కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: చేనేత పని నిమిత్తం 2010వ సంవత్సరం మార్చి 31లోపు తీసుకున్న అన్ని రకాల రుణాలను మాఫీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రివైవల్, రిఫామ్స్ రీస్ట్రక్చరింగ్(త్రిబుల్ ఆర్) స్కీమ్‌ను ప్రవేశపెట్టిందని జిల్లా చేనేత శాఖ సహాయ సంచాలకులు ధనుంజయరావు తెలిపారు.
గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2011లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిజన్ క్రెడిట్ కార్డులు, పీఎంఆర్‌వై, రాజీవ్ యువశక్తి పథకాల కింద తీసుకున్న చేనేత రుణాలను మాత్రమే మాఫీ చేసిందని తెలిపారు. అయితే ఇంకా వివిధ స్కీమ్‌ల కింద చేనేత పని నిమిత్తం తీసుకున్న రుణాలు మిగిలిపోయాయని పేర్కొన్నారు. చేనేత పని నిమిత్తం తీసుకున్న అన్ని రకాల రుణాలను మాఫీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం త్రిబుల్ ఆర్ స్కీమ్‌ను ప్రవేశపెట్టిందని తెలిపారు. 2010 మార్చి 31లోపు తీసుకున్న రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు. దీని కింద రుణ మాఫీ కోసం క్లయిమ్‌లు ఇచ్చే గడువు ఈ ఏడాది మార్చికే పూర్తయిందన్నారు. అయితే ఇంకా కొంతమంది మిగిలిపోయారనే ఉద్దేశంతో వారి రుణాలు సైతం మాఫీ చేసేందుకు క్లెయిమ్ ఇచ్చే గడువును ఈ ఏడాది డిసెంబర్ నెల చివరివరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.
చేనేత నిమిత్తం తీసుకున్న అన్ని రకాల రుణాలను మాఫీ చేసుకునేందుకు ఇది మంచి అవకాశమని లబ్ధిదారులు బ్యాంకులను సంప్రదించి క్లెయిమ్‌లను ఆయా బ్యాంకుల జిల్లా కంట్రోలింగ్ అధికారులకు పంపే ఏర్పాటు చేసుకోవాలని కోరారు. బ్యాంకర్లు కూడా 2010 మార్చి 31లోపు తీసుకున్న అన్ని రకాల చేనేత బకాయిల మాఫీ కోసం క్లెయిమ్‌లు ఇచ్చేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. బ్యాంకులు కంట్రోలింగ్ ఆఫీసర్లకు క్లెయిమ్‌లు ఇస్తే వారు వాటిని నాబార్డుకు పంపాలని సూచించారు. ఈ అవకాశాన్ని అటు చేనేతకారులు, కార్మికులు, బ్యాంకర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చేనేతల రుణ మాఫీకి ‘త్రిబుల్‌ఆర్’
Published Fri, Nov 15 2013 3:39 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement