
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఘజియాబాద్‌లోని మదర్సాలో పదేళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చిన ఇద్దరు దుండగులు అనంతరం సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇద్దరు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు బాధిత బాలికను ఐస్‌క్రీమ్ పార్లర్‌కు తీసుకువెళ్లిన నిందితుడు అక్కడి నుంచి ఘజియాబాద్‌లోని మదర్సాకు తీసుకువెళ్లి మరో నిందితుడితో కలిసి దారుణానికి పాల్పడ్డారు. నేరం ఆనవాళ్లు లేకుండా చేసేందుకు నిందితుడు తన ఫోన్‌తో పాటు బాధితురాలి ఫోన్‌ను ధ్వంసం చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడు మదర్సాలోనే నివసిస్తూ చదువుకుంటున్నాడని చెప్పారు.
బాలికను ప్రలోభపెట్టిన నిందితుడు పరారీలో ఉన్నాడని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. నిందితులపై కిడ్నాప్, పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్ధానంలో చార్జిషీట్ దాఖలు చేశారు.