-
తల్లితో వివాహేతర సంబంధం.. కూతురినిచ్చి పెళ్లి చేయాలని డిమాండ్
వైఎస్సార్: పట్టణంలోని ముస్లింకోటలో మంగళవారం రాత్రి ఓ మహిళ దారుణహత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు.. షేక్ గౌసియాబేగం (38) స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో ( ఔట్ సోర్సింగ్) కూలి పని చేసేది. ఆమె భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. ఇద్దరు ఆడపిల్లలతో ఆమె కూలి పని చేసుకుని జీవనం సాగిస్తోంది.ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన సుబహాని (24) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇటీవల సుబహాని కువైట్ వెళ్లి వచ్చాడు. ఆమెకు ఆర్థికంగా సహాయం కూడా చేశాడు. ఈ నేపథ్యంలో గౌసియాబేగం పెద్ద కూతురును తనకిచ్చి పెళ్లి చేయమని సుబహాని అడిగాడు. ఇందుకు ఆమె అంగీకరించకపోగా ఇటీవల కూతురుకు గిద్దలూరులో సంబంధం ఖాయం చేసుకుంది. దీంతో ఆమైపె కక్ష పెంచుకున్న సుబహాని పథకం ప్రకారం మంగళవారం రాత్రి ఉర్దూ స్కూలుకు పిలిచి హత్య చేసి మృత దేహాన్ని బాత్రూమ్లో పడేసి వెళ్లాడు. హత్య అనంతరం నిందితుడు నేరుగా పోలీస్‌స్టేషన్ వెళ్లి హత్య విషయం చెప్పాడు. లేకపోతే బుధవారం ఉదయం పాఠశాల తెరిచేంతవరకు ఈ విషయం వెలుగు చూసేది కాదు. ఈ సంఘటనపై ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, ఏఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ బుధవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కడపలో విషాదం.. కుటుంబంతో సహా హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, వైఎస్సార్ కడప జిల్లా: కడప కో-ఆపరేటివ్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కడప టూ టౌన్ హెచ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు.. కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలను, రివాల్వర్ తో కాల్చి తానూ కాల్చుకునీ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
Oct 5th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates 6:05 PM, అక్టోబర్ 05 2023 మెదక్ : చంద్రబాబునాయుడిని జనమే బ్యాన్ చేశారు : మంత్రి హరీష్ రావు ► మెదక్ జిల్లా సభలో మాట్లాడిన తెలంగాణ మంత్రి హరీష్‌రావు ► కులాలు, జాతుల గురించి చంద్రబాబు ఎప్పుడు ఆలోచించలేదు ► చంద్రబాబు నాయుడు పందులను, మేకలను బ్యాన్ చేశాడు ► చివరకు ప్రజలు ఆయన్నే బ్యాన్ చేశారు, ఇప్పుడు జైలుకు పంపారు ► చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవడం వద్దు 6:00 PM, అక్టోబర్ 05 2023 ఎట్టకేలకు ఢిల్లీ వదిలిన లోకేష్ ► ఢిల్లీ నుంచి రాజమండ్రికి నారా లోకేష్ ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత 22 రోజుల పాటు ఢిల్లీకే పరిమితమైన లోకేష్ ► రఘురామకృష్ణరాజుతో కలిసి సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో చర్చలు జరిపిన లోకేష్ ► వీడ్కోలు పలికిన టీడీపీ ఎంపీలు కనకమేడల, కేశినేని నాని, ఎంపీ రఘురామ ► రేపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తండ్రి చంద్రబాబును ములాఖత్‌లో కుటుంబసభ్యులతో పాటు కలవనున్న లోకేష్ ► చంద్రబాబుకు మరో 14 రోజులు పాటు రిమాండ్ విధించిన న్యాయస్థానం ► ఆదివారం మళ్లీ లోకేష్ ఢిల్లీకి వెళ్లిపోతాడని ప్రచారం ► సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్న చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ► విచారణ సమయంలో సుప్రీంకోర్టుకు లాయర్లతో కలిసి వెళ్లనున్న నారా లోకేష్ 5:10 PM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు నేర చరిత్రపై YSRCP విమర్శలు ► పదవిని అడ్డుపెట్టుకుని రూ.6 లక్షల కోట్లు దోచుకున్నాడని విమర్శ ► దోపిడిలో లోకేష్, పవన్ కళ్యాణ్‌లకు వాటా ఉందని విమర్శ Presenting India’s biggest and most notorious scamster Mr. Nara Chandra Babu Naidu @ncbn, who looted a whopping ₹6 Lakh Crores of Public Money! Costarring his coterie of co-looters Guru - Mr Ramoji Rao Biological Son - Mr @NaraLokesh Adopted Son - Mr @PawanKalyan And… pic.twitter.com/tuQHUCEFPy — YSR Congress Party (@YSRCParty) October 5, 2023 5:00 PM, అక్టోబర్ 05 2023 రేపు ACB కోర్టులో చంద్రబాబు బెయిల్‌పై వాదనలు ► విజయవాడ : చంద్రబాబు పిటిషన్లపై విచారణ రేపు మధ్యాహ్నానికి వాయిదా ► రేపు మధ్యాహ్నం బాబు న్యాయవాది దూబే వాదనలకి రిప్లై ఇవ్వనున్న AAG పొన్నవోలు ► రేపు మధ్యాహ్నం తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ PT వారెంట్లపైనా విచారణ జరిగే అవకాశం 4:45 PM, అక్టోబర్ 05 2023 హైకోర్టు : చంద్రబాబు బెయిల్‌పై తీర్పు రిజర్వ్ ► హైకోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసుపై ముగిసిన వాదనలు ► చంద్రబాబు ముందస్తు బెయిల్ పై తీర్పు రిజర్వు ► చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దంటూ CID తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరాం వాదనలు ► స్కిల్ కేసులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్, పార్థసాని ఇప్పటికే పరారీలో ఉన్నారు ► చంద్రబాబు ప్రమేయంతోనే వారిద్దరూ పరారైనట్లు మాకు సమాచారం ఉంది ► చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దు ► చంద్రబాబు బయటకు వస్తే సాక్షులు ప్రభావితం చేస్తారు 4:45 PM, అక్టోబర్ 05 2023 స్కిల్ స్కాం నిధులన్నీ చంద్రబాబు ఖాతాలకు చేరాయి : సజ్జల ► స్కిల్ స్కామ్ కేసులో CID ఆధారాలు సేకరించినట్టు కోర్టుకు తెలిపింది ► స్కామ్‌లో డబ్బులు చంద్రబాబు ఖాతాలోకి వెళ్లినట్టు CID ఆధారాలు సేకరించింది ► ఈ కుంభకోణంలో లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేష్ పాత్ర కీలకంగా ఉందని CID దర్యాప్తులో తేలింది ► NDA కూటమి నుంచి బయటకొచ్చినట్టు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు ► పవన్ తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది ► టీడీపీ బలహీనపడిందని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు ► పవన్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పాలి ► అసలు టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో తెలియాలి ► చంద్రబాబును జైల్లో పెట్టింది జగన్ కాదు కోర్టు ► ప్రభుత్వానికి చంద్రబాబు కేసులతో సంబంధం లేదు : సజ్జల 4:38 PM, అక్టోబర్ 05 2023 స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్ పొడిగింపు ► ఈ నెల 19 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ► చంద్రబాబు రిమాండ్ మరో 14 రోజులు పొడిగింపు 4:31 PM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా ► రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ► రేపు మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటానన్న న్యాయమూర్తి ► ఇవాళ హోరాహోరీగా సాగిన ఇరుపక్షాల వాదనలు 2:50 PM, అక్టోబర్ 05 2023 బుద్ధా వెంకన్న కేసు @ హైకోర్టు ► ఏపీ హైకోర్టులో బుద్ధా వెంకన్న పిటిషన్ ► పేర్నినాని పెట్టిన కేసుపై హైకోర్టును ఆశ్రయించిన బుద్ధా వెంకన్న ► వల్లభనేని వంశీ, కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బుద్ధా వెంకన్నపై కేసు ► గన్నవరం ఆత్కూరు స్టేషన్లో కేసు పెట్టిన పేర్నినాని ► బుద్దా వెంకన్నకు 41A కింద నోటీసు ఇవ్వాలన్న హైకోర్టు 2:50 PM, అక్టోబర్ 05 2023 బండారు కేసు @ హైకోర్టు ► ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి బండారు పిటిషన్ ► తనపై పెట్టిన కేసును సవాలు చేసిన టిడిపి నేత బండారు ► బండారు పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని అడ్వొకేట్ జనరల్‌కు హైకోర్టు సూచన ► ఇటీవల మంత్రి రోజాపై నీచ వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత బండారు ► మహిళలను కించపరిచినవారు బాగుపడ్డ దాఖలాలు చరిత్రలో లేవన్న మంత్రి రోజా ❝ స్త్రీ కన్నీటి బొట్టు గురించి చాగంటి వారి ప్రవచనం ❞ pic.twitter.com/6rshDIRACU — Roja Selvamani (@RojaSelvamaniRK) October 3, 2023 2:45 PM, అక్టోబర్ 05 2023 లంచ్ తర్వాత వాదనలు పునఃప్రారంభం ► ఏపీ హైకోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసు ► ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ► CID తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు 2:15 PM, అక్టోబర్ 05 2023 తెలుగుదేశం, జనసేనలకు YSRCP చురకలు ► ఎన్నికలు రాగానే ప్యాకేజీ రాజకీయాలా? ► ఇవేం పార్టీలు, ఇవేం పొత్తులు : అంబటి జనసేన రాజకీయ పార్టీ కాదు ! తెలుగుదేశం బలహీనపడినప్పుడు వాడే బలం మందు! @PawanKalyan @naralokesh @JaiTDP — Ambati Rambabu (@AmbatiRambabu) October 5, 2023 1:50 PM, అక్టోబర్ 05 2023 బాబు బయటకు వస్తే.. సాక్ష్యాధారాలు తారుమారే ► ఏపీ హైకోర్టు: ఫైబర్‌గ్రిడ్ కేసు సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు ► ప్రాథమిక విచారణలో చంద్రబాబు పేరు లేదు కాబట్టి కేసులో లేరు అనటం సరికాదు ► పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత చంద్రబాబు ప్రమేయం గుర్తించాం ► అందుకే నిందితుడుగా చంద్రబాబు పేరును చేర్చాం ► టెరా సాప్ట్ కు పనులు ఇవ్వటం మొదలు అన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయి ► నిబంధనలు పాటించకుండా నిర్ణయాలు అమలు చేసి అక్రమాలకు పాల్పడ్డారు 1:40 PM, అక్టోబర్ 05 2023 మద్ధతివ్వండి ప్లీజ్.. CPIని రిక్వెస్ట్ చేసిన TDP ► గుంటూరు జిల్లా CPI కార్యాలయానికి వెళ్లిన TDP నాయకులు ► ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్‌తో TDP నేతల భేటీ ► TDP బృందంలో నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, తెనాలి శ్రావణ్ ► ఈ నెల 7న జరిగే శాంతి ర్యాలీకు CPI మద్దతు కోరిన TDP నాయకులు 1:20 PM, అక్టోబర్ 05 2023 ఓట్ల కోసం కక్కుర్తి పడతారా? మీలో మీకైనా కనీస గౌరవముందా? ► తెలుగుదేశం, జనసేన నాయకులపై YSRCP విమర్శలు ► మీలో మీకే గౌరవం లేదు, ప్రజలను ఏం గౌరవిస్తారని ప్రశ్న మనసులో లేని ప్రేమ, అభిమానాన్ని నటిస్తూ అధికారం కోసం @JaiTDP, @JanaSenaParty పొత్తు పెట్టుకున్నాయి. కానీ.. ఎంత సీనియర్ నటులైనా లేని గౌరవాన్ని అన్నివేళలా నటించడం సాధ్యం కాదు కదా..? చంద్రబాబుని గాడు అని @PawanKalyan సంభోదిస్తే.. ఆ పవన్ కళ్యాణ్‌ని మరింత వెటకారంగా గాడూ అంటూ నందమూరి… pic.twitter.com/VXuaS4QYhQ — YSR Congress Party (@YSRCParty) October 4, 2023 1:10 PM, అక్టోబర్ 05 2023 కార్పోరేషన్ తప్పు చేస్తే.. చంద్రబాబుకేంటీ సంబంధం : బాబు లాయర్ వాదన ► చంద్రబాబు తరపున మరో సీనియర్ లాయర్ ప్రమోద్ కుమార్ దూబే వాదనలు ► దూబే : సాంకేతికంగా చంద్రబాబుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు ► న్యాయమూర్తి : చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ కార్పోరేషనుకు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీల సంగతేంటీ? ► దూబే : స్కిల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతోనే సీఎంగా చంద్రబాబు పాత్ర పూర్తయింది ► బ్యాంకు గ్యారెంటీలను స్కిల్ కార్పోరేషన్‌కు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది ► సీమెన్స్‌తో ఒప్పందం చేసుకుంది స్కిల్ కార్పోరేషనే తప్ప.. ప్రభుత్వం కాదు ► స్కిల్ కార్పోరేషన్, సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది ► అక్కడ అవినీతి, అక్రమాలు జరిగితే చంద్రబాబుకు సంబంధం ఎలా ఉన్నట్టు? : దూబే 12:50 PM, అక్టోబర్ 05 2023 హైకోర్టు : ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు లాయర్ సిద్ధార్థ అగర్వాల్ వాదనలు ► ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్‌పై హైకోర్టులో వాదనలు ► ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టులను నిబంధనలు ప్రకారమే బిడ్డర్‌కు ఇచ్చారు ► ఇందులో చంద్రబాబు తప్పేమీ లేదు, ► ఈ కేసులో కొందరికి బెయిల్ లభించింది ► చంద్రబాబుకు కూడా బెయిల్ ఇవ్వాలి : లాయర్ అగర్వాల్ 12:38 PM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు పాత్రకు ఇవే ఆధారాలు : ACB కోర్టులో పొన్నవోలు ► విజయవాడ : రెండో రోజు ACB కోర్టులో సంచలన నిజాలు బయటపెట్టిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ► నైపుణ్య శిక్షణ పేరుతో 370 కోట్ల నిధులని దిగమింగారు ► చంద్రబాబు పాత్రను బయటపెట్టే డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పణ ► ఏ రకంగా డొల్ల కంపెనీల నుంచి ఈ నిధులు నేరుగా టిడిపి ఖాతాలోకి వచ్చాయన్న దానిపై ఆధారాల సమర్పణ ► రూ.27 కోట్లు మళ్లించిన బ్యాంకు ఖాతాల డాక్యుమెంట్లని ACB కోర్టుకు సమర్పణ ► దీనికి సంబంధించిన ఆడిటర్‌ను విచారణకు పిలిచాం ► ఈ నెల 10 న విచారణకు ఆడిటర్ వస్తానన్నారు ► డొల్ల కంపెనీలని సృష్టించి హవాలా రూపంలో నిధులు దిగమింగిన వైనాన్ని వివరించిన పొన్నవోలు 12:30 PM, అక్టోబర్ 05 2023 ఫైబర్‌నెట్ స్కాంలో చంద్రబాబుదే కీలక పాత్ర ► ఏపీ హైకోర్టులో ఫైబర్ నెట్ కుంభకోణంలో వాదనలు ► తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు నాయుడు పిటిషన్ ► CID తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు ► చంద్రబాబు నాయుడు బెయిల్ విజ్ఞప్తిని తిరస్కరించాలన్న AG శ్రీరామ్ 12:30 PM, అక్టోబర్ 05 2023 భువనేశ్వరీ ప్రకటనపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి : YSRCP ► భువనేశ్వరీ ఇటీవల చేసిన ప్రకటనపై నారుమల్లి పద్మజ విమర్శలు ►ఎన్టీఆర్ కన్నీళ్లు కార్చితేనే స్పందించని భువనేశ్వరి ఇతర మహిళల కష్టాలకు స్పందిస్తుందా? ►హెరిటేజ్‌లో 2% అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని భువనేశ్వరి అంటున్నారు ►దీనిపై ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి, ఆస్తుల అఫిడవిట్లపై విచారణ జరపాలి ►బండారు సత్యనారాయణ లాంటి కీచకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతన్నారు ►ఇలాంటి వారిని ఎవరు ప్రోత్సాహిస్తున్నారు? ►ఒక మహిళ కన్నీరు తమకు సంతోషాన్నిస్తోందని అంటున్నారంటే టీడీపీ వారి పైశాచికత్వాన్ని ఏం అనాలి? ►భువనేశ్వరి సభలో ఒక పిల్లాడితో చండాలంగా మాట్లాడించారు ►భువనేశ్వరి చప్పట్లు కొడుతుంటే అసలు వీరు మహిళలేనా అనిపిస్తోంది ►చంద్రబాబు చేసిన స్కాంలలో కూడా భువనేశ్వరి పాత్ర ఉందనే అనుమానం వస్తోంది ►విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ జరిగినప్పుడు ఈ భువనేశ్వరి ఎందుకు మాట్లాడలేదు? 12:24 PM, అక్టోబర్ 05 2023 బెయిల్ ఇవ్వొద్దు, కస్టడీకి అప్పగించండి : CID లాయర్ పొన్నవోలు ► స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయి ► స్కిల్ స్కామ్ కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే ► కస్టడీకి ఇస్తే కేసుకు సంబంధించి లోతైన విచారణ జరుగుతుంది ► బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరిన అదనపు అడ్వకేట్ జనరల్ 12:10 PM, అక్టోబర్ 05 2023 ఇవ్వాళ ACB కోర్టు ముందుకు చంద్రబాబు ► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్‌పై నేడు కోర్టు నిర్ణయం ► ఇవాళ ACB కోర్టు ముందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు హాజరు ► ఈ సాయంత్రానికి రాజమండ్రికి నారా లోకేష్ ► రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్ ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత 21 రోజులుగా ఢిల్లీలోనే నారా లోకేష్ 12:04 PM, అక్టోబర్ 05 2023 ACB కోర్టులో CID తరపున పొన్నవోలు వాదనలు ► స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయి ► చంద్రబాబు స్వయంగా 13 చోట్ల సంతకాలు పెట్టారు ► రూ.27 కోట్లు నేరుగా టిడిపి ఖాతాలో జమ అయ్యాయి ► ఆర్టికల్ 14 ని ప్రస్తావించిన పొన్నవోలు ► న్యాయం ముందు అందరూ సమానమే.... ముఖ్యమంత్రైనా...సామాన్యుడికైనా న్యాయమొక్కటే ► ముఖ్యమంత్రి హోదాను అడ్డుకుని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా? ► ఇది మామూలు కేసు కాదు...తీవ్ర ఆర్ధిక నేరం కలిగిన కేసు ► చంద్రబాబు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేశారు 11:43 AM, అక్టోబర్ 05 2023 జైల్లో చంద్రబాబు, క్షేత్రస్థాయిలో తమ్ముళ్ల కుస్తీలు ► కృష్ణా జిల్లా : పెనమలూరు టీడీపీలో టిక్కెట్ చిచ్చు ► ఇటీవల కాలంలో పెనమలూరు నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరుగుతున్న దేవినేని గౌతమ్ ► జనసేన మద్ధతుతో పెనమలూరు టిడిపి టిక్కెట్ దేవినేని గౌతమ్‌కు ఇస్తారని ప్రచారం ► పార్టీలో పరిస్థితుల పై నియోజకవర్గ ఇంఛార్జి బోడే ప్రసాద్ అసహనం ► దేవినేని గౌతమ్‌కు టిడిపి టికెట్ ఇస్తే.. పార్టీని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా : బోడే ► క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని పార్టీ క్యాడర్ అంగీకరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా 11:43 AM, అక్టోబర్ 05 2023 ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై కోర్టుకు ఫిర్యాదు ► విజయవాడ : ACB కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై వాదనలు ► ఎల్లో మీడియా తప్పుడు కథనాలను కోర్టు ముందు ప్రస్తావించిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి ► ACB జడ్జి తనపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ తప్పుడు కథనాలు రాశారని తెలిపిన పొన్నవోలు ► తప్పుడు కవరేజీపై కోర్టు ఆగ్రహం ► విచారణ జరుగుతున్న హాలులో న్యాయవాదులు కాకుండా ఇంకెవరూ వుండకూడదని న్యాయమూర్తి ఆదేశం 11:40 AM, అక్టోబర్ 05 2023 TDP, జనసేన అట్టర్‌ఫ్లాప్: జోగి రమేష్ ► తాడేపల్లి : టీడీపీ, జనసేన కలయిక వైరస్ కంటే ప్రమాదకరం ► టీడీపీ, జనసేన కలిసిన తర్వాత పెట్టిన మీటింగ్ ప్లాప్ అయింది ► పవన్ మీటింగ్ అట్టర్ ప్లాప్ షోలా మారిపోయింది ► పవన్ తాట తీస్తానని చెప్పి రెండు చోట్లా ఓడిపోయాడు ► ఎలాంటి విలువలు, విశ్వసనీయత లేని మనిషి పవన్ ► రంగాను చంపించిన వారికి అమ్ముడుపోతావా పవన్? ► కాపుల కోసం పోరాడిన ముద్రగడను చంద్రబాబు వేధించారు ► పవన్ మీటింగ్ పెడితే కనీసం రెండు వేల మంది రాలేదు ► చేసిన తప్పుకు చంద్రబాబు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు టీడీపీ, జనసేన పార్టీల కలయిక వైరస్ లాంటిది కాబట్టే.. రెండు పార్టీలు కలిసి మీటింగ్ పెట్టుకున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ పెడన సభ అట్టర్ ఫ్లాప్ అయింది. - మంత్రి జోగి రమేష్ #PackageStarPK#PoliticalBrokerPK#EndOfTDP pic.twitter.com/FwjhTPedU2 — YSR Congress Party (@YSRCParty) October 5, 2023 11:35 AM, అక్టోబర్ 05 2023 NDA నుంచి ఎందుకు బయటకు వచ్చానంటే : పవన్ కళ్యాణ్ ► నాకు చాలా ఇబ్బందులున్నాయి ► NDAలో భాగస్వామి ఉండి కూడా.. నేను బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్ధతు తెలిపాను ► వంద శాతం నా మద్ధతు ఎందుకు ప్రకటించానంటే.. ► ఎందుకంటే తెలుగుదేశం చాలా బలహీన పరిస్థితుల్లో ఉంది కాబట్టి ► తెలుగుదేశం నాయకులు చాలా బలహీనంగా ఉన్నారు ► మీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జనసేన పోరాట పటిమ టిడిపికి అవసరం కాబట్టి మద్ధతిచ్చాను #PawanaKalyan #TDP #JanaSenaParty pic.twitter.com/DAH2BJIgjd — Vattikoti Vishnu (@Vattikoti1989) October 5, 2023 11:30 AM, అక్టోబర్ 05 2023 NDAకు పవన్ కళ్యాణ్ రాం రాం.! ► తెలుగుదేశం కోసం పవన్‌కళ్యాణ్ NDAకు గుడ్‌బై ► ప్రకటించిన జాతీయ న్యూస్ ఏజెన్సీ ANI Actor, Politician Pawan Kalyan exits NDA to support Chandrababu Naidu Read @ANI Story | https://t.co/K8qOh21K9Y#PawanKalyan #NDA #ChandrababuNaidu pic.twitter.com/Ojlq1ylmg1 — ANI Digital (@ani_digital) October 5, 2023 11:20AM, అక్టోబర్ 05 2023 ACB కోర్టులో రిమాండ్ మెమో ► విజయవాడ : చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని కోరుతూ మెమో దాఖలు చేసిన CID ► 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించాలంటూ మెమో దాఖలు చేసిన సీఐడీ 11:00AM, అక్టోబర్ 05 2023 ఏపీ హైకోర్టులో ప్రారంభమైన విచారణ ►ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ►ఏపీ హైకోర్టులో ప్రారంభమైన విచారణ ►చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ సిద్ధార్థ అగర్వాల్, లూథ్రా 10:40AM, అక్టోబర్ 05 2023 బాబు స్కీంలు ఇవ్వలేదు.. స్కాంలు చేశారు ►చంద్రబాబు స్కీం లు ఇవ్వలేదు, స్కాంలకు పాల్పడ్డారు ►తాను కట్టిన జైల్లో చంద్రబాబు శిక్ష అనుభవిస్తున్నారు ►మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారును ఉరి తీయాలి ►మహిళల్ని కించపరిచేలా మాట్లాడితే నాలుక చీరేస్తాం ►పవన్ కల్యాణ్ కొట్టే.. సినిమా డైలాగ్ లకు వైఎస్సార్సీపీ భయపడదు :::వంగపండు ఉష, రాష్ట్ర సంస్కృతిక విభాగం అధ్యక్షురాలు 10:24AM, అక్టోబర్ 05 2023 కోర్డుకి చేరుకున్న ఏఏజీ సుధాకర్ రెడ్డి ►విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ►సీఐడీ తరపున నిన్న బలమైన వాదనలు వినిపించిన ఏఏజీ ►స్కిల్ కుంభకోణం అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది ►స్కిల్ స్కామ్ ఫిక్షన్ కాదు.. ప్రభుత్వ నిధులు కొల్లగొట్టిన అవినీతి వ్యవహారం ►బాబు చేసిన 13 సంతకాలతో సహా బలమైన ఆధారాలున్నాయి ►చెప్పినట్లు చేయాలని అధికారులను బెదిరించారు ►బాబు ఆదేశాలతోనే.. మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని పరారయ్యారు ►బెయిల్‌పై బయటకొస్తే మిగిలిన సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును ప్రభావితంచేయొచ్చని వాదనలు ►మరికాసేపట్లో చంద్రబాబు పిటిషన్‌పై ప్రారంభం కానున్న వాదనలు 09:56AM, అక్టోబర్ 05 2023 ముందస్తుపై కాసేపట్లో వాదనలు ►ఏపీ హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►మరికాసేపట్లో వాదనలు ప్రారంభం ►ఫైబర్ నెట్ కుంభకోణంలో కేసులో నిందితుడిగా చంద్రబాబు ►ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు 09:22AM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు రిమాండ్ పొడిగింపు ఉంటుందా? ►స్కిల్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ అయిన నారా చంద్రబాబు నాయుడు ►26 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ 7691గా బాబు ►సెప్టెంబర్ 10వ తేదీ నుంచి చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ►రెండుసార్లు పొడిగించిన ఏసీబీ కోర్టు ►రిమాండ్‌లో, సీఐడీ కస్టడీ ఇంటరాగేషన్‌లో ఎలాంటి ఇబ్బందులు పడలేదని స్వయంగా జడ్జికి చెప్పిన చంద్రబాబు 09:00AM, అక్టోబర్ 05 2023 పరిటాల సునీతపై కేసు నమోదు ►టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటా సునీతపై కేసు నమోదు ►శ్రీసత్యసాయి కనగానపల్లి లో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహణ ►సునీతతో పాటు తనయుడు శ్రీరామ్ సహా 119 మందిపై కేసు 08:29AM, అక్టోబర్ 05 2023 నేడు రాజమండ్రికి లోకేష్? ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ఇవాల్టితో పూర్తి కానున్న చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ► బ్లూ జీన్ యాప్ ద్వారా ఏసీబీ జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్న అధికారులు ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఇవాళ జరుగనున్న విచారణ ►నేడు రాజమండ్రి రానున్న నారా లోకేష్? ►రేపు చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి 08:08AM, అక్టోబర్ 05 2023 బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►ఫైబర్ నెట్ స్కామ్ కేసులో నిందితుడిగా చంద్రబాబు నాయుడు ►ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ►నేడు విచారణకు వచ్చే అవకాశం 07:53AM, అక్టోబర్ 05 2023 తాడు లేని బొంగరంగా.. టీడీపీ ►అసలు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని యనమల ►యనమలే పార్టీకి దిక్కంటూ వార్తలు ►టీడీపీ తాడు బొంగరంలేని పార్టీ అని అర్థమౌతుంది. ►తండ్రి స్కాం చేసి జైలుకెళ్తే.. కొడుకు పలాయనం చిత్తగించాడు. ►టీడీపీ క్యాడర్ అడ్రస్సే లేదు ::: వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అసలు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని యనమలే దిక్కంటూ వస్తున్న వార్తలు చూస్తుంటే టీడీపీ తాడు బొంగరంలేని పార్టీ అని అర్థమౌతుంది. తండ్రి స్కాం చేసి జైలుకెళ్తే, కొడుకు పలాయనం చిత్తగించాడు. క్యాడర్ అడ్రస్సే లేదు. — Vijayasai Reddy V (@VSReddy_MP) October 4, 2023 07:48AM, అక్టోబర్ 05 2023 డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టిందట! ►మహానేత వైఎస్సార్‌పై పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ►వైఎస్సార్ మేరు పర్వతం.. పవన్ కంకర కుప్ప ►ప్యాకేజీ తీసుకుని గంపగుత్తగా ఓట్లను తాకట్టు పెట్టేది పవన్.. ప్రజలకోసం జీవించిన వ్యక్తి వైఎస్సార్ ►2009 నాటికి నువ్వు కనీసం వార్డు మెంబర్ కూడా కాదు..కానీ జగన్ అప్పటికే కడప ఎంపీ ►నువ్వు అంత గొప్పోడివి అయితే ప్రజలు ఓడించరు కదా!. ►సొల్లు కబుర్లు మానేసి నాలుగు ఓట్ల కోసం ట్రై చేయు నువ్వెంత? నీ స్థాయి ఎంత? మేరు పర్వతం ముందు కంకర కుప్పంత! వైయస్సార్ తో నీకు పోలికా? ప్యాకేజీ తీసుకుని గంపగుత్తగా ఓట్లను తాకట్టు పెట్టేసిన నీకు ప్రజలకోసం జీవించిన మహానేతతో పోలిక దేనికీ @Pawankalyan? డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టకూడదు. నువ్వు చెప్పిన 2009 నాటికి… pic.twitter.com/pmEetPK8K1 — YSR Congress Party (@YSRCParty) October 4, 2023 07:26AM, అక్టోబర్ 05 2023 రాజమండ్రిలో పోలీసుల అలర్ట్ ►ఛలో రాజమండ్రి పేరిట టీడీపీ, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ పిలుపు ►ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు పర్మిషన్ లేదని నిన్ననే స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ►శాంతి భద్రతలకు భంగం వాటిల్లే చర్యలను ఉపేక్షించమని హెచ్చరిక ►144 సెక్షన్‌తో పాటు పోలీస్ సెక్షన్ 30 అమలు ►రాజమండ్రిలో పలు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు 07:18AM, అక్టోబర్ 05 2023 సూత్రధారి చంద్రబాబే: ఏఏజీ సుధాకర్‌రెడ్డి ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై నేడు కూడా కొనసాగనున్న విచారణ ►నేడు ఉదయం 11.15 గంటలకి ప్రారంభం కానున్న వాదనలు ►స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకి సంబంధం లేదని వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే ►చంద్రబాబుకి కనీసం కండిషనల్ బెయిల్ అయినా ఇవ్వాలని కోరిన దూబే ►స్కిల్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు ►చంద్రబాబు బెయిల్ పిటీషన్ డిస్మిస్ చేయాలని కోరిన పొన్నవోలు ►చంద్రబాబుకి బెయిల్ ఇస్తే సాక్షులని ప్రభావితం చేస్తారని ప్రస్తావన ►తీవ్రమైన ఆర్ధిక నేరాలలో బెయిల్ ఇవ్వకూడదన్న సుప్రీం తీర్పుని ఉదహరించిన పొన్నవోలు ►చంద్రబాబు రెండు రోజుల కస్టడీలో సహకరించలేదని వివరణ ►చంద్రబాబుని మరో అయిదు రోజుల కస్ఢడీకి ఇవ్వాలని కోరిన పొన్నవోలు ►పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకి పారిపోవడం వెనక చంద్రబాబు హస్తముందన్న పొన్నవోలు ►ఇరువర్గాల వాదనలు పూర్తికాకపోవడంతో విచారణ నేటికి వాయిదా ►చంద్రబాబు బెయిల్, కస్టడీ విచారణల తర్వాత ఇన్నర్ రింగ్చరోడ్, ఫైబర్ నెట్ పిటి వారెంట్లపైనా విచారణ జరిగే అవకాశం 06:58AM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు పిటిషన్లపై నేడు కొనసాగనున్న విచారణ ►చంద్రబాబు బెయిల్, కస్టడీ, పీటీ వారెంట్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ ►నిన్న సుదీర్ఘంగా సాగిన ఇరువైపుల వాదనలు ►నేటికి విచారణ వాయిదా వేసిన కోర్టు 06:52AM, అక్టోబర్ 05 2023 రిమాండ్ పొడిగింపుపై నేడు ఆదేశాలు ►నేటితో ముగియనున్న చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ►పొడిగింపుపై ఆదేశాలు ఇవ్వనున్న విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ►వర్చువల్‌గా చంద్రబాబును ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ►ఇంతకు ముందు రెండుసార్లు రిమాండ్ ముగిసినప్పుడు వర్చువల్‌గానే ప్రవేశపెట్టిన వైనం ►రిమాండ్ పొడిగింపు కోరుతూ.. మెమో దాఖలు చేయనున్న సీఐడీ అధికారులు 06:40AM, అక్టోబర్ 05 2023 జైల్లో భద్రంగా చంద్రబాబు ►జైల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ చంద్రబాబు ►స్నేహ బ్లాక్‌లో ప్రత్యేక వసతులు ►ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు ►కోర్టు అనుమతితో.. ఇంటి భోజనానికి అనుమతి ►కుటుంబ సభ్యులతో ములాఖత్‌లు 06:30AM, అక్టోబర్ 05 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @26 ►స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►ఏపీ సీఐడీ అరెస్ట్.. జ్యూడీషియల్ రిమాండ్ విధించిన అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం ►26వ రోజుకి చేరిన చంద్రబాబు రిమాండ్ -
దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు.. సాక్షులను బెదిరిస్తున్నారు
సాక్షి, విజయవాడ: ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు కీలక దశలో ఉంది. రూ.371 కోట్లు కొల్లగొట్టిన ఈ సామాజిక, ఆర్థిక కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా తానై చంద్రబాబు వ్యవహరించారు. ఈ కేసులో ఇప్పటికే ఆయన సాక్షులను బెదిరిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన బెయిల్‌పై బయటకొస్తే మిగిలిన సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును ప్రభావితంచేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతున్నా’.. అని రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తూ చంద్రబాబుకు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించేందుకు ఉన్న బలమైన కారణాలను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర సుస్పష్టమన్నారు. జీఓ జారీ, అందుకు విరుద్ధంగా ఒప్పందం కుదుర్చుకోవడం, అధికారుల నియామకం, ఆర్థిక శాఖ అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధుల విడుదల.. ఇలా అన్ని దశల్లోనూ చంద్రబాబే ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. అందుకు 13 నోట్‌ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేయడమే నిదర్శనమన్నారు. జీఓ నంబర్ 4 కంటే ముందే ఒప్పందం కుదుర్చుకున్నారని.. కానీ, ఆ ఒప్పందాన్ని జీఓలో ఎందుకు ప్రస్తావించలేదన్నది ఈ కేసులో కీలకమన్నారు. ఆర్థిక శాఖ అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను చంద్రబాబు దురుద్దేశపూరితంగానే తన విచక్షణాధికారాలు (వీటో)తో తోసిపుచ్చారని న్యాయస్థానానికి వివరించారు. బాబు బెదిరింపులపై ఆధారాలున్నాయి.. అంతేకాదు.. తాను చెప్పినట్లు చేయకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. వారిని పదవుల నుంచి తొలగిస్తానని ఆనాడు సీఎంహోదాలో చంద్రబాబు అధికారులను బెదిరించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని కూడా పొన్నవోలు న్యాయస్థానానికి వివరించారు. స్కిల్ కుంభకోణం ఏమీ ఫిక్షన్ కథ కాదని, ప్రభుత్వ నిధులు కొల్లగొట్టిన అవినీతి వ్యవహారమని చెప్పారు. ఆ మేరకు సమగ్ర దర్యాప్తు ద్వారా సీఐడీ గుర్తించి నివేదించిన ఆధారాలను పరిశీలించాలని న్యాయస్థానాన్ని కోరారు. షెల్ కంపెనీలు, నకిలీ ఇన్వాయిస్ల ద్వారా పన్ను ఎగవేతను 2017లోనే జీఎస్టీ అధికారులు గుర్తించారన్నారు. ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తులో ఉండగానే 2018లో 17వ సవరణ చేశారనే విషయాన్ని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తించదన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే వారిద్దరు పరార్.. ఇక నిధులను అక్రమంగా తరలించడంలో కీలక వ్యక్తులైన చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని దేశం విడిచి పరారైన ఉదంతాన్ని ప్రస్తావించారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని వారిని సీఐడీ నోటీసులు ఇవ్వగానే దేశం విడిచిపెట్టి పోవడం తీవ్రమైన పరిణామమన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే వారిద్దరూ పరారయ్యారని చెప్పారు. పెండ్యాల శ్రీనివాస్ పాస్‌పోర్ట్‌ను సీజ్ చేసేలా న్యాయస్థానం ఆదేశించాలని కోరారు. ఇక ఈ కేసులో గతంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చిన అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ప్రస్తుతం అందుకు భిన్నంగా మీడియా చానళ్లలో చర్చల్లో మాట్లాడుతుండటం వెనుక చంద్రబాబు ఒత్తిడి ఉందన్నారు. కాబట్టి ఈ తరుణంలో చంద్రబాబుకు బెయిల్ ఇస్తే ఆయన తన రాజకీయ పలుకుబడితో సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయన్నారు. కాబట్టి ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని న్యాయస్థానాన్ని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోరారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశంలేదు : దూబే అంతకుముందు.. ఈ కేసులో ముద్దాయి చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే వాదనలు వినిపిస్తూ.. ఆర్థిక శాఖ అధికారులు గుజరాత్ వెళ్లి అధ్యయనం చేసి ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదన్నారు. ఈ ప్రాజెక్టు విలువను నిర్ణయించిన కాస్ట్ వేల్యూయేషన్ కమిటీలో చంద్రబాబు లేరన్నారు. ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్న భాస్కరరావు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారని చెప్పారు. కేబినెట్ నిర్ణయం మేరకు చేసుకున్న ఒప్పందంలో చంద్రబాబును తప్పుబట్టడానికి లేదన్నారు. సాక్షులను ప్రభావితం చేయడంగానీ, ఆధారాలను ధ్వంసం చేయడంగానీ పరారయ్యే అవకాశంగానీ లేనందున చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. అనంతరం.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయనకు పీటీ వారంట్ జారీచేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై కూడా న్యాయస్థానం గురువారం విచారించే అవకాశాలున్నాయి. వాదనలపై వక్రీకరణలా!? ఏబీఎన్, టీవీ–5పై ఏఏజీ పొన్నవోలు ఆగ్రహం మరోవైపు.. న్యాయస్థానంలో జరిగిన వాదనలను వక్రీకరిస్తూ ఏబీఎన్, టీవీ–5 చానళ్లు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆ రెండు చానళ్లు తనను లొంగదీసుకోవాలని చూస్తున్నాయని.. అది సాధ్యం కాకపోవడంతో తనపై బురద జల్లుతున్నాయని ఆయన విమర్శించారు. విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ప్రాంగణంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు విచారణ సమయంలో న్యాయస్థానం తనపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు ఏబీఎన్, టీవీ–5 చానళ్లు దుష్ప్రచారం చేశాయని విమర్శించారు. అత్యంత కీలకమైన ఈ కేసులో ప్రభుత్వం తరఫున తాను బుధవారం మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5గంటల వరకు వినిపించిన వాదనను న్యాయస్థానం ఓపిగ్గా విందన్నారు. ఆ సమయంలో న్యాయస్థానం తనపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని.. నిరూపించలేకపోతే ఏం చేస్తారని ఏబీఎన్, టీవీ–5 చానళ్లకు పొన్నవోలు సవాల్ విసిరారు. ఆ రెండు చానళ్లు టీవీ చర్చల్లో తనను తిట్టిస్తున్నా సహించానని కానీ, ఏకంగా న్యాయస్థానంలో వాదనలను వక్రీకరించడాన్ని మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. ఈ విషయాన్ని గురువారం విచారణ సమయంలో న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఆ రెండు చానళ్లకు ధైర్యం ఉంటే గురువారం న్యాయస్థానం విచారణ సమయంలో రావాలని సవాల్ విసిరారు. -
ఏసీబీ వలలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ఎన్టీఆర్జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కొండపల్లి ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ ఏరియా (ఐడీఏ)లో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మికంగా దాడి చేశారు. స్థానిక సెంటారస్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో నూతన బాయిలర్ ఏర్పాటు అనుమతులకు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ సత్యనారాయణ అసిస్టెంట్ నాగభూషణం రూ.2.10 లక్షలు నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెంటారస్ ఫార్మా కంపెనీలో నూతన బాయిలర్ ఏర్పాటుకు కంపెనీ యజమాని బాలిరెడ్డి అర్జీ పెట్టుకోగా అనుమతులు ఇచ్చేందుకు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రూ.5.50 లక్షలు డిమాండ్ చేశాడు. రూ.3.50 లక్షలు ఇచ్చేందుకు బాలిరెడ్డి ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన నగదు రూ.2.10 లక్షలను సత్యనారాయణ అసిస్టెంట్ నాగభూషణం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ విషయంపై ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత మాట్లాడుతూ బాయిలర్ ఫిటింగ్ చార్జీలు రూ.లక్ష, అదనంగా మరో 1.10 లక్షలు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. నాగభూషణం చెప్పిన వివరాల మేరకు సత్యనారాయణను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఏసీబీ డీఎస్పీ శరత్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, శివకుమార్ పాల్గొన్నారు. -
Oct 4th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Remand In Rajamaundry Central Prison, Cases Scams, Political Comments And Court Hearings Ground updates 07:28 PM, అక్టోబర్ 04, 2023 ఫైబర్ నెట్ స్కాంలో బాబు ముందస్తు బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా రేపు ఉదయం 10:30 గంటలకు వాదనలు వింటామన్న హైకోర్టు 05:44 PM, అక్టోబర్ 04, 2023 ఏబీఎన్, టీవీ-5 తీరుపై ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం ►ఏబీఎన్, టీవీ-5లో కోర్టు వాదనలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ►ఏబీఎన్, టీవీ-5 దిగజారి ప్రవర్తిస్తున్నాయి ►ఏబీఎన్, టీవీ-5 దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నాయి ►పచ్చి అబద్ధాలను ప్రసారం చేస్తున్నారు ►కోర్టు నా వాదనలకు అడ్డుపడినట్టు ప్రసారం చేశారు ►కోర్టు నన్ను తిట్టినట్టుగా ప్రచారం చేస్తున్నారు ►బుట్టలో వేసుకో.. పడకపోతే బురద చల్లు.. ఇదే విధానాలతో ఏబీఎన్,టీవీ-5 ఛానెళ్లు నడుస్తున్నాయి ►ప్రభుత్వం తరఫున నేను నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ►నాపై ఇష్టమొచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. 05:07 PM, అక్టోబర్ 04, 2023 స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా ►విచారణ రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►రేపు ఉదయం 11 గంటలకు తిరిగి విచారించనున్న కోర్టు 04:05 PM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టు: సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు వాదనలు ►సీమెన్స్ కంపెనీ పేరుతో స్కిల్ స్కామ్‌కు పాల్పడ్డారు ►కేబినెట్ ఆమోదంతో ఎంవోయూ జరిగిందనడం అవాస్తవం ►చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ విదేశాలకు పారిపోయారు ►శ్రీనివాస్ పాస్‌పోర్ట్ సీజ్ చేసేలా కోర్టు ఆదేశాలివ్వాలి 03:47 PM, అక్టోబర్ 04, 2023 ఏపీ హైకోర్టులో ఫైబర్ నెట్ స్కాం కేసు విచారణ ►చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ ►సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు ►చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు 03:39 PM, అక్టోబర్ 04, 2023 ►స్కిల్ స్కాంలో లోకేష్ ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా ►ఈ నెల 12కు వాయిదా వేసిన హైకోర్టు 03:03 PM, అక్టోబర్ 04, 2023 సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు ►స్కిల్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది: ఏఏజీ ►చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలి ►చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ►శ్రీనివాస్, మనోజ్ విదేశాలకు పారిపోవడం వెనుక బాబు హస్తం ఉంది ►స్కిల్ స్కాంలో రూ.371 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం ►డొల్ల కంపెనీల పేరుతో నిధులు దోచుకున్నారు ►2017లోనే పన్నుల ఎగవేతపై జీఎస్టీ హెచ్చరించింది ►సీబీఐ విచారణ చేయాలని జీఎస్టీ కోరింది ►ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో ఉండగానే 2018లో 17ఏ సవరణ జరిగింది ►ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తించదు ►స్కిల్ స్కాంలో అన్ని ఆధారాలు కోర్టు ముందు ఉంచాం ►బాబు పాత్ర ఉందని సీఐడీ గుర్తించిన వివరాలు పరిశీలించాలి ►స్కిల్ స్కాం కేసు.. ఇదేమీ ఫిక్షన్ స్టోరీ కాదు ►ఆధారాలున్నాయి కాబట్టే బాబును కస్టడీ కోరుతున్నాం ►జీవో నం.4 కంటే ముందే సీమెన్స్ సంస్థతో ఎంవోయూ ►సీమెన్స్‌తో ఎంవోయూను జీవో నం.4లో ఎందుకు చూపలేదు 02:54 PM, అక్టోబర్ 04, 2023 ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ ►సీఐడీ తరఫున వాదనలు ప్రారంభించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి 01:30 PM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై లంచ్ బ్రేక్ ►చంద్రబాబు తరపున వాదనలు పూర్తి ►మధ్యాహ్నం 2.30 గంటలకి మొదలు కానున్న సీఐడీ వాదనలు ►కండీషన్ బెయిలయినా ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే విజ్ఞప్తి ►చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకి పారిపోవడానికి చంద్రబాబుకి సంబందం లేదంటూ వాదనలు ►సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి 01:26 PM, అక్టోబర్ 04, 2023 నారా ఫ్యామిలీకి పరామర్శలు ►రాజమండ్రి : భువనేశ్వరి, బ్రాహ్మణిని పరామర్శించిన మాజీ ఎంపీ హర్షకుమార్ ► భువనేశ్వరిని పరామర్శించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 01:21 PM, అక్టోబర్ 04, 2023 అక్టోబర్ 10 వరకు ఢిల్లీలోనే లోకేష్ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత 21 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న నారా లోకేష్ ►ఈ నెల 9 న సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా ►అప్పటి వరకు ఢిల్లీలోనే ఉండనున్న లోకేష్ 01:15 PM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు లాయర్ సుదీర్ఘ వాదనలు ►బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు వినిపిస్తున్న ప్రమోద్ కుమార్ దూబే ► స్కిల్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు ►అప్పటి ఆర్ధికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు ►సునీత అధ్యయనం చేసి సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు ► ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయి ► కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్మెంట్ ధరను నిర్ధారించింది ► కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీలో చంద్రబాబు లేరు ► కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు ► సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు మధ్యంతర బెయిల్ ను పొడిగించింది ► చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు ► చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత విచారణ చేపట్టారు ► ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు ► ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు..అవసరం ఏముంది? ► కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది ►కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబుపై కేసు ఎలా పెడతారు?:న్యాయవాది దూబే 01:00 PM, అక్టోబర్ 04, 2023 విజయవాడ: ఏసీబీ కోర్టులో కొనసాగుతోన్న వాదనలు ►స్కిల్ కుంభకోణం కేసులో సీఐడీ అభియోగాల్ని ప్రస్తావిస్తున్న బాబు లాయర్ దూబే ►ఉమ్మడి ఏపీలో ఓ భూ వివాదానికి సంబంధించి అప్పటి సీఎం రోశయ్య విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని కోర్టు దృష్టికి తెచ్చిన దూబే ►క్యాబినెట్ నిర్ణయంలో ముఖ్యమంత్రులను తప్పు పట్టడం సరికాదన్న వివిధ కోర్టుల తీర్పులను ఉదహరించిన దూబే ►సీమెన్స్ ఒప్పందంపై చంద్రబాబు సంతకం చేయలేదు ►సంతకం చేసిన ఘంటా సుబ్బారావు బెయిల్ మీద ఉన్నారు ►కొన్ని ఫైళ్లు మిస్ చేశారంటూ సీఐడీ అభియోగాలు మోపింది 12:53 AM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టుకు చేరుకున్న ఏఏజీ సుధాకర్ రెడ్డి ► చంద్రబాబు పిటిషన్ విచారణ.. అడిషినల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు చేరుకున్నారు ► ప్రస్తుతం బెయిల్ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు ►వాదనలు వినిపిస్తున్న బాబు లాయర్ దూబే 12:18 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు న్యాయవాది దూబే వాదనలు ►చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో కొనసాగుతోన్న విచారణ ►బెయిల్ పిటిషన్‌పై వాదనలు వివిపిస్తున్న బాబు లాయర్ ప్రమోద్‌కుమార్ దూబే ►స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు ►అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కే. సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు ►సునీత అధ్యయనం చేసి.. సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు ►సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న విషయమై ఆధారాలు ఉన్నాయి. ►కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్మెంటు ధరను నిర్దారించింది ►ఆ కమిటీలో చంద్రబాబు లేరు ►ఆ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు ►అతనికి సుప్రీం కోర్టు నవంబర్ 16వరకు మధ్యంతర బెయిలును పొడిగించింది ►చంద్రబాబుకు ఎలాంటి నోటీసివ్వకుండా అరెస్ట్ చేశారు ►అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేపట్టారు ►ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు ►ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు.. అవసరం ఏముంది? ►కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది ►కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబు మీద కేసు ఎలా పెడతారు? 12:00 AM, అక్టోబర్ 04, 2023 పవన్‌కు పోలీసుల నోటీసులు ►జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు పంపారు ►రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కు నోటీసులు ►పెడన బహిరంగ సభలో గొడవలు జరుగుతాయన్న పవన్ ►నోటీసులపై వివరణ ఇచ్చిన ఎస్పీ జాషువా ►మీరు తిరగబడి కాళ్ళు చేతులు కట్టేయండంటూ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన పవన్ ►రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కు నోటీసులిచ్చాం ►నోటీస్‌లకు ఇంత వరకు సమాధానం ఇవ్వలేదు ►మాకు పవన్ కళ్యాణ్ కంటే నిఘా వ్యవస్థ బలంగా వుంది ►మీకు తెలిసిన సంచారం వుంటే మాకు తెలియపరచండని పవన్ ను కోరాం ►300 పైగా సిబ్బందితో సెక్యూరిటీని ఏర్పాటు చేశాం 11:50 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు పిటిషన్‌పై మొదలైన వాదనలు ►చంద్రబాబు కేసులో ఏసీబీ కోర్టులో ప్రారంభమైన వాదనలు ►బెయిల్ పిటిషన్‌తో పాటు కస్టడీ, పీటీ వారెంట్ పిటిషన్లపైనా వాదనలు విననున్న ఏసీబీ జడ్జి ►వాదనలు వినిపిస్తున్న బాబు తరపు లాయర్ ప్రమోద్‌కుమార్ దుబే ►అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు రాకుండానే ప్రారంభమైన విచారణ ► జడ్జి సూచన మేరకు.. వాదనలు నోటు చేసుకుంటున్న సీఐడీ తరపు లాయర్లు 11:45 AM, అక్టోబర్ 04, 2023 హైకోర్టులో నారాయణ పిటిషన్ విచారణ వాయిదా ►మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ►ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ఏ2గా నారాయణ ► విచారణకు రావాలంటూ ఇటీవలె సీఐడీ నోటీసులు ►అనారోగ్య కారణాల రీత్యా ఇంటివద్దే విచారించేలా ఆదేశించాలని హైకోర్టులో నారాయణ పిటిషన్ ►ఆ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ►నారాయణ పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ►క్వాష్ పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేయాలన్న న్యాయమూర్తి ►విచారణ ఎల్లుండికి వాయిదా 11:15 AM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టుకు స్పెషల్ జీపీ వివేకానంద ►ఏసీబీ కోర్టుకు హాజరైన సీఐడీ తరపు న్యాయవాది స్పెషల్ జీపీ(గవర్నమెంట్ ప్లీడర్) వివేకానంద ►మరికాసేపట్లో చంద్రబాబు పిటిషన్లపై విచారణ ►చంద్రబాబు కస్టడీ పిటిషన్‌తో పాటు ఫైబర్ నెట్, ఐఆర్ఆర్(రింగ్‌రోడ్డు కేసు) పీటీ వారెంట్లపైనా వాదనలు వినిపించనున్న జీపీ వివేకానంద ► తొలుత కొనసాగనున్న చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు 11:05 AM, అక్టోబర్ 04, 2023 ఆ రెండు పిటిషన్లతో పాటు పీటీ వారెంట్లపైనా ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినాల్సిందిగా ఏసీబీ న్యాయస్ధానాన్ని కోరిన చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే ►తమ తరపున సీనియర్ న్యాయవాదులు రావాల్సి ఉందన్న ప్రభుత్వ తరపు న్యాయవాదులు ►చాలా పిటిషన్లు పెండింగులో ఉన్నందున వాదనలకు ఎక్కువ సమయం పడుతుందన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►అయితే.. రెగ్యులర్ కాల్స్ అటెండ్ చేసి వాదనలు వింటానన్న ఏసీబీ జడ్జి ►ఈలోగా.. చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలను నోట్ చేసుకోవాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులకు జడ్జి సూచన ►కాసేపట్లో చంద్రబాబు పిటిషన్లపై ప్రారంభం కానున్న విచారణ ►మొదటగా వాదనలు వినిపించనున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►బెయిల్, కస్టడీ పిటిషన్లతో పాటు సీఐడీ దాఖలు చేసిన ఫైబర్ నెట్, ఐఆర్ఆర్(రింగ్‌రోడ్డు కేసు) పీటీ వారెంట్ల పైనా విచారించనున్న ఏసీబీ కోర్టు 10:47 AM, అక్టోబర్ 04, 2023 వీడిన ఉత్కంఠ.. బాబు పిటిషన్లపై కాసేపట్లో విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కొనసాగనున్న విచారణ ►కోర్టుకు చేరుకున్న చంద్రబాబు తరపు న్యాయవాది దూబే ► ఇంటరాగేషన్‌లో చంద్రబాబు సహకరించలేదని.. ఐదు రోజుల కస్టడీ కోరుతున్న ఏపీ సీఐడీ ► రాజమండ్రి జైలులోనే రెండ్రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించిన సీఐడీ ►కాలయాపన చేసిన చంద్రబాబు.. అందుకే మరోసారి కస్టడీ కోరుతూ పిటిషన్ ► స్కిల్ స్కాంలో బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపు లాయర్ల పిటిషన్ 10:14 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు పిటిషన్ల విచారణపై సందిగ్ధం? ►ఎన్ఐఏ దాడులకు నిరసనగా.. బాయ్‌కాట్ పిలుపు ఇచ్చిన విజయవాడ బార్ అసోషియేషన్ ►ఇవాళ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై జరగాల్సిన విచారణ ►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును మరో ఐదు రోజుల కస్టడీ కోరిన ఏపీ సీఐడీ ►బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు లాయర్ల వాదన ►సుప్రీంలో ఎస్ఎల్పీ పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో.. 4వ తేదీ వరకు వాయిదా కోరిన బాబు లాయర్లు ►కాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకోనున్న సీఐడీ లాయర్లు ►పిటిషన్లపై విచారణ ఉంటుందా? లేదా? అనే దానిపై కొద్దిసేపట్లో రానున్న స్పష్టత 09:45 AM, అక్టోబర్ 04, 2023 తూర్పు గోదావరిలో 144 సెక్షన్: ఎస్పీ జగదీష్ ►టీడీపీ ఛలో రాజమండ్రి జైలుకు పిలుపు ►గురువారం నిర్వహించేందుకు ప్లాన్ ►శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉన్నందున.. అనుమతి లేదన్న జిల్లా ఎస్పీ జగదీశ్వర్ ►ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు నో పర్మిషన్ అని స్పష్టీకరణ ►144 సెక్షన్‌తో పాటు పోలీస్ సెక్షన్ 30 విధింపు ఉన్నట్లు ప్రకటన 09:04 AM, అక్టోబర్ 04, 2023 టీడీపీ వర్గాల్లో టెన్షన్ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఢీలా పడిన టీడీపీ శ్రేణులు ►నాయకత్వం లేకపోవడంతో.. ఎటూ పాలుపోని పరిస్థితి ►చంద్రబాబు కేసుల్లో వెలువడే కోర్టు ఫలితాలపై టెన్షన్ టెన్షన్ ►ఇప్పటికే టీడీపీ చేపట్టే కార్యక్రమాలకు ప్రజాస్పందన కరువు ►చేసేది లేక.. జనాల వద్దకే వెళ్లాలని ప్రణాళికల రూపకల్పన 08:50 AM, అక్టోబర్ 04, 2023 సుప్రీంలో చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు ►నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసు విచారణ ►ఈ కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడిగా చేర్చాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ ►కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని ఆర్కే మరొక పిటిషన్ కూడా ►"మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ►ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ రిపోర్టులో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి ►కానీ చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చడంలో ఏసీబీ విఫలమైంది ►ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో ఏసీబీ విఫలమైందని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి ►అందుకే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ లో వినతి ►విచారణ చేయనున్న జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ►ఇదే కేసులో.. నిన్న రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు 08:20 AM, అక్టోబర్ 04, 2023 పవన్‌లాంటి చెత్త నేత లేడు! ►గొడవలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది పవన్ కళ్యాణ్..? ►అయినా గొడవలు జరిగేలా మాట్లాడేది నువ్వు. ►దేశం మొత్తం మీద నీలాంటి చెత్త రాజకీయ నాయకుడు ఉండడు. :::వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ 07:38 AM, అక్టోబర్ 04, 2023 బండారుకు ఓ మహిళ సూటి ప్రశ్న ► మంత్రి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానారాయణ ► అరెస్ట్.. ఆపై కండిషనల్ బెయిల్ మీద విడుదల ► టీడీపీ నేతపై మండిపడుతున్న మహిళా లోకం ►టీడీపీ నాయకులు తొలుత మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని పిలుపు. ►మీ ఇంట్లోనూ ఆడవాళ్లు ఉంటారని గుర్తు చేస్తూ.. హితవు టీడీపీ నాయకులు తొలుత మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలి. వయసు పెరగ్గానే సరిపోదు.. కాస్త జ్ఞానం, ఇంగితం కూడా ఉండాలి. మంత్రి రోజా గారి గురించి నువ్వు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు.. మీ ఇంట్లో భార్య లేదా కూతురిని ఉద్దేశించి అంటే నీకు ఎలా ఉంటుంది బండారు సత్యనారాయణ? టీడీపీ నేతలు కాస్త నోరు… pic.twitter.com/4QPXKD69oc — YSR Congress Party (@YSRCParty) October 4, 2023 07:30AM, అక్టోబర్ 04, 2023 ఫైబర్ గ్రిడ్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ ►ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ నిందితుడు కాదన్న అడ్వకేట్ జనరల్ ►లోకేష్ ను నిందితుడిగా చేరిస్తే 41ఏ నోటీసు ఇస్తామన్న ఏజీ ►41ఏ నోటీసును లోకేష్ అనుసరించకపోతే ప్రోసీజర్ ఫాలో అవుతామని ఏజీ చెప్పిన అంశాన్ని నోట్ చేసుకుని పిటిషన్ క్లోజ్ చేసిన న్యాయమూర్తి 07:25AM, అక్టోబర్ 04, 2023 నేడు లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపి హైకోర్టు విచారణ ► ఇవాళ్టి వరకు(అక్టోబర్ 4) లోకేష్ ను అరెస్ట్ చేయొద్దన్న కోర్టు ►నేడు మళ్లీ జరగనున్న వాదనలు 07:15AM, అక్టోబర్ 04, 2023 నేడు వివిధ కోర్టుల్లో కేసుల కీలక విచారణ ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణ ►IRR, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబుపై పీటీ వారెంట్లు దాఖలు చేసిన సీఐడీ విచారణ అడిగే అవకాశం ►హైకోర్టులో చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్ల పై విచారణ ►IRR కేసులో మాజీ మంత్రి నారాయణ ను విచారణకు రావాలని కోరిన సీఐడీ ►తనను ఇంటి దగ్గరే విచారణ చేయాలని, లేని పక్షంలో వాయిదా వేయాలని హైకోర్టులో నిన్న నారాయణ పిటిషన్ ►నారాయణ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ 06:52AM, అక్టోబర్ 04, 2023 10న సీఐడీ ముందుకు లోకేష్ ►అక్టోబర్ 10న CID ముందు హాజరు కావాలని లోకేష్‌కు హైకోర్టు ఆదేశం ►లోకేష్‌పై మూడు కేసులు, రింగ్‌రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ స్కాం ►అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టులో లోకేష్ మరో లంచ్ మోషన్ పిటిషన్ 06:50AM, అక్టోబర్ 04, 2023 సుప్రీంలో బాబుకి దక్కని ఊరట ►సుప్రీంకోర్టులో చంద్రబాబుకు షాక్, చంద్రబాబు పిటిషన్‌పై విచారణ సోమవారానికి(అక్టోబర్ 9వ తేదీకి) వాయిదా ►ACB కోర్టు : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు రేపు విచారణ జరిగే అవకాశం ►చంద్రబాబుపై మూడు కేసులు, స్కిల్ స్కాం, అంగళ్లు, రింగ్ రోడ్ ►ఏపీ హైకోర్టు : ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో బాబు బెయిల్ పిటిషన్ విచారణ 06:46AM,అక్టోబర్ 04, 2023 రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు @25 ►సీఎంగా ఉన్న టైంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌కు పాల్పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు ►రెండేళ్ల దర్యాప్తు అనంతరం.. ప్రధాన నిందితుడిగా నిర్ధారించుకున్న ఏపీ సీఐడీ ►సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అరెస్ట్ ► రిమాండ్ విధించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడీషియల్ రిమాండ్ మీద చంద్రబాబు ► ఖైదీ నెంబర్ 7691గా స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక వసతులు ► కోర్టు ఆదేశాల ప్రకారం.. ఇంటి భోజనానికి అనుమతి, వైద్య సదుపాయాలు ► నేటితో (అక్టోబర్ 4)తో 25వ రోజుకు చేరిన చంద్రబాబు రిమాండ్ ► నేడు చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ -
టీటీడీ బస్సు చోరీ కేసు నిందితుడి అరెస్ట్
తిరుమల/తిరుపతి లీగల్ : టీటీడీ ఉచిత ధర్మరథం ఎలక్ట్రిక్ బస్సు చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు నేరవిభాగం ఏఎస్పీ విమలకుమారి తెలిపారు. మంగళవారం స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, హయత్‌నగర్ మండలం అనంజపూర్ గ్రామంలోని నీలావర్ గణపతి కుమారుడు నీలావర్ విష్ణు (20) గతనెల 24వ తేదీన తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చాడు. టీటీడీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం దగ్గర ఉంచిన రూ.1.44 కోట్ల విలువైన టీటీడీ ఉచిత ధర్మరథం ఎలక్ట్రిక్ బస్సును చోరీ చేసి తీసుకెళ్లాడు. నిందితుడు అదేరోజు పోలీసులకు భయపడి నాయుడుపేట చెన్నై రహదారిపై బస్సును వదిలి పారిపోయాడు. అతని కోసం పోలీసులు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో గాలించి సోమవారం సాయంత్రం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో అరెస్టయిన నిలావర్ విష్ణు తల్లిదండ్రులు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వలసి వచ్చి జీవిస్తున్నారు. 2015లో విష్ణు తండ్రి భార్యను హత్యచేసి జైలుకు వెళ్లాడు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీసులకు జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి రివార్డులను ప్రకటించగా.. ఏఎస్పీ వారికి అందజేశారు.ఇదిలా ఉండగా నిందితుడు నీలావర్ విష్ణుకు ఈనెల 17వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోటేశ్వరరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. -
12 గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు..
తిరుపతి క్రైం: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఓ బాలుడు తెల్లవారుజామున కిడ్నాప్ కాగా... 12 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించి తిరిగి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను మంగళవారం తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి మీడియాకు వివరించారు. చెన్నైకి చెందిన చంద్రశేఖర్, మీనా దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం అర్ధరాత్రి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోని చెన్నై ప్లాట్‌ఫాం వద్ద నిద్రపోయారు. తెల్లవారుజామున మెలకువ వచ్చి చూడగా, రెండో కుమారుడు అరుల్ మురుగన్(2) కనిపించలేదు. దీంతో వెంటనే తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి డీఎస్పీ సురేందర్‌రెడ్డి, క్రైం డీఎస్పీ రవికుమార్, సీఐ మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు వెంటనే బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సీపీ ఫుటేజ్ ఆధారంగా బాలుడిని తెల్లవారుజామున 2.12 గంటలకు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని అవిలాల సుధాకర్‌గా నిర్ధారించుకుని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో అవిలాల సుధాకర్ కిడ్నాప్ చేసిన బాలుడిని ఏర్పేడు మండలంలోని మాల గ్రామంలో తన అక్క నెల్లూరి ధనమ్మ వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టినట్టుగా సమాచారం అందింది. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో పోలీసులు వెళ్లి బాలుడిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు సుధాకర్‌తోపాటు ధనమ్మ, మరికొందరిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. -
సుప్రీంకోర్టులోనూ దక్కని ఉపశమనం
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ పేరుతో నకిలీ ఒప్పందాలు చేసుకుని... షెల్ కంపెనీల్లోకి ప్రభుత్వ ధనాన్ని పంపించారు. వాటిని విత్‌డ్రా చేసుకుని తన జేబులో వేసుకున్నారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతూ ఆదాయపు పన్ను విభాగం నోటీసులిచ్చింది. ఆ నోటీసులు ఇచ్చే అధికారం మీకు లేదంటూ జవాబిచ్చారు చంద్రబాబు. ఆ డబ్బుల్ని మనీ లాండరింగ్ చేసిన వారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు కూడా చేసింది. ఇలా అన్ని వేళ్లూ సీఎం హోదా లో ఈ స్కామ్‌కు పాల్పడింది చంద్రబాబేనని చూపించాయి. పక్కా ఆధారాలతో సీఐడీ అరెస్టు చేసింది. ఆధారాలన్నీ చూపించటంతో కోర్టు జైలుకు పంపించింది. చంద్రబాబు కుటుంబీకులేమో... ఆయనకు బోలెడంత డబ్బుందని, ఈ నేరం చెయ్యాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఆయన నిజంగా నేరం చెయ్యకపోతే ఆయన లాయర్లు కోర్టులో అదే విషయాన్ని చెప్పొచ్చు కదా? అదే వాదన వినిపించొచ్చు కదా? కానీ ఈ దేశంలోనే అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ చంద్రబాబు విషయంలో వాదిస్తున్నదేంటో తెలుసా? ఆయనకు దీంతో సంబంధం లేదనో, ఆయన నేరం చెయ్యలేదనో కాదు. చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి కనుక ఆయన్ను అరెస్టు చేసే ముందు గవర్నరు అనుమతి తీసుకోవటం తప్పనిసరి అని... అలా తీసుకోలేదు కనక ఈ అరెస్టుతో పాటు ఆయనపై పెట్టిన కేసు కూడా చెల్లదని... కాబట్టి మొత్తం కేసునే కొట్టేయాలని వాదిస్తున్నారు. బుధవారం సుప్రీంకోర్టులో సైతం... చంద్రబాబు నేరం చేశారా? లేదా? అనే జోలికి తాము వెళ్లబోవటం లేదని, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ ప్రకారం ఆయన అరెస్టు చెల్లదని మాత్రమే తమ వాదన వినిపిస్తున్నామని స్పష్టంచేశారు. విచిత్రమేంటంటే చంద్రబాబు నాయుడి తరఫున కాకలు తీరిన లాయర్లు సిద్ధార్థ లూత్రా, అభిషేక్ మను సింఘ్వీ, హరీష్ సాల్వే ముగ్గురూ వాదనలు వినిపించారు. ముగ్గురూ కూడా సెక్షన్ 17ఎ కింద గవర్నరు అనుమతి తీసుకోలేదు కనక కేసు చెల్లదని, క్వాష్ చేయాలని మాత్రమే వాదించారు. దాదాపు 50 నిమిషాలసేపు జరిగిన విచారణలో... 90 శాతం సమయం ఈ చట్టం చంద్రబాబుకు వర్తిస్తుందా? లేదా? అన్న దానిపైనే సాగటం గమనార్హం. అయితే అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17(ఏ)ను 2018లో సవరించడానికన్నా ముందు ఈ నేరం జరిగింది కనక ఆ సవరణ దీనికి ఎలా వర్తిస్తుందని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చివరకు దీనికి సంబంధించిన పత్రాలన్నీ సమర్పించాలని సీఐడీని ఆదేశిస్తూ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేయటంతో... చంద్రబాబుకు ఆశించిన ఉపశమనమైతే దొరకలేదు. చంద్రబాబు తరఫున ఎందరు వాదిస్తారు?: సుప్రీం స్కిల్ కుంభకోణానికి సంబంధించి తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్రిమినల్ ఎస్సెల్పీని మంగళవారం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీతో కూడిన ధర్మాసనం విచారించింది. చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు ప్రారంభిస్తూ... పీసీ యాక్టులోని సెక్షన్ 17ఏను హైకోర్టు తప్పుగా అర్థం చేసుకుందన్నారు. ఈ చట్టాన్ని ప్రజా ప్రతినిధులు అధికార విధులు నిర్వర్తించడంలో చేసే చర్యలకు సంబంధించినదిగా చూడాలన్నారు. ‘‘2018 జులై కన్నా ముందు జరిగిన నేరాలకు ఈ సెక్షన్ వర్తించదని హైకోర్టు న్యాయమూర్తి చెప్పడం సరికాదు. ఎందుకంటే ఈ సెక్షన్ నేరం ఎప్పుడు జరిగిందనే అంశానికి సంబంధించినది కాదు. ఓ ప్రక్రియకు సంబంధించినది, విచారణ తేదీకి సంబంధించినది’’ అని వాదన వినిపించారు. అందుకోసమే తమ క్లయింట్‌కు ఈ రక్షణ కావాలని కోర్టును కోరుతున్నామని సాల్వే చెప్పారు. కేసు విచారణ 2021, సెపె్టంబరు 7న ప్రారంభమైనట్లుగా అడిషనల్ డీజీపీ రాసిన లేఖ చెబుతోందన్నారు. కాబట్టి ఈ కేసులో సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి ఆమోదం లేకుండా విచారణ చేయొచ్చా? అని సందేహం వ్యక్తంచేశారు. ఈ దశలో జస్టిస్ అనిరుద్ధ బోస్ జోక్యం చేసుకొని ‘అంటే విచారణ ప్రారంభమైన తేదీని పరిగణించాలన్నది మీ ఉద్దేశమా?’ అని సాల్వేను ప్రశ్నించారు. చట్టం తీసుకొచ్చిన వాళ్లు చెప్పిందదేనని సాల్వే బదులిచ్చారు. ‘‘చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సరికాదని హైకోర్టుకు కూడా తెలిపాం. కానీ మా వాదన అంగీకరించలేదు. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయడం సరికాదు. మంత్రి మండలి అనుమతితోనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆనాడు చంద్రబాబు సూచనలతోనే ఎక్స్ అఫిషియో నియామకాలు జరిగాయని అభియోగాలు మోపారు’’ అని సాల్వే పేర్కొన్నారు. చంద్రబాబు తరఫు మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. యశ్వంత్ సిన్హా వర్సెస్ సీబీఐ కేసు ప్రస్తావించారు. సెక్షన్ 17ఏ ప్రకారం దర్యాప్తునకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని జస్టిస్ కేఎం జోసెఫ్ తీర్పులో ఉందన్నారు. దీన్ని బట్టి చూస్తే 2018 చట్టసవరణ కన్నా ముందువాటికి కూడా సెక్షన్ 17ఏ వర్తిస్తుందన్నారు. ఇంతలో చంద్రబాబు తరఫున మరో న్యాయవాది సిద్దార్త్ లూత్రా లేచి... యశ్వంత్ సిన్హా కేసును ఉటంకిస్తూ ‘రఫేల్ డీల్ 2015–16 నాటిది. ఇది 2018 నాటి చట్టసవరణ కన్నా ముందుదే’’ అని చెప్పారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... చంద్రబాబు తరఫున ఎంత మంది సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తారని చమత్కరించింది. నలుగురం వాదిస్తున్నామని, సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తున్నారని హరీశ్ సాల్వే చెప్పారు. ఈ దశలో ముకుల్ రోహత్గీ జోక్యం చేసుకుంటూ... వాళ్లే ఒకరి తర్వాత ఒకరు వాదనలు వినిపిస్తున్నారని తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, పిటిషనర్ తరఫున ఎవరో ఒకరే వాదనలు చేయాలని పేర్కొన్నారు. అయితే కింది కోర్టుల్లో ఒక సీనియర్ మించి వాదించే అవకాశం లేదు కానీ సుప్రీంకోర్టు ఆ ప్రత్యేక హక్కు కల్పించిందని జస్టిస్ బేలా ఎం త్రివేది పేర్కొన్నారు. ఈ దశలో కేసు మెరిట్స్ జోలికి వెళ్లం: సుప్రీం రిమాండు రిపోర్టు ప్రకారం లావాదేవీలు 2015–19 నాటివని, అంటే 2018 చట్ట సవరణ తర్వాతకూడా ఓ ఏడాది ఉంది కాబట్టి నిందితుడికి చట్టప్రకారం రక్షణ తప్పనిసరి అని సింఘ్వీ పేర్కొన్నారు. చట్ట సవరణ చేసింది నిర్దిష్ఠ రక్షణ కోసమేనని తెలిపారు. కేబినెట్ నిర్ణయం అని హైకోర్టు జడ్జి పేర్కొన్నారంటే ఇది అధికారిక విధులకు సంబంధించినదే కదా? అన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకొని.. ఈ దశలో కేసు మెరిట్స్ జోలికి వెళ్లే ఉద్దేశం లేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ తర్వాత ఎఫ్ఐఆర్తో ఇబ్బందిపెడుతోందని, ఇది రాజకీయ కక్షసాధింపేనని లూత్రా పేర్కొన్నారు. ‘‘అసలు ప్రశ్న ఏంటంటే సెక్షన్ 17ఏ పీసీ యాక్టుకు మాత్రమే వర్తిస్తుందా లేక ఐపీసీకి కూడా వరిస్తుందా?’’ అని జస్టిస్ త్రివేదీ ప్రశ్నించారు. దీంతో పీసీ యాక్టు సెక్షన్ 17ఏ ను సింఘ్వీ చదువుతూ ‘ఎనీ అఫెన్స్’ అని ఉంది కనక పీసీ యాక్టుకు, ఐపీసీ నేరాలకు తేడా ఏమీ ఉండదని ధర్మాసనానికి చెప్పారు. సీఆర్పీసీ కోడ్ ప్రకారం సెక్షన్ 17ఏ సవరణ పాటించాలని లేదు కదా? అని జస్టిస్ త్రివేదీ ప్రశ్నించారు. పీసీ యాక్టు చూడాలని మరోసారి సింఘ్వీ పేర్కొనగా.. ఎఫ్ఐఆర్లో పీసీతోపాటు ఐపీసీ కూడా ఉందిగా? అని జస్టిస్ త్రివేదీ తిరిగి ప్రశ్నించారు. ‘సెక్షన్ 17ఏ కేవలం పీసీ చట్టానికే వర్తిస్తుంది. మరి ఐపీసీ కింద నమోదైన కేసుల పరిస్థితి ఏంటి?’’ అని జస్టిస్ త్రివేదీ ప్రశ్నించగా.. ఏ కేసుకైనా వర్తిస్తుందని సాల్వే పేర్కొన్నారు. చట్ట ప్రకారం సదరు వ్యక్తికి ఉన్న స్థాయిని మాత్రమే పరిగణిస్తున్నామని జస్టిస్ అనిరుద్ధ బోస్ పేర్కొన్నారు. ఈ కేసులో కోర్టు పరిశీలించాల్సింది ఒకే ఒక అంశమని, ఐపీసీ కింద నమోదైన కేసులకు 17ఏ సవరణ వర్తిస్తుందా లేదా అనేది మాత్రమే అని జస్టిస్ బేలా ఎం త్రివేది వ్యాఖ్యానించారు. దీనికి సెక్షన్ 17ఏ వర్తించదు: రోహత్గీ ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ... స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసుకి పీసీ చట్టం సెక్షన్ 17ఏ వర్తించదని స్పష్టం చేశారు. జులై 2018లో చట్ట సవరణతో సెక్షన్ 17ఏ చేర్చారని, ఎఫ్ఐఆర్ 2021 నాటిదైనా దర్యాప్తు చట్ట సవరణ కన్నా ముందుగానే ప్రారంభమైందని ధర్మాసనానికి తెలియజేశారు. 2018 కన్నా ముందుగా విచారణ ప్రారంభించినట్లు సంబంధిత పత్రాలు ఏమైనా ఉన్నాయా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆయా పత్రాలు సమర్పిస్తామని రోహత్గి ధర్మాసనానికి తెలిపారు. కేసు దర్యాప్తు చట్ట సవరణ కన్నా ముందుగానే ప్రారంభమైందని, కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ కేసును పరిశీలించిందని తెలిపారు. ఇలాంటప్పుడు రాజకీయ కక్ష అని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు. ‘‘నేరం జరిగింది 2015–16లో. దర్యాప్తు కూడా ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు కాకముందే మొదలైంది. అలాంటపుడు రాజకీయ కక్ష అనడం సబబు కాదు కదా?’’ అని దని రోహత్గి చెప్పారు. హైకోర్టుకు డాక్యుమెంట్లు అన్నీ సమర్పించారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని, ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. దర్యాప్తునకు సంబంధించిన అన్ని పత్రాలు సమరి్పస్తామని రోహత్గి ధర్మాసనానికి తెలిపారు. తదుపరి విచారణకు సంబంధించి పరిశీలించాల్సిన అంశాలు ఉన్నాయని, విచారణ సోమవారానికి వాయిదా వేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. అప్పుడే ఈ పిటిషన్ విచారణకు తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయిస్తామని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్నారని, విచారణకు సీఐడీ కస్టడీ కోరుతున్నారని అదే కష్టంగా ఉందని లూత్రా కోర్టుకు తెలిపారు. పదిహేను రోజుల గడిచిన తర్వాత కూడా కస్టడీ కోరటం సరికాదని సిద్దార్ధ లూత్రా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. బెయిలుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించిన ధర్మాసనం... విచారణ సోమవారం చేపడతామని స్పష్టం చేసింది. -
ఎందుకంత ఆందోళన? బాబు లాయర్లతో సుప్రీం బెంచ్
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సర్వోన్నత న్యాయస్థానంలో మాజీ సీఎం చంద్రబాబుకు ఊరట దక్కలేదు. బాబు పిటిషన్ ఆధారంగా ఇప్పటికిప్పుడు ఈ అంశాన్ని తేల్చలేమంటూ.. విచారణను వాయిదా వేసింది సుప్రీం. అయితే.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వాడీవేడి వాదనలు జరిగాయి. పీసీ యాక్ట్ 17 ఏ చంద్రబాబు కేసులో వర్తిస్తుందా? లేదా? అనే అంశం ప్రధానంగా వాదనలు జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబుకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు.. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఎట్టకేలకు ఈ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిల ధర్మాసనం వాదనలు వింది. చంద్రబాబు తరపున సీనియర్ లాయర్లు సిద్ధార్థ్ లూథ్రా, హరీష్‌సాల్వే, అభిషేక మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ తరుణంలో.. ఈ పిటిషన్‌పై ఎంత మంది సీనియర్లు వాదిస్తారంటూ బెంచ్ పశ్నించగా.. నలుగురం అంటూ తేలికపాటి స్వరంతో సాల్వే బదులిచ్చారు. అయినా మేం ముకుల్ రోహత్గీకి(ఏపీ ప్రభుత్వ తరుపున లాయర్) సరిపోమని సాల్వే తెలిపారు. అయితే ఇవాళ మాత్రం వాదనలు ముగ్గురే వినిపించారు. తొలుత.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఎఫ్ఐఆర్లో నమోదు అయిన అంశాలపైనే హరీష్ సాల్వే వాదనలు(వర్చువల్)గా వినిపించారు. ‘‘చంద్రబాబు కేసు పూర్తి రాజకీయపరమైంది. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారు. హైకోర్టు 17ఏ వర్తించదని చెప్పడం సరికాదు. ఈ క్రమంలో.. సెక్షన్ 17 ఏ పై హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు హరీష్ సాల్వే. ఈ సెక్షన్ ఎంక్వైరీ తేదీ గురించి చెబుతుంది తప్ప.. నేరం జరిగిన తేదీ గురించి కాదు. సెక్షన్ 17 ఏ ప్రకారం చంద్రబాబుకు రక్షణ ఉంటుంది అని సాల్వే వాదనలు వినిపించారు. ఇక.. ఇది కేవలం కక్ష సాధింపు చర్యే. 73 ఏళ్ల మాజీ ముఖ్యమంత్రిని వేధిస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నారు కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. పోలీస్ కస్టడీ అడుగుతున్నందునా.. ముందే విచారణ చేపట్టాలని చంద్రబాబు తరపు మరో న్యాయవాది లూథ్రా బెంచ్‌కు తెలిపారు. మరో న్యాయవాది మను సింఘ్వీ.. యశ్వంత్ సిన్హా కేసు తీర్పును ఉదాహరించారు. ఇది కేవలం మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయమని మాత్రమే అభియోగాలున్నాయని తెలిపారు. అయితే.. ఇప్పుడే కేసు మెరిట్‌లోకి వెళ్లదల్చుకోలేదని బెంచ్ తెలిపింది. ఏకంగా క్వాష్ అడుగుతున్నారు ఇక ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 17ఏతో ఈకేసుకు ఎలాంటి సంబంధం లేదు. జులై 2018లో 17-A వచ్చింది. అంతకంటే ముందే ఈ కేసు విచారణ ప్రారంభమైంది ఇందులో రాజకీయ కక్ష లేదు. ఈ కేసులో దర్యాప్తు 2017 కంటే ముందే మొదలయింది. అప్పుడే దీన్ని CBI పరిశీలించింది. ఇక రాజకీయ కక్ష అని ఎలా అంటారు? తప్పు చేసింది 2015-16లో. దర్యాప్తు మొదలయింది ఈ ప్రభుత్వం రాకముందే. ఇప్పుడు దాన్ని కక్ష అని ఎలా అంటారు? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ కేసు విచారణ ప్రారంభమైంది. జీఎస్టీ విభాగం అప్పట్లోనే దర్యాప్తు చేపట్టింది. ఒకసారి ఈ డాక్యుమెంట్లు చూడండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు APSDCని ప్రారంభించారు. కేవలం 10% ప్రభుత్వం ఇస్తే చాలన్నారు. 90% మరో సంస్థ గిఫ్ట్‌గా ఇస్తుందన్నారు. ఆ వెంటనే 10% నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలయ్యాయి. అరెస్టయిన మూడు రోజుల్లోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. బెయిల్ కోసం ప్రయత్నించకుండా ఇప్పుడు క్వాష్ అడుగుతున్నారు. అందుకే చంద్రబాబు పిటిషన్ ను తిరస్కరించాలి అని ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ధర్మాసనం వ్యాఖ్యలు చంద్రబాబు లాయర్లకు పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. బెంచ్ పలు ప్రశ్నలు సంధించింది. విచారణ మాత్రమే జరుగుతోందని మీకెందుకు అంత ఆందోళన? అని ప్రశ్నించింది. 2015-16లో నేరం జరిగింది కదా ? . ఆ లెక్కన 2018లో అవినీతి నిరోధక చట్టంలో 17-a రాకముందే నేరం జరిగింది కదా?. మరోవైపు.. ఐపీసీ కింద నమోదైన నేరాల పరిస్థితి ఏమిటి ?. పీసీ యాక్ట్ తో పాటు ఐపీసీ కింద కూడా నేరాలు నమోదయ్యాయి కదా అని ప్రశ్నించింది. ఈ దశలో రూలింగ్ ఇవ్వలేమని.. తర్వాతి విచారణలో వాదనలు వింటామని స్పష్టం చేసింది. సుదీర్ఘ వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. రెండు వైపులా అఫిడవిట్ ఇవ్వాలని, హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా ఇచ్చిన అన్ని పత్రాలను సమర్పించాలని ఆదేశిస్తూ.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి(9వ తేదీకి) వాయిదా వేసింది. -
Oct 3, 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu In Rajamaundry Central Prison, Cases Scams And Court Hearings Ground updates 6:45 PM, అక్టోబర్ 03, 2023 మాట్లాడే ప్రతీ మాటకు సాక్షాలుంటాయా? : బండారు ఎదురుదాడి ► స్పెషల్ మొబైల్ కోర్టులో బండారు సత్యనారాయణమూర్తిని హాజరు పరిచిన పోలీసులు ► విచారణలో బండారు సహకరించడం లేదు : న్యాయమూర్తికి తెలిపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ► ఎన్నో మాట్లాడతాం, మాట్లాడే ప్రతీదానికి సాక్ష్యాలు ఉంటాయా ? బండారు ఎదురు ప్రశ్నలు ► పోలీసుల విచారణలో బండారు తీరును న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ► ఇరువైపుల వాదనలు విన్న తరువాత ఆదేశాలు ఇవ్వనున్న న్యాయమూర్తి 6:35 PM, అక్టోబర్ 03, 2023 నోరు జారి.. పరువు తీసుకుని.. ఇప్పుడు కోర్టు మెట్లెక్కి.! ► హైకోర్టును ఆశ్రయించిన బండారు సత్యనారాయణ లాయర్ ► బండారు సత్యనారాయణ అరెస్ట్‌ను ప్రశ్నిస్తూ పిటిషన్ ► రెండు కేసుల్లో 41A నోటీసులు ఇచ్చారన్న న్యాయవాది ► కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ► పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పిటిషనర్‌కు ఆదేశం ► విచారణను ఎల్లుండికి వాయిదా వేసిన హైకోర్టు 6:15 PM, అక్టోబర్ 03, 2023 అది టిడిపి కాదు, తెలుగు దుశ్శాసనుల పార్టీ : మంత్రి రోజా తిరుపతి : మీడియా సమావేశంలో కన్నీళ్ళ పర్యవంతమైన మంత్రి రోజా ► దేశంలో మహిళలను గౌరవించండి అని చెబుతారు ► మాజీ మంత్రి బండారు చేసిన వాఖ్యలు వింటే రాష్ట్ర మహిళలు చెప్పుతో కొడతారు ► టిడిపి లో ఉన్న మహిళలు మాత్రం బండారు వాఖ్యలు స్వాగతిస్తున్నారు ► మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను ఎవరయినా ఇలా మాట్లాడితే ఊరుకుంటారా? ► మాట్లాడితే సినిమా వాళ్ళు అంటారు.. టిడిపి పార్టీ పెట్టిందే ఎన్టీఆర్, ఆయన సినిమా నుంచి రాలేదా? ► మంత్రి బండారు భార్యను అడుగుతున్నా.. ఆరోజే నీ భర్తను చెప్పుతో కొట్టి ఉంటే ఇలాంటి ఆలోచన రాదు ► లోకేష్ ఇలాంటి వాఖ్యలను సపోర్ట్ చేస్తున్నారు, సిగ్గు చేటు ► మహిళ సాధికారతకు పాటుపడుతున్న..రాజకీయాల్లో 20 ఏళ్ళు గా ఉన్నా ► నేను రాజకీయంగా మంత్రి గా ఎదిగితే.. చూసి ఓర్వలేక వాఖ్యలు చేస్తున్నారు ► జయసుధ, జయప్రద, దివ్య వాణి ,శారదా, నేను... ► సినిమా రంగం నుంచి తెలుగుదేశంలో పనిచేశాం, ఆ పార్టీలో మమ్మల్ని అవమానించారు 6:10 PM, అక్టోబర్ 03, 2023 రేపు సుప్రీంకోర్టులో ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి మరో పిటిషన్ ► ఢిల్లీ: రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసు విచారణ ► ఈ కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ ► కేసు దర్యాప్తును CBIకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ ► విచారణ చేయనున్న జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ► ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ రిపోర్టులో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావన ► కానీ చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చడంలో ACB విఫలమైంది ► ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో తెలంగాణ ACB విఫలమైంది ► అందుకే ఈ కేసును CBIకి బదిలీ చేయాలని పిటిషన్లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వినతి 5:40 PM, అక్టోబర్ 03, 2023 ACB కోర్టులో రేపే కస్టడీ, బెయిల్ పిటిషన్లు ► విజయవాడ : రేపు ACB కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్లపై విచారణ ► మరో అయిదు రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరుతూ పిటీషన్ వేసిన CID ► రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదన్న సిఐడి ► పోలీస్ కస్టడీ పొడిగింపుతో పాటు బెయిల్ పిటిషన్ పైనా రేపు ఒకేసారి వాదనలు 5:20 PM, అక్టోబర్ 03, 2023 జైలు ముందు పవన్ పొత్తు ప్రకటిస్తే BJP స్పందించదు ► విజయవాడ : ముగిసిన ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం ► సమావేశం అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు,దగ్గుబాటి పురంధేశ్వరి ► పవన్ చేసే ప్రతి కామెంట్‌పై స్పందించాల్సిన అవసరం లేదు ► పొత్తులపై పవన్ అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం ► పొత్తులు, పవన్ కామెంట్ల విషయంలో జాతీయ పార్టీ సూచనల మేరకు వ్యవహరిస్తాం ► ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో పొత్తు కొనసాగుతుందా..? లేదా..? ► ఈ అంశంపై జాతీయ నాయకత్వమే స్పష్టత ఇస్తుంది ► మాది ప్రాంతీయ పార్టీ కాదు.. జాతీయ పార్టీ : పురందేశ్వరీ 5:00 PM, అక్టోబర్ 03, 2023 బండారు సత్యనారాయణ @ హైకోర్టు ► బండారు సత్యనారాయణ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ ► 41A నోటీసులు ఇచ్చి ఎలా అరెస్ట్ చేస్తారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది ► కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన ప్రభుత్వం ► తదుపరి విచారణ ఈనెల 5కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ► బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ట్వీట్ చేసిన మంత్రి రోజా ► ఇలాంటి నేతల వల్లే భవిష్యత్తు స్వప్నాలు నిర్ణయించుకోవడంలో బాలికలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి వస్తుందన్న రోజా Four years ago..As a girl I was told it is a male dominated world and difficult to make a mark for a woman. I worked hard against entrenched misogynists. Though I lost one election, I fought back and I won as an MLA two consecutive times. Thanks to the pro women policies of… pic.twitter.com/FAULvrPpZt — Roja Selvamani (@RojaSelvamaniRK) October 3, 2023 4:50 PM, అక్టోబర్ 03, 2023 లోకేష్ @ ఫైబర్ గ్రిడ్ కేసు ► ఫైబర్ గ్రిడ్ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ ► ఫైబర్ గ్రిడ్ కేసులో ప్రస్తుతానికి లోకేష్ నిందితుడు కాదు : అడ్వకేట్ జనరల్ ► లోకేష్‌ను నిందితుడిగా చేరిస్తే 41A నోటీసు ఇస్తాం ► 41A నోటీసును లోకేష్ అనుసరించకపోతే ప్రోసీజర్ ఫాలో అవుతాం ► అడ్వొకేట్ జనరల్ చెప్పిన అంశాన్ని నోట్ చేసుకుని లోకేష్ పిటిషన్ క్లోజ్ చేసిన న్యాయమూర్తి 4:35 PM, అక్టోబర్ 03, 2023 చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు ► ఏపీ హైకోర్టు: ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసు ► బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో నారా చంద్రబాబు నాయుడు పిటిషన్ ► పూర్తయిన ఇరుపక్షాల వాదనలు, తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు (చదవండి : ఇన్నర్ రింగ్ రోడ్డు మలుపుల వెనక కుంభకోణమేంటీ?) 4:15PM, అక్టోబర్ 03, 2023 GGHకు టిడిపి నేత బండారు సత్యనారాయణ ► గుంటూరు ప్రభుత్వాసుపత్రికి బండారు సత్యనారాయణ ► వైద్య పరీక్షల నిమిత్తం సత్యనారాయణను తీసుకువచ్చిన పోలీసులు ► ఆసుపత్రి వద్ద లాయర్లను అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట ► వైద్య పరీక్షల్లో బండారుకు హైబీపీ, సెలైన్ ఎక్కించిన వైద్యులు ► వైద్య పరీక్షల తర్వాత బండారును మొబైల్ కోర్టులో హాజరు పరిచే అవకాశం ► బండారు తరపున వాదనలు వినిపించనున్న దొడ్డాల కోటేశ్వర రావు, చుక్కపల్లి రమేష్, టీడీపీ లీగల్ సెల్ సభ్యుడు హరిబాబు ► రోజా పై అనుచిత వ్యాఖ్యల పై బండారుపై కేసు నమోదు ► Cr.No.354/2023 U/s 153 (A), 354(A), 504, 505, 506, 509, 499 IPC, ► సెక్షన్ 67 ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద బండారు పై కేసులు నమోదు 4:15PM, అక్టోబర్ 03, 2023 హెరిటేజ్ డాక్యుమెంట్లపై కోర్టుకు లోకేష్ ► CID ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో సవాల్ చేసిన నారా లోకేష్ ► లోకేష్ ప్రస్తుతం హెరిటేజ్ లో షేర్ హోల్డర్ అని చెప్పిన న్యాయవాదులు ► కంపెనీ తీర్మానాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు లోకేష్ ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని చెప్పిన న్యాయవాదులు ► లోకేష్‌ను ఇవి అడగడం సమంజసం కాదు : సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ► తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమన్న సీఐడీ తరపు న్యాయవాదులు ► రేపు లోకేష్ విచారణకు హాజరు కావాలని కోరిన సీఐడీ తరపు న్యాయవాదులు ► ఇరువర్గాల వాదనల అనంతరం ఈ నెల 10న విచారణకు లోకేష్ హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు 4:05PM, అక్టోబర్ 03, 2023 హైకోర్టు : విచారణకు లోకేష్ హాజరు కావాల్సిందే ►ఫైబర్ గ్రిడ్ స్కాం : ఏపీ హైకోర్టులో లోకేష్‌కు దక్కని ఊరట ►ఫైబర్‌గ్రిడ్ స్కామ్‌లో లోకేష్ పిటిషన్‌పై విచారణ ముగించిన హైకోర్టు ►అడ్వొకేట్ జనరల్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ►41A సీఆర్పీసీ నిబంధలను పాటిస్తామన్న ఏజీ 4:00PM, అక్టోబర్ 03, 2023 హైకోర్టు : రింగ్ రోడ్డు కేసులో వాదనలు ►ఇన్నర్ రింగ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం ►చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న సిద్ధార్ధ్ లూద్రా 3:15 PM, అక్టోబర్ 03, 2023 రెచ్చగొడుతున్నాడా? రెచ్చిపోవాలంటున్నాడా? ► కృష్ణా జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వివాదస్పద ప్రకటనలు ► రేపు పెడన వారాహి యాత్ర సభలో నాపై రాళ్లదాడి చేయబోతున్నట్లు సమాచారం వచ్చింది ► నాపై దాడికి రెండు నుంచి మూడు వేల మంది వస్తున్నట్టు నాకు సమాచారం వచ్చింది ► ఎవరు ఏం చేసినా జనసైనికులు ఎదురుదాడికి దిగొద్దు ► ఎవరైనా జేబులోంచి ఏమైనా తీస్తే వారిని కట్టేసి పోలీసు స్టేషన్ కు పట్టుకెళ్దాం 3:10 PM, అక్టోబర్ 03, 2023 విజయవాడ BJP కార్యాలయంలో కోర్ కమిటీ భేటీ ► ఏపీ బీజేపీ రాష్ట్రకార్యాలయంలో ఏపి బీజీపీ కోర్ కమిటీ సమావేశం ► సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేతలు పురంధరేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి, ► ఎంపీ GVL నరసింహారావు, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, సోము వీర్రాజు ► ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చ ► టీడీపీతో పొత్తులపై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై చర్చ 3:00 PM, అక్టోబర్ 03, 2023 చంద్రబాబు శిష్యుడు రేవంత్‌కు సుప్రీంకోర్టులో షాక్ ► ఓటుకు కోట్లు సరే, కానీ అది అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదు : రేవంత్ పిటిషన్ ► రేవంత్ రెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సర్వోన్నత న్యాయస్థానం ► రేవంత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ SVN భట్టి ధర్మాసనం ► గతంలో రేవంత్ పిటిషన్‌ను తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు ► హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రేవంత్ రెడ్డి ► కచ్చితంగా అది అవినీతి నిరోధక చట్టం కిందికి వస్తుందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు 2:50 PM, అక్టోబర్ 03, 2023 అక్టోబర్ 10న CID ముందు హాజరు కావాలని లోకేష్‌ను ఆదేశించిన హైకోర్టు ► ఈనెల 10, మంగళవారం రోజున నారా లోకేష్‌ను విచారించనున్న CID ► ఈ మేరకు సీఐడీకి ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు ► 41ఏ నోటీసులోని నిబంధనలను సవాల్ చేసిన లోకేష్ ► ఇరువర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ► ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే విచారించాలని ఆదేశం ► న్యాయవాదిని కూడా అనుమతించాలన్న ఏపీ హైకోర్టు ► మధ్యాహ్నం గంట పాటు లోకేష్‌కు భోజనం బ్రేక్ ఇవ్వాలన్న హైకోర్టు 2:30 PM, అక్టోబర్ 03, 2023 జనసేనతో పొత్తును ఏం చేద్దాం? : BJP ► విజయవాడ : కాసేపట్లో AP BJP కోర్ కమిటీ సమావేశం ► బీజేపీతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు ► జైలుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడే పొత్తు ప్రకటన చేశారు ► ఇప్పుడు పవన్‌తో పొత్తును ఏం చేద్దాం? ► కోర్ కమిటీలో నిర్ణయం తీసుకోనున్న AP బీజేపీ నేతలు 2:00 PM, అక్టోబర్ 03, 2023 2018లోనే GST ఈ కేసు దర్యాప్తు చేపట్టింది : పొన్నవోలు ► సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత మీడియాతో CID లాయర్, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ► ఈ కుంభకోణం బయటపెట్టింది GSTనే ► 17(A)వచ్చింది 26-07-2018 ► 05-06-2018లోనే స్కిల్ స్కామ్ విచారణను GST చేపట్టింది ► తప్పు జరిగింది, అవినీతి జరిగింది, పన్ను ఎగ్గొట్టారని GST అప్పుడే రాష్ట్రప్రభుత్వానికి సూచించింది ► స్వయంగా ముఖ్యమంత్రే తప్పు చేయడం వల్ల GST ఇచ్చిన సూచనలు ఉద్దేశపూర్వకంగా విస్మరించారు ► రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవిని దుర్వినియోగం చేశారు చంద్రబాబు ► GST దర్యాప్తు ప్రారంభించింది 2018 కంటే ముందు కాబట్టి... ఇది 17a సవరణ కిందికి రాదు ► 17(A) స్కిల్ స్కాం కేసుకు అప్లై కాదు ► నేరం జరిగినప్పుడు, దర్యాప్తు ప్రారంభమైనప్పుడు కూడా 17(A) లేదు ► హైకోర్టు ముందు కూడా దర్యాప్తు డాక్యుమెంట్‌ను సమర్పించాం ► అదే డాక్యుమెంట్‌ను సుప్రీంకోర్టు అడిగింది. హైకోర్టులో ఇచ్చిన డాక్యుమెంట్నే సర్వోన్నత న్యాయస్థానంకు సమర్పిస్తాం 1:45 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబువి పసలేని వాదనలు : లాయర్లు ► కేవలం 17A సెక్షన్ సవరణపైనే ఆధారపడ్డ చంద్రబాబు లాయర్లు ► బెయిల్ కోసం ప్రయత్నించకుండా, మొత్తం కేసునే క్వాష్ చేయాలన్న తపనలో బాబు లాయర్లు ► చంద్రబాబు తప్పు చేయలేదని ఎక్కడా చెప్పని చంద్రబాబు లాయర్లు ► కేవలం అరెస్ట్ జరిగిన విధానాన్ని తప్పుబట్టిన చంద్రబాబు లాయర్లు ► గవర్నర్ అనుమతి తీసుకోలేదన్న వాదనను వినిపించిన బాబు లాయర్లు ► చంద్రబాబు లాయర్లలో రెండు వైఫల్యాలు ► 17A సెక్షన్ సవరణ కేవలం అవినీతి నిరోధక చట్టానికి మాత్రమే వర్తిస్తుందన్న కోర్టు ► చంద్రబాబుపై నమోదయిన FIRలో అవినీతి నిరోధక చట్టంతో పాటు IPC సెక్షన్లు ► నేరం జరిగింది 2014-15 మధ్యకాలంలో అని స్పష్టంగా తెలిసినా 17Aపైనే ఆధారపడ్డ బాబు లాయర్లు ► ఈ కేసులో ఇంతకు మించిన బలమైన వాదన లేదన్నట్టుగా వ్యవహరించిన బాబు లాయర్లు ► బాబు లాయర్ల వాదనలతో అంగీకరించని సర్వోన్నత న్యాయస్థానం 1:24 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబుకు దక్కని ఊరట ► జస్టిస్ బోసు : ఈ కేసులో హైకోర్టు ముందు బెయిల్ పిటిషన్ వేసుకోండి ► జస్టిస్ బోసు : ఈ కేసును సోమవారానికి వాయిదా వేస్తున్నాం ► చంద్రబాబు తరపు లాయర్ లూథ్రా : కానీ చంద్రబాబు జైల్లో ఉన్నారు. అది కదా కష్టం ► CID తరపు లాయర్ రోహత్గీ : వీళ్లు కనీసం బెయిల్ అడగడం లేదు, ఏకంగా కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు ► చంద్రబాబు తరపు లాయర్ లూథ్రా : ఇప్పుడు చంద్రబాబును పోలీస్ కస్టడీకి ఇవ్వాలని అడుగుతున్నారు, రేపు హైకోర్టు ముందు బెయిల్ పిటిషన్ లిస్టయింది. అరెస్టయిన 15 రోజుల తర్వాత కస్టడీ అడగడం సరికాదు. ► జస్టిస్ బోసు : ఈ కేసులో ఇంకా పరిశీలించాల్సిందేమీ లేదు. ఈ పిటిషన్‌ను సోమవారానికి వాయిదా వేస్తున్నాం. ఇరుపక్షాలు అప్పుడు డాక్యుమెంట్లు అన్నీ సమర్పించండి. కేవియట్ పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలకు మద్ధతిచ్చే డాక్యుమెంట్లు సమర్పించాలి. దర్యాప్తు ముందే ప్రారంభమయిందని నిరూపించాలి ► బెంచ్ : ఈ కేసులో ఉత్తర్వులిస్తున్నాం. క్వాష్ పిటిషన్‌పై వాదనలను సోమవారం వింటాం. అలాగే హైకోర్టు ముందు CID సమర్పించిన డాక్యుమెంట్లు అన్నీ సమర్పించాలి 1:20 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై వాడివేడి వాదనలు ► జస్టిస్ బోసు : 2018కు ముందే దర్యాప్తు ప్రారంభమైందని ఎలా చెబుతారు? ► CID తరపున ముకుల్ రోహత్గీ : ఒకసారి ఈ డాక్యుమెంట్లు చూడండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు APSDCని ప్రారంభించారు. కేవలం 10% ప్రభుత్వం ఇస్తే చాలన్నారు. 90% మరో సంస్థ గిఫ్ట్‌గా ఇస్తుందన్నారు. ఆ వెంటనే 10% నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలయ్యాయి. 2017కంటే ముందే నేరం జరిగింది. 2018 జులైలో చట్టసవరణ వచ్చింది, 2021లో FIR నమోదయింది. ఈ కేసులో ఏ రకంగానూ 17ఏ వర్తించదు ►రోహత్గీ : అరెస్టయిన మూడు రోజుల్లోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు ►రోహత్గీ : ఏకంగా 2000 పేజీల పిటిషన్‌ను హైకోర్టు ముందుంచారు ►రోహత్గీ వాదనలను అడ్డుకునేందుకు లూథ్రా ప్రయత్నం ►రోహత్గీ : లూథ్రా గారు, మీ వంతు వస్తుంది, ఆగండి 1:14 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై వాడివేడి వాదనలు ► జస్టిస్ బోసు : FIRలో రెండు రకాలు సెక్షన్లు ఉన్నాయి ► సింఘ్వీ : కానీ అవినీతి నిరోధక సెక్షన్ల కిందే చర్య తీసుకున్నారు ► లూథ్రా : ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు, వరుసగా FIRలు నమోదు చేశారు ► జస్టిస్ బోసు : మీరు వేసిన పిటిషన్‌పైనే ఉన్నాం. కేవలం 17a వర్తిస్తుందా? లేదా అన్నదాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాం ► CID తరపున ముకుల్ రోహత్గీ : ఒకసారి కేసును చూడండి. ఈ కేసులో దర్యాప్తు 2017 కంటే ముందే మొదలయింది. అప్పుడే దీన్ని CBI పరిశీలించింది. ఇక రాజకీయ కక్ష అని ఎలా అంటారు? తప్పు చేసింది 2015-16లో. దర్యాప్తు మొదలయింది ఈ ప్రభుత్వం రాకముందే. ఇప్పుడు దాన్ని కక్ష అని ఎలా అంటారు? (CID తరపున ముకుల్ రోహత్గీ వాదనలు) 1:10 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై వాడివేడి వాదనలు ► సింఘ్వీ : ఒకసారి కేసును చూడండి. ఇది కేవలం మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయమని మాత్రమే అభియోగాలున్నాయి ► జస్టిస్ త్రివేదీ : మేం కేసు లోతుల్లోకి వెళ్లడం లేదు ► జస్టిస్ బోసు : ఇప్పటికిప్పుడు కేసును క్వాష్ చేయాలన్న అంశంపై మేం ఆసక్తి చూపించడం లేదు 1:05 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై CID తరపు ముకుల్ రోహత్గీ వాదనలు ► రోహత్గీ : ఈ అంశాన్ని ఇంతకుముందే సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది ► జస్టిస్ త్రివేదీ : CrPC కోడ్ ప్రకారం 17A సవరణ పాటించాలని ఎక్కడా లేదు ► సింఘ్వీ : అవినీతి నిరోధక చట్టం ఒకసారి పరిశీలించండి ► జస్టిస్ త్రివేదీ : FIRలో రెండు సెక్షన్లు ఉన్నాయి, Prevention of corruption ఉంది, అలాగే IPC ఉంది 1:01 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై వాడి వేడి వాదనలు ► జస్టిస్ త్రివేదీ : 17A అనేది కేవలం అవినీతి నిరోధక చట్టానికే వర్తిస్తుంది, ఇండియన్ పెనల్ కోడ్ కింద నమోదయిన కేసుల సంగతేంటీ? ► సాల్వే : ఏ కేసుకయినా 17A సవరణ వర్తించాల్సిందే ► లూథ్రా : అవును, ఏ కేసుకయినా 17A సవరణ వర్తించాలి ► జస్టిస్ బోస్ : కేవలం లా పొజిషన్‌ను బట్టి మాత్రమే ముందుకు వెళ్తాం ► జస్టిస్ త్రివేదీ : ఈ కేసులో కోర్టు పరిశీలించాల్సింది ఒకే ఒక అంశం. IPC కింద నమోదయిన కేసులకు 17A సవరణ వర్తిస్తుందా? లేదా? (సుప్రీంకోర్టు ముందు చంద్రబాబు లాయర్ సింఘ్వీ వాదనలు) 12:53 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై వాడి వేడి వాదనలు ► చంద్రబాబు తరపున మరో సీనియర్ లాయర్ AM సింఘ్వీ ఎంట్రీ ► రఫెల్ కేసు సమయంలో యశ్వంత్ సిన్హా కేసును ఉదహరించిన సింఘ్వీ ► జస్టిస్ త్రివేదీ : చంద్రబాబు కోసం ఎంత మంది సీనియర్ లాయర్లు వాదిస్తున్నారు? ► సాల్వే : నలుగురు లాయర్లు ఉన్నారు, అయినా మేం ముకుల్ రోహత్గీకి సరిపోం ► యశ్వంత్ సిన్హా కేసులో జస్టిస్ జోసెఫ్ ఇచ్చిన తీర్పును చదివి వినిపిస్తున్న సీనియర్ కౌన్సిల్ సాల్వే ► జస్టిస్ త్రివేదీ : ఈ కేసులో నేరం ఎప్పుడు జరిగింది? ► లూథ్రా : 2015-16 మధ్య జరిగింది 12:43 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు హరీష్ సాల్వే వాదనలు ► కానీ చంద్రబాబు అరెస్ట్ ఇప్పుడు చేశారు ► కచ్చితంగా సెక్షన్ 17A దీనికి వర్తించాలి ► అరెస్ట్ చేసిన విధానం తప్పు అని హైకోర్టుకు కూడా తెలిపాం ► కానీ హైకోర్టు మా వాదనతో అంగీకరించలేదు ► 17A సవరణ వల్ల వచ్చే ప్రొటెక్షన్ చంద్రబాబుకు వర్తించాల్సిందే ► గవర్నర్ అనుమతి తీసుకోలేదు కాబట్టి ఈ అరెస్ట్ వర్తించదు ► విచారణ ప్రారంభమైన తేదీనే ప్రామాణికంగా తీసుకోవాలి ► మంత్రిమండలి అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేశారన్నారు ► చంద్రబాబు సూచనలతోనే కొందరని ఎక్స్ అఫిషియోలుగా తీసుకొచ్చారని అభియోగాలు మోపారు (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు తరపున సాల్వే వాదనలు) 12:42 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టు : సాల్వే వాదనలపై జస్టిస్ త్రివేదీ ప్రశ్నలు ► ఈ నేరం 2015-16 మధ్య జరిగింది ► 17A చట్ట సవరణ 2018లో జరిగింది ► అలాంటప్పుడు 17A ఏ రకంగా వర్తిస్తుంది? 12:40 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు హరీష్ సాల్వే వాదనలు ► స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు తప్పు ► ఈ కేసు విచారణను సెప్టెంబర్ 7, 2021న ప్రారంభించినట్టు ADGP లెటర్‌ను బట్టి తెలుస్తోంది 17A చట్టం ప్రకారం అరెస్ట్ చేయాలంటే నిబంధనలు పాటించాల్సిందే 12:35 PM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు కేసు ► ఢిల్లీ: సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు కేసు విచారణ ► తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు ► కేసు విచారణ చేయనున్న జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ► రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్ ► CID దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున కేసు క్వాష్ చేయలేమని తీర్పునిచ్చిన హైకోర్టు ► తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17a వర్తిస్తుందని పిటిషన్ ► గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం అక్రమం అని పిటిషన్లో వాదనలు ► తొలుత వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తరపు లాయర్ హరీష్ సాల్వే 12:32 PM, అక్టోబర్ 03, 2023 హైకోర్టులో లోకేష్ లంచ్ మోషన్ ► ఏపి హైకోర్టులో నారా లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ ► ఫైబర్ నెట్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ► మధ్యాహ్నం లోకేష్ పిటిషన్ పై విచారణ ► ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో CID నోటీసులపై లంచ్ మోషన్ పిటిషన్ ► CID 41ఏ నోటీసుల్లో ఉన్న నిబంధనలపై లోకేష్ అభ్యంతరం ► హెరిటేజ్ బ్యాంక్ లావాదేవీలు తీసుకురావలనడంపై పిటిషన్ 12:12 PM, అక్టోబర్ 03, 2023 జనసేనతో ప్రతీ టిడిపి కార్యకర్త టచ్‌లో ఉండాలి : చినరాజప్ప ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో చినరాజప్ప ములాఖత్, అనంతరం మీడియాతో మాట్లాడిన రాజప్ప ఆరోగ్యం గురించి : చంద్రబాబు జైల్లో ఆరోగ్యంగా ధైర్యంగా ఉన్నారు, చంద్రబాబుకు అందరూ మద్ధతివ్వాలి రాజకీయాల గురించి : జనసేనతో త్వరలో ఉమ్మడి కార్యాచరణ ప్రారంభిస్తాం పవన్ కళ్యాణ్ గురించి : క్షేత్రస్థాయిలో తెలుగుదేశం కార్యవర్గమంతా జనసేనతో టచ్‌లో ఉండాలని సూచించాం చంద్రబాబు గురించి : జైల్లో ఉన్నా రాష్ట్రం ఏమైపోతుందోనని చంద్రబాబు బాధపడుతున్నారు కార్యకర్తలకు ఏం చెబుతారు? : ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, చంద్రబాబు జైల్లో చాలా బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు 11:25 AM, అక్టోబర్ 03, 2023 హైకోర్టులో నారాయణకు దక్కని ఊరట ► ఏపీ హైకోర్టులో నారాయణ లంచ్ మోషన్ పిటిషన్ 16వ తేదీకి వాయిదా ► అమరావతి అసైన్డ్ భూముల కేసు విచారణ వాయిదా ► నారాయణ ముందస్తు బెయిల్, ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని వేసిన పిటిషన్లపై విచారణ ఈనెల 16కు వాయిదా ► రేపటి గైర్హాజరుకు అనుమతించాలని నారాయణ విజ్ఞప్తి, అంగీకరించని హైకోర్టు ► ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణకు సంబంధించి మినహాయింపు విజ్ఞప్తి ► 60 ఏళ్ల వయస్సు వచ్చింది కాబట్టి స్టేషన్‌కు రానంటున్న నారాయణ ► పోలీసులే ఇంటికి వచ్చి విచారణ జరపాలంటూ లంచ్ మోషన్లో విజ్ఞప్తి ► అమరావతి భూదందాలో నారాయణదే కీలక పాత్ర : YSRCP MP విజయసాయి 11:20 AM, అక్టోబర్ 03, 2023 సుప్రీంకోర్టులో పుంగనూరు అల్లర్ల కేసు విచారణ ► ఢిల్లీ: సుప్రీంకోర్టులో పుంగనూరులో పోలీసులపై టిడిపి నేతల దాడి కేసు విచారణ ► నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం ► దేవినేని ఉమ, పులివర్తి నాని, నల్లారి కీషోర్ కుమార్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ ► దాడి కేసులో చల్లా బాబుపై 7 కేసులు నమోదు ► 4 కేసుల్లో చల్లా బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ► కేసులో జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు 11:10 AM, అక్టోబర్ 03, 2023 అరెస్ట్ అనగానే గుర్తుకొచ్చిన అనారోగ్యం ► హఠాత్తుగా బండారు సత్యనారాయణను పేషేంటును చేసిన తెలుగుదేశం నేతలు ► బండారు సత్యనారాయణ హైబీపీ, మధుమేహంతో బాధపడుతున్నాడంటూ కలరింగ్ ► మరి నోరు జారేప్పుడు హైబీపీ, మధుమేహం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించిన YSRCP ► గుంటూరు నగరంపాలెం స్టేషన్‌కు వచ్చిన సత్యనారాయణ తనయుడు అప్పలనాయుడు 11:06 AM, అక్టోబర్ 03, 2023 ముందస్తు బెయిల్ కావాలంటూ లోకేష్ మరో పిటిషన్ ► హైకోర్టులో లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు ► ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ విజ్ఞప్తి ► లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశం ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు రేపు విజయవాడ వస్తోన్న లోకేష్ ► చంద్రబాబు అరెస్టయిన మూడు రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్లిపోయిన లోకేష్ ► దాదాపు మూడు వారాలుగా ఢిల్లీలోనే కాలక్షేపం చేస్తోన్న లోకేష్ 11:05AM, అక్టోబర్ 03, 2023 ఇవ్వాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందా? లేదా? ► సుప్రీంకోర్టులో ఆఖరు నెంబర్‌గా లిస్టయిన చంద్రబాబు పిటిషన్ ► జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ ► 63వ నెంబర్ కేటాయించిన రిజిస్ట్రీ, చివరి కేసుగా బెంచ్ ముందుకు ► ఈ కేసు కంటే ముందు ఏ ఒక్క కేసులో సుదీర్ఘ వాదనలు జరిగినా ఈ కేసు వాయిదా పడే అవకాశం ► చంద్రబాబు తరఫున వాదించేందుకు సిద్ధమైన దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూత్రా ► జాబితాలో చిట్టచివరన ఉన్నందున విచారణకు వస్తుందా లేదా అన్న విషయంపై సందిగ్ధత 10:46AM, అక్టోబర్ 03, 2023 చంద్రబాబుతో కుటుంబం ములాఖత్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలవనున్న నారా భువనేశ్వరి ,బ్రాహ్మణి ►వారితోపాటు ఇవాళ చంద్రబాబును కలవనున్న టీడీపీ నేత చినరాజప్ప ►ఇప్పటికే చంద్రబాబు కలిసిన యనమల, అచ్చం నాయుడు, నారాయణ ►సత్యమేవ జయతే దీక్ష వివరాలు చంద్రబాబుకు తెలియజేయునన్న భువనేశ్వరి 10:25AM, అక్టోబర్ 03, 2023 చట్టాలకు ఆయనేం అతీతుడు కాదు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ►విశాఖ: అవినీతి చేసి అడ్డంగా దొరికిన వ్యక్తి చంద్రబాబు ►చట్టాలకు చంద్రబాబు అతీతుడేం కాదు ►బాబు అవినీతికి ఆధారాలు దొరికాయి కాబట్టే అరెస్ట్ చేశారు ►అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు లక్షల కోట్లు సంపాదించారు ►పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధానే చెప్పారు ►భువనేశ్వరి దీక్ష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు ►అవినీతిపరుడు కోసం దీక్ష చేసి గాంధీని అవమానించారు ►లంచాలు తిని కంచాలు కొడటే చేసిన తప్పులు పోతాయా? ►భువనేశ్వరి చేసిన దీక్ష సత్యమేవ జయతే కాదు.. అసత్యమేవ జయతే ►కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా.. చంద్రబాబు ► చంద్రబాబు.. ఓ ఆర్థిక ఉగ్రవాది ►చంద్రబాబు కడిగిన ముత్యం కాదు.. అవినీతి ముత్యం ►దీక్ష పేరుతో నారా భువనేశ్వరి.. ఎస్సీ ఎస్టీ మహిళా నేతలను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారు ►చంద్రబాబు పెద్ద అవినీతి పరుడనీ ఎన్టీఆర్ చెప్పారు ►అవినీతి చక్రవర్తికి అబద్దాల భార్య అని భువనేశ్వరికి పేరు పెడితే బాగుంటుంది ►30 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న బతుకు చంద్రబాబుది ►చంద్రబాబు అక్రమ ఆస్తులుపై భువనేశ్వరి దీక్షల చేయాలి ►చంద్రబాబు మించిన అవినీతి సైకో మరొకరు లేరు 10:14AM, అక్టోబర్ 03, 2023 రేపు ఉదయం విజయవాడకు నారా లోకేష్ ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. ఢిల్లీకి వెళ్లిన నారా లోకేష్ ► దాదాపు రెండు వారాల తర్వాత.. రేపు ఉదయం విజయవాడకు రాక ► ఢిల్లీలో ఇంతకాలం లీగల్ సంప్రదింపులంటూ టీడీపీ శ్రేణుల ప్రచారం ► అరెస్ట్ భయంతోనే పరారైనట్లు రాజకీయ వర్గాల చర్చ ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రేపు నారా లోకేష్ సీఐడీ విచారణ ► సెప్టెంబర్ 30న CRPC 41A కింద ఢిల్లిలో లోకేష్‌కు నోటీసులు ► ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్పోస్ చేసి.. విచారణకు సహకరించాలని లోకేష్‌ను ఆదేశించిన ఏపీ హైకోర్టు 09:40AM, అక్టోబర్ 03, 2023 చంద్రబాబు అరెస్ట్.. ఎవరూ పట్టించుకోరేం? ► చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ స్థాయిలో దృష్టి దక్కకపోవడంపై టీడీపీలో చర్చ ► పార్టీకి ఇంతటి దుస్థితి ఎందుకు అని సీనియర్ల ఆవేదన ► చంద్రబాబు తర్వాత తెలుగుదేశంలో మరో పెద్ద తలకాయ లేదా? ► జాతీయ స్థాయిలో రెండు కూటములు ఎందుకు దూరం పెడుతున్నాయి? ► కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదు? ► కనీసం కాంగ్రెస్ అధిష్టానం నుంచయినా బాబుకు అనుకూలంగా ఒక్క మాట రావట్లేదు? 09:00AM, అక్టోబర్ 03, 2023 చంద్రబాబు జైలు నిద్రలతో.. : విజయసాయిరెడ్డి ►చిన్న వాగులా మొదలై కడలిని చేరేలోగా అఖండ జలరాశిలా పోటెత్తుతుంది నది. ►కాలంతో పాటు ఉరకలువేసే మనిషి జీవితమైనా, సమాజపు ప్రస్థానమైనా తరంగిణిలా సాగిపోతుంది. ►ప్రకృతి నియమం అది. ►చంద్రబాబు గారు లాక్కున్న టీడీపీ మాత్రం.. ఆయన జైలు నిద్రలతో ఎండిపోయిన చెలిమెలా తయారైంది. చిన్న వాగులా మొదలై కడలిని చేరేలోగా అఖండ జలరాశిలా పోటెత్తుతుంది నది. కాలంతో పాటు ఉరకలువేసే మనిషి జీవితమైనా, సమాజపు ప్రస్థానమైనా తరంగిణిలా సాగిపోతుంది. ప్రకృతి నియమం అది. చంద్రబాబు గారు లాక్కున్న టీడీపీ మాత్రం ఆయన జైలు నిద్రలతో ఎండిపోయిన చెలిమెలా తయారైంది. — Vijayasai Reddy V (@VSReddy_MP) October 3, 2023 08:50AM, అక్టోబర్ 03, 2023 బండారు అరెస్ట్‌పై పచ్చ బ్యాచ్ ఓవరాక్షన్ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత మంత్రి రోజాపై విశాఖ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుచిత వ్యాఖ్యలు ►సోమవారం రాత్రి అరెస్ట్ ►గుంటూరు పీఎస్‌కు తరలింపు ►బండారును నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేశారంటూ పచ్చ మీడియా గగ్గోలు ►పీఎస్ బయట మంగళవారం ఉదయం టీడీపీ నేతల ఓవరాక్షన్ 08:20AM, అక్టోబర్ 03, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డులో బెయిల్ కోసం చంద్రబాబు ►ఇన్నర్‌రింగ్ రోడ్డు స్కామ్ కేసులో ఏపీ హైకోర్టులో బాబు పిటిషన్ ►ఐఆర్ఆర్ స్కాంలో ఏ1గా చంద్రబాబు ►బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ ►మరోవైపు ఏ2 నారాయణ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై కూడా ►రేపు నారాయణ-నారా లోకేష్‌ను విచారించనున్న ఏపీ సీఐడీ ► ఇప్పటికే నోటీసుల అందజేత 07:50AM, అక్టోబర్ 03, 2023 టీడీపీ డ్రామాల్ని పట్టించుకోవట్లేదు ►సత్యమేవ జయతే దీక్ష పేరుతో చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ ఒకరోజు ఆందోళన చేపట్టిన టీడీపీ ►చంద్రబాబు అరెస్ట్ నుంచి టీడీపీ చేపట్టిన ఏ ఒక్క ఆందోళన విజయవంతం కాని వైనం ►సత్యమేవ జయతే దీక్షను సక్సెస్ చేయటానికి విశ్వ ప్రయత్నాలు ►పట్టించుకోని రాజమండ్రి వాసులు ►అంతకు ముందు.. మోత మోగిద్దాంకూ అదే పరిస్థితి ►జైల్లో చంద్రబాబు దీక్ష చేపట్టారు.. ఒక్క పూట మాత్రమే ఉపవాసం 07:39AM, అక్టోబర్ 03, 2023 సుప్రీంలో పుంగనూరు దాడి కేసు విచారణ ►నేడు సుప్రీంకోర్టులో పుంగనూరులో పోలీసులపై టిడిపి నేతల దాడి కేసు విచారణ ►నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం ►టీడీపీ నేతలు దేవినేని ఉమ, పులివర్తి నాని, నల్లారి కీషోర్ కుమార్ రెడ్డికి ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిల్ ► దాడి కేసులో చల్లా బాబు పై 7 కేసులు నమోదు ► నాలుగు కేసుల్లో చల్లా బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు. ► పుంగనూరులో సరెండర్ అయిన చల్లా బాబు 07:32AM, అక్టోబర్ 03, 2023 మా వాదనలు వినాలి: ఏపీ ప్రభుత్వం ►సుప్రీంలో చంద్రబాబు ఎస్ఎల్పీపై నేడు విచారణ ►సర్వోన్నత న్యాయస్థానంలోని 6వ నంబర్ కోర్టులో లిస్ట్ ►మరోవైపు పిటిషన్‌పై.. కేవియట్ దాఖలు చేసి విచారణలో భాగమైన ఏపీ ప్రభుత్వం ► తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టుకు వినతి ► నేటి పిటిషన్ల జాబితాలో చిట్టచివరగా లిస్ట్(నెంబర్ 63) అయిన చంద్రబాబు పిటిషన్ ► విచారణకు వస్తుందా లేదా అన్న విషయంపై సందిగ్ధత 07:10AM, అక్టోబర్ 03, 2023 నేడు సుప్రీంకోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ ►నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ కు డబ్బులిస్తూ పట్టుబడిన కేసు ►రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేయనున్న సుప్రీంకోర్టు ►విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ►ఐటెం నెం.42 గా లిస్ట్ అయిన కేసు ►ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని, కేసు కొట్టేయాలని అంటున్న రేవంత్ రెడ్డి ►ఈ కేసులో ప్రాథమిక సాక్షాధారాలు ఉన్నాయని, అన్ని విషయాలు ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని అంటున్న తెలంగాణ ప్రభుత్వం ►సుప్రీంకోర్టు ఏం చెప్తుందనే దానిపై ఉత్కంఠ ►ఈ కేసులో చంద్రబాబు సైతం ఇన్వాల్వ్ అయిన వైనం 07:08AM, అక్టోబర్ 03, 2023 చంద్రబాబు పాపి.. చిరాయువు ►భువనేశ్వరి స్పీచ్‌కు ‘అమ్మా..’అంటూనే వైఎస్సార్సీపీ కౌంటర్ ►చంద్రబాబు అమాయకుల ఉసురు పోసుకున్నారు ►బషీర్ బాగ్ కాల్పుల ఘటన నుంచి గోదావరి పుష్కరాల్లో ఎన్నో ప్రాణాలను తన ఖాతాలో వేసుకున్నారు ►చంద్రబాబు పాపి.. కాబట్టి చిరాయువుగా శిక్షలు అనుభవిస్తారు ►చంద్రబాబు ప్రజలకోసం బతకలేదు.. కేవలం నారా ఫ్యామిలీ కోసమే బతుకుతున్నారు ►రెండు శాతం షేర్ల ధర 400 కోట్లు అవడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది ఆయన మీ ఆయుష్షు పోసుకోవడం కాదమ్మా.. ఇప్పటి వరకూ ఎంతోమంది అమాయకుల ఉసురు పోసుకున్నారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటన నుంచి గోదావరి పుష్కరాల్లో ఎన్నో ప్రాణాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయినా పాపి చిరాయువు అంటారు కదా.. ఆ పాపాలకు శిక్ష అనుభవించాలి కాబట్టి చిరకాలం ఉంటారు లెండి. ఇక ఆయన ప్రజలకోసం… https://t.co/SmR3hK8fnL — YSR Congress Party (@YSRCParty) October 2, 2023 07:06AM, అక్టోబర్ 03, 2023 ఏంటీ పరిస్థితి ►అమరావతిలో రాత్రి టీడీపీ హడావిడి సమావేశం ►రాత్రి 11గంటలకు అచ్చెన్న ఆధ్వర్యంలో టిడిపి నేతల సమావేశం ►బాబు అరెస్ట్ తర్వాత మెరుగుపడని పార్టీ పరిస్థితి ►సర్వేల్లోనూ బోల్తా కొడుతున్న సైకిల్ ►కిమ్ కర్తవ్యం అనే దానిపైనే అచ్చెన్న చర్చ 07:00AM, అక్టోబర్ 03, 2023 నారాయణ పిటిషన్లపై విచారణ ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుIRR కుంభకోణంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి నారాయణ ►IRR కేసులో ఏ2గా నారాయణ ►పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగే ఛాన్స్ ►అలాగే.. అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో తనపై కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ ►రెండు పిటిషన్లపై విచారణ జరిగే అవకాశాలు 06:58AM, అక్టోబర్ 03, 2023 కంచాల మోత.. దొంగ దీక్షలు ►చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ రోజుకో డ్రామా ►జనాల అటెన్షన్ కోసం తీవ్ర యత్నాలు ►మోత మోగిద్దాంకు దక్కని స్పందన ►గాంధీ జయంతిని దీక్షల పేరిట డ్రామాలు ►బాబు రాజమండ్రి జైల్లో.. భార్య భువనేశ్వరి రాజమండ్రిలో.. కొడుకు లోకేష్ ఢిల్లీలో ఏడు గంటల దీక్ష ►అవినీతి చేసి సత్యాగ్రహ దీక్షలు చేయడంపై ముక్కున వేలేసుకుంటున్న జనం ►టీడీపీ నుంచే దక్కని స్పందన.. లైట్ తీసుకున్న నేతలు ►వందల కోట్లు నొక్కేసి సత్యాగ్రహ దీక్ష చేస్తే సరిపోతుందా? అంటున్న జనం 06:50AM, అక్టోబర్ 03, 2023 చంద్రబాబు కేసు.. ఐటెం నెంబర్ 63 గా లిస్ట్ ►నేడు సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పిటిషన్ విచారణ ►స్కిల్ స్కాంలో తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు ►తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17a వర్తిస్తుందని పిటిషన్ ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం అక్రమం అని పిటిషన్లో వాదన ► హైకోర్టులో ఎదురుదెబ్బ తర్వాత.. ఆ తీర్పును ఆశ్రయిస్తూ సుప్రీంకెళ్లిన చంద్రబాబు ►ఎస్ఎల్పీని విచారణ చేపట్టనున్న జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ ►చంద్రబాబు తరఫున దేశంలో నే అత్యంత ఖరీదైన లాయర్ లు సిద్ధార్థ్ లూత్రా, హరీశ్ సాల్వే వాదనలు ►నేడు చివరి పిటిషన్‌గా.. ఐటెం నెంబర్ 63 గా లిస్ట్ అయిన చంద్రబాబు కేసు 06:48AM, అక్టోబర్ 03, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @24 ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడీషియల్ రిమాండ్ మీద చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691 ► నేటితో (అక్టోబర్ 3)తో 24వ రోజుకు చేరిన చంద్రబాబు రిమాండ్ ► నేడు చంద్రబాబు పిటిషన్‌పై విచారణ -
యువకుడి చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్ మృతి
నూజివీడు : వినాయక నిమజ్జనాల సందర్భంగా విధులు నిర్వహిస్తూ ఓ యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ గంధం నరేంద్ర(32) ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో శనివారం రాత్రి డీజే ఆపమని చెప్పిన కానిస్టేబుల్ నరేంద్రపై ఉలాస రామకృష్ణ అనే యువకుడు తలపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నరేంద్రను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని సోమవారం తెల్లవారుజామున నూజివీడు ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీంతో ఏరియా ఆస్పత్రి వద్దకు నూజివీడు సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బంది, అధికారులు, మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు చేరుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కొద్దిసేపు ఆందోళన చేశారు. కాగా, ఏరియా ఆస్పత్రిలో ఉన్న నరేంద్ర భౌతికకాయాన్ని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఏలూరు డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి కూడా నివాళులర్పించారు. అనంతరం నరేంద్ర స్వగ్రామమైన ఎనీ్టఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం పోలిశెట్టిపాడులో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
బండ బూతుల ‘బండారు’
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అంటే ఆ పార్టీలోనే ఓ విధమైన వణుకు, జంకు. ఆయన నోరు అలాంటిది. ఎవరినైనా వినలేని, రాయలేని అత్యంత భాషలో తిట్టడం ఆయన నైజం. ఆయనకు వచ్చిన ఒకే ఒక్క విద్య బూతులే అని టీడీపీ నేతలే అంటుంటారు. బండారు బూతు పురాణం ఆయన కుటుంబ సభ్యులే సిగ్గుతో తలదించుకునేలా ఉంటుంది. ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే.. ఎవరినైనా కనీస విచక్షణ లేకుండా జుగుప్సాకరంగా మాట్లాడతారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిని అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, సభ్యత, విచక్షణ మరిచి ఆయన లక్ష్యంగా చేసుకున్న వారిపై బూతులతో విరుచుకుపడుతుంటారు. తన తప్పుల్ని ఎత్తిచూపిన ప్రతి వారిపైనా బూతులు లంఖించుకుంటారు. అందుకే ఆయన్ను ఇతర పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా బూతుల సత్యనారాయణ అని అంటుంటారు. మంత్రిగా వెలగబెట్టిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. అదే రీతిలో ఆయన ముఖ్యమంత్రి, మంత్రి రోజాపైనా ఇటీవల నోరు పారేసుకున్నారు. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకొనేలా చేశాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్, యావత్ మహిళాలోకం మండిపడ్డాయి. పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: అనుచిత వ్యాఖల కేసులో బండారు అరెస్టు మంత్రి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు ఇటీవల బండారు సత్యనారాయణ మాట్లాడుతూ మంత్రి రోజాపై రాయలేని వీలు లేని భాషలో జుగుప్సాకరమైన పదాలను ఉపయోగిస్తూ అసభ్యకరంగా మాట్లాడారు. రోజా బతుకు ఎవరికి తెలీదని అన్నారు. బ్లూ ఫిల్మ్‌లో యాక్ట్ చేశారని, అవన్నీ తమ దగ్గర ఉన్నాయని, ఆమె బతుకు బయటపెట్టకూడదని వాటిని రిలీజ్ చేయలేదన్నారు. బజారు మనిషని నోరు పారేసుకున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రిపై కూడా తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. బండారు అరెస్ట్‌పై హెబియస్ కార్పస్.. హైకోర్టు తిరస్కరణ సాక్షి, అమరావతి: మంత్రి రోజానుద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఆయన సోదరుడు సింహాద్రిరావు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు నిరాకరించింది. బండారు వ్యాఖ్యల వ్యవహారంపై గుంటూరు అరండల్‌పేట, నగరపాలెం పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో సీఆర్పీసీ కింద నోటీసులిచ్చి అరెస్ట్ చేసేందుకు విశాఖ జిల్లా వెన్నలపాలెంలోని బండారు ఇంటికి గుంటూరు పోలీసులు వెళ్లారు. ఈ సందర్భంగా సత్యనారాయణమూర్తితో పాటు టీడీపీ హంగామా సృష్టించారు. పోలీసులను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఇదే సమయంలో బండారు సోదరుడు సింహాద్రిరావు హైకోర్టును ఆశ్రయించారు. హౌస్‌మోషన్ ద్వారా అత్యవసర విచారణ జరపాలని కోరారు. ఈలోపు పోలీసులు బండారుకు నోటీసులిచ్చారు. చట్టప్రకారం అనుసరించాల్సిన విధివిధానాలను పూర్తిచేశారు. పిటిషన్‌పై విచారణ జరిపేందుకు హైకోర్టు సిద్ధమవుతున్న దశలో హైకోర్టు రిజిస్ట్రీకి ఓ సమాచారం అందింది. సత్యనారాయణమూర్తి విషయంలో పోలీసులు సీఆర్పీసీ చట్టనిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు తెలిసింది. దీంతో పిటిషన్‌పై విచారణకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించి, ఆ విషయాన్ని పిటిషనర్ న్యాయవాదికి తెలిపినట్లు సమాచారం. -
‘దాడి చేసి వేధిస్తున్నారు’
ఆత్మకూరు : తనపై భర్త తరపు బంధువులు దాడులకు పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయాలని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో షేక్ నస్రీన్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. వింజమూరుకు చెందిన షేక్ నస్రీన్ భర్త ముజీబ్‌తో గొడవలు రావడంతో మూడేళ్ల క్రితం విడిపోయింది. వారికి ఐదేళ్ల కుమార్తె ఉంది. ఆమె బతుకుదెరువు కోసం కలిగిరిలోని ఓ దుకాణంలో చిరుద్యోగం చేస్తోంది. రోజూ వింజమూరు నుంచి కలిగిరికి వెళ్లి వస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె భర్త తరపు బంధువులు నలుగురు తమ మాట వింటే భర్తతో కాపురం నిలబెడతామని చెప్పుకొచ్చారు. అదే క్రమంలో ఆమెను తరచూ వేధిస్తుండేవారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కలిగిరిలో విధులు పూర్తి చేసుకుని వింజమూరుకు వస్తున్న ఆమెను ఆ నలుగురూ అటకాయించి ఇబ్బందులకు గురిచేశారు. ఆమె ఉంటున్న ఇల్లు (భర్త బంధువుది) వెంటనే ఖాళీ చేయాలని దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె ఉంటున్న ఇంటిని సైతం కొంత భాగం కూలదోశారు. దీంతో అదేరోజు రాత్రి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో రాలేమని, మరుసటి రోజు రావాలని పోలీసులు చెప్పడంతో స్టేషన్ ఎదుటే ఈ ఆదివారం తనకు న్యాయం చేయాలని ధర్నాకు దిగింది. పోలీసులు ఆమెను ధర్నాను విరమింపజేసేందుకు ప్రయత్నించే క్రమంలో చేతిలోని బ్లేడు తెగి గాయాలయ్యాయి. అస్వస్థతకు గురైన ఆమె ఆత్మకూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. తనను వేధిస్తున్న వారిపై ఫిర్యాదు చేసేందుకు దిశ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లనున్నట్లు ఆమె తెలిపింది. దీనిపై పోలీసులను వివరణ కోరగా పలువురిపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. -
Babu Case : లోకేషా.. ఈ ప్రశ్నలకు జవాబేదీ?
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రకటనలు చేశారు. ఇంతకీ ఆయన చేసిన ప్రకటనలేంటీ? వాటి అంతరార్థమేంటీ? లోకేష్ : తెలుగుదేశం పార్టీ ఏనుగు లాంటిది. సిద్ధమవడానికి సమయం పడుతుంది. సందేహాలు : పార్టీని ఏనుగులా పోల్చడమేంటీ? అసలు ఏనుగు అనడంలో లోకేష్ ఉద్దేశ్యమేంటీ? ఎవరూ కదలలేకపోతున్నారనా? లేక పార్టీ బలంగా ఉందని చెప్పడమా? తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఏనుగే అనుకుంటే, సిద్ధమవడానికి సమయం పడుతుందనుకొందాం. కానీ తెలుగుదేశం పార్టీ కొత్తగా వచ్చింది కాదు కదా. దాదాపు 40 ఏళ్లుగా ఉన్న ఒక పార్టీలో చంద్రబాబు అనే ఒకే ఒక వ్యక్తి అవినీతి పాలయి జైల్లోకి వెళ్లాడు. ఒక్క అరెస్ట్‌తోనే పార్టీ తలకిందులయిందన్నది లోకేష్ ఉద్దేశ్యమా? లేక పార్టీ నిద్రాణంగా ఉందన్న భావనలో ఉన్నారా? లోకేష్ : చేయని తప్పుకు శిక్షించే వ్యవస్థ ఉండకూడదన్న ఉద్దేశ్యంతో, ఆ వ్యవస్తను మార్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. సందేహాలు : లోకేష్ రాజకీయాల్లోకి 2014 తర్వాత వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పుకుంటున్న లోకేష్ ముందెక్కడ పోటీ చేయలేదు. అప్పటికే పార్టీ అధికారంలో ఉంది. తండ్రి ముఖ్యమంత్రి కావడంతో లోకేష్ నేరుగా ఎమ్మెల్సీ అయ్యాడు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు. పార్టీ చెప్పుచేతల్లో ఉంది కాబట్టి జాతీయ కార్యదర్శి పదవి తీసుకున్నాడు. అధికారం తమదే కాబట్టి క్యాబినెట్ మినిస్టర్ అయ్యాడు. అంతే తప్ప.. ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేసి పదవులు సాధించుకోలేదు. తెలుగు రాజకీయాలను భ్రష్టు పట్టించి ఓటుకు కోట్లు కెమెరాల సాక్షిగా ఇస్తూ అడ్డంగా దొరికి, లంచం ఇవ్వడం తప్పు కాదని వాదించే మీలాంటి నాయకులు ఉండడం వల్లే రాజకీయాల్లోకి కొత్తగా ఎవరూ రావడం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే.., లోకేష్ రాజకీయాల్లోకి వచ్చేసమయంలో లోకేష్ గానీ, లోకేష్ తండ్రి చంద్రబాబు గానీ జైల్లో లేరు. నిజానికి ఆ సమయంలో చేయని తప్పుకు కేసులు పెట్టి జైలుకు పంపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. కాంగ్రెస్ కక్ష కడితే, దానికి చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం వంత పాడి కేసుల్లో ఇంప్లీడ్ అయి తప్పుడు అభియోగాలు బనాయించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అక్రమంగా జైలుకు పంపించారు. ఈ కేసులు తప్పని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే.. 2014లో 67 స్థానాలు, 2019లో 151 స్థానాలు కట్టబెట్టారు. అంటే లోకేష్ చెప్పే అరెస్ట్ ఇదేనా.? తాము అక్రమంగా అరెస్ట్ చేసి పంపామన్న అపరాధన భావనలో ఉన్నాడా? లోకేష్ : మేం ఎనిమిదేళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్నాం. మాకు హైదరాబాద్/సైబరాబాద్‌లో ఎకరం జాగా లేదు. అసలు నిజాలు : లోకేష్, చంద్రబాబు ఆస్తుల వెల్లడి అన్న కార్యక్రమం ఎంత కామెడీనో తెలుగు ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్‌లో కట్టిన రాజసౌధం విలువ లక్షల్లోచూపిస్తావు. ఏంటంటే.. కొన్నప్పుడు అంతే ఉందంటావు. ఇక అసలు మాకు ఒక్క గజం భూమి ఉన్నా.. ఇచ్చేస్తానంటావు. మరి మదీనాగూడలో 14 ఎకరాల్లో ఉన్న ఫాంహౌజ్ సంగతేంటీ? అంత ఖరీదైన లోకేషన్లో అంత భూమి ఎలా వచ్చింది? ఖరీదైన స్థలాలన్నీ మీ నానమ్మ నీ ఒక్కరికే ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది? ఇందులో క్విడ్ ప్రో కోల గురించి ఎప్పుడైనా వివరణలిస్తావా? దీని గురించి వేసిన కేసుల్లో విచారణ జరగకుండా స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు? మీకు, మీ కొడుకు దేవాన్ష్ కు ఇచ్చిన బహుమతులు అమ్మణ్ణమ్మ, బాలకృష్ణ ఐటీ రిటర్నులు, ఎన్నికల అఫిడవిట్లలో ఎందుకు లేవు? లోకేష్ : మా నాన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మా సంస్థ హెరిటేజ్ నిదానంగా ఎదిగింది. లేదంటే సంస్థ విలువ ఇప్పటికీ మూడు రెట్లు పెరిగేది. అసలు నిజాలు : హెరిటేజ్ విలువ ఎంత? ఆ సంస్థ అంచలంచెలుగా ఎలా ఎదిగింది అన్నది చిత్తూరు నుంచి విజయనగరం వరకు ఎవరిని అడిగినా చెబుతారు. పదవిని అడ్డు పెట్టుకుని హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని దివాళా తీయించినప్పుడే వ్యవస్థలను ముంచే మీ ప్రతిభ అర్థం చేసుకోవాలి. అయినా హెరిటేజ్ అసలు లెక్కలు ఎప్పుడయినా బయటపెట్టారా? ఇందులో మీ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకెవరయినా కీలక స్థానాల్లో ఉన్నారా? ఈ మధ్యే మీ అమ్మ భువనేశ్వరీ ఏం చెప్పారు? మా సంస్థ హెరిటేజ్‌లో 2% షేర్లు అమ్మినా మాకు రూ.400 కోట్లు వస్తాయన్నారు. అంటే ఈ లెక్క ప్రకారం మీ సంస్థ విలువ రూ.20వేల కోట్లు. కేవలం పాలు, డెయిరీ ప్రొడక్ట్‌లు, సూపర్ మార్కెట్ల ద్వారా రూ.20వేల కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మానవ మాత్రుడు ఎవరయినా ప్రపంచంలో ఉంటారా? మీరు తప్ప. ఇందులో అక్రమ సంపాదన ఎంత? వ్యవస్థలను ముంచిందెంత? మీ సంస్థ బాగు కోసం ఎవరెవరిని తొక్కేశారు. కొంచెం లెక్కలు వివరంగా చెబితే అందరూ నోళ్లు వెల్లబెట్టి వింటారు. లోకేష్ : రాజకీయాల్లోకి బ్రాహ్మణి రావడం ఆమె ఇష్టం. మేం మా దారులు ఎంచుకొన్నాం. అసలు నిజమేంటీ : పార్టీ లోడు నువ్వెత్తడం లేదని విషయం స్పష్టమయిన తర్వాతే మీ నాన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ను ఎంచుకున్నారని తెలుగుదేశంలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు గత మూడు వారాలుగా మీకు సంబంధించిన ఎల్లో మీడియాలోనే బ్రాహ్మణి పేరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బ్రాహ్మణి రావాలి, పాదయాత్ర చేయాలి, పార్టీని నడిపించాలని ప్రచారం చేస్తున్నారు. అంటే దానర్థమేంటన్నది మీ స్టాన్ఫోర్డ్ బ్రెయిన్‌కు అర్థం కానంత గొప్పదేం ఉండదు. మీరు తారా స్థాయిలో రాజకీయాలు నడిపితే బ్రాహ్మణి పేరు ముందుకు ఎందుకు వస్తుంది? హెరిటేజ్ సంస్థను విడిచిపెట్టి బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాలి అని పచ్చమీడియా పిచ్చిగా ప్రచారం చేస్తోందంటే ఇంతకు మించిన అర్థం ఇంకేముంటుంది? (Courtesy : Nidhi) లోకేష్ : స్కిల్ డెవలప్మెంట్, రింగ్‌రోడ్డు అక్రమ అలైన్మెంట్, ఫైబర్ గ్రిడ్.. ఈ మూడు ప్రాజెక్టులు నా మంత్రిత్వ పరిధిలోనివి కావు, కాబట్టి వాటికి నేను బాధ్యుడిని కాదు సందేహాలేంటీ : మొన్నటి వరకు ఏం వాదించారు.? బ్యాంకు మేనేజర్ తప్పు చేస్తే బ్యాంకు ఓనర్‌ను అరెస్ట్ చేస్తారా? అని ఎదురు ప్రశ్నించారు. అంటే అర్థమేంటీ? తప్పు జరిగింది కానీ మాది బాధ్యత కాదంటున్నావు. ఇక ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన శాఖలకు కూడా నేను మంత్రిగా పని చేయలేదంటున్నావు. అంటే అర్థమేంటీ? కుంభకోణం జరిగింది కానీ నా ప్రమేయం ప్రత్యక్షంగా లేదని అర్థమా? స్కిల్ డెవలప్మెంట్ మీ నాన్న శాఖలోనిది అయితే మీ ప్రమేయం అంతగా ఎందుకుంది? ఫైబర్ గ్రిడ్‌కు మీకు సంబంధం లేకుంటే.. మీవైపే అన్ని ఆధారాలు ఎందుకు చూపిస్తున్నాయి? మీ సంస్థ భూములు రింగ్‌రోడ్డు చుట్టే భూములు కొనాలని మీకు కలలో ఐడియా వచ్చిందా? పైగా మీ బెయిల్ పిటిషన్లో మీ అడ్వొకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఏం వాదించారు? కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌజ్‌లో తండ్రి చంద్రబాబుతో కలిసి ఉన్నందుకు నాపై కేసు ఎలా పెడతారని కోర్టు ముందు వాదించారు. అంటే మునగాల్సి వస్తే తండ్రిని కూడా వదిలేస్తారా? ఇవేనా మీరు నేర్చుకున్న కుటుంబ విలువలు? అసలు నోటీసులు రాకముందే ఢిల్లీకి ఎందుకు వెళ్లిపోయారు? సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడాల్సిన మంతనాలకు ఇన్ని రోజులు పడుతుందా? అయినా న్యాయశాస్త్రంలో మీరేమీ డాక్టరేట్ చేయలేదు కదా.. మీకున్న ప్రతిభకు సాల్వే, లూథ్రా లాంటి సీనియర్ లాయర్లకు ఏం సూచనలు చేస్తారు? రాజమండ్రిలో కుటుంబాన్ని వదిలేసి ఢిల్లీ హోటళ్లలో ఉంటూ వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టేకంటే.. పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండడం మిమ్మల్ని నాయకుడిగా నిలిపేది కదా. పైగా నన్ను అరెస్ట్ చేసే అవకాశముంది కాబట్టి ఏపీ నుంచి ఢిల్లీ వచ్చానని నిజాయతీగా చెబితే సగటు తెలుగు ప్రజలకు కనీసం సానుభూతి అయినా వచ్చేది కదా. ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్సయ్యారు? -
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల దుర్మరణం
సాక్షి, పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినుకొండ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. పసుపులేరు బ్రిడ్జిపై లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలవ్వగా అసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషయంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారంతా వినుకొండ నియోజకవర్గంలోని చుట్టుపక్కల గ్రామాల వారుగా గుర్తించారు. మద్యం సేవించి కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. ఏకకాలంలో 15 చోట్ల దాడులు -
Oct 2nd 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu In Rajamaundry Central Prison, Cases Scams And Ground updates 07:59PM ►మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్ ►సీఎం జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారు ►బండారు వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా ఆరండల్ పేట్, నగర పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.. ►400/2023, 41 (A), 41(B),153, 294, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు. ►బండారుకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు గుంటూరు నుండి వచ్చిన పోలీసులు ►చాలా సేపు నోటీసులు తీసుకోకుండా తలుపు గడియ పెట్టుకున్న బండారు ►బండారును గుంటూరు తీసుకెళ్తున్న పోలీసులు 7:01PM ►టిడిపి నేత బండారు సత్యనారాయణ.. మంత్రి రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణ వైఎస్సార్సీపీ నాయకుల నిరసన ►పుత్తూరు పట్టణం అంబేద్కర్ సర్కిల్ నందు బండారి సత్యనారాయణ దిష్టిబొమ్మ దగ్ధం ►పెద్ద ఎత్తున నినాదాలతో బండారు సత్యనారాయణను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ ►బండారు సత్యనారాయణ దిష్టిబొమ్మను చెప్పులతో సన్మానించారు వైసీపీ మహిళా నేతలు ►గాంధీ జయంతి సందర్భంగా పుత్తూరు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లతో నివాళులు 6:33PM ►మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పై మరో కేసు నమోదు ►అరండల్‌పేట పీఎస్ లో 153A , 294, 504, 505 ఐపీసీ, సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద కేసు ►బండారుకు 41బి, 41ఏ కింద నోటీసులివ్వనున్న పోలీసులు ►బండారు సత్యనారాయణ నివాసానికి చేరుకున్న గుంటూరు పోలీసులు ►తలుపులు వేసుకుని పోలీసులకు సహకరించని బండారు సత్యనారాయణ 5:54 PM, అక్టోబర్ 02, 2023 అనకాపల్లిలో బండారు ఇంటి వద్ద ఉద్రిక్తత ► పోలీసులను అడ్డుకునేందుకు భారీగా కార్యకర్తలను తరలించిన టిడిపి నేతలు ► నోటీసులు ఇచ్చేందుకు లోపలికి వెళ్లాలనుకున్న పోలీసులను అడ్డగించిన టిడిపి నేతలు 5:50 PM, అక్టోబర్ 02, 2023 త్వరలో భువనేశ్వరి ఓదార్పు యాత్ర ► ప్రజల కోసం మా నాన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు ► మా కుటుంబ సభ్యులు నలుగురూ.. నాలుగు దిక్కులు అయిపోయాం ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత 105 మంది హఠాన్మరణం పాలయ్యారు ► చంద్రబాబును బాగా అభిమానించే వారంతా ప్రాణాలు కోల్పోయారు ► మరణించిన 105 కుటుంబాలను నేను త్వరలోనే పరామర్శిస్తాను 3:50PM, అక్టోబర్ 02, 2023 భువనేశ్వరిపై లక్ష్మీ పార్వతి ధ్వజం ►ఇన్నేళ్లకు భువనేశ్వరికి తండ్రి గుర్తుకురావడం ఆశ్చర్య మేస్తోంది ►భువనేశ్వరి నీకు నిజంగా తండ్రి,తల్లి మీద గౌరవం ఉంటే నీ భర్త లక్షల కోట్ల అవినీతి బయటపెట్టు ►నీతండి, నీ తల్లి నిజంగా పుణ్యదంపతులు ►ఆ పుణ్యదంపతుల కడుపున పనికిమాలిన సంతానం పుట్టారు ►నువ్వు,నీ అక్క దోపిడీవర్గానికి చెందిన పచ్చి అవకాశవాదులు ►లక్షల కోట్లు నీ భర్త స్వయంగా సంపాదించాడా? ►నిజాయితీపరుడైన నీ తండ్రికి సేవ చేసిన నేను అదృష్టవంతురాలిని ►ఇద్దరు అవినీతి అనకొండలకు కొమ్ముకాయడానికి బస్సు యాత్ర మొదలు పెట్టావా? ►బస్సుయాత్ర ద్వారా ఏం చెప్తావ్ నువ్వు ? ►నీ భర్త,కొడుకు మీద చూపించిన జాలి...నీ తండ్రి పై చూపించి ఉంటే ఆయన ఎంతో సంతోషపడేవారు 1:35 PM, అక్టోబర్ 02, 2023 రేపు, ఎల్లుండి సుప్రీంకోర్టు ముందుకు ఓటుకు కోట్లు కేసు ► ఢిల్లీ: రేపు సుప్రీంకోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ ► నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ కు డబ్బులిస్తూ పట్టుబడిన కేసు ► రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేయనున్న సుప్రీంకోర్టు ► విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ► ఐటెం నెం.42 గా లిస్ట్ అయిన కేసు ► లంచం ఇచ్చాం కానీ, కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని, కేసు కొట్టేయాలని అంటున్న రేవంత్ రెడ్డి ► ఈ కేసులో ప్రాథమిక సాక్షాధారాలు ఉన్నాయని, అన్ని విషయాలు ట్రయల్ కోర్టుకు ఇచ్చామంటున్న తెలంగాణ ప్రభుత్వం ► అక్టోబర్ 4న ఇదే కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ► మన వాళ్లు బ్రీఫ్డ్ మీ అన్న వాయిస్ చంద్రబాబుదేనని ఇప్పటికే నిర్దారించిన ఫోరెన్సిక్ లాబ్ 1:30 PM, అక్టోబర్ 02, 2023 ఎట్టకేలకు బాబు జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు : సజ్జల ► ఒక అవినీతిపరుడు అడ్డంగా బుక్కయ్యాడు : సజ్జల ► ఆధారాలు ఉన్నాయి కాబట్టే కోర్టు విశ్వసించి జైలుకు పంపింది ► అటువంటి వ్యక్తికి కొందరు జోకర్లు మద్దతిస్తున్నారు ► దీక్షలు చేయడం బరితెగింపు ► జగన్ తనకు తానే పరీక్ష పెట్టుకున్నారు ► తన పాలనలో మేలు జరిగితేనే మద్దతివ్వాలని జగన్ ధైర్యంగా చెబుతున్నారు ► మా చేతుల్లో అధికారాలు లేవు... జగన్ ప్రజలకు ఇచ్చేశారు ► గ్రామ/వార్డు సచివాలయాల్లో పాలన ఎలా సాగుతుందో చూస్తున్నాం ► జగనన్న సురక్ష ద్వారా 90 లక్షల సర్టిఫికెట్లు, సేవలు అందాయి ► ఇప్పుడు జగనన్న సురక్షా క్యాంపెయిన్ జరుగుతోంది ► ఇవన్నీ గ్రామ/వార్డు సచివాలయాల వల్లే సాధ్యమవుతోంది 1:25 PM, అక్టోబర్ 02, 2023 తెలుగుదేశంలో తీవ్ర అంతర్మథనం ► ఇటీవల వరుసగా జరుగుతున్న టిడిపి భేటీల్లో పార్టీ దుస్థితిపై చర్చ ► టిడిపి సీనియర్ నేత సమాచారం ప్రకారం కార్యకర్తల్లో సడలిన విశ్వాసం ► పవన్‌కళ్యాణ్ తప్ప చంద్రబాబుకు ఇంకో దిక్కు లేదా? ► చంద్రబాబు తర్వాత తెలుగుదేశంలో మరో పెద్ద తలకాయ లేదా? ► ఇప్పటికిప్పుడు ఇంత అర్జంటుగా జైల్లో పొత్తు పెట్టుకోవాలా? ► జనసేన మద్ధతు లేకపోతే మనం ఏమి చేయలేమా? ► ఎల్లో మీడియాలో ఎందుకు బ్రాహ్మణి జపం చేస్తున్నారు? ► ఇన్నాళ్లు నాయకుడని చెప్పిన లోకేష్‌ను ఎందుకు వెనక్కి నెడుతున్నారు? ► ఎన్నికలకు ఏడు నెలల ముందు ఇంత గందరగోళమా? ► ఒక్క అరెస్ట్‌కే అతలాకుతులం కావాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? ► జాతీయ స్థాయిలో రెండు కూటములు ఎందుకు దూరం పెడుతున్నాయి? ► కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదు? ► నాడు మోదీని నానా మాటలు ఎందుకు అనాలి? ఇప్పుడెందుకు కాళ్లు పట్టుకోవాలి? ► కనీసం కాంగ్రెస్ అధిష్టానం నుంచయినా బాబుకు అనుకూలంగా ఒక్క మాట రావట్లేదు? ► ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా చంద్రబాబు కాంగ్రెస్ మిత్రపక్షాలకు అనుకూలంగా ప్రచారం చేశారు కదా.? ► రాహుల్, సోనియా ఎందుకు బాబును మరిచిపోయారు? ఎందుకు మాట్లాడడం లేదు? ► మన స్థాయి రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులేనా.? 1:05 PM, అక్టోబర్ 02, 2023 సుప్రీంకోర్టులో రేపు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ► చంద్రబాబు పిటిషన్ మంగళవారం విచారించనున్న సుప్రీంకోర్టు ► జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముందుకు పిటిషన్ ► 6 వ నెంబర్ కోర్టులో జరగనున్న విచారణ ► Case No: SLP(Crl) No. 012289 - / 2023 Registered on 23-09-2023 ► Category : 1405-Criminal Matters : Matters relating to Prevention of Corruption Act ► స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదయిన కేసు కొట్టేయాలని చంద్రబాబు పిటిషన్ ► తమ వాదన విన్న తర్వాతే కేసులో నిర్ణయం తీసుకోవాలంటూ ఇంప్లీడ్ అయిన ఏపీ ప్రభుత్వం ► ఐటెం నెంబర్ 63గా లిస్ట్ అయిన చంద్రబాబు కేసు ► తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A వర్తిస్తుందని పిటిషన్ ► తనను అరెస్ట్ చేసిన విధానం తప్పని చంద్రబాబు లాయర్ల వాదన ► గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయడం అక్రమం అని పిటిషన్ లో వాదన 12:55 PM, అక్టోబర్ 02, 2023 పవన్ కళ్యాణ్ పై వెల్లంపల్లి విమర్శలు ► పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ ► రెండు చోట్లా ఓడిపోయిన పవన్‌కు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు ► పవన్‌కు 175 సీట్లలో అభ్యర్ధులను నిలబెట్టే దమ్ముందా? ► చంద్రబాబు, లోకేశ్‌లను తిట్టి మళ్లీ వారి పక్కనే చేరాడు ► అవినీతికి పాల్పడి లోనికెళ్లిన చంద్రబాబుతో జైల్లో పొత్తు పెట్టుకున్నారు ► పవన్ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి : వెల్లంపల్లి 12:50 PM, అక్టోబర్ 02, 2023 పార్ట్ నర్ కోసం పవన్ కళ్యాణ్ దీక్ష మచిలీపట్నం సువర్ణ కల్యాణ మండపంలో పవన్‌కల్యాణ్ దీక్ష తెలుగుదేశం కోసం పవన్‌తో పాటు సంఘీభావంగా జనసేన నేతలు అర్జంటుగా చంద్రబాబును విడిచిపెట్టాలన్న డిమాండ్ తో దీక్ష అవినీతి వ్యతిరేక పార్టీ అని చెప్పిన పవన్ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం పదవి కోసం తన పొత్తుదారుడు చంద్రబాబు కోసం ఎజెండా విషయంలో రాజీ 12:45 PM, అక్టోబర్ 02, 2023 మార్పు ముందు బాబు ఇంటి నుంచి రావాలి : పోసాని కృష్ణ మురళి ► నారా కుటుంబం ఎన్నాళ్లు శాసిస్తుంది? : పోసాని కృష్ణ మురళి ► భారతదేశానికి ఒకరే గాంధీ... కానీ ఏపీకి మాత్రం ఇద్దరు గాంధీలు ► ఒకరు చంద్రబాబు, లోకేష్, వారింట్లో భర్తలను మించిన రాజకీయ నాయకురాలు భువనేశ్వరీ, బ్రాహ్మణి ► చంద్రబాబు, లోకేష్ నాశనం కావడానికి కారణమెవరు? ► చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి వెళ్ళేటప్పుడు భువనేశ్వరి ఎందుకు అడ్డుకోలేదు? ► నాన్న ఎన్టీఆర్‌ను చెప్పుతో కొట్టినా.. భువనేశ్వరి ఎందుకు అడుగలేదు? ► అత్తా కోడళ్ళు ఇద్దరూ భర్తల కంటే పెద్ద రాజకీయ నాయకురాళ్లు ► పవన్ కళ్యాణ్ అమాయకుడు కాబట్టే మళ్ళీ టీడీపీకి మద్దతు ఇస్తున్నారు ► పవన్ కళ్యాణ్ ఎంత తిట్టినా టిడిపి పొత్తు పెట్టుకుంది కేవలం కాపు ఓట్ల కోసమే ► కాపులు ఎవరి మైకంలోకి వెళ్ళకండి... ఎవరు మంచి చేస్తే వాళ్ళను గెలిపించండి 12:30 PM, అక్టోబర్ 02, 2023 అనకాపల్లిలో టిడిపి నేతల దౌర్జన్యం ► అనకాపల్లిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇంటి వద్ద టిడిపి నేతల దౌర్జన్యం ► ఓ మహిళా కానిస్టేబుల్ ను నెట్టేసిన టిడిపి నేతలు ► అనుమతి లేదంటున్నా లోనికి వెళ్లేందుకు ప్రయత్నం ► అడ్డుకున్న పోలీసులపౌ దౌర్జన్యం ► టిడిపి నేతల తోపులాటలో కింద పడిపోయిన మహిళా కానిస్టేబుల్ 11:45AM, అక్టోబర్ 02, 2023 దీక్షకు టీడీపీ నేతల డుమ్మా.! ►గాంధీ జయంతి నాడు.. అవినీతి కేసులో అరెస్టైన చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ దీక్షలు ►ఇప్పటికే జనం ముక్కున వేలేసుకుంటున్న వైనం ►చంద్రబాబుకు సంఘీభావంగా చేపట్టిన దీక్షను లైట్ తీసుకుంటున్న టీడీపీ శ్రేణులూ ►ఇప్పటికే చాలా జిల్లాల్లో ఇన్‌ఛార్జి స్థాయి దాకా నేతల డుమ్మా ►కర్నూలు పత్తికొండ నియోజకవర్గం ఇంఛార్జి శ్యామ్ బాబు దూరం ►చాలాచోట్ల మొక్కుబడి నిరసనలు 11:37AM, అక్టోబర్ 02, 2023 దొంగ దీక్షలను ప్రజలు గమనించాలి : మంత్రి రోజా ►గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి చంద్రబాబు ►విద్యార్థుల సొమ్ము దోచుకున్న వ్యక్తి చంద్రబాబు ►చంద్రబాబు దీక్ష గాంధీజీని అవమానించడమే ►టీడీపీ నేతల దొంగ దీక్షలను ప్రజలు తరిమి కొట్టాలి ►చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో.. టీడీపీ సత్యాగ్రహ దీక్షలపై తిరుపతిలో మంత్రి ఆర్కే రోజా కామెంట్స్ 11:10AM, అక్టోబర్ 02, 2023 చంద్రబాబు కేసు.. ఐటెం నెంబర్ 63 గా లిస్ట్ ►రేపు సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు కేసు విచారణ ►కేసు విచారణ చేయనున్న జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ ►ఐటెం నెంబర్ 63 గా లిస్ట్ అయిన చంద్రబాబు కేసు ►తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు ►తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17a వర్తిస్తుందని పిటిషన్ ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం అక్రమం అని పిటిషన్లో వాదన 11:10AM, అక్టోబర్ 02, 2023 జైల్లో బాబు.. బయట భార్య.. ఢిల్లీలో కొడుకు ►చంద్రబాబు అరెస్ట్‌పై దీక్షలతో పరువు తీసుకుంటున్న టీడీపీ ►గాంధీ జయంతి నాడు.. సత్యమేవ జయతే పేరిట ఏడు గంటల దీక్ష ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు దీక్ష ►రాజమండ్రిలో సతీమణి నారా భువనేశ్వరి దీక్ష ►మరోవైపు ఢిల్లీలో తనయుడు నారా లోకేష్ దీక్ష ►చంద్రబాబు ఏం చేసి జైలుకు వెళ్లారని నిలదీస్తున్న జనం ►టీడీపీ శ్రేణుల నుంచే సరిగ్గా స్పందన దక్కని వైనం 10:39 AM అక్టోబర్ 02, 2023 టీడీపీ దీక్షపై మంత్రి అంబటి సెటైర్ ►జైల్లో పడ్డ అవినీతి పరుడు దీక్ష చేస్తుంటే మహాత్ముడి ఆత్మ క్షోభిస్తుంది!హే రామ్! జైల్లో పడ్డ అవినీతి పరుడు దీక్ష చేస్తుంటే మహాత్ముడి ఆత్మ క్షోభిస్తుంది!హే రామ్!@naralokesh @ncbn — Ambati Rambabu (@AmbatiRambabu) October 2, 2023 10:35AM, అక్టోబర్ 02, 2023 హే రామ్.. ►గాంధీ జయంతి నాడు టీడీపీ కొత్త డ్రామా ►అవినీతి కేసులో అరెస్ట్ అయితే.. సత్యాగ్రహ దీక్షలా! ►టీడీపీ దీక్షలతో గాంధీ ఆత్మ ఘోషిస్తోందంటున్న జనం ►టీడీపీ నిరసనలపై విస్తుపోతున్న జనం ►ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్‌పై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీడీపీ ►మోత మోగిద్దాం కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువు ►ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా టీడీపీ దక్కని సానుభూతి 10:15AM, అక్టోబర్ 02, 2023 IRR కేసులో నారాయణకు మళ్లీ నోటీసులు ►ఇన్నర్ రింగ్‌రోడ్ స్కామ్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు మరోసారి నోటీసులు ►ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో ఏ2గా ఉన్న నారాయణ ► బెయిల్‌పై బయట ఉన్న నారాయణ ► మరోసారి నోటీసులు పంపిన దర్యాప్తు సంస్థ ఏపీ సీఐడీ ► ఈనెల 4న విచారణకు హాజరుకావాలని నోటీసులు ► ఇదే స్కామ్‌లో అదే తేదీన టీడీపీ జాతీయ కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ విచారణ ► ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి మరీ లోకేష్‌కు నోటీసులు అందజేసిన ఏపీ సీఐడీ ►ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో ఏ14గా ఉన్న నారా లోకేష్ ► నారాయణ, లోకేష్‌లను కలిపి విచారించే అవకాశం 09:58AM, అక్టోబర్ 02, 2023 సుప్రీంకోర్టులో రేపే ఓటుకు కోట్లు కేసు విచారణ ►మళ్లీ తెరపైకి చంద్రబాబు నోటుకు ఓటు కేసు ►సుప్రీం కోర్టు లో అక్టోబర్ 3న రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ►రేవంత్ పిటిషన్‌ను విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ►ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని, కేసు కొట్టేయాలని అంటున్న రేవంత్ రెడ్డి ►ఈ కేసులో ప్రాథమిక సాక్షాధారాలు ఉన్నాయని, అన్ని విషయాలు ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని అంటున్న తెలంగాణ ప్రభుత్వం ►సుప్రీంకోర్టు ఏం చెప్తుందనే దానిపై ఉత్కంఠ ►మరోవైపు.. అక్టోబర్ 4న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ►ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్ర పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ ►విచారణ చేయనున్న జస్టిస్ సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం 09:20AM, అక్టోబర్ 02, 2023 రాజకీయాల్లోకి రావడం ఆమె ఇష్టం: నారా లోకేష్ ►జైల్లో చంద్రబాబు గారిని చూసి షేక్ అయ్యాను ►చంద్రబాబు అరెస్ట్‌లో ఇతరుల హస్తంపై ఏం మాట్లాడలేను ►అరెస్ట్‌పై సిగ్గుపడడం లేదు ►ఇది రాజకీయాల్లో భాగమని భావించడంలేదు ►రాజకీయాల్లోకి రావడం బ్రహ్మాణి ఇష్టం ►తెలుగుదేశం పార్టీ ఏనుగు లాంటింది ►గల్లా ఇంట్లో ఆదివారం రాత్రి ఢిల్లీలో విలేకర్లుతో నారా లోకేష్ ►స్కామ్‌లపై మాత్రం దాటవేత సమాధానాలు 9:00 AM, అక్టోబర్ 02, 2023 దయనీయ స్థితిలో టీడీపీ: ఎంపీ విజయసాయిరెడ్డి ► అధినాయకుడు కరప్షన్ కేసులో జైలుపాలైనా పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోకపోవడం టీడీపీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. ► త్వరలోనే ఆ పార్టీ రెండు మూడు ముక్కలుగా చీలిపోవచ్చు. ► 40 ఏళ్లుగా పార్టీకి మద్ధతిస్తున్న ‘బలమైన’ వ్యాపార వర్గంలో కూడా పునరాలోచన మొదలైంది. ► ఆయన దోపిడీలను తామెందుకు సమర్థించాలన్న ఆలోచనలో పడ్డారు. అధినాయకుడు కరప్షన్ కేసులో జైలుపాలైనా పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోకపోవడం టీడీపీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. త్వరలోనే ఆ పార్టీ రెండు మూడు ముక్కలుగా చీలిపోవచ్చు. 40 ఏళ్లుగా పార్టీకి మద్ధతిస్తున్న ‘బలమైన’ వ్యాపార వర్గంలో కూడా పునరాలోచన మొదలైంది. ఆయన దోపిడీలను తామెందుకు… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 2, 2023 08:56AM, అక్టోబర్ 02, 2023 జైలు జీవితానికి అలవాటు పడిన చంద్రబాబు ►ఉదయం న్యూస్ పేపర్ లతో కాలక్షేపము ► ఐదు చానెల్స్‌తో నిత్యం టీవీ చూస్తున్న బాబు ►రాజమండ్రి జైల్లో 23వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్న జైలు వర్గాలు ►వేడి నీళ్లు స్నానం ►ఎప్పటికప్పుడు ఇంటి నుంచి భోజనము ► కానీ, ఇవాళ జైల్లో ఒక్కరోజు దీక్ష 08:53 AM, అక్టోబర్ 02, 2023 నారావారికి ఓ న్యాయం, ఆంధ్రా వారికీ ఇంకో న్యాయ మా? ►సానుభూతి కోసం టీడీపీ నానా తంటాలు ►ఈ నెల 5 నుంచి బస్సు యాత్ర యోచనలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ►రేపు సుప్రీం కోర్టులో జరిగే పరిణామాల తర్వాత తుది నిర్ణయం ► అన్ని జిల్లా కేంద్రాల్లో పర్యటన చేసేలా రూట్‌మ్యాప్ ► కుప్పం నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టేలా టీడీపీ ప్లాన్ ► ఇప్పటి వరకూ ఏ సమస్యపై బయటకు రాని భువనేశ్వరి, బ్రహ్మణి భువనేశ్వరి, బ్రహ్మణిలకు YSRCP సూటి ప్రశ్నలు బషీర్ బాగ్ కాల్పుల్లో రైతులు చనిపోయినప్పుడు ఈ ఇద్దరూ ఎందుకు బయటకు రాలేదు? పుష్కర్ ఘాట్‌లో చంద్రబాబు కుటుంబం స్నానానికి వెళ్లినప్పుడు.. అమాయకులు 30 మంది చనిపోయినపుడు ఎందుకు రాలేదు? ఎరుపాడులో సామాన్యులు చనిపోయినపుడు ఎందుకు రాలేదు? ఇరుకు సందులో మీటింగ్ పెట్టి.. జనాల్ని బలిగొన్నప్పుడు ఎందుకు రాలేదు? సొంత పార్టీ వినోద్ కుమార్ జైన్ వేధింపులతో ఓ చిన్నపాప చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు? ►ఎపుడు.. ఎప్పుడూ.. అయ్యోపాపం అనలేదు. బయటకు వచ్చి విజిల్స్, హారన్లు కొట్టలేదు ఈ ఇద్దరూ. ► నారావారికి ఓ న్యాయం, ఆంధ్రా వారికి ఇంకో న్యాయమా? YSRCP challenge 08:41 AM, అక్టోబర్ 02, 2023 బాబు పై ఎన్ని కేసులు? ఎన్ని స్టే :పేర్ని నాని ►సిట్టింగ్ జడ్జితో నీ ఆస్తులపై విచారణకు సిద్ధమా స్టేBN ? ►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే తెచ్చుకున్నారు. ►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే. ►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. ►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే. ►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే. ►2003లో కన్నా లక్ష్మీనారాయణ పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే. ►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. ►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు వేశాడు. ►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ..దాంట్లోనూ స్టే ►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే ►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే ►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే ►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? 08:41 AM, అక్టోబర్ 02, 2023 బండారు నివాసం వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత ►Chandrababu కేసు తర్వాత మంత్రి రోజా పై బండారు నీచమైన వ్యాఖ్యలు ► డీజీపీ ఫిర్యాదు చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ► ఫిర్యాదు ఆధారంగా చర్యలకు ఉపక్రమించిన పోలీసులు ► విశాఖ వెన్నెల పాలంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటికి వెళ్లిన పోలీసులు ►ఇంట్లో నుంచి బయటికి రాని బండారు ►గడి పెట్టుకొని రాత్రి నుంచి ఇంట్లోనే ఉన్న బండారు ► సోమవారం ఉదయం బండారు నివాసం వద్ద ఉద్రిక్తత ► అయినా.. ఇంటి నుంచి బయటకు రాని బండారు సత్యనారాయణ మూర్తి ► ఇంటి ఆవరణలోనే వేచి చూస్తున్న పోలీసులు ► 41ఏ నోటీస్‌లు ఇస్తారా? లేదంటే స్టేషన్‌కు తీసుకెళ్తారా? ►బండారును కలిసి నోటీస్ ఇస్తామంటున్న పోలీసులు 08:12 AM, అక్టోబర్ 02, 2023 భువనేశ్వరి బస్సు యాత్ర! ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతల పడరాని పాట్లు ►చివరకు.. చంద్రబాబు భార్య భువనేశ్వరి బస్సు యాత్రకు సిద్ధం ►భువనేశ్వరిని బలవంతంగా ఒప్పించిన సీనియర్లు? ►ఈ వారంలోనే చేపట్టే అవకాశం ►ఈ నెల 5న కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభించే ప్రతిపాదన ►మేలుకో తెలుగోడా అనే పేరు ఖరారు! ►ఇలాగైనా ప్రజల అటెన్షన్ దక్కించుకోవాలని టీడీపీ నేతల తాపత్రయం ►కోర్టుల్లో వెలువడే ఉత్తర్వులకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం 07:29 AM, అక్టోబర్ 02, 2023 కోర్టుల్లో చంద్రబాబు, లోకేష్‌బాబు పిటిషన్ల అప్డేట్స్ ►నారా లోకేష్‌పై మూడు కేసులు, ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో నోటీసులు ►లోకేష్‌కు ఢిల్లీలో CID నోటీసులు, 4న విజయవాడ రావాలని సూచన ►స్కిల్ స్కాం కేసు : లోకేష్‌ను అరెస్ట్ చేసే విషయంలో అక్టోబర్ 4వరకు ఆగాలని హైకోర్టు సూచన ►హైకోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసు : లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ అక్టోబర్ 4కు వాయిదా ►హైకోర్టు : ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా ►హైకోర్టు : ఇన్నర్ రింగ్ రోడ్ IRR కేసులో A1 చంద్రబాబు బెయిల్‌పై వాదనలు ► IRR కేసులో రేపు అక్టోబర్ 3న హైకోర్టులో విచారణ ►హైకోర్టు : అంగళ్లు అల్లర్ల కేసులో బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ ►ACB కోర్టు : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు అక్టోబర్ 4కి వాయిదా ►ఉండవల్లి పిటిషన్‌కు బెంచ్ కేటాయించాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ►సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ఇంకా విచారణకు లిస్టింగ్‌కాని వైనం 06:57 AM, అక్టోబర్ 02, 2023 జైల్లో చంద్రబాబు.. బయట భువనేశ్వరి ►గాంధీ జయంతి సందర్భంగా సెంట్రల్ జైల్లో నేడు చంద్రబాబు ఒక్కరోజు నిరసన ► స్కిల్ డెవలప్మెంట్ స్కాంతో పాటు పలు కుంభకోణాల్లో చంద్రబాబుపై అభియోగాలు ►మరోవైపు రాజమండ్రి క్వారీ మార్కెట్ ప్రాంతంలో బాబు సతీమణి భువనేశ్వరి నిరసన ► ‘సత్యమేవ జయతే’ పేరుతో భువనేశ్వరి దీక్ష ►రాజమండ్రి లోకేశ్ శిబిరంలో ఇప్పటికే భువనేశ్వరి బస 06:45 AM, అక్టోబర్ 02, 2023 టీడీపీ నేత బండారు అరెస్ట్‌కి రంగం సిద్ధం ►విశాఖ వెన్నెల పాలంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి వెళ్లిన పోలీసులు ►కాసేపట్లో అరెస్టు చేసే అవకాశం ►మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారు ►బండారు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన విమర్శలు ►బండారు సత్యనారాయణ పై డీజీపీకి ఫిర్యాదు చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ►బండారుని అరెస్టు చేయాలని లేఖలో పేర్కొన్న వాసిరెడ్డి పద్మ.. 06:33 AM, అక్టోబర్ 02, 2023 ఇది టీడీపీకి అంతమే: YSRCP ►మేం వద్దు… మా ఓట్లు కావాలా? ► మాజీ మంత్రి నారాయణకు చేదు అనుభవం ►నెల్లూరు పర్యటనలో అవకాశవాద రాజకీయాన్ని ప్రశ్నించిన మూలపేట ప్రజలు ►మొహం చాటేసి పారిపోయిన వైనం ► ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్‌లో నిందితుడిగా ఉన్న నారాయణ.. బెయిల్ మీద బయట ఉన్న సంగతి తెలిసిందే. మేం వద్దు… మా ఓట్లు కావాలా? “టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ అవకాశవాద రాజకీయాన్ని నిలదీసిన నెల్లూరు ప్రజలు” మూలపేట పర్యటనకు వెళ్లిన ఆయన్ను ‘చాన్నాళ్లకు వచ్చారు, కరోనా టైములో మేం ఎన్నో అవస్థలు పడ్డాం కానీ మీరు ఇటు రానే లేదు. మళ్ళీ ఎప్పుడొస్తారో.. మా బాధలు వినే ఓపిక లేదా?’ అని… pic.twitter.com/MWTpptyQUp — YSR Congress Party (@YSRCParty) October 1, 2023 06:33 AM, అక్టోబర్ 02, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @23 ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ ► నంద్యాలలో సెప్టెంబర్ 09వ తేదీ పొద్దున అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ ► రిమాండ్ విధించి.. రెండుసార్లు పొడిగించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడీషియల్ రిమాండ్ మీద చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691 ► సీఐడీ రెండు రోజుల కస్టడీలో ఇంటరాగేషన్‌కు ఏమాత్రం సహకరించని వైనం ►మరో ఐదురోజులు కస్టడీకి కోరిన వైనం.. పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ► నేటితో (అక్టోబర్ 2)తో 23వ రోజుకు చేరిన చంద్రబాబు రిమాండ్ ► కోర్టు ఆదేశాల ప్రకారం.. చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు, ఇంటి భోజనం 06:30 AM, అక్టోబర్ 02, 2023 పవన్.. నీ కుల కామెంట్లేందో? ►పవన్ కుల స్టేట్మెంట్ల వైవిధ్యం ► కులం అంటే నచ్చదంటూనే.. సొంత కులస్తులే ఓడించారని గతంలో పవన్ కామెంట్లు ► కాపుల్లో ఐక్యత ఉంటే తాను భీమవరంలో గెలిచేవాడిని అంటూ వ్యాఖ్య ► గుర్తు చేసుకుంటున్న జనసైనికులు ► కుల ప్రస్తావనే నచ్చదు అని పదేపదే చెప్పే పవన్.. ప్రసంగాలు మాత్రం కులం చుట్టురానే! ►పవన్ స్టేట్మెంట్లపై ముక్కున వేలేసుకుంటున్న జన సైనికులు. కులం అంటే తనకు నచ్చదు అని చెప్పే @pawankalyan తనను సొంత కులస్తులే ఓడించారని గతంలో నిష్టూరమాడాడు. కాపుల్లో ఐక్యత ఉంటే తాను భీమవరంలో గెలిచేవాడిని అంటూ అతను గతంలో చేసిన కామెంట్లను యువత గుర్తు చేసుకుంటోంది. తనకు కుల ప్రస్తావనే నచ్చదు అని పదేపదే చెప్పే పవన్ ప్రసంగాలు యావత్తూ కులం… pic.twitter.com/nGLv1dNbRv — YSR Congress Party (@YSRCParty) October 1, 2023 -
October 1st, 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Updates.. 7:45 PM పవన్ వారాహి యాత్రకు అంబటి కౌంటర్ 1+1 = 2 గణితంలో... కొన్నిసార్లు రాజకీయాలలో 1+1 = 0 అవుతుందని ఫ్లాప్ అయిన అవనిగడ్డ "వరాహగళం" నిరూపించింది ! @PawanKalyan@JaiTDP @naralokesh @JanaSenaParty — Ambati Rambabu (@AmbatiRambabu) October 1, 2023 వారాహి యాత్ర +యువగళం = వరాహగళం @naralokesh @PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) October 1, 2023 7:30 PM లోకేష్, అచ్చెన్నాయుడు, యనమలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ప్రజాధనం దోచుకుని అడ్డంగా దొరికిన చంద్రబాబు గారు అరెస్టయితే, సామాన్యులను డబ్బుకు ప్రలోభపెట్టి గుండు గీయించడం ఇంకా పెద్ద నేరం అవుతుంది. జుట్టు అనేది ఓ వ్యక్తి ఆత్మగౌరవానికి సంబంధించినది. అంతగా నిరసన తెలపాలనుకుంటే లోకేశ్, అచ్చెన్న, యనమలలాంటి ‘ఉద్ధండులు’ కేశ సమర్పణ చేసి యజమానిపై… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 1, 2023 5:40 PM ఆశలన్నీ అక్టోబర్ 3 మీదే.. ►అక్టోబర్ మూడో తేదీపై టీడీపీ కోటీ ఆశలు ►సుప్రీంకోర్టులో కేసు నెగ్గేందుకు దారులపై సీనియర్ నేతలతో సమాలోచనలు ► సాంకేతిక కారణాలు తప్ప బలమైన గ్రౌండ్ చంద్రబాబుకు ఈ కేసులో లేవంటున్న లాయర్లు ►గవర్నర్ అనుమతి తీసుకోలేదని బలంగా వాదించాలని సూచన 5:30 PM రంగంలోకి బీజేపీలోని టీడీపీ లీడర్లు.. ►జైలులో ఉన్న చంద్రబాబు కోసం రంగంలోకి బీజేపీలోని టీడీపీ లీడర్లు ►చంద్రబాబును రక్షించేందుకు ఏం చేయాలో సమాలోచనలు ►భువనేశ్వరి, బ్రాహ్మణిలను కలిసిన సీఎం రమేష్ ►రాజమండ్రిలో చంద్రబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రమేష్ ►బీజేపీ పెద్దలతో ఎలాగైనా అపాయింట్మెంట్ ఇప్పించాలని సూచన ►ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఆదేశాలు 2:30 PM శంషాబాద్‌లో టీటీడీపీ శ్రేణుల ఓవరాక్షన్.. ►శంషాబాద్ ఎయిర్ పోర్టులో టీటీడీపీ శ్రేణుల ఓవర్‌యాక్షన్ ►చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రధాని వచ్చే సమయంలో ఎయిర్ పోర్టులో నిరసన ►ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ప్రధాని మోదీ ►చంద్రబాబును ప్రధాని మోదీ కాపాడాలంటూ బ్యానర్ ప్రదర్శించిన మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ►చంద్రబాబు అరెస్టుపై ప్రధాని స్పందించాలని విజ్ఞప్తి 12:50PM ప్రగల్భాలు పలికేవాళ్లంతా ఆత్మావలోకనం చేసుకోండి: పేర్ని నాని ►చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే ఎన్ని కన్నీళ్ల ఉసురు ఇదీ.. నీడల్లే వెంటాడుతోందీ.. అనే పాట గుర్తొస్తోంది ►కాపులకు రిజర్వేషన్ అమలు చేస్తానని ఓట్లేయించుకుని తర్వాత మోసం చేశారు ►ముద్రగడ పద్మనాభం పిలుపుతో అప్పట్లో ఉద్యమం చేశారు ►కానీ నిన్నటి చంద్రబాబు ఉద్యమంలో అందరూ నవ్వుకుంటూ విజిల్స్ వేశారు ►అంటే చంద్రబాబు జైలుకు పోవటంపై ఆ పార్టీ వారికి కించిత్ కూడా బాధ లేదు ►చంద్రబాబు మీద అక్రమ కేసులు పెడితే కోర్టులు ఎందుకు జైలుకు పంపుతాయి? ►ప్రజాసొమ్ము కైంకర్యం చేయకపోతే కోర్టులు ఎందుకు వదిలేయలేదు? ►లంచాలు తిని కంచాలు మోగించటం చూస్తుంటే.. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్టుంది ►టీడీపీకి కోటిమంది సభ్యత్వం ఉన్నట్టు చెప్పుకునేవారు ►మరి నిన్న ఎంతమంది గంట కొట్టారు? ►అంటే వారందరు కూడా చంద్రబాబు అవినీతి చేసినట్టు అనుకుంటున్నారు ►ఇప్పటికైనా ప్రగల్భాలు పలికేవాళ్లంతా ఆత్మావలోకనం చేసుకోవాలి ►ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే జైల్లో వేస్తాం అని అప్పట్లో చంద్రబాబు అన్నారు 12:24PM చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ లూథ్రా ట్వీట్ నిర్వేదం ►ఇప్పటి వరకూ బాబు కేసులో లూథ్రాకు దొరకని బలమైన వాదం ►ఎంత సేపు సెక్షన్ 17a తప్ప మరో వాదన లేదు ►గవర్నర్ అనుమతి అడగలేదని అంటున్నారు, కాని తప్పు చేయలేదని లూథ్రా చెప్పలేకపోతున్నారు ►జడ్జిలు త్వరగా తీర్పులు ఇవ్వడం ముఖ్యమన్న లూథ్రా ►ఓ కేసు విషయాన్ని ప్రస్తావించిన సిద్ధార్ధ లూథ్రా Our Indian SC has in its judgement in Balaji Baliram Mupade [29.10.2020] written of the need for judicial discipline requires promptness in delivery of judgements https://t.co/etrm1sXw7s — Sidharth Luthra (@Luthra_Sidharth) October 1, 2023 11:50AM ►చంద్రబాబుకు పవన్ కొమ్ముకాయడం విడ్డూరం: ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ►చంద్రబాబు నాయుడుకి జైల్లో దోమలు కుడుతున్నాయి అనడం హాస్యాస్పదం ►ప్రజల సొమ్ము 375 కోట్లు స్వయానా చంద్రబాబు నాయుడు ఖాతాల్లోకి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో వెళ్ళాయన్న వాస్తవం సిఐడి స్పష్టం చేసింది ►దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మను అవమానించిన ,అన్నని అవమానపాలు చేసిన చంద్రబాబు కోమ్ము కాయటం విడ్డూరం ►చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రోజు ఎన్టీఆర్ దంపతులు స్వర్గంలో ఆనంద భాష్పాలు రాల్చుంటారు. 10:45AM జైలు జీవితానికి అలవాటు పడిన చంద్రబాబు ►ఉదయం న్యూస్ పేపర్ లతో కాలక్షేపము ►5 చానెల్ తో regular గా tv చూస్తున్న బాబు ►రాజమండ్రి జైల్లో 22వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్న జైలు వర్గాలు ►ఎప్పటికప్పుడు ఇంటి నుంచి బోజనము ►వేడి నీళ్లు స్నానం ►ప్రతీ వారం ములాఖత్ 10:31AM సానుభూతి కోసం టిడిపి అష్ట కష్టాలు ►ఏపీ వ్యాప్తంగా నారా భువనేశ్వరి బస్సు యాత్ర? ►ఈ నెల మొదటి వారంలో ప్రారంభిస్తారని సమాచారం ►అన్ని జిల్లాలను కవర్ చేసేలా భువనేశ్వరి బస్సు యాత్ర ►టీడీపీ శ్రేణుల్లో మనోధైర్యం నింపేలా భువనేశ్వరి యాత్ర 9:24AM విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం పీల్చే దుర్మార్గుడు నారాయణ: ఎమ్మెల్యే అనిల్ ►సీఐడీ తనను కూడా అరెస్ట్ చేయబోతోందని మాజీ మంత్రి నారాయణ కి తెలుసు. ►చంద్రబాబు, నారాయణ విచారణకు సహజరించకుడదని మాట్లాడుకునేందుకు జైలులో బాబుకు కలిసారు ►స్టూడెంట్స్ తల్లిదండ్రుల రక్తం పీల్చుకునే దుర్మార్గుడు నారాయణ ►రూ. 800 కోట్ల విలువ చేసే పేదల భూములను కొట్టేసిన నువ్వు సత్య హరిచంద్రుడి వా..? ►నారాయణ, చంద్రబాబు చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు.. ►టిడిపి నేతలు గంటలు కొట్టడం దేవుడి స్క్రిప్ట్.. ముద్రగడ కి చేసిన అన్యాయం గుర్తు వచ్చింది ►చంద్రబాబు చేసిన ద్రోహం టిడిపి నేతలకు కూడా కనిపిస్తుంది ►రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే మనస్ఫూర్తిగా బాధపడుతూ ఉన్నారు. ►ముద్రగడను , ఆయన కుటుంబ సభ్యులను చిత్ర హింసలు పెట్టి. ఇబ్బందులు పెట్టిన విషయం టిడిపి నేతలకు గుర్తు లేదా..? ►లోకేష్ ఒక పులికేశి.. ఢిల్లీలో లాయర్స్ తో మాట్లాడుతూ ఉన్నాడని టిడిపి నేతలు బిల్డప్ ఇస్తున్నారు ►సీఐడీ అధికారులకు దొరక్కుండా లోకేష్ దొంగలగా తప్పించుకుని తిరుగుతూ ఉంటే.. నిన్న అధికారులు పట్టుకుని నోటీస్ లు ఇచ్చారు.. 9.05AM పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై నారా లోకేశ్ ట్వీట్ ►4వ విడత వారాహి యాత్ర సక్సెస్ కావాలి.. జనసేనకు జైకొట్టాలి ►అవనిగడ్డలో జరగబోయే వారాహి యాత్ర బహిరంగ సభ విజయవంతం చేసేందుకు జనసేనతో కలిసి నడవాలని టీడీపీ శ్రేణులను కోరుతున్నా రేపటి నుంచి ప్రారంభం అయ్యే జనసేన అధ్యక్షుడు @PawanKalyan గారి నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. అవనిగడ్డలో జరగబోయే వారాహి బహిరంగ సభకి సైకో జగన్ సర్కార్ అడ్డంకులు కల్పించే అవకాశాలు ఉన్నాయి. వారాహి యాత్ర విజయవంతం చేసేందుకు తెలుగుదేశం శ్రేణులు జనసేనతో… — Lokesh Nara (@naralokesh) September 30, 2023 8:29AM తిరుమలలో టీడీపీ పచ్చ రాజకీయాలు. ►ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్ ►స్కామ్ లో అరెస్టయిన చంద్రబాబుకు మద్దతు అంటూ నిరసనలు ►టీడీపీ జెండాలతో శ్రీవారి ఆలయం వద్ద రాజకీయం ►తిరుమలలో స్టీల్ గ్లాసులతో చప్పుడు చేస్తూ వీడియో రికార్డింగ్ ►సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేందుకు ప్రయత్నం ►టీడీపీ తీరుపై మండిపడుతున్న హైందవ సంఘాలు, భక్తులు ►టీడీపీకి గుణపాఠం చెప్తామంటున్న శ్రీవారి భక్తులు 7:50AM చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై 3న సుప్రీంకోర్టులో విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీం కోర్టులో క్రిమినల్ ఎస్ఎల్పీ దాఖలు ►3వ తేదీన విచారణ చేపట్టనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ►ఈ ధర్మాసనం ముందు ఆఖరి ఐటెం నంబర్ 63గా రిజిస్ట్రీ వెబ్సైట్లో పొందుపరిచారు ►గత విచారణ సందర్భంగా చంద్రబాబు పిటిషన్ విచారణకు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నిరాకరించిన విషయం విదితమే. ►దీంతో ఈ పిటిషన్ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చింది. 7:30AM 4న ఓటుకు కోట్లు కేసు విచారణ ►తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసును ఈ నెల 4న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు. ►తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ను ప్రలోభాలకు గురిచేసిన విషయం విదితమే. ►ఈ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయపోరాటం ►ఇందులో భాగంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు ►ఈ పిటిషన్‌ను 4వ తేదీ నవిచారణ చేపట్టనున్న జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బాబు మాజీ పీఎస్ ‘పెండ్యాల’ సస్పెన్షన్ ►మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు. ►ఈయన ప్రస్తుతం ప్రణాళికా శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ►స్కిల్ కుంభకోణం కేసుతో పాటు ఐటీ నోటీసుల్లో పెండ్యాల శ్రీనివాసరావు పేరు ఉంది. ►విచారణ నిమిత్తం సీఐడీ గతంలో ఆయనకు నోటీసులు కూడా జారీ ►అయితే, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు పారిపోయిన పెండ్యాల. ప్రభుత్వం అనుమతిలేకుండా అమెరికాకు వెళ్లడం సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించడం కిందకు వస్తుంది. ►మరోవైపు.. శ్రీనివాసరావు శుక్రవారంలోగా రాష్ట్రానికి తిరిగి రావాల్సిందిగా నోటీసు పంపిన ప్రభుత్వం. ►అయితే, ఆయన రాకపోవడంతో సర్వీసు నిబంధనల మేరకు ఆయనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 2న భువనేశ్వరి నిరాహారదీక్ష ►నంద్యాల: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అక్టోబర్ 2వ తేదీన ఆయన సతీమణి భువనేశ్వరి ఒక్క రోజు నిరాహారదీక్ష ►టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టీకరణ 7:00AM అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు ► అసైన్డ్ భూములు హస్తగతం చేసుకునేందుకు వెచ్చించిన నల్లధనం గుట్టు రట్టు ►నారా , నారాయణ నల్లధనం నెట్వర్క్ బట్టబయలు ►అమరావతిలోని బడుగు, బలహీనవర్గాల అసైన్డ్ రైతులను బెదిరించి భూములు కొట్టేశారు ►ఎన్‌స్పైర నుంచి ఆర్కే హౌసింగ్‌కు నిధుల బదిలీ.. అక్కడి నుంచి బినామీలకు నగదు ►అసైన్డ్ రైతుల భూముల లూటీ ►తమ బినామీలకే భూసమీకరణ ప్యాకేజీ స్థలాలు దక్కేలా వ్యూహం ►అవినీతి నెట్‌వర్క్‌ను బట్టబయలు చేసిన సిట్ దర్యాప్తు ►పచ్చగద్దల జాబితాలో గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా, రావెల తదితరులు ►ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీ వియ్యంకుడు కూడా ►రూ.16 కోట్లతో.. రూ. 816 కోట్లు కొట్టేసిన నారాయణ 6:40AM అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు ♦నారా చంద్రబాబునాయుడు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) ♦ నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ రావెల కిశోర్ బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ తెనాలి శ్రావణ్ కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) ♦ గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) ♦ మండల ఎస్.ఎస్.కోటేశ్వరరావు (రియల్టర్) ♦ మండల రాజేంద్ర (రియల్టర్) ♦ కేవీపీ అంజనీ కుమార్ (రియల్టర్) ♦ దేవినేని రమేశ్ (రియల్టర్) ♦ బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్ (రియల్టర్) ♦ హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) ♦ పొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) ♦ దోనేపూడి దుర్గా ప్రసాద్ (రియల్టర్) 6:35AM నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు ♦ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్మెంట్ స్కామ్‌లో 41ఏ కింద నారా లోకేష్‌కు నోటీసులు ♦ఈ కేసులో ఏ14గా లోకేశ్ ♦ఢిల్లీలో ఎంపీ జయదేవ్ ఇంట్లో అందజేసిన అధికారులు ♦4వ తేదీన తాడేపల్లి కార్యాలయంలో హాజరు కావాలి ♦హెరిటేజ్ ఫుడ్స్ బ్యాంకు ఖాతా, భూలావాదేవీల బోర్డు మినిట్స్ తేవాలి ♦విచారణకు సహకరించాలి.. నిబంధనలు పాటించకుంటే అరెస్టు తప్పదు ♦నోటీసుల్లో పేర్కొన్న దర్యాప్తు అధికారులు -
చంద్రబాబుకు మరో షాక్..
సాక్షి, అమరావతి: ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివరాల ప్రకార.. చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అతిక్రమించినందుకు శ్రీనివాస్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా, శ్రీనివాస్ ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నాడు. ఇక, స్కిల్ కుంభకోణం కేసు, ఐటీ నోటీసుల్లో శ్రీనివాస్ పేరు కీలకంగా ఉండటం గమనార్హం. శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు నిధులు చేరాయని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఇక, ప్రభుత్వ అనుమతి లేకుండా శ్రీనివాస్ అమెరికాకు పారిపోయారు. ఈ క్రమంలో శుక్రవారంలోగా తిరిగి రావాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా శ్రీనివాస్ వెనక్కి రాలేదు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌పై సస్పెన్షన్ విధించారు. మరోవైపు.. నారా లోకేష్ సన్నిహితుడు రాజేష్ కూడా దేశం నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: విశాఖ బీచ్‌కు కొట్టుకొచ్చిన అరుదైన పెట్టె.. చూసేందుకు ఎగబడ్డ జనం! -
పాపం పసిపాప ఏమైందో ?
ప్రకాశం: ఐదేళ్లు కూడా నిండని పసిపాప మనుబ్రోలు రమ్య అదృశ్యమైంది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మద్దులూరు గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రమ్య తన అక్కతో పాటు మద్దులూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వెళ్తోంది. బడి ఈడు వయస్సు లేకపోయినా తన అక్క ఐదో తరగతి చదువుతుంటే అక్కతో కలిసి రోజులాగే శుక్రవారం కూడా బడికి వెళ్లింది. సాయంత్రం ఇంటర్వెల్లో రమ్య ఇంటికి వెళ్తానంటే బడిలో ఉన్న టీచర్ పంపించాడు. రోడ్డు మీద వేరే పేరెంట్ వెళ్తుంటే ఆ పేరెంట్‌తో కలిసి రమ్య వెళ్లింది. కానీ పేరెంట్ ఇల్లు మధ్యలోనే ఉండటంతో అక్కడి నుంచి రమ్య ఒక్కతే వెళ్లినట్లు స్థానికులు చెబున్నారు. తీరా సాయంత్రం 4 గంటలకు బడి వదిలినప్పుడు రమ్య అక్క ఇంటికి రాగానే రమ్య ఏదని తల్లి కోటేశ్వరి అడగటంతో ఇంటర్వెల్లోనే ఇంటికొచ్చిందని అక్క చెప్పటంతో రమ్య అదృశ్యమైనట్లు తల్లి గుర్తించి తల్లిదండ్రుల ద్వారా గ్రామంలోని పరిసరాలను వెతికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒంగోలు రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, సింగరాయకొండ సీఐ రంగనాథ్, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, టంగుటూరు, కొండపి ఎస్సైలతో పాటు ఒంగోలు పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి మరో ముగ్గురు ఎస్సైలు కలిసి అదృశ్యమైన పాప ఆచూకీ కోసం మద్దులూరు గ్రామాన్ని జల్లెడ పట్టారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి పాఠశాల, బాత్రూములు, అనకర్లపూడి వైపు ఉన్న ఆక్వా పరిశ్రమలు, మూసీ నదివైపు స్థానిక గ్రామస్థులతో పాటు పోలీసులు పాప ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. అయినా రాత్రి 10 గంటల గడిచినా పాప ఆచూకీ లభించకపోవడంతో పాప తల్లి కోటేశ్వరి, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. పాప తండ్రి రామాంజనేయులు స్వస్థలం చీమకుర్తి మండలం ఇలపావులూరు అయితే డెలివరీ కోసం కోటేశ్వరి అమ్మగారి ఊరైన మద్దులూరు వచ్చింది. కోటేశ్వరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు. అదృశ్యమైన పాప రమ్య రెండో కుమార్తె. తండ్రి హైదరాబాద్‌లో బేల్దార్ పనులకని వెళ్లాడు. కోటేశ్వరి డెలివరీకని వచ్చి మద్దులూరులోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పాప ఆచూకీ తెలియాల్సి ఉందని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
భర్తతో కలిసి థాయ్‌లాండ్ టూర్‌కు వెళ్లాల్సి ఉండగా.. భార్య ఆత్మహత్య
ప్రకాశం: ఉరి వేసుకుని అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మంగపాటివారిపాలెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కొప్పోలు కళ్యాణి (38) వెల్లటూరు పంచాయతీలో అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త సురేష్ వ్యవసాయం చేస్తూనే ఓ ప్రైవేట్ మార్కెట్ కంపెనీలో ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. మార్కెట్ కంపెనీలో సురేష్ బాగా పనిచేయడంతో ఆ కంపెనీ వారు సురేష్ కుటుంబానికి అక్టోబర్ 1వ తేదీ థాయ్‌లాండ్ టూర్ ఏర్పాటు చేశారు. దీంతో సురేష్, కళ్యాణి థాయ్‌లాండ్ వెళ్లడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏమైందో ఏమోగానీ గురువారం రాత్రి అందరూ నిద్రించిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం నిద్రలేచిన భర్త సురేష్ గమనించి చుట్టుపక్కల వారి సాయంతో కిందికి దించి చూడగా అప్పటికే కళ్యాణి మృతి చెందింది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై దాసరి రాజారావు సంఘటన స్థలానికి చేరుకుని కళ్యాణి మృతదేహాన్ని పరిశీలించారు. ఆపై మృతిపై అనుమానాలున్నాయని, ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
Sep 30th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu And Nara Lokesh Bail Petition Hearings and Ground updates 07:20 PM, సెప్టెంబర్ 30, 2023 లోకేష్.. ఈ సంగతులు మరిచిపోయావా? : మంత్రి సురేష్ ► ఇన్నర్ రింగ్ రోడ్ కారణంగా ముగ్గురు లబ్ధిపొందారు: ఆదిమూలపు సురేష్ ► అమరావతి రింగ్‌రోడ్ 97 కి.మీ పరిధిలో 97 అష్టవంకర్లు తిప్పారు ► ఆప్షన్-1 కంటే రూ.350 కోట్లు అదనంగా ఖర్చయ్యే ఆప్షన్-2 ఎన్నుకున్నారు ► ముందుగానే భూములు కొనుక్కుని బాబు కుటుంబం హెరిటేజ్ సంస్థ, నారాయణ, లింగమనేని లబ్దిపొందారు ► క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబుకు లింగమనేని తన గెష్ట్ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చారు ► ఇన్నర్ రింగ్ రోడ్ అవకతవకలన్నీ నారా లోకేష్ కనుసన్నల్లోనే జరిగాయి ► హెరిటేజ్ లో డైరెక్టర్లుగా ఉన్న లోకేష్, బ్రాహ్మణి తమకు సంబంధం లేదని ఎలా చెప్తారు? ► 56 శాతం వాటాలు చంద్రబాబు కుటుంబానివే.!: ఆదిమూలపు సురేష్ 07:18 PM, సెప్టెంబర్ 30, 2023 విచారణకు విజయవాడకు వస్తాను : ఢిల్లీలో లోకేష్ ► CID వాళ్లు లవ్ లెటర్ ఇచ్చారు, వాళ్లకు కాఫీ, టీలు ఆఫర్ చేశాం ► వాయిదాలు అడగను, విజయవాడకు మంగళవారం వెళ్లి విచారణకు హజరవుతా ► ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు, నాపై అభియోగాలు మోపారు ► 9.6 ఎకరాలు అమరావతి కోర్ కాపిటల్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ► ప్లాంట్ పెడతామని హెరిటేజ్ అప్పుడు కొనుగోలు చేసింది ► హెరిటేజ్‌లో నేను షేర్ హోల్డర్‌ను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌ను ► నాపై మూడు కేసులున్నాయి, స్కిల్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ ► ఈ మూడు వేర్వేరు శాఖల కింద ఉన్నాయి తప్ప వాటికి నేను మంత్రిని కాను ► వాటికి సంబంధించిన ఫైళ్లను నేను చూడలేదు, వాటితో నాకు సంబంధం లేదు ► వాటిలో ఏం జరిగినా నాకు సంబంధం లేదు 06:58 PM, సెప్టెంబర్ 30, 2023 కదులుతున్న హెరిటేజ్ డొంక ► ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో వేగం పెంచిన CID ► రాజధాని పేరిట లింగమనేనితో క్విడ్ ప్రో కో నడిపిన చంద్రబాబు కుటుంబం & హెరిటేజ్ ► రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకుని భూములు కొన్న హెరిటేజ్ ► లింగమనేని నుంచి కరకట్ట గెస్ట్‌హౌజ్‌ను తీసుకున్న చంద్రబాబు కుటుంబం ► రూ.29 లక్షలు నగదు రూపంలో ఇచ్చానంటున్న భువనేశ్వరీ ► హెరిటేజ్‌తో ఏ ఏ లింకులు ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలన చేసిన CID ► ఢిల్లీలో ఇవ్వాళ నారా లోకేష్‌కు CID నోటీసులు ► హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వండి ► అమరావతిలో ఎక్కడెక్కడ భూములు కొన్నారు? లావాదేవీల వివరాలివ్వాలని సూచన ► హెరిటేజ్ బోర్డు సమావేశాల మినిట్స్‌తో కూడిన బుక్ సమర్పించాలని ఆదేశం ► మినిట్స్‌ను ఆధారంగా చేసుకుని జరిపిన బ్యాంకు లావాదేవీలేంటీ? ► చెల్లింపు వివరాలను పూర్తిగా అందించాలని నోటీసుల్లో పేర్కొన్న సిఐడి 06:30 PM, సెప్టెంబర్ 30, 2023 సుప్రీంకోర్టులో అక్టోబర్ 3న చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ► చంద్రబాబు పిటిషన్ మంగళవారం విచారించనున్న సుప్రీంకోర్టు ► జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముందుకు పిటిషన్ ► 6 వ నెంబర్ కోర్టులో జరగనున్న విచారణ ► Case No: SLP(Crl) No. 012289 - / 2023 Registered on 23-09-2023 ► Category : 1405-Criminal Matters : Matters relating to Prevention of Corruption Act 06:20 PM, సెప్టెంబర్ 30, 2023 నోటీసుల్లో లోకేష్‌కు CID ఏం చెప్పిందంటే.. 1. భవిష్యత్తులో ఎలాంటి నేరానికి పాల్పడకూడదు 2. ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లో తారుమారు చేయకూడదు 3. ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని.. బెదిరింపులు కాని ప్రలోభాలు కాని గురిచేయకూడదు 4. పిలిచినప్పుడు కోర్టు ముందు తప్పక హాజరు కావాలి 5. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరై అధికారులకు సహకరించాలి 6. వాస్తవాలను దాచిపెట్టకుండా వెల్లడించాలి 7. హెరిటెజ్ ఫుడ్స్ బ్యాంక్ అకౌంట్ల వివరాలను విచారణ అధికారులకు ఇవ్వాలి 8. భూముల కొనుగోలుకు సంబంధించి హెరిటేజ్ బోర్డ్ డైరెక్టర్ల మీటింగ్ మినిట్స్ ఇవ్వాలి 9. అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి లావాదేవీల వివరాలు విచారణకు హాజరయ్యే సమయంలో తీసుకురండి 10. నోటీసులు అందుకున్నాక విచారణకు రాకపోయినా, నిబంధనలను పాటించకోపోయినా సీఆర్పీసీ సెక్షన్ 41ఏ(3), (4) ప్రకారం మీ అరెస్టు తప్పదు 05:45 PM, సెప్టెంబర్ 30, 2023 ఢిల్లీలో లోకేష్‌కు నోటీసులు ► ఏ కేసులో నోటీసులు ఇస్తున్నారని ప్రశ్నించిన లోకేష్ ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నోటీసులు : సీఐడీ అధికారులు ► వాట్సాప్ లో కూడా నోటీసులు పంపారు కదా అన్న లోకేష్ ► 41A కింద నోటీసులు ఇచ్చామని వివరించిన సీఐడీ అధికారులు ► 41(3), 41(4) సెక్షన్ లోని విషయాలను అడిగిన లోకేష్ ► సెక్షన్ల గురించి లోకేష్ కు వివరించిన సీఐడీ అధికారులు ► నోటీసులు ఇచ్చే సమయంలో లోకేష్ తో పాటు కనకమేడల ► సాక్ష్యాధారాలను ట్యాంపర్ చేయను : లోకేష్ ► నోటీసులను క్షుణ్ణంగా చదువుకుంటాం : లోకేష్ 05:35 PM, సెప్టెంబర్ 30, 2023 గల్లా ఇంట్లో ఏం జరిగింది? ► గల్లా జయదేవ్ ఇంట్లో లోకేష్‌ను కలిసిన CID అధికారులు ► సీఐడీ అధికారులు మధుసూధన్ రావు, బాజీజోహాన్, జగత్ సింగ్ ► డ్రాయింగ్ రూంలో CID అధికారులకు లోకేష్ అభివాదం ► లోకేష్ : ఏం కేసు, రింగ్ రోడ్ కేసేనా? వాట్సాప్‌లో పంపించారు కదా.! ► CID అధికారులు : మేం ఢిల్లీలోనే ఉన్నాం, నేరుగా నోటీసులు సర్వ్ చేయాలని వచ్చాం ► లోకేష్ : సెక్షన్ల గురించి చదువుకుంటాను, మా లాయర్ కనకమేడల అన్నీ చెబుతారు 05:25 PM, సెప్టెంబర్ 30, 2023 ఔను.. లోకేష్‌కు నోటీసులిచ్చాం ► దాదాపు 20 నిమిషాల పాటు గల్లా జయదేవ్ ఇంట్లో CID అధికారులు ► గల్లా జయదేవ్ ఇంట్లో ఉన్న లోకేష్‌తో మాట్లాడిన CID అధికారులు ► అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విజయవాడ CID కార్యాలయానికి విచారణకు రావాలని సూచన ► కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీడియాతో మాట్లాడలేకపోతున్నామని తెలిపిన అధికారులు ► నోటీసులు తీసుకున్న లోకేష్, నోటీసులు అందినట్టు లిఖితపూర్వకంగా తెలిపిన లోకేష్ 05:15 PM, సెప్టెంబర్ 30, 2023 CID @ గల్లా జయదేవ్ గృహం ► గల్లా జయదేవ్ ఇంటి లోనికి వెళ్లిన CID అధికారులు ► అశోక్ రోడ్డులోని 50వ నెంబర్ గృహంలోనికి అనుమతితో వచ్చిన CID అధికారులు ► జయదేవ్‌తో మాట్లాడి లోపలికి వచ్చిన CID అధికారులు ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమ అలైన్మెంట్ కేసులో A14గా లోకేష్ ► నేరుగా నోటీసులు ఇస్తామని తెలిపిన CID అధికారులు ► లోకేష్ విజయవాడకు వచ్చి విచారణకు హాజరు కావాలని సూచించిన CID అధికారులు 05:10 PM, సెప్టెంబర్ 30, 2023 CID అధికారులను అడ్డుకున్న జయదేవ్ సిబ్బంది ► ఢిల్లీ అశోకా రోడ్డులోని ఎంపీ గల్లా జయదేవ్ ఆఫీస్ లో లోకేష్ ► గేటు వద్దే CID అధికారులను నిలిపివేసిన జయదేవ్ సిబ్బంది ► లోకేష్‌ను బయటకు వస్తే నోటీసులు ఇస్తామన్న CID అధికారులు ► బయటకు రావడానికి ఇష్టపడని లోకేష్ ► విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవద్దని సూచించిన CID అధికారులు ► CID అధికారులను లోనికి అనుమతించిన జయదేవ్ సిబ్బంది ► నోటీసులు తీసుకోవాలని లోకేష్‌కు సమాచారం ఇచ్చిన CID అధికారులు ► అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విజయవాడ CID కార్యాలయానికి విచారణకు రావాలని సూచన 05:00 PM, సెప్టెంబర్ 30, 2023 లోకేష్ ఇంట్లో లేడు, ఆఫీసులో ఉన్నాడు : గల్లా జయదేవ్ ► CID అధికారులతో మాట్లాడిన ఎంపీ గల్లా జయదేవ్ ► అశోక్ రోడ్డులోని తన కార్యాలయంలో లోకేష్ ఉన్నాడన్న ఎంపీ గల్లా జయదేవ్ ► అశోక్ రోడ్డులోని 50వ నెంబర్ గృహంలో ఉన్న జయదేవ్ కార్యాలయానికి వచ్చిన CID అధికారులు 04:50 PM, సెప్టెంబర్ 30, 2023 ఢిల్లీ : గల్లా జయదేవ్ ఇంటి వద్ద హైడ్రామా ► ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లిన AP CID అధికారులు ► జయదేవ్ ఇంట్లో లోకేష్ ఉన్నట్టు పక్కా సమాచారంతో వెళ్లిన CID అధికారులు ► ఇంటికి వచ్చిన పోలీసులను గేటు వద్దే నిలిపివేసిన గల్లా మనుష్యులు ► నారా లోకేష్ ఇంట్లో లేరని సీఐడీ అధికారులకు తెలిపిన గల్లా జయదేవ్ ► నోటీసులు ఇచ్చి వెళతామని చెప్పిన CID అధికారులు 04:40 PM, సెప్టెంబర్ 30, 2023 బండారు నోరు జారొద్దు.! ► టీడీపీ నేత బండారు సత్యనారాయణపై మహిళా కమిషన్ సీరియస్ ► మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణ ► టీడీపీ నేత బండారు వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న మహిళా కమిషన్ ► ఆంధ్రప్రదేశ్ డిజిపికి లేఖ రాసిన మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ► బండారు సత్యనారాయణను అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి ► మరోసారి నోరు జారకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన వాసిరెడ్డి పద్మ 04:30 PM, సెప్టెంబర్ 30, 2023 రంగంలోకి భువనేశ్వరీ.! ► చంద్రబాబు అరెస్ట్‌పై సానుభూతి రావట్లేదని గ్రహించిన టిడిపి నేతలు ► ఎలాగైనా భువనేశ్వరీని రంగంలోకి దించాలని నిర్ణయించిన టిడిపి నేతలు ► ఇప్పటికే రాజమండ్రి నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయిన భువనేశ్వరీ ► చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా దీక్ష చేసేందుకు భువనేశ్వరీని ఒప్పించిన టిడిపి నేతలు ► అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష 04:00 PM, సెప్టెంబర్ 30, 2023 భువనేశ్వరీ లావాదేవీల సంగతేంటీ? ► కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్‌హౌజ్‌లో అద్దెకు మాత్రమే ఉన్నామన్న చంద్రబాబు, భువనేశ్వరీ ► అద్దె ఎందుకు కట్టలేదని దర్యాప్తు సంస్థల ప్రశ్న ► కరకట్టపై ఉన్న లింగమనేని ఇంట్లో చంద్రబాబు అద్దెకు ఉన్నారు అంతే ► కానీ.. ఆ ఇంటికి ఆయన అద్దె డబ్బు చెల్లించలేదు, ఆ అద్దె కట్టింది నేనే అన్న చంద్రబాబు భార్య భువనేశ్వరీ ► అద్దెను నగదు రూపంలో చెల్లించానంటున్న భువనేశ్వరీ ► జూన్ 2019లో ఏకంగా రూ.27 లక్షల రుపాయల నగదును లింగమనేనికి చెల్లించానంటున్న భువనేశ్వరీ ► రూ.27లక్షల రుపాయల నగదు చెల్లించడంలో పారదర్శకత ఉందా? ► నిజంగా రూ.27లక్షల రుపాయల నగదు చెల్లించి ఉంటే లింగమనేని IT రిటర్నులలో ఎందుకు పేర్కొనలేదు? ► పోనీ.. భువనేశ్వరీ IT రిటర్నులలోనైనా ఎందుకు రూ.27లక్షల రుపాయల నగదు చెల్లించినట్టు తెలపలేదు? ► భువనేశ్వరీకి, లింగమనేనికి మధ్య ఎన్ని లావాదేవీలు జరిగాయి? ► అందులో వైట్ మనీ ఎంత? బ్లాక్ మనీ ఎంత? 03:10 PM, సెప్టెంబర్ 30, 2023 ఢిల్లీలో బయటికొచ్చిన లోకేష్ ► ఢిల్లీ: నిన్నటి నుంచి కనిపించకుండా ఉన్న లోకేష్ ► మధ్యాహ్నం 3గంటలకు గల్లా జయదేవ్ నివాసానికి చేరుకున్న లోకేష్ ► లోకేష్ తో పాటు టిడిపి ఎంపీ రవీంద్ర కుమార్ ► లోకేష్‌కు 41A నోటీసులు ఇవ్వనున్న CID అధికారులు ► లోకేష్ బయటకు రావడానికి ముందు భారీగా మంతనాలు ► CIDకి సమాచారం ఇవ్వడమే మంచిదని సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు సూచించినట్టు సమాచారం ► దేశం విడిచిపోవడం వల్ల తప్పుడు సంకేతాలిచ్చినట్టు అవుతుందని సూచించినట్టు సమాచారం ► అరెస్ట్ భయంతో ఢిల్లీలో ఉండడం వల్ల కేడర్ నిరుత్సాహానికి గురవుతుందని చెప్పిన పార్టీ నేతలు ► తండ్రి అరెస్టయిడే ప్రజల్లో ఉండి ఆందోళన చేయాలి కానీ.. మీ అరెస్ట్ గురించి ఆలోచిస్తే ఎలా అన్న నేతలు ► బింకం వీడి గల్లా జయదేవ్ ఇంటికొచ్చిన లోకేష్ ► నోటీసు అందుకోగానే పలువురు సీనియర్ లాయర్లతో మాట్లాడేందుకు సన్నాహాలు 02:35 PM, సెప్టెంబర్ 30, 2023 ఆలోచించుకోవాల్సిందే TDP, జనసేనే : CPI ► BJPతో జనసేన పొత్తులో ఉంది ► జనసేనతో TDP పొత్తులో ఉంది ► TDP, జనసేన కూడా ఒకసారి ఆలోచించాలి ► వాళ్లు BJP తో తెంచుకుని వస్తే మేం స్వాగతిస్తాం ► దేశం, రాష్ట్రం బాగుపడాలంటే TDP, జనసేన పార్టీలు బీజేపీ నుంచి బయటకు రావాలి : CPI రామకృష్ణ 02:15 PM, సెప్టెంబర్ 30, 2023 పవన్‌కళ్యాణ్‌కు జై కొట్టాలని యాక్షన్ కమిటీలో TDP నిర్ణయం ► పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం : అచ్చెన్న ► రేపటి నుంచి కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగే వారాహి యాత్రలో తెలుగుదేశం కార్యకర్తలంతా పాల్గొనాలి ► చంద్రబాబును బాగా అభిమానించే వారిలో దాదాపు 97 మంది ఇప్పటివరకు చనిపోయారు ► త్వరలోనే చనిపోయిన వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెబుతాం ► అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున భువనేశ్వరి నిరాహారదీక్ష చేస్తారు ► అక్టోబర్ 2 రాత్రి 7 నుంచి 7.05 వరకు ప్రతి ఇంట్లో లైట్లన్నీ ఆపేసి నిరసన తెలపాలి ► లైట్లు ఆపి వరండాలోకి వచ్చి కొవ్వొత్తులతో నిరసన తెలపాలని కోరుతున్నా ► రేపటినుంచి 4 రోజులు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో పవన్ పర్యటిస్తారు ► పవన్ పర్యటనలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని సంపూర్ణ సహకారం ఇవ్వాలని నిర్ణయించాం 02:00 PM, సెప్టెంబర్ 30, 2023 కోర్టు సాక్షిగా బయటపడుతున్న తండ్రీకొడుకుల డొల్లతనం ► అసలు తప్పే చేయలేదు, మేం నిప్పు అని చెప్పుకున్న చంద్రబాబు, లోకేష్ ► కోర్టు ముందు వేసే పిటిషన్లు, వాదనలను పరిశీలిస్తే బయటపడుతోన్న డొల్లతనం ► రాజకీయ కక్షతో కేసులని చెబుతున్న వాళ్లు అదే విషయాన్ని కోర్టు ముందు చెప్పని వైనం ► మచ్చుకు ఒక రెండు ఉదాహరణలు పరిశీలిస్తే.. ఎక్కడా మేం తప్పు చేయలేదని చెప్పడం లేదు ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో ఒకసారి వాదనలు పరిశీలిస్తే.. ► లోకేష్ బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో దమ్మాలపాటి వాదనలు ► తండ్రితో కలిసి కరకట్ట ఇంట్లో నివాసం ఉన్నందుకు నాపై ఎలా కేసు పెడతారు? : లోకేష్ ► అంటే చంద్రబాబు తప్పు చేస్తే చంద్రబాబును పట్టుకోవాలి కానీ, లోకేష్‌పై ఎలా కేసు పెడతారా అన్నదేనా మీ వాదన ► ఇన్నర్ రింగ్‌రోడ్డు వ్యవహారంలో జోక్యం చేసుకోలేదని చెప్పిన లోకేష్ తండ్రి తరపున సంతకాలు ఎందుకు పెట్టారు? ► కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్‌హౌజ్‌ను క్విడ్‌ప్రోకో కింద తీసుకున్నారన్న అభియోగాలపై ► చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, దమ్మలపాటి వాదనలు ► కరకట్టపై ఉన్న లింగమనేని ఇంట్లో చంద్రబాబు అద్దెకు ఉన్నారు అంతే ► కానీ.. ఆ ఇంటికి ఆయన అద్దె డబ్బు చెల్లించలేదు, ఆ అద్దె కట్టింది చంద్రబాబు భార్య భువనేశ్వరీ ► భువనేశ్వరీ కట్టిన అద్దె లింగమనేని ఐటీ రిటర్నుల్లో ఎందుకు జమ కాలేదు? ► అసలు మీరు చెల్లించిన అద్దెను మీ ఐటీ రికార్డుల్లోనయినా చూపించారా? 01:25 PM, సెప్టెంబర్ 30, 2023 ఓవర్ టు ఢిల్లీ : లోకేష్ ఎక్కడ? ► లోకేష్ కోసం ఢిల్లీలో గాలిస్తోన్న AP CID ► 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చేందుకు గాలిస్తోన్న ఏపీ సీఐడీ అధికారులు ► నోటీసులు తీసుకోకుండా ఢిల్లీలో దాగుడు మూతలు ఆడుతున్న లోకేష్ ► స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్ కేసుల్లో ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్లు ► CIDతో పాటు మీడియా కంట్లో కూడా పడకుండా తిరుగుతున్న లోకేష్ ► ఇప్పటివరకు ఉన్న ఐటీసీ మౌర్య హోటల్లో రూమ్ ఖాళీ ► ఆఫీసు కోసం వినియోగించుకున్న జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌజ్ ఖాళీ ► లోకేష్ రెగ్యులర్‌గా వాడే కారును పక్కకు పెట్టిన టిడిపి ► సుప్రీంకోర్టు లాయర్లకు ఈ కేసు గురించి ఇంకేం చెబుతారు? ► లాయర్లతో మంతనాలు చేయడానికి లోకేష్ లా చదవలేదు కదా? ► పోనీ న్యాయశాస్త్రాన్ని ఔపోసన పట్టి సీనియర్ లాయర్లకే చెప్పే కేసు పాయింట్లు కూడా ఏమీ లేవు కదా? ► పైగా, ఎన్ని కేసులుంటే అంత మంచి పదవులు ఇస్తాను అని ప్రకటించారు కదా ► తన దాకా వస్తే కానీ లోకేష్‌కు అర్ధం కావడం లేదా? 01:10 PM, సెప్టెంబర్ 30, 2023 యాక్షన్ కమిటీలో TDP నేతలు ఏం చర్చించారు? ► నంద్యాలలో TDP పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం ► చంద్రబాబు నంద్యాలలో అరెస్ట్ అయ్యారు కాబట్టి అక్కడే సమావేశం జరిపిన టీడీపీ ► జూమ్ ద్వారా మాత్రమే హాజరవుతానని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీలో పాల్గొన్న నారా లోకేష్ ► హాజరైన అచ్చెన్న, బాలకృష్ణ, యనమల, ఇతర సభ్యులు ► టీడీపీ, జనసేన కోఆర్డినేషన్ కమిటీ నియామకంపై చర్చ ► 10 మందితో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం ► చంద్రబాబు అరెస్ట్, పెరుగుతున్న కేసుల దృష్ట్యా భవిష్యత్ కార్యాచరణపై చర్చ ► టీడీపీ, జనసేనతో కలిసి ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చ ► పైకి భింకంగా కనిపిస్తున్నా.. లోన గందరగోళంగా టిడిపి నేతల పరిస్థితి ► ఇన్ని తప్పులు ఎలా చేశారని ప్రజలు ప్రశ్నిస్తే ఏం చేయాలి? ► మీరు తప్పులు చేయకుండానే కేసులు పెట్టారా అని ప్రశ్నిస్తే ఏం చెప్పాలి? ► లోకేష్ ఎందుకు ఢిల్లీకే పరిమితమయ్యారని ప్రశ్నిస్తే ఏం చెప్పాలి? 1:05 PM, సెప్టెంబర్ 30, 2023 ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌పై టిడిపికి YSRCP ఏడు ప్రశ్నలు 1. అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని ఎకరాను రూ.8 లక్షలకు విక్రయించారు, అలైన్మెంట్ తర్వాత రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చూపించారు. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది వాస్తవం కాదా? 2. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా? 3. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు సీఎం హోదాలో చంద్రబాబే ప్రకటించింది వాస్తవం కాదా? 4. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది వాస్తవం కాదా? 5. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనున్న 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా వాస్తవం కాదా? 6. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్‌ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లు పెరిగిందన్నది వాస్తవం కాదా? 7. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. స్కాం జరగలేదంటారు.. మరి ఇన్నాళ్లు ప్రజలకు రాజధాని కట్టామని ఎందుకు చెప్పారు? చంద్రబాబు సృష్టించిన సంపద అంటే మాయా ప్రపంచమేనా? 12:10 PM, సెప్టెంబర్ 30, 2023 బ్రాహ్మణి, ముందు తప్పు చేశాడా లేదా మీ ఆయన్ని అడుగు : వరుదు కళ్యాణి ► బ్రాహ్మణి మోత పిలుపుపై వరుదు కళ్యాణి విమర్శలు ► ED, IT, CID మోగిస్తున్న అవినీతి మోతకు సమాధానం చెప్పు బ్రాహ్మణి..! ► టీడీపీకి 2019లోనే ప్రజలు మోత మోగించారు ► ఇప్పుడు బాబు జైల్లో ఉన్నాడని కొత్తగా మోగించేది ఏముంటుంది? ► టీడీపీ మాయమాటలను నమ్మే వారెవరూ లేరని బ్రాహ్మణి గుర్తించాలి ► తప్పుచేసినోళ్లే సంఘీభావం కోరడం సిగ్గుచేటు ► తప్పులపై తప్పులు చేసి ఇప్పుడు బుకాయిస్తే ఎలా? ► బాబును మించిన నియంత ఎవరూ లేరని బ్రాహ్మణికి తెలియదా? స్కిల్ స్కామ్, ఫైబర్ గ్రిడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్ జనం సొమ్మును అడ్డంగా దోచేశారు. తప్పులు అన్నీ మీరు చేసి.. డబ్బులు దోపిడీ చేసేసి.. ఇప్పుడు మోత మోగించి మద్దతు తెలపండి అని ప్రజలను అడగడం ఎంత వరకు సమంజసం? - ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి… pic.twitter.com/6K7pjsKi8O — YSR Congress Party (@YSRCParty) September 30, 2023 12:00 PM, సెప్టెంబర్ 30, 2023 తప్పులు చేసి, జైలుకి వెళ్లి.. మోత మోగిస్తానంటారా? ► లోకేష్, బ్రాహ్మణి మోత పిలుపుపై కురసాల కన్నబాబు చురకలు ► చంద్రబాబుకు ఆల్రెడీ మోత మోగింది ► గతంలో కాపు ఉద్యమంలో నిరసన తెలిపితే అక్రమ కేసులు పెట్టారు ► కాపు ఉద్యమంలో పెట్టిన అక్రమ కేసులను సీఎం జగన్ మాఫీ చేశారు ► నాటి సిద్ధాంతం ప్రకారం ఇవాళ టీడీపీ వాళ్లు కంచాలు కొడితే కేసులు పెట్టాలి కదా? ► చంద్రబాబును అరెస్ట్ చేస్తే నన్ను కలవనివ్వారా అని లోకేష్ అంటున్నాడు ► ఆనాడు ముద్రగడను అరెస్ట్ చేసి ఆయన కుమారుడ్ని దారుణంగా కొట్టారు ► కాపులు కంచాలు కొడితే తప్పని టీడీపీ నేతలే చెప్పారు ► బాబు స్కిల్ స్కామ్‌తో రాష్ట్రమంతా మోతెక్కిపోతుంది ► భలేగా కుంభకోణం చేశామని మోత మోగించాలనుకుంటున్నారా? ► ఫైబర్ గ్రిడ్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమ అలైన్మెంట్ స్కాంల తర్వాత ఇంకేమి మోగిస్తారు? 11:29 AM, సెప్టెంబర్ 30, 2023 సూత్రధారి చంద్రబాబు, కీలక పాత్రధారి పెండ్యాల శ్రీనివాస్ చౌదరీ ► చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ చౌదరీని సస్పెండ్ చేసిన ప్రభుత్వం ► సర్వీస్ నిబంధనలు అతిక్రమించినందుకు శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు ► సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ జవహర్‌రెడ్డి ► ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న శ్రీనివాస్ ► స్కిల్ కుంభకోణం, చంద్రబాబు ఐటీ నోటీసుల్లో కీలకంగా ఉన్న శ్రీనివాస్ ► శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు నిధులు చేరాయని గుర్తించిన CID ► ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా పారిపోయిన శ్రీనివాస్ లెక్కలన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి శ్రీనివాసే, అందుకే అమెరికాకు ఎక్స్పోర్ట్ చేశారు ► చంద్రబాబుకు వచ్చే నిధులన్నీ శ్రీనివాస్ ద్వారానే రూట్ అయినట్టు గుర్తించిన CID ► పర్సనల్ సెక్రటరీగా పని చేసిన సమయంలో బాబుకు నమ్మకంగా పెండ్యాల శ్రీనివాసచౌదరి ► శ్రీనివాసచౌదరి ఇంట్లో ఫిబ్రవరి 13 ,2020న IT సోదాలు ► ఏకంగా రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించిన IT అధికారులు ► చంద్రబాబు పేరును స్పష్టంగా రాసుకున్న శ్రీనివాసచౌదరి ► చంద్రబాబుకు సంబంధించి ఫిబ్రవరి 17, 2020న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల ► బ్లాక్ మనీ రూ.2వేల కోట్లకు సంబంధించి వివరాలు లభ్యమయ్యాయని పేర్కొన్న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ► మొత్తమ్మీద చంద్రబాబు చీకటి చరిత్రలో పెండ్యాల శ్రీనివాసచౌదరి పాత్ర పెద్దదేనంటున్న ఐటీ ► పెండ్యాల శ్రీనివాసచౌదరి దొరికితే కీలక ఆధారాలు దొరికే అవకాశం ఉందని భావిస్తోన్న CID & IT ► అవసరమయితే అమెరికాకు వెళ్లి పెండ్యాల శ్రీనివాసచౌదరిని తీసుకురావాలని భావిస్తోన్న CID & IT ► ఇంటర్‌పోల్ సహకారం తీసుకుని పెండ్యాల శ్రీనివాసచౌదరిని తీసుకువచ్చే అవకాశం 11:00 AM, సెప్టెంబర్ 30, 2023 బాబు కోసం గుండు గీయించుకుంటే@ రూ.1000 ►టీడీపీ నేతల పరిస్థితి దారుణంగా తయారైంది. ►ఎల్లో బ్యాచ్‌కు మద్దతిచ్చే వారే కరువురయ్యారు. ►చంద్రబాబు అరెస్టుకు నిరసన తెలిపేవారే దిక్కులేరు. ►ఆటోడ్రైవర్లకు రూ.1000 ఇచ్చి గుండ్లు గీయించిన ఎల్లో బ్యాచ్. ►టీడీపీ నేతల తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు.. అరెస్ట్ కు నిరసన గా గుండు చేపించుకుంటే గుండుకు రూ.1000 ఇవ్వడమేంట్రా.. @jaitdp @iTDP_Official 😹🤭 నీ 40 ఏళ్ల రాజకీయంలో ప్రజల్ని ఎంత పీడించావో ఈ దౌర్భాగ్యం పట్టింది నీకు @ncbn!#CorruptionKingCBN #KhaidiNo7691 #SkilledCriminalCBNinJail #TDPScams #InnerRingRoadScam pic.twitter.com/aVstKNgPGp — Jagananna Connects (@JaganannaCNCTS) September 30, 2023 10:50AM, సెప్టెంబర్ 30, 2023 ►టీడీపీ నేత నూకరాజుపై కేసు నమోదు.. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలతో జడ్జిలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై హైకోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జిపై అసభ్యకర కామెంట్లు చేసిన భీమిలికి చెందిన నూకరాజుపై సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్… — YSR Congress Party (@YSRCParty) September 30, 2023 10:40AM, సెప్టెంబర్ 30, 2023 అంత భయమెందుకు లోకేష్? ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాంలో A14గా ఉన్న నారా లోకేష్ ►అరెస్ట్ భయంతో ఢిల్లీలోనే లోకేష్. ►41ఏ నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి సీఐడీ అధికారులు ►సీఐడీకి దొరక్కుండా దాగుడుమూతలు ఆడుతున్న చినబాబు. ►తప్పు చేయకపోతే నోటీసులు అందుకోవడానికి భయమెందుకు.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాంలో A14గా ఉన్న నారా లోకేష్..అరెస్ట్ భయంతో ఢిల్లీకి పారిపోయాడు. దాంతో అతనికి 41ఏ నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి సీఐడీ అధికారులు వెళ్లగా.. వారికి దొరక్కుండా దాగుడుమూతలు ఆడుతున్నాడు. తప్పు చేయకపోతే నోటీసులు అందుకోవడానికి భయమెందుకు… pic.twitter.com/v7iqySTIjT — YSR Congress Party (@YSRCParty) September 30, 2023 10:35 AM, సెప్టెంబర్ 30, 2023 బాలయ్యకు సామాన్యురాలు కౌంటర్ ►సినిమాల్లో తొడ కొట్టినట్లు అసెంబ్లీలో కూడా బాలయ్య తొడకొడితే ఎలా? ►నిజానికి బాలకృష్ణకు రాజకీయాలు తెలీదు.. వాటి గురించి మాట్లాడలేడు కూడా. ►పొరపాటున బాలయ్య నోరుతెరిస్తే బూతులే మాట్లాడతాడు ►చంద్రబాబు రూ.371 కోట్లు అవినీతి చేశాడు. ►అది తప్పు కాబట్టే.. అరెస్ట్ చేశారు సినిమాల్లో తొడ కొట్టినట్లు అసెంబ్లీలో కూడా బాలయ్య తొడకొడితే ఎలా? నిజానికి అతనికి రాజకీయాలు తెలీదు.. వాటి గురించి మాట్లాడలేడు కూడా. పొరపాటున నోరుతెరిస్తే బూతులే మాట్లాడతాడు. చంద్రబాబు రూ.371 కోట్లు అవినీతి చేశాడు. అది తప్పు కాబట్టే.. అరెస్ట్ చేశారు. - ఓ వృద్ధురాలి అభిప్రాయం… pic.twitter.com/ML3s5thrT7 — YSR Congress Party (@YSRCParty) September 30, 2023 10:30 AM, సెప్టెంబర్ 30, 2023 బాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ సస్పెన్షన్ ►చంద్రబాబు మాజీ సీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పన్షన్ ►ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా పారిపోయిన శ్రీనివాస్ ►శుక్రవారంలోగా రావాలని నోటీసులిచ్చినా వెనక్కి రాని శ్రీనివాస్ ►స్కిల్ స్కామ్, చంద్రబాబు ఐటీ నోటీసులిచ్చినా కీలకంగా ఉన్న శ్రీనివాస్ ►ప్రభుత్వ సర్వీస్ రైల్స్ అతిక్రమించినందుకు శ్రీనివాస్ సస్పెన్షన్ 8:45 AM, సెప్టెంబర్ 30, 2023 21వ రోజు జైలులో చంద్రబాబు.. ►జైలులో 21వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్న జైలు వర్గాలు. ►చంద్రబాబుకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు. ►చంద్రబాబు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారన్న జైలు అధికారులు ►ఈ వారానికి చంద్రబాబుతో పూర్తైన ములాఖత్‌లు. 7:00 AM, సెప్టెంబర్ 30, 2023 లోకేష్ ఎక్కడ.? ► ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో A14 లోకేష్ ► 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి వెళ్లిన CID బృందం ► ఇప్పటివరకు బస చేసిన ITC మౌర్య హోటల్లో రూమ్ ఖాళీ ► మీటింగ్‌లు పెట్టే గల్లా జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌజ్‌లో లేడు ► రెగ్యులర్‌గా వాడే కారు మార్చేశాడు ► CID కంటికి కనిపించకుండా లోకేష్ దాగుడు మూతలు. 06:30 AM, సెప్టెంబర్ 30, 2023 బ్రాహ్మణి.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలరా? ► బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలకు YSRCP సూటి ప్రశ్నలు 1) బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో కేంద్ర సంస్థ ఆదాయంపన్ను అధికారులు ఫిబ్రవరి 13 ,2020న సోదాలు జరిపినపుడు రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17, 2020న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీన్ని మీరు అంగీకరించారా? లేదా? 2) అమరావతి కాంట్రాక్టర్ల నుంచి రూ.600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో రూ.119 కోట్లు (20%) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును, నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని అని శ్రీనివాస్ చౌదరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్‌కంటాక్స్ సంస్థ చంద్రబాబుకు నోటీస్ ఇచ్చింది. దీనిమీద మీ మాటేంటీ? 3) రూ.371 కోట్ల స్కిల్ కుంభకోణంలో కేంద్ర సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నలుగురిని అరెస్ట్ చేసింది. మరి మీరు అంతా సవ్యంగా జరిగిందని ఎలా అంటారు? 4) CID నోటీసులు అందుకున్న వెంటనే పెండ్యాల శ్రీనివాసచౌదరి, మనోజ్ వాసుదేవ్ , యోగి విదేశాలకు ఎందుకు పారిపోయారు?. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో A14 గా నారా లోకేశ్. ముందస్తు బెయిల్ పై ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో అరెస్ట్ భయంతో మీడియా కళ్ళుగప్పి ఢిల్లీలో ఉరుకులు పరుగులు పెడుతున్నాడు. #LooterLokesh #CorruptBabuNaidu pic.twitter.com/cFSWzwbTbB — YSR Congress Party (@YSRCParty) September 29, 2023 ఎవరి కోసం మోగించాలి.. ఎందుకోసం మోగించాలి @jaitdp? స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి యువతను మోసం చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు మీ నాయకుడు @ncbn. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణను ఎదుర్కోలేక ఢిల్లీ వెళ్ళి దాక్కున్నాడు ఆయన కొడుకు @naralokesh. అంటే మీరు తప్పులు చేసి… https://t.co/URMSKWm0Ou — YSR Congress Party (@YSRCParty) September 29, 2023 06:14 AM, సెప్టెంబర్ 30, 2023 తెలుగుసేనలో అయోమయం ► రాజమండ్రిలో జైలుకు పరిమితమైన చంద్రబాబు ► ఢిల్లీ నుంచి కదలనంటున్న లోకేష్ బాబు ► రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు భువనేశ్వరి ► రాజమండ్రి లోకేష్ క్యాంప్‌లో నారా బ్రాహ్మణి ► రెండు రోజుల హడావిడి తర్వాత కనిపించని బాలకృష్ణ ► జైలు ముందు పొత్తు ప్రకటన చేసి సైలంట్ అయిన పవన్ కళ్యాణ్. -
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
దొండపర్తి : ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాకు విశాఖ పోలీసులు చెక్ పెట్టారు. బెట్టింగ్ వేసే వారిని నిలువునా ముంచుతున్న బుకీ గ్యాంగ్‌లో 11 మందిని అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం డీసీపీ–1 కె.శ్రీనివాసరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. క్రికెట్ బెట్టింగ్ పేరుతో రూ.8 లక్షల వరకు తనను మోసం చేశారని నగరానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల పోలీస్ స్పందనలో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంలో తీగ లాగితే డొంక కదిలింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలానికి చెందిన మెరుపురెడ్డి సూరిబాబు ఈ ముఠాలో ప్రధాన సూత్రధారుల్లో ఒకరుగా పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో 20 నుంచి 30 మంది మంది నుంచి డబ్బులు వసూలు చేసి ఒక్కో మ్యాచ్‌కు రూ.4 లక్షల వరకు బెట్టింగ్ చేసేవాడు. ఇలా ఏడాదికి రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు బిజినెస్ టర్నోవర్ చేసేవాడు. ఇలా సేకరించిన మొత్తాన్ని నగరంలోని సూర్యాబాగ్ ప్రాంతంలో టూర్స్ అండ్ ట్రావెల్స్ నడిపిస్తున్న దినేష్‌కుమార్ అనే వ్యక్తికి పంపేవాడు. ఇందుకు అతడికి 2 శాతం కమీషన్ ఇచ్చేవాడు. ఇలా తనకు తెలిసిన వ్యక్తులను కూడా బుకీలుగా మార్చి బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ బుకీ గ్యాంగ్ గుట్టుగా బెట్టింగ్ నిర్వహించడంతో పాటు.. బెట్టింగ్ వేసే వారికి డబ్బులు నష్టపోయేలా సాఫ్ట్వేర్లను రూపొందించారు. సాధారణంగా గెలిచే అవకాశమున్న జట్టుకు తక్కువ పర్సెంట్, ఓడిపోయే అవకాశాలున్న జట్టుకు ఎక్కువ శాతం డబ్బును ఆఫర్ చేస్తుంటారు. ఆ విధంగా జట్టు మీద బెట్టింగ్ వేశాక కొంత సమయం వరకు వాటిని వేరొక జట్టుకు మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ వీరు అలా మార్చడానికి అవకాశం లేకుండా ఆ సమయంలో సర్వర్‌ను ఆఫ్ చేసేవారు. ప్రధానంగా గేమ్ విన్నర్, లాస్ ఆప్షన్స్.. హ్యాండ్లర్ చేతిలో ఉండడంతో ఒకవేళ గెలిచినప్పటికీ నష్టం వచ్చిందని చెప్పి వారి ఐడీని బ్లాక్ చేస్తారు. ఆ డబ్బును తమ కరెంట్ అకౌంట్లలోకి జమ చేసి వాటి నుంచి కార్పొరేట్ ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో నిర్ధారౖణెంది. ఈ గ్యాంగ్‌కు సంబంధించిన 63 బ్యాంక్ ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేయగా.. అందులో 36 ఖాతాల ద్వారా ఇప్పటి వరకు రూ.367.62 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. వాటిలో 13 అకౌంట్లలో ఉన్న రూ.75 లక్షలు స్తంభింపచేసినట్లు పోలీసులు చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో సూరిబాబు, విశాఖకు చెందిన హండ దినే‹Ùకుమార్, బర్రి శ్రీను, గుర్రం శివ, కిల్లాడి శ్రీనివాసరావు, ఉరిటి కొండబాబు, ఉరిటి వెంకటేశ్వర్లు, సుందరాపు గణేష్, దూలి నూకరాజు, అల్లు నూకరాజు అవినాష్, ఉప్పు వాసుదేవరావులున్నారు. ఈ రాకెట్ వెనుక ప్రధాన సూత్రదారి కోసం గాలిస్తున్నట్టు డీసీపీ–1 శ్రీనివాస్ తెలిపారు. సమావేశంలో ఏడీసీపీ(ఎస్బీ) నాగేంద్రుడు, సైబర్ క్రైం సీఐ భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
భర్తతో పోట్లాడి.. కాలువలో దూకింది
తూర్పు గోదావరి: భర్తతో పోట్లాడిన ఓ యువతి పోలవరం కాలువలో దూకింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరానికి చెందిన నెరుసు శ్రీనివాసరావుకు, కొవ్వూరుకు చెందిన కస్తూరితో ఈ ఏడాది జనవరిలో వివాహమైంది. శ్రీనివాసరావు వేలివెన్ను శశి విద్యాసంస్థల్లో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల మనస్పర్థలు వచ్చి, తరచూ గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కస్తూరిని కొన్ని రోజుల పాటు కొవ్వూరులోని పుట్టింట్లో ఉంచమని శ్రీనివాసరావు తల్లిదండ్రులు సూచించారు. దీంతో ఆమెను శ్రీనివాసరావు బైక్‌పై తీసుకొని శుక్రవారం ఉదయం బయలుదేరాడు. అనంతపల్లి పోలవరం కుడి కాలువ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి కాలి చెప్పు పడిపోయిందని, బైక్ ఆపాలని కస్తూరి భర్తను కోరింది. బైక్ ఆపిన వెంటనే ఆమె పరుగెత్తి, అందరూ చూస్తూండగానే బ్రిడ్జిపై నుంచి కాలువలోకి దూకేసి, ప్రవాహంలో గల్లంతైంది. దీనిపై ఆమె భర్త శ్రీనివాసరావు నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేశామని ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. కస్తూరి ఆచూకీ కోసం కాలువలో గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. -
జైల్లో నుంచే చంద్రబాబు మరో ప్లాన్.. వారంతా ఎక్కడ?
పారిపోతున్నారు.. ఒకరి తర్వాత ఒకరుగా పారిపోతున్నారు. అవినీతి ఆనకొండ అరెస్ట్ కావడంతో.. అవినీతి పందికొక్కులన్నీ విదేశీ కలుగుల్లో దాక్కొంటున్నాయి. దర్యాప్తు అనగానే వణుకు పుడుతోంది. లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము స్వాహా చేశారు కాబట్టే.. ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో జంప్ అయిపోతున్నారు. ఒకవైపు చంద్రబాబు.. నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని తెగ వాపోతున్నారు. మరోవైపు కుంభకోణాల్లో తనకు సహకరించిన వారందరినీ ఆయన సలహాతోనే దేశం దాటించేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సింపుల్‌గా చెప్పుకోవాలంటే.. దొరికి పోయామని అర్థమైంది. పరారైపోయారు.. చంద్రబాబు నాయుడు తన హయాంలో సాగించిన కుంభకోణాలు అన్నీ ఇన్నీ కావు. అందులో ప్రధాన సూత్రధారి చంద్ర బాబు అయితే.. కీలక పాత్రధారులు చాలా మందే ఉన్నారు. సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో టీడీపీ సర్కారు అవినీతి బాగోతాలు బయటపడుతున్న కొద్దీ.. పరారవుతున్న వారి జాబితా పెరుగుతూ వస్తోంది. తాజాగా లోకేష్‌కి అత్యంత సన్నిహితుడు కిలారు రాజేష్ పరారైన బ్యాచ్‌లో చేరిపోయాడు. జైల్లోకి వెళ్లక ముందు ఈ పరారీ ఎపిసోడ్‌కి దర్శకత్వం చంద్రబాబు వహించారని.. జైల్లోకి వెళ్లిన తర్వాత సలహాలు, సూచనలు ఇస్తూ చంద్రబాబు దర్శకత్వ పర్యవేక్షణ వహిస్తు న్నారని.. రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తనకే పాపం తెలియదని.. తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఒకవైపు గగ్గోలు పెడుతోన్న చంద్రబాబు.. మరోవైపు కుంభకోణాల్లో కీలకంగా వ్యవహరించిన వారిని దేశం దాటించేస్తున్నారు. వాళ్లు దొరికితే కీలక ఆధారాలన్నీ దొరికిపోయినట్టే అని చంద్రబాబు తెగ ఆందోళన చెందుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, అలానే.. షాపూర్జీ-పల్లోంజీ ప్రతినిధి మనోజ్ ఇద్దరూ ఇప్పటికే విదేశాలకు చెక్కేశారు. శ్రీనివాస్‌ని అమెరికాకి, మనోజ్‌ని దుబాయ్‌కి పంపించేసేది చంద్రబాబే అని పొలిటికల్ ఎనలిస్ట్‌లు విశ్లేషిస్తున్నారు. సెప్టెంబర్ నెల 5వ తేదీన సీఐడీ నుంచి నోటీసులు వస్తే.. ఆరవ తేదీన శ్రీనివాస్ అమెరికాకి వెళ్లిపోయాడు. చంద్రబాబు ఏ తప్పు చేయ నప్పుడు.. వాళ్లని ఎందుకు దేశం దాటించేశారన్న ప్రశ్న మొత్తం స్కామ్‌లకు సూత్రధారి చంద్రబాబే అని చెప్పకనే చెబుతోంది. మరోవైపు.. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీ పారిపోయిన లోకేష్.. అక్కడ నేషనల్ మీడియా ముందు అమాయకత్వం నటించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. ఒక నేషనల్ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ అమెరికాకి పిక్నిక్కి వెళ్లాడని లోకేష్‌కి చెప్పుకొచ్చాడు. మరి, తన బాస్‌ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే.. ఆఘమేఘాల మీద అమెరికా నుంచి రావాల్సిన పీఏ రాలేదు. ఇంకా అమెరికాలో పిక్నిక్ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నా డు. ఎందుకంటే.. శ్రీనివాస్ అమెరికా వెళ్లింది. మనోష్ దుబాయ్ వెళ్లింది. విహారయాత్రకి కాదు. పరారైన యాత్రకు. స్కామ్‌ల్లో సీఐడీ ఎవరెవరి పేర్లు అయితే బయటపెట్టిందో.. ఎవరెవరి పాత్రలపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టంగా చెబుతోందో.. వాళ్లంతా ఒకరి తర్వాత ఒకరుగా చంద్రబాబు అరెస్ట్‌కి ముందు పారిపోయారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పారి పోతున్నారు. నిర్దోషులు అయితే వాళ్లెందుకు పారిపోతున్నారు?. మరోవైపు ఢిల్లీలో వ్యవహరాలు చక్కపెట్టేందుకని లోకేష్ హడావుడి చేస్తున్నా.. అరెస్ట్ భయంతోనే ఆయన కూడా హస్తిన పారిపోయారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరో ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే.. చంద్రబాబుని అరెస్ట్ చేయగానే రోడ్డు మీద పడుకుని గగ్గోలు పెట్టేసిన పవన్ కళ్యాణ్.. ఇక టీడీపీతోనే కలిసి పనిచేస్తానని ముసుగు తీసేసిన దత్తపుత్రుడు.. ఆ తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. పవన్ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇక వన్.. టూ.. త్రీ.. అంటూ ఒకరి తర్వాత ఒకరుగా పరారైయ్యే వాళ్లు పరారైపోతున్నారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకపోతే.. ఒకవైపు దర్యాప్తునకి పూర్తిగా సహకరిస్తూ, మరోవైపు సీఐడీ నోటీసులు ఇచ్చిన వారందరూ పారిపోకుండా చూసేవారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రకరకాల కుంభకోణాలతో ప్రజాధనాన్ని చంద్రబాబు స్వాహా చేశారు కాబట్టే.. సాక్ష్యాధారాలు బయటపడకుండా స్కామ్‌లో సహకరించిన అందరినీ దేశాలు దాటిస్తున్నారన్న సంగతి.. సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోతోంది. తాజాగా కిలారు రాజేష్ కూడా పారిపోవడంతో పరారైన వాళ్ల సంఖ్య ముగ్గురికి చేరింది. పారిపోయిన వాళ్లు ముగ్గురు కాదు. నలుగురు అంటూ లోకేష్ వైపు వేలు చూపించే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇంతకీ, కిలారు రాజేష్‌ని దేశం దాటించారా? లేక దేశంలోనే దాచేశారా? విదేశీ కలుగుల్లో దాక్కొన్న అవినీతి పందికొక్కులను పట్టే స్కెచ్.. సీఐడీ సిద్దం చేస్తోంది. ఇంతకీ.. అసలు లోకేష్ ఢిల్లీలో ఏం చేస్తున్నాడు.? ఇది కూడా చదవండి: చంద్రబాబు విడుదల కాలేరు: రఘువీరారెడ్డి వ్యాఖ్యలు