
పన్నులు పెంచం: యనమల
తాజా బడ్జెట్‌లో పన్నుల ఆదాయ లక్ష్యాలను పెంచినప్పటికీ కొత్త పన్నులను వేయబోమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.
తాజా బడ్జెట్‌లో పన్నుల ఆదాయ లక్ష్యాలను పెంచినప్పటికీ కొత్త పన్నులను వేయబోమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. 2016-17 వార్షిక బడ్జెట్‌ను గురువారం సభలో ప్రవేశపెట్టిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. 2015-16లో ప్రణాళికా కేటాయింపులు రూ. 34,412 కోట్లుండగా వ్యయం రూ.38,671 కోట్లు అయిందన్నారు. పట్టిసీమతోపాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులకు అదనంగా రూ.4 వేల కోట్లను ఖర్చు చేయడం వల్లనే ప్రణాళిక కేటాయింపుల కన్నా ఎక్కువగా వ్యయం అయిందని చెప్పారు. సామాజిక పింఛన్లకు తక్కువ నిధుల కేటాయింపుపై స్పందిస్తూ.. కేటాయింపులు ఎంత ఉన్నా అవసరం మేరకు నిధులిస్తామని చెప్పారు. ఉద్యోగులకు మరో డీఏను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇస్తామన్నారు.