
తెరచుకోనున్న బీఎంసీలు..!
పులివెందుల రూరల్ : జిల్లా వ్యాప్తంగా మూతపడిన బీఎంసీ(బల్క్ మిల్క్ కూలింగ్) కేంద్రాలను తెరిపిం చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్‌నర్ షిప్‌్ట(పీపీపీ) పద్ధతిలో వీటిని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
వైఎస్ హయాంలో ఓ వెలుగు..
జిల్లాలో ఏపీ డెయిరీ ద్వారా పాల సేకరణ చేసి పాడి రైతులను ఆదుకోవాలనే లక్ష్యం తో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బీఎంసీలను ఏర్పాటు చేశారు. దీంతో అ ప్పట్లో జిల్లా లో ఉన్న 18 బీఎంసీల నుంచి దాదాపు 55 వే ల లీటర్ల పాల సేకరణ జరిగేది. పాడిని ప్రో త్సహించేందుకు రైతులకు పశుక్రాంతితో పా టు ఇతర పథకాల కింద రాయితీతో పశువులను అందజేశా రు. ఈ చర్యలు ఫలితానివ్వడంతో జిల్లాలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో 8 బీఎంసీల మూత
ప్రస్తుత ప్రభుత్వం పాడి రైతులను పట్టిం చుకోకపోవడంతో జిల్లాలో 8 బీఎంసీలు మూతపడ్డాయి. రాష్ట్ర విభజన, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏపీ డెయిరీ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ డెయిరీ రైతులకు పాల బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తూ వస్తోంది. ఫలితంగా పాడి రైతులు ప్రైవేట్ డెయిరీల వైపు మొగ్గు చూపడంతో విజయా డెయిరీకి పాల లభ్యత గణనీయంగా తగ్గింది.
55 వేల లీటర్ల నుంచి 15 వేల లీటర్లకు పడిన సేకరణ
జిల్లాలోని పులివెందుల, తొండూరు, లింగాల, చక్రాయపేట, తిమ్మంపల్లె, రాయచోటి, సుండుపల్లె, భాకరాపేట, బద్వేలు, ప్రొద్దుటూరు బీఎంసీల నుంచి ప్రస్తుతం ప్రతి రోజు 15 వేల లీటర్ల పాలను మాత్రమే అధికారులు సేకరిస్తున్నారు. కొండాపురం, రాజుపాలెం, మైదుకూరు, పోరుమామిళ్ల, పెనగలూరు, సింహాద్రిపురం, వేంపల్లె, వేముల బీఎంసీలకు పాడి రైతులు పాలు పోయకపోవడంతో అవి మూతపడ్డాయి. వీటిని పీపీపీ పద్ధతిలో తెరిపించేందుకు అధికారులు, ప్ర భుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఐసీడీఎస్‌కు విక్రయాలతో పెరిగిన అమ్మకాలు
జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు వి జయ టెట్రా పాల ప్యాకెట్లు విక్రయించేందుకు అనుమతి రావడంతో పాల విక్రయాలు పెరి గాయి. జిల్లాలోని మొత్తం కేంద్రాలకు నెలకు సుమారు 90 వేల లీటర్ల పాల ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు. దీనికి తోడు బయట మార్కెట్‌లో విక్రయాలు పెరగడంతో పాలకు డిమాం డ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో మూతపడిన బీఎంసీలు తెరిపించి పాల సేకరణ పెం చాలనే లక్ష్యంతో డెయిరీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.