ముంబై కార్పొరేటర్‌గా తెలుగు మహిళ | a telugu lady elected in mumbai BMC elections | Sakshi
Sakshi News home page

ముంబై కార్పొరేటర్‌గా తెలుగు మహిళ

Published Thu, Feb 23 2017 6:49 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM

a telugu lady elected in mumbai BMC elections

నగరి(చిత్తూరు): ముంబై కార్పొరేషన్‌ ఎన్నికల బరిలో తెలుగు మహిళ ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం కొత్త ఆరూరు గ్రామానికి చెందిన కండ్రిగ వినోద్‌రెడ్డి ఉద్యోగరీత్యా 30 ఏళ్ల క్రితం ముంబైలోనే స్థిరపడ్డారు. ఆయన అక్కడే వైఎస్సార్‌ జిల్లా కోడూరు ప్రాంతం అనంతరాజువారిపేటకు చెందిన కృష్ణవేణి(45)ని వివాహమాడారు.
 
ముంబైలోని దారాభి ప్రాంతంలో నివసిస్తున్న ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. ఇటీవల జరిగిన ముంబై కార్పొరేషన్‌ ఎన్నికల్లో 174వ వార్డు హిందూ కాలనీలో బీజేపీ తరపున కృష్ణవేణిరెడ్డి పోటీ చేశారు. గురువారం ప్రకటించిన ఫలితాల్లో శివసేన, కాంగ్రెస్‌ తదితర పార్టీలకు చెందిన ఏడుగురు అభ్యర్థులపై కృష్ణవేణి రెడ్డి గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement