
న్యూఢిల్లీ: ట్యాక్సీ ఆగ్రిగేటర్ ఓలా.. తాజాగా సెల్ఫ్ డ్రైవ్ సేవలను ప్రారంభించింది. ‘ఓలా డ్రైవ్’ పేరిట తొలుత బెంగళూరులో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓలా ప్లే ప్లాట్‌ఫాంకు అనుసంధానమైన ఈ కార్లలో 24/7 హెల్ప్‌లైన్, అత్యవసర బటన్, రియల్ టైమ్ ట్రాకింగ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది. రెండు గంటల పాటు కారును పొందడం కోసం సెక్యూరిటీ డిపాజిట్ రూ. 2,000 ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరులో పైలెట్ ప్రాజెక్ట్ కింద సెల్ఫ్ డ్రైవ్ కార్లను అందుబాటులో ఉంచిన ఓలా.. బుధవారం వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచింది. త్వరలోనే హైదరాబాద్, ముంబై, న్యూ ఢిల్లీల్లో ఈ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment