ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు పెట్టుబడులు వెళ్లక రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. రైతులందరికీ బ్యాంక్‌ల ద్వారా తక్షణమే రుణాలు అందజేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముర్తాల వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.
చిలుకూరు : ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు పెట్టుబడులు వెళ్లక రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. రైతులందరికీ బ్యాంక్‌ల ద్వారా తక్షణమే రుణాలు అందజేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముర్తాల వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన చిలుకూరులో విలేకరులతో మాట్లాడారు. బ్యాంక్‌ల ద్వారా రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు గత్యంతరం లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.