
న్యూఢిల్లీ: కార్పొరేట్ బాండ్ల మార్కెట్‌కు మరింత చేయూతనిచ్చే నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. పెద్ద కంపెనీలు తమ నిధుల అవసరాల్లో పావు శాతం మేర బాండ్ల మార్కెట్ నుంచి సమీకరించడాన్ని తప్పనిసరి చేస్తూ సెబీ నిబంధనలను సవరిస్తుందని తెలిపారు. ‘‘దేశంలో చాలా వరకు నియంత్రణ సంస్థలు ఏఏ రేటింగ్ ఉన్న బాండ్లనే పెట్టుబడులకు అర్హమైనవిగా అనుమతిస్తున్నాయి.
ఇక నుంచి ఏ గ్రేడ్ రేటింగ్ వున్న బాండ్లను ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్‌గా పరిగణించడం జరుగుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఏఏ రేటింగ్ వున్న బాండ్లను ఇన్వెస్ట్‌మెంట్‌గ్రేడ్‌గా పరిగణిస్తున్నారు. బాండ్ల మార్కెట్ విస్తృతికి, ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ మార్పునకు అవసరమైన చర్యల్ని ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు తీసుకుంటాయి’’అని జైట్లీ చెప్పారు.
కార్పొరేట్ బాండ్ల మార్కెట్ మరింత విస్తరించేందుకు, కంపెనీలు నిధుల అవసరాలకు బాండ్ల మార్కెట్‌ను ఆశ్రయించేందుకు ఈ చర్యలు తోడ్పడతాయని భావిస్తున్నట్టు పేర్కొ న్నా రు. కార్పొరేట్లు బాండ్ల మార్కెట్‌ను ఆశ్ర యించేందుకు ఆర్‌బీఐ ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసినట్టు జైట్లీ తెలిపారు.