
సీఎం నోటీసివ్వడం దుర్మార్గం:పొన్నాల లక్ష్మయ్య
విభజన బిల్లుపై తిరిగి పంపే విధంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నోటీసివ్వడం దుర్మార్గమైన చర్య అని మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.
హైదరాబాద్: విభజన బిల్లుపై తిరిగి పంపే విధంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నోటీసివ్వడం దుర్మార్గమైన చర్య అని మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. సీఎం ఏకపక్ష నిర్ణయాన్ని తెలంగాణ ప్రజా ప్రతినిధులమంతా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రపతిని, కేంద్రాన్ని ధిక్కరించే విధంగా సీఎం వ్యవహరించడాన్ని పొన్నాల తప్పుబట్టారు. ఈ అంశంపై శాసన సభాపతికి, మంత్రి మండలకి లేఖ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్ని ఇబ్బందులెదురైనా తెలంగాణ తథ్యమని పొన్నాల స్పష్టం చేశారు.
టి.బిల్లుపై మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో భేటీకీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు హాజరైయ్యారు. స్పీకర్ కు కిరణ్ ఇచ్చిన నోటీసుపై ఈ సమావేశంలో చర్చించారు.