కంకిపాడు(కృష్ణా జిల్లా): వివాహ వేడుకలో కలుషిత ఆహారం తిన్న దాదాపు 300 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో శనివారం జరిగింది. వివరాలు.. కోలవెన్ను గ్రామంలో ఒక ఇంటిలో శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. శనివారం వ్రతం సందర్భంగా విందు భోజనం ఏర్పాటు చేశారు.
ఈ విందులో భోజనం చేసిన దాదాపుగా 300 మంది అస్వస్తతకు గురయ్యారు. కొందరు వాంతులు, విరేచనాలతో స్థానిక ఆర్‌ఎమ్‌పీ వైద్యుని వద్ద ప్రాథమిక చికిత్స పొందారు. విషయం తెలిసిన గ్రామ సర్పంచ్ విజయవాడ నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని రప్పించి చికిత్స చేయించారు. ఎవరికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.
ఇదిలా ఉండగా, కృష్ణా జిల్లా కోలవెన్నులో ఫుడ్ పాయిజన్ పై ఆ జిల్లా మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. ఈ విషయమై ఆయన కృష్ణాజిల్లా వైద్యాధికారులతో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కామినేని ఉన్నతాధికారులను ఆదేశించారు.
విందు భోజనం తిని 300మందికి అస్వస్థత
Published Sat, Jan 31 2015 10:06 PM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM
Advertisement
Advertisement