
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు
మైలార్‌దేవ్‌పల్లి: మూడు నెలల కోసం కాంట్రాక్ట్ పెళ్లి కుదుర్చుకున్న సూడాన్ దేశస్తుడిని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే..సూడాన్‌కు చెందిన మహ్మద్ బండ్లగూడలోని పెళ్లిళ్ల బ్రోకర్‌ను సంప్రదించి ఓ యువతిని కాంట్రాక్టు పెళ్లి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. పెద్ద మొత్తంలో డబ్బులు ఏరవేసిన అతను మహ్మద్ అబీబ్‌ఖాన్, షమీమ్ సుల్తానా, షబానాబేగం సహకారంతో బాధితురాలి తల్లిదండ్రులను ఒప్పించారు.
ఇందుకుగాను బాధితురాలి కుటుంబ సభ్యులకు 1.10 లక్షల నగదు, 300 సూడాన్ డాలర్లు ఇచ్చాడు. దీనిపై సమాచారం అందడంతో దాడులు నిర్వహించి ఎస్‌ఓటీ పోలీసులు నిందితుడు మహ్మద్‌తో పాటు పెళ్లికి సహకరించిన నలుగురు బ్రోకర్లను అరెస్ట్ చేసి మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment