
సాక్షి, విజయవాడ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. దివంగత వైఎస్సార్ జ్ఞాపకాలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని ఆయన కొనియాడారు. నాటి స్మృతులు ప్రతి ఒక్కరి మదిలో పదిలంగా ఉన్నాయని అన్నారు. వైఎస్సార్ పాలన కాలంలో అందించిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన లక్షలాది మంది ప్రజలు ఆయనను ప్రతి నిత్యం తలుచుకుంటూనే ఉంటారని గవర్నర్ పేర్కొన్నారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.