
'అనంత'లో పరిస్థితులు హృదయ విదారకం: వైఎస్ జగన్
హైదరాబాద్: రైతులు, చేనేతకారులు, డ్వాక్రా మహిళ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. అనంతపురం జిల్లాలో వాస్తవ పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయని ఆయన ట్విటర్ లో పేర్కొన్నారు. రైతులు, చేనేతకారులు, డ్వాక్రా మహిళ జీవితాలతో సీఎం చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వీరందరి తరపున గళమెత్తుతామని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
అనంతపురం జిల్లాలో ఎనిమిది రోజుల పాటు రైతు భరోసా యాత్ర చేపట్టిన వైఎస్ జగన్... రైతులు, డ్వాక్రా మహిళలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చారు.
Ground realities in ATP are heart rending. CBN's lies played havoc with lives of farmers, weavers & DWCRA. We have to be their voice & hope!
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 19, 2015