విశాఖ విమానాశ్రయంలో శనివారం రాత్రి వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు పార్టీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
గోపాలపట్నం,న్యూస్‌లైన్ : విశాఖ విమానాశ్రయంలో శనివారం రాత్రి వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు పార్టీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆదివారం జరిగే మరోప్రజాప్రస్థానం ముగింపు సభలో పాల్గొనేందుకు ఆమె విశాఖ వచ్చారు.
పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బా బూరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, వైఎస్సార్‌సీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తల శిల రఘురాం, పార్టీ నాయకులు భాస్కర్‌రెడ్డి, పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ యాదవ్, నగర మహిళా కన్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, జి.వి.రవిరాజు, కోలా గురువులు, పార్టీ నగర అధికార ప్రతినిధి కంపా హనోక్, పార్టీ మాజీ కార్పొరేటర్లు చొప్పా నాగరాజు, కండిపల్లి అప్పారావు, పార్టీ బీసీ సెల్ నగర కన్వీనర్ పక్కి దివాకర్, పార్టీ నాయకులు మనోజ్‌బాబు, గండి రవికుమార్ విజయమ్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయమ్మతో పార్టీ ముఖ్య నేతలు మైసూరారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, మాజీ మంత్రి మారప్ప వచ్చారు