్ KM జోసెఫ్ ఇచ్చిన తీర్పును చూడండి. (జస్టిస్ KM జోసెఫ్ ఇచ్చిన తీర్పు ఏంటంటే.. రఫేల్ యుద్ధ విమానాల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దర్యాప్తు సంస్థ అయిన CBIని ఆపలేదు. అయితే 17a ప్రకారం దర్యాప్తు సంస్థ ముందస్తు అనుమతులు తీసుకోవాలి) (సుప్రీంకోర్టు ముందు సాల్వే ఉంచిన రఫేల్ కేసు డాక్యుమెంట్) 11:00AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య కొనసాగుతున్న సాల్వే వాదనలు ► బాబు లాయర్ సాల్వే : ముందస్తు అనుమతి లేకుండా దర్యాప్తు అధికారి చర్యలకు దిగరాదని చట్టం చెబుతోంది. CID ముందు అనుమతి తీసుకున్న తర్వాతే దర్యాప్తు చేయాల్సింది. ►నిన్న కూడా కోర్టు ముందు సెక్షన్ 17a సవరణ గురించి వాదనల్లో తెలిపాను. ఇది దుర్వినియోగం కాకూడదన్న ఉద్దేశ్యంతోనే సవరణ తీసుకొచ్చారు. దీని వల్ల అవినీతి నిరోధక చట్టం మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నాం ►నేరాలు బయటపడ్డాయని కాదు. CID ఇప్పుడు కొత్తగా అనుమతి తీసుకుని ఆపై విచారణను పునఃప్రారంభించాలి. (కేసు విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు, కింది విండోలో వాదనలు వినిపిస్తున్న హరీష్ సాల్వే) 10:45AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు - విచారణ పద్ధతిపై వేర్వేరు వాదనలు ► జస్టిస్ బోస్ : ఇంకా ఎంత సేపు తీసుకుంటారు సాల్వే ► బాబు లాయర్ సాల్వే : ఇంకా గంట సేపు కావాలి ► CID లాయర్ రోహత్గీ : మూడు రోజులుగా వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఎంత సేపు జస్టిస్? ఇది పూర్తిగా బేస్ లేని కేసు, అసలు ఇప్పటికే కొట్టేయాల్సిన కేసు, నోటీసులు లేకుండా ఎలా అవకాశమిస్తారు? మీరు గంట అవకాశం ఇవ్వాలనుకుంటే గంట తర్వాతే వస్తా. ► జస్టిస్ బోస్ : సెక్షన్ 136A కింద నోటీసులు ఇవ్వలేదు, - హైకోర్టులో దాఖలు చేసిన పత్రాల ఆధారంగా వాదనలు జరుగుతున్నప్పుడు కొత్త డాక్యుమెంట్లు అవసరం లేదు ► బాబు లాయర్ సాల్వే : ఇదొక క్రిమినల్ కేసు, ఇందులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయనవసరం లేదు, రికార్డులు అన్నీ ఉన్నాయి ► CID లాయర్ రోహత్గీ : ఇప్పటివరకు కోర్టు అనుసరిస్తున్న పద్ధతిని ఫాలో అయ్యేలా చూడండి. మొత్తం న్యాయశాస్త్రాన్నే తిరిగి రాస్తానంటే.. మళ్లీ మేం మొదటి నుంచి రావాలి ► జస్టిస్ త్రివేదీ (సాల్వేను ఉద్దేశించి) : ఇదొక ప్రొసీజర్ అయిప్పుడు దీని కింద ఏవైనా హక్కులుంటాయా? ► బాబు లాయర్ సాల్వే : మీరు అవకాశం ఇవ్వండి, నేను రిఫరెన్స్ తీర్పులు మీ ముందుంచుతాను. నిందితుడికి రక్షణ కల్పించిన కేసులు ఉదహరిస్తాను 10:35AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో మొదలైన వాదనలు ► సుప్రీంకోర్టులో మొదలయిన విచారణ ► కేసులో వాదనలు వింటున్న జస్టిస్ బేలా త్రివేదీ, జస్టిస్ అనిరుధ్ బోస్ ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై బెంచ్ ముందుకు ఇరుపక్షాల లాయర్లు ► నిన్న చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే వాదనలు ► ఇవ్వాళ బెంచ్ ముందు వాదనలు వినిపించనున్న CID లాయర్ ముకుల్ రోహత్గీ 10:15AM, అక్టోబర్ 10, 2023 ►సిట్ కార్యాలయంలో నారా లోకేష్ ► ఐఆర్ఆర్ కేసులో లోకేష్‌ను విచారిస్తున్న సీఐడీ ►లోకేష్‌ను ప్రశ్నిస్తున్న విచారణాధికారి జయరామ్‌రాజు బృందం 10:00AM, అక్టోబర్ 10, 2023 ►కాసేపట్లో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ►సీఐడీ తరఫున వాదనలు వినిపించనున్న సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహిత్గీ 9:58AM, అక్టోబర్ 10, 2023 ►సిట్ కార్యాలయానికి చేరుకున్న నారా లోకేష్ ►కాసేపట్లో లోకేష్‌ను ప్రశ్నించనున్న సీఐడీ 9:40AM, అక్టోబర్ 10, 2023 ►సీఐడీ కార్యాలయానికి బయల్దేరిన నారా లోకేష్ ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ విచారణకు లోకేష్ ►సాయంత్రం ఐదు గంటల వరకూ లోకేష్‌ను విచారించనున్న సీఐడీ ►తాడేపల్లి సిట్ కార్యాలయంలో విచారణ 8:50 AM, అక్టోబర్ 10, 2023 జైలులో 31వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు.. ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 31వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు. ►యథావిధిగా చంద్రబాబుకు కొనసాగుతున్న భద్రత. ►చంద్రబాబు ఆరోగ్య రీత్యా జైలు ఆవరణలో నిరంతరం అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య నిపుణుల బృందం. ►హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేతతో టీడీపీ వర్గాల్లో నైరాశ్యం. ►సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పైనే ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు ►లోకేశ్ నేడు సీఐడీ ఎదుట హాజరు కానుండటంపై ఎల్లో శ్రేణుల్లో టెన్షన్ 08:06AM, అక్టోబర్ 10, 2023 ►న్యాయ నిపుణులు: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు చాలా సీరియస్. ఈ కేసులో బాబుకి శిక్ష పడే అవకాశం ఉంది. ►అవును.. అక్కడ పుర చేత్తో తండ్రీ కొడుకులు ఇచ్చి, అవతల అత్తా, కోడళ్ళు కుడి చేత్తో తీసుకున్నారు. ►ఇక్కడ తమ ఇంటి కంపెనీకి లాభం వచ్చేట్టు కేబినేట్ నిర్ణయాలు తీసుకున్నారు. ►ఇది ఖచ్చితంగా తండ్రీ కొడుకులకి మాత్రమే కాదు, భువనేశ్వరి, బ్రహ్మణి కూడా ఇరుక్కున్నట్టే. 07:58AM, అక్టోబర్ 10, 2023 ►ఇన్నర్ రింగ్ రోడ్(ఐఆర్ఆర్) కేసులో పునీత్ అనే వ్యక్తికీ ఏపీ సీఐడీ నోటీసులు ►ఈ నెల 11 న విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ►సీఐడీ నోటీసులను క్వాష్ చేయాలని ఏపీ హైకోర్టులో పునీత్ పిటిషన్ ►నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు 07:57AM, అక్టోబర్ 10, 2023 టీడీపీ నేత నారాయణకు మరో షాక్ ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అయన భార్య, బావమరదులు ►ఏ - 15గా పొంగూరి రమాదేవి ►ఏ -16గా రావూరి సాంబశివరావు ►ఏ - 17 గా ఆవుల మునిశంకర్ ►ఏసీబీ కోర్టులో సీఐడీ ప్రత్యేక మెమో ముందు ముందు దీపావలీ, దసరా పండుగలన్నీ వీళ్లకే.. 😄😄#YSRCPITWING#KhaidiNo7691 pic.twitter.com/046QDCP2nu — YSRCP IT WING Official (@ysrcpitwingoff) October 10, 2023 7:00 AM, అక్టోబర్ 10, 2023 నేడు చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ.. ►చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ ►నేడు వాదనలు వినిపించనున్న సీఐడీ. ► చంద్రబాబు కేసుపై నిన్న సుదీర్ఘ వాదనలు ► దాదాపు రెండున్నర గంటల పాటు వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే ► నేడు CID, ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్న సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ 6:50 AM, అక్టోబర్ 10, 2023 నేడు సిట్ విచారణకు నారా లోకేశ్.. ►ఢిల్లీ నుంచి ఏపీకి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు ►కోర్టు ఉత్తర్వులు ప్రకారం.. ఈరోజు ఉదయం సీఐడీ సిట్ విచారణకు హాజరు ►తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్డులో ఉన్న సిట్ కార్యాలయంలో విచారణ ►మంగళవారం ఉ.10 నుంచి సా.5 గంటల వరకు లోకేశ్ విచారణ ►మధ్యాహ్నం గంటపాటు భోజన విరామం ఇవ్వాలని సీఐడీకి కోర్టు ఆదేశం ►సీఐడీ నోటీసుల్లోని పలు అంశాలపై ఈనెల 4న కోర్టును ఆశ్రయించిన లోకేష్ ►సీఐడీకి పలు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన హైకోర్టు ►విచారణ సమయంలో లోకేష్‌తో పాటు న్యాయవాదిని అనుమతించాలని ఆదేశం ►ఫలానా దస్త్రాలతో రావాలని పిటిషనర్‌ను ఒత్తిడి చేయవద్దన్న న్యాయస్థానం ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. న్యాయ నిపుణులతో చర్చ పేరిట ఢిల్లీకి వెళ్లిన వైనం ►ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో ఏ14గా నారా లోకేష్ ►ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులు ఇచ్చిన సీఐడీ పోలీసులు ► విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు. చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన సీఎం జగన్ ► చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్నా, జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ పడదు ► ఆయనకు విశ్వసనీయత లేదు, రాదు. ఎక్కడున్నా ఆయనకు విశ్వసనీయత లేదు. అలాంటి ఆయన ఎక్కడున్నా ఒక్కటే. ► చంద్రబాబును చూసినప్పుడు, ఆయన పార్టీని చూసినప్పుడు పేదవాడికి, ప్రజలకు గుర్తుకు వచ్చేది ఒక్కటే, మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు. ► చంద్రబాబు నాయుడ్ని ఎవ్వరూ కూడా కక్షసాధింపుతో అరెస్టు చేయలేదు. ఆయనమీద నాకు ఎలాంటి కక్ష లేదు. కక్షసాధించి ఆయన్ను ఎవ్వరూ అరెస్ట్ చేయలేదు ► నేను భారతదేశంలో లేనప్పుడు, లండన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. ► కక్షసాధింపే నిజమనుకుంటే.. కేంద్రంలో బీజేపీ ఉంది, దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నానని ఇప్పటికీ అంటున్నాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితోపాటు, సగం టీడీపీ నాయకులు బీజేపీలోనే ఉన్నారు. ► కేంద్రంలోని ఇన్‌కంటాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేసి ఆయన అవినీతిని గమనించి నోటీసులిచ్చాయి, దోషులను అరెస్టు చేసింది ► చంద్రబాబుకు నేరుగా ఇన్‌కంట్యాక్స్ నోటీసులు కూడా ఇచ్చారు. ► మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మోడీగారు బాబుపై అవినీతి ఆరోపణలు కూడా చేశారు. పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా మార్చారని ప్రధాని స్వయంగా చెప్పారు. ► రాష్ట్రంలో సీబీఐని, ఐటీని, ఈడీని అడుగు పెట్టనివ్వనని గతంలో చంద్రబాబు పర్మిషన్కూడా విత్‌డ్రా చేశాడు. ► ఆనాటికే అవినీతిపరుడని స్పష్టంగా రూఢి అయిన ఈ వ్యక్తిపైన విచారణ చేయకూడదట ► విచారించిన తర్వాత రిమాండుకు పంపినా ఒక చంద్రబాబును గాని, వీరప్పన్గాని ఎవ్వరూ కూడా పట్టించి ఇవ్వడానికి వీల్లేదని ఎల్లోమీడియా, ఎల్లో గజదొంగల ముఠా వాదనలు వినిపిస్తున్నాయి. ► ఇలాంటి వ్యవస్థలతో మనం యుద్ధంచేస్తున్నాం. నిన్న సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు వివరాలు.. ► హరీష్ సాల్వే : ఒక ప్రజా ప్రతినిధి సైకిల్ దొంగతనం చేస్తే.. దానికి అవినీతి నిరోధక చట్టం వర్తించదు. అంటే జరిగిన అక్రమం తనకు కేటాయించిన విధులకు సంబంధించినదయి ఉండాలి ► జస్టిస్ బోస్ : మీ వాదన ప్రకారం ఈ సెక్షన్ పైపైన వర్తిస్తుందని అనుకోవాలి ► హరీష్ సాల్వే :: అంటే అధికారిక నిర్ణయాలకు సంబంధించినవి కాబట్టి.. ► జస్టిస్ బోస్ : ఇందులో పరిపాలనపరమైన అంశాలున్నాయి. కేసులో అభియోగాలను పరిశీలిస్తే.. 10 శాతం అడ్వాన్స్ నిధులను ముందే విడుదల చేశారు ► హరీష్ సాల్వే :నేను కేసు లోతుల్లోకి వెళ్లడం లేదు. అయినా ఈ కేసులో నిందితులందరికీ ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా మేం 17Aపైనే ఎందుకు వాదిస్తున్నామంటే అరెస్ట్ చేసిన విధానం సరికాదని. పార్లమెంటులో చట్టం తెచ్చిన ఉద్దేశ్యమేంటంటే.. ఈ సవరణ తర్వాత జరిగిన కేసులకు 17A SOP వర్తించాలని. 3:45 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : కానీ ఈ కేసులో పోలీసు అధికారి తన బాధ్యతలో భాగంగా తన పై అధికారి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ► జస్టిస్ త్రివేదీ : సెక్షన్ 6A DSPE act (ఢిల్లి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్)కు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్వర్వులను చూడండి. ఆ కేసులో అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏం చెప్పిందో చూడండి. అది సరిగ్గా 17A సవరణ తరహాలోనే ఉంది కదా. ► సెక్షన్ 6A DSPE act (ఢిల్లి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్) కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే : 2014కు ముందు నమోదయిన అవినీతి, అక్రమాల కేసుల్లో ప్రజా ప్రతినిధులకు ఎలాంటి మినహాయింపు ఉండదు. ఇది సరిగ్గా 17Aకు సంబంధం ఉన్న కేసే. 3:25 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ►హరీష్ సాల్వే :ఈ కేసులో చంద్రబాబు పేరును సెప్టెంబర్ 8, 2023న చేర్చారు. ఒకప్పుడు 37వ నిందితుడిగా ఉన్న చంద్రబాబును మొదటి నిందితుడిగా చేర్చామని తెలిపారు. దర్యాప్తు అధికారి చెప్పిన దాని ప్రకారం A37 (చంద్రబాబు) సూచనల మేరకు A36 (నిందితుడి సంఖ్య 36) నేరానికి పాల్పడ్డారు. కాబట్టి ఇది అవినీతి నిరోధక చట్టం కిందికి వర్తిస్తుందని చెప్పారు. అప్పుడే గవర్నర్ దగ్గరకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సింది. ► జస్టిస్ త్రివేదీ : 17A సవరణను ఎలాగైనా చూడవచ్చు. 17A సవరణ కంటే ముందు జరిగిన నేరాల సంగతేంటీ? ఒక్కో సవరణ వచ్చినప్పుడల్లా కొత్తగా కొందరిని దీని పరిధిలోకి తెస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు ఈ కేసులో 17A సవరణ వర్తిస్తుందా? ► జస్టిస్ బోస్ : 17A అనేది కేవలం నేరం జరిగిన తేదీకి వర్తిస్తుంది కానీ, నిందితులకు కాదు కదా. ► హరీష్ సాల్వే : 17A అనేది నేరం జరిగిన తేదీని బట్టి పరిగణించవద్దని కోరుతున్నాను. ఈ చట్టం ఉద్దేశ్యం ఏంటంటే, దర్యాప్తు పేరిట ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదన్నది. ► జస్టిస్ త్రివేదీ : 17A సవరణ అన్న చట్టాన్ని మనం అవినీతి నిరోధక చట్టం ఉద్దేశ్యంలో చూడాలి. దాని ప్రకారం ప్రజా ప్రతినిధులు అక్రమాలకు పాల్పడకూడదని. అంతే తప్ప.. చట్టంలోని ప్రధాన ఉద్దేశ్యాన్ని పక్కనబెట్టి ఒక వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని విశ్లేషించుకోవద్దు. అది మొత్తం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది. 3:25 PM, అక్టోబర్ 9, 2023 విజయవాడ: చంద్రబాబు కేసులో ACB కోర్టు కీలక నిర్ణయం ► చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు ► CID వేసిన కస్టడీ పిటిషన్ తిరస్కరించిన న్యాయస్థానం 3:15 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : కేంద్రం ఈ చట్టాన్ని ఎందుకోసం తెచ్చిందో గుర్తు చేసుకోవాలి. 17A అమలు ఎలా ఉండాలన్నదానిపై కొన్ని మార్గదర్శకత్వ నిర్దేశకాలను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 3, 2021న రాష్ట్రాలకు పంపింది. ఏ స్థాయి నాయకుల విషయంలో ఎవరి అనుమతి తీసుకోవాలన్న విషయంలో స్పష్టత ఇచ్చింది. దాన్ని బట్టి ఎలాంటి దర్యాప్తు జరగాలన్నా ముందస్తు అనుమతి కావాలి. ► జస్టిస్ త్రివేదీ : ఈ SOP అన్నది మూడేళ్ల కిందనే 17a సవరణ తెచ్చినప్పుడు ప్రకటించింది. SOP ప్రకటించకముందు సంగతేంటీ? అయినా Regime Revenge (పదవీ మారగానే రాజకీయ కక్ష చూపించడం) అని ఎవరన్నారు? ► హరీష్ సాల్వే: మా స్నేహితుడు రాజీవ్ ధావన్ ఈ పదాన్ని ఉపయోగించారు. కేంద్రం తెచ్చిన SOP కోర్టు ముందు నిలబడకపోవచ్చు. కానీ ఆ చట్టం వెనకున్న పరమార్థాన్ని మెరుగ్గా అర్థం చేసుకోడానికి ఉపయోగపడవచ్చు. 2:50 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : ఈ కేసులో హైకోర్టు ఏం చెప్పిందంటే.. 2015-16 మధ్య కాలంలో జరిగిన నేరానికి సంబంధించిన అభియోగాలున్నాయి కాబట్టి, దర్యాప్తు జరిగిన తేదీని పట్టించుకోమని చెప్పింది. అందుకే ఆ డాక్యుమెంట్‌ను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. న్యాయశాస్త్రంలో ఉన్న విషయాన్ని రెండు రకాలుగా అన్వయించుకోవచ్చు. కానీ నిర్దారణ అయిన విషయాలను అనుమానించలేరు. రిమాండ్ విధించిన ఆర్డర్లో చంద్రబాబు పాత్రను 2021లో జరిగిన ప్రాథమిక దర్యాప్తు ద్వారా నిర్దారించామని కోర్టుకు CID తెలిపింది. 17A సవరణ కూడా సరిగ్గా ఇలాంటి కేసుల కోసమే తీసుకొచ్చారు. 2:35 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే: ఈ కేసులో ఫిర్యాదును చూస్తే.. సీమెన్స్, డిజైన్‌టెక్, ఇతరుల పేర్లున్నాయి తప్ప పిటిషనర్ పేరు లేదు. పైగా ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు 2021 తర్వాత జరిగిందని భావించాలి. అందువల్ల 17A సవరణ ఈ కేసుకు వర్తిస్తుంది. ► జస్టిస్ బోస్ : ఈ కేసులో రెండు విషయాలు పరిశీలిస్తున్నాం. ఒకటి, హైకోర్టు ముందు CID దాఖలు చేసిన డాక్యుమెంట్. జులై 5,2018న దర్యాప్తు ప్రారంభమయిందని చెప్పే డాక్యుమెంట్. రెండో అంశం.. హైకోర్టు ముందు వాదన వినిపించడానికి మీరు అవకాశం కోల్పోయారా? అన్న విషయాలను. వీటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం. ► హరీష్ సాల్వే : ఇప్పుడు మీరు మళ్లీ హైకోర్టుకు వెళ్లి వాదన వినిపించమంటే మేం నష్టపోతాం. హైకోర్టు కచ్చితంగా సెక్షన్ 17A సవరణ దీనికి వర్తించదంటారు. ఒక డాక్యుమెంట్ కారణంగా తీర్పు మారకూడదు. నేను మీకు ఈ డాక్యుమెంట్ గురించి ఎందుకు చెప్పానంటే.. దీని వల్లే CID వారు దర్యాప్తును 2018కంటే ముందు ప్రారంభించామంటున్నారు ► హరీష్ సాల్వే : హైకోర్టు ఏమంటుందంటే, ప్యారా 15 ప్రకారం నేరం 2015-16 మధ్య జరిగిందని చెబుతుంది. వారి దృష్టిలో దర్యాప్తు తేదీకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఏపీ హైకోర్టు అసలు డాక్యుమెంట్నే పరిగణనలోకి తీసుకోలేదు 2:20 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► జస్టిస్ త్రివేదీ : ఈ కేసులో మీ వాదనంతా దేని మీద ఉందంటే.., వాదనల తర్వాత డాక్యుమెంట్ సమర్పించారని మీరు చెబుతున్నారు. అంటే అసలేం వినకుండానే కేసు కొట్టేస్తారా? ► CID తరపున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి : ఈ కేసులో వాదనల తర్వాత డాక్యుమెంట్లు సమర్పించామని సాల్వే చేస్తోన్న వాదన సరికాదు. కేసు రిమాండ్‌లోనే ఈ విషయం అంతా ఉంది ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే : ఏ కేసులోనయినా హైకోర్టు ఏం భావనలో ఉంటుందంటే.. ఆ రిమాండ్ 17A సవరణకు లోబడి ఉంటుందని అనుకుంటుంది. 2021లో జరిగిన ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా దర్యాప్తు ప్రారంభమయింది. ► జస్టిస్ బోస్ : ఈ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమయింది? ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే: సెప్టెంబర్ 7, 2021 ► జస్టిస్ బోస్ : దేని ఆధారంగా ఆ విషయం చెబుతున్నారు? ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే: డిజైన్ టెక్ పన్ను ఎగ్గొట్టిందని GST (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) డిపార్ట్మెంట్ పసిగట్టింది. అంతే తప్ప దీనికి పిటిషనర్‌కు సంబంధం లేదు. ► జస్టిస్ త్రివేదీ : డిజైన్ టెక్ ఒప్పందం ఎవరితో కుదుర్చుకున్నారు? ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే: నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 2:14 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► బాబు లాయర్ సాల్వే : 17A సవరణ మీద వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు హైకోర్టులు వేర్వేరు పద్ధతులు అనుసరిస్తున్నాయి. కొన్ని కోర్టులు నేరం జరిగిన తేదీ అంటున్నాయి. మరికొన్ని FIR నమోదయిన తేదీ అంటున్నాయి ► ఇది అవినీతి నిరోధక చట్టానికి వర్తిస్తుందా లేదా అని న్యాయస్థానం ప్రశ్నించింది ► దీనిపై ప్రత్యేక న్యాయస్థానంలో ఇచ్చిన ఆదేశాలను మీ ముందుంచుతున్నాం ► సెక్షన్ 17A సవరణ వర్తిస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాం ► పంకజ్ బన్సల్ కేసులో కోర్టు ఏం చెప్పిందంటే.. అరెస్ట్ సక్రమం కానప్పుడు రిమాండ్ రిపోర్ట్ చెల్లదని న్యాయస్థానం చెప్పింది : సాల్వే ► వాదనల తర్వాత CID వారు డాక్యుమెంట్ సమర్పించారు -
వివాహిత అనుమానాస్పద మృతి
శ్రీకాకుళం: పెళ్లయిన ఆరు నెలలకే వివాహిత మృతి చెందిన సంఘటన మెళియాపుట్టి మండలంలోని ముకుందాపురం పంచాయతీ పరశురాంపురంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పరశురాంపురం గ్రామానికి చెందిన జన్ని కృష్ణారావుతో పొగడవెల్లి గ్రామానికి చెందిన జన్ని అశ్విని (21) మార్చిలో వివాహం జరిగింది. అశ్విని సోమవారం మధ్యాహ్నం బహిర్భూమికని గ్రామశివారు ప్రాంతానికి వెళ్లింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నోటి నుంచి నురగలు కక్కుతూ, మాట్లాడలేని స్థితిలో ఉండటంతో వెంటనే కుటుంబసభ్యులు ఆటోలో మెళియాపుట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బయలుదేరారు. ఆస్పత్రికి చేరేలోపే మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించనున్నట్లు తెలిసింది. -
CBN Petition: 17ఏ అవినీతిని కాపాడేందుకు కాదు
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. అయితే.. ఈ పిటిషన్‌పై ఇవాళ(సోమవారం) సుదీర్ఘ వాదనలే జరిగాయి. మొత్తం 17-ఏ చుట్టూరానే వాదనలు కొనసాగడం గమనార్హం. ఈ క్రమంలో చంద్రబాబు తరపు న్యాయవాదుల్ని ఉద్దేశించి.. ధర్మాసనంలోని జస్టిస్ బేలా త్రివేది 17-ఏపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘17-A వ్యాఖ్యానంలో చట్టం ముఖ్య ఉద్దేశం చూడాలి. అవినీతి నిరోధమే చట్టం అసలు ఉద్దేశం. ఇది అవినీతి నిరోధానికి ఉండాలే తప్ప.. అవినీతిని కాపాడేందుకు కాదు. అవినీతి నిరోధించడంలో నష్టం జరగకూడదన్న బాధ్యత కూడా ఉంది కదా!. చట్టం ఉద్దేశానికి భంగం కలిగేలా దీన్ని అమలు చేయలేం. 17-A లో చాలా అంశాలున్నాయి కదా. 17-A కు ముందు జరిగిన నేరాలకు ఇది వర్తిస్తుందా ?. 17-A ప్రకారం అనుమతి తీసుకోకపోతే జరిగిన దర్యాప్తు ఏం కావాలి?’’ అని బేలా త్రివేది, చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం వాదనలు వింది. ఇవాళ దాదాపు రెండున్నర గంటల పాటు చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ తరుణంలో. కోర్టు సమయం ముగియడంతో వాదనల్ని రేపు(అక్టోబర్ 10) వింటామంది ధర్మాసనం. రేపు ఉదయం చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై.. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు. చంద్రబాబు పిటిషన్‌పై వాదనలు ప్రారంభం కాగానే.. 2018లోనే ఈ కేసు విచారణ ప్రారంభమైందన్న ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ గత వాదనల్ని.. జస్టిస్ బేలా ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే రోహత్గీ వాదన సరికాదంటూ హరీశ్ సాల్వే తన వాదనలు మొదలుపెట్టారు. రాజకీయ ప్రతీకార చర్యలు లేకుండా ఉండడం కోసమే 17ఏ తీసుకొచ్చారు. 17ఏ ప్రకారం ప్రజాప్రతినిధులపై ఏ తరహా విచారణ చేయాలన్నా పోలీసుల అనుమతి పొందాల్సిందే. అని వాదించారు. ఈ కేసు.. రెజిం రివెంజ్(పాలన పగ) అని, పబ్లిక్ సర్వెంట్‌ను ఎఫ్ ఐ ఆర్ లో చేర్చాలి అంటే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనని, దీనిపై కేంద్రం SOP కూడా జారీ చేసింది అని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. -
ఏసీబీ కోర్టులో చంద్రబాబుకి చుక్కెదురు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. బెయిల్ పిటిషన్‌పై మూడు రోజులపాటు సుదీర్ఘ వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారమే ఇరువైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి.. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నాం తీర్పు వెల్లడించారు. అంతేకాదు.. చంద్రబాబును మరోసారి కస్టడీ కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం న్యాయస్థానం తోసిపుచ్చింది. మరోవైపు అంగళ్లు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్‌రోడ్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు ఇవాళ కొట్టేసిన సంగతి విదితమే. ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర కీలకంగా ఉందని.. బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. విచారణ కీలక దశలో ఉన్న తరుణంలో బెయిల్ ఇవ్వొద్దని ఏపీ సీఐడీ తరపున వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. -
ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఐదుగురి పేర్లను కొత్తగా నిందితులుగా చేర్చింది దర్యాప్తు సంస్థ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(AP CID). సోమవారం నలుగురి పేర్లను చేరుస్తూ.. అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీల ( నారాయణ కళాశాల ఉద్యోగి ధనంజయ్ భార్య), ఆవుల మణి శంకర్( నారాయణ బంధువు), రాపూరి సాంబశివరావు( రమాదేవి బంధువు), వరుణ్ కుమార్ కొత్తాపు పేర్లు కేసులో చేర్చాలని మెమో దాఖలు చేసింది సీఐడీ. క్రైం నంబర్ 16/2021 గా ఇప్పటికే ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన ఏపీ సీఐడీ.. సెక్షన్ 120(b), 409, 420,166,167,34,35,37,218 IPC మరియు 13(2), 13(1) ఆఫ్ పీసీ యాక్ట్ గా కేసు నమోదు చేసింది కూడా. ఇదే స్కాంలో చంద్రబాబు నాయుడు ఏ1గా, మాజీ మంత్రి పి.నారాయణ ఏ2గా, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఏ14గా ఉన్నారు. తాజాగా.. నారాయణ భార్య రమాదేవిని ఏ15గా, రావూరి సాంబశివరావు ఏ-16, ఏ-17గా ఆవుల మణిశంకర్, ఏ-18గా ప్రమీల, వరుణ్‌కుమార్ కొత్తాపును ఏ19గా చేర్చింది. ఈ కేసుకు సంబంధించి నారా లోకేష్‌కు, నారాయణకు తమ ఎదుట హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసింది సీఐడీ. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏ1 చంద్రబాబు పిటిషన్ వేయగా.. ఏపీ హైకోర్టు ఇవాళ ఆ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. ఇదీ చదవండి: నారా-నారాయణ దోపిడీ.. ఇలా.. -
Chandrababu: చంద్రబాబుకు మరో బిగ్ షాక్..
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు దాడుల కేసు, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు వేసిన మూడు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. వివరాల ప్రకారం, చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మూడు కేసులకు సంబంధించిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసు, అంగళ్లు దాడులకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరణ, ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు దాడుల కేసులో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఫైబర్ నెట్ కేసు ఇదే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌లకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు చెందిన ‘టెరా సాఫ్ట్’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. అందుకోసం టీడీపీ ప్రభుత్వం పక్కా పన్నాగంతో కథ నడిపించింది. చంద్రబాబు విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. వాస్తవానికి ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాలి. కానీ ఈ ప్రాజెక్టును విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ చేపడుతుందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయించారు. పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా.. ఫైబర్ నెట్ టెండర్లను తన బినామీ కంపెనీ అయిన టెరా సాఫ్ట్‌కు కట్టబెట్టడం కోసం చంద్రబాబు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా టెరా సాఫ్ట్‌కు చెందిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను ముందుగానే రెండు కీలక పదవుల్లో నియమించారు. తొలుత ఆయన్ని ఏపీ ఈ– గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ని అంతటి కీలక స్థానంలో నియమించడంపై అనేక అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోలేదు. ఫైబర్ నెట్ టెండర్ల మదింపు కమిటీలోనూ సభ్యుడిగా నియమించారు. ఓ ప్రాజెక్టు టెండర్ల మదింపు కమిటీలో ఆ ప్రాజెక్టు కోసం పోటీ పడే సంస్థకు చెందిన వారు ఉండకూడదన్న నిబంధననూ ఉల్లంఘించారు. టెరా సాఫ్ట్ సంస్థ అప్పటికే బ్లాక్ లిస్టులో కూడా ఉంది. అంతకు ముందు చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. కానీ చంద్రబాబు ఒత్తిడి తీసుకువచ్చి బ్లాక్ లిస్ట్ జాబితా నుంచి టెరా సాఫ్ట్ కంపెనీ పేరును తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కనబెట్టి మరీ టెరా సాఫ్ట్ కంపెనీకి ప్రాజెక్టును కట్టబెట్టారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేయడం గమనార్హం. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్లో మార్పులు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. అలైన్మెంట్ ఎలా ఉండాలో ముందే ఓ నిర్ణయానికి వచ్చి, దానికి అనుగుణంగా ప్రాజెక్టు పనులు దక్కించుకున్న సంస్థ చేత అలైన్‌మెంట్‌ను తయారు చేయించారని వివరించారు. ఈ మార్పుల ద్వారా వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌కు చంద్రబాబు లబ్ధి చేకూర్చారని చెప్పింది. అందుకు ప్రతిఫలంగా రమేష్ కృష్ణానది కరకట్ట సమీపంలో ఉన్న తన ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని తెలిపింది. ఇది క్విడ్ ప్రోకోయేనని వెల్లడించింది. ఇది కూడా చదవండి: బాబు కనుసన్నల్లోనే ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు ఇది కూడా చదవండి: తోడు దొంగల ‘రింగ్’! అంగళ్లు కేసు ఇదే.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు సంబంధించి టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ప్రథమ ముద్దాయిగా పోలీసులు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 4న యాత్ర ముసుగులో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతల హత్యకు కుట్ర పన్ని, మారణాయుధాలు, బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడిన ఘటనలపై చంద్రబాబు సహా 20 మందిపై కురబలకోట మండలం ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇతర నిందితుల్లో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, తిరుపతి ప్రాంతాలకు చెందిన నేతలు నిందితులుగా ఉన్నారు. దాదంవారిపల్లెకు చెందిన అంగళ్లు మార్కెట్ కమిటీ చైర్మన్ డీఆర్.ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ 120బి, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద ఎస్ఐ షేక్ ముబిన్తాజ్ కేసు నమోదు చేశారు. ఇది కూడా చదవండి: ‘అంగళ్లు’ దాడుల కేసులో ఎ1గా చంద్రబాబు -
Oct 9th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates 08:34 PM, అక్టోబర్ 9, 2023 గన్నవరం బయల్దేరిన నారా లోకేష్ ►ఢిల్లీ నుంచి మళ్లీ ఏపీకి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు ► ఢిల్లీ విమానాశ్రయం నుండి గన్నవరం పయనం ►లోకేష్‌కి వీడ్కోలు పలికిన టీడీపీ ఎంపీలు ►కోర్టు ఉత్తర్వులు ప్రకారం.. రేపు ఉదయం సిట్ విచారణకు హాజరు ► మంగళవారం ఉ.10 నుంచి సా.5 గంటల వరకు లోకేశ్ విచారణ ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. న్యాయ నిపుణులతో చర్చ పేరిట ఢిల్లీకి వెళ్లిన వైనం ►ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో ఏ14గా నారా లోకేష్ ►ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులు ఇచ్చిన సీఐడీ పోలీసులు ► విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు 5:35 PM, అక్టోబర్ 9, 2023 చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన సీఎం జగన్ ► చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్నా, జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ పడదు ► ఆయనకు విశ్వసనీయత లేదు, రాదు. ఎక్కడున్నా ఆయనకు విశ్వసనీయత లేదు. అలాంటి ఆయన ఎక్కడున్నా ఒక్కటే. ► చంద్రబాబును చూసినప్పుడు, ఆయన పార్టీని చూసినప్పుడు పేదవాడికి, ప్రజలకు గుర్తుకు వచ్చేది ఒక్కటే, మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు. ► చంద్రబాబు నాయుడ్ని ఎవ్వరూ కూడా కక్షసాధింపుతో అరెస్టు చేయలేదు. ఆయనమీద నాకు ఎలాంటి కక్ష లేదు. కక్షసాధించి ఆయన్ను ఎవ్వరూ అరెస్ట్ చేయలేదు ► నేను భారతదేశంలో లేనప్పుడు, లండన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. ► కక్షసాధింపే నిజమనుకుంటే.. కేంద్రంలో బీజేపీ ఉంది, దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నానని ఇప్పటికీ అంటున్నాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితోపాటు, సగం టీడీపీ నాయకులు బీజేపీలోనే ఉన్నారు. ► కేంద్రంలోని ఇన్‌కంటాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేసి ఆయన అవినీతిని గమనించి నోటీసులిచ్చాయి, దోషులను అరెస్టు చేసింది ► చంద్రబాబుకు నేరుగా ఇన్‌కంట్యాక్స్ నోటీసులు కూడా ఇచ్చారు. ► మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మోడీగారు బాబుపై అవినీతి ఆరోపణలు కూడా చేశారు. పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా మార్చారని ప్రధాని స్వయంగా చెప్పారు. ► రాష్ట్రంలో సీబీఐని, ఐటీని, ఈడీని అడుగు పెట్టనివ్వనని గతంలో చంద్రబాబు పర్మిషన్కూడా విత్‌డ్రా చేశాడు. ► ఆనాటికే అవినీతిపరుడని స్పష్టంగా రూఢి అయిన ఈ వ్యక్తిపైన విచారణ చేయకూడదట ► విచారించిన తర్వాత రిమాండుకు పంపినా ఒక చంద్రబాబును గాని, వీరప్పన్గాని ఎవ్వరూ కూడా పట్టించి ఇవ్వడానికి వీల్లేదని ఎల్లోమీడియా, ఎల్లో గజదొంగల ముఠా వాదనలు వినిపిస్తున్నాయి. ► ఇలాంటి వ్యవస్థలతో మనం యుద్ధంచేస్తున్నాం. ప్రజామోదం లేని చంద్రబాబు జనంలో ఉన్నా జైల్లో ఉన్నా ఒక్కటే. ఆయన రాజకీయ జీవితం మొత్తం మోసం, వెన్నుపోటు, అబద్ధాలే ఉంటాయి. - సీఎం వైయస్ జగన్#GajaDongaChandrababu#SkilledCriminalCBNInJail #KhaidiNo7691 #CorruptBabuNaidu pic.twitter.com/TqkEIaLJSe — YSR Congress Party (@YSRCParty) October 9, 2023 5:25 PM, అక్టోబర్ 9, 2023 దోచుకోవడం, పంచుకోవడం.. ఇవే చంద్రబాబు నమ్మిన సిద్ధాంతం : సీఎం జగన్ ► ఏపీలో ప్రతిపక్షాలు అన్నీ కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయి ► వారు ఎంతమంది కలిసినా… రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా.. సున్నాయే. ► ఎన్ని సున్నాలు కలిసిన వచ్చేది పెద్ద సున్నాయే. ► ఒకరైతే రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. చంద్రబాబును మోయడమే ఆయన పని. ► ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక అభ్యర్థి లేడు. ప్రతి గ్రామంలో జెండా మోసే కార్యకర్తా లేరు ► చంద్రబాబు దోచుకున్న దాంట్లో ఈయన పార్టనర్. మోసాలు చేయడంలో పార్టనర్. ► బిస్కట్ వేసినట్టు, చాక్లెట్ వేసినట్టు. సంపాదించిన సొమ్ములో భాగం పంచడం.. ► ఇంత ఈనాడుకు, ఇంత టీవీ5 కు, ఇంత ఆంధ్రజ్యోతికి, ఇంత దత్తపుత్రుడికి ► దోచుకోవడం.. పంచుకోవడం.. ఇదే వీరికి తెలిసింది ► చంద్రబాబును సమర్థించామంటే.. .ఈ రాష్ట్రంలో పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా వ్యతిరేకించడమే అన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ► చంద్రబాబును సమర్థించడమంటే.. పేదవాళ్లకు వ్యతిరేకంగా ఉండటమే. ► చంద్రబాబును సమర్థించడమంటే.. పెత్తందారీ వ్యవస్థను, నయా జమీందారీ వ్యవస్థను సమర్థించడమే. ► చంద్రబాబును సమర్థించడమంటే.. పేదవర్గాల పిల్లలకు ఇంగ్లిషు మీడియం అందకుండా వ్యతికేకించడమే. ► చంద్రబాబును సమర్థించడమంటే.. డెమోగ్రఫిక్ ఇన్ బ్యాలెన్స్ అంటూ వారు ఏకంగా కోర్టుల్లో వేసిన దావాలను సమర్థించడమే. ► చంద్రబాబును సమర్థించడమంటే.. కొన్ని వర్గాలు ఎప్పటికీ పేదలుగా, కూలీలుగా మిగిలివాలని సమర్థించినట్టే. ► ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తానన్న పెత్తందారీ భావజాలాన్ని సమర్థించడమే. బాబుని సమర్ధించడం అంటే పేద వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందకుండా చేయడమే.. పేదలకు ఇళ్ల స్థలాలను వ్యతిరేకించడమే... ఇటువంటి పచ్చముఠా దుర్మార్గాలను ప్రజలకు మనం వివరించాలి. - సీఎం వైయస్ జగన్#JaganannaOnceMore pic.twitter.com/cUOCGMWYiz — YSR Congress Party (@YSRCParty) October 9, 2023 4:45 PM, అక్టోబర్ 9, 2023 బాబు కస్టడీ కోరుతూ హైకోర్టును ఆశ్రయించనున్న CID ► విజయవాడలో మాట్లాడిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద ► హైకోర్టులో చంద్రబాబు వేసిన 3 బెయిల్ పిటీషన్ లు కొట్టేశారు ► ACB కోర్టు బెయిల్, కస్టడీ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది ► ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసులపై వాదనలు జరుగుతున్నాయి ► రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్ చంద్రబాబు తరపున వేశారు ► కోర్టులో న్యాయమూర్తి కూడా వారి వాదనలు విన్నారు ► రేపు మధ్యాహ్నం న్యాయమూర్తి దీనిపై ఆదేశాలు జారీ చేస్తారు ► చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ హైకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తున్నాం 4:35 PM, అక్టోబర్ 9, 2023 ACB కోర్టులో PT వారెంట్లపై రేపు వాదనలు ► ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా ► రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని పట్టుబట్టిన బాబు తరపు లాయర్లు ► ఫైబర్ నెట్, IRR కేసుల్లో చంద్రబాబు పై పెండింగులో ఉన్న పీటీ వారెంట్లు ► పీటీ వారెంట్ల పై వాదనలు అవసరం లేదని కోర్టును కోరిన CID న్యాయవాది వివేకా ► కోర్టు నిర్ణయం తీసుకుంటే చాలని తెలిపిన CID న్యాయవాది వివేకా ► పీటీ వారెంట్లపై వాదనలు వినిపిస్తామన్న చంద్రబాబు లాయర్లు పోసాని, గింజుపల్లి ► పీటీ వారెంట్లు, కస్టడీ పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 4:05 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు రేపటికి వాయిదా ► చంద్రబాబు కేసుపై ఇవ్వాళ సుదీర్ఘ వాదనలు ► దాదాపు రెండున్నర గంటల పాటు వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే ► రేపు CID, ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్న సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ 3:55 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : ఒక ప్రజా ప్రతినిధి సైకిల్ దొంగతనం చేస్తే.. దానికి అవినీతి నిరోధక చట్టం వర్తించదు. అంటే జరిగిన అక్రమం తనకు కేటాయించిన విధులకు సంబంధించినదయి ఉండాలి ► జస్టిస్ బోస్ : మీ వాదన ప్రకారం ఈ సెక్షన్ పైపైన వర్తిస్తుందని అనుకోవాలి ► హరీష్ సాల్వే : అంటే అధికారిక నిర్ణయాలకు సంబంధించినవి కాబట్టి.. ► జస్టిస్ బోస్ : ఇందులో పరిపాలనపరమైన అంశాలున్నాయి. కేసులో అభియోగాలను పరిశీలిస్తే.. 10 శాతం అడ్వాన్స్ నిధులను ముందే విడుదల చేశారు ► హరీష్ సాల్వే : నేను కేసు లోతుల్లోకి వెళ్లడం లేదు. అయినా ఈ కేసులో నిందితులందరికీ ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా మేం 17Aపైనే ఎందుకు వాదిస్తున్నామంటే అరెస్ట్ చేసిన విధానం సరికాదని. పార్లమెంటులో చట్టం తెచ్చిన ఉద్దేశ్యమేంటంటే.. ఈ సవరణ తర్వాత జరిగిన కేసులకు 17A SOP వర్తించాలని. 3:45 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : కానీ ఈ కేసులో పోలీసు అధికారి తన బాధ్యతలో భాగంగా తన పై అధికారి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ► జస్టిస్ త్రివేదీ : సెక్షన్ 6A DSPE act (ఢిల్లి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్)కు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్వర్వులను చూడండి. ఆ కేసులో అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏం చెప్పిందో చూడండి. అది సరిగ్గా 17A సవరణ తరహాలోనే ఉంది కదా. ► సెక్షన్ 6A DSPE act (ఢిల్లి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్) కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే : 2014కు ముందు నమోదయిన అవినీతి, అక్రమాల కేసుల్లో ప్రజా ప్రతినిధులకు ఎలాంటి మినహాయింపు ఉండదు. ఇది సరిగ్గా 17Aకు సంబంధం ఉన్న కేసే. 3:25 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : ఈ కేసులో చంద్రబాబు పేరును సెప్టెంబర్ 8, 2023న చేర్చారు. ఒకప్పుడు 37వ నిందితుడిగా ఉన్న చంద్రబాబును మొదటి నిందితుడిగా చేర్చామని తెలిపారు. దర్యాప్తు అధికారి చెప్పిన దాని ప్రకారం A37 (చంద్రబాబు) సూచనల మేరకు A36 (నిందితుడి సంఖ్య 36) నేరానికి పాల్పడ్డారు. కాబట్టి ఇది అవినీతి నిరోధక చట్టం కిందికి వర్తిస్తుందని చెప్పారు. అప్పుడే గవర్నర్ దగ్గరకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సింది. ► జస్టిస్ త్రివేదీ : 17A సవరణను ఎలాగైనా చూడవచ్చు. 17A సవరణ కంటే ముందు జరిగిన నేరాల సంగతేంటీ? ఒక్కో సవరణ వచ్చినప్పుడల్లా కొత్తగా కొందరిని దీని పరిధిలోకి తెస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు ఈ కేసులో 17A సవరణ వర్తిస్తుందా? ► జస్టిస్ బోసు : 17A అనేది కేవలం నేరం జరిగిన తేదీకి వర్తిస్తుంది కానీ, నిందితులకు కాదు కదా. ► హరీష్ సాల్వే : 17A అనేది నేరం జరిగిన తేదీని బట్టి పరిగణించవద్దని కోరుతున్నాను. ఈ చట్టం ఉద్దేశ్యం ఏంటంటే, దర్యాప్తు పేరిట ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదన్నది. ► జస్టిస్ త్రివేదీ : 17A సవరణ అన్న చట్టాన్ని మనం అవినీతి నిరోధక చట్టం ఉద్దేశ్యంలో చూడాలి. దాని ప్రకారం ప్రజా ప్రతినిధులు అక్రమాలకు పాల్పడకూడదని. అంతే తప్ప.. చట్టంలోని ప్రధాన ఉద్దేశ్యాన్ని పక్కనబెట్టి ఒక వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని విశ్లేషించుకోవద్దు. అది మొత్తం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది. 3:25 PM, అక్టోబర్ 9, 2023 విజయవాడ: చంద్రబాబు కేసులో ACB కోర్టు కీలక నిర్ణయం ► చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు ► CID వేసిన కస్టడీ పిటిషన్ తిరస్కరించిన న్యాయస్థానం 3:15 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : కేంద్రం ఈ చట్టాన్ని ఎందుకోసం తెచ్చిందో గుర్తు చేసుకోవాలి. 17A అమలు ఎలా ఉండాలన్నదానిపై కొన్ని మార్గదర్శకత్వ నిర్దేశకాలను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 3, 2021న రాష్ట్రాలకు పంపింది. ఏ స్థాయి నాయకుల విషయంలో ఎవరి అనుమతి తీసుకోవాలన్న విషయంలో స్పష్టత ఇచ్చింది. దాన్ని బట్టి ఎలాంటి దర్యాప్తు జరగాలన్నా ముందస్తు అనుమతి కావాలి. ► జస్టిస్ త్రివేదీ : ఈ SOP అన్నది మూడేళ్ల కిందనే 17a సవరణ తెచ్చినప్పుడు ప్రకటించింది. SOP ప్రకటించకముందు సంగతేంటీ? అయినా Regime Revenge (పదవీ మారగానే రాజకీయ కక్ష చూపించడం) అని ఎవరన్నారు? ► హరీష్ సాల్వే : మా స్నేహితుడు రాజీవ్ ధావన్ ఈ పదాన్ని ఉపయోగించారు. కేంద్రం తెచ్చిన SOP కోర్టు ముందు నిలబడకపోవచ్చు. కానీ ఆ చట్టం వెనకున్న పరమార్థాన్ని మెరుగ్గా అర్థం చేసుకోడానికి ఉపయోగపడవచ్చు. 2:50 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : ఈ కేసులో హైకోర్టు ఏం చెప్పిందంటే.. 2015-16 మధ్య కాలంలో జరిగిన నేరానికి సంబంధించిన అభియోగాలున్నాయి కాబట్టి, దర్యాప్తు జరిగిన తేదీని పట్టించుకోమని చెప్పింది. అందుకే ఆ డాక్యుమెంట్‌ను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. న్యాయశాస్త్రంలో ఉన్న విషయాన్ని రెండు రకాలుగా అన్వయించుకోవచ్చు. కానీ నిర్దారణ అయిన విషయాలను అనుమానించలేరు. రిమాండ్ విధించిన ఆర్డర్లో చంద్రబాబు పాత్రను 2021లో జరిగిన ప్రాథమిక దర్యాప్తు ద్వారా నిర్దారించామని కోర్టుకు CID తెలిపింది. 17A సవరణ కూడా సరిగ్గా ఇలాంటి కేసుల కోసమే తీసుకొచ్చారు. 2:35 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : ఈ కేసులో ఫిర్యాదును చూస్తే.. సీమెన్స్, డిజైన్‌టెక్, ఇతరుల పేర్లున్నాయి తప్ప పిటిషనర్ పేరు లేదు. పైగా ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు 2021 తర్వాత జరిగిందని భావించాలి. అందువల్ల 17A సవరణ ఈ కేసుకు వర్తిస్తుంది. ► జస్టిస్ బోసు : ఈ కేసులో రెండు విషయాలు పరిశీలిస్తున్నాం. ఒకటి, హైకోర్టు ముందు CID దాఖలు చేసిన డాక్యుమెంట్. జులై 5,2018న దర్యాప్తు ప్రారంభమయిందని చెప్పే డాక్యుమెంట్. రెండో అంశం.. హైకోర్టు ముందు వాదన వినిపించడానికి మీరు అవకాశం కోల్పోయారా? అన్న విషయాలను. వీటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం. ► హరీష్ సాల్వే : ఇప్పుడు మీరు మళ్లీ హైకోర్టుకు వెళ్లి వాదన వినిపించమంటే మేం నష్టపోతాం. హైకోర్టు కచ్చితంగా సెక్షన్ 17A సవరణ దీనికి వర్తించదంటారు. ఒక డాక్యుమెంట్ కారణంగా తీర్పు మారకూడదు. నేను మీకు ఈ డాక్యుమెంట్ గురించి ఎందుకు చెప్పానంటే.. దీని వల్లే CID వారు దర్యాప్తును 2018కంటే ముందు ప్రారంభించామంటున్నారు ► హరీష్ సాల్వే : హైకోర్టు ఏమంటుందంటే, ప్యారా 15 ప్రకారం నేరం 2015-16 మధ్య జరిగిందని చెబుతుంది. వారి దృష్టిలో దర్యాప్తు తేదీకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఏపీ హైకోర్టు అసలు డాక్యుమెంట్నే పరిగణనలోకి తీసుకోలేదు 2:20 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► జస్టిస్ త్రివేదీ : ఈ కేసులో మీ వాదనంతా దేని మీద ఉందంటే.., వాదనల తర్వాత డాక్యుమెంట్ సమర్పించారని మీరు చెబుతున్నారు. అంటే అసలేం వినకుండానే కేసు కొట్టేస్తారా? ► CID తరపున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి : ఈ కేసులో వాదనల తర్వాత డాక్యుమెంట్లు సమర్పించామని సాల్వే చేస్తోన్న వాదన సరికాదు. కేసు రిమాండ్‌లోనే ఈ విషయం అంతా ఉంది ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే : ఏ కేసులోనయినా హైకోర్టు ఏం భావనలో ఉంటుందంటే.. ఆ రిమాండ్ 17A సవరణకు లోబడి ఉంటుందని అనుకుంటుంది. 2021లో జరిగిన ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా దర్యాప్తు ప్రారంభమయింది. ► జస్టిస్ బోస్ : ఈ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమయింది? ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే: సెప్టెంబర్ 7, 2021 ► జస్టిస్ బోస్ : దేని ఆధారంగా ఆ విషయం చెబుతున్నారు? ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే: డిజైన్ టెక్ పన్ను ఎగ్గొట్టిందని GST (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) డిపార్ట్మెంట్ పసిగట్టింది. అంతే తప్ప దీనికి పిటిషనర్‌కు సంబంధం లేదు. ► జస్టిస్ త్రివేదీ : డిజైన్ టెక్ ఒప్పందం ఎవరితో కుదుర్చుకున్నారు? ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే: నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 2:14 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► బాబు లాయర్ సాల్వే : 17A సవరణ మీద వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు హైకోర్టులు వేర్వేరు పద్ధతులు అనుసరిస్తున్నాయి. కొన్ని కోర్టులు నేరం జరిగిన తేదీ అంటున్నాయి. మరికొన్ని FIR నమోదయిన తేదీ అంటున్నాయి ► ఇది అవినీతి నిరోధక చట్టానికి వర్తిస్తుందా లేదా అని న్యాయస్థానం ప్రశ్నించింది ► దీనిపై ప్రత్యేక న్యాయస్థానంలో ఇచ్చిన ఆదేశాలను మీ ముందుంచుతున్నాం ► సెక్షన్ 17A సవరణ వర్తిస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాం ► పంకజ్ బన్సల్ కేసులో కోర్టు ఏం చెప్పిందంటే.. అరెస్ట్ సక్రమం కానప్పుడు రిమాండ్ రిపోర్ట్ చెల్లదని న్యాయస్థానం చెప్పింది : సాల్వే ► వాదనల తర్వాత CID వారు డాక్యుమెంట్ సమర్పించారు 2:10 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► ప్రారంభం అయిన విచారణ ► బెంచ్ మీదకు న్యాయమూర్తులు ► వాదనలు ప్రారంభించిన హరీష్ సాల్వే 1:45 PM, అక్టోబర్ 9, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డులో కీలక పరిణామం ► ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో నిందితులుగా మరో నలుగురి పేర్లు చేరుస్తూ ACB కోర్టులో మెమో దాఖలు చేసిన సిఐడి ► క్రైం నంబర్ 16/2021 గా ఇప్పటికే FIR నమోదు ► సెక్షన్లు 120(b), 409, 420,166,167,34,35,37,218 IPC మరియు 13(2), 13(1) ఆఫ్ PC యాక్ట్ గా కేసు నమోదు ► ప్రమీల ( నారాయణ కళాశాల ఉద్యోగి ధనంజయ్ భార్య) ► రమాదేవి( మాజీ మంత్రి నారాయణ) ► ఆవుల మణి శంకర్( నారాయణ బంధువు) ► రాపూరి సాంబశివరావు( రమాదేవి బంధువు) ► పై పేర్లు కేసులో చేర్చాలని మెమో దాఖలు చేసిన CID 12:54 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు మ.2గంటలకు వాయిదా ► బాబు లాయర్ సాల్వే : కానీ 2018కు ముందు దర్యాప్తు జరిగిందన్న డాక్యుమెంట్ ప్రభుత్వం సమర్పించలేదు. రిమాండ్ విధించిన ACB కోర్టు ముందు కూడా సమర్పించలేదు ► జస్టిస్ త్రివేదీ : మీరు ACB కోర్టు విధించిన రిమాండ్‌ను సవాలు చేస్తున్నారా? ► బాబు లాయర్ సాల్వే : అవును, ACB కోర్టు రిమాండ్‌ను సవాలు చేస్తున్నాం. CID సమర్పించిన డాక్యుమెంట్ ద్వారానే దర్యాప్తు మొదలయిందని చెప్పి ఉంటే, లేదా దాని ద్వారానే FIR నమోదయిందని ఉంటే ఈ డాక్యుమెంట్ కోర్టు పరిగణనలోకి తీసుకోవాలి. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఒక SOP (Standarad operating procedure) విడుదల చేసింది. కచ్చితంగా అనుమతి తీసుకోవాలని ఆ SOP చెబుతోంది. ► జస్టిస్ త్రివేదీ & జస్టిస్ బోస్ : సరే ఆ విషయం లంచ్ తర్వాత పరిశీలిస్తాం, కేసు మధ్యాహ్నం 2గంటలకు పరిశీలిస్తాం 12:44 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్ స్కాం కేసు ► బాబు లాయర్ సాల్వే : సెప్టెంబర్ 19న పిటిషన్ దాఖలు చేశాం, 2021లో FIR నమోదయిందని పేర్కొన్నాం ► ఈ కేసులో సెక్షన్ 17a సవరణ వర్తిస్తుందని చెప్పాం, 1959 SCR 191 ప్రకారం ఈ కేసుకు ఇది వర్తిస్తుంది ► జస్టిస్ త్రివేదీ : కానీ ఈ కేసులో దర్యాప్తు 2018కి ముందే (అంటే 17A సవరణకు ముందే) మొదలయిందని రోహత్గీ చెప్పారు కదా (సుప్రీంకోర్టు : బెంచ్ జస్టిస్ త్రివేదీ, జస్టిస్ బోస్ బెంచ్ ముందు CID తరపున రోహత్గీ, చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా, మనుషేక్ సింగ్ సింఘ్వీ) 12:39 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో మొదలైన వాదనలు ► స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో పునః ప్రారంభమైన వాదనలు ► CID తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గీ ► చంద్రబాబు తరపున హరీష్ సాల్వేతో పాటు అభిషేక్ మనుసింఘ్వి, సిద్ధార్థలూథ్రా ► జస్టిస్ త్రివేదీ : గత విచారణ సందర్భంగా సాల్వే వర్చువల్‌గా హజరయ్యారు. హఠాత్తుగా కేసు విచారణకు సంబంధించిన వర్చువల్ లింకు నుంచి ఎలాంటి అనుమతి లేకుండా తప్పుకున్నారు ► బాబు లాయర్ సాల్వే : దానికి నా క్షమాపణలు, మిగతా లాయర్లు ఉన్నారు కదా అని నేను తప్పుకున్నాను ► జస్టిస్ త్రివేదీ : అదెలా కుదురుతుంది? జస్టిస్ బోసు కూడా అదే అనుకున్నారు 12:36 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో ఇప్పటివరకు ఏం జరిగింది? చంద్రబాబు తరపున ఏం విజ్ఞప్తి చేశారు? కోర్టు ఏమని చెప్పింది? ► స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై అక్టోబర్ 3, 2023న విచారణ జరిపిన సుప్రీంకోర్టు ► బాబు నేరం చేశారా? లేదా? అనే వాదనల జోలికెళ్లని ఆయన లాయర్లు ► గవర్నరు అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయకూడదని వాదన ► అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం అనుమతి తప్పనిసరి ► కాబట్టి ఈ అరెస్టు చెల్లదు.. కేసును క్వాష్ చేయండంటూ బాబు లాయర్ల వాదనలు ► బాబు తరఫున వాదించిన హరీష్ సాల్వే, సిద్దార్థ లూథ్రా, అభిషేక్ సింఘ్వీ ► ఎంతమంది సీనియర్లు బాబు తరఫున వాదిస్తారని అడిగిన ధర్మాసనం ► 2018 జులైలో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ)కు సవరణ ► ఆ తర్వాత జరిగిన నేరాలకే 17ఏ వర్తిస్తుందన్న సీఐడీ న్యాయవాది రోహత్గీ ► స్కిల్ కుంభకోణం 2015–16 మధ్య జరిగిందని వెల్లడి ► విచారణ కూడా 2018కి ముందే ప్రారంభమయిందని వివరణ ► మరి 17ఏ ఎలా వర్తిస్తుందని బాబు లాయర్లను ప్రశ్నించిన కోర్టు ► దీనికి సంబంధించిన పత్రాలను సమర్పించాలని సీఐడీకి ఆదేశం (చదవండి : అక్టోబర్ 3న సుప్రీంకోర్టు ఏం చెప్పింది.. పూర్తి కథనం) 12:35 PM, అక్టోబర్ 9, 2023 కాసేపట్లో సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు కీలక విచారణ ► స్కిల్ స్కామ్ కేసులో తనపై దాఖలైన FIRను కొట్టివేయాలని పిటిషన్ ► విచారణ చేయనున్న జస్టిస్ అనిరుద్ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ► అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A సవరణ తనకు వర్తిస్తుందని బాబు పిటిషన్ ► గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని వాదనలు ► అవినీతి నిరోధక చట్ట 17A సవరణ రాకముందే, స్కిల్ స్కాంలో దర్యాప్తు ప్రారంభమైందని ప్రభుత్వ వాదన ► చంద్రబాబు కేసుకు 17A వర్తించదని ప్రభుత్వ వాదన 11:55AM, అక్టోబర్ 9, 2023 విజయవాడ ACB కోర్టులో కీలక అంశాలు ► లంచ్ తర్వాత చంద్రబాబు బెయిల్ , కస్టడీ పిటిషన్లపై తీర్పు ► లంచ్ తర్వాత రెండు PT వారెంట్లపై విచారణ ► ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ పిటి వారెంట్లపై లంచ్ అనంతరం ఇరుపక్షాల వాదనలు విననున్న ACB కోర్టు ► PT వారంట్ అంటే Prisoner in Transit ► అంటే ఇప్పటికే ఒక కేసులో అరెస్టయి జైల్లో ఉన్న నిందితుడిని మరో కేసులోనూ విచారణ చేపట్టేందుకు వీలుగా వేసే వారంట్ 11:25AM, అక్టోబర్ 9, 2023 ఏ కేసులో చంద్రబాబు పరిస్థితి ఏంటీ? ► స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాల కేసు : ►కోర్టు రిమాండ్ విధించడంతో జైల్లో ఉన్న చంద్రబాబు ►నేడు సుప్రీంకోర్టు ముందు చంద్రబాబు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ►విజయవాడ ACB కోర్టులో CID వేసిన కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు ►విజయవాడ ACB కోర్టులో చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు ►ఈ మధ్యాహ్నం కస్టడీ, బెయిల్‌పై ACB కోర్టు ఆదేశాలిచ్చే అవకాశం ► అంగళ్లు అల్లర్లు కేసు : ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు ► ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట అక్రమాలకు పాల్పడిన కేసు : ►చంద్రబాబు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు ► ఫైబర్‌గ్రిడ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన కేసు : ►అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు ► చంద్రబాబును కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ 11:05AM, అక్టోబర్ 9, 2023 కిం కర్తవ్యం.? ► కాసేపట్లో సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ ► విచారించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ► సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో లాయర్లతో లోకేష్ సమావేశం ► చంద్రబాబు తరఫున మరోసారి నేరుగా రంగంలోకి హేమాహేమీలు ► ఇవ్వాళ కోర్టుకు నేరుగా హరీష్ సాల్వే వస్తాడని టిడిపి వర్గాల ప్రచారం ► ఇప్పటివరకు వర్చువల్‌గా మాత్రమే విచారణకు హాజరయిన సాల్వే ► హరీష్ సాల్వేతో పాటు అభిషేక్ మనుసింఘ్వి, సిద్ధార్థలూథ్రా 10:55AM, అక్టోబర్ 9, 2023 పార్టీని తాకట్టు పెట్టేందుకు రెడీ.! ►ఢిల్లీలో పార్టీతో వ్యాపారం చేస్తోన్న చినబాబు : ఎంపీ విజయసాయిరెడ్డి ►పార్టీని విలీనం చేస్తా, కాపాడాలంటూ ఆఫర్లు మరో పదేళ్ల దాకా విముక్తి దొరకని డజనుకు పైగా స్కాముల నుంచి బయట పడేస్తే తమ పార్టీని బిజెపిలో విలీనం చేస్తానని ఎల్లో మీడియా ముఖ్యుల ద్వారా కాళ్ల బేరానికి వెళ్లినట్టు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 6 లక్షల కోట్లు పోగేశాడు. అనుభవించింది లేదు. బయటికొస్తే చాలు, బలుసాకు… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 9, 2023 10:43AM, అక్టోబర్ 9, 2023 బాబు బెయిల్ పిటిషన్ తిరస్కృతి ►చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ ►చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు ►ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరణ ►ఇన్నర్‌రింగ్ రోడ్, అంగళ్లు కేసుల్లో బెయిల్ పిటిషన్లు కొట్టివేత (చదవండి : అంగళ్లు అల్లర్ల కేసు పూర్వపరాలేంటీ?) (చదవండి : ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట బాబు సృష్టించిన మాయా ప్రపంచమేంటీ?)9:43 AM, అక్టోబర్ 9, 2023 యువగళం సంగతేంటీ? భువనేశ్వరీ బస్సు యాత్ర ఎటు పోయింది? ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతల పడరాని పాట్లు ►చివరకు.. చంద్రబాబు భార్య భువనేశ్వరి బస్సు యాత్ర చేపడతారని ప్రకటన ►తనకు అంతగా రాజకీయాలు తెలియవని చెప్పినా భువనేశ్వరిని బలవంతంగా ఒప్పించిన సీనియర్లు ►ఈ నెల 5న కుప్పం నుంచి యాత్ర ప్రారంభిస్తారని ఎల్లో మీడియాలో కథనాలు ►మేలుకో తెలుగోడా అనే పేరు కూడా ఖరారు చేసినట్టు ప్రచారం ►ఢిల్లీ నుంచి లోకేష్ రాగానే మారిన సీను ►తాను ఢిల్లీలో ఉంటూ అమ్మ ప్రజల్లో తిరిగితే తన పరిస్థితి ఏంటని చినబాబు సీరియస్ ►సుప్రీంకోర్టులో ఏదో ఒకటి తెలిసే వరకు ఆగాలని లోకేష్ సూచించినట్టు పార్టీలో ప్రచారం ►యువగళం ఇప్పుడు తిరిగి ప్రారంభించేకంటే.. ఇంకొన్నాళ్లు ఆగే ఉద్దేశ్యంలో లోకేష్ ►ఎన్నికలకు ఎలాగూ ఆరు నెలలు ఉంది కదా ఇప్పుడే తొందరెందుకు అన్నట్టుగా టిడిపి తీరు ►రాజకీయాలకు బ్రాహ్మణీ, భువనేశ్వరీ దూరంగా ఉంటారని మొన్న రాజమండ్రిలో ప్రకటించిన లోకేష్ ►ఎన్టీఆర్ కూతురే అయినా భువనేశ్వరీ ఇంతవరకు బయటకు రాలేదని సమర్థించుకున్న లోకేష్ 9:30 AM, అక్టోబర్ 9, 2023 జైలు వద్ద నిరంతర భద్రత.. ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 30వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►విస్తృతమైన భద్రత ఏర్పాట్ల మధ్య జైల్లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►జైలు బయట 300 మంది పోలీసులతో నిరంతర భద్రత ►ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ ►చంద్రబాబు కోసం జైలు ఆవరణలో నిరంతరం సన్నద్ధంగా ప్రత్యేక వైద్య బృందం 9:15 AM, అక్టోబర్ 9, 2023 చంద్రబాబుకు విజయసాయి కౌంటర్.. చంద్రబాబు కోసం దేశంలోని టాప్ 10 లాయర్లు, వారిలో నలుగురు బ్యాటరీ ఆఫ్ అడ్వొకేట్స్తో మూడు కోర్టుల్లో అనేక వ్యాజ్యాలు నడుపుతున్నారు. చట్టం అందరికీ ఒకటి కాదా? చంద్రబాబు గారి కోసం దేశంలోని టాప్ 10 లాయర్లలో నలుగురు, వారి బ్యాటరీ ఆఫ్ అడ్వొకేట్స్ తో మూడు కోర్టుల్లో అనేక వ్యాజ్యాలు నడుపుతున్నారు. అన్యాయంగా ఎలా అరెస్టు చేశారు? చిన్నపాటి స్కాంకు ప్రపంచస్థాయి నాయకుడిని లోపల వేస్తారా? అంటూ సామాజికవర్గ ప్రముఖులు ఆర్తనాదాలు చేస్తున్నారు. చట్టం… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 9, 2023 9:00 AM, అక్టోబర్ 9, 2023 వాడకమంటే చంద్రబాబుదే.. ►సినిమా వాళ్లనే వాడుకోవడంలో చంద్రబాబు దిట్ట ►అవసరం తీరాక కరివేపాకులా తీసిపడేస్తాడు. మీరే చూడండి @ncbn సినిమా వాళ్ళని ఎలా వాడుకుంటాడు తరవాత కరివేపాకు లా పాడేస్తాడు అనే దానికి @PawanKalyan మినహాయింపు కాదు చిరంజీవి సభలకు ఎక్కువ జనం వస్తున్నారు అని విలేకరి అడిగితే మా బావమరిది కొడుకు @tarak9999 కి అంతకంటే 3రెట్లు జనాలు వస్తున్నారు అన్నాడు..తర్వాత కరివేపాకులా!😔 pic.twitter.com/FCSpT2KU8D — YSRCP IT WING Official (@ysrcpitwingoff) October 8, 2023 7:30 AM, అక్టోబర్ 9, 2023 జైలులో నేటికి నెల.. ►చంద్రబాబు జైలుకి వెళ్లి నేటికి 30 రోజులు ►రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►చంద్రబాబు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణ ►ఇంటి నుంచే చంద్రబాబు మందులు, భోజనం 7:10 AM, అక్టోబర్ 9, 2023 5 కేసుల్లో నేడు తీర్పు వచ్చే అవకాశం, క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ ►1. బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు ►2. సీఐడీ కస్టడీ పిటిషన్-ఏసీబీ కోర్టు తీర్పు ►3. అంగళ్లు కేసులో బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు ►4.ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు ►5. ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు ►టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నెల రోజులు - గత నెల 9న నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ 7:00 AM, అక్టోబర్ 9, 2023 అందరి దృష్టి కోర్టుల వైపే ►టీడీపీ అధినేత చంద్రబాబుకి సంబంధించిన కేసుల్లో సోమవారం కీలకం కానుంది. ►దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు, తీర్పులు వెలువడనున్నాయి. ►స్కిల్ స్కాంకు సంబంధించి సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. ►ఇదే కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ►పోలీసు కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై సైతం ఏసీబీ కోర్టు తగిన ఉత్తర్వులు జారీచేయనుంది. ►రెండు పిటిషన్లపై శుక్రవారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. 6:55AM, అక్టోబర్ 9, 2023 ఐటమ్ 59గా చంద్రబాబు పిటిషన్.. ►జస్టిస్ అనిరుద్దాబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ ►ఆరవ నంబర్ కోర్టులో ఐటమ్ 59గా ఈ పిటిషన్‌ను జాబితాలో చేర్చారు. ►గత విచారణ సందర్భంగా హైకోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం 6:50 AM, అక్టోబర్ 9, 2023 హైకోర్టులో కూడా నేడు తీర్పులు.. ►హైకోర్టులోనూ చంద్రబాబుకు సంబంధించిన మూడు బెయిలు పిటిషన్లపై నేడు తీర్పులు వెల్లడికానున్నాయి. ►రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరు పిటిషన్లు దాఖు ►ఈ కేసులో వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పులను రిజర్వు చేసింది. ►ఈ మూడు పిటిషన్లలో న్యాయమూర్తి సోమవారం నిర్ణయం వెల్లడించనున్నారు. 6:30 AM, అక్టోబర్ 9, 2023 బాబు పై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు? ►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే ►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే ►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. ►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే. ►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే ►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే ►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. ►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు ►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే ►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే ►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే ►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే ►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? : YSRCP 6:20 AM, అక్టోబర్ 9, 2023 పత్తా లేని చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల’ ► పక్కా ప్లాన్ తో పరారీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావు చౌదరీ ►ప్రస్తుతం ప్రణాళికా శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న పెండ్యాల శ్రీనివాసరావు చౌదరీ ►స్కిల్ కుంభకోణం కేసుతో పాటు ఐటీ నోటీసుల్లో పెండ్యాల శ్రీనివాసరావు పేరు ►విచారణ నిమిత్తం సీఐడీ గతంలో ఆయనకు నోటీసులు కూడా జారీ ►అయితే, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు పారిపోయిన పెండ్యాల ►శుక్రవారంలోగా రాష్ట్రానికి తిరిగి రావాల్సిందిగా ఈమెయిల్ ద్వారా నోటీసు పంపిన ప్రభుత్వం ►చంద్రబాబు చేసిన అక్రమ దందాల లెక్కలన్నీ పెండ్యాల హ్యండిల్ చేసినట్టు ఆధారాలు ►ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ కూడా నోటీసులు ఇచ్చింది పెండ్యాలకే ►పెండ్యాల దగ్గర స్వాధీనం చేసుకున్న ఆధారాలను బట్టి చంద్రబాబు సృష్టించిన బ్లాక్ మనీ రూ.2వేల కోట్లు ►లెక్కలు లేని రూ.2వేల కోట్లకు సంబంధించిన వివరాలివ్వాలని చంద్రబాబును అడిగిన ఐటీ -
ఎమ్మెల్యే శంకరనారాయణ వాహనంపై డిటోనేటర్‌తో దాడి
గోరంట్ల: శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ వాహనంపై ఆదివారం ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ డిటోనేటర్‌తో దాడిచేశాడు. అది పేలకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ సుబ్బరాయుడు తెలిపిన మేరకు.. ఎమ్మెల్యే శంకరనారాయణ పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. అదే సమయంలో సోమందేపల్లి మండలం గుడిపల్లికి చెందిన హరిజన గణేశ్ తన జేబులో ఉన్న ఎలక్ట్రికల్ డిటోనేటర్ తీసుకుని ఎమ్మెల్యే వాహనంపై విసిరాడు. అది పేలలేదు. గమనించిన సీఐ సుబ్బరాయుడు, పోలీసు సిబ్బంది వెంటనే గణేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గోరంట్ల పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. నిందితుడు గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని నాసన్ కంపెనీలో డ్రైవర్ విధులతోపాటు డిటోనేటర్లు పేల్చేపని చేసేవాడు. ఆదివారం అతిగా మద్యం తాగడంతో కాంట్రాక్టర్ పనుల్లో పెట్టుకోకుండా వెళ్లిపొమ్మన్నాడు. దీంతో అతడు నేరుగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీ, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నాడు. మద్యం మత్తులో ఎమ్మెల్యే వాహనంపైకి డిటోనేటర్ విసిరాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ మాధవరెడ్డి, పెనుకొండ డీఎస్పీ ఉసేన్‌పీరా గోరంట్ల స్టేషన్‌కు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మరింత లోతుగా విచారించి నిజానిజాలు నిగ్గుతేలుస్తామని ఎస్పీ తెలిపారు. ఘటన దురదృష్టకరం నియోజకవర్గంలో ఎలాంటి ఫ్యాక్షన్ ప్రభావం లేకుండా ప్రజలకు సేవచేస్తున్నా. డిటోనేటర్ పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన దురదృష్టకరం. పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – ఎమ్మెల్యే శంకరనారాయణ -
అయ్యో.. ఏమైందమ్మా..!
కాకినాడ రూరల్: కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఆ యువతి తోడుగా నిలిచేది.. వలంటీర్‌గా తన పరిధిలోని ప్రజలతో ఆప్యాయంగా మసలుకునేది.. తన పరిధిలోని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందించేది.. ఇటీవలే పెళ్లి కూడా కుదిరింది.. ఇంతలోనే ఏమైందో ఏమో.. బలవన్మరణానికి పాల్పడింది.. కుటుంబ సభ్యులకు విషాదాన్ని మిగిల్చింది. తమ సేవా సారథి అర్ధాంతరంగా జీవితాన్ని ముగించిందని తెలిసి.. ఆమె పరిధిలోని ప్రజలు విచారంలో మునిగిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం తారకరామ కాలనీకి చెందిన కొక్కరి మహిమ (26) సచివాలయం–3లో వలంటీరుగా పని చేస్తోంది. తండ్రి విజయ్‌కుమార్ ఆటో డ్రైవర్. తల్లి రత్నకుమారి గృహిణి. తమ్ముడు కాకినాడ మెయిన్ రోడ్డులోని వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. కాకినాడకు చెందిన యువకుడితో పెద్దల సమక్షంలో మహిమకు గత నెల 11న వివాహ నిశి్చతార్థం జరిగింది. త్వరలో వివాహం జరగాల్సి ఉంది. నిశి్చతార్ధం తరువాత ఆమె చాలా సంతోషంగా కనిపించేది. తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి ప్రేయర్ కోసం చర్చికి వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఏమైందో.. ఏమో కానీ.. రాత్రి సుమారు 9.45 గంటల సమయంలో మహిమ తమ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ప్రేయర్ అనంతరం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఫ్యాన్‌కు వేలాడుతున్న కుమార్తెను చూసి గొల్లుమన్నారు. స్థానికులు సహాయంతో కిందకు దించి, కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో నిండిపోయారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇంద్రపాలెం ఎస్సై దేవ సుధ శనివారం కేసు నమోదు చేశారు. సంఘటన స్థలంలో లభించిన మహిమ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారికి భారం కాకూడదనే ఉద్దేశంతోనే మహిమ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. జీజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం మహిమ మృతదేహానికి మధ్యాహ్నం ఇంద్రపాలెంలో అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వలంటీర్ మహిమ మృతి పట్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులను ఆదుకుంటామని తెలిపారు. నా చావుకు ఎవ్వరూ బాధ్యులు కారు నా చావుకు ఎవ్వరూ బాధ్యులు కారు. మానసిక స్థితి బాగో లేదు. మానసిక ఒత్తిడి భరించలేకపోతున్నాను. అమ్మా నాన్నా.. ఐ మిస్ యూ.. ఐ లవ్ యూ.. బతకాలని ఉంది. కానీ భరించలేకపోతున్నాను. (కాబోయే భర్త రాజేష్ ను ఉద్దేశించి) నా కంటే మంచి అమ్మాయి దొరుకుతుంది. – సూసైట్ నోట్లో మహిమ ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
Oct 8th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates 6:30PM, అక్టోబర్ 08 2023 రేపు చంద్రబాబు కేసులకు సంబంధించి అత్యంత కీలకం 5 కేసుల్లో తీర్పు, క్వాష్ పిటిషన్ పై సుప్రీంలో విచారణ ►1. బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు ►2. సీఐడీ కస్టడీ పిటిషన్-ఏసీబీ కోర్టు తీర్పు ►3. అంగళ్లు కేసులో బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు ►4.ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు ►5. ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు ►టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నెల రోజులు - గత నెల 9న నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ 6:00PM, అక్టోబర్ 08 2023 అర్జంటుగా ఇండియా కూటమికి జై కొట్టేద్దామా? ► తెలుగుదేశం క్యాడర్ లో తీవ్ర అంతర్మథనం ► ఇటీవల వరుసగా జరుగుతున్న టిడిపి భేటీల్లో పార్టీ దుస్థితిపై చర్చ ► టిడిపి సీనియర్ నేత సమాచారం ప్రకారం కార్యకర్తల్లో సడలిన విశ్వాసం ► ఎన్నికలకు ఏడు నెలల ముందు ఇంత గందరగోళమా? ► ఒక్క అరెస్ట్‌కే పార్టీ అతలాకుతులం కావాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? ► జాతీయ స్థాయిలో రెండు కూటములు తెలుగుదేశం పార్టీని, లోకేష్ ను ఎందుకు దూరం పెడుతున్నాయి? ► నాడు మోదీని చంద్రబాబు ఎందుకు నానా మాటలు అనాలి? ఇప్పుడెందుకు లోకేష్ వెళ్లి కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించాలి? ► ఇప్పటికిప్పుడు బహిరంగంగా ఇండియా కూటమికి జై కొడితే మార్పు ఉంటుందా? ► కనీసం కాంగ్రెస్ అధిష్టానంతోనయినా చంద్రబాబు అరెస్ట్ ఖండించేలా ప్రకటన చేయిద్దామా? ► మన బలహీనతను పవన్ కళ్యాణ్ ఎత్తిపొడుస్తున్నా... మనం మాత్రం జనసేనకు జై కొట్టాలా? ► తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉందని పవన్ కళ్యాణ్ బహిరంగసభలో ఎలా ప్రకటిస్తాడు? ► లోకేష్ జనంలో ఉండకుండా... ఢిల్లీకి ఎందుకు పరిమితం అవుతున్నట్టు? 5:42PM, అక్టోబర్ 08 2023 బాబు పై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు? ►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే ►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే ►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. ►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే. ►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే ►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే ►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. ►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు ►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే ►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే ►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే ►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే ►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? : YSRCP 5:24PM, అక్టోబర్ 08 2023 యువగళం సంగతేంటీ? భువనేశ్వరీ బస్సు యాత్ర ఎటు పోయింది? ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతల పడరాని పాట్లు ►చివరకు.. చంద్రబాబు భార్య భువనేశ్వరి బస్సు యాత్ర చేపడతారని ప్రకటన ►తనకు అంతగా రాజకీయాలు తెలియవని చెప్పినా భువనేశ్వరిని బలవంతంగా ఒప్పించిన సీనియర్లు ►ఈ నెల 5న కుప్పం నుంచి యాత్ర ప్రారంభిస్తారని ఎల్లో మీడియాలో కథనాలు ►మేలుకో తెలుగోడా అనే పేరు కూడా ఖరారు చేసినట్టు ప్రచారం ►ఢిల్లీ నుంచి లోకేష్ రాగానే మారిన సీను ►తాను ఢిల్లీలో ఉంటూ అమ్మ ప్రజల్లో తిరిగితే తన పరిస్థితి ఏంటని చినబాబు సీరియస్ ►సుప్రీంకోర్టులో ఏదో ఒకటి తెలిసే వరకు ఆగాలని లోకేష్ సూచించినట్టు పార్టీలో ప్రచారం ►యువగళం ఇప్పుడు తిరిగి ప్రారంభించేకంటే.. ఇంకొన్నాళ్లు ఆగే ఉద్దేశ్యంలో లోకేష్ ►ఎన్నికలకు ఎలాగూ ఆరు నెలలు ఉంది కదా ఇప్పుడే తొందరెందుకు అన్నట్టుగా టిడిపి తీరు 5:04PM, అక్టోబర్ 08 2023 కుటుంబ సభ్యులను కూడా నమ్మడం లేదా? ► జైల్లో చంద్రబాబుకు కుటుంబ సభ్యుల నుంచి కొత్త తలనొప్పి ► పార్టీ పగ్గాల విషయంలో ఎవరినీ నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ► చంద్రబాబు అరెస్ట్ కాగానే పార్టీ సారథ్యం నేనంటూ ముందుకొచ్చిన బాలకృష్ణ ► టిడిపి కార్యాలయంలో మీటింగ్ లు పెట్టి మరీ నేనేనని ప్రకటించిన బాలకృష్ణ ► బాలకృష్ణను అత్యంత చాకచక్యంగా ఏపీ నుంచి తప్పించిన చంద్రబాబు ► తెలంగాణ ఎన్నికల వరకు ఏపీ వ్యవహారాలు పక్కనబెట్టి హైదరాబాద్ లోనే ఉండాలని బాలకృష్ణకు సూచన ► బావ మాట కాదనలేక హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు పరిమితమైన బాలకృష్ణ ► తెలంగాణలో ఒక్క సీటులో కూడా తెలుగుదేశం కచ్చితంగా గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి ► అయినా భీకర ప్రకటనలు చేస్తూ లేని గాంభీర్యం ప్రదర్శిస్తోన్న బాలకృష్ణ ► బావ చంద్రబాబు కొట్టిన దెబ్బను అర్థం చేసుకున్నా.. బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో బాలకృష్ణ 4:40PM, అక్టోబర్ 08 2023 పత్తా లేని చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల’ ► పక్కా ప్లాన్ తో పరారీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావు చౌదరీ ►ప్రస్తుతం ప్రణాళికా శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న పెండ్యాల శ్రీనివాసరావు చౌదరీ ►స్కిల్ కుంభకోణం కేసుతో పాటు ఐటీ నోటీసుల్లో పెండ్యాల శ్రీనివాసరావు పేరు ►విచారణ నిమిత్తం సీఐడీ గతంలో ఆయనకు నోటీసులు కూడా జారీ ►అయితే, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు పారిపోయిన పెండ్యాల ►శుక్రవారంలోగా రాష్ట్రానికి తిరిగి రావాల్సిందిగా ఈమెయిల్ ద్వారా నోటీసు పంపిన ప్రభుత్వం ►చంద్రబాబు చేసిన అక్రమ దందాల లెక్కలన్నీ పెండ్యాల హ్యండిల్ చేసినట్టు ఆధారాలు ►ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ కూడా నోటీసులు ఇచ్చింది పెండ్యాలకే ►పెండ్యాల దగ్గర స్వాధీనం చేసుకున్న ఆధారాలను బట్టి చంద్రబాబు సృష్టించిన బ్లాక్ మనీ రూ.2వేల కోట్లు ►లెక్కలు లేని రూ.2వేల కోట్లకు సంబంధించిన వివరాలివ్వాలని చంద్రబాబును అడిగిన ఐటీ 4:10PM, అక్టోబర్ 08 2023 రంగంలోకి బీజేపీలోని టీడీపీ లీడర్లు.. ►జైలులో ఉన్న చంద్రబాబు కోసం రంగంలోకి బీజేపీలోని టీడీపీ లీడర్లు ►చంద్రబాబును రక్షించేందుకు ఏం చేయాలో సమాలోచనలు ►గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో తిరుగుతున్న సీఎం రమేష్, సుజనా చౌదరీ ►నడ్డాను ఎల్లో మీడియాకు తీసుకెళ్లేందుకు సర్వ శక్తులు ఒడ్డిన తెలుగు బీజేపీ నేతలు ►చంద్రబాబు విషయంలో జోక్యం చేసుకోవాలని నడ్డాకు ఎల్లో మీడియా విజ్ఞప్తులు ►చంద్రబాబు విషయంలో జోక్యం చేసుకుంటే.. తెలంగాణ ఎన్నికలకు సహకరిస్తామంటూ రాయబేరాలు ►చంద్రబాబుకు ప్రజల్లో సానుభూతి వచ్చేందుకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ►అయినా పట్టించుకోకపోవడంతో ఎల్లో మీడియా సంపాదకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు ►నేరుగా ప్రధాని మోదీ వ్యక్తిత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నాలు 3:30PM, అక్టోబర్ 08 2023 ఆశలన్నీ అక్టోబర్ 9 మీదే.. ►అక్టోబర్ తొమ్మిదో తేదీపై టీడీపీ కోటీ ఆశలు ►సుప్రీంకోర్టులో కేసు నెగ్గేందుకు దారులపై సీనియర్ నేతలతో సమాలోచనలు ► సాంకేతిక కారణాలు తప్ప బలమైన గ్రౌండ్ చంద్రబాబుకు ఈ కేసులో లేవంటున్న లాయర్లు ► గవర్నర్ అనుమతి తీసుకోలేదని బలంగా వాదించాలని సూచన ► ఇప్పటికే గట్టి వాదనలతో CIDకి కేసులో ఎడ్జ్ ► కేసు దర్యాప్తు సెక్షన్ 17A సవరణకు ముందే ప్రారంభమయిందని స్పష్టం చేసిన CID 2:31PM, అక్టోబర్ 08 2023 Justice delayed is justice denied ఎంత కరెక్టో Justice hurried is justice buried కూడా అంతే కరెక్ట్ : YSRCP ►న్యాయం ఆలస్యం కాకూడదు ►అదే విధంగా వేగంగా న్యాయ నిర్ణయాలు తీసుకోకూడదు ► రూ. 100 కోట్ల లిక్కర్ కుంభకోణం లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఎనిమిది నెలలుగా జైల్లో ఉన్నాడు ► రూ. 371 కోట్ల స్కిల్ కుంభకోణం లో తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి 27 కోట్ల రూపాయల వచ్చాయి ,మిగిలిన సొమ్ము బాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి ద్వారా బాబుకు ముట్టాయి. ►అమరావతి కాంట్రాక్టర్ల నుంచి రూ. 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరికి ఇచ్చానని షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు ►అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4న కేంద్ర సంస్థ ఇన్‌కమ్‌ట్యాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. ►CID నోటీస్ అందుకోగానే వాళ్ళు ఇద్దరూ విదేశాలకు పారిపోయారు 2:30PM, అక్టోబర్ 08 2023 ►17 A మీద ప్రశాంత్ భూషణ్ అనే సీనియర్ న్యాయవాది 2018 నవంబర్ 15న ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు ►ఆ తీర్పు ఈ ఏడాది నవంబర్ 20న విచారణకు వచ్చే అవకాశం ఉంది ►అప్పటి వరకు 17A మీద చంద్రబాబు వాదన మీద నిర్ణయం తీసుకోవద్దు అని కోరాలని సీబీసీఐడి లాయర్ల యోచన 12:52 PM, అక్టోబర్ 08 2023 టీడీపీ నేత బండారు వ్యాఖ్యల పై సుప్రీంకోర్టుకు వెళ్తా : మంత్రి రోజా ►న్యాయపరంగా పోరాడతా ►బండారు లాంటి చీడపురుగులను ఏరిపారేయాలి ►మహిళలను ఒకమాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలి ►మహిళలను కించపరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు ►చంద్రబాబు జైలుకెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కింది ►చంద్రబాబు తప్పు చేయకుంటే ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? ►టీడీపీ ఫెయిల్యూర్‌ను డైవర్ట్ చేయడానికే నన్ను టార్గెట్ చేశారు ►టీడీపీ, జనసేనకు దిగజారుడు రాజకీయాలే తెలుసు 12:21 PM, అక్టోబర్ 08 2023 చంద్రబాబు అక్రమంగా దోచుకున్న విషయం నిజం కాదా?: మంత్రి కాకాణి ►కోర్టులో చంద్రబాబు లాయర్లు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ►లైట్స్ ఆర్పేసి మేము దోచుకుంటాం అన్నట్లుగా టీడీపీ నేతలు కార్యక్రమాలు చేస్తున్నారు.. ►చంద్రబాబు తప్పు చేయలేదని.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎల్లో మీడియా కష్టపడుతోంది.. 12:09 PM, అక్టోబర్ 08 2023 లోకేష్, భువనేశ్వరి లకు సూటి ప్రశ్న ►కొంచెం సావధానముగా సమాధానం చెప్పండి Mam me nana garu edo chepparu okasari vinandi pic.twitter.com/X9QUNAXhnU — Naveen Kumar (@NaveenKNi) October 2, 2023 11:08 AM, అక్టోబర్ 08 2023 భువనేశ్వరీ ప్రకటనపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి: YSRCP ►ఎన్టీఆర్ కన్నీళ్లు కార్చితేనే స్పందించని భువనేశ్వరి ఇతర మహిళల కష్టాలకు స్పందిస్తుందా? ►హెరిటేజ్‌లో 2% అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని భువనేశ్వరి అన్నారు ►అసలు Heritage విలువ ఎంత? అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తల్లి భువనేశ్వరిని కూడా ఇరికించిన నారా లోకేష్#LooterLokesh#CorruptBabuNaidu#SkilledCriminalCBNInJail #AmaravathiLandScam#TDPInsiderTrading#TDPScams#KhaidiNo7691 pic.twitter.com/EAnSfS9Fok — YSR Congress Party (@YSRCParty) October 6, 2023 09:55 AM, అక్టోబర్ 08 2023 టీడీపీపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు ►మీరు చెప్పినట్టుగానే లైట్లు ఆపేసిన ఇళ్లు లెక్కవేస్తే 2019లో వచ్చిన ఆ 23 కూడా 2024లో రావటగా! ►రాష్ట్రాన్ని ఆర్పేసిన బాబు కోసం మేమెందుకు మా ఇళ్ళల్లో లైట్లను ఆపాలంటున్నారట తెలుగు తమ్ముళ్లు ►ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంకొంతమంది నేతలు టపాసులు కాల్చారట ►వాళ్ళ ఆనందమే వేరులే ►మొత్తానికి టీడీపీ ఆరిపోయే దీపం అని మీరే సింబాలిక్ గా చెప్పడం ఎదైతో ఉందో...నభూతో నభవిష్యత్ మీరు చెప్పినట్టుగానే లైట్లు ఆపేసిన ఇళ్లు లెక్కవేస్తే 2019లో వచ్చిన ఆ 23 కూడా 2024లో రావటగా! రాష్ట్రాన్ని ఆర్పేసిన బాబు కోసం మేమెందుకు మా ఇళ్ళల్లో లైట్లను ఆపాలంటున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంకొంతమంది నేతలు టపాసులు కాల్చారట! వాళ్ళ ఆనందమే వేరులే! మొత్తానికి టీడీపీ… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 8, 2023 09:30 AM, అక్టోబర్ 08 2023 చంద్రబాబు పిటిషన్ @ సుప్రీంకోర్టు ► సుప్రీంకోర్టులో 59వ నంబర్‌గా లిస్ట్ అయిన చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ► అక్టోబర్ 9, 2023, సోమవారం రోజు సుప్రీం కోర్టులో లిస్ట్ అయిన చంద్రబాబు కేసు 08:15 AM, అక్టోబర్ 08 2023 రాజమండ్రి సెంట్రల్ జైల్లో 29వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►చంద్రబాబుకు యథావిధిగా కొనసాగుతున్న భద్రత ►రేపు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టులో విచారణకు రానున్న కీలక కేసులు ►సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న క్వాష్‌పై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు ►హడావుడిగా మరోసారి ఢిల్లీ వెళ్లిన లోకేష్ ►చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనకు ప్రజాస్పందన కరువు ►లోకేష్ క్యాంప్ ఆఫీస్ మినహా మిగిలిన చోట్ల పెద్దగా కనిపించని ఆందోళన కార్యక్రమం Presenting India’s biggest and most notorious scamster Mr. Nara Chandra Babu Naidu @ncbn, who looted a whopping ₹6 Lakh Crores of Public Money! Costarring his coterie of co-looters Guru - Mr Ramoji Rao Biological Son - Mr @NaraLokesh Adopted Son - Mr @PawanKalyan And… pic.twitter.com/tuQHUCEFPy — YSR Congress Party (@YSRCParty) October 5, 2023 07:50 AM, అక్టోబర్ 08 2023 నా ఆస్తి లక్ష కోట్లు : చంద్రబాబు వీడియోను విడుదల చేసిన YSRCP ► తన ఆస్తి గురించి బహిరంగంగా ప్రసంగించిన చంద్రబాబు ► నా ఆస్తే లక్ష కోట్ల రుపాయలని ప్రకటించిన చంద్రబాబు ► ఎలక్షన్ అఫిడవిట్లో ఒక లెక్క, తెర వెనక మరో లెక్క కేవలం 2 ఎకరాలతో మొదలైన నువ్వు, అన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించావ్ చంద్రబాబూ? ఎంత మంది పేద ప్రజలను దోచుకుంటే అన్ని లక్షల కోట్లు సంపాదించావ్ @ncbn? #GajaDongaChandrababu#CorruptionKingCBN pic.twitter.com/v9Zqvi3Whs — YSR Congress Party (@YSRCParty) October 5, 2023 07:46 AM, అక్టోబర్ 08 2023 దోచుకుంటే జైల్లో పెట్టరా?: మంత్రి దాడిశెట్టి రాజా ►అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.370 కోట్లు చంద్రబాబు అప్పనంగా దోచేశారు ►బాబును జైల్లో పెట్టకుండా సన్మానాలు చేస్తారా.. ►చంద్రబాబు వల్ల ఒకతరం యువత మొత్తం మోసపోయింది 07:30 AM, అక్టోబర్ 08 2023 స్కిల్ స్కాంలో ఈ సందేహాలను టీడీపీ తీరుస్తుందా? : YSRCP ► స్కిల్ కార్పోరేషన్ ఏర్పాటు జరిగింది అక్టోబరు, 2014లో ► నిధుల విడుదల జరిగింది డిసెంబరు, 2015లో ► నిధుల విడుదల తర్వాత సెంటర్లు ప్రారంభమైంది 19 నెలల తర్వాత ► నిధుల విడుదలకు అంత ఆత్రం చూపించిన వారు సెంటర్లు ఎందుకు ఆలస్యం చేశారు? ► సీమెన్స్ వాటా గురించి ఆగకుండా నిధులు విడుదల చేయమని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని నోట్‌ఫైల్‌లో చీఫ్ సెక్రటరీ రాసిందానిపై ఏమంటారు? ► కేంద్ర సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI) సెబి ద్వారా GST శాఖ (గూడ్స్ & సర్వీస్ టాక్స్)కు అలర్ట్ వచ్చిందానిపై ఏమంటారు? ► GST చంద్రబాబు ప్రభుత్వాన్ని అలర్ట్ చేయగానే బాధ్యులెవరో తేల్చండి అంటూ చర్య ఎందుకు తీసుకోలేదు? ► చంద్రబాబు హయాంలో ACB (అవినీతి నిరోధక శాఖ) విచారణ ప్రారంభించి, ఎందుకు వెంటనే ఆపేసింది ? ► ACB (అవినీతి నిరోధక శాఖ) శాఖ రిపోర్టు చేసేది ముఖ్యమంత్రికే. అంటే విచారణ ఆపేయడానికి కారణం ఎవరు? ► సీమెన్స్ 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ప్రకటించిన చంద్రబాబు ► కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇస్తుందని చెప్పుకొచ్చిన తెలుగుదేశం నేతలు ► అసలు మాకు సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా ప్రకటించిన సీమెన్స్ ► కాదు, కాదు సీమెన్స్ గ్రాంట్ ఇన్ కైండ్ ఇచ్చిందంటూ ప్రకటించిన సుమన్ బోస్ ► అంటే కేవలం బ్రాండింగ్ కోసం సీమెన్స్‌ను కలుపుకున్నారా? ► మొత్తం డాక్యుమెంట్లలో ఎక్కడా డేట్, ప్లేస్‌తో పాటు అన్నీ ముఖ్యమైన వివరాల దగ్గర ఖాళీలెందుకు ఉంచారు? ► అసలు ఇంత ముఖ్యమైన ఒప్పందాన్ని చీకట్లో ఎందుకు చేసుకున్నారు? 07:10 AM, అక్టోబర్ 08 2023 చంద్రబాబుపై కనిపించని సానుభూతి ►కాంతితో క్రాంతి కార్యక్రమానికీ స్పందన కరువు ►బాబు అరెస్టుతో సానుభూతి పొందాలని టీడీపీ ప్రయత్నాలు ►పట్టించుకోని ప్రజలు, పార్టీ కార్యకర్తలు ►టీడీపీ ఎన్ని కార్యక్రమాలు చేసినా అన్నీ విఫలం ►బాబు అవినీతి చేశారని ప్రజలు నమ్ముతున్నారంటున్న విశ్లేషకులు ►అందుకే టీడీపీ పిలుపునకు స్పందించడంలేదని వెల్లడి 07:01 AM, అక్టోబర్ 08 2023 మళ్లీ ఢిల్లీ విమానం ఎక్కిన లోకేశ్ ►టీడీపీ శ్రేణుల్లో అయోమయం ►సీఎం జగన్ ఢిల్లీ వెళ్లగానే రాజమండ్రికి వచ్చిన చినబాబు ►సీఎం తిరిగి రాగానే మళ్లీ ఢిల్లీకి వెళ్లిన వైనం ►ఇదంతా అరెస్టు భయం వల్లే అంటున్న ఆ పార్టీ నేతలు ►కీలక వేళ పార్టీని వదిలేస్తున్నారని క్యాడర్లో ఆందోళన వీళ్లిద్దరు కలిసి రెండు పార్టీలను నడపటం 🤣#PackageStarPK #LooterLokesh pic.twitter.com/8gk2jVMiHb — Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) October 2, 2023 06:37 AM, అక్టోబర్ 08 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @29 ►స్కిల్ స్కామ్ కేసులో 29వ రోజుకి చేరిన రిమాండ్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ నెంబర్ 7691గా బాబు ►మూడోసారి రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►తాజాగా.. అక్టోబర్ 19దాకా రిమాండ్ పొడిగింపు చంద్రబాబు లాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలోనే ఎవరూ లేరు. అధికారంలో ఉన్నపుడు వందల మందిని అక్రమంగా అరెస్టు చేయించాడు. నేను కూడా ఆయన బాధితుడినే. @ncbn స్కామ్‌లు చేసి ఆధారాలతో సహా అడ్డంగా దొరికి జైలుకు వెళ్లాడు. తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించక తప్పదు. - APSFL ఛైర్మన్ గౌతం రెడ్డి… pic.twitter.com/6TkpdCZLud — YSR Congress Party (@YSRCParty) October 7, 2023 -
Oct 7th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates 08:00PM, అక్టోబర్ 07 2023 టీడీపీ నేత బండారుపై సినీనటి రమ్యకృష్ణ ఆగ్రహం ►మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా? ►బండారు సత్యనారాయణని క్షమించకూడదు ►బండారు అసభ్యంగా దూషించడం దారుణం ►మన దేశంలో మాత్రమే భారత మాతాకి జై అని గర్వంగా చెప్తాం ►మనదేశం ప్రపంచంలోనే ఐదవ అత్యుత్తమ ఆర్థిక దేశంగా అవతరిస్తోంది. ►అలాంటి దేశంలో ఓ మహిళ మంత్రిని ఇంత దారుణంగా మాట్లాడతారా?, ►కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్‌తో సంబంధం లేకుండా బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు ఖండించాలి. ►నేను ఓ మహిళ గా, నటిగా , స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటా 07:38PM, అక్టోబర్ 07 2023 ►టిడిపి ఇచ్చిన కాంతితో క్రాంతి కార్యక్రమం పట్టించుకోని ప్రజలు ►ఇళ్లలో లైట్లు ఆర్పి క్యాండిల్స్ వెలిగించాలని టీడీపీ పిలుపు ►యథావిధిగా వ్యాపారాలు చేసుకున్న ప్రజలు 5:10 PM, అక్టోబర్ 07 2023 స్కిల్ స్కాంలో ఈ సందేహాలను టిడిపి తీరుస్తుందా? : YSRCP ► స్కిల్ కార్పోరేషన్ ఏర్పాటు జరిగింది అక్టోబరు, 2014లో ► నిధుల విడుదల జరిగింది డిసెంబరు, 2015లో ► నిధుల విడుదల తర్వాత సెంటర్లు ప్రారంభమైంది 19 నెలల తర్వాత ► నిధుల విడుదలకు అంత ఆత్రం చూపించిన వారు సెంటర్లు ఎందుకు ఆలస్యం చేశారు? ► సీమెన్స్ వాటా గురించి ఆగకుండా నిధులు విడుదల చేయమని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని నోట్‌ఫైల్‌లో చీఫ్ సెక్రటరీ రాసిందానిపై ఏమంటారు? ► కేంద్ర సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI) సెబి ద్వారా GST శాఖ (గూడ్స్ & సర్వీస్ టాక్స్)కు అలర్ట్ వచ్చిందానిపై ఏమంటారు? ► GST చంద్రబాబు ప్రభుత్వాన్ని అలర్ట్ చేయగానే బాధ్యులెవరో తేల్చండి అంటూ చర్య ఎందుకు తీసుకోలేదు? ► చంద్రబాబు హయాంలో ACB (అవినీతి నిరోధక శాఖ) విచారణ ప్రారంభించి, ఎందుకు వెంటనే ఆపేసింది ? ► ACB (అవినీతి నిరోధక శాఖ) శాఖ రిపోర్టు చేసేది ముఖ్యమంత్రికే. అంటే విచారణ ఆపేయడానికి కారణం ఎవరు? ► సీమెన్స్ 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ప్రకటించిన చంద్రబాబు ► కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇస్తుందని చెప్పుకొచ్చిన తెలుగుదేశం నేతలు ► అసలు మాకు సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా ప్రకటించిన సీమెన్స్ ► కాదు, కాదు సీమెన్స్ గ్రాంట్ ఇన్ కైండ్ ఇచ్చిందంటూ ప్రకటించిన సుమన్ బోస్ ► అంటే కేవలం బ్రాండింగ్ కోసం సీమెన్స్‌ను కలుపుకున్నారా? ► మొత్తం డాక్యుమెంట్లలో ఎక్కడా డేట్, ప్లేస్‌తో పాటు అన్నీ ముఖ్యమైన వివరాల దగ్గర ఖాళీలెందుకు ఉంచారు? ► అసలు ఇంత ముఖ్యమైన ఒప్పందాన్ని చీకట్లో ఎందుకు చేసుకున్నారు? 3:10 PM, అక్టోబర్ 07 2023 మాజీ మంత్రి బండారు పై ఎంపీ నవనీత్ కౌర్ ఆగ్రహం ► బండారు నీకు అసలు సిగ్గు లేదా? ► మంత్రి రోజా పై ఇంత దిగజారి మాట్లాడతావా? ► మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా..? ► ఆంధ్రా, తెలంగాణ లో మహిళలను చాలా గౌరవిస్తారు ► ఈ బండారు ఆంధ్ర, తెలంగాణ మహిళల గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడాడు ► మంత్రి రోజా కు మేం అండగా ఉంటాం ► నేనే కాదు యావత్ మహిళలంతా రోజా కు అండగా ఉంటారు ► మంత్రి రోజా సినీ పరిశ్రమలో చాలా కాలం హీరోయిన్గా ఉన్నారు ► పెద్ద పెద్ద హీరోల తో పనిచేసిన ఆమెని ఇలా కించపరుస్తారా..? ► ఈ రాజకీయ నాయకుడు మహిళల కోసం ఇంతలా దిగజారి మాట్లాడరు.! ► బండారు నీకు రాజకీయలు ముఖ్యమా..? ► లేక ఆంధ్ర, తెలంగాణ మహిళల గౌరవం ముఖ్యమా..? ► బండారుకి ఇప్పటికైనా సిగ్గురావాలి ► నేను ఎంపీగా, నటిగా, మహిళగా రోజా కి అండగా ఉంటా : ఎంపీ నవనీత్ కౌర్ 3:10 PM, అక్టోబర్ 07 2023 మళ్లీ ఢిల్లీకి లోకేష్ ► మధ్యాహ్నం రాజమండ్రి నుంచి ఢిల్లీకి లోకేష్ ► రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే మకాం ► పదో తారీఖున నేరుగా విజయవాడలోని CID ఎదుట విచారణకు లోకేష్ ► ఎలాగైనా బీజేపీ అగ్రనేతలను కలవాలని తీవ్రంగా ప్రయత్నాలు ► నిన్ననే బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో ఎల్లోమీడియా అధినేతల భేటీ ► చంద్రబాబు, లోకేష్ గురించి నడ్డాకు వివరించినట్టు సమాచారం ► నడ్డా సహకారం తీసుకుని అపాయింట్మెంట్లు తీసుకోవాలని లోకేష్ యత్నాలు 3:00 PM, అక్టోబర్ 07 2023 ములాఖత్‌లో లోకేష్‌కు చంద్రబాబు ఏం చెప్పారు? ► రాజమండ్రి జైల్లో శుక్రవారం 45 నిమిషాలపాటు చంద్రబాబుతో లోకేష్ భేటీ ► పలు అంశాలపై లోకేష్‌తో సుదీర్ఘంగా చర్చించినట్టు వెల్లడించిన ఎల్లో మీడియా ► CID విచారణకు అక్టోబర్ 12వరకు సమయం ఉంది కాబట్టి ఢిల్లీలో ఉండడమే బెటర్ అని లోకేష్‌కు సూచించినట్టు సమాచారం ► ఢిల్లీలో తన వెంట ఎంపీ/లాయర్ కనకమేడలను ఉంచుకోవాలని లోకేష్‌కు సూచన ► తన కేసుకు సంబంధించి ఏమేం చేయాలో లోకేష్‌కు సవివరంగా సూచించినట్టు సమాచారం ► క్వాష్ కొట్టేయకపోతే ఏం చేయాలి? బెయిల్ విషయంలో ఎలా ముందుకెళ్లాలి..? ► జాతీయ స్థాయిలో మనకు అనుకూలంగా ఎవరెవరు ఉన్నారు? ► రెంటికి చెడ్డ రేవడి అయినట్టుగా మన పరిస్థితి ఎందుకుంది? ► ఇంకా ఏమేం చేయాలి..? ఎవరెవరితో మాట్లాడాలి..? ► మూడు కేసుల్లో ఏదో ఒక దాంట్లో అరెస్ట్ పరిస్థితి వస్తే లోకేష్ ఏం చేయాలి? ► సాంకేతికంగా తమకు అనుకూలంగా ఉన్న అంశాలేంటీ అన్నదానిపై చర్చించినట్టు సమాచారం 2:40 PM, అక్టోబర్ 07 2023 చంద్రబాబు స్కాం బయటపెట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థలే : మంత్రి ధర్మాన ► శ్రీకాకుళం : చంద్రబాబు కేసులు కేంద్ర సంస్థలే దర్యాప్తు చేస్తున్నాయి : మంత్రి ధర్మాన ప్రసాదరావు ► ఇద్దరు వ్యక్తులకు డబ్బులు వెళ్లాయని దర్యాప్తులో తేలింది ► ఒకరు చంద్రబాబు పీఏ, మరొకరు లోకేష్ పీఏ ► మాజీ సీఎం అంటూ వదిలేయమంటే ఎలా ? ► తప్పు చేయలేదని వాదించే చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి 2:07 PM, అక్టోబర్ 07 2023 రింగ్ రోడ్డు లేదు.. బొంగు రోడ్ లేదు.. : అచ్చెన్న ►కోర్టు విచారణపై అచ్చెన్న అడ్డగోలు వ్యాఖ్యలు ►స్కిల్ కేసులో ఎలాంటి ఆధారాల్లేవని నెల రోజుల తర్వాత AAG చావు కబురు చల్లగా చెబుతున్నారు ►ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి అంటూ కేసులు పెడుతున్నారు ►రింగ్ రోడ్డు లేదు.. బొంగు రోడ్ లేదు.. ►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ కోర్టుకెళ్లాడు ►అచ్చెన్నకు YSRCP ఒకే ఒక ప్రశ్న ►తప్పు చేయలేదని ఘీంకరించే మీరు... కోర్టు ముందుకెళ్లి అరెస్ట్ చేసిన విధానం మాత్రం తప్పని ఎందుకు వాదిస్తున్నారు? 12:47 PM, అక్టోబర్ 07 2023 చంద్రబాబు ఎన్నో దీపాల్ని ఆర్పేశారు: అంబటి ►పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ పొలిటికల్ బఫూన్స్ ►అవనిగడ్డలోనేమో ఎన్డీయే నుండి బయటకు వచ్చానని పవన్ అన్నారు ►మొన్నటి మీటింగ్ లో ఎన్డీయే లోనే ఉన్నానన్నారు ►చంద్రబాబు అవినీతి పై ఇంటింటికీ ప్రచారం చేస్తామని లోకేష్ అంటున్నారు ►వారంతా పొలిటికల్ బఫూన్స్ ►పవన్ సభలు పొత్తుల ప్రకటనకు ముందు ఎలా జరిగాయి? ►ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో చూస్తే అర్థం అవుతుంది ►ప్రజలు పవన్, చంద్రబాబు పొత్తులను అంగీకరించటం లేదు ►ఆ రెండు ఓట్లు కలిసేలా లేవు ►2014-19 మధ్యలో చంద్రబాబు చేసిన స్కాంలపై విచారణ జరుగుతోంది ►ఇందులో పవన్ పాత్ర కూడా కచ్చితంగా ఉందని మా అనుమానం ►అవినీతితో అరెస్టు ఐన వ్యక్తికి మద్దతు ఇవ్వటం వెనుక కారణం.. లంచాల్లో వాటా అందటం వలనే! ►కోట్ల రూపాయలు తీసుకుని వాదించే లాయర్లను చంద్రబాబు పెట్టుకున్నారు ►ఐనాసరే ఆధారాలు పక్కాగా ఉన్నందునే కోర్టు చంద్రబాబుకు రిమాండ్ వేశారు ►రామోజీరావు మార్గదర్శిలో, రాధాకృష్ణ ఖాతాలో కూడా అవినీతి సొమ్ము పడే ఉంటుంది ►ఎన్నో దీపాలను ఆర్పేసిన అవినీతిపరుడు చంద్రబాబు ►చంద్రబాబు అరెస్ట్ నిరసనగా.. ఇళ్లలో లైట్లు ఆర్పేయటం ఏంటి? ►పవన్ చెత్తశుద్దితో చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారు ►టీడీపీ బలహీన పడిందని పవన్ స్పష్టంగా చెప్పారు ►పవన్ ఎన్డీయేతో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎలా సపోర్ట్ చేస్తారు? ►ఎన్డీయే నుండి బయటకు రాకుండా ప్రకటించిన ఈ పొత్తు అక్రమం, అనైతికం 12:05 PM, అక్టోబర్ 07 2023 సింహగిరిపై టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ ►సింహచలం వెళ్లిన బండారు సత్యమూర్తితో సహా టీడీపీ నేతలు ►రాజకీయ విమర్శలకు అనుమతి లేదన్న పోలీసులు ►పోలీసులతో వాగ్వాదానికి దిగిన పీలా సోదరులు, టీడీపీ నేతలు ►అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తామని పోలీసులకు బెదిరింపులు 11:35AM, అక్టోబర్ 07 2023 పవన్ కళ్యాణ్ కచ్చితంగా ప్యాకేజీ కళ్యాణే : ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ► పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు ► పవన్ కళ్యాణ్ బిజెపిని కాదని బయటకు రమ్మనండి ► పవన్ ప్యాకేజీ సొమ్ములు ఏ రూట్ ద్వారా విదేశాలకు వెళ్ళాయో బయటకు రావడం ఖాయం ► నాకు తెలిసి రూ.1400 కోట్ల ప్యాకేజీ సొమ్ములు హవాలా ద్వారా దేశం దాటింది ► అది దుబాయ్ కి వెళ్ళాయా? లేక రష్యాకు వెళ్ళాయా, సింహపూర్ కు వెళ్ళాయా తేలాలి ► పవన్ కు దమ్ముంటే నా మీద గ్లాస్ గుర్తును పోటీకి పెట్టాలి ► లోకేష్, వ్యవస్ధలను మేనేజ్ చేసేది మీ నాన్న చంద్రబాబే ► చీకట్లో చిదంబరంను కలిసింది.. కాళ్ళు పట్టుకున్నది కూడా చంద్రబాబే ► ఓటుకు కోట్లు ఇచ్చి అడ్డంగా దొరికిపోయింది చంద్రబాబే ► వాట్ ఐయామ్ సేయింగ్, మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అన్నది చంద్రబాబే ► తెలంగాణలో కేసులు రాగానే కరకట్టకు పారిపోయింది చంద్రబాబే ► ఇన్ని తప్పులు, ఇన్ని అక్రమాలు చేసి ఇప్పుడు ఎదురుప్రశ్నిస్తున్నారా? 11:30AM, అక్టోబర్ 07 2023 TDP నేతల సిగ్గుమాలిన వ్యాఖ్యలపై సినీ రంగం సీరియస్ ► మంత్రి RK రోజాపై బండారు దిగజారి వ్యాఖ్యలు చేశారు : సీనియర్ సినీ నటి రాధిక ► బండారు ఒక మహిళ పట్ల అలా మాట్లాడడానికి సిగ్గుండాలి ► మీకు అటెన్షన్ రావడం కోసం ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తారా? ► మీరు బయటికి వెళ్లినపుడు మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? 11:10AM, అక్టోబర్ 07 2023 బాబు చేసింది అవినీతి.. ఉద్యమం కాదు : సజ్జల ► చంద్రబాబు అరెస్ట్‌పై టిడిపి చేస్తోన్న నిరసనలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందన ► చంద్రబాబు విప్లవ కారుడో.. లేక ఉద్యమమో చేసి జైలుకు వెళ్లినట్లు టిడిపి హడావుడి చేస్తోంది ► చంద్రబాబు అవినీతికి స్పష్టమైన ఆధారాలున్నాయి ► తప్పు చేయకపోతే చంద్రబాబు అవినీతి పై మేం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి ► చంద్రబాబు స్కిల్ స్కామ్ కు సంబంధించి 13 చోట్ల సంతకాలు పెట్టిన విషయం వాస్తవమా..కాదా ► స్కాం అంశం పక్కదోవ పట్టించడానికే ఎలక్ర్టోరల్ బాండ్స్ అంశం తెచ్చారు ► కోర్టుల్లో అన్ని విషయాలు తేలతాయి 11:00AM, అక్టోబర్ 07 2023 లోకేష్ వ్యాఖ్యలపై జైలు అధికారుల సీరియస్ ► చంద్రబాబు అరెస్ట్‌పై సానుభూతి కోసం లోకేష్ తాపత్రయం ► జైల్లో భద్రత లేదంటూ లోకేష్ కొత్త రాగం ► జైల్లో నక్సలైట్లు, సంఘ విద్రోహ శక్తులు ఉన్నారన్న లోకేష్ ► వారి నుంచి చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందన్న లోకేష్ ► జైలు అధికారులకు ఓ లేఖ వచ్చిందంటూ నిన్న ప్రెస్ మీట్లో వ్యాఖ్యలు ► లోకేష్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జైలు అధికారులు ► లేని కారణాలను చూపుతూ జైలును రాజకీయం చేయడంపై ఆగ్రహం ► రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మరింత భద్రత పెంపు ► ముందు వేడినీళ్లన్నారు, తర్వాత దోమలన్నారు, ఇప్పుడు మావోయిస్టులంటున్నారు.! ► రాజకీయం కోసం జైలు మీద నిందలెందుకు? ► చంద్రబాబు జైల్లో నిశ్చింతగా ఉన్నారు, ఎలాంటి ముప్పు లేదన్న అధికారులు 10:54AM, అక్టోబర్ 07 2023 శాంతి ర్యాలీ పేరిట అశాంతికి కుట్ర.? ► చంద్రబాబు అరెస్ట్‌పై శాంతి ర్యాలీకి తెలుగుదేశం వ్యూహం ► శాంతి ర్యాలీ పేరిట భారీగా ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని ప్లాన్ ► అంగళ్లు తరహాలో మరోసారి అల్లర్లకు అవకాశం ► అంగళ్లు ఘటనలో చూపు కోల్పోయిన కానిస్టేబుల్, 27 మందికి తీవ్ర గాయాలు ► శాంతి భద్రతల నేపథ్యంలో టీడీపీ, జనసేన, సీపీఐ నేతలకు పోలీసుల నోటీసులు ► టీడీపీ శాంతి ర్యాలీకి అనుమతి లేదని తెలిపిన పోలీసులు ► పోలీసులు అడ్డుకున్నా ర్యాలీ నిర్వహిస్తామంటున్న ఆనందబాబు 08:54AM, అక్టోబర్ 07 2023 మళ్లీ ఢిల్లీ బాట పట్టిన లోకేష్ ►మళ్లీ ఢిల్లీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ►గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లనున్న టీడీపీ యువనేత ►ములాఖత్ అయిన మరుసటి రోజే ఢిల్లీకి ►సుప్రీంకోర్టులో సోమవారం చంద్రబాబు పిటిషన్‌పై వాదనలు ►చంద్రబాబు కేసు వ్యవహారం నేపథ్యంలో మరోసారి ఢిల్లీకి లోకేష్ ►న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెళ్తున్నట్లు ప్రచారం ►సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా బాబు పిటిషన్‌పై విచారణ ►చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని టీడీపీ ఆశాభావం 07:58AM, అక్టోబర్ 07 2023 రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►పటిష్టమైన భద్రత ఏర్పాట్లతో పాటు వైద్య సదుపాయాలు కూడా ►ములాఖత్‌లో నిన్న చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు ►జైల్లో ఆరోగ్యంగానే ఉన్న చంద్రబాబు ►చంద్రబాబు అరెస్టుపై ప్రజల దృష్టి కోసం టీడీపీ వరుస కార్యక్రమాలు ►ఇవాళ లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించే కార్యక్రమానికి పిలుపు 07:58AM, అక్టోబర్ 07 2023 బాబు భద్రతపై లోకేష్ అతి ►చంద్రబాబు భద్రతపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు ►జైలుపై దాడి చేస్తారని బెదిరిస్తున్నారంటూ.. మీడియా ముందుకు ►జైల్లో నక్సల్స్, గంజాయి అమ్మేవాళ్లు ఖైదీలంటూ వ్యాఖ్య ►ఢిల్లీకి వెళ్లే ముందు కూడా లోకేష్ ఇలాంటి వాదన ►అప్పుడు దోమలతో చంపించేందుకు కుట్రంటూ ఆరోపించి నవ్వులపాలు ►చంద్రబాబు భద్రతపై ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తూ వస్తున్న జైలు అధికారులు ► అయిన అతి చేస్తున్న లోకేష్ బాబు 07:30AM, అక్టోబర్ 07 2023 చంద్రబాబు అండ్ కో పిటిషన్ల పర్వం ►వేర్వేరు కోర్టుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మరికొందరి పిటిషన్లు ►అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో .. బెయిల్ కోరుతూ పిటిషన్ ► ఏసీబీ కోర్టులో ముగిసిన విచారణ, తీర్పు రిజర్వ్ ► సోమవారం తీర్పు వెలువరించనున్న ఏసీబీ జడ్జి ► స్కిల్ కేసులో ఏపీ సీఐడీ వేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని సుప్రీంలో పిటిషన్ ►సోమవారం(9వ తేదీన) సుప్రీంలో విచారణకు రానున్న పిటిషన్ ►గత వాదనల్లో ముగ్గురు లాయర్లు బాబు తరపున వాదనలు.. ఇంకెంత మంది అని బెంచ్ అసహనం ► విచారణ దశలోనే ఉంది కదా.. ఎందుకంత ఆందోళన అని బాబు లాయర్లకు ప్రశ్న ► బాబు జైల్లో ఉన్నారని.. అత్యవసరంగా విచారించాలన్న బాబు లాయర్లు ►కుదరదని చెప్పి.. విచారణ వాయిదా వేసిన ధర్మాసనం ►ఏపీ హైకోర్టు: ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో ఏ1గా చంద్రబాబు ► బెయిల్ కోసం పిటిషన్.. కొనసాగుతున్న విచారణ ► ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులోనే.. అక్టోబర్ 12న CID ముందు హాజరు కానున్న లోకేష్ ► ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో.. ఏ2 నారాయణ పిటిషన్లపైనా ఏపీ హైకోర్టు విచారణ ►ఫైబర్ నెట్ స్కామ్‌లోనూ ఏపీ హైకోర్టు బాబు అండ్ కో పిటిషన్లు 07:08AM, అక్టోబర్ 07 2023 నిరాశ, నిస్పృహల్లో టీడీపీ ►స్కిల్ స్కామ్‌లో పక్కా ఆధారాలతో దొరికిన చంద్రబాబు ► బయటకు వస్తారో? రారో.. అని టీడీపీ శ్రేణుల్లో ఆందోళన ►ఏసీబీ కోర్టులో మూడు రోజులపాటు బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదనలు ►సోమవారానికి తీర్పు వాయిదా వేసిన జడ్జి ►సీఎం హోదాలో స్కిల్డ్‌గా స్కామ్‌కు పాల్పడిన వైనాన్ని తన వాదనల్లో వినిపించిన ఏఏజీ పొన్నవోలు ►కీలక డాక్యుమెంట్లు సైతం సమర్పణ ►చంద్రబాబు ఆర్థిక లావాదేవీలను సైతం విచారించాలన్న ఏఏజీ ►కనీసం మూడు రోజుల సీఐడీ కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి 06:52AM, అక్టోబర్ 07 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @28 ►స్కిల్ స్కామ్ కేసులో 28వ రోజుకి చేరిన రిమాండ్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ నెంబర్ 7691గా బాబు ►మూడోసారి రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►తాజాగా.. అక్టోబర్ 19దాకా రిమాండ్ పొడిగింపు ఇంతకీ.. ఎవరి జట్టు పవనా?:YSRCP ►ఓవైపు టీడీపీతో జనసేత పొత్తు అంటావు. ►ఇంకోవైపు ఎన్డీయే నుంచి జనసేన ఇంకా బయటకు రాలేదు.. బీజేపీ కలిసి వస్తుందంటావ్. ►టీడీపీతో సమన్వయ కమిటీ అంటావు.. బీజేపీతో కూడా సమన్వయ కమిటీ వేశానంటావు. ►ఇంతకీ నువ్వు ఎవరితో ఉన్నట్టు? ►పూటకో మాట చెబుతూ.. జనసేన కార్యకర్తల్ని కూడా అయోమయానికి గురిచేస్తున్నావ్? ►అసలు వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలనే విషయంపై కనీసం నీకైనా స్పష్టత ఉందా? ఢిల్లీలో @naralokeshను కలిసేందుకు కూడా ఇష్టపడలేదు బీజేపీ పెద్దలు. నువ్వేమో ఓవైపు @JaiTDPతో పొత్తు అంటావు. ఇంకోవైపు ఎన్డీయే నుంచి ఇంకా బయటకు రాలేదంటావు. బీజేపీ మాతో కలిసి వస్తుందంటావు. టీడీపీతో సమన్వయ కమిటీ అంటావు. అదే సమయంలో బీజేపీతో కూడా సమన్వయ కమిటీ వేశానంటావు. ఇంతకీ నువ్వు… pic.twitter.com/vJwt38MGfC — YSR Congress Party (@YSRCParty) October 6, 2023 -
టీడీపీకి.. స్కిల్ కార్పొరేషన్‌కు ఒక్కరే అడిటర్
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. గత రెండు రోజులుగా ఇరపక్షాలు సుదీర్ఘ వాదనలు వినిపించగా.. ఇవాళ(శుక్రవారం) అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తుది వాదనలు వినిపించారు. అయితే వాదనల సమయంలో ఇవాళ కూడా కొన్ని సంచలన విషయాల్ని బయటపెట్టారాయన. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్కిల్ స్కామ్‌లో టీడీపీ ఖాతాలోకి మళ్లిన నిధుల వ్యవహారాన్ని నిన్న వాదనల సందర్భంగా డాక్యుమెంట్లతో సహా బయటపెట్టిన ఏఏజీ సుధాకర్‌రెడ్డి.. మూడవ రోజు వాదనలోనూ సంచలనాలు వెలుగులోకి తెచ్చారు. టీడీపీకి.. స్కిల్ స్కామ్‌లో ఆడిటర్‌గా పని చేసిన వ్యక్తి ఒక్కరేనని.. ఆయన్ని విచారిస్తే కేసులో చాలా విషయాలు బయటకు వస్తాయని కోర్టుకు తెలియజేశారు ఏఏజీ పొన్నవోలు. ఈ కేసులో టీడీపీ అడిటర్ వెంకటేశ్వర్లుని విచారించాల్సి ఉంది. ఈ నెల 10వ తేదీన సీఐడీ విచారణకి రావాలని ఆయనకి నోటీసులిచ్చాం. ఆడిటర్ వెంకటేశ్వర్లే స్కిల్ కార్పోరేషన్‌కి ఆడిటర్ గా పనిచేశారు. ఈ రెండింటికీ ఒక్కరే ఆడిటర్ కావడంతో నిధులు దారి మల్లింపు వ్యవహారం బయటపడకుండా మేనేజ్ చేశారు. తద్వారా చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారు. పైగా సీఎం హోదాని చంద్రబాబు అడ్డు పెట్టుకుని షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాకి నిధులు మళ్లించారు. జీవో నెంబర్ 4 ని అడ్డం పెట్టుకుని నిధులు దిగమింగారు. కాబట్టి.. చంద్రబాబుకి ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుంది అని పొన్నవోలు కోర్టులో వాదించారు. ఈ దశలో చంద్రబాబుకి బెయిల్ ఇవ్వొద్దని.. ఆయన్ని మరింత విచారించాల్సిన అవసరం ఉందని, మరీ ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలపై చంద్రబాబును విచారించాల్సి ఉందని ఏఏజీ పొన్నవోలు ఏసీబీ కోర్టుకు తెలియజేశారు. చంద్రబాబు ఆదాయపన్ను వివరాలు కూడా తీసుకుంటున్నామని చెప్పారాయన. చంద్రబాబు సహకరించలేదు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిసిన తర్వాత.. చంద్రబాబు కస్టడీ పిటీషన్‌పై ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. స్కిల్ కుంభకోణం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. చంద్రబాబు గత రెండు రోజులకస్టడీలో సీఐడీకి సహకరించలేదు. సెంట్రల్ జైలులోనే చంద్రబాబుని మరోసారి విచారించడానికి అవకాశమివ్వండి. [di చంద్రబాబుని కనీసం మూడు రోజుల కస్టడీకి ఇవ్వండి. చంద్రబాబుని విచారణ చేస్తేనే కొంతవరకైనా నిజం బయటకి వస్తుంది అని కోర్టును కోరారాయన. ఇక బ్యాంకర్ల నుంచి వివరాలు సేకరించారన్న చంద్రబాబు లాయర్ల ఆరోపణలపై ఏఏజీ పొన్నవోలు స్పందించారు. చంద్రబాబు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఐటీ రిటర్స్ని మాత్రమే డౌన్ లోడ్ చేశాం. బ్యాంకర్ల నుంచి ఎక్కడా తీసుకోలేదని స్పష్టత ఇచ్చారాయన. -
తిరుపతిలో జంట హత్యల కలకలం.. వెలుగులోకి సంచలన నిజాలు
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని కపిలతీర్థం సమీపంలోని ఓ ప్రైవేట్ హోటట్లో జంట హత్యలు కలకలం రేపుతోంది. అన్న, చెల్లెల్లను బావ పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేశాడు. మృతులను మహారాష్ట్ర నాందేడ్‌కు చెందినవారుగా గుర్తించారు. బావ యువరాజ్.. భార్య మనీషా తోపాటు, బావమరిది హర్ష వర్ధన్‌ను హత్య చేసి పరారయ్యాడు. వివరాలు.. నాందేడ్‌కు చెందిన యువరాజ్‌కు 12 ఏళ్ల క్రితం మనీషాతో వివాహం జరిగింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు షక్షమ్(6), ప్రజ్ఞాన్ (4) ఉన్నారు. బావమరిది హర్షవర్ధన్‌తో కలిసి యువరాజ్, మనీషా నాలుగు రోజుల క్రితం తిరుపతికు వచ్చినట్లు సమాచారం. వీరంతా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి నందిసర్కిల్ ఉన్న ప్రవేట్ హోటల్లో దిగారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ డబుల్ మర్డర్ వెలుగు చూసింది. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. హోటల్ యాజమాన్యం పోలీసులలకు సమాచారం అందించారు. సంఘటన ప్రాంతాన్ని తిరుపతి ఈస్ట్ డీఎస్పీ సురేందర్ రెడ్డి పరిశీలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అలిపిరి పోలీసులు విచారిస్తున్నారు వెలుగులోకి వాస్తవాలు.. తిరుపతి డబుల్ మర్డర్ కేసులో పలు సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. మనీషాకు నిందితుడు యువరాజ్ అన్నతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏడాదికాలంగా మనీషా, యువరాజ్ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. రాజీ కుదుర్చేందుకు బావమరిది హర్ష వర్ధన్, మనీషాతో పాటు ఇద్దరు పిల్లల్ని యువరాజ్ తిరుపతికు రప్పించినట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం నంది సర్కిల్లో ప్రవేట్ హోటల్ 302 రూమ్‌లో దిగారు. అర్థరాత్రి 2 గంటలు సమయంలో ఇద్దరినీ యువరాజ్ హత్య చేశాడు. చదవండి: ఇంట్లో చెప్పకుండా.. వెళ్లిన నేపాల్ బాలిక ఒక్కసారిగా ఇలా.. -
Oct 6th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates 6:21 PM, అక్టోబర్ 06 2023 ఉత్తర కుమారుడు లోకేష్ ఏదేదో మాట్లాడుతున్నాడు: పేర్ని నాని ►చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశామని చెబుతున్నాడు ►ఫ్యామిలీ అంతా కలిసి సెంటిమెంట్ ప్లే చేసేందుకు ప్రయత్నించారు ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేశ్ ఎక్కడున్నాడు? ►లాయర్లంతా బెజవాడ రోడ్లపై తిరుగుతుంటే లోకేశ్ ఎక్కడున్నాడు? ►ఎవరిని మేనేజ్ చేద్దామని ఢిల్లీ వెళ్లారు? ►మేనేజ్ చేయడం మీకు బాగా తెలిసిన విద్య ►25 రోజుల నుంచి ఢిల్లీలో ఎందుకు తిరుగుతున్నావు ? ►ఎవరి కాళ్లు, చేతులు పట్టుకోవడానికి ఢిల్లీ వెళ్లారు ? ►స్కామ్ లో రూ. 27 కోట్లు మీ పార్టీ అకౌంట్ లో వేసుకున్నారు ►ఢిల్లీ వేషాలు ఇక్కడ వేయొద్దు ►సీమెన్స్ ఇస్తామన్న డబ్బులు ఎక్కడ ? ►అప్పుడు వీరప్పన్ చెప్పిన కబుర్లే ఇప్పుడు మీరు చెబుతున్నారు ►అంత నిజాయితీ పరులైతే మీ ఆస్తులపై కోర్టు మానిటర్డ్ విచారణకు సిద్ధమా ? ►పవన్ ఐదు రోజులు కృష్ణాజిల్లా ఆటవిడుపు యాత్ర చేశారు ►పవన్ మాటలు జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా నచ్చడం లేదు ►జగన్ కు దమ్ముంది కాబట్టే ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేస్తారు ►వైఎస్సార్ పై నువ్వు ఎప్పుడు పోరాటం చేశావు పవన్ ? ►బీజేపీ కంటే చంద్రబాబే తనకు ముఖ్యమని పవన్ తేల్చేశారు ►ఏపీలో పవన్ కు ఆధార్ కార్డు ఉందా ? ఇల్లుందా? ►అవనిగడ్డలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్టు చెప్పావు ►ముదినేపల్లి లో మళ్లీ ఎన్డీఏ లోనే ఉన్నానని చెబుతావు ►తెలంగాణలో 32 సీట్లలో పోటీ చేస్తానని ప్రకటించావు ►చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ఒక్క పథకం చెప్పు ►పవన్ ఏ కూటమిలో ఉంటే మాకెందుకు? ►చంద్రబాబుకు సరుకు లేదని పవన్ అంటున్నా టీడీపీ వారికి సిగ్గు లేదు ►చంద్రబాబు కొట్టేసిన డబ్బులు యాక్సప్టబుల్ కరప్షన్ అంటూ కొత్త పదాలు చెప్తున్నారు ►ఏపీని విడగొట్టి నాశనం చేసింది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ►ప్రత్యేక హోదా గురించి పవన్ ఎందుకు మాట్లాడలేదు? ►నీటి విషయంలో కేంద్రంతో పోరాటం చేస్తారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేక పవన్, నాదెండ్ల మనోహర్ నీళ్లు నమిలారు ►చంద్రబాబు, పవన్ లే రాష్ట్రానికి పట్టిన మహమ్మారి 6:01 PM, అక్టోబర్ 06 2023 నా ఆస్తి లక్ష కోట్లు : చంద్రబాబు వీడియోను విడుదల చేసిన YSRCP ► తన ఆస్తి గురించి బహిరంగంగా ప్రసంగించిన చంద్రబాబు ► నా ఆస్తే లక్ష కోట్ల రుపాయలని ప్రకటించిన చంద్రబాబు ► ఎలక్షన్ అఫిడవిట్లో ఒక లెక్క, తెర వెనక మరో లెక్క కేవలం 2 ఎకరాలతో మొదలైన నువ్వు, అన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించావ్ చంద్రబాబూ? ఎంత మంది పేద ప్రజలను దోచుకుంటే అన్ని లక్షల కోట్లు సంపాదించావ్ @ncbn? #GajaDongaChandrababu#CorruptionKingCBN pic.twitter.com/v9Zqvi3Whs — YSR Congress Party (@YSRCParty) October 5, 2023 5:54 PM, అక్టోబర్ 06 2023 ఇంటింటికి వెళ్లి చంద్రబాబు అన్యాయాన్ని చెప్పండి : రోజా ► జైలు ముందు లోకేష్ చేసిన ప్రకటన టిడిపి అసలు రూపం బయటపెట్టింది ► ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన అన్యాయాన్ని చెబుతానంటున్నారు చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయానికి ఈరోజు అరెస్టు అయ్యారు, @ncbn ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల డబ్బులను దోచుకున్నారో ఆయన చేసిన అన్యాయాన్ని గడపగడపకి @YSRCParty వెళ్ళి తెలియజేస్తుంటే మేము కూడా గడపగడపకు వెళ్లి ప్రతిమనిషికి కూడా చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాన్ని చెబుతాము అని చెప్పినందుకు… pic.twitter.com/AIXVVG9Syr — Roja Selvamani (@RojaSelvamaniRK) October 6, 2023 5:35 PM, అక్టోబర్ 06 2023 చంద్రబాబు పిటిషన్ @ సుప్రీంకోర్టు ► సుప్రీంకోర్టులో 59వ నంబర్‌గా లిస్ట్ అయిన చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ► అక్టోబర్ 9, 2023, సోమవారం రోజు సుప్రీం కోర్టులో లిస్ట్ అయిన చంద్రబాబు కేసు 5:15 PM, అక్టోబర్ 06 2023 ఇంకా NDAలోనే ఉన్నాం : పవన్ కళ్యాణ్ ► 2014లో టిడిపి, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి ► అందుకే 2024లో కూడా టిడిపి, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలన్నది నా కోరిక ► అదే విషయాన్ని నడ్డాకు ఎప్పటికప్పుడు చెబుతున్నాను ► రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిసి చర్చించాను ► జనసేన పూర్తిగా ఇండిపెండెంట్ పార్టీ ► పొత్తుల విషయంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటాం ► లోకేష్ ముందే తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని ప్రకటించాను ► నాదెండ్ల మనోహన్ నేతృత్వంలో అయిదుగురు సభ్యుల బృందం టిడిపితో పొత్తుల విషయం తేల్చుతుంది ► ఒకటి రెండు రోజుల్లో ఉమ్మడి కార్యాచరణ మీద ప్రకటన వెలువడుతుంది 4:55 PM, అక్టోబర్ 06 2023 TDP బలహీనపడిందని పార్ట్‌నరే చెప్పారు : అంబటి ► టీడీపీ బలహీనపడిందని పవన్ చెబుతున్నారు ► టీడీపీ వాళ్లు మాకు సింపతీ పెరిగిందంటున్నారు ► టీడీపీ పల్లకి మోయడానికి పవన్ సిద్ధమయ్యాడు ► ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి ఏమి కాదు ► ప్రజల ఆశీర్వాదంతో YSRCP మళ్లీ గెలుస్తుంది 4:15 PM, అక్టోబర్ 06 2023 చంద్రబాబును కలిసిన తర్వాత మీడియాతో లోకేష్ ► ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నందుకే చంద్రబాబుపై కేసు ► కొత్త జిల్లాలు అడిగినందుకు, ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే కేసులు ► మా కుటుంబంలో మహిళలెప్పుడూ రాజకీయాల్లోకి రాలేదు ► మా అమ్మ ఎన్టీఆర్ కూతురు అయినా రాజకీయాల్లోకి రాలేదు ► ఇప్పుడు బ్రాహ్మణి పాత్ర కూడా రాజకీయాలకు దూరమే ► నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్నది YSRCPకి ఎందుకు చెబుతాను? ► ముందు 3వేల కోట్లు, 371 కోట్లు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు ► 14 సంవత్సరాలు, 15 ఏళ్లు ప్రతిపక్షనేతగా చంద్రబాబు పని చేశారు ► తెలంగాణలో సైబరాబాద్ కట్టింది చంద్రబాబే ► వ్యవస్థల్ని మేనేజ్ చేసి 28 రోజులు జైల్లో పెట్టారు ► చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనం పంపిస్తున్నాం ► 1992లో హెరిటేజ్ కంపెనీ పెట్టారు, ఆ డబ్బులను మేం రాజకీయాల కోసం ఖర్చు పెట్టాం ► నేను హెరిటేజ్‌లో షేర్ హోల్డర్‌ను, నాకు కంపెనీ రికార్డులన్నీ అందుబాటులో ఉండవు ► ఇన్నాళ్లు ఢిల్లీ హోటల్లో ఉన్నాను, ఎక్కడికీ పారిపోలేదు ► మా పార్టీకి వచ్చిన విరాళాలు అన్నీ సభ్యత్వం ద్వారానే వచ్చాయి ► 2014, 2016, 2018లలో ఒక్కో సభ్యత్వానికి రూ.100 జనం నుంచి తీసుకున్నాం ► 1300 బ్రాంచ్‌ల ద్వారా ఈ డబ్బు సేకరించాం ► ఇన్నర్ రింగ్ రోడ్డులో నాపై కేసు పెట్టాం ► ఫైబర్ గ్రిడ్ కేసులో నన్ను విచారణకు పిలుస్తామని చెప్పారు ► కోవిడ్ సమయంలో అందరికీ మాస్కులు పంచాం ► జైల్లో చంద్రబాబు ధైర్యంగా ఉన్నారు ► నేను తప్పు చేస్తే నన్ను కూడా చంద్రబాబు జైలుకు పంపిస్తారు ► 17Aపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి ► ACB కోర్టులో బెయిల్ పిటిషన్ వాదనలు జరిగాయి ► టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక చర్చించి ఆచరణలో పెడతాం 4:15 PM, అక్టోబర్ 06 2023 లోకేష్ పాదయాత్ర సందర్భంగా రాళ్లు రువ్విన కేసులో నిందితులకు బెయిల్ ► పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా అల్లర్లు ► పోలీసులు, సామాన్యులపై రాళ్లు రువ్విన తెలుగుదేశం కార్యకర్తలు, పలువురికి గాయాలు ► మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహా 13 మంది టీడీపీ నేతలపై కేసు ► షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన కోర్టు 4:15 PM, అక్టోబర్ 06 2023 అంగళ్లు అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ ► అంగళ్లు కేసులో 150 మందికి హైకోర్టు బెయిల్ ► చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు, సామాన్యులపై రెచ్చిపోయిన టిడిపి కార్యకర్తలు ► 27 మంది పోలీసులు, సామాన్యులకు తీవ్ర గాయాలు ► కంటి చూపు కోల్పోయిన ఒక కానిస్టేబుల్ ► నిందితులకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు 3:55 PM, అక్టోబర్ 06 2023 కిం కర్తవ్యం.. జైల్లో చంద్రబాబుతో చర్చలు ► చంద్రబాబు అరెస్టయి ఇవ్వాళ్టికి 27 రోజులు ► పసలేని వాదనలతో కోర్టులో నెగ్గని బాబు లాయర్లు ► లోకేష్, భువనేశ్వరి, బ్రహ్మణితో చంద్రబాబు 45 నిమిషాల పాటు చర్చలు ► ఢిల్లీలో వ్యవహారాలను చంద్రబాబుకు లోకేష్ వివరించినట్టు సమాచారం ► తెలుగుదేశం పార్టీపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనా చర్చ ► భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై కుటుంబ సభ్యులకు చంద్రబాబు దిశానిర్దేశం 2:55 PM, అక్టోబర్ 06 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ► రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చిన నారా లోకేష్ , బ్రాహ్మణి , భువనేశ్వరి ► రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో కుటుంబం ములాఖత్ ► 3గంటల నుంచి 3.45 వరకు ములాఖత్ కానున్న కుటుంబ సభ్యులు ► 22 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన లోకేష్ 2:15 PM, అక్టోబర్ 06 2023 దొరికిపోయిన దొంగ చంద్రబాబు : కొడాలి నాని ► చంద్రబాబు లాయర్లు 17A సెక్షన్ ప్రకారం అరెస్ట్ చట్ట విరుద్ధమంటున్నారు ► చంద్రబాబు 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమీషన్లకు కక్కుర్తిపడేవాడు ► 2014లో లోకేష్ ఎంటరయ్యాక దొంగ అకౌంట్లకు ప్రభుత్వ సొమ్ము తరలించి విచ్చలవిడిగా దోచేశారు ► గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని వాదిస్తున్నారు ► సెక్షన్ 17A సవరణ రాక ముందే దర్యాప్తు ప్రారంభమైన కేసు ఇది ► చంద్రబాబు అవినీతి చేయలేదని చెప్పకుండా.. గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని కేసు కొట్టేయమనడం సిగ్గుచేటు 2:10 PM, అక్టోబర్ 06 2023 చంద్రబాబు లాయర్ ప్రమోద్ కుమార్ దూబే ► స్కిల్ స్కాంలో అరెస్టయిన 13మందికి ఇప్పటికే బెయిల్ వచ్చింది ► ఈ కేసులో విడుదలయిన నిధులకు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు సంబంధం లేదు ► అరెస్టయిన 15 రోజుల తర్వాత కస్టడీ అడగడం సరికాదు ► తెలుగుదేశం అక్కౌంట్లలో జమ అయిన మొత్తం పార్టీకి వచ్చిన విరాళాలు ► ఈ డబ్బుతో చంద్రబాబుకు సంబంధం లేదు ► ఇవి స్కిల్ స్కాం నుంచే వచ్చాయన్నదానికి ఆధారాలు లేవు 1:55 PM, అక్టోబర్ 06 2023 చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు ► ACB కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లు ► వాదనలు వినిపించిన ఇరుపక్షాలు ► CID తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ► చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ దూబే ► వాదనల అనంతరం తీర్పు రిజర్వులో పెట్టిన న్యాయమూర్తి ► PT వారెంట్లపై సోమవారం విచారణ జరపనున్న ACB కోర్టు 1:45 PM, అక్టోబర్ 06 2023 జైల్లో చంద్రబాబును కలవనున్న కుటుంబ సభ్యులు ► రాజమండ్రి : మధ్యాహ్నం 3 గంటలకు సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ ► చంద్రబాబును కలవనున్న నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి ► 21 రోజుల కింద ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్ ► సుదీర్ఘ విరామం తర్వాత తండ్రి చంద్రబాబుతో భేటీ కానున్న లోకేష్ ( చదవండి : ఢిల్లీలో లోకేష్ సాధించిందేంటీ?) (రాజమండ్రిలో కుటుంబ సభ్యులతో లోకేష) 1:45 PM, అక్టోబర్ 06 2023 బాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో పొన్నవోలు వాదనలు ► బాబుకు ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుంది ► చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారు ► అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ఖాతాకు నిధులు మళ్లించారు ► ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దు ► CIDకి కోర్టు ఇచ్చిన రెండ్రోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు ► చంద్రబాబును మరో మూడ్రోజుల కస్టడీకి ఇవ్వండి : ఏఏజీ పొన్నవోలు 1:35 PM, అక్టోబర్ 06 2023 ఇంతకీ పవన్ కళ్యాణ్ NDAలో ఉన్నాడా? లేడా? ► వేర్వేరు సభల్లో పవన్ కళ్యాణ్ వేర్వేరు ప్రకటనలు ► NDAని విడిచి సైకిల్ ఎక్కానంటూ పవన్ ప్రకటనలు ► తెల్లవారే మాట మార్చిన పవన్, NDAను వదిలేస్తే చెబుతానంటూ ప్రకటన ► పవన్ మాట మార్చడాన్ని తప్పుబట్టిన మంత్రి అంబటి ఏంది బ్రో @Pawankalyan, ఏమైంది నీకు! 😂 - మంత్రి @AmbatiRambabu pic.twitter.com/LDAriehBAa — YSR Congress Party (@YSRCParty) October 6, 2023 1:32 PM, అక్టోబర్ 06 2023 ఇంకా NDAలోనే ఉన్నా : పవన్ కళ్యాణ్ ► ఇంకా NDAతోనే జనసేన ఉందని ప్రకటించిన పవన్ ► ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా ఫోన్ నెంబర్లు తన దగ్గరున్నాయన్న పవన్ ► ఒక వేళ NDAని విడిచిపెడితే చెప్పి బయటకు వస్తానన్న పవన్ ► మేం NDAలో ఉంటే ఏంటీ? లేకపోతే ఏంటీ? ► ఎలాగూ గెలిచేది YSRCPనే, 175/175 వైఎస్సార్సిపికి వస్తాయి కాబట్టి జనసేన మీద దృష్టి పెట్టొద్దన్న పవన్ మేము NDAలోనే ఉన్నాం!#HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra pic.twitter.com/OryVQsyitR — JanaSena Party (@JanaSenaParty) October 6, 2023 1:30 PM, అక్టోబర్ 06 2023 సైకిల్‌కు గాడి తప్పింది.! : YSRCP విమర్శలు ► చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత పార్టీ గాడి తప్పిందన్న YSRCP ► ఢిల్లీకి లోకేష్, హైదరాబాద్‌కు బాలయ్య పరిమితం స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అడ్డంగా దొరికిపోయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో @ncbn రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. దాంతో ఇప్పుడు @JaiTDPని ముందుండి నడిపించే నాయకుడు కనిపించకపోవడంతో.. కేడర్ బిక్కచూపులు చూస్తోంది. #CorruptionKingCBN#GajaDongaChandrababu#EndOfTDP pic.twitter.com/TpZjxZJYau — YSR Congress Party (@YSRCParty) October 6, 2023 1:10 PM, అక్టోబర్ 06 2023 ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు ► చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు ► బెయిల్ తర్వాత కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో మొదలైన విచారణ ► చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని CID పిటిషన్ ► CID తరపున వాదనలు వినిపిస్తున్న AAG పొన్నవోలు ► ఆర్థిక లావాదేవీలపై చంద్రబాబు నుంచి వివరాలు ► చంద్రబాబు ఆదాయపన్ను వివరాలు కూడా తీసుకుంటున్నాం : AAG 1:05 PM, అక్టోబర్ 06 2023 సానుభూతి కోసం TDP అష్టకష్టాలు ► రాజమండ్రి టిడిపి క్యాంపు కార్యాలయానికి వచ్చిన లోకేష్ ► భువనేశ్వరీ, బ్రాహ్మణితో కలిసి నారా లోకేష్ రేపు కొత్త కార్యక్రమం ► అక్టోబర్ 7న రాత్రి 7 గంటలకు "టీడీపీ కాంతితో క్రాంతి" ► రేపు ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‌ఫోన్ టార్చ్ వెలిగించాలని పిలుపు ► రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేయాలని పిలుపు 12:55 PM, అక్టోబర్ 06 2023 కస్టడీపై TDP లాయర్ అభ్యంతరం ► చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ACB కోర్టులో విచారణ ► కస్టడీకి ఇవ్వాలన్న AAG వాదనలపై చంద్రబాబు తరపు న్యాయవాది దూబే అభ్యంతరం ► ఇప్పటికే రెండురోజులు కస్టడీకి తీసుకున్నారు : దూబే ► కేసు డైరీ ఎక్కడ ఉందని సీఐడీ అధికారులను ప్రశ్నించిన జడ్జి 12:35 PM, అక్టోబర్ 06 2023 ACB కోర్టులో CID తరపున పొన్నవోలు వాదనలు ► మూడో రోజు వాదనలోనూ సంచలన విషయాలు బయటపెట్టిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి ► చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారు ► ముఖ్యమంత్రి హోదాను అడ్డు పెట్టుకుని డొల్ల కంపెనీల ద్వారా తెలుగుదేశం ఖాతాకి నిధులు మళ్లించారు ► GO నంబర్ 4ని అడ్డం పెట్టుకుని నిదులు దిగమింగారు ► స్కిల్ స్కామ్‌లో తెలుగుదేశం పార్టీ ఆడిటర్ వెంకటేశ్వర్లును విచారించాల్సి ఉంది ► ఆడిటర్ వెంకటేశ్వర్లు స్కిల్ కార్పోరేషన్‌కు ఆడిటర్‌గా పనిచేశారు ► ఈ నెల 10న CID విచారణకు రావాలని ఆడిటర్ వెంకటేశ్వర్లుకి నోటీసులిచ్చాం ► టిడిపికి, స్కిల్ కార్పోరేషన్ కి ఒక్కరే ఆడిటర్ కావడంతో నిధులు దారి మళ్లింపు బయటపడకుండా మేనేజ్ చేశారు ► చంద్రబాబుకి బెయిల్ ఇవ్వద్దు, ఇస్తే ఆడిటర్ వెంకటేశ్వర్లును మేనేజ్ చేస్తారు ► చంద్రబాబుకి ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుంది, కాబట్టి బెయిల్ ఇవ్వొద్దు 12:05 PM, అక్టోబర్ 06 2023 ACB కోర్టులో వాదనలు ప్రారంభం ► ACB కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ మూడవ రోజు వాదనలు ► కస్టడీ పిటీషన్‌పై సిఐడి తరపు న్యాయవాది ఎఎజి పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు ► ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్, ఎప్పుడెప్పుడు టిడిపి ఖాతాల్లో నగదు చేరిందన్న ఆధారాలు సమర్పణ ► ఇప్పటికే టిడిపి అకౌంట్లను చూసే ఆడిటర్‌కు నోటీసులు ఇచ్చిన CID 11:50AM, అక్టోబర్ 06 2023 చంద్రబాబు అరెస్టును ప్రజలెవరూ పట్టించుకోవటం లేదు : మంత్రి కారుమూరి ► చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన సామాజిక వర్గం వారు మీటింగ్ పెట్టుకున్నారు ► చంద్రబాబు అక్రమాలు చేసినందునే జైలుకు వెళ్లినట్టు ఆయన సామాజిక వర్గం వారే నమ్ముతున్నారు ► రామోజీ, రాధాకృష్ణ, బీఆర్.నాయుడు, పవన్ కళ్యాణ్‌కు తప్ప మనకేమీ చేయలేదని సొంత సామాజిక వర్గం వారే అంటున్నారు ► చేసిన పాపం పండినందుకే చంద్రబాబు జైలుకు వెళ్లారు ► ఒక గంటకు ఒక్కో లాయర్‌కు కోటిన్నర ఫీజు ఇచ్చి రంగంలోకి దించారంటే.. చంద్రబాబు ఎంత అడ్డగోలుగా సంపాదించారో అర్థం చేసుకోవచ్చు ► చంద్రబాబు పుంగనూరులో దాడులు చేసినట్టు పవన్ చేయాలని చూస్తున్నారు ► పవన్ పార్టీకి ఒక సిద్ధాంతం అనేదే లేదు ► యువతను రెచ్చగొడుతూ వారి జీవితాలతో అనుకుంటున్నారు 11:30AM, అక్టోబర్ 06 2023 ACB కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లు ► చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ACB కోర్టులో విచారణ ► అవినీతి జరిగిందని... నగదు బాబుకు చేరిందన్న CID ► ఆధారాలు సమర్పించమని CIDకి సూచించిన న్యాయమూర్తి ► TDPకి రూ.27 కోట్లు వచ్చాయంటూ డాక్యుమెంట్లు సమర్పించిన సీఐడీ ► ఇవాళ మధ్యాహ్నం విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు ► బెయిల్, కస్టడీ పిటిషన్లతో పాటు PT వారెంట్లపైన కూడా విచారణ జరిపే అవకాశం 11:10AM, అక్టోబర్ 06 2023 అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తల్లి భువనేశ్వరిని కూడా ఇరికించిన నారా లోకేష్#LooterLokesh#CorruptBabuNaidu#SkilledCriminalCBNInJail #AmaravathiLandScam#TDPInsiderTrading#TDPScams#KhaidiNo7691 pic.twitter.com/EAnSfS9Fok — YSR Congress Party (@YSRCParty) October 6, 2023 10:25AM, అక్టోబర్ 06 2023 అవినీతి లేని చోట ప్రశ్నలా?.. పవన్‌పై ఫైర్ ►కైకలూరు రోడ్లకు, పెద్దింట్లమ్మ వారధికి ప్రభుత్వం ఏం చేయలేదని పవన్ ఆరోపణలు ►గత ప్రభుత్వంలో పవన్ గెలిపించిన కామినేని ఏమి చేశాడని సూటి ప్రశ్న ►సీఎం జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు లెక్కలతో సహా వివరణ ►పవన్ తన స్థాయిని కూడా దిగజార్చుకుని వెళుతున్నారు ►వాస్తవాలు తెలుసుకోకుండా దిగజారిపోయి మాట్లాడుతున్నారు ►ప్రజా జీవితానికి సినిమాకి చాలా తేడా ఉంది పవన్ కళ్యాణ్ గమనించాలి ►అవినీతిపరుడు.. నేరస్తుడైన చంద్రబాబుకి పవన్ కొమ్ము కాస్తున్నారు ►రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గామార్చిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి ►కేరాఫ్ ప్లాట్ఫారం నుండి వచ్చిన వ్యక్తినీ నేను ►అన్నచాటున పెరిగిన వ్యక్తి నువ్వు.. పవన్ ►చంద్రబాబు రాజధానిలో నిలువు దోపిడీ చేస్తే ప్రశ్నించావా? ►అవినీతి లేని చోట ప్రశ్నిస్తే పవన్ నవ్వుల పాలవుతారు ►పవన్ ఆవేశంగా.. ఆలోచన లేకుండా మాట్లాడుతారు ►పవన్ చుట్టూ తిరిగి యువత భవిష్యత్తు పాడు చేసుకోకండి ►ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు ►తండ్రిని ముఖ్యమంత్రి పదవి నుండి దించేసిన వ్యక్తికి కొమ్ముకాస్తున్న బాలకృష్ణను అసలు మనిషి అంటారా...? ►చంద్రబాబు ప్రభుత్వ సొమ్మును దోచేసిన కేసులు ఎదుర్కొంటున్నారు :::కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావు 10:04AM, అక్టోబర్ 06 2023 కరకట్ట ఇంటిపై అధికారంలో ఉన్నపుడు ఒకమాట.. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇంకోమాట. ఇదీ పొలిటికల్ ఊసరవెల్లి చంద్రబాబు తీరు. #GajaDongaChandrababu#CorruptBabuNaidu#SkilledCriminalCBNInJail #AmaravathiLandScam#TDPInsiderTrading#TDPScams#KhaidiNo7691 pic.twitter.com/kd7V8a8P6p — YSR Congress Party (@YSRCParty) October 6, 2023 09:20AM, అక్టోబర్ 06 2023 టీడీపీ వర్గాల్లో ఆందోళన ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ►రిమాండ్ మరో 14 రోజులు పొడిగించిన ఏసీబీ కోర్టు ►ఇవాళ బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు ►బెయిలూ దక్కక.. రిమాండ్ పొడిగింపులతో టీడీపీ వర్గాల్లో ఆందోళన ►రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద హై సెక్యూరిటీ ►ఢిల్లీ నుంచి వచ్చిన నారా లోకేష్ ►నేడు జైలులో తండ్రితో ములాఖత్ ►జోన్ టు టీడీపీ పార్లమెంటరీ నాయకులతో భేటీ అయ్యే ఛాన్స్ 08:35AM, అక్టోబర్ 06 2023 పొన్నవోలుపై యెల్లో మీడియా విద్వేష రాతలు ► ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి యెల్లో మీడియా అక్కసు ►స్కిల్ స్కాంలో ఏపీ సీఐడీ తరపున పొన్నవోలు వాదనలు ►చంద్రబాబు దోషిత్వాన్ని నిరూపించే సాక్ష్యాలను సమర్పించిన పొన్నవోలు ►తాజాగా.. యెల్లో మీడియా తీరుపై పొన్నవోలు అసహనం ►ఏబీఎన్, టీవీ-5 దిగజారి ప్రవర్తిస్తున్నాయని ఆవేదనపై ► తనపై దుష్ప్రచారం చేసినా. భయపడేది లేదని స్పష్టీకరణ ►తాజాగా.. ఏఏజీపై విషం చిమ్ముతూ ఈనాడు కథనం 07:59AM, అక్టోబర్ 06 2023 టీడీపీ నేతల చెత్త రాజకీయాలు:YSRCP ►మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట. ► ఆనాడు అసెంబ్లీలో భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనకపోయినా.. ఏదో అనేశారంటూ ప్రచారం చేసుకుని దొంగ ఏడుపులు ఏడ్చాడు. ►రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిచే అవకాశం లేదనే టీడీపీ నాయకులు ఇప్పుడు చెత్త రాజకీయాలకి తెరదీశారు. మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట. అసెంబ్లీలో భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనకపోయినా.. ఏదో అనేశారంటూ ప్రచారం చేసుకుని దొంగ ఏడుపులు ఏడ్చాడు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిచే అవకాశం లేదనే టీడీపీ నాయకులు ఇప్పుడు చెత్త రాజకీయాలకి తెరదీశారు.#TDPAbusesWomen#EndOfTDP pic.twitter.com/bIe40r3zbR — YSR Congress Party (@YSRCParty) October 5, 2023 07:50AM, అక్టోబర్ 06 2023 నారాయణ పిటిషన్‌పై విచారణ నేడు ►ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి, టీడీపీ నారాయణ పిటిషన్ ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో ఏ2గా నారాయణ ►విచారణకు రావాలంటూ 41ఏ కింద ఏపీ సీఐడీ నోటీసులు ►వయసు, అనారోగ్యం రిత్యా ఇంట్లోనే విచారణ చేపట్టాలంటూ హైకోర్టును ఆశ్రయించిన నారాయణ ►దీంతో పాటు క్వాష్ పిటిషన్ కూడా ►నేడు విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు 07:37AM, అక్టోబర్ 06 2023 ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన లోకేష్ ►ఇవాళ రాజమండ్రిలో చంద్రబాబుతో లోకేష్ ములాకత్ ►జనసేనతో సమన్వయ కమిటీ, పార్టీ కార్యక్రమాలపై చర్చ ►పార్టీ కార్యక్రమాల షెడ్యూల్‌ను ప్రకటించనున్న లోకేష్ ►9వ తేదీన చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ ►8వ తేదీన తిరిగి ఢిల్లీకి లోకేష్? ►9వ తేదీన విచారణకు సంబంధించి న్యాయవాదులతో చర్చ! 07:27AM, అక్టోబర్ 06 2023 చంద్రబాబే స్కిల్ స్కామర్ ►చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో 3వ రోజు కొనసాగనున్న విచారణ ►బెయిల్ పిటిషన్.. బాబు లాయర్ దూబే వాదనలకి రిప్లై ఇవ్వనున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ► బాబు బెయిల్ అభ్యర్థనను డిస్మిస్ చేయాలని వాదించిన పొన్నవోలు ►స్కిల్ స్కామ్‌లో బాబే ప్రధాన సూత్రధారి అనేందుకు పక్కా ఆధారాలున్నాయని వెల్లడి ►ఆర్ధిక శాఖ అభ్యంతరాలని పట్టించుకోకుండా 13 చోట్ల సంతకాలు పెట్టిన బాబు ►రూ.370 కోట్ల నిధుల విడుదలపై అప్పటి ఆర్దికశాఖ ఉన్నతాధికారి సునీత అభ్యంతరాలతో కూడిన నోట్ ఫైల్ కోర్టుకి సమర్పణ ► టీడీపీ ఖాతాలోకి రూ.27 కోట్లు జమ అయ్యాయని బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పణ ►బాబుకి బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని స్పష్టీకరణ ►నేడు కూడా వాదనలు వినిపించనున్న పొన్నవోలు ►ఆ తర్వాతే సీఐడీ కస్టడీ పిటిషన్‌పై పొన్నవోలు వాదనలు ► ఈ రెండు పిటిషన్ల తర్వాతే.. ఇన్నర్ రింగ్చరోడ్, ఫైబర్ నెట్, పిటి వారెంట్ పిటిషన్లపై విచారణ జరిగే అవకాశం 07:16AM, అక్టోబర్ 06 2023 నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ►నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ►బాబుతో ములాఖత్ కానున్న భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి ► ఈ నెల 12న ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‌ను విచారించనున్న ఏపీ సీఐడీ ► కోర్టు ఆదేశాల ప్రకారం.. ఇప్పటికే నోటీసులు అందజేత 07:06AM, అక్టోబర్ 06 2023 నేటి విచారణ కీలకం? ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు ►గత రెండు రోజులపాటు కొనసాగుతున్న వాదనలు ►నేడు మధ్యాహ్నం మరోసారి విననున్న కోర్టు ►చంద్రబాబు తరపున ప్రమోద్‌కుమార్ దూబే.. సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు ►నేటి విచారణ కీలకంగా మారే అవకాశం 06:58AM, అక్టోబర్ 06 2023 వేర్వేరు కోర్టుల్లో చంద్రబాబు & కో రకరకాల పిటిషన్లు ►ACB కోర్టు : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ ►హైకోర్టు : ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో బాబు బెయిల్ పిటిషన్ ► ఫైబర్ నెట్ స్కామ్ కేసులో ముందస్తు కోసం పిటిషన్ ►సోమవారం సుప్రీంకోర్టు ముందుకు రానున్న చంద్రబాబు పిటిషన్ 06:52AM, అక్టోబర్ 06 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @27 ►స్కిల్‌డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►27వ రోజుకి చేరిన రిమాండ్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ నెంబర్ 7691గా బాబు ►అక్టోబర్ 19దాకా రిమాండ్ పొడిగింపు ►గురువారం వర్చువల్‌గా జడ్జి ముందు హాజరుపర్చిన అధికారులు ►రిమాండ్ పొడిగించాలని సీఐడీ మెమో దాఖలు ►పరిశీలించిన రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►ఇప్పటికే రెండు దఫాలుగా రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►తాజాగా మూడోసారి పొడిగించిన కోర్టు ► రిమాండ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేవని జడ్జి ఎదుట చంద్రబాబు స్టేట్మెంట్ -
భార్యాబిడ్డలను హత్యచేసి.. ఆత్మహత్య
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడపలో హెడ్ కానిస్టేబుల్ భార్యాపిల్లల్ని హత్యచేసి, ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో రైటర్‌గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ టి.వెంకటేశ్వర్ (51) (హెచ్‌సీ 1895) ఈ దురాగతానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున మూడుగంటలలోపు 9ఎంఎం పిస్టల్‌తో భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపేశాడు. తర్వాత అదే పిస్టల్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. పులివెందులకు చెందిన వెంకటేశ్వర్ 1993లో కానిస్టేబుల్‌గా చేరాడు. అతడి భార్య మాధవి (47). వీరికి ఇద్దరు కుమార్తెలు లాస్య (21), అభిజ్ఞ (16). లాస్య డిగ్రీ, అభిజ్ఞ టెన్త్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్‌కు యారాసు రమాదేవి అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త చనిపోయిన ఆమెకు నాగలోకేశ్వర్రెడ్డి అనే కుమారుడున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో కలతలు రేగాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్ బుధవారం రాత్రి విధులు ముగించుకుని 10.30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. తన కస్టడీలోనే ఉండే పోలీసు అధికారులకు సంబంధించిన ఓ పిస్టల్‌ను ఎవరికి తెలియకుండా వెంట తెచ్చుకున్నాడు. రాత్రి భోజనం తర్వాత భార్య, ఇద్దరు కుమార్తెలు బెడ్రూంలో పడుకుని ఉండగా కాల్చి చంపేశాడు. తర్వాత అదే పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు వచ్చారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ కం అగ్రిమెంట్‌తో పాటు మరో డాక్యుమెంట్‌ను స్వాదీనం చేసుకున్నారు. సూసైడ్‌నోట్‌లో తన భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు కాబట్టి, తన మరణానంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన డెత్ బెనిఫిట్స్ మొత్తం తన రెండో భార్య యారాసు రమాదేవికి, ఆమె కుమారుడు యారాసు నాగలోకేశ్వర్‌రెడ్డికి చెందాలని రాశాడు. మరో డాక్యుమెంట్లో రమాదేవి నుంచి తాను అవసరాల నిమిత్తం రూ.20 లక్షలు అప్పు తీసుకున్నానని, ప్రతిఫలంగా తనకు పులివెందుల మండలం ఉలిమెల వద్ద అనువంశికంగా వచ్చిన స్థిరాస్తిని రాసి ఇస్తున్నట్లు ఉంది. భార్యాపిల్లలను చంపకముందు వారు పూర్తిగా నిద్రలోకి జారుకునేందుకు మత్తుమందు కలిపి ఇచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, కడప డీఎస్పీ ఎండీ షరీఫ్, సీఐలు ఎన్.వి.నాగరాజు, రామచంద్ర, సయ్యద్ హాసం, ఎస్బీ సీఐలు అశోక్‌రెడ్డి, యు.వెంకటకుమార్, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం వారు ఆధారాలను సేకరించారు. మృతదేహాలను డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజాద్‌బాషా, కడప మేయర్ కె.సురేష్‌బాబు, వైఎస్సార్సీపీ నాయకుడు అప్జల్‌ఖాన్, పులి సునీల్‌కుమార్, సిబ్బంది పరిశీలించారు. డీఎస్పీని అడిగి వివరాలను తెలుసుకున్నారు. మృతదేహాలను కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. మార్చురీలో మృతదేహాలను ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరి్థక సమస్యలు, వివాహేతర సంబంధం కారణంగా ఈ ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. కర్నూలు డీఐజీ సెంథిల్‌కుమార్ కడప వచ్చి స్టేషన్లో పోలీసు అధికారులను, సిబ్బందిని విచారించారు. -
తల్లితో వివాహేతర సంబంధం.. కూతురినిచ్చి పెళ్లి చేయాలని డిమాండ్
వైఎస్సార్: పట్టణంలోని ముస్లింకోటలో మంగళవారం రాత్రి ఓ మహిళ దారుణహత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు.. షేక్ గౌసియాబేగం (38) స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో ( ఔట్ సోర్సింగ్) కూలి పని చేసేది. ఆమె భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. ఇద్దరు ఆడపిల్లలతో ఆమె కూలి పని చేసుకుని జీవనం సాగిస్తోంది.ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన సుబహాని (24) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇటీవల సుబహాని కువైట్ వెళ్లి వచ్చాడు. ఆమెకు ఆర్థికంగా సహాయం కూడా చేశాడు. ఈ నేపథ్యంలో గౌసియాబేగం పెద్ద కూతురును తనకిచ్చి పెళ్లి చేయమని సుబహాని అడిగాడు. ఇందుకు ఆమె అంగీకరించకపోగా ఇటీవల కూతురుకు గిద్దలూరులో సంబంధం ఖాయం చేసుకుంది. దీంతో ఆమైపె కక్ష పెంచుకున్న సుబహాని పథకం ప్రకారం మంగళవారం రాత్రి ఉర్దూ స్కూలుకు పిలిచి హత్య చేసి మృత దేహాన్ని బాత్రూమ్లో పడేసి వెళ్లాడు. హత్య అనంతరం నిందితుడు నేరుగా పోలీస్‌స్టేషన్ వెళ్లి హత్య విషయం చెప్పాడు. లేకపోతే బుధవారం ఉదయం పాఠశాల తెరిచేంతవరకు ఈ విషయం వెలుగు చూసేది కాదు. ఈ సంఘటనపై ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, ఏఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ బుధవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.