
శ్మశానంలోనే నిరుపేద మృతదేహం
వరంగల్ నగరంలో ఇళ్లు లేని నిరుపేదలకు శాస్మశాన వాటికలే దిక్కువుతున్నాయి.
స్వచ్చంద సంస్థల చేయూతతో అంత్యక్రియలు
ఖిలావరంగల్ : వరంగల్ నగరంలో ఇళ్లు లేని నిరుపేదలకు శాస్మశాన వాటికలే దిక్కువుతున్నాయి. వరంగల్ నగరంలోని అండర్ బ్రిడ్జి శివనగర్ ప్రాంతానికి చెందిన నిరుపేదురాలు పులికంటి కొమురమ్మ చిన్నకుమారుడు పులికంటి సురేష్(30) కిడ్నీ వ్యాధితో గత కొంత కాలంగా బాధపడుతూ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతుడు ఇదే ప్రాంతంలో సైకిల్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.
శివనగర్‌లోని ఓ ఇంట్లో ఆద్దెకు ఉంటున్నారు.ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సను పొందుతూ మృతిచెందిన అనంతరం సురేష్ భౌతికకాయాన్ని శివనగర్‌లో మృతుని కుటుంబం నివా సం ఉండే అద్దె ఇంటికి తీసుకవచ్చారు. మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్తుండగా ఇంటి యజమాని నిరాకరించాడు. దీంతో మృతుడి కుటుం బం చేసేదిలేక బుధవారం రాత్రి శివనగర్ శ్మశాన వాటిక వద్దకు మృతదేహాన్నితీసుకెళ్లారు. అక్కడే సురేష్ పార్థీవ దేహాన్ని ఉంచగా స్థానిక ప్రజలు, బంధువులు, వచ్చి పరామర్శించారు. గురువారం ఉదయం ఈ విషయం తెలిసిన స్ఫూర్తి స్వచ్చంధ సంస్థ ఆధ్యక్షుడు కూనూరుశేఖర్‌గౌడ్, సిద్దం రాము అక్కడికి చేరుకుని సురేష్ దహన సంస్కారాలు, రూ.10వేల ఆర్ధిక సాయం మృతుడి తల్లి కొమురమ్మకు అందజేశారు