వడోదర: ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) వచ్చే నెల 1-2 తేదీల్లో జరపతలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేసింది. డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఎం. కె. చౌదరితో ఈ నెల 23న జరిగిన చర్చల తర్వాత ఈ సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ఏఐబీఈఏ పేర్కొంది. తదుపరి సంప్రదింపులు వచ్చే నెల 3న జరుగుతాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి ిసీహెచ్. వెంకటాచలం చెప్పారు. ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులపై ఎస్‌బీఐ విధించిన కెరీర్ ప్రోగ్రెషన్ స్కీమ్‌కు వ్యతిరేకంగా సమ్మె చేయాలని ఎస్‌ఎస్‌బీఈఏ నిర్ణయం తీసుకుంది.
అదనపు బాధ్యతలు, అధికారాలు, పనిగంటల పెంపు, క్షేత్ర స్థాయి పరిధిని పెంచడం, శాశ్వత స్వీపర్ల ఉద్యోగాలను తొలగించి, వాటిని అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయడం.. తదితర అంశాలు ఈ స్కీమ్‌లో ఉన్నాయి. వీటిని వ్యతిరేకిస్తున్నామని వెంకటాచలం పేర్కొన్నారు. ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లను ఎస్‌బీఐ యాజమాన్యం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా.. ఈ ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల ఉద్యోగ సంఘాలకు ఎస్‌ఎస్‌బీఈఏ ప్రాతినిధ్యం వహిస్తోంది.
‘ఎస్‌బీఐ’ ఉద్యోగుల సమ్మె వాయిదా
Published Thu, Nov 26 2015 3:31 AM | Last Updated on Sun, Sep 3 2017 1:01 PM
Advertisement