ప్రభుత్వం ఇసుక రవాణాపై విధించిన ఆంక్షలను ఎత్తి వేయాలని నిరసిస్తూ అఖిలపక్షం బంద్‌కు పిలుపునిచ్చింది.
అనంతపురం అర్బన్: ప్రభుత్వం ఇసుక రవాణాపై విధించిన ఆంక్షలను ఎత్తి వేయాలని నిరసిస్తూ అఖిలపక్షం బంద్‌కు పిలుపునిచ్చింది. శనివారం జరిగిన ఈ బంద్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న అఖిలపక్షం నేతలుర్యాలీగా వెళ్లిన అనంతపురం అర్బన్‌లోని పలు దుకాణాలను మూసివేశారు. ఈ బంద్ సందర్భంగా జరిగిన ర్యాలీలో వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎమ్, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, భవన నిర్మాణ సంఘం కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, సీపీఐ నేత నారాయణరావు, సీపీఎమ్ నేత మల్లికార్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, 2 టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.