-
వైఎస్ జగన్ ఆదేశం.. వైఎస్సార్సీపీ ‘ప్రత్యేక టాస్క్‌ఫోర్స్’
తాడేపల్లి : ఏపీలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ‘ప్రత్యేక టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒకవైపు అక్రమ అరెస్టులు చేస్తూనే వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. దీనిని సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, భరోసా కల్పించడం, ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి తాజాగా ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పని చేయనుంది.జిల్లాలవారీగా టాస్క్‌ఫోర్స్ వివరాలుశ్రీకాకుళం : సీదిరి అప్పలరాజు, శ్యామ్విజయనగరం: బెల్లాని చంద్రశేఖర్, జోగారావువిశాఖపట్నం : భాగ్యలక్ష్మి, కెకె రాజుతూర్పు గోదావరి : జక్కంపూడి రాజా, వంగా గీతపశ్చిమ గోదావరి : కె.సునిల్‌కుమార్ యాదవ్, జయప్రకాష్ (జేపి)కృష్ణా : మొండితోక అరుణ్ (ఎమ్మెల్సీ), దేవభక్తుని చక్రవర్తిగుంటూరు : విడదల రజని, డైమండ్ బాబుప్రకాశం : టీజేఆర్ సుధాకర్‌బాబు, వెంకటరమణారెడ్డినెల్లూరు : రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి (ఎమ్మెల్సీ)చిత్తూరు : గురుమూర్తి (ఎంపీ), చెవిరెడ్డి మోహిత్రెడ్డిఅనంతపురం : కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేష్గౌడ్కడప : సురేష్‌బాబు, రమేష్యాదవ్కర్నూలు హఫీజ్‌ఖాన్, సురేందర్‌రెడ్డి -
‘హామీలు నిలబెట్టుకోలేక.. అప్పులపై చంద్రబాబు తప్పుడు లెక్క’
సాక్షి, విశాఖపట్నం: అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు అబద్ధాలు ఆగలేదంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారని.. రాష్ట్రం దివాలా తీసిందంటూ దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారని చంద్రబాబు చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో 6 లక్షల 40 వేల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోక చంద్రబాబు అప్పులపై తప్పుడు లెక్కలు చెబుతున్నారు’’ అని దుయ్యబట్టారు.వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే సమయానికి 3 లక్షల 13 వేల కోట్లు అప్పు ఉంది. కోవిడ్ పరిస్థితిని తట్టుకొని వైఎస్ జగన్ పాలన చేశారు. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు. చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. చంద్రబాబు మోసాలు బయటపడతాయని వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు’’ అని అమర్నాథ్ ఎండగట్టారు.పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి గతంలో ఏ ప్రభుత్వం ఆరు నెలలు సమయం తీసుకోలేదు. పథకాలకు కేటాయింపులు సక్రమంగా జరపలేదు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు. 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారికి రూ. 12,500 వేల కోట్లు ఖర్చు అవుతుంది. బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించారు. 18 ఏళ్లు దాటిన మహిళలు రాష్ట్రంలో కోటి 50 లక్షలు మంది వరకు ఉన్నారు. వారికి ఏడాదికి 26,000 వేల కోట్లు ఖర్చు అవుతుంది. బడ్జెట్లో ఆడబిడ్డ నిధికి బడ్జెట్లో ఒక రూపాయి కేటాయించలేదు. నిరుద్యోగ భృతికి ఒక రూపాయి కేటాయించలేదు. చంద్రబాబు హామీలకు ఏడాదికి లక్ష 20 వేల కోట్లు అవసరం. చంద్రబాబు బడ్జెట్లో 30 వేల కోట్లు ఖర్చు చేశారు...సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు తర్వాత మమ్మలను అరెస్టు చేస్తారు. మేము దేనికైనా సిద్ధం. మా తాత పేరు మీద ఉన్న ట్రస్ట్‌కు 20 ఏళ్ల క్రితం ఇచ్చిన భూమి పేపర్లు తేవాలని అడుగుతున్నారు. పోలీసులకు భయపడేది లేదు’’ అని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. -
బడ్జెట్లో సూపర్ సిక్స్‌ల ఎగవేత.. బాబు చేసింది మోసం కాదా?: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి జిల్లా: ఏపీలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై సీఎం చంద్రబాబును మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చిన చంద్రబాబు. .బడ్జెట్లో వాటిని ఎగ్గొట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులను బాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్‌లో స్పందించారు.. @ncbn గారు.. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టారు!నువ్వు చేసింది మోసం కాదా?యువతని మోసం చేశారుమహిళలను మోసం చేశారురైతులను మోసం చేశారుఆడబిడ్డ నిధి:18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళ…— Roja Selvamani (@RojaSelvamaniRK) November 14, 2024 -
విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు
సాక్షి, ఢిల్లీ: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను ఈసీ రద్దు చేసింది. -
కూటమి బడ్జెట్ మోసాలను ప్రశ్నిస్తే అడ్డుకుంటారా?: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
సాక్షి, తాడేపల్లి: మండలిలో మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే అడ్డు తగులుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ఏపీ శాసన మండలి మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ 3 సిలిండర్లు ఇస్తామని ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టారని ధ్వజమెత్తారు. రూ.5,387 కోట్లు ఇస్తే తల్లికి వందనం ఎలా అమలు చేస్తారు? అని ప్రశ్నించారు.కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది: వరుదు కల్యాణిప్రశ్నిస్తే గొంతును నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటివరకు ఇవ్వలేదు. రైతులకు కేటాయించిన రూ.వెయ్యి కోట్లు ఎప్పుడిస్తారో చెప్పలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా జగన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం విధ్వంసమంటారా?. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పోర్టులు కట్టడం చీకటి పాలన అవుతుందా?. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను మంత్రులు దెబ్బతీయాలని చూస్తున్నారు.బడ్జెట్‌పై చర్చ పక్కదారి: తోట త్రిమూర్తులుబడ్జెట్పై చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. పవర్ సెక్టార్‌పై చర్చ జరగకుండా చేశారు. పలు సమావేశాల్లో కరెంట్ ఛార్జీలు పెంచనని చంద్రబాబు చెప్పారు. ఒక్క రూపాయి ఛార్జీ పెంచనని చెప్పి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు. తమ మోసాన్ని ప్రజలకు తెలియకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ సందర్భం లేని చర్చను తెరపైకి తెచ్చారు. బడ్జెట్ పై వరుదు కళ్యాణి మాట్లాడుతుంటే మా తల్లిని అవమానించారంటూ లోకేష్ చర్చను తప్పుదారి పట్టించారు. గతంలో ఎప్పుడూ లేని పరిస్థితులను సభలో చూస్తున్నాం. సోషల్ మీడియై పోస్టులపై చర్చకు కోరితే అడ్డుకున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియకూడదనే టీడీపీ ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్నారు. సూపర్ సిక్స్‌లు అమలు చేయకుండా కూటమి నేతలు ప్రజలను మోసం చేస్తున్నారు.ఇదీ చదవండి: బడ్జెట్‌పై వరుదు కల్యాణి ప్రశ్నలు.. పదేపదే అడ్డుకున్న టీడీపీ మంత్రులు -
అధికారంతోనే పచ్చ బ్యాచ్ స్వరం మారింది!
రాజకీయం అంటే నాలుక మడతేయడమేనా? బాబు మార్కు రాజకీయాలు చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం.. అధికారంలోకి రాగానే అవన్నీ మరచిపోయి సుద్దులు చెప్పడం! ఈ విషయంలో ఇప్పుడు బాబుకు పవన్ తోడైనట్టు కనిపిస్తోంది. నేనంటే నేను అన్న చందంగా మాటమార్చే విషయంలో ఇరువురూ పోటీ పడుతున్నారు కూడా. రాష్ట్రంలో అరాచకాలను కట్టడి చేయాల్సిన వీరే వాటిని ఉసిగొలుపుతున్నట్లుగా ఉందీ ప్రస్తుతం పరిస్థితి.ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసులు, అరెస్ట్‌లు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పోలీసు అధికారులను తమ చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్న బాబు అండ్ కో చట్టాలను అతిక్రమిస్తున్న తీరు దారుణంగా ఉంది. కేసులు, అరెస్ట్‌లను దాటి పోలీసులు వీరిపై నీచాతినీచంగా బూతులు తిడుతున్నారన్న వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబుల వ్యాఖ్యలకు ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ వైసీపీ అధినేత జగన్ తాము మళ్లీ అధికారంలోకి వస్తామని అప్పుడు ఇలా అకృత్యాలకు పాల్పడ్డ పోలీసు అధికారులు చట్ట ప్రకారం శిక్షకు గురవుతారని హెచ్చరించారు. కానీ.. ఈ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ వక్రీకరించి వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. ఐపీఎస్ అధికారులనే బెదిరిస్తున్నారా? అంటూ పవన్ జగన్‌ను విమర్శించే ప్రయత్నం చేశారు. సూమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు కూడా.సినీ నటుడిగా పవన్ పౌరుల హక్కుల కోసం పోరాడే హీరో పాత్రలో బోలెడు పోషించారు పవన్. రాజకీయ జీవితంలో మాత్రం వాటిని హరించేలా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు అల్లర్లు చేసినా, దొమ్మీలకు పాల్పడ్డ అసలు ఎలాంటి చర్యలూ తీసుకోరాదన్నట్టు వపన్ మాట్లాడిన విషయం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి మంత్రి రోజాపై జనసేన కార్యకర్తల దాటికి సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకుంటే పవన్ చేసిన హడావుడిని అందరూ చూసే ఉంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పవన్‌కు మద్దతుగా నిలిచారు.మంత్రిపై దాడి జరగడం ప్రభుత్వ తప్పు అన్నట్లు ప్రచారం చేశారు. ఇక స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బాబుకు పవన్ వత్తాసు పలకడం.. శాంతి భద్రతల సమస్య రాకూడదన్న ఉద్దేశంతో ఆయన్ను అడ్డుకుంటే రోడ్డుపై పడుకుని యాగీ చేయడం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో ఉండే ఉంటుంది. ఒక దశలో చంద్రబాబు పోలీసులనే నేరుగా సంఘ విద్రోహశక్తులన్నట్టు చిత్రీకరించారు. వారిని బెదిరించిన సందర్భాలైతే లెక్కలేనన్ని. తండ్రి తీరు ఇలా ఉంటే.. ఆయన కుమారుడు లోకేష్ రెడ్‌బుక్ అంటూ పోలీసు అధికారులను పేర్లు చెప్పి మరీ బెదిరించిన వైనం చూశాం. పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తలు దొమ్మీకి దిగి పోలీసు వాహనాన్ని దగ్ధం చేయడమే కాకుండా.. వారిపై రాళ్లూ విసిరారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. అంత జరిగినా అప్పట్లో పవన్ పోలీసులపై కనీస సానుభూతి చూపలేదు. అప్పట్లో ఈనాడు వంటి మీడియా సంస్థలు ఏ చిన్న గొడవ జరిగినా చిలువలు పలువలుగా చేసి కథనాలు రాయడం.. వాటిని అందుకుని టీడీపీ, జనసేన కార్యకర్తలు రెచ్చిపోవడం మనం చూశాం. ఎక్కడైనా మానభంగాలు జరిగితే ప్రభుత్వంపై వారు అప్పట్లో దారుణమైన విమర్శలు చేసేవారు.2017లో జరిగిన సుగాలి ప్రీతి హత్యోదంతం ఇందుకు ఒక ఉదాహరణ. తాము అధికారంలోకి వస్తే ఈ కేసురె మొదటగా తీసుకుంటామని నాటకీయంగా చెప్పారు. పవర్లోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఆ కేసును ఏమి చేశారో తెలియదు. రాష్ట్రంలో 35 వేల మంది మహిళలు తప్పిపోయినా ప్రభుత్వం ఏం చేస్తోందని, పోలీసులు ఏమయ్యారని కూడా అప్పట్లో పవన్ పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఊసే ఎత్తడం లేదు. మంగళిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో రోడ్ల ఆక్రమణలు తొలగింపుపై నిరసన తెలిపేందుకు పవన్ వెళుతూండగా పోలీసులు వారించారు. అయినాసరే ఆయన కారుపై కూర్చుని మరీ నాటకీయ ఫక్కీలో అలజడి సృష్టించారు. అయినా ఆనాటి ప్రభుత్వం పవన్ పై ఎప్పుడూ కేసులు పెట్టలేదు. అలాగే పోలీసులను పలుమార్లు దూషించిన చంద్రబాబు, లోకేష్‌లను కూడా ఏమీ చేయలేదు. ప్రస్తుత మంత్రి అచ్చన్నాయుడు గతంలో పోలీసులను ఎంత నీచంగా దూషించారో వినాలన్నా ఇప్పుడు సిగ్గేస్తుంది.ఇప్పుడు వీరందరికి అధికారం దక్కిందో లేదో.. స్వరం మార్చారు. పోలీసు శాఖలో ఎవరైనా రూల్ ప్రకారం వెళితే ఊరుకోవడం లేదు. వెంటనే బదిలీ చేస్తున్నారు. కడప ఎస్పి బదిలీనే ఇందుకు ఉదాహరణ. చంద్రబాబు నెల రోజులలో పోలీసులను సెట్ చేస్తానంటే ఇదా అని అంతా విస్తుపోతున్నారు. ఇప్పటికి 680 మందికి నోటీసులు ఇవ్వడం, 147 మందిపై కేసులు పెట్టడం, 49 మందిని అరెస్టు చేయడం అసాధారణ చర్యగా కనిపిస్తుంది. మరి వైసీపీ నేతలను దూషిస్తూ కామెంట్లు పెట్టిన ఒక్కరిపై కూడా కేసు రాలేదు. అధికారం ఉంటే ఏమైనా చేయవచ్చని ఈ ఉదంతాలు తేటతెల్లం చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం సాధ్యం కాదని, విద్యార్ధినులు, మహిళలపై దాడులను సమాజమే ఎదుర్కోవాలని ఆయన సూక్తి ముక్తావళి వల్లిస్తున్నారు. ఒకపక్క వైసీపీ వారిపై ఇంత అక్రమ కేసులు పెడుతూ, అత్యాచారాలు చేసిన వారిని పట్టుకోలేమన్న సంకేతం ఇచ్చే విధంగా పవన్ మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఈయన హోం మంత్రి అయితే మాత్రం ఒరిగేది ఉంటుంది? వైసీపీ పాలన అయితే ఏమి జరిగినా జగన్ బాధ్యత వహించాలి. కూటమి పాలనలో మాత్రం సమాజమే రక్షించుకోవాలన్న మాట. అధికారులను బెదిరిస్తే కేసులు అని అంటున్న పవన్ కళ్యాణ్ ముందుగా గతంలో తనతోసహా చంద్రబాబు, లోకేష్‌లు చేసిన దూషణలకు సుమోటోగా కేసు పెట్టించుకుంటారా? అంతెందుకు ప్రభుత్వాన్ని జనం బూతులు తిడుతున్నారని చెప్పిన సందర్భంలో పోలీసులను ఉద్దేశించి ఆయన ఏమన్నారో మర్చిపోతే ఎలా? చిన్నపిల్లలపై అత్యాచారం కేసులో పోలీసులు కులం చూసి చర్య తీసుకోవడం లేదని అన్నారంటే ఆ పోలీసు అధికారికి ఎంత అవమానం? కూటమి ప్రభుత్వానిది ఎంత అసమర్థత?వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి పచ్చ ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు చేస్తోంది అన్నది వాస్తవం. తప్పు ఎవరు చేసినా తప్పే అన్నట్లు కాకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎదురయ్యే పరిణామాలకు ఆ శాఖ బాధ్యత కూడా వహించదా? ఒక మోసకారి నటి వ్యవహారంలో తప్పుడు కేసులు పెట్టారంటూ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు లెక్కకు మిక్కిలిగా పోలీసు అధికారులు ఇష్టారీతిన దౌర్జన్యాలకు దిగుతుంటే, బూతులు తిడుతుంటే, దానిపై ప్రతిపక్షంగా వైసీపీ అధినేత జగన్ స్పందించకుండా ఎలా ఉంటారు? మాట్లాడకపోతే ఆ పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యం నిలబడుతుంందా? వైసీపీ నేత పేర్నినాని ఓపెన్ గా తుళ్లూరు డీఎస్పీ పేరు చెప్పి మరీ ఆయన చేస్తున్న ఘాతుకాలను మీడియాకు తెలిపారు.దానికి ఆ అధికారి ఏమి జవాబు ఇస్తారు? అలాగే ఆరబ్ దేశాలలో ఫలానా శిక్ష వేస్తారని చెబుతూ రాజును మించిన రాజభక్తి ప్రదర్శించిన మరో ఐపీఎస్ అధికారికి నాని సవాల్ విసిరారు. చట్ట ఉల్లంఘన చేసే పోలీసు అధికారులకు కూడా ఆయా దేశాలలో ఉరి శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు. వైసీపీ సోషల్ మీడియాను అంతం చేయడానికి, వారిని భయభ్రాంతులను చేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతాయని మరో నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు.గతంలో ఒక నాయకుడు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ టీవీలలో రోజూ మాట్లాడుతుంటే పోలీసులు కేసు పెట్టారు. ఆయనను అరెస్టు చేశారు. ఆ సందర్భంలో తనను పోలీసులు హింసించారని ఆయన ఆరోపించి, అసలు కేసును పక్కదారి పట్టించారు. నిజంగానే అప్పుడైనా ఆయనపై పోలీసులు దౌర్జన్యం చేసి ఉంటే ఎవరూ సమర్థించరాదు. అప్పట్లో ఒక నాయకుడికి అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టి నానా అల్లరి చేసిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఇన్ని వందల మంది మీద పోలీసులతో ఎలా దౌర్జన్యాలు చేయిస్తారు? దూషణలు చేయిస్తారు? అంటే ఈ దేశంలో పలుకుబడి, డబ్బు ఉన్నవారికి ఒక న్యాయం, సామాన్యుడికి మరో న్యాయం అన్నది మరోసారి రుజువు కావవడం లేదా? ఆయా వ్యవస్థల్లో ఇంతగా వివక్ష ఉంటే ఈ సమాజంలో అశాంతి ప్రబలకుండా ఉంటుందా? విద్వేషాలు మరింతగా పెరగవా? వాటి పరిణామాలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించవా? ఒక్కసారి కట్టు తప్పితే ఎంత ప్రమాదమో సీనియర్ నేత అయిన చంద్రబాబు నాయుడుకు తెలియకుండా ఉంటుందా? బహుశా ఈ పరిణామాలు, ఇన్ని విషయాలు సినీ నటుడు కూడా అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలియకపోవచ్చు. అందుకే ఆయన తన అధికారంతో ఎవరిని ఏమైనా చేయవచ్చని భ్రమపడుతున్నారు.నిజంగానే పవన్ అలా అరాచకంగా ప్రవర్తిస్తే, భవిష్యత్తులో తన మెడకే గుదిబండలు అవుతాయని గ్రహిస్తే మంచిది.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బడ్జెట్‌పై వరుదు కల్యాణి ప్రశ్నలు.. పదేపదే అడ్డుకున్న టీడీపీ మంత్రులు
సాక్షి, అమరావతి: ఏపీ శాసన మండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీగా మారింది. మండలిలో బడ్జెట్‌పై వైఎస్సార్సీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యుల ఎదురుదాడికి దిగారు. సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తూ సభలో గందరగోళం సృష్టించారు. బడ్జెట్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నలు కురిపించారు. 3 సిలిండర్లు ఇస్తామని ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టారని మండిపడ్డారు. రూ. 5,387 కోట్లు ఇస్తే తల్లికి వందనం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.అయితే వరుదు కల్యాణి ప్రసంగిస్తుండగా హోంమంత్రి అనిత అడ్డుతగిలారు. వరుదు కల్యాణి మాట్లాడుతుండగా మంత్రులు అనిత, సవిత, బాల వీరంజనేయులు ఆటంకం కలిగించారు. ఎమ్మెల్సీ కల్యాణిని సభలో మాట్లాడకుండా అడుగడుగునా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు.మంత్రుల తీరుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు మాట్లాడుతుండగా మంత్రులే అభ్యంతరం తెలపడం ఏంటని ఆగ్రహించించారు.వైస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గతంలో తమ తల్లిని తిట్టారంటూ లోకేష్ గగ్గోలు పెట్టగా.. సంబంధం లేని సబ్జెక్ట్‌ను ఎందుకు తీసుకొచ్చారని బొత్స ప్రశ్నించారు. సభలో ఇటువంటి సాంప్రదాయం సరికాదంటూ ఆయన సూచించారు. దీంతో గందరగోళం నడుమ సభను చైర్మన్ రేపటికి(శుక్రవారం) వాయిదా వేశారు. -
ప్రజల భద్రత కాదు.. పోలీసుల ప్రాధాన్యతలు మారిపోయాయి: విజయసాయిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏపీ పోలీసులు తమ వనరులను టీడీపీ రాజకీయ ఎజెండాకు మళ్లిస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భద్రతను పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్రంలో పోలీసుల ప్రాధాన్యతలు మారిపోయాయి. మహిళలపై అఘాయిత్యాలు, సైబర్ నేరాలు పెరుగుతున్నా వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏపీ పోలీసులు తమ వనరులను టీడీపీ రాజకీయ ఎజెండాకు మళ్లిస్తున్నారు. 680 మంది వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు అందించారు. 147 కేసులు నమోదు చేసి, 49 మందిని అరెస్టు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భద్రతను పక్కన పెట్టారు’ అని ఘాటు విమర్శలు చేశారు. The priorities of the AP Police are misplaced. Amid rising crimes against women and increasing cybercrimes, the AP police is diverting significant resources to further TDP’s political agenda—serving notices to 680 YCP social media activists, filing 147 cases, and arresting 49…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 14, 2024 -
ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి అని అంటూ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు.సోషల్ మీడియాలో టీడీపీ వారు పెట్టిన అసభ్యకర పోస్టులపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.. ప్రొద్దుటూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం, రాచమల్లు మీడియాతో మాట్లాడుతూ.. నాపై గతంలో అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ వారిపై చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము.కూటమి ప్రభుత్వం ఎంతమందిపై కేసులు పెడతారో పెట్టుకోండి. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తాము. మా పార్టీ ప్రతి కార్యకర్త, నాయకులకు మేము అండగా ఉంటాము అని హామీ ఇచ్చారు. అలాగే, కూటమి నేతల అబద్ధాలను ఎండగడతాం. ప్రజలకు అన్ని నిజాలు తెలుస్తున్నాయి అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అక్రమ బెల్ట్ షాపులు.. బాలకృష్ణ నియోజకవర్గంలో ఏరులై పారుతున్న లిక్కర్! -
బావ మాట అయినా మూడు పెగ్గులు.. ఆరు గ్లాసులే!!
సాక్షి, శ్రీ సత్యసాయి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో దాదాపు ప్రతీ గ్రామంలో అడ్డగోలుగా బెల్ట్ షాపులు వెలిశాయి. కొన్ని చోట్లైతే టీడీపీ ముఖ్య నేతలు డబ్బులు తీసుకుని మరీ బెల్టు షాపులకు అనుమతి ఇస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ బాటలో చంద్రబాబు బావమరిది బాలకృష్ణ నియోజకవర్గం కూడా ఉందనే విషయం తాజాగా వెలుగు చూసింది. హిందూపురం నియోజకవర్గంలో బెల్టు షాపులు విచ్చలవిడిగా.. భారీగా వెలిశాయి. మందుబాబులకు మూడు పెగ్గులు.. ఆరు గ్లాసులుగా నడుస్తోంది అక్కడ. ఈ నియోజకవర్గంలో దాదాపు వందకుపైగా బెల్ట్ షాపులు ఉన్నట్టు అనధికార సమాచారం. ఇక, ఈ బెల్డ్ షాపులు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వాళ్ల ఇష్టానుసారం లిక్కర్ అమ్మకాలు జరుపుతున్నారు. ఒక్కో లిక్కర్ బాటిల్‌పై రూ.20 అదనంగా తీసుకుంటున్నారు. అయితే, ఎలా పడితే అలా బెల్ట్ షాపులకు అనుమతులు ఇవ్వమని, అలా కాదని అమ్మితే రూ.5లక్షలు జరిమానా విధిస్తామని సాక్ష్యాత్తూ సీఎం చంద్రబాబే హెచ్చరించారు. ఇక్కడ కూడా కొందరు టీడీపీ లీడర్లే ఈ దందాలు నడిపిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే ఎక్సైజ్ అధికారులు పట్టించుకోని ఈ విషయాన్ని కనీసం.. బాలయ్య అని పట్టించుకోవాలని కింది స్థాయి కూటమి నేతలు కోరుకుంటున్నారు. మరి బావ మాటలను ఇప్పటికైనా బాలకృష్ణ సీరియస్‌గా తీసుకుంటారా? లిక్కర్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తారా? అనే చర్చ మొదలైంది ఇప్పడు. -
వీ వాంట్ జస్టిస్.. సేవ్ డెమోక్రసీ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నిరసన
అమరావతి, సాక్షి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమైన కాసేపటికే.. శాసనమండలిలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబట్టగా.. చైర్మన్ అందుకు నిరాకరించారు. దీంతో.. ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం చుట్టుముట్టి అరగంట పాటు నినాదాలతో తమ నిరసన తెలియజేశారు. సోషల్ మీడియా అరెస్టులతో పాటు డీఎస్సీపై పీడీఎఫ్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ఆ రెండు తీర్మానాలను తిరస్కరించారు. తమ వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని చైర్మన్‌ను మండలిలో ప్రతిపక్ష నేత బొత్స కోరారు. అయినా అందుకు చైర్మన్ అంగీకరించలేదు. దీంతో.. పోడియం వద్దకు వచ్చి చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ‘‘వీ వాంట్ జస్టిస్..’’, ‘‘సేవ్ డెమోక్రసీ’.. అంటూ నినాదాలు చేస్తుండగా.. మరోవైపు కూటమి ఎమ్మెల్సీలు వాళ్లతో వాగ్వాదానికి దిగి రెచ్చగొట్టేందుకు యత్నించారు. కానీ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాత్రం సోషల్ మీడియా పోస్టుల ప్రతులను చైర్మన్‌కు చూపిస్తూ నినాదాలు కొనసాగించారు. చేసేది లేక ఆ నినాదాల నడుమే ఏపీ మంత్రులు మాట్లాడేందుకు యత్నించారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొనగా.. మండలిని కాసేపు వాయిదా వేశారు చైర్మన్. ఇదీ చదవండి: చావు లెక్కలు నవ్వుతూ.. -
AP: అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా
AP Assembly Budget Session Day 3 Update అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడింది.అసెంబ్లీ మీడియా పాయింట్వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుబడ్జెట్పై చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారుపవర్ సెక్టార్ పై చర్చ జరగకుండా చేశారుఅనేక మీటింగ్ లలో కరెంట్ ఛార్జీలు పెంచనని చంద్రబాబు చెప్పారుఒక్క రూపాయి ఛార్జీ పెంచనని చెప్పి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారుతమ మోసాన్ని ప్రజలకు తెలియకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారులోకేష్ సందర్భం లేని చర్చను తెరపైకి తెచ్చారుబడ్జెట్ పై వరుదు కళ్యాణి మాట్లాడుతుంటే మా తల్లిని అవమానించారంటూ లోకేష్ చర్చను తప్పుదారి పట్టించారుగతంలో ఎప్పుడూ లేని పరిస్థితులను సభలో చూస్తున్నాం.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణిప్రజల పక్షాన మాట్లాడకుండా మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు.అరకొర బడ్జెట్ పెట్టి...నిధులు కేటాయించారు.ఈ బడ్జెట్‌తో తమ తలరాతలు మారిపోతాయని ప్రజలు ఆశపడ్డారు.దీపం పథకం కోసం కేటాయింపులు ఎంతమంది ఇస్తారనేది మేం ప్రశ్నించాం.రాష్ట్రంలో 2.7 కోట్ల మంది మహిళలున్నారు.ఒక్కొక్కరికి ఏడాదికి 18 వేలు ఇస్తామన్నారు... ఆ లెక్కలేవి.హోంమంత్రి గారు ఈనాడు పేపర్ చూసి చెప్పడం కాదు.దమ్ముంటే మీరు కేటాయించిన 3200 కోట్ల లెక్క చూపించండి.టీచర్లు తమ పరిస్థితి ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు.ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలి.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయల్సభలో బడ్జెట్‌పై చర్చకు అడుగడుగా అడ్డుపడ్డారు.కావాలనే సభను పక్కదారి పట్టించారు.మా నాయకుడు సభ నుంచి పారిపోలేదు.మాకు ప్రజాబలం ఉంది కాబట్టి మేం ప్రతిపక్ష హోదా ఉందని కోరాం.ప్రతిపక్ష నేతగా గుర్తించకుండా... సభలో మైకు ఇవ్వకుండా అవమానించడం పద్దతేనా?చంద్రబాబు సభకు ఎందుకు రాలేదంటే లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడారు.అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి.ప్రతిపక్ష గొంతును నొక్కాలని చూస్తే భవిష్యత్తులో మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది.ఎమ్మెల్సీ,వంకా రవీంద్రనాథ్నేను తొలిసారి బడ్జెట్ చర్చలో పాల్గొన్నాసభ చాలా హుందాగా సాగుతుందని భావించాప్రతిపక్ష పార్టీ సభ్యులను అధికారపార్టీ సభ్యులు మాట్లాడకుంటా చేశారుచర్చ జరగకుండా గతంలో ఎప్పుడో జరిగిన అంశాలు లేవనెత్తి నానా గొడవ చేశారురేపైనా ప్రతిపక్ష పార్టీకి అడ్డుకోకుండా అధికారపార్టీ సభ్యులు సంయమనం పాటించాలిసభ సజావుగా సాగేలా సహకరించాలి.మండలి రేపటికి వాయిదామండలిలో బడ్జెట్ లో వైస్సార్సీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యుల ఎదురుదాడి..సంబంధం లేని అంశాల్ని ప్రస్తావన చేస్తూ సభలో గందరగోళం..అడుగడుగునా వరుదు కల్యాణి ని సభలో మాట్లాడకుండా అడ్డుకున్న టీడీపీ సభ్యులు..వైస్సార్సీపీ ఎమ్మెల్సీ ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గతంలో తమ తల్లిని తిట్టారంటూ లోకేష్ గగ్గోలుసభలో ఇటువంటి సాంప్రదాయం సరికాదంటూ సూచించిన బొత్స..గందరగోళం నడుమ సభను రేపటికి వాయిదా వేసిన చైర్మన్ శాసన మండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ మంత్రులుబడ్జెట్పై వరుదు కల్యాణి ప్రసంగంవరుదు కల్యాణి మాట్లాడుతుండగా అడ్డు తగిలిన మహిళా మంత్రులుఅనిత, సవితలపై మండలి ప్రతిపక్ష నేత బొత్స ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసిన బొత్స, ఇతర ఎమ్మెల్సీలు బాబు సర్కార్‌ను ప్రశ్నించిన YSRC ఎమ్మెల్సీలుమండలిలో బడ్జెట్ పై చర్చలో పాల్గొన్న వైస్సార్సీపీ MLC లు..2014 నుండి 2019 వరకు ప్రభుత్వంలో మూడు పార్ట్నర్షిప్ సమ్మిట్స్ నిర్వహించారుఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు?ఇప్పుడు సంపద సృష్టిస్తామని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెపుతున్నారు..తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తే 12 వేల కోట్లు కావాలి..అన్నదాత సుఖీభవ కింద ఒక్కొక్క రైతుకు 20వేల కింద ఇస్తే 10716 కోట్లు కావాలిమహిళలకు 18 వేల చెప్పునిస్తే 32400 కోట్లు కావాలిఎన్నికల ముందు చెప్పిన దానికి బడ్జెట్లో చూపించిన దానికి పొంతన లేదు..కుంభ రవిబాబు కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసింది..సూపర్ సిక్స్ కి 74,287 కోట్లు కావాలి..ఎన్నికల ముందు కొట్టిన డప్పు.. బడ్జెట్లో మొగ లేదు..మేనిఫెస్టో కి బడ్జెట్ కి మధ్య తేడా చూస్తే మైండ్ బ్లాంక్ అయింది..ప్రజాగలం ప్రజా గరాళమైందిబాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఎన్నికల గారడీ అయింది..వరుదు కళ్యాణి, ఏపీ శాసనసభ డిప్యూటి స్పీకర్ ఎన్నికఏపీ అసెంబ్లీ ఉపసభాపతిగా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుఎన్నికైనట్టు ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో ముగిసిన ప్రశ్నోత్తరాలు స్వల్ప వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన మండలిశాసన మండలి వాయిదావైఎస్సార్సీపీ నిరసనలతో దద్దరిల్లిన శాసన మండలిసోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌పై చర్చకు YSRCP పట్టుఅరగంటపాటు నినాదాలతో హెరెత్తిన మండలిఅయినా చర్చకు మండలి చైర్మన్ నిరాకరణపొడియం చుట్టు ముట్టి సేవ్ డెమోక్రసీ.. వీ వాంట్ జస్టిస్ నినాదాలు చేసిన YSRCP ఎమ్మెల్సీలుఈ ఆందోళనలతో శాసన మండలిని వాయిదా వేసిన చైర్మన్ వీ వాంట్ జస్టిస్.. మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుమండలి చైర్మన్ పోడియంను చుట్టుముట్టిన YSRCP ఎమ్మెల్సీలువీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు సోషల్ మీడియా పోస్టుల ప్రతులను చైర్మన్‌కు చూపిస్తూ నినాదాలు చేసిన ఎమ్మెల్సీలుఎమ్మెల్సీలు నిరసన మధ్యలోనే మాట్లాడిన ఇతర పార్టీల సభ్యులుమండలిలో వైఎస్సార్సీపీ నిరసనప్రారంభమైన శాసన మండలిసోషల్ మీడియా అరెస్టు లపై వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానండీఎస్సీ పై పీడీఎఫ్ వాయిదా తీర్మానంరెండు వాయిదా తీర్మానాలను తిరస్కరించిన ఛైర్మన్పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ ప్రారంభమైన ప్రశ్నోత్తరాలు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలుమూడో రోజు మొదలైన ప్రశ్నోత్తరాలు అనంతరం బడ్జెట్ పై చర్చ మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంశాసన మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంసోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమకేసుల బనాయింపు పై సభలో చర్చించాలని కోరుతూ తీర్మానంశాసన మండలి చైర్మన్ కు వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు డిప్యూటీ స్పీకర్ ఎంపిక నేడు!మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక.డిప్యూటీ స్పీకర్ గా రఘురామ కృష్ణంరాజు నామినేషన్ ఎన్నిక లాంఛనంగా ప్రకటించనున్న శాసన సభ స్పీకర్ అయ్యన పాత్రుడు... నేడు అసెంబ్లీ లో 5 బిల్లులుఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు - 2024...ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రసిటీ సిటీ డ్యూటీ బిల్లు - 2024.ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ప్రాక్టిషనర్ రిజిస్ట్రేషన్ బిల్లు - 2024..ఆంధ్ర ప్రదేశ్ ఆయుర్వేదిక్ మరియు హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ బిల్లు - 2024..ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు - 2024.నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పాలసీలను సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్న మంత్రులు...ఆంధ్రప్రదేశ్ MSME డవలప్మెంట్ పాలసీ 2024 - 29. పై సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్న మంత్రి కొoడపల్లి శ్రీనివాస్..ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ డవలప్మెంట్ పాలసీ 2024 - 29..ఆంధ్ర ప్రదేశ్ ఫుడ్ ప్రాసేసింగ్ పాలసీ 2024 - 29..ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ప్రయివేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 2024 - 29.. పై సభ లో స్టేట్మెంట్ ఇవ్వనున్న మంత్రి టి జీ భరత్.... -
బూచిగా అప్పుల భూతం.. సూపర్ సిక్స్‌కు ఎగనామం: వైఎస్ జగన్
‘ఎన్నికల వేళ నువ్వు చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి? ఇదిగో నీ సూపర్ సిక్స్.. వాటిని అమలు చేయడానికి కావాల్సిన బడ్జెట్ రూ.74 వేల కోట్లు. కానీ బడ్జెట్లో కేటాయింపు చేయలేదు. నువ్వు చెప్పింది అబద్ధం కాదా? నువ్వు చేసింది మోసం కాదా? నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా?’ అని ప్రశ్నిస్తూ నేను ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడతా. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇదే పోస్టు పెడతారు. ఇదే పోస్టును సోషల్ మీడియాలో పెట్టాలని ప్రతి కార్యకర్తకూ పిలుపునిస్తున్నా. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. అరెస్ట్ చేయడం మొదలు పెడితే.. అది నాతోనే ప్రారంభించండి.– సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సవాల్సాక్షి, అమరావతి: ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇస్తున్నప్పుడే వాటిని అమలు చేయలేనని తెలిసినా, మోసం చేయడమే తన నైజంగా పెట్టుకున్న చంద్రబాబు.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర అప్పులు రూ.11 లక్షల కోట్లు.. రూ.12.50 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అంటూ చేసిన దుష్ప్రచారం బడ్జెట్ సాక్షిగా బట్టబయలైందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై ఒక అబద్ధాన్ని సృష్టించి.. దాన్నే ఎల్లో మీడియాతో రాయించి.. ఆ తర్వాత దత్తపుత్రుడు, బీజేపీలోని టీడీపీ నాయకురాలు, తన వదినమ్మ, ఇతర పార్టీల్లోని టీడీపీ నాయకులతో పదే పదే మాట్లాడించి దుష్ప్రచారం చేసిన ఆర్గనైజ్డ్ క్రిమినల్ (వ్యవస్థీకృత నేరగాడు) చంద్రబాబు అని ధ్వజమెత్తారు. రాష్ట్రం శ్రీలంకలా దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో అంటూ ఒక పద్ధతి ప్రకారం దుష్ఫ్రచారం చేశారని గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులపై చంద్రబాబు చేసిన దుష్ఫ్రచారాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. అధికారంలోకి వచ్చాక కూడా ఆర్థిక శాఖపై నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లకు చేరుకుందంటూ సీఎం చంద్రబాబు లీకులు ఇచ్చారని.. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చిత్రీకరిస్తూ సూపర్ సిక్స్, ఇతర హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు రంగం సిద్ధం చేశారని దుయ్యబట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ముందు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లంటూ గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని గుర్తు చేశారు. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లేనని తేలిందని ఎత్తి చూపారు. తద్వారా చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారన్నది బట్టయలైందని చెప్పారు. రాష్ట్ర అప్పులపై తాను చెప్పిందంతా అబద్ధమని తేలుతుందని.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కేటాయింపులపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ఇన్నాళ్లూ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సాగదీస్తూ వచ్చారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకాఏమన్నారంటే..ఎనిమిది నెలలయ్యాక బడ్జెట్ ప్రవేశపెట్టడమా? ⇒ ఈ బడ్జెట్ కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే ప్రవేశపెట్టిన డాక్యుమెంట్లా ఉంది. నిజంగా ఎవరైనా ఎన్నికలైన వెంటనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ కేటాయింపులు చేసి, వాటి అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారు. కానీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 8 నెలలు గడిచాక.. కేవలం మరో నాలుగు నెలలు సమయం మాత్రమే ఉన్న పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ను చూస్తే ఆశ్చర్యమేస్తోంది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు అన్నీ బయటకొస్తాయని ఇలా చేశారు. ⇒ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు కేటాయింపులు జరపకపోతే మా సూపర్ సిక్స్ ఏమైంది.. సూపర్ సెవెన్ ఏమైందని ప్రజలు నిలదీస్తారని తెలుసు కాబట్టే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సాగదీస్తూ వచ్చారు. దీనికి రకరకాల కారణాలు చెబుతూ వచ్చారు. పరిమితికి మించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పులు చేసిందని.. రాష్ట్రాన్ని శ్రీలంక చేసిందని.. ప్రజలను మభ్యపెట్టే విధంగా అబద్ధాలు ప్రచారం చేశారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెబుతూ.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే.. ఆయన ఏ స్థాయి డ్రామా ఆర్టిస్ట్ అన్నది స్పష్టమవుతోంది. బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొన్న అంశాలే ఇందుకు సాక్ష్యం.చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు ఆధారాలు ఇవిగో..05–04–2022: ‘రాష్ట్రం మరో శ్రీలంకగా తయారవుతుంది’ చంద్రబాబు స్టేట్మెంట్. ‘ఈనాడు’లో బ్యానర్ కథనం 13–04–22: ‘శ్రీలంకలా ఏపీ దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో?’ అని చంద్రబాబు మరో స్టేట్మెంట్ 19–04–22: చంద్రబాబు చెప్పిన అబద్ధాలను పట్టుకుని ‘మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే’ అంటూ ఈనాడు కథనం 17–05–22: ‘శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం’లోనే ఉందంటూ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ 21–07–22 : ’శ్రీలంక కంటే రాష్ట్రానికి 4 రెట్లు అప్పు’ అని అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్టేట్మెంట్17–02–23 : ‘అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు అప్పు రత్న’ అని పేరు పెట్టాలంటూ దత్తపుత్రుడు మరో ట్వీట్ 25–10–23 : ‘రాష్ట్ర రుణం రూ.11 లక్షల కోట్లు’ అని చంద్రబాబు వదినమ్మ, బీజేపీలో టీడీపీ నాయకురాలు స్వయంగా చూసినట్లు, ఆమెకు తెలిసినట్లు స్టేట్మెంట్⇒ వీటిని బట్టి కొత్త పాత్రధారులు, వారి ఎల్లో మీడియా, ఇతర పార్టీల్లోని టీడీపీ నాయకులతో కలిసి ఒక పద్ధతి ప్రకారం అప్పులపై గోబెల్స్ ప్రచారం చేశారని స్పష్టమవుతోంది. అప్పులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన సమా«ధానాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని రివర్స్ ప్రచారం. ఢిల్లీకి పోవడం.. రకరకాల ఏజెన్సీలకు లేఖలు రాయడం ఎందుకు? ‘వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రాకూడదు.. కేంద్ర ప్రభుత్వం సహకరించకూడదు.. ఇక్కడ ఏమెమో జరిగిపోతోందన్న భయం సృష్టించాలి’ అని పద్దతి ప్రకారం ఇవన్నీ చేసుకుంటూ పోయారు.⇒ ఎన్నికలు సమీపించే సరికి అబద్ధాలు ముమ్మరం చేశారు. 2023 ఏప్రిల్ 7వ తేదీన ‘రాష్ట్ర అప్పు రూ.12.50 లక్షల కోట్లు’ అని ఎన్నికలకు నెల ముందు చంద్రబాబు వదినమ్మ స్టేట్మెంట్. ఇందుకు వత్తాసుగా అదే నెల 21న ఒకాయనను పట్టుకొచ్చి.. ఆయనకు ఎకానమిస్ట్ అని బిళ్ల తగిలించి.. ‘రాష్ట్ర రుణాలు రూ.14 లక్షలు కోట్లు’ అని చెప్పించారు. ఆ తర్వాత మిగిలిన వాళ్లు వరుసగా ఇదే పాట అందుకున్నారు. ఒక పద్దతి ప్రకారం అబద్ధాల ప్రచారం జరిగింది.మాకు రూ.42,183.80 కోట్ల బకాయిల బహుమతి⇒ చంద్రబాబు పోతూ పోతూ రూ.42,183.80 కోట్ల బకాయిలు మాకు గిఫ్ట్‌గా ఇచ్చి పోయాడు. అవన్నీ మేము కట్టాం. ఉపాధి హామీ బకాయిలు రూ.2,340 కోట్లు, ఉద్యోగులకు రెండు డీఏలు బకాయి పెట్టాడు. ఆరోగ్యశ్రీ రూ.640 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ రూ.2,800 కోట్లు, రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు, విత్తన బకాయిలు రూ.380 కోట్లు, పంటల బీమా బకాయిలు రూ.500 కోట్లు, చివరికి పిల్లలకు మధ్యాహ్న భోజనం వండే ఆయాలకు, కోడిగుడ్లకు కూడా బకాయిలు పెట్టాడు.⇒ ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఏ ప్రభుత్వ హయాంలోనైనా కొన్ని బకాయిలు మామూలే. ఏటా ఈ బకాయిలు క్లియర్ అవుతూనే ఉంటాయి. దీన్నేదో చంద్రబాబు వక్రీకరించి.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎగరగొట్టాలనే దూరపు ఆలోచనతో కొత్త కథను బిల్డప్ చేస్తున్నాడు. సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు అబద్ధాలకు రెక్కలు కట్టాడు. ఇలా చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్‌లో ఎవరెవరు భాగస్వాములై ఉన్నారో సాక్ష్యాధారాలతో సహా మీ ముందు పెట్టాను. రాజకీయ లబ్ధి కోసమే అప్పులపై దుష్ఫ్రచారం⇒ ఏ రాష్ట్రమైనా, ఏ ప్రభుత్వమైనా రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా అప్పులు చేయడం బడ్జెట్లో భాగం. ఇది సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం. ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రభుత్వానికి ఎంత పర్సంటేజ్‌లో అప్పులు చేయాలో ఎఫ్ఆర్బీఎం నిర్దేశిస్తుంది. ఏ ప్రభుత్వమైనా జీఎస్డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతంలోపే అప్పులు తీసుకుంటుంది. అంతకు మించి తీసుకునే అవకాశం ఉండదని అందరికీ తెలుసు.⇒ చంద్రబాబు, ఆయన కూటమి, ముఠా సభ్యులు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై ఏ విధంగా ప్రచారం చేశారో అందరికీ తెలిసిందే. ఏ బ్యాంకు అయినా ప్రభుత్వాలకు రుణాలు ఇవ్వాలంటే ఒక పద్ధతి ఉంటుంది. కార్పొరేషన్ల ద్వారా కూడా ఇష్టమొచ్చినట్టు రుణాలు తీసుకోవడానికి అవకాశం లేదు. చంద్రబాబు సుందర ముఖారవిందం చూసో, జగన్ ముఖారవిందం చూసో ఏ బ్యాంకులు అప్పులు ఇవ్వవు. ఇవన్నీ వాస్తవాలు. కేవలం వారు రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఇలా చేశారని స్పష్టమైంది.అధికారంలోకి వచ్చాక కూడా విష ప్రచారమే⇒ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన తప్పుడు ప్రచారం మానలేదు. అదే విష ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. జూలై 10వ తేదీన ఆర్థిక శాఖపై సమీక్ష చేస్తూ ‘రాష్ట్రం మొత్తం అప్పులు రూ.14 లక్షల కోట్లు’ అని లీకులిస్తాడు. ఈనాడులో రాస్తారు.. ఈటీవీలో చూపిస్తారు. ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేందుకు చంద్రబాబుకు కారణాలు కావాలి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్’కు కేటాయింపులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారని తెలుసు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన దుష్ప్రచారం కొనసాగించారు.⇒ ఒక పద్దతి ప్రకారం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లను తెరమరుగు చేసే కార్యక్రమం. హామీలిచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. అయినా ప్రజలను మోసం చేయాలి. మోసం చేసే సమయంలోనైనా కనీసం నిజాయితీతో మిమ్మల్ని మోసం చేస్తున్నాం అని చెప్పడానికి మళ్లీ జగన్ కావాలి. అందుకోసం రంగం సిద్ధం చేస్తున్నాడు.బడ్జెట్ సాక్షిగా దుష్ఫ్రచారం బట్టబయలు⇒ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్టానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి. అది తప్పనిసరి. ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి ఎవరి హయాంలో ఎంత అప్పులున్నాయో స్పష్టంగా వాళ్లే పేర్కొన్నారు. 14, 16 పేజీలను గమనిస్తే.. 2018–19 నాటికి.. అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి అప్పులు రూ.2,57,509 కోట్లు. వీటికి ప్రభుత్వ గ్యారంటీతో వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు కూడా కలుపుకుంటే మరో రూ.55వేల కోట్లు. అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి (2018–19) రూ.3.13 లక్షల కోట్ల అప్పులున్నాయి. ⇒ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.3.13 లక్షల కోట్లు ఉన్న అప్పులు, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.4.91,774 కోట్లకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు మరో రూ.1.54 లక్షల కోట్లు.. రెండు కలిపితే రూ.6.46 లక్షల కోట్లు. ఈ వివరాలను వాళ్లే స్పష్టం చేశారు. అలాంటప్పుడు వాళ్లు ప్రచారం చేసినట్టుగా ఎక్కడ రూ.10 లక్షల కోట్లు, ఎక్కడ రూ.11 లక్షల కోట్లు, ఎక్కడ రూ.12.50 లక్షల కోట్లు, ఎక్కడ రూ.14 లక్షలు కోట్లు అప్పులు? ఇవన్నీ దుష్ప్రచారాలే కదా?అప్పుల రత్న బిరుదు ఎవరికి ఇవ్వాలి?⇒ ఎవరెవరి హయాంలో ఎంతెంత అప్పులు చేశారో అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు (డెట్ కాంపౌండ్ గ్రోత్ రేటు) ఎంతుందో ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.32 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. ఆయన దిగిపోయేసరికి రూ.3.13 లక్షల కోట్లు అప్పులుగా ఉన్నాయి. అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్) 19.54 శాతం. అదే మా హయాంలో అప్పు రూ.3.13 లక్షల కోట్ల నుంచి రూ.6.46 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు 15.61 శాతం. అంటే.. చంద్రబాబు కంటే 4 శాతం తక్కువగా అప్పులు చేశాం.⇒ ఇక ప్రభుత్వ రంగ సంస్థల నాన్ గ్యారంటీ అప్పులు చూసినా.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.8,638 కోట్లు ఉన్న నాన్ గ్యారంటీ అప్పులు.. ఆయన దిగిపోయే నాటికి రూ.77,228 కోట్లకు చేరాయి. పవర్ సెక్టార్, డిస్కమ్‌లకు చేసిన అప్పులు ఏకంగా 54.98 శాతం పెరిగాయి. మేము డిస్కమ్‌లు కాపాడేందుకు, పబ్లిక్ సెక్టార్, నాన్ గ్యారంటీడ్ లయబులిటీస్ అయినా సరే దాన్ని తగ్గించే కార్యక్రమం చేశాం. రూ.77,228 కోట్ల నుంచి రూ.75,386 కోట్లకు తగ్గించాం. అంటే మా హయాంలో రుణం పెరగకపోగా – 0.48 శాతం తగ్గించాం. ⇒ ప్రభుత్వ అప్పు, గ్యారంటీ అప్పు,. నాన్ గ్యారంటీ అప్పులు అన్ని కలిపి చూస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి అంటే 2014 నాటికి రూ.1.40 లక్షల కోట్లు ఉంటే.. ఆయన దిగేపోయే సరికి రూ.3.90 లక్షల కోట్లు చేరాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధిరేటు 22.63 శాతం ఉంటే.. మా హయాంలో రూ 3.90 లక్షల కోట్లు రూ.7.21 లక్షల కోట్లు అయ్యింది. 13.57 శాతంగా అప్పుల వార్షిక వృద్ధి రేటు నమోదైంది. అది కూడా రెండేళ్లు కోవిడ్ దుర్భర పరిస్థితుల్లో. నిజంగా ఏదైనా అవార్డు ఇవ్వాలంటే మా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, అప్పుల రత్న బిరుదు చంద్రబాబుకు ఇవ్వాలి. -
‘హామీలిచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.. ఇది మోసం కాదా? చంద్రబాబూ’
సాక్షి, తాడేపల్లి: ‘చంద్రబాబూ.. ప్రజలకు సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు. నీవు చీటర్‌వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు.ఆడబిడ్డ నిధి:18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత ఇచ్చావ్?దీపం:ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. 1,54,47,061 కనెక్షన్లకు గాను రూ.4115 కోట్లు ఇవ్వాలి. ఎన్ని కోట్లు కేటాయించావ్?తల్లికి వందనం:ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15,000లు ఇస్తా అన్నావు. రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు గాను రూ.12,450 కోట్లు ఇవ్వాలి. ఎంత మందికి ఇచ్చావ్?అన్నదాత:ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అన్నావు. రాష్ట్రంలో 53.52 లక్షల మంది రైతులకు గాను రూ.10,706 కోట్లు అవుతుంది. ఎంత ఇచ్చావ్?ఉచిత బస్సు ప్రయాణం:రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి దాదాపు ఏడాదికి రూ.3వేల కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు అతీగతీలేదు.యువగళం:రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు రూ.3వేలు ఇస్తా అన్నావ్. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.36వేల చొప్పున రూ.7,200 కోట్లు ఇవ్వాలి? ఎప్పుడు ఇస్తావ్ఇదీ చదవండి: హామీలకు కోతలు.. పచ్చమీడియా పైపూతలు!50 ఏళ్లు పైబడిన వారికి రూ.4వేలు పింఛన్:రాష్ట్రంలో 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు దాదాపు 17 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.48వేలు ఇస్తా అన్నావ్. మొత్తం రూ.8,160 కోట్లు కావాలి. నువ్వు ఎంత ఇచ్చావ్.నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?ప్రశ్నిస్తే కేసులు పెడతానంటున్నావు, అరెస్టులు చేస్తానంటున్నావు. నాతో సహా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులు నిన్ను నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారు..@ncbn గారు .. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.నీవు చీటర్‌వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?ఆడబిడ్డ నిధి:18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత…— YS Jagan Mohan Reddy (@ysjagan) November 13, 2024 -
ఈ పాటికి సీఎంగా వైఎస్ జగన్ ఉండి ఉంటే..
సాక్షి,అమరావతి: చంద్రబాబు మోసాలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. ‘‘సూపర్‌సిక్స్ ఒక మోసం. సూపర్ సెవెన్ ఒక మోసం. నీ బడ్జెట్ ప్రజెంటేషన్ ఒక మోసం. రోజూ డైవర్షన్ టాపిక్స్. వీటన్నింటినీ ప్రశ్నిస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 680 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు నోటీసులు ఇచ్చారు. 147 మందిపై కేసులు పెట్టారు. 49 మందిని అరెస్టు చేశారు’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాటికి సీఎంగా తాను ఉండి ఉంటే.. ప్రజలకు పథకాలన్నీ వచ్చి ఉండేవని వివరించారు.ఏప్రిల్‌లో వసతి దీవెన, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు.మే లో విద్యాదీవెన, ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా, మత్స్యకారులకు డీజిల్‌పై సబ్సిడీ.జూన్‌లో బడులు తెరవగానే జగనన్న అమ్మ ఒడి.జూలైలో విద్యాకానుక, వాహనమిత్ర, కాపునేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు. వివిధ పథకాల్లో మిగిలిపోయిన లబ్ధిదార్లకు చెల్లింపు.ఆగస్టులో విద్యాదీవెనలో మరో త్రైమాసిక చెల్లింపు. వాహనమిత్ర.సెప్టెంబరులో వైఎస్సార్ చేయూత.అక్టోబరులో వైయస్సార్ రైతు భరోసా రెండో విడత.నవంబరులో జగనన్న విద్యాదీవెన. రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాలు.. బాబు రాకతో అవన్నీ క్లోజ్.డిసెంబరులో చూస్తే.. ఈబీసీ నేస్తం. లా నేస్తం. వివిధ పథకాల్లో మిగిలిపోయిన లబ్ధిదార్లకు చెల్లింపులు.జనవరిలో వైయస్సార్ రైతు భరోసా, వైయస్సార్ ఆసరా, జగనన్న తోడు, వైయస్సార్ పెన్షన్ కానుక.ఫిబ్రవరిలో జగనన్న విద్యాదీవెన, జగనన్న చేదోడు.మార్చిలో జగనన్న దీవెన, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు.పద్ధతి ప్రకారం క్యాలెండర్ ఇచ్చి, అన్నీ పక్కాగా అమలు చేశాంవివిధ పథకాల ద్వారా ఈ 5 ఏళ్లలో రూ.2.73 లక్షల కోట్ల నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఇచ్చాం.మరి చంద్రబాబు ఈ బడ్జెట్లో చూపారా?ఇదే చంద్రబాబు సూపర్‌సిక్స్‌లో ఏమన్నాడు? యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి. అంటే రూ.7,200 కోట్లు. ఎక్కడైనా బడ్జెట్లో కనిపించిందా?వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు:👉అదే మా హయాంలో అధికారంలోకి వచ్చిన 6 నెలలకే అక్టోబర్ 2 గాంధీ జయంతికి ముందే 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. 58 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం.👉2.60 లక్షల మంది వాలంటీర్లను నియమించి, ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ చేశాం. అదే కాకుండా 5 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో వివిధ కేటగిరీస్‌లో అక్షరాలా 6.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.👉లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్‌లో లక్షా 2 వేల ఉద్యోగాలు ఇచ్చాం. దాదాపుగా 80,400 కోట్ల ఇన్వెస్ట్ మెంట్లలో ఉద్యోగాలు ఇప్పించగలిగాం. ఎంఎస్ఎంఈలు 2019–24 మధ్య గ్రౌండ్ అయినవి 3.94 లక్షలు అయ్యాయి. ఒట్టి ఎంఎస్ఎంఈల ద్వారానే 23.65 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం.👉గవర్నమెంట్ రంగంలో ఇచ్చిన 6.31 లక్షల ఉద్యోగాలకు తోడు, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ లో ఇచ్చిన 1.02 లక్షల ఉద్యోగాలకు తోడు ఎంఎస్ఎంఈలలో ఇచ్చి 23 లక్షల ఉద్యోగాలు.. ఇవన్నీ కలిపితే 30,99,476 మందికి ఆ 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వగలిగాం.బాబు వచ్చే.. జాబు పోయేమరి చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? 2.60 లక్షల మంది వాలంటీర్లను రోడ్డుపై పడేశారు. ఉద్యోగాలు కట్. 15 వేల మంది ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో పని చేస్తున్న వారిని ఉద్యోగాల్లోంచి తీసేశారు104, 108 ఎంప్లాయీస్‌కు 2 నెలల జీతం రాకపోతే గొడవ చేస్తే మొన్న ఇచ్చారు. ఆపరేటర్‌కు అయితే అది కూడా ఇవ్వలేదు. ఆర్పీలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్లు ఫిర్యాదులు. టాయిలెట్ మెయింటెనెన్స్‌లో ఆయాలకు జీతాలు ఇవ్వడం లేదని కంప్లయింట్స్. ఇవన్నీ ఆరు నెలల చంద్రబాబు పాలనలో చూస్తున్న విచిత్రాలు’ అని చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు. -
చంద్రబాబుకు వైఎస్ జగన్ ఓపెన్ ఛాలెంజ్
సాక్షి, తాడేపల్లి: సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై అక్రమ కేసులు పెట్టారని.. అరెస్ట్‌చేస్తే నా దగ్గర నుంచే మొదలు పెట్టాలంటూ చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సవాల్ విసిరారు. ‘‘చంద్రబాబు మోసాలపై నేను ట్వీట్ చేస్తాను. నాతో పాటు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ట్వీట్ చేస్తారు. ఎంతమంది పైన కేసులు పెడతారో పెట్టండి. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. బాబు బడ్జెట్లో చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేస్తాం. సోషల్ మీడియాలో బాబు మోసాలను ఎండగడతాం’’ అని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు.‘‘ఇచ్చిన హామీలను మేం తూచా తప్పకుండా అమలు చేశాం. మేం రూ. 2 లక్షల 73 వేల కోట్లు డీబీటీ ద్వారా అందించాం. ఐదేళ్లలో మేం ఆరు లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం. చంద్రబాబు వచ్చాక 2 లక్షల 60 వేల మంది వాలంటీర్లను రోడ్డున పడేశారు. 15వేల మంది బేవరేజెస్ ఉద్యోగులను తొలగించారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి అన్నారు. బడ్జెట్లో రూ.7,200 కోట్లు కనిపించలేదు. తల్లికి వందనం పేరుతో పిల్లలకు రూ.15 వేలు ఇస్తానన్నాడు. బడ్జెట్ రూ. 13 వేల కోట్లు ఎక్కడా కనిపించలేదు...11వేల కోట్లకు గాను బడ్జెట్లో వెయ్యి కోట్లే కేటాయించారు. ప్రతి రైతుకు రూ. 20 వేలు సాయమన్నారు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు రూ.18 వేలు ఇస్తామన్నారు. రూ. 37,313 కోట్లకు గాను బడ్జెట్లో ఏమీ కేటాయించలేదు. సూపర్ సిక్స్ పథకాలన్నింటికీ చంద్రబాబు పంగనామాలు పెట్టేశారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. హామీలు అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేస్తున్నారు. 110 మంది ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగాయి. ఇప్పటివరకు 11 మంది చనిపోయారు. 170కిపైగా హత్యలు, 500లకు పైగా హత్యాయత్నాలు జరిగాయి.ఇదీ చదవండి: హామీలకు కోతలు.. పచ్చమీడియా పైపూతలు!..680 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు నోటీసులిచ్చారు. 147 మందిపై కేసులు పెట్టారు. 49 మందిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం కుదేలైంది. చంద్రబాబు ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్ అమలుకు రూ. 74వేల కోట్లు అవసరం. చంద్రబాబు చేసిన మోసాలపై ఎందుకు 420 కేసు పెట్టకూడదు?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. -
ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి నేతలు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. మద్యం దుకాణాలను ప్రైవేట్ సిండికేట్లకు అప్పగించేశారంటూ ధ్వజమెత్తారు. ‘‘గవర్నమెంట్‌కు రావాల్సిన ఆదాయం ప్రైవేట్ జేబుల్లోకి వెళ్తోంది. ఇసుక రేట్లు మా ప్రభుత్వం హయాం కన్నా రెట్టిపంయింది.’’ అని చంద్రబాబు సర్కార్‌ను వైఎస్ జగన్ నిలదీశారుగతంలో సంక్షేమ క్యాలెండర్ ద్వారా పథకాలన్నీ క్రమబద్ధంగా అందించాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పథకాలన్ని అందేవి. చంద్రబాబు వచ్చాక సంక్షేమ పథకాలన్నింటికి తూట్లు పొడిచారు. అమలు చేసే పథకాలకు బడ్జెట్లో అరకొర కేటాయింపులే. సంక్షేమ పథకాలు అందించేందుకు చంద్రబాబు విముఖంగా ఉన్నారు. రాష్ట్రంలో ఇసుక దందా, పేకాట క్లబులు నడుపుతున్నారు. మద్యం దుకాణాలను ప్రైవేట్ సిండికేట్లకు అప్పగించేశారు. రాష్ట్ర ఆదాయం పెరగకపోగా తగ్గుతోంది. దోచేసిన దాంట్లో బాబుకింత, లోకేష్కింత, దత్తపుత్రుడికింత పంచుకుంటున్నారు’’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు.ఇదీ చదవండి: హామీలకు కోతలు.. పచ్చమీడియా పైపూతలు! -
‘అప్పు రత్న’ బిరుదు ఎవరికివ్వాలి.. ఇవిగో ఆధారాలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘బడ్జెట్ పెడితే మోసాలు బయటపడతాయని బాబుకు తెలుసు.. అందుకే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా సాగదీశారు. బడ్జెట్ పత్రాలే బాబు డ్రామా ఆర్టిస్ట్ అని తేల్చాయి. బడ్జెట్ చూస్తే బాబు ఆర్గ్‌నైజ్డ్ క్రైమ్ తెలుస్తుంది.’ అంటూ దుయ్యబట్టారు.‘చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టిస్తాడు. ఆ అబద్ధాన్ని ఎల్లో మీడియాలో ప్రచారం చేయిస్తాడు. తర్వాత తన మనుషులతో పదేపదే అబద్ధాలు చెప్పిస్తాడు. అప్పుల విషయంలో ఏపీ శ్రీలంక అయిపోతుందని దుష్ప్రచారం చేశారు.ఇవే విషయాలను దత్త పుత్రుడితో మాట్లాడిస్తారు. ఇదంతా ఆర్గ్‌నైజ్డ్ క్రైమ్‌కు నిలువెత్తు ఆధారం’ అని వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..ఓట్ ఆన్ ఎక్కౌంట్‌తో 8 నెలలు:దురదృష్టవశాత్తూ 8 నెలలు అయిపోయాక, ఇంకో నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇన్నాళ్లూ ఓట్ ఆన్ అక్కౌంట్తోనే కాలం వెళ్లదీశారు. ఇంత కాలం ఎందుకు సాగదీశారంటే, బడ్జెట్ ప్రవేశపెడితే, చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు బయటపడతాయి. ప్రజలు తమ హామీలు అడుగుతారన్న భయం. అందుకే బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సాగదీస్తూ వచ్చారు.చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రిమినల్:ఇవాళ బడ్జెట్లో చెప్పిన అంశాలు, గణాంకాలు చూస్తే, చంద్రబాబుగారు ఎంత డ్రామా ఆర్టిస్ట్ అన్నది స్పష్టమైంది. ఆయన ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేశాడనేది అందరికీ అర్ధమవుతుంది. ఆయన ఆర్గనైజ్డ్ క్రిమినల్. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా ఉంటుంది అంటే.. ముందుగా తన అనుకూల ఎల్లో మీడియాలో కథనాలు రాయిస్తాడు. ఆ తర్వాత ఆయన దాన్నే పదే పదే మాట్లాడతాడు. పనిలో పనిగా తన దత్తపుత్రుడితోనూ, తనకు సంబంధించి ఇతర పార్టీల ఉన్న వారితోనూ మాట్లాడిస్తారు. ట్వీట్స్ పెడతారు. చివరకు దాన్ని ఒక ఇంటర్నేషనల్ మ్యాటర్‌గా చేస్తారు. ఇది ఎందుకు చెబుతున్నానంటే.. సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాను.అప్పులపై విష ప్రచారం:ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేయడం సహజం. అది బడ్జెట్లో భాగమే. ప్రతి ప్రభుత్వానికి ఎఫ్ఆర్బీఎం ఉంటుంది. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే అప్పులు చేస్తారు. జీఎస్డీపీలో 3 శాతం లేదా 3.5 శాతం అప్పులు చేస్తారు. అంతకు మించి ఎవరికి సాధ్యం కాదు. కానీ వారు ఒక ప్లాన్ ప్రకారం వారు ఎలా దుష్ప్రచారం చేశారంటే..తొలుత..⇒05.04.2022. చంద్రబాబు ప్రకటన. రాష్ట్రం శ్రీలంక అవుతుంది.⇒13.04.2022. రాష్ట్రాన్ని శ్రీలంకగా ప్రకటిస్తారేమో.. అనడం.. దాన్ని వెంటనే ఈనాడులో రాస్తారు.⇒19.04.2022న ఈనాడులో రాశారు.. మేలుకోకపోతే మనకు శ్రీలంక గతే అని రాశారు.⇒17.05.2022న దత్తపుత్రుడు ట్వీట్ చేశాడు. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో.. అని⇒ 21.07.2022న అప్పటి టీడీపీ మంత్రి, ఇప్పటి ఆర్థిక మంత్రి ఏమన్నారంటే.. శ్రీలంక కంటే రాష్ట్ర అప్పులు నాలుగు రెట్లు అని.⇒07.02.2023న అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు.. ‘అప్పు రత్న’ అని పేరు పెట్టాలని దత్తపుత్రుడి ట్వీట్.⇒25.10.2023. ఆ తర్వాత చంద్రబాబుగారి వదినమ్మ, బీజేపీలో టీడీపీ నాయకురాలు.. ‘రాష్ట్ర రుణం రూ.11 లక్షలు అని ప్రకటన’.అంటే ఒక పద్ధతి ప్రకారం గోబెల్స్ ప్రచారం. కొత్త పాత్రధారులు.వారి ఎల్లో మీడియా. ఇతర పార్టీల్లో ఉన్న టీడీపీ నాయకులు.అవన్నీ ఎందుకు అంటే.. వైయస్సార్సీపీ ప్రభుత్వానికి అప్పులు రాకూడదు. కేంద్రం సహకరించొద్దు. ఇక్కడ ఏమేమో జరుగుతోందన్న భయం క్రియేట్ చేయాలి.ఎన్నికలు సమీపించడంతో..:ఎన్నికలు దగ్గర పడే సరికి.. ఆ ప్రచారం మరింత ముమ్మరం చేశారు. 07.04.2024న రాష్ట్ర అప్పులు ఏకంగా రూ.12.50 లక్షల కోట్లు అని చంద్రబాబుగారి వదినమ్మ ప్రకటన. 21.04.2024న సరిగ్గా ఎన్నికలకు కొన్నాళ్ల ముందు.. ఈనాడు ఒకాయనను పట్టుకొచ్చి.. ఆయనకు ఎకనమిస్ట్ అనే బిళ్ల తగిలించి.. ఆయనతో రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని చెప్పించారు. అలా ఒక పద్ధతి ప్రకారం అబద్దాల ప్రచారం. విష ప్రచారం. రాష్ట్ర రుణాన్ని ఏకంగా రూ.14 లక్షల కోట్లు అని చెప్పించి, ఈనాడులో రాయడం. దాన్ని అందరూ చెప్పడం.అధికారంలోకి వచ్చాక కూడా..:⇒అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన దుష్ప్రచారం మానలేదు. ఎందుకంటే హామీలు అమలు చేయడం ఆయనకు అలవాటు లేదు. అందుకే అదే విష ప్రచారం.⇒10.07.2024న ఆర్థిక శాఖపై రివ్యూ చేస్తూ.. రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని లీక్. దాన్ని ఈనాడులో రాస్తారు. ఈటీవీలో చూపుతారు.⇒22.07.2024న రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్‌గారి ప్రసంగం. çఆ ప్రసంగంలో కూడా అబద్ధాలు చెప్పించారు. రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లు అని చెప్పించారు. ⇒26.07.2024న చంద్రబాబు అదే ఓట్ ఆన్ ఎక్కౌంట్ ప్రవేశపెడుతూ అన్న మాటలు ఒకసారి విందామా? అంటూ ఆ వీడియో ప్రదర్శించి చూపారు.⇒బాధగా ఉందంటాడు. ఆవేదనగా ఉందంటాడు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందంటాడు. భయం వేస్తుందంటాడు.⇒దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్ యాక్షన్‌ను మించి చంద్రబాబు నటన.అప్పులపై బడ్జెట్లో ఏం చెప్పారు?:⇒2024–25 వార్షిక బడ్జెట్లో రాష్ట్ర అప్పులు చూపారు. ఆ వివరాలు చూద్దాం.⇒2018–19 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2,57,509 కోట్లు. దానికి తోడు ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్లు చేసిన అప్పు మరో రూ.55,000 కోట్లు. ఆ రెండూ కలిపి చూస్తే.. మొత్తం అప్పులు రూ.3.13 లక్షల కోట్లు. ⇒అదే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వ అప్పులు చూస్తే.. ప్రభుత్వ అప్పులు రూ.4,91,734 కోట్లు. అలాగే ప్రభుత్వం పూచీ పడ్డ అప్పులు 1.54 లక్షల కోట్లు. ⇒రెండూ కలిపితే మొత్తం అప్పులు రూ.6,46,000 కోట్లు.⇒మరి వారు ప్రచారం చేసినట్లు ఎక్కడ రూ.14 లక్షల కోట్లు. ఎక్కడ వాస్తవ రూ.6.46 లక్షల కోట్లు.⇒ఎవరి హయాంలో ఎంతెంత అప్పులు చేశారు? వాటి గ్రోత్ ఎంత (సీఏజీఆర్) అని చూస్తే..⇒ చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న అప్పులు రూ.1,32,079 కోట్లు కాగా, ఆయన పదవి నుంచి దిగిపోయే నాటికి ఉన్న అప్పులు రూ.3,13,018 కోట్లు. అంటే ఏటా సగటున 19.54 శాతం చొప్పున అప్పులు పెరిగాయి.⇒అదే మా ప్రభుత్వ హయాంలో చూస్తే.. మేము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర అప్పులు రూ.3,13,018 కోట్ల నుంచి రూ.6,46,531 కోట్లకు పెరిగాయి. అంటే ఏటా సగటున 15.61 శాతం చొప్పున అప్పులు పెరిగాయి. అంటే చంద్రబాబుగారి హయాంలో కన్నా, 4 శాతం తక్కువ అన్నమాట.⇒ఇక పబ్లిక్ సెక్టార్లకు సంబంధించి, నాన్ గ్యారెంటీడ్ అప్పులు చూసినా, చంద్రబాబుగారి హయాంలో రూ.8638 కోట్లు ఉన్న నాన్ గ్యారెంటీ అప్పు, ఆయన హయాం ముగిసే నాటిసి ఏకంగా రూ.77,228 కోట్లకు తీసుకుపోయాడు. 54.98 శాతం పెరిగింది. పవర్ సెక్టర్లో డిస్కమ్‌లకు అలా రుణాలు సేకరించారు.⇒అదే మా ప్రభుత్వం వచ్చాక, ప్రభుత్వ రంగ సంస్థల నాన్ గ్యారెంటీ రుణాలు తగ్గించే ప్రయత్నం చేశాం. మా హయాంలో ఆ రుణం పెరగకపోగా, తగ్గించాం. –0.48 శాతం. అంటే ఆ రుణాన్ని రూ.75,386 కోట్లకు తగ్గించాం.⇒ఇక ప్రభుత్వ అప్పు, గ్యారెంటీ అప్పు, నాన్ గ్యారెంటీ అప్పులు మొత్తం కలిపి చూస్తే..⇒చంద్రబాబు హయాంలో ఆయన అధికారంలోకి వచ్చిన నాటికి రూ.1.40 లక్షల కోట్లు, ఆయన దిగిపోయే నాటికి రూ.3.90 లక్షల కోట్లు. అంటే సీఏజీఆర్ 23.6 శాతం అన్నమాట.⇒మా హయాంలో 2019లో ఉన్న అప్పు రూ.3.90 లక్షల కోట్లు కాస్తా, రూ.7.21 లక్షల కోట్లు అయింది. అంటే సీఏజీఆర్ 13.57 శాతం మాత్రమే.⇒ఇంకా చెప్పుకోవాలంటే.. మా హయాంలో సీఏజీఆర్ 15.61 శాతం నమోదైంది.. అది కూడా రెండేళ్లు కోవిడ్ దుర్భర పరిస్థితులు.⇒నిజానికి కోవిడ్ వల్ల దేశమే కాదు, ప్రపంచలోనే చాలా దేశాలు అతలాకుతలం అయ్యాయి. ప్రభుత్వ ఆదాయం తగ్గింది. మరోవైపు ఖర్చు పెరిగింది. అయినా చంద్రబాబు కంటే మా పనితీరు చాలా బాగుంది.చంద్రబాబు వదిలిపెట్టిన బకాయిలు:⇒చంద్రబాబు దిగిపోతూ, డిస్కమ్‌ల బకాయిలు రూ.21,541 కోట్లు. అంటే కరెంటు సప్లై చేసిన వారికి డబ్బులు ఇవ్వలేదు. వాటితో పాటు, చంద్రబాబు పోతూ పోతూ మాకు ఇచ్చిన బకాయిలు ఏకంగా రూ.42,183 కోట్లు.⇒ఉపాధి హామీ బకాయిలు రూ.2340 కోట్లు. ఉద్యోగుల రెండు డీఏలు బకాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.680 కోట్లు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.2800 కోట్లు. రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు. పిల్లలకు మధ్యాహ్న భోజనం వండిన ఆయాలకు గౌరవ వేతనాలు కూడా బకాయిలు. చివరకు పిల్లల కోడిగుడ్లకు కూడా డబ్బులు చెల్లించలేదు.⇒ఏ ప్రభుత్వమైనా కొంత బకాయిలు పెడుతుంది. కానీ, చంద్రబాబు మాదిరిగా ఈ స్థాయిలో బకాయిలు పెట్టిపోదు.జీడీపీలో రాష్ట్ర వాటా. గణాంకాలు:⇒ప్రభుత్వం సంపద లెక్కలు తేలాలంటే.. దేశ జీడీపీలో ప్రభుత్వ వాటా (జీఎస్డీపీ) ఎంత అని చూస్తే చాలు.⇒చంద్రబాబుగారి హయాంలో కోవిడ్ మహమ్మారి లేదు. అదే మా హయాంలో రెండేళ్లు కోవిడ్ ఉంది.⇒చంద్రబాబుగారి హయాంలో 5 ఏళ్లలో దేశ జీడీపీలో రాష్ట్ర జీఎస్డీపీ వాటా 4.47 శాతం. అదే మా హయాంలో అది 4.83 శాతం. అంటే కోవిడ్ ఉన్నా, చంద్రబాబుగారి కంటే బాగా పని చేశాం.ఉత్పాదక రంగం చూస్తే..:⇒తనకు తాను ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు చంద్రబాబు. ఆయన హయాంలో 2014–19 మధ్య దేశ వస్తు ఉత్పత్తి (ఉత్పాదక రంగం)లో రాష్ట్ర వాటా 2.86 శాతం.⇒అదే మా ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ ఉన్నా, 2019–24 మధ్య దేశ వస్తు ఉత్పత్తిలో రాష్ట్ర వాటా 4.07 శాతం. ఇది చాలదా? మా హయాంలో ఉత్పాదక రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందింది? చంద్రబాబు హయాంలో ఎలా నత్తనడకన సాగింది?వైఎస్సార్సీపీ హయాంలోనే పెట్టుబడులకు బాట:⇒ఆదిత్య మిట్టల్‌తో నా భేటీ. అంటూ దావోస్ సమావేశం ఫోటోలు చూపారు. అలాగే అదానీ, కుమార మంగళం బిర్లా, ముఖేష్ అంబానీతో వేర్వేరు సందర్భాల్లో ఫోటోలు చూపారు.⇒ముఖేష్ అంబానీ మా ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ పెట్టుబడులు మొదలుపెట్టారు. ఆ మేరకు ప్రకటనలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 24న, ఎనిమిది ఎథనాల్ ప్రాజెక్టులు కట్టడం మొదలు పెట్టారు. ⇒ఆయన దాన్ని ముందుకు తీసుకుపోతూ.. ఇక్కడ రూ.65 వేల కోట్ల పెట్టుబడి అంటూ బిల్డప్ ఇచ్చారు. కానీ, నిజానికి దానికి పునాది పడింది మా హయాంలోనే. ఇది వాస్తవం.⇒ఏ దానికైనా బిల్డప్. ఆదిత్య మిట్టల్ ఒడిషాలో రూ.1.04 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ కడుతున్నారు. అయితే అదే మిట్టల్ ఇక్కడ అనకాపల్లి వద్ద రూ.1.61 లక్షల కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసున్నారని లోకేష ప్రకటించారు. దాన్ని ఒడిషా సీఎం తీవ్రంగా ఖండించారు.⇒పైగా, వస్తున్న కంపెనీలను పంపించేస్తున్నారు. సజ్జన్ జిందాల్ ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం మొదలుపెడుతుంటే.. ఎవరో హ్యాబిచ్యువల్ అఫెండర్‌ను తీసుకొచ్చి, ఆరోపణలు చేయించి, ఆయన వెళ్లిపోయేలా చేశారు.డిస్కమ్‌ల నష్టాలు. అప్పులు. గణాంకాలు:⇒2014లో చంద్రబాబు సీఎం అయ్యే నాటికి పవర్ డిస్కమ్‌ల నష్టాలు రూ.6625 కోట్లు ఉండగా, ఆయన దిగిపోయే నాటికి డిస్కమ్‌ల నష్టాలు ఏకంగా రూ.28,715 కోట్లకు పెరిగాయి.⇒అంటే చంద్రబాబు హయాంలో ఏకంగా రూ.22 వేల కోట్ల నష్టాలు పెరిగాయి. అదే మా ప్రభుత్వ హయాంలో డిస్కమ్‌ల నష్టాలు కేవలం రూ.395 కోట్లు మాత్రమే అదనంగా పెరిగాయి.⇒చంద్రన్న వెలుగులు. జిలుగులు. మెరుగులు అంటారు కదా.. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి 2014లో డిస్కమ్‌ల అప్పులు రూ.29,552 కోట్లు ఉంటే, ఆయన దిగిపోయే నాటికి ఆ అప్పులు ఏకంగా రూ.86,215 కోట్లకు పెరిగాయి. ⇒అంటే ఆయన హయాంలో డిస్కమ్‌ల అప్పులు ఏకంగా రూ.56,664 పెరిగాయి. అంటే ఏటా సగటున పెరిగిన అప్పు 23.88 శాతం కాగా, మా ప్రభుత్వ హయాంలో డిస్కమ్‌ల అప్పులు రూ.86 వేల కోట్ల నుంచి రూ.1.22 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే కేవలం రూ.36 వేల కోట్లు మాత్రమే పెరిగాయి. అంటే ఏటా పెరిగిన సగటు అప్పులు కేవలం 7.28 శాతం మాత్రమే.చంద్రబాబు హయాంలో డిస్కమ్‌లకు అరకొర:⇒మామూలుగా డిస్కమ్‌లకు ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయి. అప్పుడే డిస్కమ్‌లు కొనసాగుతాయి. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుంది.⇒చంద్రబాబుగారి హయాంలో 2014–19 మధ్య డిస్కమ్‌లను సపోర్ట్ చేస్తూ ఇచ్చిన మొత్తం కేవలం రూ.13,255 కోట్లు మాత్రమే. అదే మా ప్రభుత్వం ఇచ్చిన మొత్తం ఏకంగా రూ.47,800 కోట్లు.⇒అలా ఇవ్వగలిగాం కాబట్టే.. డిస్కమ్‌లు నిలబడగలిగాయి. ⇒చంద్రబాబు మామీద వదిలిపెట్టిన ట్రూఅప్ ఛార్జీలు, ఫ్యుయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలకు సంబంధించి, ప్రజలకు తక్కువ బదిలీ చేయగలిగాం. అంటే ఛార్జీలు పెద్దగా పెంచలేదు.ఆరు నెలలు తిరక్కుండానే విద్యుత్ ఛార్జీల మోత:⇒అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా రాకముందే ప్రజలపై ఏకంగా రూ.17,899 కోట్ల భారం మోపాడు. ఇందులో రూ.6,072 కోట్ల ట్రూఅప్ ఛార్జీలు ఇప్పటికే నవంబరులో భారం మోపారు. మిగిలిన రూ.11 వేల కోట్లు డిసెంబరు నుంచి వేస్తాడు.⇒చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ది ఉంటే, డిస్కమ్‌లకు సపోర్ట్ చేస్తే, ప్రజలపై ఈ భారం పడదు కదా?. అంటే ఆయన అక్కడ వాటికి సపోర్టు చేయకుండా, ఇక్కడ ప్రజలపై భారం వేస్తున్నాడు. అదీ చంద్రబాబు వైఖరి.ప్రభుత్వ ఆదాయం తగ్గింది:⇒ఈ ఆరు నెలల్లో చంద్రబాబుగారి హయాంలో రాష్ట్ర సంపద (స్టేట్ ఓన్ రెవెన్యూస్–ఎస్ఓఆర్)ను, మా ప్రభుత్వ హయాంలో తొలి ఆరు నెలలతో పోల్చి చూస్తే, ఇప్పుడు అది –2 శాతం తగ్గింది.⇒అంటే మా ప్రభుత్వ హయాంలో తొలి ఆరు నెలల్లో ఎస్ఓఆర్ రూ.42436 కోట్లు కాగా, ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఈ తొలి ఆరు నెలల్లో అది రూ.41,570 కోట్లు.⇒అంటే రాష్ట్ర ఆదాయం పెరగాల్సింది పోయి తగ్గింది. ఎందుకంటే రావడం రావడం దోపిడినే. వచ్చీరాగానే యథేచ్ఛగా ఇసుక దోపిడి చేశారు. ఎక్కడా వదిలిపెట్టలేదు. ⇒ఇంకా పేకాట క్లబ్‌లు. దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాదు. ఎమ్మెల్యేలు, చంద్రబాబు, లోకేష్‌కు వాటాలు.⇒మద్యం షాప్‌లు. గతంలో ప్రభుత్వ «ఆధ్వర్యంలో నడిస్తే ఇప్పుడు సిండికేట్ల చేతిలో. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. అది ప్రభుత్వానికి రాదు. అందరికీ వాటా. ప్రైవేటు జేబుల్లోకి.⇒మా హయాంలో ఇసుక ధర రెట్టింపు. మా హయాంలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్ల రాయల్టీ వచ్చేది. టన్నుకు రూ.370 చొప్పున. – ఇప్పుడు గతంలో కంటే ఇసుక ధరలు రెట్టింపు అయ్యాయి. కానీ ప్రభుత్వానికి మాత్రం ఆదాయం పెరగలేదు.క్యాపిటల్ ఎక్స్పెండీచర్:⇒చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య క్యాపిటల్ ఎక్స్పెండీచర్ కింద ఏటా చేసిన సగటు వ్యయం రూ.13,860 కోట్లు కాగా, అదే మా హయాంలో చేసిన సగటు వ్యయం రూ.15,632 కోట్లు.⇒అందుకే స్కూళ్లు, ఆస్పత్రులు బాగు పడ్డాయి. ప్రతి గ్రామంలో సచివాలయాలు వచ్చాయి. ప్రణాళిక ప్రకారం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశాం. అవి నీళ్లతో నిండాయి.⇒కానీ, ఈరోజు పరిస్థితి ఏమిటి. వెలిగొండ ప్రాజెక్టు పూరై్తనా నీళ్లు నింపని పరిస్థితి.ఇదీ చదవండి: నయవంచనకు నకలు పత్రం! -
మోసం చేయడం బాబుకు అలవాటుగా మారింది: కొట్టు సత్యనారాయణ
సాక్షి,తాడేపల్లిగూడెం: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక మోసపూరితమైన బడ్జెట్ అని ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు బుధవారం(నవంబర్ 13)తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘మోసం చేయడం అనేది చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. ముగ్గురు కలసి నాటకం ఆడుతూ ప్రజలను నట్టేట ముంచారు.ఈ బడ్జెట్ లో గత బడ్జెట్ కంటే రూ.41వేల కోట్లు ఎక్కువ చూపించారు.కాగ్ నివేదిక ప్రకారం 9 శాతం వృద్ధి ఉన్నది ఇప్పుడు మైనస్ 2 శాతానికి పడిపోయింది.అలాంటప్పుడు ఏ విధంగా గత బడ్జెట్ కంటే ఎక్కువ చూపించారో అర్థం కావట్లేదు. ఇదంతా ఒక అంకెల గారడీ మాత్రమే అని తేటతెల్లం అవుతుంది.గత ప్రభుత్వం కంటే 20శాతం అప్పులు ఎక్కువగా పెంచారు.దీనికి పచ్చమీడియా ప్రజలను మోసం చేస్తూ వార్తలు చేస్తున్నారు.గత ప్రభుత్వంలో అమ్మఒడి కింద కుటుంబంలో ఒక విద్యార్థికి ఇచ్చేలా 6500 కోట్లు పెడితే కుటుంబంలో అందరూ విద్యార్థులకు ఇస్తానని తల్లికి వందనం ఇచ్చేందుకు రూ.5387కోట్లు కేటాయించడం హాస్యాస్పదంగా ఉంది.ప్రజలకు మీ బడ్జెట్ అగమ్యగోచరంగా కనపడుతోంది.ఈ బడ్జెట్ ద్వారా రైతుల నోట్లో మట్టి కొట్టారు. సున్నావడ్డీ తీసేసారు.ధరల స్థిరీకరణకు ఎటువంటి నిధులు కేటాయించలేదు.స్త్రీ శక్తి ద్వారా ఏడాదికి రూ. 18వేలు ఇస్తానని బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించలేదు.గత ప్రభుత్వంలో 19,180కోట్లు,కాపు నేస్తం,వైఎస్సార్ ఆసరా,వైఎస్సార్ చేయూత పథకాల కింద మహిళలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేశాం.ఉచితబస్సు ప్రయాణం ఇస్తానని బడ్జెట్లో ఇచ్చిందేంటి. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ చంద్రబాబు ప్రజలను తేనె పూసిన కత్తిలాగా మోసం చేస్తున్నారు.జాబ్ క్యాలెండర్ ఉందా? కాపు సంక్షేమం ద్వారా 15వేల కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.కూటమి ప్రభుత్వంలో ఇప్పటిదాకా 3లక్షల 50వేల మందికి పెన్షన్లు తీసేశారు.సెంటు స్థలంలో సమాధికి కూడా సరిపోదని పట్టణంలో రెండు,రూరల్‌లో 3సెంట్లు ఇస్తానని హామీ ఇచ్చి దానికోసం బడ్జెట్లో ఏమి కేటాయించని ఘనత చంద్రబాబుది.ఉచిత ఇసుక పేరు చెప్పి కూటమి నేతలు దోచుకుంటున్నారు.పైకి మాత్రం ఇసుక జోలికి వెళ్లొద్దంటూ ఆదేశాలు చేస్తున్నట్లు నటిస్తున్నారు.వైసీపీ సోషల్ మీడియాపై చేస్తున్న అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.రెడ్ బుక్ పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతోంది.అన్యాయం జరిగితే ఎదిరించేందుకు సిద్ధంగా ఉంటాం.ప్రతి కార్యకర్తకు ఎప్పుడూ అండగా ఉంటాం’అని కొట్టు తెలిపారు. -
హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి క్లీన్చిట్
సాక్షి, విజయవాడ: సాయి ఈశ్వర్ హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఊరట లభించింది. ఆయనకు ప్రజా ప్రతినిధుల కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. కర్నూలు త్రిటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు 9 మందిని ప్రజాప్రతినిధుల కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.నందికొట్కూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తెలుగు సాయి ఈశ్వర్ 2014లో దారుణ హత్యకు గురికావడంతో కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొదటి నిందితుడు బాషా కాగా ఐదో నిందితుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. బైరెడ్డి సిద్ధార్థతో పాటు ఆయన అనుచరులపైనా కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో వాదనలు విన్న విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. -
బాబు బ్యాండ్ మేళం ప్రచారం మళ్లీ మొదలు: విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో చంద్రబాబు పాలనపై సెటైరికల్ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో చంద్రబాబు బ్యాండ్ మేళం ప్రచారాలు మళ్లీ మొదలయ్యాయని ఎద్దేవా చేశారు. అలాగే, గతంలలో మాదిరిగానే అవే గ్రాఫిక్ అభివృద్ధి పనులు, అవే లక్షల కోట్ల గ్రాఫిక్ పెట్టుబడులు అంటూ కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు బ్యాండ్ మేళం ప్రచారాలు మళ్లీ మొదలయ్యాయి. చంద్రబాబు (2014-19) మధ్య కాలంలో ఎల్లో పత్రికల నిండా వందల వేల లక్షల కోట్ల పెట్టుబడులు, అభివృద్ధి పనులు అని అమరావతిని సింగపూర్‌లా మార్చేస్తామని ఒక్కటే ప్రచారాలు, డప్పులు, భాజాబజంత్రీలతో హడావిడి చేశారు. చివరికి 2019 ఎన్నికల చివరి నాటికి పెట్టుబడులు, అభివృద్ధి శూన్యం. మరి ఏం చేశాడో చెప్పుకోలేని పరిస్థితి చంద్రబాబుది..ఇప్పుడు మళ్లీ అదే మొదలైంది. అవే యెల్లో పత్రికలు.. అవే గ్రాఫిక్ అభివృద్ధి పనులు...అవే లక్షల కోట్ల గ్రాఫిక్ పెట్టుబడులు...ఇవేవీ వాస్తవరూపం దాల్చవు. యెల్లో మీడియా గ్రాఫిక్స్‌లో మాత్రమే ఉంటాయి. అందుకే అనేది చంద్రబాబువి ఉత్తిత్తి బ్యాండ్ ప్రచారాలు అని అంటూ సెటైర్లు వేశారు.చంద్రబాబు బ్యాండ్ మేళం ప్రచారాలు మళ్లీ మొదలయ్యాయి. చంద్రబాబు (2014-19) మద్య కాలంలో ఎల్లో పత్రికల నిండా వందల వేల లక్షల కోట్ల పెట్టుబడులు, అభివృద్ధి పనులు అని అమరావతి ని సింగపూర్ లా మార్చేస్తామని ఒక్కటే ప్రచారాలు, డప్పులు, బాజాభజంత్రీలతో హడావిడి చేసారు. చివరికి 2019 ఎన్నికల…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 13, 2024 -
ఏపీలో స్మార్ట్ మీటర్ల పేరుతో మరో డ్రామా: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: ఏపీలో స్మార్ట్ మీటర్ల పేరుతో మరో డ్రామాకు తెర లేపారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకుడు దేవినేని అవినాష్. ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చాక పథకాలను అమలు చేయడంలేదన్నారు. ఇది శంకుస్థాపనల ప్రభుత్వమే కానీ.. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కాదంటూ తీవ్ర విమర్శలు చేశారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన ఏ హామీ అమలు కాలేదు. వైఎస్సార్సీపీ హయాంలో కార్పొరేషన్లలో మంజూరైన పనులకు శంకుస్థాపనలు చేస్తూ కూటమి నేతలు కాలక్షేపం చేస్తున్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరు నెలల కాలంలో చేసిందేమీ లేదు. రోడ్లు, డ్రైనేజీ, ఇతర సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. ఇది శంకుస్థాపనల ప్రభుత్వమే కానీ.. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కాదు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రారంభించి చివరి దశలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలి. లేనిపక్షంలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఏపీలో కూటమి నేతలు స్మార్ట్ మీటర్ల పేరుతో మరో డ్రామాకు తెర లేపారు. గతంలో వైఎస్ జగన్‌పై కూటమి నేతలు నిందలు వేశారు. దానికి ఇప్పుడు ఏ సమాధానం చెబుతారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చారు. ఆ పథకాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి?. ఎన్నికల ముందు ఉదయం అవ్వగానే పథకాల గురించి ఫోన్లు చేసి వివరించారు. పథకాలు ఎవరెవరికి అందాయి ఇప్పుడు ఫోన్లు చేసి కనుక్కోండి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఏమైపోయాయి. మీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చి నిజాయితీ నిరూపించుకోండి. లయోలా కాలేజీ వాకర్స్ కు గద్దె రామ్మోహన్ పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. వాళ్లని రెచ్చగొట్టి ఇప్పుడు కేసుల్లో ఇరికించారు. లయోలా కాలేజ్ యాజమాన్యానికి వాకర్స్‌ని అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రజలను నమ్మించారు. వారికి న్యాయం చేయండి. ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం’ అని చెప్పారు.