విద్యుత్ స్తంభాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు కూలీలకు తీవ్ర గాయాల య్యాయి.
విద్యుత్ స్తంభాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు కూలీలకు తీవ్ర గాయాల య్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మామిళ్లకుంట సమీపంలో గురువారం చోటుచేసుకుంది. మామిళ్లకుంట గ్రామానికి చెందిన రైతులు జొన్నగిరి నుంచి ట్రాక్టర్ పై విద్యుత్ స్తంభాలను తరలిస్తుండగా.. అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా కొట్టింది. దీంతో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 సాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.