
బాల్యవివాహాలను అడ్డుకున్న అధికారులు
ఎదిగీ ఎదగని ఆడపిల్లలకు బాల్యవివాహాలు చే సి ఎలాగైనా సరే వారిని వదిలించుకో చూస్తున్నారు కొందరు తల్లిదండ్రులు.
కొల్చారం, న్యూస్‌లైన్ :
ఎదిగీ ఎదగని ఆడపిల్లలకు బాల్యవివాహాలు చే సి ఎలాగైనా సరే వారిని వదిలించుకో చూస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. ఇలాంటి ఘటనే మండల పరి ధిలోని అంసానిపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గొల్ల వెంకటయ్య పదో తరగతి చదువుతున్న కుమార్తె మహేశ్వరిని వెల్దుర్తి గ్రామంలోని గొల్ల మల్లయ్య కుమారుడు మహేష్‌కు ఇచ్చి గురువారం అంసానిపల్లిలో వివాహం జరిపేందుకు నిశ్చయించారు. ఇదే గ్రామానికి చెందిన మరో కుటుంబం ఈర్ల నాగయ్య తొమ్మిదో తరగతి చదువుతున్న తన కుమార్తె విజయరాణి (సంధ్య)ను నర్సాపూర్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన దీసు మల్లేశం కుమారుడు మహేష్‌కు ఇచ్చి శుక్రవారం వివాహం జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే సమాచారం అందుకున్న ఐసీడీఎస్, పోలీసు అధికారులు గురువారం గ్రామానికి చేరుకుని వివాహ ఏర్పాట్లపై ఆరా తీశారు. విషయం నిజమేనని తెలియడంతో ఐసీడీఎస్, పోలీసుల అధికారులతో పాటు చైల్డ్ లైన్‌కు చెందిన సిబ్బంది గొల్ల వెంకటయ్య, నాగయ్య ఇళ్లకు వేర్వేరుగా వెళ్లి కౌన్సెలింగ్ నిర్వహిం చారు. పెళ్లీడు రాకుండా వివాహం జరిపిస్తే జరిగే అనార్థాలకు గురించి వివరించారు. ఒక వేళ వివాహం చేస్తే చట్టరీత్యానేరమని హెచ్చరించారు. అనంతరం ఇరువురితో వివాహం నిలిపి వేస్తున్నట్లు హామీ పత్రాలను రాయించుకున్నారు. ఈ కౌన్సెలింగ్‌లో కొల్చారం ఏఎస్‌ఐ గౌస్, పాపన్నపేట ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అమృత, వీఆర్‌ఓ బాలయ్య, కార్యదర్శి నరేందర్, ఐసీపీఎస్ కౌన్సెలర్ రాజు, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ సుభాష్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.