-
మదనపల్లి ఫైల్స్ దగ్ధంపై మండలిలో రగడ
సాక్షి, గుంటూరు: మదనపల్లి ఆర్డీవో ఆఫీసులో అగ్ని ప్రమాదం ఘటనపై శాసన మండలి ఇవాళ అట్టుడుకింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరును మంత్రి అనగాని సత్యకుమార్ ప్రస్తావనవకు తేవడంపై వైఎస్సార్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రికార్డుల నుంచి పెద్దిరెడ్డి తొలగించాల్సిందేనని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పట్టుబట్టారు.మంగళవారం ఏడో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. శాసన మండలిలో.. మదనపల్లి ఘటన ప్రస్తావించిన మంత్రి అనగాని.. పెద్దిరెడ్డి పేరు లేవనెత్తారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. పెద్దిరెడ్డి పేరును ప్రస్తావించడంపై వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణ ఉన్నప్పుడు పేర్లు ఎలా చెప్తారంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ‘‘కావాలని బురద చల్లే ప్రయత్నం చేయొద్దు. మీకు చేతనైతే విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోండి. అనవసరంగా ఆరోపణలు చేయడం సరికాదు. రికార్డుల నుండి పెద్దిరెడ్డి పేరును తొలగించాలి’’ అని బొత్స అన్నారు. ఈ క్రమంలో పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడాలంటూ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు మంత్రి అనగానికి సూచించారు. -
టార్గెట్ వంశీ.. కొనసాగుతున్న కూటమి కక్ష సాధింపులు
సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకు అరెస్ట్ చేశారో సమాధానం మాత్రం చెప్పడం లేదు.గన్నవరం వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్ట్‌లపై వైఎస్సార్సీపీ మండిపడింది. కంకిపాడు పోలీస్ స్టేషన్ వద్దకు వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. పీఎస్ వద్ద పోలీస్ అంక్షలు విధించారు. స్టేషనలోకి ఎవరూ వెళ్లకుకుండా అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు కోసమే అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. గన్నవరానికి చెందిన 10 మందిని అక్రమంగా అరెస్ట్ చేశారు. మీరు కేసులు పెట్టినంత మాత్రాన బెదిరిపోమని లోకేష్ గుర్తుంచుకోవాలి. రెడ్ బ్యాంక్ రాజ్యాంగాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తే మీకు ప్రజలు చరమగీతం పలుకుతారు. మీకు చేతనైంది.. చేసుకోండి. దానికి మీరు కచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదు’’ అంటూ దేవభక్తుని చక్రవర్తి హెచ్చరించారు.తెల్లవారుజామున 5 గంటలకు మా నాన్నను అరెస్ట్ చేశారు. ఏదో గ్యాంగ్ స్టర్‌ను అరెస్ట్ చేసినట్లు ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేశారంటూ వైఎస్సార్సీపీ ఎంపీపీ అనగాని రవి కుమారుడు ధ్వజమెత్తారు. 45 ఏళ్లుగా మా తాత, మా నాన్న రాజకీయాల్లో ఉన్నారు. ఏనాడూ ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కోలేదు. ఇంత కక్షపూరిత.. దౌర్జన్య వైఖరి ఎప్పుడూ లేదు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంపై కంటే అభివృద్దిపై దృష్టి పెడితే బాగుంటుంది. ఏ కేసు పెట్టారో చెప్పకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్‌ను టార్గెట్ చేయడం కోసం కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని.. అరెస్టులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టలేరని ఆయన అన్నారు.కనీస సమాచారం లేకుండా తెల్లవారు జామున అక్రమంగా అరెస్ట్ చేశారని.. అనగాని రవికి ఆరోగ్యసమస్యలున్నాయని అనగాని రవి మేనకోడలు అన్నారు. మందులు ఇవ్వాలని కోరినా పోలీసులు ఒప్పుకోవడం లేదు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ధర్మవరంలో కూటమి నేతల బరితెగింపు, కరెంట్ తీగలతో..
సాక్షి, సత్యసాయి జిల్లా: మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయ కక్షలు బయటపడ్డాయి. వైఎస్సార్ సీపీ నేత, ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి హత్య కుట్ర భగ్నమైంది.కాంపౌండ్ వాల్ ఐరన్ డోర్‌కు విద్యుత్ తీగలు వేసిన టీడీపీ కూటమి నేతలు.. డోర్ తాకిన వెంటనే కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి చనిపోయేలా పన్నాగం పన్నారు. అయితే 33కేవీ విద్యుత్ తీగలకు బదులుగా.. ఫైబర్ కేబుల్‌కు కనెక్షన్ ఇవ్వడంతో ప్రమాదం తప్పింది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. కామిరెడ్డిపల్లి పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. అక్కడితో ఆగకుండా బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారు. తాజాగా ఆదివారం రాత్రి పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులో నిత్యం రద్దీగా ఉండే వైఎస్సార్, నెహ్రూ సర్కిళ్లతో పాటు ధర్మవరం బస్టాండ్ ప్రాంతంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ గూండాలు మూకుమ్మడిగా దాడి చేశారు. పోలీసులు చూస్తుండగానే... కొడపగానిపల్లికి చెందిన వినోద్‌కుమార్‌రెడ్డి, నరేంద్రరెడ్డి, హరిపై అకారణంగా కాళ్లతో, కర్రలతో విరుచుకు పడ్డారు. కొత్తచెరువుకు చెందిన టీడీపీ ముఖ్య నేత శ్రీనివాసులు ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొన్నట్లు బాధిత కార్యకర్తలు వాపోయారు. కొత్తచెరువు మండలం కొడపగానిపల్లికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఈడిగ మారుతి రెండు రోజుల క్రితం సోషల మీడియాలో ఓ పోస్టును పెట్టారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ తీర్చిదిద్దిన ప్రభుత్వ బడి ఫొటోతో పాటు ఇటీవల ‘బడి వైన్స్’ పేరుతో తిరుపతిలో ప్రారంభించిన మద్యం దుకాణం ఫొటోను జతపరుస్తూ పోస్టు చేశారు. ఇందులో తప్పిదం ఏమీ లేకపోయినా... సీఎం చంద్రబాబు మద్యం పాలసీని తప్పు బట్టారని, ఆ పోస్టును తొలగించకపోతే కేసు పెడతామని స్థానిక టీడీపీ నేత శివయ్య బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే ఇంత చిన్న విషయాన్ని రచ్చ చేయరాదని, కేసులు.. గీసులు ఏమీ వద్దని పోలీసులు నచ్చచెప్పారు. అదే సమయంలో ప్రశాంత మైన గ్రామంలో వర్గ కక్షలు ఉండరాదని భావించిన మారుతి కూడా ఆ పోస్టును తొలగించాడు. దీంతో అప్పటికి సమస్య సద్దుమణిగిందనుకున్నారు. అయినా కక్ష కట్టిన శివయ్య... మారుతి పోస్టును స్క్రీన్ షాట్ తీసి ఆదివారం కొత్తచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఒత్తిళ్లను తాళలేక మారుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న కొడపగానిపల్లికి చెంది వైఎస్సార్సీపీ నాయకులు వినోద్‌కుమార్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, హరి... కొత్తచెరువు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మారుతీకి స్టేషన్ బెయిల్ ఇచ్చే విషయంగా పోలీసులతో చర్చించి ఆదివారం రాత్రి బయటకు వచ్చారు.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ముఖ్య నేత శ్రీనివాసులు తన అనుచరులతో కలసి పథకం ప్రకారం కొత్తచెరువులోని ప్రధాన కూడళ్లలో వీధి లైట్లను ఆఫ్ చేయించి వినోద్‌కుమార్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, హరిపై దాడికి తెగబడ్డారు. చెప్పులు, కర్రలు, ముష్టిఘాతాలతో విరుచుకుపడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన హరి అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన ఇద్దరికి మూగ దెబ్బలయ్యాయి. ఘటనపై బాధితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మారుతిని సోమవారం పోలీసులు వదిలేశారు. -
తోచిన అంకెలతో చంద్రబాబు గారడి.. ఈ ఐదేళ్లు ఇలాగే పాలన సాగిస్తారా?
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ సవాల్ చేస్తున్నదేమిటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నది ఏమిటి? ప్రజలను అసలు విషయాల నుంచి తప్పుదారి పట్టించడంలో చంద్రబాబు ఘనాపాటియే అని అంగీకరించాలి. టీడీపీ, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, అలాంటి వారిని అరెస్టు చేస్తే,తొలుత తనను అరెస్టు చేయండని జగన్ సవాల్ చేశారు. బాబు మోసాలపై తాను ట్వీట్ చేస్తున్నానని, తన పార్టీ నేతలు, క్యాడర్ కూడా ట్వీట్ చేస్తారని, ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టండని, ఎంతమందిని అరెస్టు చేస్తారో చూద్దాం అని జగన్ అన్నారు. బడ్జెట్లో చంద్రబాబు మోసాలను సోషల్ మీడియాలో ప్రజలకు తెలియచేస్తామని, సోషల్ మీడియాలో ఎండగడతామని ఆయన అన్నారు. దీనికి చంద్రబాబు ఏమని జవాబు ఇవ్వాలి? తానుమోసం చేయలేదని చెప్పగలగాలి. జగన్ చేస్తున్న వాదన సరికాదని నిరూపించగలగాలి. అలా కాకుండా ఆయన ఏమంటున్నారో గమనించండి..ఎల్లో మీడియాలో వచ్చిన కధనం ప్రకారం శాసనసభలో ఆయన ప్రసంగిస్తూ' కన్నతల్లి శీలాన్ని శంకించేవారు మనుషులా!పశువులా!తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేసేవారికి మనమో లెక్క?అని అన్నారట.ఇది చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రజలను తప్పుదారిటీడీపీ పట్టించే యత్నమా?కాదా?ఎవరు ఎవరి తల్లికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు?ఎంత అన్యాయంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు!పోనీ ఫలానా వ్యక్తి అని చెప్పకుండా, ఏదో పత్రికలలో ఎవరిమీదనో అన్యాపదేశంగా వార్తలు రాసినట్లు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేయవచ్చా?అన్నది ఆలోచించుకోవాలి.చంద్రబాబు మరో వ్యాఖ్య చూడండి.. కూటమిలోని నేతలు , కార్యకర్తలు ఎవరూ అసభ్య పోస్టులు పెట్టరని, ఒకవేళ పెడితే శిక్షిస్తామని ఆయన అన్నారు. ఇందులో లేశమంతమైనా వాస్తవం ఉందా? ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోకి వచ్చినా టీడీపీ ప్రత్యేకించి ఐటీడీపీ పేరుతోనో,మరో పేరుతోనో కొంతమంది కార్యకర్తను సోషల్ మీడియా కోసం వినియోగించింది..అందులో ఎందరు దారుణమైన వికృత పోస్టింగ్ లు పెట్టింది తెలియదా?వారికి స్వయంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లే మద్దతు ఇచ్చింది అవాస్తవమా?సీఎంగా ఉన్నపుడు, ఆ తర్వాత కూడా జగన్ ను ,ఆయన కుటుంబ సభ్యులను దూషించి, అసభ్యకర పోస్టింగ్ లు పెట్టినవారిపై ఒక్కరి మీద అయినా కేసులు పెట్టారా?కనీసం ఖండించారా?పైగా ఇప్పుడు తమవాళ్లు ఎవరూ పెట్టరని సూక్తులు చెబుతున్నారు.అంతెందుకు జగన్ అధికార టీడీపీ వెబ్ సైట్ లో తన తల్లిపైన పెట్టిన ఒక అబద్దపు పోస్టు గురించి ప్రస్తావించి చంద్రబాబు, లోకేష్‌లను అరెస్టు చేస్తారా?అని డీజీపీని ప్రశ్నించారు.అందులో రెండేళ్ల క్రిం విజయమ్మ ప్రయాణిస్తున్న ఒక వాహనం టైర్ పంక్చర్ అయితే ఆమె రోడ్డుపక్క నిలబడి ఉన్న ఫోటోని తీసి, ఈ మధ్యే జరిగినట్లు, జగన్ ఆమెను చంపడానికి ఇలాంటి కుట్ర చేశారని టీడీపీ వెబ్ సైట్ లో పెటిన విషయాన్ని ఆధారాలతో సహా తెలిపితే, చంద్రబాబు అది నిజమా?కాదా? అన్నది ఎందుకు చెప్పలేదు?అంతే!అదే చంద్రబాబు స్టైల్. తను చేసే తప్పులను కూడా ఎదుటివారిపై పెట్టడంలో ఆయన నేర్పరి అని అంటారు.మరో వైపు ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ కూడా శాసనమండలిలో మాట్లాడుతూ తన అమ్మను అవమానించారు..వారిని సహించాలా అని ప్రశ్నించారు. ఎవరూ సహించాలని చెప్పరు.అసెంబ్లీలో ఎవరూ అలా మాట్లాడకపోయినా,నెపం నెట్టి ప్రచారం చేశారన్నది వైఎస్సార్సీపీవారి వాదన. ఆ వంకతో రాజకీయాల కోసం పదే,పదే అదే విషయాన్ని ప్రస్తావించడం అమ్మకు గౌరవమా?అన్నది ఆలోచించాలి.అదే టైమ్ లో జగన్ భార్య భారతి మీద, వారి కుటుంబ సభ్యులపైన పెట్టిన దారుణమైన అనుచిత పోస్టింగ్‌ల మాటేమిటి?మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు కొడాలి నాని తదితరుల కుటుంబ సభ్యులపై ఎంత అసభ్యకర పోస్టింగ్ లు పెట్టారో సాక్ష్యాలతో సహా చెప్పినా, అసలుఏమీ జరగనట్లు చంద్రబాబు ప్రభుత్వంలోని పోలీసులు వ్యవహరిస్తున్నారే! వీటిపై చంద్రబాబు కాని, లోకేష్ కాని ఎక్కడా నోరు విప్పరు.జగన్ ఏపీ బడ్జెట్ పై వ్యాఖ్యానిస్తూ చంద్రబాబు వచ్చాక 2.60 లక్షల మంది వలంటీర్లను రోడ్డున పడేశారు..15వేల మంది బెవరేజెస్ ఉద్యోగులను తీసేశారు..నిరుద్యోగులకు మూడువేల భృతి ఎగవేస్తున్నారు.తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి పదిహేను వేల చొప్పున ఇవ్వడానికి 13 వేల కోట్లు అవసరమైతే,ఎంత మొత్తం పెట్టారని ప్రశ్నించారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పారు..అలా చేయలేదు..ఇవన్ని మోసాలా?కాదా?అని జగన్ అడిగారు.వీటిలో ఒక్కదానికి కూడా చంద్రబాబుకాని, ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కాని నేరుగా జవాబు ఇవ్వలేకపోయారు.చంద్రబాబు మాత్రం యధాప్రకారం గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, విధ్వంసం చేసిందని ఆరోపించారు. రాత్రికి రాత్రే అధ్బుతాలు జరుగుతాయని అనుకోవడం లేదని చేతులెత్తేశారు.ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే అన్నీ అద్బుతాలే చేస్తామని,సంపద సృష్టిస్తామని చెప్పడం అబద్దాలాడినట్లే కదా?అప్పుడు చెప్పినవాటి గురించి , హామీల గురించి ప్రశ్నిస్తే వారిమీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం తప్పుకాదా?జగన్ బడ్జెట్ పుస్తకాలలో ఉన్న అప్పుల లెక్కల గురించి ప్రస్తావించి, తన హయాంలో అప్పులు 14 లక్షల కోట్లకు వెళ్లాయని అబద్దాలు చెప్పినట్లు కూటమి బడ్జెట్ లోనే తేలింది కదా అని అన్నారు. మొత్తం అప్పు ఏడు లక్షల కోట్ల లోపే ఉన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం అంగీకరించింది కదా అని అన్నారు. అందులోను విభజన నాటికి ఉన్న అప్పు, తదుపరి చంద్రబాు ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులు పోను అంతా కలిపి తమ హయాంలో మూడు లక్షల కోట్ల అప్పే కదా అని అడిగారు.అందులో కూడా రెండేళ్లు కరోనా సమస్య ఉందన్న సంగతి గుర్తు చేశారు.దీనికి చంద్రబాబు ఆన్సర్ ఇవ్వలేదు సరికదా..మళ్లీ పాత విమర్శలనే చేశారు.తాము ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లోనేమో ఆరున్నర లక్షల కోట్లు అని చెబుతారు. ఉపన్యాసంలో మాత్రం జగన్ పాలన పూర్తి అయ్యేసరికి 9.74 లక్షల కోట్లు అని అంటారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు పద్నాలుగు లక్షల కోట్లు అనడంపై ఎక్కడా వివరణ ఇవ్వరు. అదే చంద్రబాబు విలక్షణ సరళి అని చెప్పుకోవాలి. జగన్ టైమ్ లో జిఎస్టి, జిఎస్‌డిపి,తలసరి ఆదాయం అన్నీ పెరుగుదల చూపినా, వాటినన్నిటిని తోసిపుచ్చుతూ తనకు తోచిన అంకెలతో చంద్రబాబు గారడి చేశారు. జగన్ టైమ్ లో విద్యుత్ చార్జీలు కొద్దిగా పెరిగినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు గగ్గోలుగా ప్రచారం చేసేవారు. ఎల్లో మీడియా పూనకం వచ్చినట్లు ఘీబెట్టేది. అదే చంద్రబాబు టైమ్ లో ఏకంగా యూనిట్ కు రూపాయిన్నర వరకు పెరిగినా, అందుకూ జగన్ ప్రభుత్వమే కారణమని ప్రచారం చేస్తున్నారు. మరి ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెరగవని, పైగా తగ్గిస్తానని చెప్పారుగా అని ఎవరైనా అడిగితే,ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావా?అని కేసులు పెట్టే పరస్థితి ఏర్పడింది.వీటిపై జగన్ నిలదీసినా చంద్రబాబు కాని ఆయన మంత్రులు కాని నోరుపారేసుకోవడం తప్ప సమాధానం ఇవ్వడం లేదు.జగన్ అసెంబ్లీలో తనకు ఎలాగూ అవకాశం ఇవ్వరని, సవివరంగా తన ఆఫీస్ నుంచే బడ్జెట్ పై మాట్లాడి అనేక ప్రశ్నలు సంధించారు .చంద్రబాబువి అన్నీ మోసాలేనని ,సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, జగన్ స్పష్టం చేస్తూ అదే ప్రకారం చేశారు. ఆయనతో పాటు పార్టీ నేతలు,కార్యకర్తలు కూడా అలాగే పోస్టు చేశారు.దానిపై మాత్రం చంద్రబాబు మాట్లాడరు.కాని అసభ్య పోస్టులు అంటూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసుల ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారు.చంద్రబాబు ఈ ఐదేళ్లు ఇలాగే పాలన సాగిస్తారా?ఏమో పరిస్థితి చూస్తే అలాగే ఉంది.జగన్ అడిగేవాటికి జవాబులు చెప్పలేనప్పుడు చంద్రబాబుకు ఇదొక్కటే మార్గమా!కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కూటమి ప్రభుత్వంపై మా పోరాటం ఆగదు: తాటిపర్తి
సాక్షి,ప్రకాశం జిల్లా : యర్రగొండపాలెం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కి పోలీసులు నోటీసులు అందించారు. ఎక్స్ వేదికగా నారా లోకేష్‌పై పెట్టిన పోస్టింగ్‌తో పాటు ఎన్నికల సమయంలో పెట్టిన నాలుగు కేసులకు సంబంధించి ఎర్రగొండపాలెం ఎస్సై చౌడయ్య నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ఎన్నికుట్రలు చేసినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేయాలనే కుట్రతోనే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని అన్నారు. -
వైఎస్ జగన్ హయాంలోనే మాదిగలకు మేలు జరిగింది: ఆదిమూలపు సురేష్
సాక్షి,తాడేపల్లి:వైఎస్ జగన్ హయాంలోనే ఏపీలో మాదిగలకు చాలా మేలు జరిగిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సోమవారం(నవంబర్ 18) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ఆఫీసులో పార్టీ అధికార ప్రతినిధి కొమ్మూరి కనకారావుతో కలిసి సురేష్ మీడియాతో మాట్లాడారు.‘మంద కృష్ణ మాదిగ మాత్రం చంద్రబాబు పల్లకి మోస్తూ కాలం గడుపుతున్నారు. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత లేదని చంద్రబాబు అంటుంటే మంద కృష్ణ ఏం చేస్తున్నారు?అంటే ఈ సమస్య ఎప్పటికీ ఇలాగే ఉండాలని మంద కృష్ణ కోరుకుంటున్నారు. అందుకే కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు. మాదిగలకు న్యాయం జరిగేదానికంటే రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు,మంద కృష్ణ చూస్తున్నారు.మాల,మాదిగలను రెండు కళ్లుగా వైఎస్ జగన్ చూశారు. చంద్రబాబులాగ రాజకీయాలకు వాడుకోలేదు.సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా అమలు చేసేలా మంద కృష్ణ చూడాలి. అంతేగానీ వైఎస్ జగన్‌ని దూషిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. రాష్ట్రంలో అలజడి సృష్టించాలంటే కుదరదు.అన్ని ఉద్యోగాలలో దామాషా ప్రకారం మాదిగలకు దక్కేలా చూడాలి. కమిటీల పేరుతో కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తే సహించం.కొమ్మూరి కనకారావు కామెంట్స్...మంద కృష్ణమాదిగ చంద్రబాబు చేతిలో పనిముట్టులాగ మారాడువర్గీకరణ పేరుతో మందకృష్ణ మాదిగలను రాజకీయంగా వాడుకుంటున్నారుముప్పై ఏళ్లుగా మంద కృష్ణ చేస్తున్నది అదేమాల, మాదిగల మధ్య వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారురెండు వర్గాల మధ్య మంటలు రాజేసి చలి కాసుకుంటున్నాడుపెద్ద మాదిగలాగ ఉంటానన్న చంద్రబాబు అధికారంలో ఉన్నంతవరకు ఏమీ చేయలేదుమరి చంద్రబాబుకు మళ్ళీ ఎందుకు మద్దతు చెప్తున్నావ్?ఇద్దరి మధ్య ఉన్న లాలూచీ ఏంటి?చంద్రబాబు ఇచ్చిన టాస్క్ ప్రకారం జగన్‌ను దూషించడంంకరెక్టు కాదువైఎస్ జగన్ మాత్రమే మాదిగని ఎంపీ చేశారుఇద్దరు మాదిగలకు కీలకమైన మంత్రి పదవులు వైఎస్ జగన్ ఇచ్చారుచంద్రబాబు ముగ్గురికే నామినేట్ పదవులు ఇస్తే, వైఎస్ జగన్ ఏకంగా ఏడుగురికి పదవులు ఇచ్చారుచర్మకారులు, డప్పు కళాకారులకు వైఎస్ జగన్ పెన్షన్లు ఇచ్చారుచంద్రబాబు ఆ పెన్షన్లు చంద్రబాబు తొలగిస్తుంటే మంద కృష్ణ ఏం చేస్తున్నారు?చంద్రబాబు ప్రభుత్వంలో మాదిగలకు రక్షణ లేదు -
ఆర్థిక మంత్రి ఒకలా.. సివిల్ సప్లై మంత్రి మరోలా?
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీల అమలు విషయంలో.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం శాసన మండలిలో చర్చ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారాయన.‘‘దీపం-2 పథకాన్ని తప్పు దోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ పథకానికి బడ్జెట్లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు. ఎన్నికలకు ముందు ఈ పథకంపై విపరీతమైన హామీలిచ్చారు. ఎన్నికలయ్యాక అధికారంలో వచ్చి ఇప్పుడు మెలిక పెడుతున్నారు. ఆర్థిక మంత్రి ఒకలా.. సివిల్ సప్లై మంత్రి మరోలా దీపం2 గురించి మాట్లాడుతున్నారు. ప్రజలను మభ్య పెట్టి అధికారంలో వచ్చింది. ఇప్పుడు నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు వెంటనే అమలు చేయాలి.చేతిలో అధికారం ఉందని విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతామంటే కుదరదు. మా ప్రభుత్వ హయాంలో కూడా డిస్కంలకు సబ్సిడీ ఇచ్చాం. తల్లికి వందనం 18 వేలు ఇస్తామన్నారు? ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదు? అని బొత్స ప్రశ్నించారు. నేరస్తుల్లో భయం పోయిందినేరస్తులకు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై భయం పోయింది. నేరస్తులు రాష్ట్రంలో తీవ్రంగా నేరాలకు పాల్పడుతున్నారు. మా హయాంలో పెట్టుబడి వ్యయం చేయలేదని అన్నారు. మరి నాలుగు పోర్టులు, ఎయిర్ పోర్టు, మెడికల్ కాలేజీలు నిర్మాణం ఎలా జరిగాయి? అవి క్యాపిటల్ వ్యయం కాకుండా హాం ఫట్ అంటే వచ్చాయా? ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ -
‘ఐ-టీడీపీతో లోకేష్ చేయిస్తున్న పనే ఇదంతా’
సాక్షి, తిరుపతి: ఏపీలో తప్పు చేయని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐ-టీడీపీ నీచపు పోస్టులు చేసిందని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఏపీని హిట్లర్, గడాఫీ కలిసి పాలిస్తున్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్ట్‌లపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అమాయక సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమంగా కేసులు బనాయిస్తోంది. కూటమి కార్యకర్తలు, మద్దతుదారులు.. మా పార్టీ నాయకుడు వైఎస్ జగన్‌పై, నాయకులపై అసహ్యకరమైన సోషల్ మీడియా పోస్టులు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులను ఐ-టీడీపీ ద్వారా వాళ్లే సృష్టించి, అది మాపై నెట్టేస్తున్నారు. అంతటితో ఆగకుండా అమాయకులపై కేసులు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. ఐ-టీడీపీ ద్వారానే చాలా పోస్టులు వచ్చాయి. వాటిపైనే ఫిర్యాదు చేశాం. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారికి రిసీవ్డ్ కాపీ ఇవ్వాలి. కానీ, ఇవ్వకుండా మాతో దారుణంగా వ్యవహరించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.మాజీ మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో తప్పు చేయని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఏపీని హిట్లర్, గడాఫీ కలిసి పాలించినట్లు ఉంది. చంద్రబాబు, పవన్ పాలనలో అదృశ్యమైన మహిళల ఆచూకీ కోసం కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?. వైఎస్సార్సీపీ హయాంలో వేల సంఖ్యలో మహిళలు, యువకులు మిస్ అయ్యారని అబద్ధపు ప్రచారం చేశారు. అసెంబ్లీ సాక్షిగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. కేవలం 36 మందే అని తేలింది. ఇది హోంమంత్రే బయటకు చెప్పారు.చంద్రబాబు తప్పు చేసి ఎదుటివారిపై రుద్దుతున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు.. మీరెంత?. తప్పు చేయని వారిని వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలో ఎవరికీ న్యాయం చేయలేక డైవర్షన్ పాలిటిక్స్‌తో నెట్టుకొస్తున్నారు. మహిళలపై నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారు. మేము ఫిర్యాదు చేస్తే రిసీవ్డ్ కాపీ ఇవ్వడానికి వందసార్లు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. పోలీసులు.. మీ నెత్తిపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చెసే విధంగా ప్రవర్తించండి’ అంటూ కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ..‘మేం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు గంటల కొద్ది నిలబెట్టి ఫిర్యాదు తీసుకోవడానికి వెనకాడారు. మాకు ఉన్న ప్రోటోకాల్‌ను విస్మరిస్తే కచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ వేస్తామని హెచ్చరిస్తున్నాను. ప్రజా గొంతుకలను నొక్కే ప్రయత్నాన్ని విరమించుకోవాలి. లేదంటే రాబోయే రోజుల్లో తగిన మూల్యం తప్పదు.మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. మేము ఐ-టీడీపీపై ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు కేసు తీసుకోవడం లేదు. ఇంతటి దారుణమైన పోస్టులు పెడుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోరా?. అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఐ-టీడీపీ పోస్టులు పెడుతున్నా చర్యలు లేవు. ఏపీలో రాజ్యాంగ హక్కులు కాలరాశారు. పోలీసులు కేసుల పేరుతో వేధిస్తున్నారు. మేం ఎలాంటి బెదిరింపులకు లొంగ. చంద్రబాబు మీ కూటమి పార్టీల పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు త్వరలో ఉంది అని హెచ్చరించారు. -
సోమిరెడ్డి నోరు డ్రైనేజీ కంటే అధ్వాన్నం: కాకాణి
సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి పనుల్లో అవినీతి కట్టలు తెంచుకుని ప్రవహిస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారు రిటైర్ అయినా సరే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. పాత కేసులు తోడి నన్ను భయపెట్టాలని చూస్తున్నారు.. ఉడుత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు అంటూ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి కాకాణి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరును ఖండిస్తున్నాం. ఇరిగేషన్లో అవినీతి ఆరోపణలు చేస్తున్న సోమిరెడ్డి నోరు డ్రైనేజీ కంటే అధ్వాన్నంగా ఉంది. తూ.తూ మంత్రంగా పనులు ముగించి నీళ్ళు వదిలితే ఆ పనుల్లో నాణ్యత ఎలా ఉంటుంది. టెండర్ల కంటే ముందే పనులు ముగించిన అవినీతి ఘనత సోమిరెడ్డిది. పూడికతీత పనులు ఎంత నాణ్యతగా ఉన్నాయో ఇవే సాక్ష్యాలు (ఫోటో ప్రూఫ్).నవంబర్ ఏడో తేదీన నీళ్ళు వదిలిన ఘనతను దినపత్రికలే సాక్షిగా చెబుతున్నాయి. నీకు అనుకూలంగా వున్న కొద్ది మంది రైతుల దగ్గర పనులు జరగలేదని చెప్పించడం కాదు. మొత్తం కనుపూరు కాలువ మీద 30 కోట్ల అవినీతి జరిగింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారు రిటైర్ అయినా సరే జైలుకు వెళ్లక తప్పదు. సోమిరెడ్డి చేస్తున్న పనుల్లో అవినీతి కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. విచారణలో అవకతవకలు జరిగినట్లు తేలితే దాని మీద మళ్ళీ విచారణ చేయిస్తాం.పాత కేసులు తోడి నన్ను భయపెట్టాలని చూస్తున్నారు.. ఉడుత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. స్టేట్మెంట్తో మీరు స్ట్రిక్ట్ ఆఫీసర్లు కాలేరు. చిత్తశుద్ధితో పని చేయాలి. మద్యం షాపుల్లో ఎంఆర్పీ రేటు కంటే ఎక్కువ విక్రయిస్తే జరిమానాలు అన్నారు. సోషల్ మీడియాలో విమర్శలు చేశామని రెండు కేసులు నమోదు చేశారు. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతిపై క్యాష్ కొట్టు.. షాప్ పట్టు అని ఇప్పుడు కూడా చెబుతున్నాను. మీ అవినీతిని ఎప్పటికప్పుడు బయటకు చెబుతూనే ఉంటాం’ అని హెచ్చరించారు. -
అసెంబ్లీలో మంత్రి అనిత అనుచిత వ్యాఖ్యలు
అమరావతి, సాక్షి: ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో కంటే.. తమ హయాంలోని గత ఐదు నెలల కాలంలోనే క్రైమ్ రేటు విపరీతంగా తగ్గిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ ఆందోళనకుదిగగా.. మరోవైపు చైర్మన్ సైతం ఆమె తీరును తప్పుబట్టారు.ఏపీ శాసన మండలిలో శాంతి భద్రతలపై వాడీ వేడి చర్చ నడిచింది. తొలుత.. రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడంపై వరదు కళ్యాణి మాట్లాడారు. దిశ యాప్, చట్టాన్ని నిర్వీర్యం చేయడంపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీనిపై అనిత మాట్లాడుతూ.. అత్యాచార ఘటనను రాజకీయం చేయొద్దన్నారు. అలాగే.. మహిళల భద్రత పేరిట వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చిందని, దిశ పోలీస్ స్టేషన్లు గతంలో ఏర్పాటు చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించామని ఆమె అన్నారామె. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా విఫలం అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. అసహనానికి లోనైన ఆమె.. దమ్ము, ధైర్యం అంటూ ఆమె తీవ్ర పదజాలంతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో కొయ్యే మోషేన్‌రాజు, మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. బాధ్యత గల మంత్రిగా ఉండి.. దమ్ము ధైర్యం గురించి మాట్లాడం సరైనది కాదు అని అన్నారాయన. దీంతో ఆమె క్షమాపణలు చెప్పి కూర్చున్నారు. అయితే అనిత వ్యాఖ్యలపై నిరసనగా.. శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైనందున మండలి నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది. అంతకు ముందు..‘‘ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పై నేరాలు, వేధింపులు పెరిగాయి. రాష్ట్రంలో రోజుకు 59 నేరాలు మహిళల పై జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి గంట కి ఇద్దరు, ముగ్గురు మహిళలు పై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం వలన మహిళలు, చిన్నారుల పై నేరాలు జరుగుతున్నాయి. ముచుమర్రి లో 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసి చంపేస్తే ఈరోజు కి మృతదేహం దొరకలేదు. హిందూపురం లో అత్తా కోడళ్ల పై గ్యాంగ్ రేప్ చేశారు. ఏ ఆర్ పురంలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. దిశ యాప్ ని కొనసాగిస్తున్నారా..? లేదా..?. దిశ పోలీసు స్టేషన్ల ను కొనసాగిస్తున్నారా లేదా?. మహిళల పై నేరాల పై నియంత్రణ కు ఏదైనా కొత్త వ్యవస్థ తెచ్చారా..? అని మండలిలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు గుప్పించారు. -
అసెంబ్లీ సాక్షిగా అప్పులపై అసత్యాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అవాస్తవాలు చెప్పారని మాజీ ఆర్థికమంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. అసెంబ్లీలో రికార్డు అవుతుందని, నిజాలే చెప్పాలని తెలిసి కూడా వారిద్దరూ బాధ్యతారహితంగా మాట్లాడారన్నారు. ప్రభుత్వం పెట్టిన బడ్జెట్, కాగ్ పత్రాల్లో అసలు అప్పులెంతో తేలిందన్నారు. వాటి ప్రకారం అప్పులు రూ.6.46 లక్షల కోట్లేనని బాబు ప్రభుత్వం కూడా ఇదే చెప్పిందని బుగ్గన సాక్ష్యాధారాలతో ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.అలాగే, పయ్యావుల చెప్పింది నిజమా? లేక సీఎం చంద్రబాబు చెప్పింది నిజమా లేదా టీడీపీ మాజీ ఆర్థికమంత్రి యనమల చెప్పింది నిజమా.. అనేది ఒకసారి ముగ్గురు ఒకచోట కూర్చుని ఒక అంకెకు వస్తే మంచిదని బుగ్గన ఎద్దేవా చేశారు. అయినా, చంద్రబాబు రాష్ట్ర అప్పులు రూ.9,74,556 కోట్లంటూ అవాస్తవాలు చెప్పారని బుగ్గన తెలిపారు. ఇంకా తవ్వతే ఎంత వస్తుందోనని ఆయనన్నారని, తవ్వడానికి 6 నెలలు సరిపోలేదా.. ఇదేమైనా గండికోట రహస్యమా.. అని ప్రశి్నంచారు. ‘స్కాములన్నీ మీరే చేశారు. తండ్రీ కొడుకులు నీకింత.. నాకింత.. అని పంచుకుంటున్నారు.. బడ్జెట్లో సూపర్–6, సూపర్–7 పథకాలకు కేటాయింపులు ఎక్కడ..’ అని బుగ్గన ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. స్కీములన్నింటికీ రికార్డులున్నాయివైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర ఆదాయం తగ్గిందని, తలసరి ఆదాయం తగ్గిందని, మూలధన వ్యయం సున్నా అని, స్కీములన్నీ స్కాములేనంటూ చంద్రబాబు బాధ్యతలేకుండా అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు గుంజీలు ఎవరు తీయాలో సీఎం ఆలోచించుకోవాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కీములన్నీ డీబీటీ ద్వారానే అమలుచేసింది. వీటన్నింటికీ రికార్డులున్నాయి. మరి స్కాములెక్కడుంటాయి? అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం లైసెన్సులు, ఇసుక టెండర్లలో యథేచ్ఛగా దోపిడీ సాగించారు. తండ్రి కొడుకులు నీకింత.. నాకింత.. అని పంచుకున్నారు. మైనింగ్ కాంట్రాక్టులు కూడా దోపిడీయే. ఏ స్కాములో చూసినా మీరే కనిపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ బకాయిలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించిందిగత టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.42,188 కోట్లు బకాయిలు ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది. విద్యుత్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాల కోసం అప్పులు తీసుకుంటాయి. వాటితో ప్రభుత్వానికి సంబంధం ఎలా ఉంటుంది? వాటినీ పరిగణనలోకి తీసుకున్నా బాబు హయాం కన్నా మేమే తక్కువ అప్పులుచేశాం. బాబు అప్పుల పెరుగుదల 22.63 శాతమైతే మాది 13.57 శాతమేఇక గత టీడీపీ ప్రభుత్వంలో వార్షిక సగటు అప్పుల పెరుగుదల 22.63 శాతం కాగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అది 13.57 శాతమే. దీన్నిబట్టి చూస్తే ఎవరెక్కువ అప్పులు చేశారో తెలుస్తుంది? అలాగే, గత టీడీపీ ప్రభుత్వం పరిమితికి మించి రూ.16,400 కోట్లు అప్పులుచేసింది. ఈ అప్పును వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేంద్రం మినహాయించింది. మరోవైపు.. మూలధన వ్యయం సున్నా అని బాబు, సింగిల్ డిజిట్ అని యనమల చెప్పారు.. కానీ, మొన్నటి బడ్జెట్ డాక్యుమెంట్‌లోనే మూలధన వ్యయం రూ.23,330 కోట్లుగా చూపెట్టారు. ఇది సున్నా, సింగిల్ డిజిట్ ఎలా అవుతుందో చెప్పాలి. ‘విద్యుత్’పై ఆరోపణల్లోనూ నిజంలేదువిద్యుత్ సంస్థలకు రూ.1.29 లక్షల కోట్లు నష్టంచేసినట్లు చంద్రబాబు చేసిన ఆరోపణల్లోనూ నిజంలేదు. రాష్ట్ర విభజన నాటికి విద్యుత్ సంస్థల నష్టాలు రూ.6,625 కోట్లు ఉండగా చంద్రబాబు హయాంలో అవి రూ.28,715 కోట్లకు పెరిగాయి. అదే వైఎస్సార్సీపీ హయాంలో 2022–23 నాటికి అవి రూ.29,110 కోట్లే. రూ.395 కోట్లే పెరిగింది.ఎన్నికల ముందు తాము అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీల భారం తగ్గిస్తామని చెప్పిన కూటమి నేతలు... ఇప్పుడు 6 నెలల్లోనే రూ.6,072 కోట్లు విద్యుత్ చార్జీల భారం మోపారు. మరో రూ.12,000 కోట్లు భారం మోపేందుకు సిద్ధంగా ఉన్నారు. తలసరి ఆదాయం 2018–19 నాటికి రూ.1,54,031లతో దేశంలో రాష్ట్రం 18వ స్థానంలో ఉంటే.. 2022–23 నాటికి రూ.2,19,881లతో 15వ స్థానానికి చేరింది. యనమల ఆరోపణలు విచిత్రం.. విడ్డూరంఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల అయితే.. అప్పులపై చాలా అన్యాయంగా అవాస్తవాలు చెప్పారు. నిజానికి గ్యారెంటీ అప్పులు రూ.1.54 లక్షల కోట్లే. ఇక వేస్ అండ్ మీన్స్, ఓవర్‌డ్రాఫ్ట్ అనేది అన్ని ప్రభుత్వాలు చేసేవే. వాటిని అవసరమైన రోజులు తీసుకోవడం ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి తీర్చేయడం జరుగుతుంది. ఇలా తీర్చేసిన అప్పులను కూడా యనమల అప్పులుగా పేర్కొనడం.. విడ్డూరంగాను, విచిత్రంగాను ఉంది. అలాగే, ఆర్థిక విధ్వంసం, అరాచకం జరిగిందని ఆర్థికమంత్రి కేశవ్ అన్నారుగానీ, ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో చూపించలేకపోయారు? చిక్కీలపై బకాయి పెట్టామన్నారు. మరి వాళ్లు కోడిగుడ్లపై బకాయి పెట్టలేదా? రన్నింగ్ బిల్లులు పెండింగ్‌లో ఉండటం సహజం. ఆదాయం తగ్గలేదు, పెరిగిందిఆదాయం తగ్గిపోయిందని సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. 1999–2004 మధ్య బాబు పెంచిన ఆదాయం 12.4 శాతమైతే.. 2004–2009 మధ్య వైఎస్సార్ 21.6 శాతం పెంచారు. తిరిగి 2014–19 మధ్య బాబు ఆరు శాతం పెంచితే 2019–2024 మధ్య జగన్ 16% పెంచారు. సూపర్ సిక్స్‌లో పావు దీపం తప్ప మిగతా ఏవీ అమలుచేయలేదు. ఎన్నికల ముందు అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉండగా అవాస్తవాలు చెబుతూ తప్పులుచేస్తే ప్రజలు గమనిస్తారు. ప్రతీసారి మోసపోవడానికి ప్రజలు అమాయకులు కారు. ఈ వయస్సులో అసెంబ్లీలో అవాస్తవాలు చెప్పడం చంద్రబాబుకు తగదు. -
సోషల్‌మీడియా కార్యకర్తల కుటుంబాలకు వైఎస్సార్సీపీ నేతల భరోసా
సాక్షి,వైఎస్ఆర్జిల్లా: కడపలో సోషియల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ నాయకులు భరోసా ఇచ్చారు. సోషియల్ మీడియా కో కన్వీనర్ నిషాంత్, దుర్గా ప్రసాద్‌తో పాటు పలు కుటుంబాలను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు ఆదివారం(నవంబర్17) పరామర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ‘ గత కొన్ని రోజులుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలను నోటీసుల పేరుతో పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. సోషియల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు అర్థరాత్రి సమయాల్లో ఇళ్లకు వస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా? వారికి పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాం’అని తెలిపారు. -
అందుకే బీజేపీ నేతలు భయపడుతున్నారు: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌కు తెలంగాణ పోటీ వస్తుందని బీజేపీ నేతలు భయపడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి కాకూడదన్నది బీజేపీ నేతల ఉద్దేశంగా ఉందన్నారు. గుజరాత్ గులామ్‌లా ఎందుకు వ్యవహరిస్తున్నారు. మూసీ సుందరీకరణను ఎందుకు అడ్డుకుంటున్నారు?. క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవాలను పరిశీలించండి’’ అని మహేష్‌కుమార్ గౌడ్ హితవు పలికారు.మూసీ ప్రాజెక్టు ఆపేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై ఆపేందుకు కుట్ర చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోటో షూట్ కోసం మూసీ నిద్ర చేశారు. బస చేసే ముందు ఆ ప్రాంతంలో దోమల, ఈగల మందు కొట్టారు. మూడు నెలలు అక్కడ ఉంటే ప్రజల అవస్థలు తెలుస్తాయి. మూసీ పక్కన మూడు నెలల బస చేయండి అని మా సీఎం సవాల్.. నేను కూడా వస్తాను. మీరు నేను ఇద్దరం కలసి మూడు నెలలు అక్కడ బస చేద్దాం రండి. అక్కడి ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు.బీఆర్ఎస్ గ్రాఫ్ పడిన ప్రతీ సారి కిషన్‌రెడ్డి బయటకి వస్తాడు. బీఆర్ఎస్ను ప్రొటెక్ట్ చేయడానికి కిషన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కరోజు నిద్ర చేసి ఏం సాధించారు?. తెలంగాణ అభివృద్ధికి అందుకు అడ్డుపడుతున్నారు. సబర్మతి రివర్ ఫ్రంట్‌కి ఒక న్యాయం.. మూసీ రివర్కి ఒక న్యాయమా?. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి ఆదుకుంటాం. వారి పిల్లలకు విద్యావకాశాలు కల్పిస్తున్నాం. గుజరాత్ గులామ్‌లా ఎందుకు వ్యవహరిస్తున్నారు. ప్రపంచంతో తెలంగాణ పోటీ పడుతుందనగానే వీళ్లకు భయం పట్టుకుంది.ఒక్కరోజు నిద్రతో అక్కడి ప్రజల అవస్థలు ఏం తెలుసుకున్నారో చెప్పండీ. డీపీఆర్ వచ్చాక ఎక్కడ రిటర్నింగ్ వాల్ కట్టలో తెలుస్తుంది. ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది. పదేళ్లు తెలంగాణ అభివృద్ధి కుంటూ పడింది. అభివృద్ధిలో తెలంగాణ మార్పు చూస్తారు. తెలంగాణ రైజింగ్‌గా ముందుకు వెళ్తుంది. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. కిషన్‌రెడ్డి కాళ్లకు సాక్సులు వేసుకొని నిద్రపోయారు. అంటే అక్కడ ఎన్ని దోమలు ఉన్నాయో అర్థం అవుతుంది.బీజేపీ, బీఆర్ఎస్ ఎవరికి ఆపద వచ్చినా ఒకరిని ఒకరు పరస్పరం ఆడుకుంటున్నారు. బుల్డోజర్ పాలన మాది కాదు. కిషన్ రెడ్డి నడిపి అన్న యోగి అధిత్యనాథ్ది బుల్డోజర్ పాలన. నిజాం కాలంలో మూసీ బోర్డు కూడా ఉండేది. లగచర్ల దాడిలో కేటీఆర్ ఉన్నాడని స్పష్టమైంది.. కాబట్టే డైవర్ట్ చేయడానికి కిషన్‌రెడ్డి బస చేస్తున్నారు. మేము అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే నువ్వు అక్కడ ప్లాట్ కొనుక్కుంటావా కిషన్ రెడ్డి’’ అంటూ మహేష్‌కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. -
సూపర్ సిక్స్ కాదు.. సూపర్ బాదుడు మొదలైంది: కారుమూరి
సాక్షి, తణుకు: ఏపీ సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేసి సూపర్ బాదుడు అమలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఒకపక్క పెరిగిన పేదలు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు మాత్రం నిర్మల సీతారామన్‌ను ఒక పర్సెంట్ జీఎస్టీ పెంచుకోవటానికి అనుమతి అడుగుతున్నారుని అన్నారు.మాజీ మంత్రి కారుమూరి ఆదివారం తణుకు వైఎస్సార్సీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తాం పేదవారిని లక్షాధికారిని చేస్తామని చంద్రబాబు అబద్దాలు చెప్పాడు. ఆనాడు బాదుడే బాదుడు అని తిరిగిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నదేంటి?. సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారు.. ప్రజలకు సూపర్ బాదుడు అమలు చేస్తున్నారు.నాణ్యమైన కరెంట్ ఇస్తామని కరెంట్ చార్జీలు పెంచబోమని చెప్పి సూపర్ బాదుడు బాదుతున్నారు. ఆనాడు లోకేష్ రైతులను ఉద్దేశించి స్మార్ట్ మీటర్లు ఎవరూ పెట్టుకోవద్దని, అవి బిగిస్తే బద్దలు కొట్టాలని చెప్పాడు. ఇప్పుడు కేంద్రంతో కుమ్మక్కై స్మార్టుగా స్మార్టు మీటర్లు బిగించేస్తున్నారు. ఇది రైతులను మోసం చేసినట్లు కాదా?. వందల కోట్లు చందాలు వసూలు చేసి అగ్గిపెట్టె, కొవ్వొత్తులకి అయిపోయాయని మోసం చేశారు. అన్ని నిత్యవసర ధరలను ఇష్టానుసారం పెంచేశారు.ఒక్కసారి గమనిస్తే నూనె దగ్గర నుండి పప్పులు, ఉప్పులు, కూరగాయలు అన్నీ కూడా దారుణంగా పెంచేశారు. ఇప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న ధరలను ప్రజలకు ఒక్కసారి గమనించుకోండి. ఒక పక్క పేద ప్రజలు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు మాత్రం ఒక పర్సెంట్ జీఎస్టీ పెంచుకోవడానికి ఆర్థిక మంత్రిని అనుమతి అడుగుతున్నారు. అన్నీ అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసి వచ్చారు కూటమి నేతలు. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పే మీరు ఎక్కడ సంపద సృష్టించారు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై నిందలు మోపారు. అసెంబ్లీ సాక్షిగా అన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. మరి ఇప్పుడేం సమాధానం చెబుతారు’ అని ప్రశ్నించారు. -
కూటమి సర్కార్ ఫెయిల్.. చంద్రబాబుకు సీపీఐ వార్నింగ్
సాక్షి, విజయవాడ: ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? అనే సందేహం కలుగుతోందంటూ చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ధరల నియంత్రణలో ఇంత దారుణంగా ప్రభుత్వం ఫెయిలవుతుందని తాను ఊహించనేలేదన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ట్రూ అప్ ఛార్జీల 17 వేల కోట్ల రూపాయలు భారం రూపంలో మోపుతున్నారంటూ ఆయన నిలదీశారు.‘‘ఏపీ చరిత్రలో ఇంత భారం ఏనాడూ మోపలేదు. ట్రూ అప్ ఛార్జీల భారంపై ఈనెల 19న వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో భారీ నిరసన చేపడతాం. నవంబర్ నెలాఖరు వరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తాం. ట్రూ అప్ ఛార్జీలపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పెద్ద ఎత్తున పోరాడతాం. కరెంట్ ఛార్జీలు మోపితే కచ్చితంగా అదే మీకు శాపం అవుతుంది. డిసెంబర్లో విద్యుత్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం’’ అని రామకృష్ణ హెచ్చరించారు.‘‘నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ధరలను నియంత్రించలేకపోతున్నారు. చంద్రబాబు బుస్ బుస్ అనడం తప్ప ఏం ఉపయోగం లేదు. నాదెండ్ల మనోహర్ అక్కడక్కడా తిరిగినా ఏం ప్రయోజనం. ముఖ్యమంత్రులు, మంత్రుల మాట ఒక్కడు ఖాతరు చేయడం లేదు. మంత్రుల హుకరింపులు తప్ప ధరలు తగ్గిందే లేదు. ఒక్క వస్తువుపై ఒక్క రూపాయి కూడా తగ్గలేదు’’ అని రామకృష్ణ దుయ్యబట్టారు.‘‘ఉచిత ఇసుకను అధికారపార్టీ ఎమ్మెల్యేలే ఫెయిల్ చేశారు. మీ ఎమ్మెల్యేలే బ్లాక్ చేసి అమ్ముకుంటుంటే కంట్రోల్ చేయలేకపోతున్నారు. ప్రభుత్వం చెప్పిన మాట ఏదీ అమలు కావడం లేదు. ప్రభుత్వం చెప్పిన మాట ఎవరూ వినే పరిస్థితి ఏపీలో కనిపించడం లేదు. నీటిపారుదల రంగంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరగబోతోందనే ఆందోళన నెలకొంది. గోదావరి, కృష్ణా,పెన్నా నదులను అనుసంధానం చేస్తానని చంద్రబాబు చెబుతున్నాడు. పోలవరం అంశంలో కేంద్రం పదేపదే ఆటంకాలు కలిగించాలని చూస్తోంది. కానీ కేంద్రం వైఖరితో అన్ని రకాలుగా మనకు ప్రమాదం పెరుగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి’’ అని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.‘‘పోలవరం ఎత్తు 4.15 మీటర్లకు కుదించాలనే ప్రయత్నం జరుగుతోంది. ఏపీ ప్రయోజనాలు నెరవేరాలంటే పోలవరం 45.72 మీటర్ల ఎత్తు ఉండాల్సిందే. ఎత్తు తగ్గించడం వల్ల నిర్వాసితులకు ఇవ్వాల్సిన రూ.25 వేల కోట్లు ఆదాయం చేసుకోవాలని చూస్తున్నారు. పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్ధ్యం తగ్గించాలని చూస్తున్నారు. నిధులు ఆదా చేసుకునేందుకు పరిహారం ఎగ్గొట్టేందుకే ఈ ప్రయత్నాలు. ఎత్తు తగ్గింపు, కాలువల సామర్ధ్యం తగ్గింపు ద్వారా 29 వేల కోట్లు ఎగ్గొట్టాలని చూస్తున్నారు. పదే పదే ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు పోలవరం విషయంపై కేంద్రంతో ఏం మాట్లాడుతున్నారు. పోలవరం విషయంలో కేంద్రం ఏం చెప్పింది?. మీరు ఏం వివరించారో ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని రామకృష్ణ నిలదీశారు.‘‘విభజన బిల్లులో 6 ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉంది. 194 టీఎంసీల నీటిలో కోత పెట్టాలని చూస్తున్నారు. గోదావరి, కృష్ణానది జలాల్లో ఏపీకి అన్యాయం జరగకుండా చంద్రబాబు చూడాలి. పోలవరం పై చంద్రబాబు తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. రాజకీయ, ఇరిగేషన్, రైతు సంఘాలతో చర్చించాలి. పోలవరం పార్టీ వ్యవహారం కాదు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం. నదీ జలాల్లో మరోసారి అన్యాయం జరిగితే ఏపీ భవిష్యత్తు అంధకారమే. పోలవరంపై చంద్రబాబు తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని రామకృష్ణ డిమాండ్ చేశారు. -
దమ్ముంటే అరెస్ట్ చేయండి.. యనమలకు కృష్ణుడి సవాల్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేత యనమల రామకృష్ణుడుకు ఆయన తమ్ముడు, వైఎస్సార్సీపీ నేత కృష్ణుడు సవాల్ కూడా విసిరారు. రామకృష్ణుడికి దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. తనను అరెస్ట్ చేస్తే రామకృష్ణకు మంచిపేరు వస్తుందన్నారు.వైఎస్సార్సీపీ నేత యనమల కృష్ణుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కూటమి నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని సోషల్ మీడియా కార్యకర్తలను హింసిస్తున్నారు. నా దగ్గర పనిచేసే కుర్రాళ్లను, డ్రైవర్లను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కేసులు పెడుతున్నారు. నిజంగా యనమల రామకృష్ణకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయాలి. నన్ను అరెస్ట్ చేస్తే యనమలకు మంచి పేరు వస్తుంది.అక్రమ కేసులు, అరెస్ట్‌లకు ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరు. 40 ఏళ్ళు రాజకీయాలు చేశాను.. ఇలాంటి చౌకబారు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నానని చులకనగా చూడొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. -
కూటమి సర్కార్ కక్ష సాధింపు.. కొడాలి నానిపై కేసు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి నేతల ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా కూటమి నేతలు, పోలీసులు ముందుకు సాగుతున్నారు. నిన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగగా.. ఇప్పుడు రాజకీయ నాయకులపై వేధింపులు మొదలయ్యాయి.మాజీ మంత్రి కొడాలి నానిపై లా విద్యార్థినితో కూటమి నేతలు ఫిర్యాదు చేయించారు. కూటమి నేతలు మాత్రమే కాకుండా విద్యార్థులను కూడా రాజకీయ కక్షలకు పావులుగా వాడుకుంటున్నారు. లా విద్యార్థిని ప్రియతో కూటమి నేతలు.. కొడాలి నానిపై త్రీటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయించారు. చంద్రబాబుపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో, పోలీసులు నానిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
‘లెక్క ఇది.. గుంజీలు ఎవరు తీయాలో ఆలోచించుకో బాబూ?’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలోనూ కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. డీబీటీ ద్వారా అబ్ధిదారులకు లబ్ధి చేకూరితే స్కాం ఎలా జరుగుతుందంటూ చంద్రబాబును ప్రశ్నించారు.‘‘రాష్ట్ర అప్పులపై గతంలో ఓ మాట, ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారు. అబద్దాన్ని నిజం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. 9.56 లక్షల కోట్లు అప్పులున్నాయని.. తవ్వితే ఇంకెన్ని ఉన్నాయో అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. తవ్వడానికి ఏముంది? ప్రతి కార్పొరేషన్ మీ చేతిలోనే ఉంది ఆడిట్ జరుగుతాయి కదా?. గుంజీలు ఎవరు తీయాలో మీరే ఆలోచించుకోండి’’ అని బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు.‘‘2014-15లో ఓపెన్ మార్కెట్లో ఎక్కువ వడ్డీ పెట్టీ అప్పు తెచ్చుకున్నారు చంద్రబాబు. మాపై అప్పులు ఎక్కువ అయ్యాయని, ఎక్కువ వడ్డీ తో అప్పులు తీసుకున్నారని వైఎస్ జగన్ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మాజీ, ప్రస్తుత ఆర్ధిక మంత్రికి లెక్కలు అర్థం కావా?’’ అంటూ బుగ్గన ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: రాజ్యమేలుతున్న మారీచ తంత్రం!‘‘2014-19లో ట్రూ అప్ చార్జీలు రూ.6,625 కోట్ల నుంచి 28,717 కోట్లకు పెరిగింది. మా ప్రభుత్వ హయాంలో 2,300 కోట్ల మాత్రమే వినియోగదారులపై భారం వేశాం. తాజాగా 5 నెలల్లోనే రూ.6,770 కోట్లు వినియోగదారులపై భారం మోపారు. ఇంకా రూ.12 వేల కోట్ల ట్రూ అప్ చార్జీల భారం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.’’ అని బుగ్గన నిప్పులు చెరిగారు. -
పవన్ ఆత్మవిమర్శ చేసుకో.. ఇది అసలు నిజం: ఆర్కే రోజా
సాక్షి, చిత్తూరు జిల్లా: కూటమి సర్కార్ తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతల దుష్ప్రచారం బట్టబయలైందంటూ ఆమె ట్వీట్ చేశారు. మిస్సింగ్ కేసుల్లో 99.5 శాతానికిపైగా మహిళలను గత ప్రభుత్వంలోనే గుర్తించారని కేంద్ర హోంశాఖ కూడా పార్లమెంట్లో స్పష్టం చేసింది. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ ఆత్మ విమర్శ చేసుకోవాలి. అధికారం కోసం ఎంతటి అబద్ధమైనా చెప్తారా?’’ అంటూ ఆర్కే రోజా నిలదీశారు.అసెంబ్లీ సాక్షిగా ఇన్నాళ్లు @JaiTDP, @JanaSenaParty చేసిన తప్పుడు ప్రచారం బట్టబయలైంది.గత @YSRCParty ప్రభుత్వం లో వాలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని, 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధం.ఐదేళ్ళలో 34 కేసులు మహిళల అక్రమ రవాణాకు సంబంధించి… pic.twitter.com/vTBGvDWsKN— Roja Selvamani (@RojaSelvamaniRK) November 16, 2024 -
వాలంటీర్లకు బాబు,పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి: వరుదు కళ్యాణి
సాక్షి,విశాఖపట్నం: ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్, చంద్రబాబు రాష్ట్రంలో 30 వేల మందికిపైగా మహిళలు మాయమయ్యారని ప్రచారం చేశారని వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గుర్తుచేశారు. ఈ మేరకు శనివారం(నవంబర్ 16) వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు.‘వాలంటీర్ల ద్వారా 30 వేలకు పైగా మహిళలు అక్రమ రవాణా అయ్యారంటూ అబద్ధాలు చెప్పారు.ఇప్పుడేమో అసెంబ్లీ వేదికగా 34 మంది మహిళలే మిస్ అయ్యారని చెప్పారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు మాటలు అసత్యమని అసెంబ్లీ వేదికగా తేలిపోయింది. వాలంటిర్లకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. హిందూస్తాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో చంద్రబాబు అబద్ధాలు చెప్పారు.అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు మొదటి నుంచి అలాటు. ఫేక్ అకౌంట్స్ సృష్టించి విజయమ్మ,షర్మిళపై తప్పుడు ప్రచారం చేసింది టీడీపీనే. పవన్ కల్యాణ్ అమ్మపైన టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసింది. తన తల్లిపై లోకేష్ తప్పడు ప్రచారం చేయిస్తున్నారని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలి.కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది’అని వరుదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: పోలీసుల తీరు అమానుషం.. గౌతమ్‌రెడ్డి కుమార్తె లిఖిత -
పన్నులు పెంచడమే సంపద సృష్టించడమా?: మార్గాని భరత్
సాక్షి,తూర్పుగోదావరిజిల్లా:ఒక శాతం అదనంగా జీఎస్టీ పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి,రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సంపద సృష్టించడం అంటే ట్యాక్స్‌లు పెంచేయడమా అని ప్రశ్నించారు. శనివారం(నవంబర్ 16) రాజమండ్రిలో మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు.‘రాజుల కాలంలో ప్రజలను దోచుకుని ఖజానాలు నింపుకునేవారు ..అది ఇదేనా?విజయవాడ వరదల్లో డబ్బు ఎలా పక్కదారి పట్టించారో అందరికీ తెలుసు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు.. ఉరితాళ్ళు అని ఈనాడులో రాశారు.ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చేశాయ్ అని ఇదే అంశంపై ఈనాడులో కథనం వచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా..ప్రతిపక్షంలో ఉంటే మరోలా ప్రవర్తిస్తారు.ఐదు నెలల్లో రూ.57వేల కోట అప్పులు చంద్రబాబు చేశారు.ఐదు నెలల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో టీడీపీ చెప్పిన అబద్ధాలు స్పష్టమయ్యాయి. గతంలో వైఎస్జగన్ రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా రూ. 6 లక్షల కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయని తేల్చారు. స్మార్ట్ మీటర్ల పేరు చెప్పి రూ.11వేల కోట్లు ప్రజలపై రుద్దేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 15 నుంచి యూనిట్ రూపాయి 58 పైసలు పెంచేందుకు బాదుడు సిద్ధం చేశారు.టీడీపీ ఎమ్మెల్యేలు యథేచ్చగా ఇసుక అమ్ముకుంటున్నారు. ఇసుక పాలసీపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వేలకోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లభించేది. ఈనాడులో నిస్సిగ్గుగా వైఎస్జగన్ కుటుంబ సభ్యులపై వార్తలు రాయడం దారుణం. మనుషుల క్యారెక్టర్‌ను అసాసినేట్ చేసే విధంగా ఫేక్ అకౌంట్లు సృష్టిస్తున్నారు’అని మార్గాని భరత్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: బీజేపీ కోసం ఏపీ ప్రయోజనాలు పణం -
పోలీసులు తీరు అమానుషం: గౌతమ్‌రెడ్డి కుమార్తె లిఖిత
సాక్షి, విజయవాడ: పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని వైఎస్సార్సీపీ నేత పూనూరు గౌతమ్‌రెడ్డి కుమార్తె లిఖిత మండిపడ్డారు. ఫోన్ చేస్తే అందుబాటులో ఉండే వ్యక్తి గౌతమ్ రెడ్డి.. పోలీసులు అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏముంది? అంటూ ఆమె ప్రశ్నించారు. సుమారు 30 మందికి పైగా కరెంట్ తీసేసి ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడ్డారన్నారు.‘‘అసలు పోలీసులు వచ్చింది ఎందుకు?. నా తండ్రిని తీసుకెళ్లిపోవడానికా.. ఎత్తుకెళ్లిపోవడానికా.. దాచేయడానికా?.. ఏకంగా చంపేయడానికా?. పోలీసులు తీసుకెళ్లి ప్రశ్నించే పద్ధతి ఇది కాదు. పోలీసులు వచ్చిన సమయంలో మా నాన్న లేరు కాబట్టే ఆయన బతికున్నారని నేను అభిప్రాయ పడుతున్నా. మా తల్లికి 66 ఏళ్లు. ఆమెకు అనారోగ్య సమస్యలున్నాయి. అర్ధరాత్రి బెడ్ రూమ్ తలుపులు బాదుతూ ఆమెను ఇబ్బంది పెట్టారు. డోర్లు వేసుకోకుండా పడుకున్నారేంటంటూ పోలీసులు రివర్స్‌లో దబాయించారు’’ అని లిఖిత ఆవేదన వ్యక్తం చేశారు.‘‘గౌతమ్‌రెడ్డిని ఎక్కడ దాచావ్?. ఎక్కడికి వెళ్లాడు. ఎక్కడెక్కడికి వెళ్తాడంటూ భయపెట్టారు. ఫ్రెండ్లీ పోలీస్ ... ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా?. పోలీసుల తీరు చూస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగంలాగే ఉంది’’ అని లిఖిత ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పవన్ కల్యాణ్ లెక్క తప్పింది!.. శాసనసభ సాక్షిగా బయటపడ్డ నిజం ఇదే
అమరావతి, సాక్షి: కూటమి పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన సంచలన ఆరోపణలపై.. అసెంబ్లీ సాక్షిగా నిజం నిగ్గు తేలింది. మహిళల అక్రమ రవాణాకు సంబంధించిన లెక్కలపై ఓ స్పష్టత ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో..గత ఐదేళ్లలో మహిళల అక్రమ రవాణా కేసులు 34 మాత్రమే నమోదుకాగా.. వీటిల్లో 46 మందిని బాధితులుగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ హోం శాఖ. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్నకు.. గణాంకాలతో సహా అసెంబ్లీలో ప్రకటించింది. అసెంబ్లీలో వెల్లడైన ఈ సమాధానంతో.. గతంలో పవన్, చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్ధమని తేలిపోయింది.గతేడాది జూలై 9న ఏలూరులో వారాహి యాత్రలో పవన్ సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో వలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని, ఇందుకు వలంటీర్ వ్యవస్థ కారణమైందని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు, టీడీపీ కూడా ఇదే ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు.. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలకు వేసిన ప్రశ్నతో ఆ లెక్క తేలింది.