నవ వధువు అనుమానాస్పద మృతి | Bride Suspicious Death In East godavari | Sakshi

నవ వధువు అనుమానాస్పద మృతి

Apr 26 2018 12:34 PM | Updated on Apr 26 2018 12:34 PM

Bride Suspicious Death In East godavari - Sakshi

మృతి చెందిన మాధురి

రామచంద్రపురం: పెళ్‌లైన వారం రోజులకే యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన పట్టణంలోని బ్రాడీపేటలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, రామచంద్రపురం ఎస్సై వంశీధర్‌ కథనం ప్రకారం.. బ్రాడీపేటకు చెందిన మల్లు మాధురి(18)కి కొమరిపాలేనికి చెందిన మల్లు శివతో ఈ నెల 19న వివాహం జరిగింది. మాధురి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందడంతో బ్రాడీపేటలోని అమ్మమ్మ ఇంటివద్దనే పెరిగింది. అయితే ఆమెకు తరచుగా కడుపులో నొప్పి వస్తుంటుందని నొప్పి తాళలేక మాధురి బ్రాడీపేటలోని అమ్మమ్మ ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని మాధురి బంధువుల పిర్యాధు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై వంశీధర్‌ తెలిపారు. అయితే పెళ్‌లైన వారం రోజులకే మాధురి ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement